కౌలాలంపూర్ వెళ్లాల్సిన విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే తిరిగి ల్యాండ్ అయింది.
హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్ వెళ్లాల్సిన విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే తిరిగి ల్యాండ్ అయింది. సోమవారం ఉదయం విమానం బయలుదేరిన 15 నిమిషాల అనంతరం గాలిలో చక్కర్లు కొట్టి తిరిగి రన్‌వేపైకి చేరింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఇలా జరిగిందని అధికారులు అంటున్నారు. విమానంలో 148 మంది ప్రయాణికులతో సహా ఆరుగురు సిబ్బంది ఉన్నారు.