అమెరికా మెరైన్లంటే తెలుసు కదూ.. మెరికల్లాంటి సైనిక బలం వారిది. అలాంటి మెరైన్ కోర్ వెబ్సైట్ హ్యాకింగ్కు గురైంది. సిరియా అనుకూల వాదులు ఈ సైట్ను హ్యాక్ చేసి అందులో ఓ సందేశం పెట్టారు. సిరియా మీద దాడి చేయాలని వాషింగ్టన్ నుంచి ఆదేశాలు వస్తే, వాటిని తిరస్కరించాలని అమెరికన్ సైనికులను కోరుతూ ఆ సందేశం ఉంది. దీంతో చాలా గంటల పాటు మెరైన్స్.కామ్ అనే ఆ సైట్ చాలా గంటల పాటు స్తంభించిపోయింది. సిరియన్ ఎలక్ట్రికల్ ఆర్మీ - సీ అనే పేరుతో ఉన్న సందేశమే చాలాసేపటి వరకు అందులో కనిపించింది. గతంలో న్యూయార్క్ టైమ్స్ సైట్ను, సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ను, ఇతర మీడియా సైట్లను కూడా ఇదే గ్రూపు హ్యాక్ చేసింది.
'సిరియాలో అల్ కాయిదా గురించి నేను పోరాడను' అంటూ చేత్తో రాసి ఉన్న సందేశాలను పట్టుకున్న కొందరు వ్యక్తుల ఫొటోలు ఆరింటిని కూడా ఈ సైట్లో పెట్టారు. సిరియన్ సైన్యం తమ మిత్ర పక్షమే గానీ శత్రుపక్షం కాదని అమెరికా దళాలకు 'సీ' తెలిపింది. తామిద్దరి ఉమ్మడి శత్రువు ఉగ్రవాదమేనని చెప్పింది. అయితే, ఈ హ్యాకింగ్ వల్ల తమ సమాచారానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని అమెరికా మెరైన్ కోర్ ప్రతినిధి ఎరిక్ ఫ్లానగాన్ తెలిపారు. ఈ నియామక సైట్ వాణిజ్యపరమైన నెట్వర్కే గానీ పెంటగాన్ నెట్వర్క్ కాదని చెప్పారు.
అమెరికా మెరైన్ల సైట్ను హ్యాక్ చేసిన సిరియన్లు
Published Tue, Sep 3 2013 11:52 AM | Last Updated on Tue, Nov 6 2018 8:59 PM
Advertisement
Advertisement