అమెరికా ఇంకా ఫ్లాపీలు వాడుతోంది!
వాషింగ్టన్: ప్రపంచం ఎప్పుడో మర్చిపోయిన, 1970ల్లో తయారైన ఫ్లాపీ డిస్క్‌లను అమెరికా అణువిభాగంలో ఇంకా వాడుతున్నారని అక్కడి ‘ప్రభుత్వ జవాబుదారీ కార్యాలయం’ (జీఏఓ) విడుదల చేసిన తాజా నివేదిక ద్వారా వెల్లడైంది. ప్రస్తుత కాలంలో పనికిరాని పురాతన పరికరాలను అమెరికా ప్రభుత్వ విభాగాల్లో ఇంకా వాడుతుండటంపై జీఏఓ ఆందోళన వ్యక్తం చేసింది.
అమెరికా ప్రభుత్వం టెక్నాలజీ కోసం కేటాయించిన 80 బిలియన్ డాలర్ల బడ్జెట్ లో మూడు-నాలుగో వంతు పాత కంప్యూటర్ల నిర్వహణకే వినియోగిస్తున్నట్టు జీఏఓ నివేదిక వెల్లడించింది. కంప్యూటర్లను అప్ డేట్ చేయాలని, వచ్చే ఏడాది చివరి నాటికి ఫ్లాపీ డిస్క్‌ల వాడకం లేకుండా చేసేందుకు పెంటగాన్ ప్రణాళికలు రచిస్తోంది.