న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ తాజాగా ఎయిర్‌బస్ హెలికాప్టర్స్‌తో చేతులు కలిపింది. తద్వారా దేశీయంగా ఒకే ఇంజిన్‌గల హెచ్125 చోపర్స్ తుది అసెంబ్లీ లైన్(ఎఫ్‌ఏఎల్) ఏర్పాటుకు తెరతీయనున్నాయి. ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో దేశీ వైమానిక రంగానికి భారీస్థాయిలో ప్రోత్సాహం లభించనుంది.
ఎఫ్‌ఏఎల్ ద్వారా దేశీయంగా ప్రయివేట్ రంగంలో తొలిసారి హెలికాప్టర్ అసెంబ్లీ సౌకర్యం ఏర్పాటు కానుంది. వెరసి ఎయిర్‌బస్ అత్యధికంగా విక్రయిస్తున్న హెచ్125 చోపర్స్‌ను దేశీ అవసరాలతోపాటు.. ఇరుగుపొరుగు దేశాలకు సరఫరా చేసేందుకు వీలు చిక్కనుంది. ఫార్న్‌బరో ఇంటర్నేషనల్ ఎయిర్‌షోలో కాంట్రాక్టుపై సంతకాలు చేసినట్లు రెండు సంస్థలు సంయుక్త ప్రకటనలో తెలియజేశాయి.
నిజానికి ఎఫ్‌ఏఎల్ ఏర్పాటుకు ఈ ఏడాది జనవరి 26న ఎయిర్‌బస్ సీఈవో గిలౌమ ఫారీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తొలిసారి వెల్లడించారు. తొలి మేడిన్ ఇండియా హెచ్125 చోపర్స్ డెలివరీలు 2026లో ప్రారంభంకావచ్చని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment