అమెరికా మిలటరీకి చెందిన విమానాన్ని ఇండోనేసియాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
జకర్తా: అమెరికా మిలటరీకి చెందిన విమానాన్ని ఇండోనేసియాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. శనివారం ఇండోనేసియా ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి ఈ విషయాన్ని చెప్పారు. శుక్రవారం అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన బోయింగ్ 707 విమానంలోని నాలుగు ఇంజిన్లలో ఒకటి ఫెయిలైందని, ల్యాండింగ్ చేసుకోవడానికి అనుమతివ్వాలని వారు కోరగా, తాము అంగీకరించామని ఇండోనేసియా ఎయిర్ వైస్ మార్షల్ జెమీ త్రిసోంజయ చెప్పారు.
ఏసెహ్ ప్రావిన్స్‌లోని బండా ఏసెహ్ విమానాశ్రయంలో రన్ వే పక్కన అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలను మోహరించామని, యూఎస్ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. హిందూ మహాసముద్రంలోని డీగో గార్కియా మిలటరీ బేస్ నుంచి జపాన్‌లోని హానెడా విమానాశ్రయానికి 20 మంది అమెరికా మిలటరీ అధికారులను విమానంలో తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విమానంలోని ఇంజిన్ ఫెయిల్ కావడానికి గల కారణాలు తెలియరాలేదు.