ఒక్కరోజు పైలట్‌!  | One day pilot! | Sakshi

ఒక్కరోజు పైలట్‌! 

Oct 29 2017 1:14 AM | Updated on Oct 29 2017 1:14 AM

One day pilot!

పైలట్‌ అవ్వడమే ఆ చిన్నారి లక్ష్యం. అందుకే.. వయసు ఆరేళ్లే అయినా.. ఓ పైలట్‌కు ఉండాల్సిన స్కిల్స్‌ అన్నీ ఆ చిన్నారి సొంతం. ఆ చిన్నారి పేరు ఆడమ్‌. చిన్నప్పటి నుంచి విమానాలు నడపాలనే ఆసక్తితో యూట్యూబ్‌లో పైలట్‌ శిక్షణకు సంబంధించిన వీడియోలన్నీ చూసేశాడు. అబుదాబీకి చెందిన ఆడమ్‌కు విమానాలకు సంబంధించిన నాలెడ్జ్‌ను చూసి ఆశ్చర్యపోయిన ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది ఆడమ్‌కు ఒక్కరోజు పైలట్‌గా ఉండే అవకాశాన్ని కల్పించారు. దీంతో తన డ్రీమ్‌ను ఆరేళ్ల వయసులోనే తీర్చేసుకున్నాడు ఆడమ్‌.

ఆడమ్‌ను ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌కు పిలిచి.. పైలట్‌ యూనిఫాం వేసి, ఎయిర్‌బస్‌ ఏ380కు ఒక్కరోజు కోపైలట్‌గా అవకాశం ఇచ్చారు. ఇక... ఆడమ్‌కు ఉన్న నాలెడ్జ్‌ చూసి ఆశ్చర్యపోయిన కెప్టెన్‌ సమెరె యాక్‌లెఫ్‌ ఆడమ్‌ విమానం నడిపిస్తుండగా వీడియో తీసి.. ఎయిర్‌వేస్‌ అధికారుల పర్మిషన్‌తో ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. అంతే.. ఆ వీడియోను ఇప్పటి వరకు 2 కోట్ల మందికిపైగా వీక్షించారు. అంతే కాదు.. ఆ చిన్నారి కచ్చితంగా భవిష్యత్తులో పైలట్‌ అవుతాడని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. ఏ380 ఎయిర్‌బస్‌కు కెప్టెన్‌ అవ్వడమే ఆడమ్‌ ఆశయమట. తప్పకుండా ఆడమ్‌ కోరుకున్న ఎయిర్‌బస్‌కు కెప్టెన్‌ అవ్వాలని మనమూ కోరుకుందాం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement