Lamborghini
-
ఈ లంబోర్ఘిని కార్లకు ఏమైంది? రేమండ్ ఎండీ ఆందోళన
ప్రముఖ లగ్జరీ కార్ మేకర్ లంబోర్ఘినికి (Lamborghini) చెందిన కార్ల భద్రతా ప్రమాణాల గురించి రేమండ్ (Raymond) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా (Gautam Singhania) ఆందోళన వ్యక్తం చేశారు. లంబోర్ఘిని కారు మంటల్లో చిక్కుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ వచ్చిన ఓ పోస్ట్‌కు ఆయన స్పందించారు. లగ్జరీ ఆటోమేకర్ విశ్వసనీయత, పారదర్శకతను ప్రశ్నించిన సింఘానియా జాగ్రత్తగా ఉండాలని కస్టమర్లకు సూచించారు."లంబోర్ఘిని కి ఏమైంది? వారు ఏం చేయలేకతున్నారా? ఎందుకు ఇన్ని కార్లు మంటల్లో చిక్కుకుంటున్నాయి? కంపెనీ నుండి ఎందుకు వివరణ లేదు? కొనుగోలుదారులు జాగ్రత్త!" అంటూ సింఘానియా ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్‌లో రాశారు. లంబోర్ఘిని కార్లు మంటల్లో చిక్కుకున్న వరుస సంఘటనల నేపథ్యంలో సింఘానియా ఈ విధంగా స్పందించారు. గతేడాది డిసెంబర్లో ముంబైలోని కోస్టల్ రోడ్లో కదులుతున్న లంబోర్ఘిని లోపల మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. 45 నిమిషాల్లో మంటలు అదుపులోకి వచ్చాయి. "ఇలాంటి సంఘటనలు లంబోర్ఘిని విశ్వసనీయత, భద్రతా ప్రమాణాల గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతున్నాయి. ధర, ఖ్యాతి దృష్ట్యా, రాజీపడని నాణ్యతను ఆశించవచ్చు. సంభావ్య ప్రమాదాలను కాదు" అని ఆయన అప్పుడు ట్వీట్ చేశారు.ఇక 2024 అక్టోబర్‌లో న్యూయార్క్‌లోని ఒక హైవేపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లంబోర్ఘిని రెవెల్టో మంటల్లో చిక్కుకుంది. ఎవరూ గాయపడనప్పటికీ, బ్రాండ్-న్యూ హైబ్రిడ్ సూపర్‌కార్ పూర్తిగా దగ్ధమైంది. 2023 మార్చిలో లాంచ్ అయిన లంబోర్ఘిని రెవెల్టో 1,001 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే 6.5-లీటర్ V12 హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో విశేష దృష్టిని ఆకర్షించింది. -
2024లో లంబోర్ఘిని కార్లను ఇంతమంది కొన్నారా?
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ 'లంబోర్ఘిని' (Lamborghini) భారతదేశంలో గణనీయమైన విక్రయాలను పొందుతోంది. 2024లో కంపెనీ 113 కార్లను సేల్ చేసింది. దీంతో సంస్థ విక్రయాల్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది.2023తో పోలిస్తే 2024లో లంబోర్ఘిని విక్రయాలు 10 శాతం పెరిగాయి. కాగా ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ 10,687 కార్లను విక్రయించింది. ఇందులో అధిక భాగం రెవెల్టో హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ఉంది. అంతకు ముందు ఏడాదిలో హురాకాన్ మంచి అమ్మకాలను పొందింది. ఈ ఏడాది కంపెనీ ఉరుస్ ఎస్ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది.గత ఏడాది అన్ని ప్రధాన మార్కెట్లలో కంపెనీ మంచి వృద్ధిని సాధించింది. లంబోర్ఘిని.. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలలో 4,227 కార్లను విక్రయించింది. అమెరికాలో 3,712 యూనిట్లు, ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో 2,748 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది కూడా కంపెనీ మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉంటుంది. -
భర్త నుంచి.. వామ్మో ఇవేం కోరికలు.. కానుకలు!
దుబాయ్‌కి (Dubai) చెందిన ఒక మిలియనీర్ భార్య తాను గర్భిణిగా ఉన్నప్పుడు తన భర్తను కోరిన కోరికలను వింటే మతిపోతుంది. తన సంపన్నమైన, విలావంతమైన జీవనశైలిని తెలియజెప్పేలా ఫొటోలను, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేరే లిండా ఆండ్రేడ్ (Linda Andrade) అనే మహిళ గర్భిణిగా ఉన్నప్పుడు తన భర్త నుంచి తాను ఏమేమి కోరిందో పేర్కొంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ లిస్ట్ విని వామ్మో ఇవేం డిమాండ్లు అని ముక్కున వేలేసుకోవడం నెటిజన్ల వంతైంది.ఎప్పుడూ షాపింగ్ చేస్తూ విలాసాల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసే లిండా, తనను తాను "అసలైన దుబాయ్ గృహిణి" అని అభివర్ణించుకుంటుంది. ఆమె రికీ అనే మిలియనీర్‌ను వివాహం చేసుకుంది. “ఇవి సరిపోతాయా?” అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన వీడియోలో లిండా తన భర్త నుంచి ఖరీదైన లంబోర్గిని కారు (Lamborghini), 9 క్యారెట్ల డైమండ్ రింగ్, కేజీలకొద్దీ బంగారం (gold), ఇతర వస్తువులను కానుకలుగా అడిగినట్లు వెల్లడించింది."దుబాయ్‌లో హాట్ మామ్స్ మాత్రమే ఉంటారు" అంటూ భర్త తన కోసం కొన్న సరికొత్త విల్లాను పరిచయం చేసింది. అలాగే ఇటీవల భర్త కొనిచ్చిన ఖరీదైన హీర్మేస్ క్రోకోడైల్ హ్యాండ్‌బ్యాగ్‌ను కూడా ఫాలోవర్లకు చూపించింది. అంతేకాదు భర్త నుంచి సరికొత్త లంబోర్ఘిని కారును బహుమతిగా పొందినట్లు పేర్కొంది. ఆమె డిమాండ్లు ఇక్కడితో ఆగలేదు. తొమ్మిది నెలల గర్భానికి సంకేతంగా 9 క్యారెట్ డైమండ్ రింగ్.. ప్రసవించే ముందు తన బిడ్డ బరువుకు సమానమైన బంగారం కూడా కానుకల జాబితాలో ఉన్నాయి.ఈ వీడియోకు 1.16 లక్షల లైక్‌లు, 2,700 పైగా కామెంట్లు వచ్చాయి. చాలా మంది ఆమె వీడియోకు ప్రతిస్పందించారు. లిండా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఇటువంటివి అనేక వీడియోలను పోస్ట్ చేస్తూ ఆమె కొనుగోలు చేసిన కొత్త ఉత్పత్తులను చూపుతుంటుంది. కొత్త సంవత్సరానికి ఒక రోజు ముందు షేర్ చేసిన వీడియోలో 2 లక్షల డాలర్ల వాచ్, 67,000 డాలర్ల విలువైన వైవ్స్ సెయింట్ లారెంట్ ఆర్కైవల్ పీస్తో సహా తాను కొన్న ఖరీదైన వస్తువులను పంచుకుంది. View this post on Instagram A post shared by Linda Andrade (@lionlindaa) -
జొమాటో సీఈఓ గ్యారేజిలో ఇన్ని కార్లు ఉన్నాయా (ఫోటోలు)
-
ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన టాప్ 10 పాపులర్ కార్లు (ఫోటోలు)
-
ప్రపంచంలోని గ్రేటెస్ట్ సూపర్ కార్లు ఇవే (ఫోటోలు)
-
ఖరీదైన కారులో సమస్య!.. కంపెనీ కీలక నిర్ణయం
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని భారతదేశంలో 'రెవెల్టో' (Lamborghini Revuelto) కోసం రీకాల్ జారీ చేసింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) వెబ్సైట్ ప్రకారం.. కంపెనీ 8 ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సూపర్ కార్లకు రీకాల్ ప్రకటించింది. ఇవన్నీ 2023 డిసెంబర్ - 2024 అక్టోబర్ మధ్యలో తయారైన కార్లు.లంబోర్ఘిని తన రెవెల్టో కార్లకు రీకాల్ ప్రకటించడానికి ప్రధాన కారణం ప్యాసింజర్ సైడ్ విండ్‌షీల్డ్ వైపర్ సిస్టమ్‌లో సమస్య అని తెలుస్తోంది. ఈ సమస్య వైపర్ & వైపర్ మోటారు మధ్య కనెక్షన్‌ను ఏర్పరుస్తుంది. తద్వారా.. వైపర్ మోటారును వేరు చేసి వైపర్ ఆర్మ్ పనిచేయకుండా చేస్తుంది. దీనివల్ల డ్రైవర్ సరైన దృశ్యమానతను కోల్పోయే అవకాశం ఉంది. ఇది ప్రమాదాలకు దారితీస్తుంది.రెవెల్టో కారులో సమస్య ఉన్నట్లు వినియోగదారులు కూడా వెల్లడించలేదు. కానీ కంపెనీ ముందు జాగ్రత్త చర్యలలో భాగంగానే ఈ రీకాల్ ప్రకటించింది. రూ. 8 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన లంబోర్ఘిని రెవెల్టో 2.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 350 కిమీ కావడం గమనార్హం. -
విల్లా కొంటే.. లంబోర్ఘిని కారు ఫ్రీ
భారతదేశంలోని చాలామంది వాహన ప్రియులు జీవితంలో ఒక్కసారైనా లంబోర్ఘిని కారును డ్రైవ్ చేయాలనుకుంటారు. అయితే దీని ధర రూ. కోట్లలో ఉండటం వల్ల అందరికి సాధ్యం కాకపోవచ్చు. అలాంటి కారు ఫ్రీగా ఇస్తానంటే? ఎవరు మాత్రం వద్దంటారు. అయితే లంబోర్ఘిని కారు కావాలంటే.. ఓ విల్లా కొనాల్సి ఉంటుంది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ జేపీ గ్రీన్స్ ఈ ప్రకటన చేసింది. ఇందులో లగ్జరీ విల్లా కొనుగోలు చేసినవారికి రూ. 4 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన లంబోర్ఘిని కారును ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది. అయితే ఇక్కడ ఓ విల్లా కొనుగోలు చేయాలంటే.. రూ.26 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఇది కదా అసలైన పండుగ.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలువిల్లా కోసం రూ. 26 కోట్లు చెల్లిస్తే అంతటితో సరిపోతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కారు పార్కింగ్ చేయడానికి, క్లబ్ మెంబర్షిప్ కోసం, గోల్ఫ్ కోర్స్ కోసం ఇలా దాదాపు మరో రూ. కోటి కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Noida’s got a new Villa Project coming up at 26 Cr that's offering 1 Lamborghini with each of those! 🙄 pic.twitter.com/gZqOC8hNdZ— Gaurav Gupta | Realtor (@YourRealAsset) October 27, 2024 -
సరికొత్త లంబోర్ఘిని కారు: 312 కిమీ/గం స్పీడ్
ఇటలీ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని భారతదేశంలో కొత్త 'ఉరుస్ ఎస్ఈ' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ.4.57 కోట్లు (ఎక్స్ షోరూమ్). అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ కలిగిన కొత్త ఉరుస్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టం పొందుతుంది.లంబోర్ఘిని ఉరుస్ ఎస్ఈ 4.0 లీటర్, ట్విన్ టర్బోచార్జ్డ్ వీ8 ఇంజన్ పొందుతుంది. ఇది 620 hp, 800 Nm టార్క్ అందిస్తుంది. కంపెనీ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్‌తో జతచేయడానికి ఇంజిన్ పూర్తిగా రీ-ఇంజనీరింగ్ చేసింది. ఇది 25.9kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ (60 కిమీ రేంజ్) పొందుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లో లభిస్తుంది. దీని టాప్ స్పీడ్ 312 కిమీ/గం.కొత్త ఉరుస్ ఎస్ఈ కారు స్ట్రాడా, స్పోర్ట్, కోర్సా మోడ్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఆఫ్ రోడింగ్ కోసం మరో నాలుగు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ కారు ఆన్ రోడ్, ఆఫ్ రోడింగ్‌కు అనుకూలంగా ఉంటుందని స్పష్టమవుతోంది.లంబోర్ఘిని ఉరస్ ఎస్ఈ మ్యాట్రిక్స్ టెక్నాలజీని కలిగిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. వెనుక వై-షేప్ ఎల్ఈడీ టెయిల్ లైట్ ఉంటుంది. లోపల 12.3 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్, అప్డేటెడ్ ఏసీ వెంట్స్, స్టీరింగ్ వీల్ వంటివి ఎన్నో ఉన్నాయి. -
అంబానీ పెళ్లి సందడి : జెఫ్ బెజోస్, ఇతర దిగ్గజాల కళ్లు చెదిరే కానుకలు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆకాశమంతపందిరి, భూదేవి అంత పీట అనే మాట వినడమే గానీ ఎపుడూ చూడని చాలామందికి ఇలా ఉంటుందా అనేట్టుగా కనీవినీ ఎరుగని రీతిలో మూడు రోజుల పాటు వేడుక జరిగింది. జూలై 12, 2024న గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా పద్నాలుగు వేల మంది హాజరయ్యారు. సుమారు రూ. 5వేల కోట్లు ఖర్చు చేసినట్టు పలు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే దేశ, విదేశాలనుంచి విచ్చేసిన అతిథులకు బహుమతులను అంతే ఘనంగా అందించారు. అయితే ఇపుడు తాజాగా అనంత్-రాధిక గ్రాండ్ వెడ్డింగ్‌కు విచ్చేసిన గ్గోబల్ దిగ్గజాలు నూతన వధూవరులకు ఇచ్చిన కానుకలపై తాజా చర్చ నడుస్తోంది.కొత్త జంట అనంత్ అంబానీ-రాధిక మర్చంట్లకు కొందరు హై-ప్రొఫైల్ అతిథులు ఖరీదైన విగ్రహాలు , పెయింటింగ్‌లను అందించారు. ఇంటర్నేషన్ గెస్ట్‌లు మాత్రం వీటన్నింటికీ మించిన కోట్ల విలువ చేసే కార్లను గిప్ట్‌లుగా అందించారట. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారం, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ వారికి బుగాట్టి కారును బహుమతిగా ఇచ్చారు. దీని రూ. 11.50 కోట్లు.అమెరికన్ నటుడు , ప్రొఫెషనల్ రెజ్లర్, జాన్ సెనా వారికి రూ. 3 కోట్ల విలువైన లంబోర్ఘిని బహుమతిగా ఇచ్చాడు. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వారికి రూ. రూ. 300 కోట్లు విలువైన కానుక ఇచ్చారట. ఇక బిల్ గేట్స్ రూ. 9 కోట్ల విలువైన డైమండ్ రింగ్ ఇచ్చారని తెలుస్తోంది. 9 కోట్లు. అంతేకాదు బిల్ గేట్స్ రూ. రూ. 180 కోట్ల విలువైన లగ్జరీ యాచ్‌ను ఇచ్చినట్టు మరో వీడియో ద్వారా తెలుస్తోంది. గూగుల్ , అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ 100 కోట్ల రూపాయల విలువైన హెలికాప్టర్‌ను బహుమతిగా ఇచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కొత్తగా పెళ్లయిన జంటకు అమెరికాలోని రూ. 80 కోట్ల విలువ జేసే లగ్జరీ భవనాన్ని కానుకగా ఇచ్చినట్టు తెలుస్తోంది. -
పుట్టినరోజున రూ.5 కోట్లతో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన తండ్రి!
కొడుకు పుట్టిన రోజున డ్రెస్, మొబైల్.. మరీకాదంటే బైక్లాంటివి గిఫ్ట్ ఇస్తుంటారు. ఇదంతా మధ్య తరగతివారికి తీపి జ్ఞాపకాలను మిగుల్చుతాయి. మరి ధనవంతుల ఇళ్లలో పుట్టినరోజుకు ఏం గిఫ్ట్ ఇస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రముఖ వ్యాపారవేత్త వివేక్‌కుమార్ రుంగ్తా తన కుమారుడి బర్త్‌డే రోజున ఏకంగా రూ.5 కోట్లు విలువచేసే ‘లాంబోర్గినీ హురకాన్ ఎస్టీఓ’ మోడల్కారును బహుమానంగా ఇచ్చారు. ఈమేరకు తనకు గిఫ్ట్ ఇస్తుంటే తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. దుబాయ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న వీకేఆర్ గ్రూప్ అధినేత వివేక్‌కుమార్ రుంగ్తా తన కుమారుడు తరుష్ రుంగ్తా 18వ పుట్టిన రోజున అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దాంతో దుబాయ్‌లోని లాంబోర్గినీ సంస్థను సంప్రదించారు. కంపెనీ తయారుచేసిన హురకాన్ ఎస్టీఓ కారును కుమారుడికి బహుమతిగా ఇచ్చారు. ఇదీ చదవండి: ఐటీ జాబ్ కోసం వేచిచూస్తున్నారా.. టెకీలకు శుభవార్త ఆ సూపర్ స్పోర్ట్స్ కారును చూసిన తరుష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా స్పందిస్తూ.. ‘నా 18వ పుట్టినరోజును డ్రీమ్కారు గిఫ్ట్‌గా ఇచ్చి మరింత అద్భుతంగా మార్చినందుకు నాన్నకు కృతజ్ఞతలు! తన ప్రేమాభిమానాలు ఎప్పటికే నాతోనే ఉంటాయి’ అని తెలిపారు. Indian businessman Vivek Kumar Rungta gifted a Lamborghini Huracan STO worth ₹5 Crore to his son Tarush on his 18th birthday pic.twitter.com/nNe4GMIGqI — Rosy (@rose_k01) April 11, 2024 -
ఏంజెల్ బ్రోకింగ్ సీఈఓ 'దినేష్ ఠక్కర్' రూ.5 కోట్ల సూపర్ కారు (ఫోటోలు)
-
ఇన్‌స్టా రీల్స్ చేస్తూ సూపర్ కారు కొనేశారు - ధర తెలిస్తే షాకవుతారు!
ధర ఎక్కువైనప్పటికీ సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడే కార్లలో ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్ లంబోర్ఘిని. అయితే ఖరీదైన ఈ బ్రాండ్ కారును ఇటీవల ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కీర్తి సింగ్ రహేజా ఆమె భర్త రోహిత్ రహేజా ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసుకుంటూ బాగా ఫేమస్ అయ్యారు. వీరు ఇప్పుడు సుమారు రూ.4.22 కోట్ల విలువైన వైలెట్ కలర్‌తో కూడిన వయోలా పాసిఫేలో లంబోర్ఘిని ఉరుస్ పర్ఫార్మంటే కొనుగోలు చేశారు. వీడియోలో వారు డీలర్‌షిప్‌కు చేరుకోవడం, ఆ కారుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం వంటివి చూడవచ్చు. నిజానికి వయోలా పాసిఫేలో లంబోర్ఘిని ఉరుస్ పర్ఫార్మంటే కొనుగోలు చేసిన మొదటి కస్టమర్లు వీరే కావడం ఇక్కడ గమనించదగ్గ విషయం. అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారును మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇప్పటికే భారతదేశంలో కార్తీక్ ఆర్యన్, రోహిత్ శెట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్, ఫహద్ ఫాసిల్, రణవీర్ సింగ్ వంటి ప్రముఖులు చాలామంది లంబోర్ఘిని ఉరస్ SUVలను కలిగి ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే దేశీయ విఫణిలో లంబోర్ఘిని కార్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థమైపోతుంది. లంబోర్ఘిని ఉరస్ పెర్ఫార్మంటే 4.0 లీటర్ వీ8 ఇంజన్‌తో 666 పీఎస్ పవర్, 850 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సుమారు 2000 కేజీల బరువున్న ఈ కారు కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవత్తమా అవుతుంది. ఈ SUV టాప్ స్పీడ్ గంటకు 303 కిమీ కావడం గమనార్హం. ఇదీ చదవండి: టెక్నాలజీ ఉంది కదా అని ఎవరైనా ఇలా చేస్తారా! వీడియో చూడండి View this post on Instagram A post shared by Kirti Singh raheja (@kirtisinghx3) -
వేలంలో రూ.9.14 కోట్లకు అమ్ముడైన 'డొనాల్డ్ ట్రంప్' కారు ఇదే..
ఇటీవల బారెట్ జాక్సన్ నిర్వహించిన వేలంలో అమెరికా మాజీ అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ఉపయోగించిన 'లంబోర్ఘిని డయాబ్లో వీటీ' కారు ఏకంగా 1.1 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. దీంతో ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన డయాబ్లో కారుగా ఇది కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 1997లో 'డొనాల్డ్ ట్రంప్' కొనుగోలు చేసిన లంబోర్ఘిని కంపెనీకి చెందిన 'డయాబ్లో వీటీ' ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన, ప్రజాదరణ పొందిన కారు. ఈ కారుని ట్రంప్ తనకోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేసుకున్నారు. బ్లూ లే మాన్స్ అనే ఒక స్పెషల్ కలర్ షేడ్‌లో కనిపించే ఈ కారు అమెరికాలో అమ్ముడైన 132 కార్లలో ఒకటి. ట్రంప్ అభ్యర్థన మేరకు కంపెనీ ఆ కారు డోర్ మీద ట్రంప్ 1997 డయాబ్లో అనే నేమ్ ప్లేట్ కూడా ఫిక్స్ చేసింది. ఇది డ్యూయల్-టోన్ క్రీమ్/బ్లాక్ ఫినిషింగ్ పొంది ఉండటం కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ కారుని ట్రంప్ 2002లో ఈ కారును విక్రయించారు. ఆ తరువాత ఈ కారు 2016లో eBayలో అమ్మకానికి కనిపించింది. ఆ తరువాత ఇప్పటి వరకు ఎంతమంది చేతులు మారిందనే విషయం స్పష్టంగా వెల్లడికాలేదు. అయితే తాజాగా ఈ కారు 1.1 మిలియన్ డాలర్లకు (రూ. 9.14 కోట్లు) అమ్ముడైంది. 2016 వరకు ఈ కారు 14655 కిమీ ప్రయాణించినట్లు, ఇప్పుడు వేలానికి వచ్చే సమయానికి ఓడోమీటర్లో 15431 కిమీ ప్రయాణించినట్లు తెలుస్తోంది. అంటే 2016 తరువాత దీని ఎక్కువ ఉపయోగించలేదని తెలుస్తోంది. ఇదీ చదవండి: రూ. 700లకు థార్ అడిగిన బుడ్డోడు.. ఫ్యాక్టరీలో హల్చల్ చేశాడు - వీడియో లంబోర్ఘిని డయాబ్లో లంబోర్ఘిని కంపెనీకి చెందిన డయాబ్లో మంచి డిజైన్ కలిగి శక్తివంతమైన 5.7 లీటర్ వీ12 ఇంజిన్ పొందుతుంది. ఇది 492 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కలిగి కేవలం 4.1 సెకన్లలో గంటకు 60mph వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 235 కిమీ వరకు ఉంది. Ordered new in a one-off Blu Le Mans color by former President Donald J. #Trump, this #V12 #Lamborghini #Diablo beauty will be selling with No Reserve on #SuperSaturday at WestWorld of #Scottsdale. Learn More: https://t.co/Fok6pALx8M pic.twitter.com/r1OCsXiCbJ — Barrett-Jackson (@Barrett_Jackson) January 26, 2024 -
భారత్‌లో లాంచ్ అయిన ఇటాలియన్ సూపర్ - ధర తెలిస్తే అవాక్కవుతారు
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన కొత్త 'రెవెల్టో' (Revuelto) కారుని లాంచ్ చేసింది. రూ.8.89 కోట్ల ధర వద్ద విడుదలైన ఈ కారు డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఈ కొత్త కారు డిజైన్, ఫీచర్స్, ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ రెవెల్టో చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. వై షేప్ హెడ్‌లైట్, ఎయిర్ ఇన్‌టేక్‌లు, టెయిల్ లైట్స్ వంటి వాటిని పొందుతుంది. వెనుక భాగంలో హెక్సా గోనల్ ఎగ్జాస్ట్ పోర్ట్‌లు చూడవచ్చు. ముందు భాగంలో 20 ఇంచెస్ వీల్స్, వెనుక భాగంలో 21 ఇంచెస్ వీల్స్ ఉంటాయి. ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 8.4 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ డిస్ప్లే, 9.1 ఇంచెస్ ప్యాసింజర్-సైడ్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. ఈ మూడు స్క్రీన్లు ఫిజికల్ కంట్రోల్స్ పొందుతుంది. స్టీరింగ్ వీల్ కూడా కంట్రోల్ బటన్స్ పొందుతుంది. సౌకర్యవంతమైన సీట్లు కలిగిన ఈ కారు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇదీ చదవండి: షారుక్ ఖాన్ గ్యారేజిలో ఇదే ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు - ధర ఎంతో తెలుసా? లంబోర్ఘిని రెవెల్టో సూపర్ కారు మూడు ఎలక్ట్రిక్ మోటార్లతో 1015 హార్స్ పవర్, 807 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 2.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ సూపర్ కారు టాప్ స్పీడ్ గంటకు 350 కిమీ కావడం గమనార్హం. ఇది ఇండియన్ మార్కెట్లో 'ఫెరారీ SF90 స్ట్రాడేల్'కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
సొగసైన కారుపై 'సాహో' భామ
-
ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు - కియా నుంచి లాంబోర్గినీ వరకు..
భారతదేశంలో పండుగల సీజన్ నేపథ్యంలో చాలా వాహన తయారీ సంస్థలు కొత్త కార్లను & బైకులను మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ వారం మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కియా కారెన్స్ ఎక్స్-లైన్ దేశీయ మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన కియా కంపెనీకి చెందిన కారెన్స్ ఇప్పుడు ఎక్స్-లైన్ రూపంలో విడుదలైంది. ఈ కొత్త కారు ధరలు రూ. 18.94 లక్షల నుంచి రూ. 19.44 వరకు ఉంటుంది. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, కావున డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. పనితీరు చాలా ఉత్తమంగా ఉంటుంది. నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్ తాజాగా ఇండియన్ మార్కెట్లో అడుగెట్టిన నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్ ధరలు ఈ రోజు అధికారికంగా వెలువడ్డాయి. దీని ధర రూ. 8.27 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది పెట్రోల్ ఎమ్టీ, టర్బో పెట్రోల్ ఎమ్టీ, టర్బో-పెట్రోల్ సీవీటీ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ జిటి ప్లస్ మ్యాట్ వర్టస్ వెర్షన్ ఇటీవల జిటి ప్లస్ మ్యాట్ ఎడిషన్ రూపంలో విడుదలైంది. దీని ధరలు రూ. 17.62 లక్షల నుంచి రూ. 19.29 లక్షల వరకు ఉంటుంది. బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్ కేవలం 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మోటారుతో మాన్యువల్ అండ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదీ చదవండి: ఎక్స్, యూట్యూబ్ & టెలిగ్రామ్‌లకు నోటీస్ - వాటిని వెంటనే తొలగించండి లాంబోర్గినీ రెవెల్టో ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని దేశీయ విఫణిలో 'రెవెల్టో' అనే కొత్త కారుని విడుదల చేసింది. దీని ధర రూ. 8.9 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది మూడు ఎలక్ట్రిక్ మోటార్లు & 3.8 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. ఇందులోని 6.5 లీటర్ వి12 ఇంజిన్ 825 హార్స్ పవర్, 725 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. -
అదే నిజమైతే బిలియనీర్‌కి ఏడేళ్ళు జైలు శిక్ష! వీడియోలో ఏముందంటే?
ఇటలీలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలీవుడ్ నటి గాయత్రి జోషి, ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ లంబోర్ఘిని కారు ప్రమాదంలో చిక్కుకుందని, ఈ సంఘటనలో వారు గాయపడగా, ఒక ఫెరారీ కారు మంటల్లో చిక్కుకుని అందులోని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ సంఘటన మీద విచారణ జరుగుతోంది. నివేదికల ప్రకారం, ఈ ప్రమాదంలో ఒబెరాయ్ దోషిగా తేలితే సుమారు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ రంగంలో కోట్లు సంపాదిస్తున్న బిలియనీర్ వికాస్ ఒబెరాయ్ ప్రయాణిస్తున్న కారుని.. ఫెరారీ కారు క్రాష్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. వీడియోలో గమనించినట్లయితే.. రోడ్డుపై అనేక సూపర్ కార్లు వెళ్తున్నాయి. ఈ సందర్భంగా ఒబెరాయ్ తన భార్యతో లంబోర్ఘిని కారులో ముందు వెళ్తున్న ఒక ట్రక్కుని ఓవర్టేక్ చేయడానికి వెళ్తాడు, అదే సమయంలో వెనుక వస్తున్న ఫెరారీ కారు లంబోర్ఘినిని ఓవర్టేక్ చేయడానికి వెళ్ళింది. ఈ సందర్భాల్లో ఈ ప్రమాదం జరిగింది. ఇదీ చదవండి: కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి.. ఈ ప్రమాదంలో ఫెరారీ కారులోని ఇద్దరు స్విస్ వ్యక్తులు మరణించారు, కాగా ఒబెరాయ్ అతని భార్య గాయత్రి జోషి గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో ఒబెరాయ్ వేగవంతమైన ఫెరారీని గమనించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం వికాస్ ఒబెరాయ్‌పై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే అసలు తప్పు ఎవరిది అనే ప్రశ్న తలెత్తుతోంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. Two deaths on a Ferrari in Sardina, Italy pic.twitter.com/skT3CaXg0T — Globe Clips (@globeclip) October 3, 2023 -
విషాదం: బిలియనీర్ వికాస్, నటి గాయత్రి లగ్జరీ కార్ క్రాష్, వీడియో వైరల్
బాలీవుడ్ మూవీ 'స్వదేశ్' లో షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించిన యాక్టర్ గాయత్రి జోషి ప్రయాణిస్తున్న లగ్జరీ కారు ప్రమాదానికి గురైంది. గాయత్రితోపాటు, భర్త, వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ తృటిలో ఈ ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. అయితే మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఇటలీలో విహార యాత్రలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సార్డినియా సూపర్‌కార్ ఎక్స్పీరియన్స్ సమయంలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు గాయత్రి ప్రయాణిస్తున్న లంబోర్ఘిని కారు మరో లగ్జరీ కారు ఫెరారీని, క్యాంపర్ వ్యాన్ని ఢీకొట్టింది. లంబోర్ఘిని ,ఫెరారీతో సహా ఇతర లగ్జరీ వాహనాలతో పాటు, మినీ ట్రక్కును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇది జరిగింది. దీంతో ఫెరారీ కారులో ఉన్న స్విట్జర్లాండ్‌కు జంట ప్రాణాలు కోల్పోయారు. మీడియా నివేదికల ప్రకారం, ఫెరారీలో మంటలు చెలరేగడంతో మెలిస్సా క్రౌట్లీ(63) మార్కస్ క్రౌట్లీ, 67 అక్కడి క్కడే ప్రాణాలొదిలారు. వికాస్ ఒబెరాయ్ మేనేజర్ ప్రకారం గాయత్రి, వికాస్ జంట ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. కాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించిన గాయత్రీ జోషి వీడియో జాకీగా తన కెరీర్‌ను ప్రారంభించింది. అడ్వర్టైజింగ్ మోడల్‌గా కూడా పనిచేసింది. హన్స్ రాజ్ హన్స్ 'ఝంజరియా, జగ్జిత్ సింగ్ 'కాఘజ్ కి కష్టి'తో సహా అనేక మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. ఆ తర్వాత ఫెమినా ఇండియా అందాల పోటీల్లో విజేతగా నిలవాలనే లక్ష్యంతో 2000లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకుంది. అలాగే మిస్ ఇంటర్నేషనల్ 2000లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఇక సినిమాల విషయానికి వస్తే 2004లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ 'స్వేడ్స్'లో నటించింది. 2005లో వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్‌ని పెళ్లాడి సినిమాలకు గుడ్‌బై చెప్పింది. వీరికి ఇద్దరు పిల్లలు. వికాస్ ఒబెరాయ్: టాప్ ముంబై రియల్టర్, ఒబెరాయ్ రియల్టీ ఎండీ వికాస్ ఒబెరాయ్. ఫోర్బ్స్ అతని నికర విలువ 3.8 బిలియన్లు డాలర్లుగా అంచనా వేసింది. Two deaths on a Ferrari in Sardina, Italy pic.twitter.com/skT3CaXg0T — Globe Clips (@globeclip) October 3, 2023 -
19 ఏళ్లనాటి కల.. ఇప్పుడు నిజమైంది.. ఈజ్‌మైట్రిప్ కో-ఫౌండర్
భారతదేశంలో యువ పారిశ్రామిక వేత్తల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎవరికి వారు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి.. కొత్త కొత్త ఆలోచనలతో బాగా సంపాదిస్తూ కోటీశ్వరుగా మారుతున్నారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు EaseMyTrip ట్రావెల్ వెబ్సైట్ కో-ఫౌండర్ 'రికాంత్ పిట్టి'. ఈయన ఇటీవల ఖరీదైన 'లంబోర్ఘిని' కారుని కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మంటే (Lamborghini Urus Performante) నివేదికల ప్రకారం.. రికాంత్ పిట్టి కొనుగోలు చేసిన కారు 'లంబోర్ఘిని' కంపెనీకి చెందిన 'ఉరుస్ పెర్ఫార్మంటే'. దీని ధర రూ. 4.2 కోట్లు కావడం గమనార్హం. మన దేశంలో ఎక్కువమంది సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు బాగా ఇష్టపడే కార్ల జాబితాలో ఇది ఒకటి. ఈ కారు కొనుగోలు చేసిన సందర్భంగా రికాంత్ లింక్డ్ఇన్లో చాలా పెద్ద పోస్ట్ షేర్ చేసాడు. ఇందులో అతని 16 సంవత్సరాల వయస్సులో తన సోదరుడితో తన వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాడో వివరించాడు. ఆ తరువాత 20 సంవత్సరాల వయసు నాటికి EaseMyTrip వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. ఇది క్రమంగా వృద్ధిలోకి వచ్చింది. అనేక సంవత్సరాల కృషి తర్వాత, ఈజీమైట్రిప్ ప్రస్తుతం దేశంలో రెండవ అతిపెద్ద ఆన్లైన్ ట్రావెల్ కంపెనీగా అవతరించింది. లంబోర్ఘిని కారుని సొంతం చేసుకోవడం 19 ఏళ్లప్పుడు కన్న కల అని రికాంత్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. అయితే 2021లో ఈ కారుని కొనుగోలు చేసి ఉండొచ్చని, ఆ సమయంలో కరోనా బాధితుల సహాయం కోసం నిధులను ఉపయోగించడం వల్ల అది కుదరలేదని పేర్కొన్నాడు. అంతే కాకుండా ఇది కేవలం కారు మాత్రమే కాదు, మన కష్టార్జితాన్ని, మనం సాకారం చేసుకున్న కలలను, వెంటాడుతున్న కలలను సూచిస్తుందని పేర్కొన్నాడు. ఇదీ చదవండి: ఆడి కారులో వచ్చి ఆకుకూర అమ్ముతున్నాడు - వీడియో ఇక లంబోర్ఘిని విషయానికి వస్తే, ఇది 2022లో దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఇది 4.0-లీటర్ V8, ట్విన్-టర్బోచార్జ్డ్ ఇంజన్ కలిగి 666 పీఎస్ పవర్ & 850 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ SUV దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమ పనితీరుని అందిస్తుంది. -
ఏఆర్ రెహమాన్ సూపర్ కారు - ధర తెలిస్తే షాకవుతారు!
ఏఆర్ రెహమాన్ (AR Rahman) గురించి కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో చాలామందికి తెలుసు. సింగర్, సాంగ్స్ రైటర్, రికార్డ్ ప్రొడ్యూసర్, మ్యూజిక్ కంపోజర్‌గా మాత్రమే చాలామందికి తెలిసిన ఇతనికి కార్లంటే కూడా చాలా ఇష్టం. ఈ కారణంగానే ఇటీవల ఇటలీ బ్రాండ్ కారు కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఏఆర్ రెహమాన్ ఇటీవల 'లంబోర్ఘిని ఉరుస్ ఎస్' సూపర్ కారుని కొనుగోలు చేశారు. ఈ కారు ధర రూ. 4.18 కోట్లు అని తెలుస్తోంది. తెలుపు రంగులో కనిపించే ఈ కారు చెన్నైలోని డిటైలింగ్ స్టూడియో వద్ద కనిపించింది. అయితే ఈ కారు ఎప్పుడు కొన్నారని విషయం మాత్రం స్పష్టంగా వెల్లడికాలేదు. లంబోర్ఘిని ఉరుస్ లంబోర్ఘిని ఉరుస్ ఎస్ అనేది బ్రాండ్ లైనప్‌లో రెండవ మోడల్. మొదటిది ఉరస్ పెర్ఫార్మంటే. ఉరుస్ ఎస్ సబ్బియా, నెవ్, టెర్రా అనే మూడు మోడ్లతో లభిస్తుంది. పెర్ఫార్మంటే మాత్రం ఆఫ్-రోడ్ మోడ్ పొందుతుంది. లంబోర్ఘిని ఉరుస్ ఎస్ 4.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజన్‌తో 666 బిహెచ్పి పవర్ & 850 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇదీ చదవండి: భారత్ - కెనడా వివాదం: ఐటీ కంపెనీలకు గండమేనా! టెకీల పరిస్థితేంటి? లంబోర్ఘిని ఉరస్ ఎస్ కలిగిన సెలబ్రిటీల జాబితాలో ఏఆర్ రెహమాన్ మాత్రమే కాకుండా సచిన్ టెండూల్కర్, రోహిత్ శెట్టి, బాద్షా, రణవీర్ సింగ్, రోహిత్ శర్మ, రజనీకాంత్, కార్తీక్ ఆర్యన్, ఆకాష్ అంబానీ, జూనియర్ ఎన్టీఆర్, జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ కూడా ఉన్నారు. -
ప్రభాస్ రేంజే వేరు.. డార్లింగ్ కార్ల కలెక్షన్స్ చూస్తే కళ్లు తిరగాల్సిందే!
