సంచలన తీర్పు: యువకుడికి వందేళ్ల జైలుశిక్ష | US man sentenced to 100 years for assaulting elderly woman | Sakshi
Sakshi News home page

సంచలన తీర్పు: యువకుడికి వందేళ్ల జైలుశిక్ష

Published Sat, Apr 29 2017 11:17 AM | Last Updated on Fri, Aug 24 2018 4:57 PM

సంచలన తీర్పు: యువకుడికి వందేళ్ల జైలుశిక్ష - Sakshi

సంచలన తీర్పు: యువకుడికి వందేళ్ల జైలుశిక్ష

వాషింగ్టన్‌: అమెరికాలో ఇలినోయిస్‌ రాష్ట్రానికి చెందిన 85 ఏళ్ల వృద్ధురాలిని లైంగికంగా వేధించి, దోపిడీకి పాల్పడిన కేసులో ఓ యువకుడికి కోర్టు వందేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసు తదుపరి విచారణను మే 4వ తేదీకి వాయిదా వేసింది.

2015 కొత్త సంవత్సరం రోజున టెవిన్‌ రైనీ (23) అనే యువకుడు చికాగోకు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న వెస్ట్‌మాంట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న వృద్ధురాలిని తుపాకీతో బెదిరించి వేధించాడు. తర్వాత ఆమెను బలవంతంగా ఓ ఏటీఎమ్‌ దగ్గరకు తీసుకెళ్లి డబ్బులు విత్‌ డ్రా చేసుకుని పారిపోయాడు. ఈ కేసులో టెవిన్‌ నేరం చేసినట్టు రుజువు కావడంతో కోర్టు దోషిగా ప్రకటించింది. వృద్ధురాలిని లైంగికంగా వేధించినందుకు 60 ఏళ్లు, తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడినందుకు మరో 40 ఏళ్లు కలిపి టెవిన్‌కు మొత్తం వందేళ్ల జైలుశిక్ష విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement