Airbus
-
మరో 100 విమానాలకు ఎయిరిండియా ఆర్డరు
విమానయాన సంస్థ ఎయిరిండియా మరో 100 ఎయిర్‌బస్ విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. వీటిలో వైడ్–బాడీ ఏ350 రకం ఎయిర్‌క్రాఫ్ట్‌లు 10, ప్రాంతీయ రూట్లలో ఉపయోగించే నారో–బాడీ ఎ320 రకం విమానాలు 90 ఉన్నాయి. కంపెనీ ఇప్పటికే ఎయిర్‌బస్, బోయింగ్ సంస్థలకు ఇచ్చిన 470 విమానాలకు ఇవి అదనం.అలాగే ఎ350 ఎయిర్‌క్రాఫ్ట్‌ల విడిభాగాలు, నిర్వహణ సహకారం కోసం ఎయిర్‌బస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిరిండియా తెలిపింది. తాజా ఆర్డరుతో కలిపి ఎయిర్‌బస్ నుంచి ఎయిరిండియా కొనుగోలు చేసే మొత్తం ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య 350కి చేరుతుంది. 2023లో కంపెనీ 250 విమానాల కోసం ఆర్డరిచ్చింది."భారత ప్రయాణికుల వృద్ధి ప్రపంచంలోని ఇతర దేశాలను అధిగమించడం, గణనీయంగా మెరుగుపడుతున్న దేశ మౌలిక సదుపాయాలు, ఆకాంక్షతో కూడిన యువ జనాభా అంతర్జాతీయంగా ఎదుగుతుండటం వంటి పరిణామాలతో ఎయిర్ ఇండియా విస్తరణకు స్పష్టమైన సందర్భాన్ని చూస్తున్నాం" టాటా సన్స్, ఎయిర్ ఇండియా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. -
ఎయిర్ ఇండియాలోకి మరో 100 ఎయిర్‌బస్ విమానాలు
టాటా గ్రూప్ యాజమాన్యంలోని 'ఎయిర్ ఇండియా' (Air India) మరో వంద కొత్త విమానాలను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఇందులో 10 ఏ350 వైడ్‌బాడీ, మరో 90 ఏ320 ఫ్యామిలీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి.ఎయిర్ ఇండియా గతేడాది ఎయిర్‌బస్‌కు 250 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 40 ఏ350 విమానాలు, 210 ఏ320 విమానాలు ఉన్నాయి. కొత్తగా చేరనున్న విమానాలతో కలిపి ఎయిర్‌బస్‌కు ఇచ్చిన ఆర్డర్ల సంఖ్య 350కి చేరింది.కొత్త విమానాల కోసం ఆర్డర్ చేయడం మాత్రమే కాకుండా.. ఎయిర్ ఇండియా ఏ350 విమానాలను సంబంధించిన విడి భాగాలు, నిర్వహణ కోసం ఎయిర్‌బస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎయిర్‌బస్‌తో 250 విమానాల కోసం గతంలో ఆర్డర్ చేసినప్పుడే.. 220 విమానాల కోసం బోయింగ్‌తోనూ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో కంపెనీ ఆర్డర్ చేసిన మొత్తం కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య 570కి పెరిగింది.కొత్త విమానాలకు ఆర్డర్ చేసిన సందర్భంగా టాటా సన్స్ అండ్ ఎయిర్ ఇండియా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. మన దేశంలో మౌలిక సదుపాయాలు క్రమంగా పెరుగుతున్నాయి. చదువుకోవడానికి లేదా ఉద్యోగం కోసం చాలామంది యువత ఇతర దేశాలకు వెళ్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఎయిర్ ఇండియాలో విమానాల సంఖ్యను పెంచుతున్నట్లు, సేవలను ప్రపంచ నలుమూలలకు విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు.100 more @Airbus aircraft! ✈️We are happy to announce new orders for 10 A350s and 90 A320 Family aircraft, adding 100 more aircraft to our firm orders for 250 Airbus aircraft placed last year.With this, the total number of new aircraft we have ordered rises to 570, of which… pic.twitter.com/OmfSWbJwbi— Air India (@airindia) December 9, 2024 -
ఎయిర్‌బస్ @ ఓరుగల్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విమానాశ్రయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. వరంగల్ శివారులోని మామునూరులో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఎయిర్పోర్ట్ రూపొందబోతోంది. ఐదారేళ్ల తర్వాత ఎట్టకేలకు అవరోధాలు పరిష్కారం కావటంతో విమానాశ్రయ నిర్మాణం చేపట్టేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సంసిద్ధత ప్రకటించింది. దీనిని సొంతంగానే నిర్మించాలని నిర్ణయించగా, అనుమతులు, ఇతర అధికారిక ప్రక్రియను ఆరునెలల్లో పూర్తి చేసి టెండర్లు పిలవబోతోంది. ఎయిర్‌బస్ దిగేలా.. నాలుగేళ్ల క్రితం ఏఏఐ ఆధ్వర్యంలో జరిగిన టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ సర్వే రెండు రకాల నివేదికలు సమర్పించింది. చిన్న విమానాశ్రయం నిర్మించేందుకు 724 ఎకరాల భూమి, రూ.248 కోట్ల వ్యయం అవుతుందని, పెద్ద విమానాలను ఆపరేట్ చేసే స్థాయిలో నిర్మించాలంటే 1053 ఎకరాల భూమి, రూ. 345 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొంది. తొలుత చిన్న విమానాశ్రయంగానే నిర్మించాలని నాటి ప్రభుత్వం సూచించింది. కానీ భవిష్యత్‌లో విస్తరణ ఇబ్బందిగా ఉంటుందని, కనీసం 30 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఒకేసారి పెద్ద విమానాశ్రయమే నిర్మించాలని గతేడాది చివరలో ఏఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి ప్రభుత్వం సరే అనటంతో పెద్ద విమానాశ్రయమే రూపొందబోతోంది. ఇక్కడ ఎయిర్‌బస్ విమానం దిగేలా దాదాపు 2,800 మీటర్ల పొడవైన్ రన్‌వే నిర్మించబోతున్నారు. మామునూరులో నిజాం ప్రభుత్వం నిర్మించిన ఎయిర్‌్రస్టిప్ శిథిలం అయినా, నాటి రెండు రన్‌వేల ఆనవాళ్లు ఉన్నాయి. అందులో పెద్దది దాదాపు 1,400 మీటర్ల పొడవు ఉంది. ఇప్పుడు అదే డైరెక్షన్లో దానిపైనే కొత్త రన్‌వే నిర్మించనున్నారు. దాని పక్కన గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్‌వే కూడా ఉంది. దానిని కూడా పునరుద్ధరించే యోచనలో ఉన్నారు. సొంతంగానే నిర్మాణం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎమ్మార్ సంస్థ నిర్మించింది. ఎయిర్‌పోర్టుకు 150 కి.మీ. పరిధిలో మరో విమానాశ్రయం నిర్మించకూడదన్న నిబంధన ఉంది. వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఇది అడ్డంకిగా మారటంతో జీఎమ్మార్ సంస్థతో సంప్రదింపులు జరిపారు. వరంగల్ విమానాశ్రయాన్ని కూడా దానికే కేటాయించేలా కూడా చర్చలు జరిగాయి. చివరకు ఆ నిబంధనపై అభ్యంతరం పెట్టకూడదన్న దిశలో చర్చలు సానుకూలంగా జరిగాయి. ఆ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ఓసీ తీసుకుంది. