సంచలన తీర్పు: యువకుడికి వందేళ్ల జైలుశిక్ష
వాషింగ్టన్: అమెరికాలో ఇలినోయిస్ రాష్ట్రానికి చెందిన 85 ఏళ్ల వృద్ధురాలిని లైంగికంగా వేధించి, దోపిడీకి పాల్పడిన కేసులో ఓ యువకుడికి కోర్టు వందేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసు తదుపరి విచారణను మే 4వ తేదీకి వాయిదా వేసింది.
2015 కొత్త సంవత్సరం రోజున టెవిన్ రైనీ (23) అనే యువకుడు చికాగోకు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న వెస్ట్మాంట్లోని ఓ అపార్ట్మెంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న వృద్ధురాలిని తుపాకీతో బెదిరించి వేధించాడు. తర్వాత ఆమెను బలవంతంగా ఓ ఏటీఎమ్ దగ్గరకు తీసుకెళ్లి డబ్బులు విత్ డ్రా చేసుకుని పారిపోయాడు. ఈ కేసులో టెవిన్ నేరం చేసినట్టు రుజువు కావడంతో కోర్టు దోషిగా ప్రకటించింది. వృద్ధురాలిని లైంగికంగా వేధించినందుకు 60 ఏళ్లు, తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడినందుకు మరో 40 ఏళ్లు కలిపి టెవిన్కు మొత్తం వందేళ్ల జైలుశిక్ష విధించింది.