
ఎయిర్ బస్ ను కిందకు దించిన ఎలుకలు!
లెహ్: ఎలుకలే కదా తేలిగ్గా తీసిపారేయకండి. ఓ ఎలుకల గుంపు పెద్ద విమానాన్ని గాల్లోంచి కిందకు దించేసింది. ఎలుకల హడావుడితో ఎయిర్ బస్ ఏకంగా ఆకాశం నుంచి అత్యవసరంగా దిగింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఏ-320 విమానం మంగళవారం జమ్మూకశ్మీర్ లోని లెహ్ ఎయిర్ పోర్టులో దిగింది.
90 ప్రయాణికులు ఉన్న ఈ విమానంలో ఎలుకలను గుర్తించడంతో ముందు జాగ్రత్త చర్యగా కిందకు దించేశారు. విమానంలోని ఎలక్ట్రిక్ వైర్లను ఎలుకలు కొరికేస్తాయని, దీంతో సమాచార వ్యవస్థ పనిచేయక ప్రమాదం వాటిల్లే అవకాశమున్నందన్న ఉద్దేశంతో ప్లైట్ ను కిందకు దించారు.
అయితే లెహ్ ఎయిర్ పోర్టులో ఎలుకలను పట్టుకునే ఎక్విప్ మెంట్ లేకపోవడంతో మరో చోటి నుంచి విమానంలో దీన్ని తెప్పించింది ఎయిర్ ఇండియా. ఎలుకల పని పట్టిన తర్వాత విమానం మళ్లీ ఎగురుతుందని అధికారులు తెలిపారు. కేటరింగ్ వ్యాన్ల ద్వారా ఎలుకలు విమానంలోకి ప్రవేశించివుంటాయని అనుమానిస్తున్నారు.