ఎయిర్ ఇండియాలోకి మరో 100 ఎయిర్‌బస్‌ విమానాలు | Air India Discloses 100 Airbus Aircraft Order | Sakshi
Sakshi News home page

ఎయిర్ ఇండియాలోకి మరో 100 ఎయిర్‌బస్‌ విమానాలు

Dec 9 2024 8:11 PM | Updated on Dec 9 2024 8:26 PM

Air India Discloses 100 Airbus Aircraft Order

టాటా గ్రూప్ యాజమాన్యంలోని 'ఎయిర్ ఇండియా' (Air India) మరో వంద కొత్త విమానాలను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఇందులో 10 ఏ350 వైడ్‌బాడీ, మరో 90 ఏ320 ఫ్యామిలీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి.

ఎయిర్ ఇండియా గతేడాది ఎయిర్‌బస్‌కు 250 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 40 ఏ350 విమానాలు, 210 ఏ320 విమానాలు ఉన్నాయి. కొత్తగా చేరనున్న విమానాలతో కలిపి ఎయిర్‌బస్‌కు ఇచ్చిన ఆర్డర్ల సంఖ్య 350కి చేరింది.

కొత్త విమానాల కోసం ఆర్డర్ చేయడం మాత్రమే కాకుండా.. ఎయిర్ ఇండియా ఏ350 విమానాలను సంబంధించిన విడి భాగాలు, నిర్వహణ కోసం ఎయిర్‌బస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎయిర్‌బస్‌తో 250 విమానాల కోసం గతంలో ఆర్డర్ చేసినప్పుడే.. 220 విమానాల కోసం బోయింగ్‌తోనూ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో కంపెనీ ఆర్డర్ చేసిన మొత్తం కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య 570కి పెరిగింది.

కొత్త విమానాలకు ఆర్డర్ చేసిన సందర్భంగా టాటా సన్స్ అండ్ ఎయిర్ ఇండియా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. మన దేశంలో మౌలిక సదుపాయాలు క్రమంగా పెరుగుతున్నాయి. చదువుకోవడానికి లేదా ఉద్యోగం కోసం చాలామంది యువత ఇతర దేశాలకు వెళ్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఎయిర్ ఇండియాలో విమానాల సంఖ్యను పెంచుతున్నట్లు, సేవలను ప్రపంచ నలుమూలలకు విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement