సాక్షి, ముంబై: వ్యాపార దిగ్గజం టాటా గ్రూపు సొంతమైన ఎయిరిండియా దూసుకుపోతోంది. ముఖ్యంగా విమానాల కొనగోలులో రికార్డ్ సృష్టిస్తోంది. బోయింగ్, ఎయిర్‌బస్‌తో మెగా డీల్‌గా ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ సోమవారం మాట్లాడారు.సంస్థ వాణిజ్య విమానయాన చరిత్రలో అతిపెద్ద ఒప్పందాన్ని ప్రకటించిన కొన్ని వారాల తర్వాత, విల్సన్, ఈ డీల్ ప్రాముఖ్యత, భవిష్యత్తు మార్కెట్ వ్యూహంఅభివృద్ధిలో దాని పాత్ర గురించి వివరాలను బిజినెస్ టుడేతో పంచుకున్నారు. ప్రపంచ స్థాయి విమానయాన కేంద్రంగా దేశం ఆవిష్కారమయ్యే క్రమంలో విమానయాన చరిత్రలో ఇదొక గొప్ప పరిణామమని పేర్కొన్నారు.
రికార్డు స్థాయిలో 470 విమానాల కొనుగోలు డీల్ విలువ 70 బిలియన్లని సీఈవో తెలిపారు. ఈ సంవత్సరం చివరి నుండి దశాబ్దం చివరి వరకు విమానాల సేవలను ప్రారంభిస్తామని, కొత్త విమానాల ఫ్లీట్, పవర్ ముఖ్యమైన నెట్‌వర్క్ , సామర్థ్య విస్తరణ రెండింటినీ మార్చడానికి చారిత్రాత్మక మెగా డీల్‌కు కట్టుబడి ఉన్నామన్నారు.
5వేల పైలట్లు, ప్రతి నెలా 500మంది క్యాబిన్
ఈ నెల ప్రారంభంలో, విమానయాన సంస్థ తన విమానాలకు 470 విమానాలను చేర్చుకోనున్నట్లు సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.. దీని ప్రకారం ఈ 470 విమానాల్లో 220 విమానాలను బోయింగ్ నుంచి, 250 విమానాలను ఎయిర్‌బస్ నుంచి కొనుగోలు చేయనుంది. అలాగే గత వారం, విమానయాన సంస్థ 5వేల పైలట్లు , క్యాబిన్ సిబ్బందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. నెలకు 100మంది పైలట్లు, 500 మంది క్యాబిన్ సిబ్బంది,ఇతర గ్రౌండ్ స్టాఫ్‌ను చేర్చుకుంటున్నామని ఆయన తెలిపారు. నాన్‌ఫ్లైయింగ్ పొజిషన్‌లతో సహా 1,500 మందికి పైగా సంస్థలో చేరారని విల్సన్ చెప్పారు.
ఎయిరిండియా- విస్తారా విలీనం
ఎయిరిండియా, విస్తారా విలీనం మొదటి దశలో ఉందని కూడా సీఈవో ప్రకటించారు. తదుపరి దశ విలీనానికి డీజీసీఏ, సీసీఐ ఆమోదం తెలిపాల్సి ఉందన నారు. తక్కువ ధరల్లో సంపూర్ణమైన సేవలు అందించాలని టాటా గ్రూప్ లక్క్ష్యంగా పెట్టుకుంది.
ఫ్యూచర్ ప్లాన్స్‌పై సీఈవో కీలక ప్రకటన
♦ 470 నారో, వైడ్‌బాడీ ఎయిర్‌బస్, బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ మెగా-డీల్‌తో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏవియేషన్ మార్కెట్‌లో విమాన ప్రయాణసేవల్ని, వస్తువుల రవాణా రూపురేఖలను పూర్తి మారిపోనున్నాయి.
♦ ప్రపంచంలోని ప్రముఖ విమానాల తయారీదారుల నుండి మరో 370 విమానాలను కొనుగోలు చేసి, ఆర్డర్ పరిమాణాన్ని 840 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు తీసుకువెళ్లే అవకాశాన్ని ఎయిరిండియా పరిశీలిస్తోంది.
♦ 2025 మధ్యకాలం నుండి పదేళ్లలో గణనీయమైన సంఖ్యలో డెలివరీలు షురూ చేయాలని ప్లాన్.
♦ఎయిరిండియా గ్రూప్ క్యారియర్‌లు ఎయిరిండియాఎక్స్‌ప్రెస్ ఏకీకరణ తర్వాత అత్యంత సమన్వయంతో కూడిన కార్యకలాపాలు.
♦ విమానయాన సంస్థ అంతర్జాతీయ , దేశీయ రూట్ నెట్‌వర్క్ రెండింటినీ పెంచడంపై సమానంగా దృష్టి
♦ మూడు ప్రధాన కేంద్రాల ఏర్పాటు వీటిలో దక్షిణ భారతదేశంలో ఒకటి
♦పైలట్‌లు, క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ స్పెషలిస్ట్‌ల కోసం శిక్షణ సౌకర్యాల ఏర్పాటు, అలాగే భవిష్యత్తుకార్యకలాపాలు,సేవల నిమిత్తం నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర (MRO) సామర్థ్యాల నిర్మాణం
Comments
Please login to add a commentAdd a comment