
ముంబై: బడ్జెట్ ధరల ఎయిర్‌లైన్స్ ఇండిగో దేశీయంగా అధిక సంఖ్యలో విమానాలు కలిగిన సంస్థగా రికార్డు నమోదు చేసింది. దేశీయంగా 200 విమానాలను కలిగి ఉన్న తొలి సంస్థ ఇదే. రెండు ఎయిర్‌బస్ ఏ320(సియో), రెండు ఎయిర్‌బస్ ఏ320 నియో విమానాలు తాజాగా వచ్చి చేరడంతో సంస్థ విమానాల సంఖ్య 200కు చేరుకుంది.
దేశీయ మార్కెట్లో ఇండిగో 40 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. 2015 డిసెంబర్ 24న ఈ సంస్థ నిర్వహణలోకి 100వ విమానం వచ్చి చేరగా, మూడేళ్ల తర్వాత రెట్టింపు స్థాయికి చేరుకున్నట్టు అయింది.
Comments
Please login to add a commentAdd a comment