emergency landing
-
శంషాబాద్‌లో చెన్నై-పూణే విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో Air India విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. వాతావరణం అనుకూలించని కారణంగా విమానం శంషాబాద్‌లో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. చెన్నై-పూణే ఎయిర్ ఇండియా విమానం శనివారం ఉదయం శంషాబాద్‌లో అత్యవసరంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. దట్టమైన పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం దాదాపు మూడు గంటల పాటు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. అనంతరం, పైలట్ విమానాన్ని శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు సమాచారం. ఇక, ఎయిర్ ఇండియా విమానంలో 180 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది.An Air India exp flight from Chennai to Pune has diverted to Hyd. Nearly 3 hrs in the air. pic.twitter.com/ywnbnMtG50— Mahesh (@Hanumanbhakt000) December 21, 2024 -
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్
కొచ్చి:బెంగళూరు నుంచి మాల్దీవుల రాజధాని మాలేకు వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని కేరళలోని కొచ్చికి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం సురక్షితంగా దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో 140మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ అంశంపై ఇండిగో స్పందించింది. సాంకేతిక సమస్య తలెత్తిన విమానానికి అవసరమైన మరమ్మతులు చేసిన తర్వాత తిరిగి వినియోగంలోకి తెస్తామని ఇండిగో తెలిపింది.ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.సాంకేతిక లోపంతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది.విమానంలో ప్రయాణిస్తున్నవారిలో 91మంది భారతీయ పౌరులు కాగా 49మంది విదేశీయులు ఉన్నారని అధికారులు తెలిపారు. -
విమానాలకు బాంబు బెదిరింపు
శంషాబాద్ రూరల్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. ఆదివారం పలు విమానాలకు బెదిరింపు ఫోన్ కాల్ రావటంతో ఓ విమానాన్ని అత్యవసరంగా దించేశారు. గోవా నుండి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానానికి బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో దింపారు.ఇందులో 180 మంది ప్రయాణికులు ఉన్నా రు. మరో గంటకు బెంగళూరు–హైదరాబాద్ ఇండిగో విమానానికి, మళ్లీ గంట తర్వాత హైదరాబాద్–పుణే ఇండిగో విమానానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. వీటితో పాటు ఎయిర్ఇండియా విమానానికి ఇదే తరహా కాల్ వచి్చనట్లు విమానాశ్రయం వర్గాలు తెలిపాయి. దీంతో ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. -
విమానాలకు ఉత్తుత్తి బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: విమానాలకు ఉత్తుత్తి బాంబు బెదిరింపుల బెడద ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. గురువారం ముంబై నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ఇండియా విమానం ఏఐసీ129కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. లండన్ గగనతలంపై ప్రయాణిస్తుండగా ‘స్క్వాకింగ్ 7700’ సంకేతాలు అందాయి. ఇదొక అత్యవసర సంకేతామని అధికారులు దాంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇటీవల 14 భారత విమానాలను వేర్వేరు దేశాల్లో ఇలాంటి కారణంతోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, విమానాల్లో బాంబులు అమర్చామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న 10 సోషల్ మీడియా ఖాతాలను సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు రద్దు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఎక్కువ ఖాతాలు ‘ఎక్స్’కు సంబంధించినవేనని తెలిపాయి. ముంబై నుంచి బయలుదేరే మూడు విమానాల్లో బాంబులు పెట్టానని ఎక్స్‌లో పోస్టు చేసిన 17 ఏళ్ల బాలుడిని ముంబై పోలీసులు చత్తీస్‌గఢ్‌లో ఇటీవల అరెస్టు చేశారు. -
మరో 2 విమానాలకు బాంబు బెదిరింపులు.. 3 రోజుల్లో 12 ఘటనలు
దేశంలో పలు విమానాలకు బాంబు బెదిరింపు ఘటనలు ఎక్కువయ్యాయి. గత మూడు రోజుల్లో అనేక విమానాలకు బాంబు బెదరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం ఏకంగా పలు సంస్థలకు చెందిన ఏడు విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చినన విషయం తెలిసిందే. మొత్తం గత 72 గంటల్లో 12 విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి.తాజాగా బెంగళూరు వెళ్తున్న అకాశా ఎయిర్ ఫ్లైట్, ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానానికి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు.ఆకాశా ఎయిర్‌లైన్ సంస్థకు చెందిన QP 1335 విమానం 184 మంది ప్రయాణికులు, సిబ్బందితో బుధవారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మధ్యాహ్నం 2 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం విమానంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.అదే విధంగా ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. 6E 651 విమానం దాదాపు 200 మంది ప్రయాణికులు, సిబ్బందితో ముంబై నుంచి బయల్దేరగా.. సోషల్ మీడియా ద్వారా బెదిరింపు అలర్ట్ వచ్చింది. దీంతో పైలట్ విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించారు. అక్కడ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు. అనంతరం విమానంలో తనిఖీలు చేపట్టగా బెదిరింపు కాల్స్ బూటకమని తేలింది.48 గంటల్లో 10 విమానాలకు బాంబు బెదిరింపులుమంగళవారం ఢిల్లీ-చికాగో ఎయిర్ ఇండియా విమానం, జైపూర్-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, దమ్మం-లక్నో ఇండిగో విమానం, దర్భంగా-ముంబై స్పైస్‌జెట్ విమానం, సిలిగురి-బెంగళూరు అకాశ ఎయిర్ విమానం, అలయన్స్ ఎయిర్ అమృత్సర్-డెహ్రాడూన్-ఢిల్లీ విమానం, మధురై నుంచి సింగపూర్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సహా ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.సోమవారం రెండు ఇండిగో, ఎయిరిండియా విమానాలకు ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు పోలీసులతో కలిసి బెదిరింపుల వెనుక ఉన్న నిందితులను కనిపెట్టడానికి పని చేస్తోంది. -
ఎయిర్ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి అమెరికాలోని షికాగో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఏఐ-127 విమానానికి ముప్పు ఉందని మంగళవారం(అక్టోబర్ 15) బెదిరింపు మెయిల్ అందింది.దీంతో అప్రమత్తమైన ఎయిర్ ఇండియా సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని కెనడాలోని ఇకాల్యూట్ ఎయిర్‌పోర్టుకు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్(ట్విటర్)లో తెలిపింది. ఇకాల్యూట్ ఎయిర్‌పోర్టులో ప్రోాటోకాల్ ప్రకారం విమానంలోని ప్రయాణికులను,సిబ్బందిని తనిఖీ చేసిన తర్వాత విమానం తిరిగి బయలుదేరేందుకు అనుమతిస్తారని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఇటీవలి కాలంలో తమ విమానాలకు తరచుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంది. -
Kolkata: విమానం ప్రయాణంలో విషాదం
ఇరాక్ నుంచి చైనా వెళ్తున్న విమానంలో విషాదం చోటు చేసుకుంది. ఓ టీనేజీ ప్రయాణికురాలు అస్వస్థతకు గురై సీటులోనే కుప్పకూలిపోగా.. విమానాన్ని కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే.. ఆస్పత్రికి తరలించేలోపు ఆ బాలిక కన్నుమూసింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతురాలు బాగ్దాద్ సర్ చినార్ ప్రాంతానికి చెందిన డెరన్ సమీర్ అహ్మద్(16). మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఏఐ 473 విమానంలో చైనా గువాంగ్జౌకు వెళ్తోంది. అయితే బుధవారం అర్ధరాత్రి దాటాక.. హఠాత్తుగా ఆమె అస్వస్థతకు గురైంది.దీంతో విమానాన్ని దారి మళ్లించి అరగంటకు కోల్‌కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్‌పోర్ట్‌లో దించారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆమెను ఏఏఐ ఆంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన తర్వాత గురువారం అర్ధరాత్రి మిగతా ప్రయాణికులతో విమానం తిరిగి బయల్దేరింది. ఈ ఘటనపై అసహజ మరణంగా కోల్‌కతా బాగౌతి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం పూర్తి అయ్యాక.. మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. -
అరేబియా సముద్రంలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురు సిబ్బంది గల్లంతు
గుజరాత్‌లోని పోరుబందర్ తీరం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. అరేబియా సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్(ఏఎల్ హెచ్) కూలిపోయింది. రెస్క్యూ ఆపరేషన్‌కు వెళ్తుండగా అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్న సమయంలో సముద్రంలో హెలికాప్టర్ కూలడంతో.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు.గుజరాత్‌లోని పోర్బందర్ తీరం నుంచి అరేబియా సముద్రంలోకి 45 కిలోమీటర్ల దూరంలో మోటార్ ట్యాంకర్ హరిలీలాలో గాయపడిన సిబ్బందిని రక్షించడానికి సెప్టెంబర్ 2 రాత్రి 11 గంటలకు అధునాతన తేలికపాటి హెలికాప్టర్‌ను మోహరించినట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా హెలికాప్టర్లో సమస్య తలెత్తి సముంద్రంపై అత్యవసర హార్డ్ ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. ఈ క్రమంలో అరేబియా సముద్రంలో హెలికాప్టర్ ప్రమాదవశాత్తు పడిపోయిందని పేర్కొంది. ఆ సమయంలో హెలికాప్టర్లో నలుగురు సిబ్బంది ఉండగా అప్రమత్తమైన కోస్ట్‌గార్డ్ దళాలు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాయి.వెంటనే ఒకరిని రక్షించగా. మిగతా ముగ్గురు అదృశ్యమయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు నౌకలు, రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు కోస్ట్‌గార్డ్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఇటీవల గుజరాత్ వర్షాల సమయంలో 67 మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. -
ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం
-
సెక్యూరిటీ అలర్ట్.. అహ్మదాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఢిల్లీ: ఢిల్లీ నుంచి ముంబై బయలుదేరిన అకాసా ఎయిర్ విమానానికి సెక్యూరిటీ అలెర్ట్ రావటం కలకలం రేపింది. దీంతో ఆ విమానాన్ని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు మళ్లించారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ముంబైకి 186 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానానికి సెక్యూరిటీ హెచ్చరిక వచ్చింది.Akasa Air flight diverted to Ahmedabad airport after security alert https://t.co/BMWokfVVF9 pic.twitter.com/itUSAtj16s— DeshGujarat (@DeshGujarat) June 3, 2024 దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది 10.13 గంటలకు దారి మళ్లించి అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులందరినీ ఫ్లైట్ నుంచి దించివేశారు.‘ఫైట్ కెప్టెన్ అన్ని అత్యవసర సూచనలు పాటించారు. సురక్షింతంగా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. అకాశ్ ఫ్లైట్.. సెఫ్టీ, సెక్యూరిటీ ప్రొటోకాల్స్ పాటించింది’ అని అకాసా ఎయిర్ అధికార ప్రతినిధి వెల్లడించారు. -
గిరికీలు కొట్టిన హెలికాప్టర్
కేదార్నాథ్: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో శుక్రవారం ఉదయం పెనుప్రమాదం తప్పింది. హెలికాప్టర్ హైడ్రాలిక్ వ్యవస్థ విఫలం కావడంతో అత్యవసర ల్యాండయ్యింది. కెస్ట్రెల్ ఏవియేషన్‌కు చెందిన ఈ హెలికాప్టర్ సిర్సి నుంచి ఆరుగురు భక్తులతో కేదార్‌నాథ్‌కు చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపంతో హెలికాప్టర్ వేగంగా గిరికీలు కొట్టింది. హెలిప్యాడ్ వద్ద ఉన్న వాళ్లంతా భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. పైలట్ కల్పేశ్ చాకచక్యంగా వ్యవహరించి, హెలిప్యాడ్ పక్కనే 100 మీటర్ల దూరంలోని ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అందరూ సురక్షితంగా కిందికి దిగారు. -
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్‌కు తప్పిన ప్రమాదం
భువనేశ్వర్: దేశంలో ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో అక్కడక్కడా వర్షం కురుస్తూ బీభత్సం సృష్టిస్తోంది. సోమవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో గాలివాన తీవ్రతరమైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఒడిశా ముఖ్యమంత్రి 'నవీన్ పట్నాయక్' హెలికాప్టర్ భువనేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కాలేదు.ఎన్నికల ప్రచారం ముగించుకుని ఖరియార్ నుంచి తిరిగి వస్తుండగా.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, సీనియర్ బీజేడీ నాయకుడు కార్తిక్ పాండియన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ చేయడానికి సాధ్యపడలేదు. దీంతో హెలికాప్టర్ 30 నిమిషాల పాటు భువనేశ్వర్ విమానాశ్రయంపై తిరుగుతూ ఝర్సుగూడకు బయలుదేరింది.జరిగిన సంఘటన పార్టీ నేతలను ఒక్కసారిగా భయానికి గురిచేసింది. ఝర్సుగూడలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. నవీన్ పట్నాయక్, బీజేడీ సీనియర్ నేత కార్తిక్ పాండియన్ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.#WATCH | Odisha: While returning from Khariar, the helicopter carrying CM Naveen Patnaik and 5T Chairman and BJD leader VK Pandian couldn't land at Bhubaneswar airport due to wind and rain. After hovering over the airport for nearly 30 minutes, the helicopter headed to… pic.twitter.com/B0lyEMQYN4— ANI (@ANI) May 6, 2024 -
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
భువనేశ్వర్: విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం గాల్లో ప్రయాణిస్తుండగా వడగళ్ల వాన వల్ల దెబ్బతింది. విమానం విండ్‌షీల్డ్ పగుళ్లిచ్చింది. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.భువనేశ్వర్తోపాటు పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం వడగండ్ల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ నుంచి ఢిల్లీ విమానం టేకాఫ్ అయిన కేవలం పది నిమిషాల్లో తిరిగి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. విమానంలో ప్రయాణిస్తున్న ఉన్న 169 మంది ప్రయాణికులు, ఇతర సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.వడగళ్ల వాన వల్ల విస్తారా విమానం దెబ్బతిన్నట్లు బిజూ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. వడగళ్ల వల్ల విమానం విండ్‌షీల్డ్ పగుళ్లిచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు తెలిపారు. విమానంలోని 169 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. -
విమానంలో మంటలు.. అత్యవసర ల్యాండింగ్
అట్లాస్ ఎయిర్ బోయింగ్ కార్గో విమానం ఆకాశంలో ఉండగానే మంటలు చెలరేగాయి. దీంతో అమెరికాకు చెందిన ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అట్లాస్ ఎయిర్ బోయింగ్ 747-8 కార్గో విమానం టేకాఫ్ అయి ఫ్యూక్టోరికాకు బయలుదేరింది. అయితే కొద్దిసేపటికే ఆకాశంలో ఉండగా ఇంజన్లో లోపం కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని తిరిగి మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. 💥#BREAKING: Atlas Air Boeing 747-8 catches fire with sparks shooting out during mid flight.#Miami | #Florida #boeing7478 #atlasair pic.twitter.com/3IO5xFvMr6 — Noorie (@Im_Noorie) January 19, 2024 విమానంలో మంటలో చెలరేగటంతో ఆ విమానాన్ని వెంటనే సురక్షింగా మియామి ఎయిర్ట్లోనే ల్యాడింగ్ చేయించామని అట్లాస్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కారణంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ ఘటనలో సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదని మియామి ఎయిర్ పోర్టు ఫైర్ సిబ్బంది వెల్లడించింది. ఆకాశంలో ఉన్న విమానం మంటల్లో చిక్కుకున్నట్లు తెలిపే వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: Israel Hamas War: గాజాలో పేలిన యూనివర్సిటీ భవనం -
త్రుటిలో తప్పిన మరో విమాన ప్రమాదం
టోక్యో: అమెరికాలో విమానం మార్గమధ్యంలో కిటికీ ఊడిపడి ప్రయాణికులు నరకం చూసిన ఘటన మరువకముందే దాదాపు అలాంటి ఘటనే జపాన్‌లో జరిగింది. కాక్‌పిట్ కిటికీకి పగుళ్లు రావడంతో అప్రమత్తమైన విమాన పైలెట్లు వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్చేశారు. జపాన్‌లోని సప్పోరో నగరంలోని న్యూ చిటోసే ఎయిర్‌పోర్ట్‌లో శనివారం జరిగిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచి్చంది. 59 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ఆల్ నిప్పన్ ఎయిర్వేస్కు చెందిన దేశీయ బోయింగ్ 737–800 రకం విమానం సప్పోరో నుంచి టొయామాకు బయల్దేరింది. మార్గమధ్యంలో కాక్‌పిట్ కిటికీలో పగుళ్లను గుర్తించారు. పైలెట్లు వెంటనే అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు. వారి అనుమతితో మళ్లీ అదే ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. -
విమానం గాల్లో ఉండగా ఊడిపోయిన డోర్.. వీడియో వైరల్
అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా.. ఎయిర్‌క్రాఫ్ట్ డోర్ ఒక్కసారిగా ఊడిపోయింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 9(1282) విమానం పోర్టులాండ్ నుంచి ఒంటారియాకు(కెనడా) గురువారం సాయంత్రం బయలు దేరింది. 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్ టేకాఫ్ అయిన కొంత సమయానికే మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ విమానం నుంచి పూర్తిగా విడిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు. వెంటనే గమనించిన పైలెట్.. విమానాన్ని తిరిగి పోర్ట్లాండ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. 🚨#BREAKING: Alaska Airlines Forced to Make an Emergency Landing After Large Aircraft Window Blows Out Mid-Air ⁰⁰📌#Portland | #Oregon ⁰A Forced emergency landing was made of Alaska Airlines Flight 1282 at Portland International Airport on Friday night. The flight, traveling… pic.twitter.com/nt0FwmPALE — R A W S A L E R T S (@rawsalerts) January 6, 2024 విమానం ఆకాశంలో ఉండగా డోర్ ఊడిపోయి సమయం దృశ్యాలను ప్రయాణికులు వీడియో తీయగా.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై అలస్కా ఎయిర్‌లైన్స్ స్పందించింది. ఈ ఘటనతో ప్రభావితులైన ప్రయాణికులు, సిబ్బంది పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. AS1282 from Portland to Ontario, CA experienced an incident this evening soon after departure. The aircraft landed safely back at Portland International Airport with 171 guests and 6 crew members. We are investigating what happened and will share more as it becomes available. — Alaska Airlines (@AlaskaAir) January 6, 2024 ఇక ఈ సంఘటన అనంతరం అలాస్కా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ‘ఫ్లైట్ 1282లో గురువారం రాత్రి జరిగిన పరిణామంతో మా బోయింగ్ 737-9కు సంబంధించిన 65 విమానాలను ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తాత్కాలికంగా నేలకు పరిమితం చేస్తున్నాం’ అని ఎయిర్లైన్సన్ సీఈవో బెన్స్ మినికుచి పేర్కొన్నారు. పూర్తి మెయింటెనెన్స్, సేఫ్టీ తనిఖీల తర్వాత ప్రతి విమానం తిరిగి సేవలందించనున్నట్లు ఆయన తెలిపారు. -
గన్నవరంలో విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కారణం ఇదే..
