
( ఫైల్ ఫోటో )
సుమారు డెబ్భై ఏళ్ల తర్వాత ఎయిరిండియాను సొంతం చేసుకుంది టాటా. ప్రస్తుతం ఏవియేషన్ సెక్టార్‌లో ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఆధునీకరణ పనులు చేపడుతోంది.ఈ మేరకు ఈ రంగంలో దిగ్గజ కంపెనీలైన ఎయిర్‌బస్, బోయింగ్ సంస్థలతో టాటా గ్రూపు చర్చలు జరుపుతోంది.
ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను టాటా ఇటీవల దక్కించుకుంది. ఈ క్రమంలో చిన్నా పెద్దా అంతా కలిసి 150 విమానాలు ఎయిరిండియాకు ఉన్నాయి. అయితే ఇందులో చాలా వరకు విమానాలు పాతవై పోయాయి. వీటి మెయింటనెన్స్ అండ్ మోడిఫికేషన్‌కి రూ. 7,500 వరకు ఖర్చు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ పనిని పరిమితంగా చేపట్టి.. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా కొత్త విమానాల కొనుగోలకు టాటా ఆసక్తి చూపుతుందంటూ బ్లూబెర్గ్ కథనం ప్రచురించింది.
ప్రపంచ వ్యాప్తంగా విమానాల తయారీలో బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థలు ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా బోయింగ్ సంస్థ భారీ విమానాలకు పర్యాయపదంగా ఉంది. దీంతో కొత్త విమానల తయారీ, తమ అవసరాలు తదితర అంశాలపై టాటా ప్రతినిధులు ఈ రెండు కంపెనీలతో చర్చలు చేపడుతున్నారు. ఇవి సఫలమైతే టాటా నుంచి అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment