future plans
-
దుర్మార్గ పాలనపై పోరాటం: వైఎస్ జగన్
నేను జిల్లాల పర్యటన కార్యక్రమం మొదలు పెట్టేటప్పటికి గ్రామ, బూత్ కమిటీల నియామకాలు పూర్తి చేద్దాం. ఆ తర్వాత ప్రతి సభ్యుడికీ ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టా, ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్ అకౌంట్లు ఉండాలి. మన గ్రామంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఆస్పత్రిలో డాక్టర్ ఎందుకు లేడు? పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదు? అమ్మఒడి ఏమైంది? ఇలా ప్రతిదీ ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. మనం చంద్రబాబు సహా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తున్నామని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. విప్లవ స్ఫూర్తితో వారి కుట్రలను తిప్పికొట్టాలి. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. దుర్మార్గ పాలన వల్ల ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. ప్రజలతో మమేకమవుతూ.. వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీద్దాం.. అరాచక పాలనపై పోరాటం చేద్దాం’ అని పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల పార్టీ ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై మార్గ నిర్దేశం చేశారు. ‘మనం కేవలం చంద్రబాబుతో మాత్రమే యుద్ధం చేయడం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి చెడిపోయిన వ్యతిరేక మీడియాతో యుద్ధం చేస్తున్నాం. ఇంత మంది కలిసి చేస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పి కొట్టాలంటే వాళ్ల కంటే మనం బలంగా తయారు కావాలి. అలా జరగాలంటే ప్రతి కార్యకర్త విప్లవ స్ఫూర్తితో పని చేయాలి’ అంటూ దిశా నిర్దేశం చేశారు. ‘మోసంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ప్రజల కోపానికి గురికాక తప్పదు. అప్పుడు వాళ్లు ఎంత దూరంలో పడతారంటే.. టీడీపీకి సింగిల్ డిజిట్ కూడా రాని రోజులు మనం చూస్తాం’ అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ప్రతి ఇంటికీ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం చంద్రబాబు ప్రభుత్వం వచ్చి దాదాపు ఆరు నెలలు కావస్తోంది. అంతలోనే ఇంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. తొలిసారిగా చూస్తున్నాం. ఇలాంటి నేప«థ్యంలో మనమంతా కలిసికట్టుగా ఏం చేయాలని ఆలోచన చేసి ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. మన ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఇవ్వాళ్టికి కూడా మన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచ్‌లు ఏ గ్రామానికైనా, ఏ ఇంటికైనా ఈ మంచి చేశామని చెబుతూ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలరు. కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేసిందని మనం సగర్వంగా చెప్పగలం. మామూలుగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో మేనిఫెస్టో అని రంగు, రంగుల కాగితాలు ఇచ్చి.. దాన్ని ఎన్నికలు అయిపోగానే చెత్తబుట్టలో పడేసే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి... తొలిసారిగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మనం తూచ తప్పకుండా అమలు చేశాం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ... అందులో 99 శాతం వాగ్దానాలు అమలు చేశాం. బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడే ఏ పథకం ఏ నెలలో ఇస్తామో ముందుగానే చెప్పడంతో పాటు సంక్షేమ కేలండర్‌ను విడుదల చేశాం. ఆ మేరకు క్రమం తప్పకుండా ఆ నెలలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశాం. చరిత్రలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే ఇలా జరిగింది. ఆ రకమైన మంచి మనం చేశాం. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు.. పొరపాటున చేయి అటువైపు వెళ్లింది ప్రతి ఇంటికీ మంచి చేసినా కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అందుకు కారణాలు ఏమైనా వాటిని పక్కన పెడితే.. మనకు గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు వస్తే.. ఈ సారి 40 శాతం ఓట్లు వచ్చాయి. జగన్ ప్రతి ఇంటికి పలావు పెట్టాడు.. కానీ చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు కాబట్టి పొరపాటున చేయి అటు వైపు పోయింది. తీరా ఇవ్వాళ చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా లేదు.. అన్న మాట ప్రతి ఇంటిలోనూ వినిపిస్తోంది. ఆ రోజుల్లో మనం ఏ ఇంటికి పోయినా చిక్కటి చిరునవ్వుతో ఆహ్వానించారు. ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి తీవ్రంగా ప్రచారం చేశారు. ఆ ఇంట్లో చిన్న పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు అని, వాళ్ల తల్లులు కనిపిస్తే నీకు రూ.18 వేలు అని, అంతకన్నా పెద్దవాళ్లు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, ఆ ఇంట్లోంచి ఉద్యోగం చేసే వయస్సున్న పిల్లాడు వస్తే నీకు రూ.36 వేలు అని, ఆ ఇంట్లో రైతు కండువా వేసుకుని బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని చెప్పారు. మనం కుటుంబం మొత్తానికి సహాయం చేస్తుంటే.. టీడీపీ వాళ్లు ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తామని అబద్ధాలు చెబుతున్నారని చాలా మంది నాతో కూడా చెప్పారు. కానీ మనం అలా చేయలేదు. అతి మంచితనం.. అతి నిజాయితీతో మళ్లీ అధికారంలోకి..ఇవ్వాళ్టికీ నా దగ్గరకు వచ్చిన మన ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలు.. మీ దగ్గర అతి మంచితనం, అతి నిజాయితీ.. ఈ రెండూ మనకు సమస్యలు అంటున్నారు. కానీ రేపు మళ్లీ మనం ఈ గుణాలతోనే అధికారంలోకి వస్తాం. ఆరు నెలల కూటమి పాలనలో టీడీపీ కార్యకర్తలు ఏ ఇంటికి గర్వంగా వెళ్లలేని పరిస్థితి. ఏ ఇంటికి వెళ్లినా చిన్న పిల్లలు నా రూ.15 వేలు ఏమైందని.. రైతులు నా రూ.20 వేలు ఏమైందని.. ఉద్యోగం కోసం వెతికే పిల్లలు నా రూ.36 వేలు ఏమయ్యాయని అడిగే పరిస్థితి ఉంది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేటతెల్లం అవుతున్నాయి. మరోవైపు వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్న పరిస్థితులు. ఈ బడులు మాకొద్దు అనే పరిస్థితిలోకి నెట్టేశారు స్కూళ్లలో నాడు–నేడు లేదు. ఇంగ్లిష్ మీడియం లేదు. మన హయాంలో రోజుకొక మెనూతో భోజనం పెట్టే గోరుముద్ద ఉండేది. ఇవ్వాళ అధ్వాన్న పరిస్థితుల్లో మధ్యాహ్న భోజనం ఉంది. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లు, టోఫెల్ ఎత్తివేశారు. ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కూడా గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన హయాంలో ఆరో తరగతి నుంచి డిజిటిల్ క్లాస్ రూములు తయారు చేశాం. మన హయాంలో ప్రైవేటు స్కూళ్లు ప్రభుత్వ స్కూళ్లతో పోటీ పడతాయా అన్న పరిస్థితి నుంచి.. ఇవాళ పూర్తిగా తిరోగమనంలోకి వెళ్లిపోయాయి. ఇవాళ గవర్నమెంటు బడులు మాకు వద్దు.. అని పేదవాడు అనుకునే పరిస్థితుల్లోకి నెట్టేశారు. అమ్మఒడి గాలికి ఎగిరిపోయింది. విద్యా దీవెన, వసతి దీవెన కూడా ఇవ్వడం లేదు.ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న పిల్లలకు ప్రతి క్వార్టర్ ముగిసిన వెంటనే నాలుగో నెల వెరిఫై చేసి ఐదో నెల ఇచ్చే వాళ్లం. ఈ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ నాలుగు త్రైమాసికాలకు సంబంధించి బకాయిలు పెట్టారు. ఫీజు కట్టకపోతే ఒప్పుకోమని కాలేజీల యాజమాన్యాలు పిల్లలను ఇంటికి పంపిస్తున్నాయి.జిల్లాల్లో పర్యటిస్తా.. అక్కడే నిద్ర చేస్తా..రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి. నా జిల్లాల పర్యటన కార్యక్రమం సంక్రాంతి తర్వాత జనవరి మూడో వారం నుంచి ప్రారంభం అవుతుంది.అక్కడే నిద్ర చేస్తాను. ప్రతి బుధ, గురువారం ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో రెండు రోజులు అక్కడే ఉంటాను. కార్యకర్తలతో మమేకం అవుతాను. ‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం’ పేరుతో ఈ కార్యక్రమం చేపడతాను. పార్టీ గట్టిగా నిలబడాలంటే ఆర్గనైజేషన్ బలంగా ఉండాలి. ప్రతి గ్రామంలో, మండలంలో, నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలంగా ఉంది. దీన్ని మరింత బలోపేతం చేయాలి. నా పర్యటనలోగా జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పార్టీ కమిటీలు పూర్తి చేయాలి. విప్లవ స్ఫూర్తితో పని చేసి మనం మరింత బలంగా తయారవ్వాలి. గ్రామ స్థాయిలో కమిటీల నియామకాలు పూర్తయ్యాక ప్రతి సభ్యుడి ట్విటర్ (ఎక్స్), ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సప్, యూట్యూబ్ తదితర అన్ని అకౌంట్లు ఉండాలి. ఆయా గ్రామాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఎప్పటికప్పుడు పోస్టులు పెట్టాలి.దయనీయంగా వైద్య రంగంవైద్య రంగం పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు అందించే నెట్వర్క్ ఆస్పత్రులకు మార్చి నుంచి ఇంత వరకు బిల్లుల చెల్లింపు లేదు. మార్చి నుంచి నవంబర్ వరకు లెక్కిస్తే.. ఇప్పటికీ ఇంకా రూ.2,400 కోట్లు బకాయిలు ఉన్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులకు పేదలు వెళితే వైద్యులు మేం వైద్యం చేయలేమనే పరిస్థితి. 104, 108కు సంబంధించి ఆగస్టు నుంచి బకాయిలు ఇవ్వడం లేదు. నడపలేని పరిస్థితి. కుయ్.. కుయ్.. మంటూ రావాల్సిన అంబులెన్స్‌లు చతికిల పడుతున్నాయి. మన ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని 3,350 రోగాలకు పెంచి రూ.25 లక్షల వరకు చికిత్స అందించాం. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉండకూడదని జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆస్పత్రిలో డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలతో మందులు ఇచ్చేలా మార్పులు తీసుకొచ్చాం. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసి, ప్రతి 15 రోజులకొకమారు ఊరికే వచ్చి వైద్యం అందించే పరిస్థితి తీసుకొచ్చాం. ఇవాళ అంతా తిరోగమనం.కుదేలైన వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం కూడా కుదేలైంది. ఆర్బీకేలు స్థాపించి, ఈ–క్రాప్ పెట్టి పారదర్శకంగా ప్రతి రైతుకు ఆర్బీకే ద్వారా ఉచిత పంటల బీమా అందించాం. దళారుల వ్యవస్థ లేకుండా ధాన్యం నేరుగా రైతు వద్దకే వచ్చి కొనుగోలు చేసే కార్యక్రమం మనం చేస్తే.. ఈ రోజు ఏ రైతుకూ ధాన్యానికి కనీస మద్దతు ధర రావడం లేదు. రూ.200 నుంచి రూ.300 తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఈ–క్రాప్ గాలికెగిరిపోయింది.పారదర్శకత పక్కకు పోయింది. వ్యవసాయం తిరోగమనంలో ఉంది. డోర్ డెలివరీతో ప్రతి ప«థకాన్ని ఇంటికి అందించే పాలన మనదైతే.. ఈ రోజు డోర్ డెలివరీ మాట, మంచి పాలన దేవుడెరుగు.. టీడీపీ కార్యకర్తల చుట్టూ తిరిగితే తప్ప వచ్చే పరిస్థితి లేదు. ఇంత దారుణమైన పరిస్థితులున్నాయి. మళ్లీ పథకాలు ఎలా ఉన్నాయని హలో అని ఫోన్ చేసి అడుగుతామంటున్నారు. అసలు పథకాలుంటే కదా!దోచుకోవడం.. పంచుకోవడం రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది. ఇసుక రేట్లు చూస్తే.. మన కన్నా తక్కువ రేట్లకు ఇస్తామన్నారు. మన హయాం కంటే రెట్టింపు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. మద్యం షాపులు ప్రభుత్వంలో ఉన్నవి తీసేశారు. ప్రతి గ్రామంలో వేలం వేసి రూ.2 లక్షలు, రూ.3 లక్షలకు బెల్టుషాపులు ఇచ్చేస్తున్నారు. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా.. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు. ఏ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్నా, పరిశ్రమ నడవాలన్నా, ఏం జరగాలన్నా ఎమ్మెల్యేకు ఇంత, ముఖ్యమంత్రికి, ఆయన కొడుక్కు ఇంత అని దోచుకోవడం, పంచుకోవడం జరుగుతోంది. అందుకే కేవలం ఆరు నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. మనం ప్రజల తరఫున నిలబడాల్సిన సమయం వచ్చింది. ఆరు నెలల ప్రభుత్వ పాలన వేగంగా నడిచిపోయింది. జమిలి అంటున్నారు.అందరం చురుగ్గా ప్రజల తరఫున పని చేయాలి. ప్రజల తరఫున గళం వినిపించాలి. మీ అందరినీ నేను ఒక్కటే కోరుతున్నా. ప్రతిఒక్కరూ ప్రజలకు తోడుగా, అండగా ఉండాలి. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న ఇలాంటి సమయంలోనే మనం ప్రజలకు అందుబాటులో ఉండాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. -
గాల్లో తేలినట్టుంది..నెక్ట్స్ ఏంటి? టీసీఎస్ గోపీనాథన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు అనూహ్యంగా గుడ్‌బై చెప్పిన సీఈవో గోపీనాథన్ తన నిష్క్రమణపై కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుకోవడానికి ఇంతకంటే మంచి సమయం లేదని తాను భావించాననీ, సంతోషంగా, మనసంతా ఎంత తేలిగ్గా ఉందో చెప్పలేను..రీసెటింగ్కి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను అంటూ గోపీనాథన్ వ్యాఖ్యానించారు. పదవీకాలం ఇంకా నాలుగేళ్లు మిగిలి ఉండగానే (ఫిబ్రవరి 21, 2027 వరకు) తన పదవికి రాజీనామా చేయడం టెక్ వర్గాల్లో చర్చకు దారితీసింది. అదీ కంపెనీ చరిత్రలో ఒక సీఈవో సమయానికి ముందే తమ రాజీనామాను చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. టీసీఎస్‌లో 22 ఏళ్ల సుదీర్ఘ కరియర్‌కు గుడ్‌బై చెబుతూ గోపీనాథన్ గురువారం రాజీనామా ప్రకటించారు. సాధారణంగా సిగ్గుపడే గోపీనాథన్ శుక్రవారం ఉదయం మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏక్షణమైతే ఆసక్తిపోతుందో.. ఆక్షణమే తప్పుకోవాలి (జిస్ దిన్ మన్ ఉడ్ జాయే, ఉఎస్ దిన్ నికల్ జానే కా!) గత 48 గంటలుగా చాలా స్వేచ్ఛగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే తన భవిష్యత్తు ప్లాన్ల గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా టీసీఎస్ భవిష్యత్తు గురించి ఆలోచించి దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే తన ప్లేస్లోమరొకరు ఉండటం సముచితమని భావించానన్నారు. ఈ సందర్బంగా కృతివాసన్ సామర్థ్యంపై సంతృప్తిం వ్యక్తం చేశారు. అలాగే తన రాజీనామాపై టాటా సన్స్ ఛైర్మన్, టీసీఎస్ మాజీ సీఎండీ చంద్రశేఖరన్‌తో చర్చించి, వారం క్రితమే ఈనిర్ణయం తీసుకున్నట్లు గోపీనాథన్ వివరించారు టీసీఎస్‌లో ప్రతీ నిమిషం ఆస్వాదించానని చెప్పుకొచ్చారు. కానీ కొన్నిసార్లు కీలక మైలురాళ్లను చేరుకున్నప్పుడు, ఆలోచన మొదలవుతుంది. నెక్ట్స్ ఏమిటి? అనేది కచ్చితంగా పెద్ద ట్రిగ్గర్ పాయింటే.. కానీ ప్రస్తుతానికి ఎలాంటి క్లూ లేదు అని చెప్పారు. కాగా గోపీనాథన్ రాజీనామా ఇచ్చినప్పటికీ ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు గోపీనాథన్ టీసీఎస్‌తోనే కొనసాగనున్నారు. అలాగూ కొత్త సీఈవోగా (డిజిగ్నేట్) బీఎఫ్ఎస్ఐ డివిజన్ గ్లోబల్ హెడ్‌గా ఉన్న కే కృతివాసన్‌ను నియమించినట్టు కంపెనీ ప్రకటించింది. 2001లో టాటా ఇండస్ట్రీస్ నుంచి టీసీఎస్‌లో చేరారు గోపీనాథన్ 20013లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా, 2017లో సీఎండీగా ఎంపికయ్యారు. -
ఎయిరిండియా మెగా డీల్: భారీ ఉద్యోగాలు, సీఈవో కీలక ప్రకటన
సాక్షి, ముంబై: వ్యాపార దిగ్గజం టాటా గ్రూపు సొంతమైన ఎయిరిండియా దూసుకుపోతోంది. ముఖ్యంగా విమానాల కొనగోలులో రికార్డ్ సృష్టిస్తోంది. బోయింగ్, ఎయిర్‌బస్‌తో మెగా డీల్‌గా ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ సోమవారం మాట్లాడారు.సంస్థ వాణిజ్య విమానయాన చరిత్రలో అతిపెద్ద ఒప్పందాన్ని ప్రకటించిన కొన్ని వారాల తర్వాత, విల్సన్, ఈ డీల్ ప్రాముఖ్యత, భవిష్యత్తు మార్కెట్ వ్యూహంఅభివృద్ధిలో దాని పాత్ర గురించి వివరాలను బిజినెస్ టుడేతో పంచుకున్నారు. ప్రపంచ స్థాయి విమానయాన కేంద్రంగా దేశం ఆవిష్కారమయ్యే క్రమంలో విమానయాన చరిత్రలో ఇదొక గొప్ప పరిణామమని పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో 470 విమానాల కొనుగోలు డీల్ విలువ 70 బిలియన్లని సీఈవో తెలిపారు. ఈ సంవత్సరం చివరి నుండి దశాబ్దం చివరి వరకు విమానాల సేవలను ప్రారంభిస్తామని, కొత్త విమానాల ఫ్లీట్, పవర్ ముఖ్యమైన నెట్వర్క్ , సామర్థ్య విస్తరణ రెండింటినీ మార్చడానికి చారిత్రాత్మక మెగా డీల్‌కు కట్టుబడి ఉన్నామన్నారు. 5వేల పైలట్లు, ప్రతి నెలా 500మంది క్యాబిన్ ఈ నెల ప్రారంభంలో, విమానయాన సంస్థ తన విమానాలకు 470 విమానాలను చేర్చుకోనున్నట్లు సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.. దీని ప్రకారం ఈ 470 విమానాల్లో 220 విమానాలను బోయింగ్ నుంచి, 250 విమానాలను ఎయిర్‌బస్ నుంచి కొనుగోలు చేయనుంది. అలాగే గత వారం, విమానయాన సంస్థ 5వేల పైలట్లు , క్యాబిన్ సిబ్బందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. నెలకు 100మంది పైలట్లు, 500 మంది క్యాబిన్ సిబ్బంది,ఇతర గ్రౌండ్ స్టాఫ్‌ను చేర్చుకుంటున్నామని ఆయన తెలిపారు. నాన్‌ఫ్లైయింగ్ పొజిషన్లతో సహా 1,500 మందికి పైగా సంస్థలో చేరారని విల్సన్ చెప్పారు. ఎయిరిండియా- విస్తారా విలీనం ఎయిరిండియా, విస్తారా విలీనం మొదటి దశలో ఉందని కూడా సీఈవో ప్రకటించారు. తదుపరి దశ విలీనానికి డీజీసీఏ, సీసీఐ ఆమోదం తెలిపాల్సి ఉందన నారు. తక్కువ ధరల్లో సంపూర్ణమైన సేవలు అందించాలని టాటా గ్రూప్ లక్క్ష్యంగా పెట్టుకుంది. ఫ్యూచర్ ప్లాన్స్‌పై సీఈవో కీలక ప్రకటన ♦ 470 నారో, వైడ్‌బాడీ ఎయిర్‌బస్, బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ మెగా-డీల్‌తో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏవియేషన్ మార్కెట్లో విమాన ప్రయాణసేవల్ని, వస్తువుల రవాణా రూపురేఖలను పూర్తి మారిపోనున్నాయి. ♦ ప్రపంచంలోని ప్రముఖ విమానాల తయారీదారుల నుండి మరో 370 విమానాలను కొనుగోలు చేసి, ఆర్డర్ పరిమాణాన్ని 840 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు తీసుకువెళ్లే అవకాశాన్ని ఎయిరిండియా పరిశీలిస్తోంది. ♦ 2025 మధ్యకాలం నుండి పదేళ్లలో గణనీయమైన సంఖ్యలో డెలివరీలు షురూ చేయాలని ప్లాన్. ♦ఎయిరిండియా గ్రూప్ క్యారియర్లు ఎయిరిండియాఎక్స్‌ప్రెస్ ఏకీకరణ తర్వాత అత్యంత సమన్వయంతో కూడిన కార్యకలాపాలు. ♦ విమానయాన సంస్థ అంతర్జాతీయ , దేశీయ రూట్ నెట్వర్క్ రెండింటినీ పెంచడంపై సమానంగా దృష్టి ♦ మూడు ప్రధాన కేంద్రాల ఏర్పాటు వీటిలో దక్షిణ భారతదేశంలో ఒకటి ♦పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ స్పెషలిస్ట్‌ల కోసం శిక్షణ సౌకర్యాల ఏర్పాటు, అలాగే భవిష్యత్తుకార్యకలాపాలు,సేవల నిమిత్తం నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర (MRO) సామర్థ్యాల నిర్మాణం -
మీ చిన్నారుల భవిష్యత్తు కోసం.. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి!
చిన్నారుల భవిష్యత్తు అవసరాల కోసం ఓ చక్కని నిధిని సమకూర్చుకోవాలని భావించే వారి ముందు ఉన్న పెట్టుబడి సాధనాల్లో ఈక్విటీలకు మించినది మరేదీ లేదనే చెప్పుకోవాలి. ఈక్విటీల్లో మంచి పథకాలను ఎంపిక చేసుకుని సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో (సిప్) దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళితే సగటు వార్షిక రాబడి 15 శాతం, అంతకంటే ఎక్కువే ఆశించొచ్చు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని భావిస్తే, హెచ్డీఎఫ్సీ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ ను పరిశీలించొచ్చు. సెబీ సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ విభాగంలోకి ఇది వస్తుంది. ఈ పథకంలో పెట్టుబడులకు ఐదేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. అంటే ఐదేళ్ల వరకు పెట్టుబడులను వెనక్కి తీసుకోలేరు. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు కనుక ఐదేళ్లలోపు పెట్టుబడులను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడదు. మోస్తరు రిస్క్ భరించగలిగే వారికి హెచ్డీఎఫ్సీ చిల్ట్రన్స్ గిఫ్ట్ ఫండ్ అనుకూలం. పెట్టుబడుల విధానం/రాబడులు ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడి 7 శాతంగా ఉంది. కానీ, ఇదే కాలంలో అగ్రెస్సివ్ హైబ్రిడ్ కేటగిరీ రాబడి 4.5 శాతంగానే ఉంది. ఇక మూడేళ్ల కాలంలో 17 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించింది. ఐదేళ్ల కాలంలో 11 శాతం, ఏడేళ్లలో 12 శాతం, పదేళ్లలో 15 శాతం చొప్పున వార్షిక రాబడిని అందించింది. మైనర్ పేరిటే (18 ఏళ్ల లోపు) ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సంబంధిత చిన్నారి తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడి పేరిట వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించక్కర్లేదు. ఫండ్స్ యూనిట్లు ఎన్నున్నాయో వాటి విలువకు పది రెట్లు, గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఈ బీమా ఉంటుంది. అస్థిరతల రిస్క్‌ను తగ్గించుకునేందుకు సిప్ ద్వారా ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవడం అనుకూలం. పనితీరు విధానం ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ మాదిరిగా హెచ్డీఎఫ్సీ చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్ పనిచేస్తుంది. డెట్ సాధనాల్లో, ఈక్విటీలోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. కనుక అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోలిస్తే రిస్క్ కొంత తక్కువగా ఉంటుంది. ఒక విభాగంలో ప్రతికూలతలు ఎదురైనప్పుడు మరో విభాగం నుంచి కొంత కుషన్ ఉంటుంది. రూ.5,217 కోట్ల పెట్టుబడులు ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో ఉన్నాయి. ఇందులో 65.7 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించింది. డెట్ సాధనాల్లో 20 శాతం ఇన్వెస్ట్ చేయగా, 14.3 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. మార్కెట్ల వ్యాల్యూషన్లు గరిష్టానికి చేరాయని భావించినప్పుడు కొంత మేర ఈక్విటీ పెట్టుబడులను విక్రయించి నగదు నిల్వలను పెంచుకుంటుంది. తద్వారా కరెక్షన్లో ఇన్వెస్ట్ చేయడానికి నిల్వలను పెంచుకుంటుంది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 47 స్టాక్స్ వరకు ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడుల్లో 20 శాతం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత క్యాపిటల్ గూడ్స్ రంగానికి 10 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 8 శాతం మేర కేటాయింపులు చేసింది. -
మహేష్‌బాబు సినిమానే చివరగా చూశా: కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి
శ్రీనిధి శెట్టి.. కేజీఎఫ్ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది ఈ కన్నడ బ్యూటీ. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 1కు సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యశ్‌కు జోడీగా నటించిన శ్రీనిధి పాత్రకు అనేక ప్రశంసలు దక్కాయి. తొలి సినిమాతోనే స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న శ్రీనిధికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటీవల కేఎఫ్‌సీ పాప్‌కార్న్ నాచోస్కు సైతం బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన శ్రీనిధి శెట్టితో సాక్షి డిజిటల్ ప్రతినిధి రేష్మి స్పెషల్ ఇంటర్వ్యూ... ఇంజినీరింగ్ కాలేజీ నుంచి అందాల పోటీల వరకు ఇదంతా ఎలా జరిగింది? అందాల పోటీల్లో పాల్గొనాలని, ఆ తర్వాత సినిమాల్లోకి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అయితే, ప్రతిదానికీ సమయం ఉందని పెద్దలు చెప్పంది నిజమని నేను భావిస్తాను. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు తొలి ప్రాధాన్యత కుటుంబమే. అందుకే వారు చెప్పినట్లే మొదట నా చదువును పూర్తి చేశాకే అందాల పోటీలు, తర్వాత సినిమాల కోసం ప్రయత్నించాలని అనుకున్నాను. సినిమా రంగంలోకి ఎలా అడుగుపెట్టారు? నేను సినిమాల్లో నటించాలని అనుకున్నాను. కానీ, కేజీఎఫ్‌లో నటించాలని ప్లాన్ చేసింది కాదు. నేను మిస్ దివా ఇండియా పోటీల్లో కిరీటం గెలుచుకున్నాను. దానికి సంబంధించిన ఫొటోలు అనేక పత్రికల్లో వచ్చాయి. ఈ ఫొటోలను చూసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నన్ను ఆడిషన్‌కు పిలిచారు. నిజం చెప్పాలంటే, ఆ ఆడిషన్ తర్వాత నాకు ఈ పాత్ర వస్తుందని అస్సలు అనుకోలేదు. కానీ ఆడిషన్లో నా పర్ఫామెన్స్ ఆయనకు నచ్చి.. నేనే ఆ పాత్రకు సూట్ అవుతానని అనుకున్నారు. ఇక తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. నాకు కేజీఎఫ్‌లో అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. నా మొదటి సినిమాలోని నా నటనకు లభించిన ప్రేమ, మద్దతుకు ఎంతో సంతోషిస్తున్నా. మీరు కేజీఎఫ్ సినిమా ఒప్పుకున్నప్పుడు ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకున్నారా ? అస్సలు అనుకోలేదు. సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ మేము ఒక మంచి సినిమా తీయాలనుకున్నాం. దానికోసం అందరం చాలా కష్టపడ్డాం. కేజీఎఫ్ విడుదలైన తర్వాతే అర్థమైంది మేము ఎంత పెద్ద హిట్ కొట్టామో. ప్రేక్షకుల ప్రేమకు, దేవుని ఆశీస్సులకు ధన్యవాదాలు. అన్ని బాక్సాఫీస్ రికార్డులను కేజీఎఫ్ బద్దలు కొట్టిందని తెలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నా మొదటి సినిమా కన్నడ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇక కేజీఎఫ్ 2 రూ. 