గన్నవరం: పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవటంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో మూడు విమానాలు అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి. చత్తీస్గడ్ నుంచి హైదరాబాద్, గోవా నుంచి హైదరాబాద్, తిరువనంతపురం నుంచి హైదరాబాద్‌కు రావల్సిన విమానాలను అత్యవసరంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేశారు. ఒక్కో విమానంలో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఢిల్లీ, హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులను పొగమంచు కమ్మెసింది. దీంతో పలు విమానాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. పొగమంచు వల్ల వాతావరణం అనుకూలించికపోవడంతో పలు విమానాలను దారి మళ్లించారు. ఉదయం 07:35 గంటలకు మస్కట్ నుంచి శంషాబాద్ రావాల్సిన ఒమాన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. ఉదయం 8:05 గంటలకు రియాద్ నుంచి రావలసిన విమానం, ఉదయం 9:10 గంటలకు జెడ్డా నుండి రావాల్సిన విమానాలను బెంగళూరుకు దారి మళ్లించారు. పలు విమానాలు బెంగళూరు, నాగపూర్‌కు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 200 మంది అయ్యప్ప భక్తుల ఆందోళన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కొచ్చి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం రద్దు కావడంతో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. ఉదయం 9:40కి కొచ్చి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం పొగ మంచు కారణంగా 11 గంటలకు వెళ్లనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. 11 గంటలు దాటిన విమానాన్ని కొచ్చికి వెళ్లేందుకు సుముఖత చూపకపోవడంతో ఎయిర్‌పోర్టులో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. రాత్రి 10:40కి భక్తులకు దర్శనం ఉండడంతో అయ్యప్ప భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఢిల్లీ వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ముంబై: పుణె నుంచి ఢిల్లీ వెళ్తున్న అకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాన్ని ముంబై ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వివరాలు.. ఆకాశ ఎయిర్ సంస్థకు విమానం(QP 1148) 185 ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో శుక్రవారం అర్థరాత్రి 12 గంటలకు తెల్లవారుజామున పుణె నుంచి బయల్దేరింది. టేకాఫ్ అయిన 40 నిమిషాలల తర్వాత ఓ ప్రయాణికుడు తన వద్దనున్న బ్యాగ్‌లో బాంబ్ ఉందని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ముంబైకి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు. అనంతరం బాంబ్ స్క్వాడ్ బృందం, పోలీసులు విమానం అంతా తనిఖీలు చేపట్టారు. అయితే తమ సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించలేదని అధికారులు తెలిపారు. బాంబు బెదిరింపు చేసిన ప్రయాణికుడు ఛాతీలో నొప్పి వస్తుందని కూడా చెప్పడంతో విమానం ల్యాండైన వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతనికి వైద్యం అందించి పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాంబు లేదని తేలడంతో శనివారం ఉదయం 6 గంటలకు విమానం మళ్లీ ఢిల్లీకి టేకాఫ్ అయ్యింది. చదవండి: ఘోర ప్రమాదం.. చిన్నారి సహా అయిదుగురు మృత్యువాత -
విమానం గాల్లో ఉండగా బాత్రూమ్లో కుప్పకూలి చనిపోయిన పైలట్
విమానం గాల్లో ఉండగా బాత్రూమ్లో పైలట్ కుప్పకూలిపోయాడు. దీంతో అప్రమత్తమైన కో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే అప్పటికే పైలట్ మృతి చెందినట్లు డాక్టర్లు తేల్చారు. ఫ్లోరిడాలోని మియామీ నుంచి చిలీకి వెళుతున్న లాటామ్ ఎయిర్‌లైన్స్ వాణిజ్య విమానంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఆదివారం రాత్రి మియామీ ఎయిర్‌పోర్టు నుంచి చిలీ రాజధాని శాంటియాగోకు బయల్దేరింది. విమానంలో 271 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత 56 ఏళ్ల కెప్టెన్ ఇవాన్ అందౌర్ అస్వస్థతకు గురయ్యారు. బాత్రూమ్కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. ఆయన ఎంతకూ తిరిగి రాకపోడంతో సిబ్బంది వెళ్లి చూడగా కిందపడిపోయి ఉన్నారు. సిబ్బంది వెంటనే అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. వెంటనే కో పైలట్ విమానాన్ని పనామా సిటీలోని టోకుమెన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ల బృందం ఇవాన్‌ను పరిశీలించగా.. అప్పటికీ పైలట్ చనిపోయినట్లు ప్రకటించారు. మంగళవారం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. అప్పటి వరకు ప్రయాణికులకు పనామాలోని హోటల్లో వసతి కల్పించారు. ఈదురదృష్టకర సంఘటనపై ఎయిర్‌లైన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కెప్టెన్ ఇవాన్ అందూర్ తమ ఎయిర్‌లైన్స్‌లో వెటరన్ పైలట్ అని.. అతడికి 25 ఏళ్ల అనుభవం ఉందని పేర్కొంది. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని తెలిపింది. కెప్టెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. ఈ 25 ఏళ్ల కెరీర్లో తమ ఎయిర్‌లైన్స్‌కు ఎంతో సేవలు అందించారని పేర్కొంది. తాము ఎంత ప్రయత్నించినప్పటికీ ఇవాన్ అందూర్‌ను కాపాడుకోలేకపోయామని వెల్లడించింది. చదవండి: వర్షం ఇంక లేదు.. వరదైంది..! -
ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
తిరువనంతపురం: తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి షార్జాకు వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో, విమానాన్ని ముందు జాగ్రత్తగా కేరళలో తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. 154 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో సోమవారం ఉదయం 10.45 గంటలకు తిరుచిరాపల్లి నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ తీసుకుంది. కొద్దిసేపటికే ఇంజిన్‌లో సమస్యలు తలెత్తినట్లు గుర్తించిన పైలట్ అధికారులకు సమాచారం అందించారు. వారి సూచనల మేరకు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి స్థాయి అత్యవసర పరిస్థితి ప్రకటించి, మధ్యాహ్నం 12.01 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. తిరువనంతపురం–బహ్రెయిన్ ఎక్స్‌ప్రెస్ సాంకేతిక లోపంతో నిలిచిపోయిందని ఎయిరిండియా పేర్కొంది. -
నేరుగా సముద్రంలోనే విమానం ల్యాండింగ్.. తర్వాత ఏం జరిగిందంటే
మార్సెయిల్(ఫ్రాన్స్): ఇంజిన్ వైఫల్యం చెందడంతో ఓ పైలట్ విమానాన్ని సముద్రంలోనే అర్ధాంతరంగా దించేశాడు. విమానం మునిగిపోయినా అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఫ్రాన్సులోని మధ్యధరా సముద్ర తీరం ఫ్రెజుస్ వద్ద ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. తీరానికి మరో 600 మీటర్ల దూరం ఉందనంగా సెస్నా 177 రకం చిన్నపాటి పర్యాటక విమానం ఇంజిన్‌లో లోపం ఏర్పడింది. దీంతో, పైలట్ సముద్ర జలాల్లోనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అత్యవసర విభాగం సిబ్బంది అక్కడికి చేరుకునే అందులోని ముగ్గురినీ రక్షించారు. ‘ఫ్రెజుస్ బీచ్‌లో జనం రద్దీ ఎక్కువగా ఉంది. బీచ్‌లో అత్యవసర ల్యాండింగ్ వారికి అపాయం కలుగుతుందని పైలట్ భావించాడు. దీంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి బీచ్‌లో కాకుండా దగ్గర్లోని∙సముద్ర జలాల్లో ల్యాండ్ చేశాడు. ఇందుకు ఎంతో నైపుణ్యం కావాలి. అదృష్టమూ కలిసి రావాలి’ అని సహాయక సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలో విమానం సముద్రంలో మునిగిపోయింది. -
ఆక్సిజన్ మాస్క్‌తో విమానంలో సోనియా గాంధీ.. రాహుల్ భావోద్వేగ పోస్టు..
భోపాల్: బెంగళూరులో విపక్ష భేటీ అనంతరం ఢిల్లీకి వెళుతుండగా.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో విమానంలో ఆక్సిజన్ తక్కువ అయింది. ఈ కారణంగా సోనియా గాంధీ ఆక్సిజన్ మాస్క్ ధరించారు. ఈ ఫొటోను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ షేర్ చేశారు. 'ఆపదలోనూ దయకు అమ్మే ఉదాహారణ' అని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. పోస్టు చేసిన మొదటి గంటలోనే 1.8 లక్షల లైకులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రయాణిస్తున్న విమానం మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎయిర్ పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. సాంకేతిక లోపం కారణంగా విమానం భోపాల్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణ్ చారీ మిశ్రా పీటీఐ వార్తా సంస్థకు తెలియజేశారు. View this post on Instagram A post shared by Rahul Gandhi (@rahulgandhi) సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు బెంగళూరులో జరిగిన విపక్ష నేతల సమావేశంలో పాల్గొని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. దాదాపు గంటన్నర సేపు ఎయిర్ పోర్టులో బస చేసిన తర్వాత మంగళవారం రాత్రి 9.35కి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇదీ చదవండి: దంచికొట్టిన వానలు.. నీటమునిగిన కార్లు.. ఒక్క రోజులోనే.. -
సోనియా, రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రయాణిస్తున్న విమానం మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎయిర్ పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. వారి విమానం భోపాల్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణ్ చారీ మిశ్రా పీటీఐ వార్తా సంస్థకు తెలియజేశారు. అయితే ఎయిర్‌ప్లేన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రతికూల వాతావరణమే కారణంగా తెలుస్తోంది. కాగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు బెంగళూరులో జరిగిన విపక్ష నేతల సమావేశంలో పాల్గొని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు తెలిసింది. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ విషయమై వివరాలు తెలుసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శోభ ఓజా తెలిపారు. -
తప్పిన ప్రమాదం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై దొర్లిన విమానం!
బెంగళూరు: బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఓ విమానం సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా వెనక్కి మళ్లింది. అంతేకాకుండా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా.. రన్‌వేపై అదుపుతప్పి ప్రమాదకరంగా దిగింది. అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ హాని జరగలేదు. వివరాల్లోకి వెళితే.. హాల్ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతున్న ప్రీమియర్ 1ఏ విమానం వీటీ-కేబీఎన్‌లో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విమానం టేకాఫ్ అయిన తర్వాత నోస్ ల్యాండింగ్ గేర్‌ను వెనక్కి తీసుకోలేనందున ఎయిర్‌టర్న్‌బ్యాక్‌లో చిక్కుకుంది. దీంతో విమానాన్ని తక్షణమే వెనక్కి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో రన్‌వేపై నీరు నిలిచింది. ఆ నీటిలోనే విమానం ముందుకుసాగింది. అయితే విమానపు నోస్ ల్యాండింగ్ గేర్ సరిగా లేకపోవడంతో ఒక్కసారిగా ముందుకు దొర్లింది. అయితే అదృష్టవశాత్తు చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు మాత్రమే ఉన్నారు. ప్రయాణికులెవరూ లేరని డీజీసీఏ తెలిపింది. Bengaluru | A Fly By wire Premier 1A aircraft VT-KBN operating flight on sector 'HAL Airport Bangalore to BIAL' was involved in Airturnback as the nose landing gear couldn't be retracted after take off. The aircraft safely landed with the nose gear in Up position. There were two… pic.twitter.com/53zmaaKKEn — ANI (@ANI) July 11, 2023 చదవండి: ఆ తేనెలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే.. -
మమతా బెనర్జీకి తప్పిన పెను ప్రమాదం
బెంగాల్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఈ ఉదయం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టరును అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జల్పాయిపూర్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు మమతా బెనర్జీ. అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని బాగ్డోగ్రా ఎయిర్ పోర్టుకు వెళ్తూ బైకుంఠాపూర్ అడవులు దాటుతుండగా వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. దీంతో సిలిగురి సమీపంలోని సెవోక్ ఎయిర్ బేస్ వద్ద హెలికాప్టరును ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు సిబ్బంది. ఒక్కసారిగా వర్షం ఉధృతం కావడంతో మార్గం స్పష్టంగా లేక ముందుకు వెళ్లడం ప్రమాదకరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ఈ ఘటనలో మమతా బెనర్జీ స్వల్ప గాయాలతో బయటపడినట్లు చెప్పారు అధికారులు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బాగ్డోగ్రా ఎయిర్ పోర్టుకు చేరుకొని మమతా బెనర్జీ కోల్‌కతా పయనమైనట్లు తెలిపారు అధికారులు. Due to low visibility, West Bengal CM Mamata Banerjee's helicopter made an emergency landing at Sevoke Airbase. She was going to Bagdogra after addressing a public gathering at Krinti, Jalpaiguri. She is safe, says TMC leader Rajib Banerjee (file pic) pic.twitter.com/IVNIPV3oJD — ANI (@ANI) June 27, 2023 ఇది కూడా చదవండి: సెంచరీ దాటిన కిలో టమాట ధరలు.. కారణమిదే!