
భారతదేశంలో ఖరీదైన లంబోర్ఘిని కార్లను ఉపయోగించే వారి సంఖ్య నానాటికి ఎక్కువవుతోంది. ఇటీవల కేరళకు చెందిన ఒక వ్యాపారవేత్త సరికొత్త ఉరుస్ పెర్ఫార్మాంటే కొనుగోలు చేశారు. కాగా ఈ కారు ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ. 46 లక్షలు ఖర్చు చేశారు.
లంబోర్గిని ఉరుస్ కొనుగోలు చేసిన వేణు గోపాలకృష్ణన్.. మోటారు వాహనాల శాఖ (MVD) నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో KL07 DG 0007 అనే ఫ్యాన్సీ నెంబర్ కోసం 45.99 లక్షల రూపాయలు వెచ్చించారు. కేరళలో ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన నోటిఫైడ్ ఫ్యాన్సీ వెహికల్ నెంబర్‌గా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది.
వేణు గోపాలకృష్ణన్ కొనుగోలు చేసిన లంబోర్గిని ఉరుస్ ధర రూ. 4 కోట్లు. దీనిని ఆయన బెంగళూరులోని లంబోర్గిని డీలర్‌షిప్ నుంచి కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదీ చదవండి: Delhi EV Policy 2.0: పెట్రోల్ బైకులు, సీఎన్‌జీ ఆటోలు బ్యాన్!
ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ బ్రాండ్ లంబోర్ఘిని భారతదేశంలోని పరిమిత నగరాల్లో మాత్రమే డీలర్‌షిప్‌లను కలిగి ఉంది. అతను బహుశా SUVని బుక్ చేసుకుని, ముందుగానే అన్ని కస్టమైజేషన్‌లను చేసి ఉండవచ్చు. ఈ వీడియోలో యజమాని, అతని కుటుంబం డెలివరీ తీసుకోవడానికి డీలర్‌షిప్‌ను సందర్శించారు.
లంబోర్గిని ఉరుస్ పెర్ఫార్మాంటే 4.0 లీటర్, ట్విన్ టర్బో వీ8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 666 పీఎస్ పవర్, 850 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు.. మంచి పనితీరును అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది దీనిని కొనుగోలు చేస్తుంటారు.