న్యూఢిల్లీ : పారిస్ నుంచి ముంబై బయలుదేరిన ఎయిర్ ఫ్రాన్స్ సబ్సిడరీకి చెందిన ఎయిర్‌బస్ ఏ 340 దుబాయ్ వెళుతూ ఇరాన్‌లో గంటల కొద్దీ నిలిచిపోయింది. సాంకేతిక సమస్యలతో విమానం ఇరాన్ నగరం ఇస్ఫహాన్‌లో ల్యాండయింది. ప్రయాణీకులు అందరూ క్షేమంగానే ఉన్నారని, అధికారులు వారికి అవసరమైన ఏర్పాట్లు చేశారని ఇరాన్ వార్తాసంస్థ పేర్కొంది.
విమానాన్ని స్ధానిక మెయింటెనెన్స్ బృందం చెక్ చేసిందని గురువారం దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుందని ఎయిర్ ఫ్రాన్స్ వెల్లడించింది. దుబాయ్ నుంచి ఇతర ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాల్లో ప్రయాణీకులను ముంబై చేరవేస్తామని తెలిపింది. కాగా గత ఏడాది డిసెంబర్‌లో సైతం నార్వేకు చెందిన ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ దుబాయ్ నుంచి ఓస్లో వెళుతూ ఇరాన్‌లో అత్యవసరంగా ల్యాండయింది.
Comments
Please login to add a commentAdd a comment