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు కేటాయించకుండా సొంతంగానే వరంగల్ ఎయిర్‌పోర్టును చేపట్టాలని అది నిర్ణయించింది. – విమానాశ్రయానికి 700 మీటర్ల దూరంలో ఉన్న వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిని మళ్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. దాదాపు కిలోమీటరు నిడివితో భారీ సొరంగమార్గం నిర్మించి వాహనాలను దాని గుండా మళ్లించాలని ప్రతిపాదించారు. కానీ దీనికి భారీ ఖర్చు అవుతున్నందున, దాని బదులు బైపాస్‌రోడ్డు నిర్మించాలన్న ప్రత్యామ్నాయ ప్రతిపాదనపై ఇప్పుడు పరిశీలిస్తున్నారు. – వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో జపాన్, తైవాన్ లాంటి విదేశీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇవి కార్గో ఫ్లైట్ సేవలు కోరుతున్నాయి. కార్గో ఫ్లైట్ ఆపరేషన్ జరగాలంటే పెద్ద రన్‌వే ఉండాలి. దీంతో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంగానే దీనిని రూపొందించబోతున్నారు. మూడేళ్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్.. మామునూరు విమానాశ్రయాన్ని ‘ఉడాన్’లోని రీజినల్ కనెక్టివిటీ స్కీంతో అనుసంధానించనున్నారు. ఇందులో మూడేళ్ల కాలానికి కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండ్ అందిస్తుంది. రూట్ల వారీగా బిడ్డింగ్ నిర్వహిస్తే వాటిల్లో ఎంపికైన ఆపరేటర్లకు ఆయా రూట్లు కేటాయిస్తారు. ఆ ఆపరేటర్లు మాత్రమే ఆ రూట్లలో మూడేళ్లపాటు విమాన సర్వీసులు నిర్వహిస్తారు. ఈ కాలంలో సీట్ల వారీగా నష్టాలను బేరీజు వేసి.. డిమాండ్ అంచనా–వాస్తవ డిమాండ్.. ఈ రెంటి మధ్య ఉండే గ్యాప్‌ను కేంద్రం భర్తీ చేస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. వేయి ఎకరాలు అవసరం కొత్త విమానాశ్రయానికి వేయి ఎకరాలు కావాలి. నిజాం కాలం నాటి పాత విమానాశ్రయానికి చెందిన 696 ఎకరాలు ప్రస్తుతం ఏఏఐ అధీనంలోనే ఉన్నాయి. మిగతా భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. విమానాశ్రయం నిర్మించేందుకు రూ. 800 కోట్లు ఖర్చవుతాయని అంచనా. త్వరలో ఏఏఐ డీపీఆర్ సిద్ధం చేయనుంది. -
వడోదరలో టాటా- ఎయిర్ బస్ ఎయిర్ క్రాఫ్ట్ అసెంబ్లింగ్ ప్లాంట్
-
బెలూగా.. భలేగా..
శంషాబాద్: ఆకాశ తిమింగలంగా పేరొందిన ప్రపంచంలోని అతిపెద్ద అయింది. ఈ నెల 27న ఫ్రాన్స్‌లోని టూలూజ్ నుంచి థాయ్‌లాండ్ వెళ్లేందుకు బయలుదేరిన ఈ విమానం 28న ఫ్రాన్స్‌లోని మార్సెల్లే, 29న ఈజిప్టు రాజధాని కైరో, కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్‌బస్ బెలూగా (ఏ300–608ఎస్టీ3) మరోసారి భాగ్యనగరాన్ని పలకరించింది. గురువారం అర్ధరాత్రి 12:23 గంటలకు ముచ్చటగా మూడోసారి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ ఒమన్ రాజధాని మస్కట్ మీదుగా ప్రయాణించి ఇంధనం నింపుకోవడంతోపాటు సిబ్బంది విశ్రాంతి కోసం హైదరాబాద్ చేరుకుంది. దాదాపు 15 గంటల హాల్టింగ్ అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు థాయ్‌లాండ్ బయలుదేరింది. బెలూగా–3 విమానం 2022 డిసెంబర్లో తొలిసారి, 2023 ఆగస్టులో రెండోసారి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండైంది.ప్రత్యేకతలు ఇవీ..రష్యన్ భాషలో బెలూగా అంటే తెల్ల తిమింగలం అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఈ రకం విమానాలు కేవలం ఐదే ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన అంటోనోవ్–225కన్నా ఇది 20 మీటర్లు చిన్నగా ఉంటుంది. సాధారణ కార్గో విమానాల్లోతరలించలేని భారీ సామగ్రిని ప్రత్యేకించి విమానాల విడిభాగాలు, రక్షణ రంగ పరికరాలను ఈ విమానంలో తరలిస్తారు. దీని పొడవు పొడవు 56.15 మీటర్లు, ఎత్తు 17.24 మీటర్లు, కార్గో మోసుకెళ్లే సామర్థ్యం 47 టన్నులు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరుదైన విమానం
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గురువారం(ఆగస్టు29) అర్ధరాత్రి అరుదైన విమానం ల్యాండ్ అయింది. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన విమానం సైజు భారీగా ఉండటంతో దీనిని వేల్ ఆఫ్ ది స్కైగా పిలుస్తారు. ఇది ఎయిర్‌బస్‌కు చెందిన A300-608ST బెలుగా రకం విమానం.ఇంధనం నింపుకోవడంతో పాటు సిబ్బంది విశ్రాంతి కోసం బెలుగా విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. మస్కట్ నుంచి థాయిలాండ్ వెళ్తుండగా మార్గమధ్యలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఈ లోహవిహంగం వాలింది. ఇది శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి వెళుతుందని అధికారులు చెప్పారు. -
ఎయిర్‌బస్‌తో టాటా అడ్వాన్స్డ్ జత
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ తాజాగా ఎయిర్‌బస్ హెలికాప్టర్స్‌తో చేతులు కలిపింది. తద్వారా దేశీయంగా ఒకే ఇంజిన్గల హెచ్125 చోపర్స్ తుది అసెంబ్లీ లైన్(ఎఫ్ఏఎల్) ఏర్పాటుకు తెరతీయనున్నాయి. ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో దేశీ వైమానిక రంగానికి భారీస్థాయిలో ప్రోత్సాహం లభించనుంది.ఎఫ్ఏఎల్ ద్వారా దేశీయంగా ప్రయివేట్ రంగంలో తొలిసారి హెలికాప్టర్ అసెంబ్లీ సౌకర్యం ఏర్పాటు కానుంది. వెరసి ఎయిర్‌బస్ అత్యధికంగా విక్రయిస్తున్న హెచ్125 చోపర్స్ను దేశీ అవసరాలతోపాటు.. ఇరుగుపొరుగు దేశాలకు సరఫరా చేసేందుకు వీలు చిక్కనుంది. ఫార్న్‌బరో ఇంటర్నేషనల్ ఎయిర్‌షోలో కాంట్రాక్టుపై సంతకాలు చేసినట్లు రెండు సంస్థలు సంయుక్త ప్రకటనలో తెలియజేశాయి.నిజానికి ఎఫ్ఏఎల్ ఏర్పాటుకు ఈ ఏడాది జనవరి 26న ఎయిర్‌బస్ సీఈవో గిలౌమ ఫారీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తొలిసారి వెల్లడించారు. తొలి మేడిన్ ఇండియా హెచ్125 చోపర్స్ డెలివరీలు 2026లో ప్రారంభంకావచ్చని అంచనా. -
గతి శక్తి విశ్వవిద్యాలయం, ఎయిర్‌బస్ మధ్య ఒప్పందం.. ఎందుకంటే..
భారత విమానయాన పరిశ్రమను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని గతి శక్తి విశ్వవిద్యాలయం (జీఎస్వీ), ఎయిర్‌బస్ పరస్పరం భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. సెప్టెంబర్ 2023లో జరిగిన ఎంఓయూను అనుసరించి ఎయిర్‌బస్ ఎండీ రెమి మెయిలార్డ్, జీఎస్వీ వైస్ ఛాన్స్లర్ మనోజ్ చౌదరి మధ్య న్యూదిల్లీలోని రైల్ భవన్లో ఒప్పందం కుదిరింది. ఈ మేరకు భారత రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటన వెలువరించింది.మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం..భారత్‌లోని విమానయాన పరిశ్రమను విస్తరించేందుకు జీఎస్వీ, ఎయిర్‌బస్ మద్య ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా విమాన రంగంలో రాణించాలనుకునే వారికి ఎగ్జిక్యూటివ్ శిక్షణ, నైపుణ్యాలు అందిస్తారు. మొత్తం ప్రోగ్రామ్ వ్యవధిలో 40 మందికి పూర్తి స్కాలర్‌షిప్‌తో కూడిన శిక్షణ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..‘సబ్కా సాథ్ సబ్కా వికాస్.. అనే స్ఫూర్తితో కేంద్రం విమానయానం, హైవేలు, రైల్వేలు, రోడ్డు రవాణాను అభివృద్ధి చేస్తోంది. దానికి అందరి సహకారం అవసరం. అన్ని రవాణా రంగాలను ఏకీకృతం చేసేందుకు ఒక ప్రత్యేక సంస్థ ఉండాలని జీఎస్వీని ఏర్పాటు చేశాం. ఆయా రంగాల్లో తయారీ పరిశ్రమను ప్రోత్సహించేలా అందులో ఎగ్జిక్యూటివ్ శిక్షణ, నైపుణ్యాలు అందిస్తున్నాం. ఇప్పటికే ఇందులో రైల్వే శిక్షణ ఇచ్చాం. విమానయాన రంగం వేగంగా వృద్ధి చెందుతుంది. అందులో విప్లవాత్మక మార్పులు రావాలి. కాబట్టి ప్రస్తుతం సివిల్ ఏవియేషన్‌లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. తర్వాత షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగంలో శిక్షణ ఇస్తాం. ప్రస్తుతం జరిగే శిక్షణకు ఎయిర్‌బస్ సహకరిస్తుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: గూగుల్ మ్యాప్స్‌తో ఒప్పందం రద్దు.. రూ.100 కోట్లు ఆదా!ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ..‘పదేళ్ల కాలంలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 157కి రెట్టింపయింది. ఉడాన్ పథకం ద్వారా విమాన సర్వీసులు టైర్ II, టైర్ III నగరాలకు విస్తరించాయి. ఈ రంగం పురోగతికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గతి శక్తి విశ్వవిద్యాలయానికి పూర్తిగా సహకరిస్తుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్, రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో జయవర్మ సిన్హా తదితరులు పాల్గొన్నారు. -
100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
ప్రాంతీయ మార్గాల్లో విమాన సేవలందించేలా ఇండిగో సంస్థ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. దానికోసం మూడు విమాన తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది.ఇండిగో సంస్థ ప్రాంతీయ మార్గాల్లో విమాన సేవలు ప్రారంభించాలని నిర్ణయించింది. స్థానికంగా ప్రయాణికులకు రవాణా సేవలందించి లాభాలు పొందాలని యోచిస్తోంది. అందులో భాగంగా కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది. అయితే వీటి తయారీకి ఏటీఆర్, ఎంబ్రాయిర్, ఎయిర్‌బస్ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా 50 విమానాలకు ఆర్డరు పెట్టి, తర్వాత మరో 50 విమానాలు కొనుగోలు చేయాలనుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండిగో 45 ఏటీఆర్-72 విమానాలను నడుపుతోంది. అందులో ప్రతి విమానంలో 78 సీట్లు ఉంటాయి. ఈ ఏడాదిలో మరో 5 కొత్త విమానాలు కంపెనీలో చేరనున్నాయి.ఇదీ చదవండి: తగ్గుతున్న పంట దిగుబడి.. ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లపై ప్రభావంఏటీఆర్‌తోపాటు ఎయిర్‌బస్ ఏ220, ఎంబ్రేయర్ ఈ-175 రకం విమానాలను కంపెనీ పరిశీలిస్తోంది. ఇటీవల అంతర్జాతీయ మార్గాలను చేరుకునేందుకు వీలుగా ఏప్రిల్‌లో 30 ఎయిర్‌బస్ ఏ350-900 విమానాల కోసం ఆర్డర్ చేసింది. -
లండన్ ఎయిర్‌పోర్టులో ప్రమాదం.. రెండు విమానాల ఢీ..
లండన్: అప్పుడప్పుడు అనుకోకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ప్రమాదాలకు కారణమవుతాయి. శనివారం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో వర్జిన్ అట్లాంటిక్ బోయింగ్ 787 విమానం.. బ్రిటిష్ ఎయిర్వేస్ ఎయిర్‌బస్ A350 విమానాన్ని అనుకోకుండా ఢీ కొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బ్రిటన్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన హీత్రూలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణీకులకు ఎలాంటి గాయాలు కాలేదని ఏవియేషన్ అధికారులు తెలిపారు. Just witnessed a plane crash at Heathrow! A tug pushing back a Virgin 787, crashed the wing into a BA A350 #Heathrow #BritishAirways #VirginAtlantic pic.twitter.com/9VmiP6uwQr — Alex Whittles (@PurpleFrogAlex) April 6, 2024 ఈ ప్రమాదం జరిగిన వెంటనే బృందం అప్రమత్తమైంది. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్లు కూడా చేరుకున్నాయి. ఇంజినీరింగ్ బృందాలు విమానాలను పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం ఆ వాటిని సర్వీసు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ప్రభావం కస్టమర్ల మీద పడకుండా ఉండటానికి ప్రత్యామ్నాయ విమానం అందించినట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో తెలిపింది. Accident at #heathrow involving a #virginatlantic #boeing787 and a #britishairways #A350 #bigjettv @BigJetTVLIVE pic.twitter.com/Hm5Vh6ehrc — specialise cyclists (@slaytor_roger) April 6, 2024 -
భారత కంపెనీకి విమాన డోర్లు తయారుచేసే కాంట్రాక్ట్
ఎయిర్‌బస్‌కు చెందిన ఏ220 విమానాల డోర్లు ఇకపై భారత్‌లోనే తయారవనున్నాయి. ఈ మేరకు దేశీయ సంస్థ డైనమెటిక్ టెక్నాలజీస్‌తో ఒప్పందం జరిగినట్లు యూరప్‌కు చెందిన విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్ గురువారం ప్రకటించింది. భారతీయ విమానయాన రంగ తయారీ సంస్థకు దక్కిన అతిపెద్ద ఎగుమతి కాంట్రాక్టుల్లో ఇది కూడా ఒకటని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా అన్నారు. విమానాల విడిభాగాల తయారీలో భారత్ కీలకంగా మారుతుందని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో భారత్ ఏగుమతి చేసే సేవలు, విమాన విడిభాగాల విలువను 1.5 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలనే లక్ష్యంతో పనిచేయాలని కోరారు. ప్రస్తుతం ఈ మార్కెట్ 750 మిలియన్ డాలర్లుగా ఉందని చెప్పారు. ఇదీ చదవండి: లిథియం బ్లాక్‌ల వేలంలో పాల్గొననున్న ప్రముఖ కంపెనీ? ఈ కాంట్రాక్టులో భాగంగా డైనమెటిక్ టెక్నాలజీస్ ఎయిర్‌బస్ 220 కార్గో, ప్యాసింజర్ విమానాల డోర్లను తయారీచేయనుంది. అందుకు సంబంధించి సర్వీసింగ్‌ను అందించనుంది. ఒక్కో విమానానికి 8 డోర్లుంటాయి. ఈ డోర్లతోపాటు వాటికి సంబంధించిన అన్ని విడిభాగాలనూ సంస్థ తయారు చేస్తుంది. ఇప్పటికే ఎయిర్‌బస్‌కు చెందిన ఏ330, ఏ320 విమానాల ఫ్లాప్ ట్రాక్ బీమ్లనూ ఈ సంస్థే తయారు చేస్తుండటం విశేషం. అలాగే ఏ220 విమానాల్లో కాక్‌పీట్ ఎస్కేప్ హ్యాచ్ డోర్లనూ ఉత్పత్తి చేస్తోంది. -
ఇక మేడిన్ ఇండియా హెలికాప్టర్లు!
ముంబై: దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజ గ్రూప్ టాటాతో ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ చేతులు కలిపింది. ఇరు సంస్థలు దేశీయంగా హెలికాప్టర్స్ తయారీకి భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేయనున్నాయి. టాటా గ్రూప్‌తో జత కట్టడం ద్వారా హెలికాప్టర్స్ తయారీలో తుది అసెంబ్లీ లైన్ (ఎఫ్ఏఎల్) యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు ఎయిర్‌బస్ హెలికాప్టర్ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ప్లాంటు ద్వారా పౌర విమాన శ్రేణిలో దేశీయంగా ఎయిర్‌బస్ హెచ్125 హెలికాప్టర్లను రూపొందించనున్నట్లు పేర్కొంది. వీటిలో కొన్నింటిని పొరుగు దేశాలకు సైతం ఎగుమతి చేయనున్నట్లు తెలియజేసింది. వెరసి దేశీయంగా హెలికాప్టర్ తయారీకి ప్రైవేట్ రంగంలో తొలి ఎఫ్‌ఏఎల్‌ను నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. ఇది భారత ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్ కార్యక్రమానికి భారీస్థాయిలో ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు వివరించింది. డెలివరీలవరకూ.. భాగస్వామ్యంలో భాగంగా ఎయిర్‌బస్ హెలికాప్టర్స్‌తో కలసి టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్) ఎఫ్‌ఏఎల్‌ను ఏర్పాటు చేయనుంది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మేక్రన్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా ఎయిర్‌బస్ హెలికాప్టర్ తాజా ప్రకటన జారీ చేసింది. గణతంత్ర దినోత్సవాలలో ప్రధాన అతిథిగా పాల్గొనేందుకు మేక్రన్ భారత్‌కు విచ్చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రధాన విడిభాగాల అసెంబ్లీలు, ఏవియానిక్స్, మిషన్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ నియంత్రణల ఇన్స్టలేషన్, హైడ్రాలిక్ సర్క్యూట్లు, విమాన కంట్రోళ్లు, ఇంధన వ్యవస్థతోపాటు ఇంజిన్ కూర్పు తదితరాలను జేవీ నిర్వహించనున్నట్లు ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ వివరించింది. అంతేకాకుండా భారత్ తదితర ప్రాంతాలలో హెచ్125ల టెస్టింగ్, క్వాలిఫికేషన్‌తో సహా.. డెలివరీలను సైతం చేపట్టనున్నట్లు పేర్కొంది. 24 నెలల్లోగా ఎఫ్ఏఎల్ ఏర్పాటవుతుందని, 2026లో దేశీయంగా తయారైన తొలి (మేడిన్ ఇండియా) హెచ్125ల డెలివరీ చేసే వీలున్నట్లు అంచనా వేసింది. తయారీ యూనిట్ ఏర్పాటుచేసే ప్రాంతాన్ని సంయుక్తంగా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది. కీలక పాత్ర... జాతి నిర్మాణంలో హెలికాప్టర్లు కీలక పాత్ర పోషిస్తాయని ఎయిర్‌బస్ సీఈవో గిలామ్ ఫారీ పేర్కొన్నారు. నవ భారత సామర్థ్యాలపై గల నమ్మకానికి మేడిన్ ఇండియా పౌర హెలికాప్టర్ ప్రతీకగా ఉంటుందని అభివర్ణించారు. తద్వారా దేశీయంగా హెలికాప్టర్ మార్కెట్‌కున్న భారీ అవకాశాలకు తెరతీస్తుందని అభిప్రాయపడ్డారు. దేశీయంగా ప్రయివేట్ రంగంలో తొలి హెలికాప్టర్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటుకు సంతోషిస్తున్నట్లు టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు. తుది అసెంబ్లీ లైన్ ద్వారా ప్రపంచంలోనే ఎయిర్ బస్‌కు చెందిన అత్యుత్తమ హెచ్125 సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్‌ను భారత్‌తోపాటు, ఇతర మార్కెట్లకు కూడా అందించనున్నట్లు తెలియజేశారు. -
భారత్‌లో ఫ్రాన్స్ ప్రధాని..టాటా - ఎయిర్ బస్‌ల మధ్య కీలక ఒప్పందం
దేశంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సైతం హాజరయ్యారు. ఈ తరుణంలో భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య వ్యాపార ఒప్పందాలు ఊపందుకున్నాయి. దేశీయ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా - ఫ్రాన్స్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ల మధ్యం ఒప్పందం జరిగింది. ఈ రెండు సంస్థల సంయుక్త భాగస్వామ్యంలో హెచ్ 125 హెలికాప్టర్లను తయారు చేసేందుకు సిద్ధమయ్యాయి. అందుకు సంబంధించిన ఒప్పందాలు సైతం చివరి దశకు వచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ రెండు సంస్థల మధ్య పలు ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఏ320, ఏ350 వంటి కమర్షియల్ జెట్ల కోసం ఎయిర్‌బస్‌కు విడిభాగాలను తయారు చేయడానికి, సరఫరా చేస్తున్నట్లు ప్రకటించింది. అదనంగా భారత వైమానిక దళం కోసం టాటా, ఎయిర్‌బస్‌లు సీ295 సైనిక రవాణా విమానాన్ని తయారు చేయనున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
ఎగిరిన కొత్త ఫ్లైట్.. దేశంలోనే తొలిసారి!
దేశంలో కొత్త ఫ్లైట్ ఎగిరింది. తొలిసారిగా ఎయిర్‌బస్ A350-900 వాణిజ్య విమానాన్ని ఎయిర్ ఇండియా బెంగళూరు, ముంబైల మధ్య ప్రారంభించింది. అలాగే ప్రత్యేకమైన యూనిఫాంను సైతం ఈ సందర్భంగా ఆవిష్కరించింది. AI 589 ఫ్లైట్ నంబర్‌తో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిర్దేశిత సమయానికి బయలుదేరిన ఎయిర్‌బస్ A350-900.. కొత్త అనుభూతిని ఆస్వాదించేందుకు సిద్ధమైన ప్రయాణికులను గమ్యస్థానానికి తీసుకెళ్లింది. మంగళవారం మినహా ప్రతిరోజు ఈ విమాన సర్వీస్‌ను నడపనున్నారు. రోజూ ఉదయం 7.05 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరి 8.50 గంటలకు ముంబైకి చేరుకుంటుంది. సిబ్బందికి అలవాటు కావడానికి, అలాగే రెగ్యులేటరీ సమ్మతి కోసం తొలుత దేశీయ మార్గాల్లోనే ఈ విమానాన్ని నడపనున్నారు. ఈ క్రమంలో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబైల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఎయిర్‌బస్ A350 విమానంలోని అత్యాధునిక సౌకర్యాలను ఆస్వాదించే అవకాశం కలగనుంది. తదుపరి దశలో అంతర్జాతీయ సర్వీసుల్లో వీటిని నడుపుతారు. సౌకర్యాలివే.. ఎయిర్‌బస్ A350లో ఉన్న ఇన్-ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ (IFE) సిస్టమ్, ప్రత్యేకమైన సౌకర్యాలను హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన వింగ్స్ ఇండియా గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్‌లో ప్రదర్శించారు. త్రీ-క్లాస్ క్యాబిన్ లేఅవుట్‌తో కాన్ఫిగర్ చేసిన A350లో 316 సీట్లు ఉన్నాయి. ఇందులో 28 ప్రైవేట్ బిజినెస్ సూట్లు, 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, 264 విశాలమైన ఎకానమీ సీట్లు ఉన్నాయి. అన్ని సీట్లు లేటెస్ట్ జనరేషన్ పానాసోనిక్ eX3 ఇన్-ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, హెచ్డీ స్క్రీన్లతో అమర్చబడి ఉంటాయి. రోల్స్ రాయిస్ ట్రెంట్ ఎక్స్‌డబ్ల్యూబీ ఇంజన్ల ద్వారా ఆధారితమైన ఈ విమాన ఇంధన సామర్థ్యం, ఇతర విమానాలతో పోల్చితే 20 శాతం మెరుగ్గా ఉంటుంది. ఇంధన ఉద్గారాలను తగ్గించడానికి ఇది దోహదం చేస్తుంది. -
WINGS INDIA 2024: 20 ఏళ్లలో 2,840 విమానాలు కావాలి
రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఏవియేషన్ రంగానికి భారత్ దన్నుగా నిలుస్తుందని విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్ ఇండియా ప్రెసిడెంట్ రెమి మిలార్డ్ తెలిపారు. గణనీయంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్‌కు వచ్చే 20 ఏళ్లలో 2,840 కొత్త విమానాలు అవసరమన్నారు. అలాగే 41,000 మంది పైలట్లు, 47,000 మంది టెక్నికల్ సిబ్బంది కావాల్సి ఉంటుందని గురువారం వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమంలో ఆయన చెప్పారు. వచ్చే 20 ఏళ్ల పాటు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందతున్న దేశంగా భారత్ నిలుస్తుందని అంచనాలు ఉన్నట్లు రెమీ తెలిపారు. భారత్ నుంచి రెట్టింపు స్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు రెమీ వివరించారు. ప్రస్తుతం 750 మిలియన్ డాలర్లుగా ఉన్న సోర్సింగ్‌ను ఈ దశాబ్దం చివరికి 1.5 బిలియన్ డాలర్లకు పెంచుకోనున్నట్లు చెప్పారు. భారత్ నుంచి గతేడాది 750 విమానాలకు ఆర్డర్లు రాగా 75 ఎయిర్‌క్రాఫ్ట్‌లను దేశీ విమానయాన సంస్థలకు డెలివరీ చేసినట్లు వివరించారు. వీటిలో 41 విమానాలు ఇండిగో సంస్థకు, ఎయిరిండియాకు 19, విస్తారాకు 14, గో ఫస్ట్‌కు ఒకటి చొప్పున అందించినట్లు రెమీ చెప్పారు. తమ ఏ350 రకం విమానాలు భారత్‌లో అంతర్జాతీయ ప్రయాణాలకు ఊతమివ్వగలవని పేర్కొన్నారు. గతేడాది ఎయిరిండియాకు ఆరు ఏ350 విమానాలను అందించినట్లు చెప్పారు. భారత్‌లో విమానాల నిర్వహణ, రిపేర్లు, ఓవరాలింగ్ వ్యవస్థ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. వింగ్స్ ఇండియా హైలైట్స్ ► హెరిటేజ్ ఏవియేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ చార్టర్ కంపెనీ హెరిటేజ్ ఏవియేషన్ తాజాగా హెచ్125, హెచ్130 హెలికాప్టర్ల కోసం ఎయిర్‌బస్‌కు ఆర్డరు ఇచి్చంది. వీటిని ప్రాంతీయ కనెక్టివిటీ స్కీము ఉడాన్ కింద సరీ్వసుల కోసం ఉపయోగించనున్నట్లు సంస్థ సీఈవో రోహిత్ మాథుర్ తెలిపారు. ఎత్తైన, వేడిమి ఎక్కువగా ఉండే వాతావరణాల్లో ప్రయాణాలకు హెచ్125 హెలికాప్టర్ ఉపయోగపడుతుంది. ఇక సైట్ సీయింగ్, అత్యవసర వైద్య సరీ్వసులు మొదలైన వాటి కోసం హెచ్130 సహాయకరంగా ఉంటుంది. ► ఎయిర్ ఇండియా గురుగ్రాంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసియాలో అతిపెద్ద ఏవియేషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఎయిర్‌బస్, బోయింగ్ కోసం 20కిపైగా సిమ్యులేటర్స్‌తో పైలట్లకు శిక్షణ. ఆకాశ ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ రకం 150 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఆకాశ ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ రకం 150 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్ ఇండియా గురుగ్రాంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసియాలో అతిపెద్ద ఏవియేషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఎయిర్‌బస్, బోయింగ్ కోసం 20కిపైగా సిమ్యులేటర్స్‌తో పైలట్లకు శిక్షణ. జీఎంఆర్ ఏరో జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా ఏవియేషన్ స్కూల్ వర్చువల్‌గా ప్రారంభం. టీఏఎస్ఎల్ విడిభాగాల తయారీకై మహీంద్రా ఏరోస్పేస్తో కలిసి ఎయిర్‌బస్ నుంచి ఆర్డర్లను పొందింది. -
Wings India 2024: బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికగా ‘వింగ్స్ ఇండియా–2024’ (ఫొటోలు)
-
ఎయిర్ఇండియా బాహుబలి!
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వాకిట్లోకి మరో కొత్త విమానం వచ్చి చేరింది. అతిపెద్ద బాడీ కలిగిన ఏ350-900 సర్వీస్ శనివారం ఎయిర్ ఇండియాతో జతైంది. యూరప్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ రూపొందించిన ఈ సర్వీసు దిల్లీలోని ఇందీరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి వైడ్‌బాడీ విమాన సర్వీసును నిర్వహిస్తున్న సంస్థల్లో ఎయిర్ ఇండియానే మొదటిది కావడం విశేషం. దీంతోపాటు వచ్చే మార్చిలోగా మరో 5 విమానాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది. మొత్తం 20 ఏ350-900 సర్వీసులను ఆర్డర్ చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ ఏడాది మొదట్లో ఎయిర్ ఇండియా 40 ఏ350ఎస్ విమానాలు, 40 ఏ350-900, ఏ350-1000 ఎయిర్క్రాఫ్ట్లతోపాటు 140 చిన్న సైజు ఏ321, 70 ఏ320 నియో విమానాలకు ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియా A350-900 విమానం కాన్ఫిగరేషన్లు.. క్యాబిన్లో మెరుగైన సౌలభ్యం కోసం ఫ్లాట్ బెడ్లతో 28 ప్రైవేట్ బిజినెస్ క్లాస్ సూట్లు ఉన్నాయి. అదనంగా 24 ప్రీమియం ఎకానమీ సీట్లు ఉన్నాయి. క్యాబిన్లో 264 ఎకానమీ క్లాస్ సీట్లున్నాయి. అన్ని తరగతుల్లో హైడెఫినిషన్ స్క్రీన్లు అందుబాటులో ఉంచారు. సుమారు ఇందులో 320 మంది ప్రయాణించవచ్చు. క్రూ సిబ్బంది ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇటీవల రూపొందించిన కొత్త యూనిఫామ్‌లో కనిపించనున్నారు. ఎయిర్ ఇండియా A350 జనవరి 2024లో వాణిజ్య సేవలను ప్రారంభించనుంది. ప్రాథమికంగా ఈ సర్వీస్ కొన్నిరోజులు దేశీయంగా సేవలందిస్తుందని సంస్థ ప్రకటించింది. ఆ తర్వాత విదేశాల్లోని ఇతర ప్రాంతాలకు దీని సేవలను విస్తరించనున్నారు. ఏటా వెయ్యి కోట్లు ఆదా భారతీయ వైమానిక దళం అధీనంలో ఉన్న గగనతలాన్ని వినియోగించుకోవడం వల్ల విమానయాన సంస్థలకు ఏటా వెయ్యి కోట్ల రూపాయల వరకు ఆదా కానున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశీయంగా వినియోగిస్తున్న గగనతలంలో 30 శాతం వైమానిక దళం అధీనంలో ఉంది. ఈ గగనతలాన్ని వినియోగించుకోవడం వల్ల విమానం నడిచే సమయం తగ్గనుందని, చమురు వినిమయం, ఉద్గారాలు మరింత తగ్గుతాయని మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ నెల 18 నాటికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) 1,562 మంది కమర్షియల్ పైలెట్లకు లైసెన్స్‌లు జారీ చేసింది. వైమానిక దళం వినియోగిస్తున్న ఏరోస్పేస్లో 40 శాతం వృథాగా ఉందని పేర్కొంది. ఇదీ చదవండి: వారాంతపు సెలవులపై అభిప్రాయం మార్చుకున్న బిల్‌గేట్స్ -
వికటించిన క్రిస్మస్ డిన్నర్.. 700 మందికి అస్వస్థత
క్రిస్మస్ సందర్భంగా ఓ విమానయాన సంస్థ తమ ఉద్యోగులను ఖుషీ చేయాలని నిర్ణయించింది. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ అట్లాంటిక్ కంపెనీ తవ వద్ద పనిచేసే వారికి పసందైన విందు ఇవ్వాలని ప్లాన్ చేసింది. అనుకున్నట్లుగానే గ్రాండ్‌గా డిన్నర్ పార్టీ ఇచ్చింది. అయితే క్రిస్మిస్ డిన్నర్ ప్లాన్ బెడిసి కొట్టింది. భోజనం చేసిన ఉద్యోగుల్లో దాదాపు 700 మందికి అస్వస్థతకు గురయ్యారు. డిన్నర్ చేసిన తర్వాత ఉద్యోగులు.. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. అయితే డిన్నర్‌కు ఇచ్చిన మెనూలో ఏయే వంటకాలు ఉన్నాయన్న విషయం తెలియరాలేదు. అంతేగాక భారీ సంఖ్యలో ఉద్యోగుల అనారోగ్యానికి గురవడం వెనక ఉన్న నిర్ధిష్ట కారణం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఎయిర్‌బస్ సంస్థ కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా ప్రపంచంలోని అతిపెద్ద విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌కు చెందిన అనుబంధ సంస్థే ఎయిర్‌బస్ అట్లాంటిక్. ఆ సంస్థ కింద అయిదు దేశాల్లో సుమారు 15,000 మంది పనిచేస్తున్నారు. ఫుడ్ పాయిజనింగ్‌కు సంబంధించిన దర్యాప్తు జరుగుతున్నట్లు ఏఆర్తెఎస్లి ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎయిర్‌బస్ సంస్థలో సుమారు లక్షా 34 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్, డిఫెన్స్, స్పేస్, సెక్యూరిటీ పరిశ్రమలు ఆ కంపెనీ పరిధిలో ఉన్నాయి. చదవండి: విమానం కంటే స్పీడ్‌గా వెళ్లే రైలు.. కథ కంచికే.. -
భారత్‌లో విమానాల సర్వీసింగ్.. హాల్‌తో ఎయిర్‌బస్ జట్టు!
యూరోపియన్ మల్టీనేషనల్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ భారత్‌లో వాణిజ్య విమానాల సర్వీసింగ్లోకి ప్రవేశిస్తోంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) భాగస్వామ్యంతో దేశంలో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ , మరమ్మతులు, నవీకరణ (ఎంఆర్ఓ) పరిశ్రమను బలోపేతం చేయడానికి ముందుకొచ్చింది. దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య విమానాలు, ముఖ్యంగా విమాన ప్రయాణాన్ని సరళతరం చేసిన A320 రకానికి చెందిన విమానాల కోసం ఎంఆర్ఓ సేవల డిమాండ్ పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా సేవలందించేందుకు ఎయిర్‌బస్ ఈ భాగస్వామ్యం ద్వారా హాల్‌కు మద్దతు ఇస్తుంది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ దేశంలో ఇంటిగ్రేటెడ్ ఎంఆర్ఓ హబ్‌ని స్థాపించి, విమానయాన సంస్థలకు సమర్థవంతమైన సేవలలు అందించాలనే దృక్పథంతో ఉందని, హాల్ నాసిక్ కేంద్రం చేస్తున్న ఈ ప్రయత్నం భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా మిషన్‌కు అనుగుణంగా ఉంటుందని హాల్ సీఈవో (MiG కాంప్లెక్స్) సాకేత్ చతుర్వేది పేర్కొన్నారు. భారతదేశంలో విమానయాన వ్యవస్థ బలోపేతానికి, అందుకు అత్యంత ఆవశ్యకమైన ఎంఆర్ఓ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎయిర్‌బస్ కట్టుబడి ఉందని ఎయిర్‌బస్ ఇండియా అండ్ దక్షిణాసియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రెమి మైలార్డ్ తెలిపారు. ఒప్పందం ప్రకారం, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ ఎయిర్‌బస్ A320 ఫ్యామిలీ టూల్ ప్యాకేజీని, ఎంఆర్ఓని సెటప్ చేయడానికి ప్రత్యేక కన్సల్టింగ్ సేవలను అందిస్తుంది. దీంతోపాటు ఎయిర్‌బస్ సపోర్ట్, టెక్నికల్ డేటాతోపాటు ట్రైనింగ్ సొల్యూషన్స్ అందించే డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన ‘ఎయిర్‌బస్ వరల్డ్’కి యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆమోదించిన మూడు హ్యాంగర్లు, నైపుణ్యం కలిగిన మానవవనరులతో కూడిన పౌర విమాన ఎంఆర్ఓ సదుపాయాలు ఇప్పటికే హిందూస్తాన్ ఏరోనాటిక్స్ నాసిక్ విభాగంలో ఉన్నాయి. -
గుడ్ న్యూస్: ఎయిర్‌బస్‌లో భారీగా ఉద్యోగాలు
గ్లోబల్ ఏరోస్పేస్ మేజర్ ఎయిర్‌బస్ (Airbus) వచ్చే రెండేళ్లలో భారత్ నుంచి 2,000 మంది ఇంజనీర్లను నియమించుకోవాలని చూస్తోంది. తద్వారా సంస్థలో భారతీయ ఇంజనీర్ల మొత్తం సంఖ్యను 5,000కి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఎయిర్‌బస్ ఇండియా ప్రెసిడెంట్, దక్షిణాసియా ఎండీ రెమి మెయిలార్డ్ మాట్లాడుతూ.. తాము భారత్‌ను కేవలం మార్కెట్‌గా మాత్రమే కాకుండా టాలెంట్ హబ్‌గా చూస్తున్నామన్నారు. కొత్త ఇంజనీరింగ్ కోర్సు ఎయిర్‌బస్.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో వడోదరలోని గతి శక్తి విశ్వవిద్యాలయ (GSV)తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏరోస్పేస్ రంగంలో కొత్త ఇంజనీరింగ్ కోర్సును ప్రారంభించేందుకు ఈ ఒప్పందం మార్గం సుగమం చేసింది. గతి శక్తి విశ్వవిద్యాలయ భాగస్వామ్యంతో నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌ను అభివృద్ధి చేస్తామని, ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్ రంగానికి సేవలందించేందుకు భవిష్యత్తులో సిద్ధంగా ఉంటుందని మెయిలార్డ్ తెలిపారు. (Google: ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్ బంపరాఫర్.. ) ఎయిర్‌బస్ సంస్థలోని డిజైన్, డిజిటల్ కేంద్రాలలో ఇప్పిటికే 3,000 మందికిపైగా భారతీయ ఇంజనీర్లు పనిచేస్తున్నారని, 2025 నాటికి ఈ సంఖ్యను 5,000లకు పైగా పెంచుతామని మెయిలార్డ్ వివరించారు. భారత్ శక్తిసామర్థ్యాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక మొదటి మేక్-ఇన్-ఇండియా C295 మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను 2026 సెప్టెంబర్‌లో డెలివరీ చేయనున్నట్లు చెప్పారు. -
వారెవ్వా.. శంషాబాద్ రన్‌వేపై బెలుగా ఎయిర్‌బస్.. అదిరిపోయిందిగా! (ఫొటోలు)
-
ఏవియేషన్ చరిత్రలో అదిపెద్ద డీల్.. 500 విమానాలకు ఇండిగో ఆర్డర్
ఏవియేషన్ చరిత్రలో అతి పెద్ద డీల్ జరిగింది. దేశీయ ఏయిర్‌లైన్స్ దిగ్గజం ఇండిగో ఫ్రాన్స్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ నుంచి 500 విమానాల్ని కొనుగోలు చేసేలా ఒప్పందం కుదర్చుకుంది. ఇప్పటికే టాటాలకు చెందిన ఎయిరిండియా ఎయిర్‌బస్, బోయింగ్ నుంచి 470 విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెట్టింది. ఆ ఒప్పందం కంటే ఇండిగో - ఎయిర్ బస్‌ల మధ్య జరిగిన డీల్ దేశీయ విమాన చరిత్రలో ఇదే పెద్దదని పరిశ్రమ వర్గాల విశ్లేషకులు చెబుతున్నారు. జూన్ 19న ప్యారిస్ ఎయిర్ షోలో ఇండిగో - ఎయిర్‌బస్‌ల మధ్య కొనుగోలు చర్చలు జరిగాయి. ఈచర్చల్లో సందర్భంగా ఇండిగో బోర్డ్ఆఫ్ చైర్మన్ వి.సుమత్రాన్, ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్, ఎయిర్‌బస్ సీఈవో గుయిలౌమ్ ఫౌరీ, అంతర్జాతీయ చీఫ్ కమర్షియల్ అధికారి క్రిస్టియన్ షెరర్లు పాల్గొన్నారు. అనంతరం, దేశ ఏవియేషన్ హిస్టరీలోనే భారీ కొనుగోలు ఒప్పందం జరిగింది. 500 ఏ320 ఎయిర్ క్రాఫ్ట్‌ల కొనుగోలుకు ఆర్డర్ పెట్టినట్లు ఇండిగో తెలిపింది. తాజా ఇండిగో చేసిన ఆర్డర్‌తో ఎయిర్‌బస్ డెలివరీ చేయాల్సిన విమానాల సంఖ్య 1,330కి చేరింది. కాగా, ప్రస్తుతం ఇండిగో 300 విమానాలను నడుపుతోంది. ఇది వరకే 480 విమానాలకు ఆర్డర్ పెట్టింది. ఇవి డెలివరీ అవ్వాల్సి ఉంది. -
డ్రోన్ పైలట్ అవుతారా? శిక్షణ కోర్సులు అందించనున్న ఎయిర్‌బస్
ముంబై: యూరోపియన్ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్‌బస్ భారత్‌లో డ్రోన్ పైలట్ల శిక్షణ కోర్సులను అందించనున్నట్లు వెల్లడించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆమోదం పొందిన ఈ సర్టిఫికెట్ కోర్సులు అయిదు రోజుల పాటు ఉంటాయి. సూక్ష్మ, చిన్న కేటగిరీ డ్రోన్ల కోసం ఉద్దేశించిన కోర్సులు బెంగళూరులోని ఎయిర్‌బస్ ట్రైనింగ్ సెంటర్లో జూన్ 26 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. డ్రోన్ల నిబంధనలు, ఫ్లయిట్ ప్రాథమిక సూత్రాలు, నిర్వహణ మొదలైన వాటిపై డీజీసీఏ ఆమోదించిన ఇన్స్ట్రక్టర్లు శిక్షణనిస్తారని పేర్కొంది. సిమ్యులేటర్ శిక్షణతో పాటు ప్రాక్టికల్ ఫ్లయింగ్ పాఠాలు కూడా ఉంటాయని వివరించింది. 10వ తరగతి పూర్తి చేసిన, 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇందు కోసం దరఖాస్తు చేసుకునేవారికి తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ ఉండాలి. అలాగే శిక్షణ పొందేందుకు, డ్రోన్లను ఆపరేట్ చేయడానికి ఫిట్నెస్ను ధ్రువీకరించే మెడికల్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: Palm Payment: ఇదేదో బాగుందే.. వట్టి చేతులు చాలు! పేమెంట్ ఈజీ -
ఒకేసారి అన్ని విమానాలు కొంటుందా? ఇండిగో భారీ డీల్..
