
ఉక్రెయిన్‌లో రెండు నెలలకుపైగా జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌తో రష్యాకు తీవ్ర నష్టం వాటిల్లింది. బాంబులు, మిస్సైల్స్ దాడుల్లో ఉక్రెయిన్ పౌరులు, సైనికులు, రష్యా బలగాలు వేల సంఖ‍్యలో మృత్యువాతపడ్డారు.
ఇదిలా ఉండగా, యుద్దభూమిలో సుమారు 12 మంది రష్యన్ జనరల్స్ మరణించినట్టు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కాగా, ఈ వ్యాఖ్యలను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఓ సంచలన కథనాన్ని వెలువరించింది. ఈ కథనం పుతిన్‌కు బిగ్ షాకిచ్చింది. న్యూయర్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఉక్రెయిన్‌తో యుద్దంలో రష్యన్ జనరల్స్‌ను చంపడానికి ఉక్రేనియన్ దళాలకు అమెరికా ఇంటెలిజెన్స్ సహాయం అందించిందని పేర్కొంది.
దీని కోసం అమెరికాకు చెందిన సీనియర్ అధికారులు సైతం సాయం అందించినట్టు తెలిపింది. ఉక్రెయిన్‌లో రష్యా బలగాల కదలికలు, రష్యా మొబైల్ సైనిక ప్రధాన కార్యాలయం స్థావరం, ఇతర విషయాలపై ఇంటెలిజెన్స్ సాయం చేసినట్టు స్పష్టం చేసింది. కాగా, ఈ కథనంపై పెంటగాన్, వైట్ హౌట్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. అయితే, ఉక్రెయిన్‌కు సాయం విషయంతో రష్యా ఇప్పటికే అమెరికాను త్రీవంగా హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ విచిత్ర పరిస్థితులు.. అమ్మాయిలనే కాదు అబ్బాయిలను కూడా..
Comments
Please login to add a commentAdd a comment