1000 కోట్లు దాటింది. మేము ఇలాంటి విజయం సాధించినందుకు, టీమ్‌లో భాగస్వామ్యం అయినందుకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి భారీ సినిమా కోసం ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాను ఒప్పుకుంటే ఇతర అవకాశాలు కోల్పోతామనే భయం కలిగిందా ? అలాంటి రిస్క్ తీసుకోడానికి నేను సిద్ధంగానే ఉన్నా. కేజీఎఫ్ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టిన తర్వాత ఎన్ని ఏళ్లు పడుతుందనే విషయాన్ని ఆలోచించలేదు. ఎందుకంటే ఏ కళాకారుడికైనా ఎన్ని రోజులు చేశామనేది కాకుండాల ఎంత బాగా చేశామన్నదే ముఖ్యం అని నేను భావిస్తాను. మీరు స్టార్‌గా మారడం చూసిన మీ స్నేహితులు ఎలా స్పందించారు? నేను నటిని మాత్రమే. నన్ను నేను స్టార్‌గా పరిగణించను. నా స్నేహితులు కూడా అలా చూడనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు నన్ను ఎప్పుడూ ఒకేలా ట్రీట్ చేస్తారు. వారే నాకు పెద్ద అభిమానులు, నా పెద్ద విమర్శకులు కూడా. యష్‌తో పనిచేయడం ఎలా అనిపించింది? యష్‌తో కలిసి పనిచేయడం చాలా అద్భుతంగా ఉంది. అతను చాలా అంకితభావం, ఏకాగ్రత ఉన్న వ్యక్తి. అతను తన పని చేసుకుంటూనే మనం మరింత మెరుగ్గా నటించేందుకు ప్రేరేపిస్తాడు. అతనితో నేను కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి చెప్పండి. ప్రశాంత్ నీల్‌తో పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం. ఆయన చాలా సౌమ్యుడు, దయగలవారు. అలాగే ఆయనకు తన నటీనటుల నుంచి ఏం కావలన్నదానిపై పూర్తి స్పష్టత ఉంది. దాని వల్ల నటీనటుల నుంచి ఉత్తమ నటనను బయటకు తీసుకురాగలరు. సినిమా అనేది ఎల్లలు దాటేసింది. మరి మీరు ఇతర పరిశ్రమల వైపు మొగ్గు చూపుతున్నారా? నేను భారతీయ సినిమాను ఒక పరిశ్రమగా పరిగణిస్తాను. వివిధ భాషల్లో సినిమాలు చేసేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నాను. మీరు ఇటీవల కేఎఫ్‌సీ కోసం ఒక ప్రకటన చేశారు. దాని గురించి చెప్పండి. ప్రకటనలకు, చలనచిత్రాల షూటింగ్‌కు ఏ మేరకు తేడా ఉంటుంది? కేఎఫ్‌సీతో పని చేసే అవకాశం వచ్చినప్పుడు నేను థ్రిల్ అయ్యాను. ఎందుకంటే నేను కేఎఫ్‌సీ చికెన్ అంటే చాలా ఇష్టం. ఇక నా వరకు అయితే ప్రకటనలు, చలనచిత్రాల మధ్య ఎలాంటి తేడా లేదు. నిజానికి, 1-2 రోజులలో షూట్ చేసే యాడ్ ఫిల్మ్‌లతో పోలిస్తే సినిమాలకు చాలా ఎక్కువ సమయం, నిబద్ధత, నెలలు అవసరం. సమయం చాలా భిన్నంగా ఉంటుంది. కానీ ఒక కళాకారుడిగా, ఉత్తమ ఫలితాన్ని పొందడానికి చేసే కృషి మాత్రం ఒకే విధంగా ఉంటుంది. మీరు టాలీవుడ్ సినిమాలు చూస్తారా ? మీరు ఇటీవల ఏ తెలుగు సినిమా చూశారు? అవును, నేను టాలీవుడ్ సినిమాలు చూస్తాను. నిజానికి, నేను సినిమా పిచ్చిదాన్ని. అన్ని భాషల్లో సినిమాలు చూస్తాను. నేను చూసిన చివరి తెలుగు సినిమా మహేష్ బాబు 'సర్కారు వారి పాట'. కేజీఎఫ్ చాప్టర్ 3 నిజంగా ఉంటుందా ? నాకు తెలియదు. అది మీరు దర్శకనిర్మాతలను అడగాలి. కానీ కేజీఎఫ్ ఫ్రాంచైజీ కొనసాగుతుందని, దాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. మీ తదుపరి చిత్రాలు, పాత్రల గురించి చెప్పండి. చాలా ప్రాజెక్ట్‌లు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. ఇప్పటివరకు దేనికి ఇంకా ఓకే చేయలేదు. ప్రాంతీయ భాషల్లోని సినిమాలు భారతదేశంలో పాన్ ఇండియా చిత్రాలుగా మారి చాలా ప్రశంసలు పొందాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారా? నిజానికి ఇది చాలా కాలం క్రితమే జరగాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈరోజు ప్రేక్షకులు చాలా ఎక్కువ ఎక్స్‌పోజర్‌ని కలిగి ఉన్నారు. అలాగే వారు అన్ని రకాల చిత్రాలను వీక్షిస్తున్నారు, అభినందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలతో అతిపెద్ద ప్రయోజనం ఏంటని మీరు అనుకుంటున్నారు? ప్రేక్షకులు! ఎప్పుడు కూడా చివరి ఫలితం ప్రేక్షకులే. పాన్ ఇండియా చిత్రాల ద్వారా మీరు అనేక మంది ప్రేక్షకులకు చేరువవుతారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల గురించి మీరు ఏమనుకుంటున్నారు? నా అభిప్రాయం ప్రకారం ఓటీటీ ఒక అద్భుతమైన వేదిక. వివిధ రకాల పాత్రలు, జానర్లతో ప్రయోగాలు చేయడానికి కళాకారులకు, అన్ని రకాల బడ్జెట్లతో పని చేసే దర్శకులకు ఇది అవకాశాలను కల్పిస్తోంది. వెబ్ సిరీస్‌ల్లో మీరు నటించే అవకాశం ఉందా ? పని ఎక్కడ నుంచి వస్తుందని నేను ఆలోచించను. నేను ఇష్టపడే స్క్రిప్ట్‌పై పని చేయడం, నేను ఉన్నతంగా నటిస్తున్నానా లేదా అని చూడటం, అందుకు సహాయపడే బృందంతో పని చేస్తున్నానా లేదా అని చూడటమే నాకు ముఖ్యం. -
ప్రపంచంలోనే నంబర్ 1 కంపెనీగా టీసీఎస్!
ముంబై: సాఫ్ట్వేర్ సేవలకు దేశీయంగా నంబర్ వన్ ర్యాంకులో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీగా ఎదిగే లక్ష్యాన్ని ప్రకటించింది. ఇప్పటికే భారీగా కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ ఇందుకు భయపడటంలేదని టీసీఎస్ సీఈవో, ఎండీ, రాజేష్ గోపీనాథన్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. లక్ష్యాలను చేరుకునేందుకు కంపెనీకున్న భారీస్థాయి అడ్డుకాదని స్పష్టం చేశారు. 25 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,90,000 కోట్లు) ఆదాయం, 6 లక్షలమంది ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థ భవిష్యత్‌లో రెట్టింపు, మూడు రెట్లు, లేదా నాలుగు రెట్లు వృద్ధిని ఆశించడం తప్పేమీకాదని తెలియజేశారు. ప్రస్తుత స్థాయి నుంచి మరింత భారీ కంపెనీగా ఆవిర్భవించే లక్ష్యాలను పెట్టుకోకపోవడానికి తగిన కారణమేదీ కనిపించడంలేదని వివరించారు. ఇప్పటికే తాము పలు విధాల వృద్ధి బాటలో సాగుతున్నట్లు తెలియజేశారు. బీఎఫ్ఎస్ఐలో టాప్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా విభాగం(బీఎఫ్ఎస్ఐ)లో ఐటీ సర్వీసులు అందిస్తున్న అతిపెద్ద కంపెనీగా టీసీఎస్ నిలుస్తున్నట్లు గోపీనాథన్ తెలియజేశారు. ఉద్యోగుల సంఖ్యలోనూ రెండో ర్యాంకులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ బాటలో గ్లోబల్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లోనూ అగ్రపథానికి చేరుకునే దృష్టాంతాలున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచస్థాయిలో 50, 100 బిలియన్ డాలర్ల పరిమాణంగల పలు కంపెనీలున్నట్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. చదవండి👉🏼గుడ్ న్యూస్: భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు..ఎప్పటి నుంచంటే! -
రిలయన్స్‌కు... కొత్త ‘ఇంధనం’
ముంబై: చమురు నుంచి రిటైల్, టెలికం దాకా వివిధ రంగాల్లో విస్తరించిన పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వ్యాపార వృద్ధికి ఊతమిచ్చే కొత్త ఇంధనాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా గురువారం జరిగిన 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) భారీ ప్రణాళికలు ఆవిష్కరించింది. వీటి ప్రకారం పర్యావరణ అనుకూల ఇంధనాలపై వచ్చే మూడేళ్లలో రూ. 75,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. సోలార్ సెల్స్ తయారీ ప్లాంట్లు, విద్యుత్ నిల్వ చేసే బ్యాటరీల ఫ్యాక్టరీ, ఫ్యుయెల్ సెల్ తయారీ ప్లాంటు, హరిత హైడ్రోజన్ ఉత్పత్తి కోసం ఎలక్ట్రోలైజర్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఏజీఎంలో పాల్గొన్న సందర్భంగా కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. 2030 నాటికి 100 గిగావాట్ల (జీడబ్ల్యూ) సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్లను, కార్బన్ ఫైబర్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రిలయన్స్ ఆదాయాల్లో దాదాపు 60 శాతం .. హైడ్రోకార్బన్ ఆధారిత ఇంధనాల కార్యకలాపాల ద్వారానే వస్తోంది. ‘2035 నాటికి పూర్తిగా కర్బన ఉద్గారాల రహిత కంపెనీగా ఆవిర్భవించాలని రిలయన్స్ గతేడాది లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ దిశగా వ్యూహాలు, మార్గదర్శక ప్రణాళికలను నేడు మీ ముందు ఉంచుతున్నాను. ఈ ప్రణాళికల అమలుపై వచ్చే మూడేళ్లలో రూ. 60,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నాం. నాలుగు గిగా ఫ్యాక్టరీలు నిర్మించబోతున్నాం‘ అని ముకేశ్ అంబానీ వెల్లడించారు. నాలుగు గిగా ఫ్యాక్టరీలకు అవసరమైన పరికరాల తయారీకి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకు మరో రూ. 15,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. అమలు ఇలా ..: రిలయన్స్ 2030 నాటికి కనీసం 100 గిగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేయాలని నిర్దేశించుకున్నట్లు అంబానీ చెప్పారు. ఇందులో సింహభాగం రూఫ్‌టాప్ సోలార్, గ్రామాల్లో సౌర విద్యుత్ మౌలిక సదుపాయాల ఏర్పాటు రూపంలో ఉండనుంది. ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్‌ను నిల్వ చేసేందుకు అత్యాధునిక బ్యాటరీల తయారీ కోసం ప్రత్యేకంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. విద్యుత్‌తో పాటు వాహనాల్లో ఇంధనంగా ఉపయోగించగలిగే హరిత హైడ్రోజన్ కూడా ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. కంపెనీలో అంతర్గతంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ నిర్వహణ.. నిర్మాణం, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ ఫైనాన్స్ పేరిట రెండు విభాగాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 5జీ ముందుగా మేమే తెస్తాం.. దేశీయంగా పూర్తి స్థాయిలో 5జీ సర్వీసులను తమ కంపెనీయే ముందుగా అందుబాటులోకి తెస్తుం దని అంబానీ ధీమా వ్యక్తం చేశారు. ఇతర భాగస్వాములతో కలిసి దేశీయంగా రూపొందించిన 5జీ సొల్యూషన్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు తెలిపారు. ఇవి 1 జీబీపీఎస్ పైగా స్పీడ్‌తో పనిచేసినట్లు చెప్పా రు. దేశవ్యాప్తంగా తమ డేటా సెంటర్లలో, నవీ ముంబైలోని ట్రయల్ సైట్లలో 5జీ నెట్‌వర్క్‌ను ఇన్స్టాల్ చేసినట్లు అంబానీ పేర్కొన్నారు. ఏజీఎం నేపథ్యంలో గురువారం షేరు బీఎస్ఈలో 2.35% తగ్గి రూ. 2,153 వద్ద క్లోజయ్యింది. సెప్టెంబర్‌లో జియో–గూగుల్ ఫోన్.. టెక్ దిగ్గజం గూగుల్‌తో కలిసి రూపొందించిన చౌక 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ముకేశ్ అంబానీ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 10 నుంచి ఇది మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. జియోఫోన్ నెక్ట్స్ పేరిట దీన్ని ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్ ఫోన్ కాగలదని ఆయన పేర్కొన్నారు. ‘భారత్‌ను 2జీ విముక్త దేశంగా మార్చాలంటే అత్యంత చౌకైన 4జీ స్మార్ట్‌ఫోన్ అవసరం. ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం జియో, గూగుల్ కలిసి జియోఫోన్ నెక్ట్స్ రూపొందించాయి‘ అని అంబానీ తెలిపారు. దీనికోసమే ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసినట్లు ఏజీఎంలో వర్చువల్‌గా పాల్గొన్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. 5జీకి సంబంధించి కూడా గూగుల్ క్లౌడ్, జియో జట్టు కట్టాయని ఆయన వివరించారు. ఫోన్ ధర కీలకం.. దాదాపు 30 కోట్ల మంది యూజర్లకు చేరువయ్యేందుకు చౌక స్మార్ట్‌ఫోన్ రిలయన్స్‌కి ఉపయోగపడగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అయితే, అంతిమంగా ధర, పనితీరు కీలకంగా ఉంటుందని పేర్కొన్నాయి. కరోనా వైరస్‌కు పూర్వం భారత మార్కెట్లో రూ. 5,000 పైగా రేటున్న స్మార్ట్ఫోన్ల సెగ్మెంట్ వాటా అయిదు శాతమేనని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. రూ. 5,000 లోపు సెగ్మెంట్‌పై ఏ సంస్థా పెద్దగా ఆధిపత్యం సాధించలేకపోయిందని పేర్కొన్నారు. రిలయన్స్ రిటైల్‌తో 10 లక్షల ఉద్యోగాలు.. వచ్చే 3–5 ఏళ్లలో రిలయన్స్ రిటైల్ మూడు రెట్లు వృద్ధి చెందగలదని ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న రిలయన్స్ రిటైల్‌ను.. ప్రపంచ టాప్ 10లో ఒకటిగా చేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. వచ్చే మూడేళ్లలో రిలయన్స్ రిటైల్‌తో 10 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని, మరెంతో మందికి జీవనోపాధి కల్పించగలదని అంబానీ తెలిపారు. పరిశోధన, డిజైన్, ఉత్పత్తి అభివృద్ధి సామర్థ్యాలను మరింత మెరుగుపర్చుకోవడంపై రిలయన్స్ రిటైల్ గణనీయంగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. వచ్చే మూడేళ్లలో ఈ–కామర్స్ విభాగం జియోమార్ట్‌లో ఒక కోటి పైగా వ్యాపారులను భాగస్వాములుగా చేసుకోవాలనే ప్రణాళికలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. రేటింగ్ అప్‌గ్రేడ్: ఫిచ్ భారీ ప్రణాళికలతో ముందుకెడుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రేటింగ్‌ను ‘బీబీబీ’కు అప్‌గ్రేడ్ చేసినట్లు ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. వివిధ వ్యాపార విభాగాల నుంచి వచ్చే నగదు ప్రవాహం, రుణభారాన్ని తగ్గించుకునేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలు తదితర సానుకూల అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిచ్ తెలిపింది. ఇది భారత సార్వభౌమత్వ రేటింగ్ కన్నా ఒక అంచె ఎక్కువ కావడం గమనార్హం. బోర్డులోకి ఆరామ్కో చైర్మన్.. సౌదీ అరేబియాకు చెందిన సౌదీ ఆరామ్కోతో ప్రతిపాదిత 15 బిలియన్ డాలర్ల డీల్ ఈ ఏడాది ఆఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని అంబానీ తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా చమురు, రసాయనాల (ఓ2సీ) వ్యాపార విభాగంలో ఆరామ్కో 20 శాతం వాటా కొనుగోలు చేస్తోంది. వాస్తవానికి 2020 మార్చి నాటికి ఇది పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ జాప్యం జరిగింది. తాజాగా సౌదీ ఆరామ్కో చైర్మన్, సావరీన్ వెల్త్‌ఫండ్ పీఐఎఫ్ చీఫ్ యాసిర్ ఆథ్మాన్ అల్–రుమయ్యాన్ (51) .. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో చేరనున్నట్లు అంబానీ తెలిపారు. బోర్డు సభ్యుడైన యోగేంద్ర పి త్రివేది (92) రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నారని, ఆయన స్థానాన్ని యాసిర్ భర్తీ చేస్తారని అంబానీ పేర్కొన్నారు. -
ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతల మౌనం
-
భయపడితే ప్రణయ్‌కు నచ్చదు : అమృత
మిర్యాలగూడ : ‘ఎక్కువ కులం ఏంటి.. తక్కువ కులం ఏంటి.. అసలు ఈ కులం అనేదాన్నే తొలగించాలి.. మన పిల్లల్ని మాత్రం ఈ కులం రొంపిలో పడకుండా బాధ్యాతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుదాం’.. ఇది ప్రణయ్ కల. ‘రిసెప్షన్‌కు ముందు రెండు రోజులు మేం వేర్వేరు గదుల్లో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో మా భవిష్యత్తుకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుకున్నాం. ఆ రెండు రోజులే రెండు యుగాలుగా అన్పించాయి. ఇప్పుడు నా పూర్తి జీవితం ప్రణయ్ లేకుండా గడపాలి. ఇది నాకు సాధ్యమవుతుందా..’ అంటూ గుండెలవిసేలా ఏడుస్తోంది అమృత. రెండు రోజులు ఒకరికి ఒకరు కనిపించకపోతేనే తట్టుకోలేని ఆ పసి హృదయాలు ఇప్పుడు జీవిత కాలం ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితి. ‘పరువు’ అనే కనిపించని భూతం వారి నూరేళ్ల జీవితాన్ని మింగేసింది. ఇది నల్గొండ, మిర్యాలగూడలో జరిగిన విషాదాంత ప్రేమకథ చిత్రమ్. వైశ్య కులానికి చెందిన తిరునగరి అమృత వర్షిణిని పెళ్లాడటమే ప్రణయ్ చేసిన పాపం. కక్ష్య గట్టిన అమృత తండ్రి మారుతీరావ్ ప్రణయ్‌ని అతి కిరాతకంగా హత్య చేయించాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. తన భర్తను చంపిన తండ్రికి ఉరి శిక్ష పడాలని అమృత కోరుకుంటోంది. తాను తన పుట్టింటికి వెళ్లేది లేదని.. అత్తింట్లోనే ఉండి కుల రహిత సమాజం కోసం పోరాటం చేస్తానంటోంది. ఈ సందర్భంగా అమృత చెప్పిన అంశాలు... ‘ప్రణయ్‌కు మొదటి నుంచి కులం అంటే నచ్చేది కాదు. కుల రహిత సమాజం కోసం కలలు కనేవాడు. ఈ విషయం గురించి అనేక సార్లు నాతో చర్చించేవాడు. కానీ మా ప్రేమ నా తల్లిదండ్రులకు నచ్చలేదు. కారణం ప్రణయ్‌ది తక్కువ కులం కావడం. ఈ కులాల పిచ్చి మా నాన్న లాంటి సైకోలకే కానీ మాకు కాదు. అందుకే ఇంట్లోంచి వెళ్లి పోయి వివాహం చేసుకున్నాం. ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను. మా బిడ్డ గురించి మేము ఎన్నో కలలు కన్నాం. మా బిడ్డను ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మంచి పౌరులుగా తీర్చి దిద్దుకోవాలని ఆశపడ్డాం’ అని తెలిపింది. అమృత మాట్లాడుతూ ‘ఇక్కడే ఉంటూ పాలీ హౌస్ ఏర్పాటు చేయాలనుకున్నాం. విదేశాలకు కూడా వెళ్లాలనుకున్నాం. మా కుటుంబ పరిస్థితుల వల్ల మేం చాలా త్వరగా వివాహం చేసుకోవాల్సి వచ్చింది. నాకు ఇప్పుడు 21 ఏళ్లు.. ప్రణయ్‌కి 24 ఏళ్లు. మా జీవితం ఇప్పుడే ప్రారంభమయ్యింది. ప్రపంచంలోని అన్ని సంతోషాలను పూర్తిగా అనుభవించాలనుకున్నాం. కానీ కులం మా కలల్ని చిధిమేసింది. నా ప్రణయ్‌ని నా నుంచి దూరం చేసింది. నన్ను, నా బిడ్డను ఒంటరి వాళ్లను చేసింది. కానీ నేను భయపడను. భయపడితే ప్రణయ్‌కు నచ్చదు. మా ప్రేమకు ప్రతిరూపమైన మా బిడ్డను ప్రణయ్ ఆశాయాలకు అనుగుణంగా, కుల పిచ్చికి వ్యతిరేకంగా నేనే పెంచుతాను’ అంటూ వివరించింది. అంతేకాక ‘మా అత్త మామలకు తోడుగా ఇక్కడే ఉంటాను. నా పుట్టింటికి వెళ్లను. ప్రణయ్‌ని చంపిన వారికి శిక్ష పడేంత వరకూ నా పోరటాన్ని కొనసాగిస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు. అమృత మామా గారు బాలాస్వామీ మాట్లాడుతూ.. ‘వీరిద్దరి ప్రేమ గురించి మాకు చెప్పినప్పుడు మేం వద్దని వారించాం. ఇలాంటి ప్రమాదాలు వస్తాయని ముందే హెచ్చరించాం. కానీ వారు తమ జీవితం గురించి, ప్రేమ గురించి చాలా నిజాయితీగా, బలంగా ఉన్నారు. ఇక చేసేదేం లేక వివాహనికి ఒప్పుకున్నాం. వారిద్దరూ ఎందో అన్యోనంగా ఉండేవారు. కానీ మేం ఊహించిందే జరిగింది. కులం మా అబ్బాయిని కాటేసింది. అమృత తన పుట్టింటికి వెళ్లనంటోంది. తనను మా దగ్గరే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటాం’ అని తెలిపారు. ఈ హత్య గురించి పోలీసు ఉన్నతాధికారి ఒకరు ప్రణయ్ - అమృతల వెడ్డింగ్ రిసెప్షన్ వీడియో అమృత నాన్నలో కోపాన్ని తీవ్రంగా పెంచింది. కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోవడమే కాక తమ వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. వాటిని తన బంధువులు కూడా చూడటం వల్ల ఆయనకు తీవ్రమైన కోపం వచ్చింది. అందువల్ల ప్రణయ్‌ని అడ్డుతొలగిస్తే.. తన కూతురు తన దగ్గరకు వస్తుందని భావించాడు. అందుకే ఈ నేరానికి పాల్పడినట్లుగా మారుతీ రావ్ తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. -
అంతా కొత్త వాళ్లతో సినిమా!
హిందీ ‘దేవదాసు’ గురించి చర్చలు ‘‘సినిమా అంటే నాకు చాలా ప్యాషన్. కథ తయారు చేయడం మొదలుపెట్టినప్పట్నుంచీ సినిమా పూర్తయ్యేవరకూ నాకు వేరే ఆలోచనే ఉండదు’’ అని దర్శకుడు వైవీయస్ చౌదరి అన్నారు. ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్‌గా దూసుకెళుతున్న రామ్‌లో మంచి హీరో మెటీరియల్ ఉన్నాడనీ, ఆల్రెడీ ఒక దర్శకుడు రిజెక్ట్ చేసిన ఇలియానాలో మంచి హీరోయిన్ మెటీరియల్ ఉందని నమ్మి, ఇద్దర్నీ ‘దేవదాసు’ చిత్రం ద్వారా నాయకా నాయికలుగా పరిచయం చేశారాయన. అలాగే, నందమూరి హరికృష్ణ హీరోగా చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఆయన టైటిల్ రోల్లో ‘సీతయ్య’ తీశారు వైవీయస్. అంతకుముందు భారీ తారాగణంతో తీసిన ‘లాహిరి లాహిరి’ చిత్రంలో హరికృష్ణతో ప్రధాన పాత్ర చేయించడంతో పాటు, ఆయన, నాగార్జున కాంబినేషన్లో ‘సీతారామరాజు’ తీశారు. సుప్రీమ్ హీరోగా మాస్లో మంచి పేరు తెచ్చుకున్న సాయిధరమ్ తేజ్‌ను గుర్తించింది కూడా వైవీయస్సే. ‘‘ఓ దర్శకుడిగా ఎదుటి వ్యక్తి బాడీ లాంగ్వేజ్, ప్రవర్తనను బట్టి వాళ్లు ఆర్టిస్టులుగా పనికొస్తారా? లేదా? అని ఆలోచించుకుంటాను. పనికొస్తారనిపిస్తే పరిచయం చేస్తాను. ఇప్పుడు కూడా కొత్తవాళ్లతో సినిమా ప్లాన్ చేస్తున్నాను’’ అని వైవీయస్ అన్నారు. బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీయస్ సంగీత ప్రధానంగా సాగే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీశారు. నేడు ఆయన బర్త్‌డే. భవిష్యత్ ప్రణాళికల గురించి వైవీయస్ చెబుతూ - ‘‘కొత్తవాళ్లతో తీయబోతున్న చిత్రానికి కథ- స్క్రీన్‌ప్లే సమకూర్చి, దర్శకత్వం వహించడంతో పాటు నేనే నిర్మిస్తా. ‘దేవదాసు’ చిత్రం హిందీ రీమేక్ హక్కులను ఓ ప్రముఖ నిర్మాత అడిగారు. నన్నే దర్శకత్వం వహించమన్నారు. నాకు హిందీ చిత్రాలంటే ఇష్టం ఉన్నప్పటికీ తెలుగు చిత్రం ప్లాన్‌లో ఉండటంతో హిందీ రీమేక్‌కి ఇంకా మాటివ్వలేదు’’ అన్నారు. -
చరిత్ర తెలుసుకుంటేనే భవిష్యత్
తెలంగాణ రచయితల వేదిక మహాసభల్లో కోదండరాం కరీంనగర్ కల్చరల్: గత చరిత్ర తెలుసుకుంటేనే భవిష్యత్‌కు ప్రణాళికలు వెయ్యగలమని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా మహాసభలు ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. కోదండరాం మాట్లాడుతూ చదువుకున్నవాళ్లు మౌనంగా ఉండడం పెద్ద నేర మన్నారు. తెలంగాణ చరిత్రను తిరిగిరాస్తేనే భవిష్యత్తుకు దారి దొరుకుతుందన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేయడం వల్ల పెట్టుబడిదారులే బలపడుతున్నారన్నారు. సామాన్యుడికి వైద్యం అందించే పరిస్థితుల్లో దవాఖానాలు లేవన్నారు. అం దుకు నిదర్శనం ఉస్మానియా ఆసుపత్రేనన్నారు. సీనియర్ పాత్రికేయులు కె.శ్రీనివాస్, తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరే దిశలో రచయితలు పనిచేయాలని ఆకాంక్షిం చారు. వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్.వేణుగోపాల్, వేదిక అఖిలభారత అధ్యక్షుడు జూకం టి జగన్నాథం, ప్రధాన కార్యదర్శి సంగెవేని రవీంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజోజు నాగభూషణం, కేంద్ర సాహితీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్, కథా రచయిత అల్లం రాజయ్య, జర్నలిస్ట్స్ యూనియన్ నాయకులు నగునూరి శేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ రాసిన ‘తెలంగాణ సాహిత్య వికాసం’ పుస్తకాన్ని శతాధిక గ్రంథకర్త మలయశ్రీ ఆవిష్కరించారు. కూకట్ల తిరుపతి రాసిన ఆరుద్ర పురుగు కవితా సంపుటిని కె.శ్రీనివాస్ ఆవిష్కరించారు. -
కెమెరా ఉంటే కిర్రాకే!
రశ్మి... తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన పేరు. అందం, అభినయమే కాదు... చెరగని చిరునవ్వు, నాన్‌స్టాప్ మాటలు ఆమెకు స్పెషల్ ఎస్సెట్స్. అందుకే ఒడిశాలో పుట్టి, హైదరాబాద్‌లో సెటిలై... యావత్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయింది. ఆ వసపిట్ట పాస్ట్ ఎక్స్పీరియెన్సెస్, ఫ్యూచర్ ప్లాన్స్ ఆమె మాటల్లో... ..:: శిరీష చల్లపల్లి నాన్నది ఉత్తరప్రదేశ్.. అమ్మది ఒడిశా. నేను హైదరాబాదీనీ. పుట్టింది ఒడిశాలో అయినా నేను పెరిగింది వైజాగ్‌లో. చదువంతా అక్కడే. స్కూల్‌డేస్ నుంచే నాకు ధైర్యం ఎక్కువ. స్టేజ్ ఫియర్ అస్సలు ఉండేది కాదు. వెయ్యి మందిలో అయినా అవలీలగా మాట్లాడగలిగేదాన్ని. ఇంకా ఎక్కడ కెమెరా ఉంటే అక్కడ వాలిపోయేదాన్ని. డాన్సు చేయడం బాగా ఇష్టం. ఫ్రెండ్స్ బర్త్డేస్లో హంగామా అంతా నాదే. పిలిపించుకుని మరీ నాతో డాన్స్ చేయించుకునేవారు. ఓన్లీ డాటర్ని కావడంతో అమ్మా, నాన్న కూడా నాకు అడ్డు చెప్పేవారు కాదు. అలా గారాబంగా పెరిగాను. ప్రజలకు దగ్గరగా... హైదరాబాద్‌కు వచ్చి పది సంవత్సరాలవుతోంది. 2006లో మొదటిసారి ‘ప్లీజ్ సారీ థ్యాంక్స్’ అనే తెలుగు సినిమాలో నటించాను. నాగార్జున గారు నిర్మించిన ‘యువ’ సీరియల్లో కూడా చేశాను. అలా సినిమాలు, సీరియల్స్, ప్రోగ్సామ్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. గతంలో ఇన్ని అవకాశాలు లేవు. ఇప్పుడు ఫీల్డ్స్ చాలా ఉన్నాయి. స్కోప్ ఎక్కువగా ఉంది. అందుకే చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నాను. ఫిట్నెస్ సీక్రెట్... ఇక నా హాబీస్ విషయానికొస్తే స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. నా ఫిట్నెస్కి కారణం కూడా అదే. నాకు జూబ్లీహిల్స్‌లోని ఉలవచారు రెస్టారెంట్లో ‘కూచిపూడి సముద్రం తాళి’ అంటే చాలా ఇష్టం. స్పైసీ ఫుడ్ బాగా తింటాను. వంటలు చేయడంలో ఎక్స్పర్ట్ కాదుగానీ... అప్పుడప్పుడు ఎక్స్పరిమెంట్స్ చేస్తూ ఉంటాను. ‘వ్యూహం’తో... నేను డిఫికల్ట్ పర్సన్‌ని. ఎదుటివారి ప్రవర్తనను బట్టే నా బిహేవియర్ ఉంటుంది. ఎక్కువగా ఎవరితోనూ క్లోజ్ అవ్వను. అలా అని ఫ్రెండ్స్ లేరని కాదు. ఉన్నారు... కానీ అంత క్లోజ్ కాదు. అందుకే అందరూ నన్ను హైపర్ యాక్టివ్ అంటారు. అంత ఈజీగా అలసిపోను. అదే నా ప్లస్ పాయింట్. ప్రస్తుతం ‘వ్యూహం’ సినిమాలో చేస్తున్నాను. అది త్వరలో రిలీజ్ కాబోతోంది. నా ప్రోగ్రామ్స్‌ని ఆదరిస్తున్నట్టే సినిమాలో నా పాత్రను ఆదరిస్తారని ఆశిస్తున్నా.