దేశీయ దిగ్గజ ఏవియేషన్ సంస్థలు భారీ ఎత్తున విమానాల కొనుగోళ్లకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఎయిరిండియా కోసం టాటా సన్స్ 500 విమానాల్ని కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. తాజాగా ఇండిగో సైతం బోయింగ్, ఎయిర్ బస్ సంస్థల 500 అంతకంటే ఎక్కువ విమానాల కోసం ఆర్డర్ ఇవ్వనున్నట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ప్రస్తుతం విమానాల కొనుగోళ్ల నేపథ్యంలో విమానాల తయారీ సంస్థలతో ఇండిగో చర్చలు జరుపుతుందని, ఆ చర్చలు సఫలమైతే ఎయిరిండియా తర్వాత మరో అతిపెద్ద ఒప్పొందం అవుతుందని రాయిటర్స్ తెలిపింది. బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో గత నెలలో న్యారో బాడీ ప్లైట్ల కోసం ఎయిర్ బస్, ఫ్రెంచ్ ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయని, ఆ చర్చలు కొలిక్కి రావడంతో వందల విమానాల కొనుగోలుకు సిద్ధపడినట్లు రాయిటర్స్ రిపోర్ట్ హైలెట్ చేసింది. ఇక మరో పదేళ్లలో ఇండిగో సంస్థ మిడ్ సైజ్ వైడ్ బాడీ జెట్స్ విమానాల సంఖ్యను పెంచే ప్రణాళికల్లో ఉండగా అందుకు అనుగుణంగా విమానాల ఆర్డర్ ఉండనుంది ఇప్పటికే ఎయిరిండియా ఎయిరిండియా బ్రాండ్‌కు కొత్త గుర్తింపును తీసుకొచ్చేందుకు మాతృ సంస్థ టాటా సన్స్ ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల్ని అందుకునేలా 100 బిలియన్ డాలర్లతో 500 విమానాల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఒప్పందంలో భాగంగా విమాన తయారీ సంస్థలు ఈ 500 ఎయిర్ క్రాప్ట్‌లను 8 ఏళ్లలో డెలివరీ చేయనున్నట్లు రాయిటర్స్ కథనం వెలువరించింది. -
ఎయిరిండియా మెగా డీల్: భారీ ఉద్యోగాలు, సీఈవో కీలక ప్రకటన
సాక్షి, ముంబై: వ్యాపార దిగ్గజం టాటా గ్రూపు సొంతమైన ఎయిరిండియా దూసుకుపోతోంది. ముఖ్యంగా విమానాల కొనగోలులో రికార్డ్ సృష్టిస్తోంది. బోయింగ్, ఎయిర్‌బస్‌తో మెగా డీల్‌గా ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ సోమవారం మాట్లాడారు.సంస్థ వాణిజ్య విమానయాన చరిత్రలో అతిపెద్ద ఒప్పందాన్ని ప్రకటించిన కొన్ని వారాల తర్వాత, విల్సన్, ఈ డీల్ ప్రాముఖ్యత, భవిష్యత్తు మార్కెట్ వ్యూహంఅభివృద్ధిలో దాని పాత్ర గురించి వివరాలను బిజినెస్ టుడేతో పంచుకున్నారు. ప్రపంచ స్థాయి విమానయాన కేంద్రంగా దేశం ఆవిష్కారమయ్యే క్రమంలో విమానయాన చరిత్రలో ఇదొక గొప్ప పరిణామమని పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో 470 విమానాల కొనుగోలు డీల్ విలువ 70 బిలియన్లని సీఈవో తెలిపారు. ఈ సంవత్సరం చివరి నుండి దశాబ్దం చివరి వరకు విమానాల సేవలను ప్రారంభిస్తామని, కొత్త విమానాల ఫ్లీట్, పవర్ ముఖ్యమైన నెట్వర్క్ , సామర్థ్య విస్తరణ రెండింటినీ మార్చడానికి చారిత్రాత్మక మెగా డీల్‌కు కట్టుబడి ఉన్నామన్నారు. 5వేల పైలట్లు, ప్రతి నెలా 500మంది క్యాబిన్ ఈ నెల ప్రారంభంలో, విమానయాన సంస్థ తన విమానాలకు 470 విమానాలను చేర్చుకోనున్నట్లు సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.. దీని ప్రకారం ఈ 470 విమానాల్లో 220 విమానాలను బోయింగ్ నుంచి, 250 విమానాలను ఎయిర్‌బస్ నుంచి కొనుగోలు చేయనుంది. అలాగే గత వారం, విమానయాన సంస్థ 5వేల పైలట్లు , క్యాబిన్ సిబ్బందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. నెలకు 100మంది పైలట్లు, 500 మంది క్యాబిన్ సిబ్బంది,ఇతర గ్రౌండ్ స్టాఫ్‌ను చేర్చుకుంటున్నామని ఆయన తెలిపారు. నాన్‌ఫ్లైయింగ్ పొజిషన్లతో సహా 1,500 మందికి పైగా సంస్థలో చేరారని విల్సన్ చెప్పారు. ఎయిరిండియా- విస్తారా విలీనం ఎయిరిండియా, విస్తారా విలీనం మొదటి దశలో ఉందని కూడా సీఈవో ప్రకటించారు. తదుపరి దశ విలీనానికి డీజీసీఏ, సీసీఐ ఆమోదం తెలిపాల్సి ఉందన నారు. తక్కువ ధరల్లో సంపూర్ణమైన సేవలు అందించాలని టాటా గ్రూప్ లక్క్ష్యంగా పెట్టుకుంది. ఫ్యూచర్ ప్లాన్స్‌పై సీఈవో కీలక ప్రకటన ♦ 470 నారో, వైడ్‌బాడీ ఎయిర్‌బస్, బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ మెగా-డీల్‌తో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏవియేషన్ మార్కెట్లో విమాన ప్రయాణసేవల్ని, వస్తువుల రవాణా రూపురేఖలను పూర్తి మారిపోనున్నాయి. ♦ ప్రపంచంలోని ప్రముఖ విమానాల తయారీదారుల నుండి మరో 370 విమానాలను కొనుగోలు చేసి, ఆర్డర్ పరిమాణాన్ని 840 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు తీసుకువెళ్లే అవకాశాన్ని ఎయిరిండియా పరిశీలిస్తోంది. ♦ 2025 మధ్యకాలం నుండి పదేళ్లలో గణనీయమైన సంఖ్యలో డెలివరీలు షురూ చేయాలని ప్లాన్. ♦ఎయిరిండియా గ్రూప్ క్యారియర్లు ఎయిరిండియాఎక్స్‌ప్రెస్ ఏకీకరణ తర్వాత అత్యంత సమన్వయంతో కూడిన కార్యకలాపాలు. ♦ విమానయాన సంస్థ అంతర్జాతీయ , దేశీయ రూట్ నెట్వర్క్ రెండింటినీ పెంచడంపై సమానంగా దృష్టి ♦ మూడు ప్రధాన కేంద్రాల ఏర్పాటు వీటిలో దక్షిణ భారతదేశంలో ఒకటి ♦పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ స్పెషలిస్ట్‌ల కోసం శిక్షణ సౌకర్యాల ఏర్పాటు, అలాగే భవిష్యత్తుకార్యకలాపాలు,సేవల నిమిత్తం నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర (MRO) సామర్థ్యాల నిర్మాణం