ఈశ్వర్ సినిమాతో తెలుగు చలన చిత్ర సీమలో అడుగుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నటుడు 'ప్రభాస్' (Prabhas) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టి ఇప్పుడు ఆదిపురుష్ చిత్రంలో తెరకెక్కాడు. సుమారు రూ. 200 కోట్ల కంటే ఎక్కువ నికర ఆస్తులు కలిగిన ప్రభాస్ సినిమాల గురించి తెలిసిన చాలా మందికి అతడు ఎలాంటి కార్లను ఉపయోగిస్తాడనేది తెలిసి ఉండక పోవచ్చు. ఈ కథనంలో ప్రభాస్ ఉపయోగించే కార్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లంబోర్ఘిని అవెంటడోర్ భారతదేశంలో లంబోర్ఘిని కంపెనీకి చెందిన అవెంటడోర్ కలిగి ఉన్న కొంతమందిలో ప్రభాస్ ఒకరు. ఈ కారు ధర రూ. 6 కోట్లు వరకు ఉంటుంది. ఇది లంబోర్ఘిని కంపెనీకి చెందిన అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్. ఇది 6.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి12 పెట్రోల్ ఇంజిన్ కలిగి 740 హార్స్ పవర్ 690 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో సింగిల్ క్లచ్ 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉండటం వల్ల అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఒకటి. ఈ కారు ప్రభాస్ గ్యారేజిలో కూడా ఉంది. 2016లో బ్లాక్ కలర్ ఫోర్త్ జనరేషన్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కొనుగోలు చేశారు. ఈ SUV లో 4.4 లీటర్ డీజిల్ వి8 ఇంజిన్ కలిగి 340 పీఎస్ పవర్, 740 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రభాస్ ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన లగ్జరీ కారుగా ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన 'ఫాంటమ్' కారుని కూడా కలిగి ఉన్నారు. ఈ కారు ధర సుమారు రూ. 8 కోట్ల కంటే ఎక్కువ. ప్రభాస్ గ్యారేజిలో ఉన్న అత్యంత ఖరీదైన కారు కూడా ఇదే. దీనిని 2013లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ లగ్జరీ కారు 6.75 లీటర్ వి12 ఇంజిన్ కలిగి 460 పీఎస్ పవర్, 720 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. (ఇదీ చదవండి: ప్రపంచంలో ఇదే బెస్ట్ ఎయిర్ లైన్! భారత్ ఎక్కడుందంటే?) జాగ్వార్ ఎక్స్‌జే భారతీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరించే జాగ్వార్ ఎక్స్‌జే ప్రభాస్ కార్ల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 1 కోటి కంటే ఎక్కువ ఉంటుంది. సిల్వర్ కలర్ ఆప్షన్లో కనిపించే ఈ కారుని 2012లో కొనుగోలు చేశారు. ఇది 3.0-లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వి6 డీజిల్ ఇంజిన్ కలిగి 275 పీఎస్ పవర్ 600 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ -స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. (ఇదీ చదవండి: హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!) బీఎండబ్ల్యూ ఎక్స్3 జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన బ్లాక్ కలర్ ఎక్స్3 మోడల్ కారుని 2018లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కారుని ప్రభాస్ చాలా అరుదుగా వినియోగిస్తారని తెలుస్తోంది. నిజానికి బీఎండబ్ల్యూ ఎక్స్3 మూడు వేరియంట్లలో లభిస్తుంది. కావున ప్రభాస్ ఇందులో ఏ వేరియంట్ కొన్నారనేది స్పష్టంగా తెలియదు. ఇది డీజిల్ ఇంజిన్ కలిగి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుందని తెలుస్తుంది. -
ఈ సైకిల్ కొనే డబ్బుతో కారు కొనేయొచ్చు! ధర తెలిస్తే షాక్ అవుతారు!
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ 'లంబోర్ఘిని' (Lamborghini) అనగానే మొదట గుర్తొచ్చేది లగ్జరీ కార్లు. అయితే ఈ సంస్థ ఖరీదైన కార్లను మాత్రమే కాకుండా సైకిల్స్ కూడా విడుదల చేస్తుందని చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ ఇప్పుడు మార్కెట్లో ఒక సైకిల్ విడుదల చేసింది. దీని ధర, ఇతర వివరాలను క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం. లంబోర్ఘిని విడుదల చేసిన ఈ సైకిల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి రేస్మ్యాక్స్ ఎక్స్ ఆటోమొబిలి లంబోర్ఘిని, స్ట్రాడా ఎక్స్ ఆటోమొబిలి లంబోర్ఘిని. వీటి ధరలు వరుసగా 9,899 డాలర్లు (రూ. 8,15,365), 8,999 డాలర్లు (రూ. 7,41,226). కంపెనీ ఈ సైకిల్స్ విడుదల చేయడానికి ప్రత్యేకంగా 3టి అనే సంస్థతో జత కట్టింది. (ఇదీ చదవండి: ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు విడుదల చేసిన రోల్స్ రాయిస్ - ధర ఎంతో తెలుసా?) ఈ లేటెస్ట్ లంబోర్ఘిని సైకిల్స్ 51, 54, 58 సెంటీమీటర్ల లిమిటెడ్ సైజుల్లో మాత్రమే లభిస్తాయి. ఈ సైకిల్స్ డెలివరీకి సుమారు 16 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. రేస్మ్యాక్స్ ఎక్స్ ఆటోమొబిలి లంబోర్ఘిని అనేది ఒక లైట్‌వెయిట్ మోడల్. దీనిని 3టీ కార్బన్ పరికరాలతో తయారు చేశారు. ఈ సైకిల్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎక్స్ప్లోరో రేస్మ్యాక్స్ ఎక్స్ హరికెన్ స్టెరెట్టో సైకిల్‌ను పోలి ఉంటుంది. రెండవ మోడల్ స్ట్రాడా ఎక్స్ ఆటోమొబిలిని ప్రత్యేకంగా కంఫర్ట్, ఎయిరోడైనమిక్స్ కోసం రూపొందించారు. ఇందులో ఎస్ఆర్ఏఎం ఫోర్స్ పరికరాలు ఉంటాయి. 3టీతో జతకట్టి లంబోర్ఘిని విడుదల చేసిన మూడవ సైకిల్ ఇది కావడం గమనార్హం. ఇప్పటికే సంస్థ 2018లో ఆర్5 ఆటోమొబిలి లంబోర్ఘిని ఎడిషన్ రూపొందించింది. అప్పట్లో ఇది కేవలం 63 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. -
భారత్‌లో విడుదలైన ఇటాలియన్ సూపర్ కారు - ధర అక్షరాలా..
Lamborghini Urus S: ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని 2022లో 'ఉరుస్ ఎస్' (Urus S) SUV గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసిన తరువాత ఇప్పుడు భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు దాని మునుపటి మోడల్ కంటే అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగి అంతకంటే ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. ధర: ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన లేటెస్ట్ ఎస్యువి ధర రూ. 4.18 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది ఉరుస్ పెర్ఫార్మంటే కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. ఇది ఉరుస్ లైనప్‌లో ఉన్న రెండవ మోడల్. డిజైన్ & ఫీచర్స్: లంబోర్ఘిని ఉరుస్ ఎస్ మంచి డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఇది కొత్త బంపర్, కూలింగ్ వెంట్స్‌తో కూడిన కొత్త బానెట్‌తో కాస్మెటిక్ అప్గ్రేడ్లను పొందుతుంది. కానీ బయట కనిపించే కార్బన్-ఫైబర్ బానెట్, కార్బన్-ఫైబర్ రూఫ్ మాత్రం పెర్ఫార్మంటే మోడల్ని గుర్తుకు తెస్తుంది. ఫీచర్స్: కొత్త ఉరుస్ ఎస్ లోపలి భాగంలో ఉరుస్ ఎస్ ఉరుస్ పెర్ఫార్మంటే మాదిరిగానే అదే డిజైన్ కలిగి ఉన్నప్పటికీ కొంత విభిన్నమైన మెటీరియల్ చూడవచ్చు. పెర్ఫార్మంటే బ్లాక్ ఆల్కాంటారా ఇంటీరియర్‌ను స్టాండర్డ్‌గా కలిగి చోట ఉరుస్ ఎస్‌లోని ఇంటీరియర్ లెదర్‌ను స్టాండర్డ్‌గా పొందుతుంది. (ఇదీ చదవండి: ChatGPT: మీరు చేసే ఈ ఒక్క పని మిమ్మల్ని లక్షాధికారుల్ని చేస్తుంది.. డోంట్ మిస్!) ఇంజిన్ & పర్ఫామెన్స్: కొత్త లంబోర్ఘిని ఉరుస్ ఎస్ సూపర్ SUV 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజిన్ పొందుతుంది. ఇది 666 హెచ్‌పి పవర్, 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో ఈ సూపర్ కారు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ నాలుగు చక్రాలకు డెలివరీ చేస్తుంది. ఉరుస్ ఎస్కి శక్తినివ్వడం ఉరుస్ పెర్ఫార్మంటే వలె అదే 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V8, 666hp మరియు 850Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఉరుస్ పెర్ఫార్మంటే క్లెయిమ్ చేయబడిన 3.3 సెకన్లలో గంటకు 0-100కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు, ఉరుస్ ఎస్ దానిని 3.5 సెకన్లలో (క్లెయిమ్ చేయబడింది) నిర్వహిస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ నాలుగు చక్రాలకు పంపబడుతుంది. (ఇదీ చదవండి: బీకామ్ డ్రాప్ అవుట్.. బిజినెస్ టేకప్: ప్రియాంక్ సుఖిజా సక్సెస్ స్టోరీ) ప్రత్యర్థులు: భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త లంబోర్ఘిని ఉరుస్ ఎస్ జర్మన్ బ్రాండ్ అయిన బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్, ఆడి RSQ8, ఆస్టన్ మార్టిన్ DBX 707, పోర్స్చే కయెన్ టర్బో జిటి, మసెరటి లెవాంటే ట్రోఫియో వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
దేశీ మార్కెట్లో మరింత వృద్ధిపై లంబోర్గిని దృష్టి
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో వ్యాపార వృద్ధిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సూపర్‌స్పోర్ట్స్ కార్ల తయారీ దిగ్గజం లంబోర్గిని చైర్మన్ స్టెఫాన్ వింకెల్మాన్ తెలిపారు. ముందుగా హైబ్రిడ్ వాహనాలు.. ఆ తర్వాత పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనాలు ఇందుకు దోహదపడగలవని ఆయన చెప్పారు. భౌగోళికరాజకీయ పరిస్థితులతో అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తమకు అవసరమయ్యే విడిభాగాలు మొదలైన వాటిని ఇతరత్రా మరిన్ని దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నామని వింకెల్మాన్ చెప్పారు. దీనితో భారతీయ విడిభాగాల సరఫరా సంస్థలకు కూడా వ్యాపార అవకాశాలు లభించగలవని ఆయన తెలిపారు. భారత్‌లో భారీగా పన్నులు, మౌలికసదుపాయాలపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ.. వృద్ధికి కూడా అవకాశాలు బాగానే ఉన్నాయని వింకెల్మన్ చెప్పారు. అయితే, వృద్ధి ఎంత స్థాయిలో ఉండొచ్చనేది చెప్పలేనని పేర్కొన్నారు. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టబోతున్నట్లు 2021లో కంపెనీ ప్రకటించింది. దీని ప్రకారం 2023లో తొలి హైబ్రిడ్ మోడల్‌ను (విద్యుత్, ఇంధనంతో నడిచేది) ప్రవేశపెట్టనుంది. 2024 ఆఖరు నాటికి ప్రస్తుతం తమకున్న మోడల్స్ శ్రేణి మొత్తాన్ని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చనుంది. లంబోర్గిని గత ఏడా ది భారత్‌లో 92 వాహనాలు విక్రయించింది. అంతక్రితం ఏడాది 2021లో నమోదైన 69 యూనిట్లతో పోలిస్తే ఇది 33 శాతం అధికం. -
ఇదో పిచ్చి.. రూ. 3 కోట్ల కారు నాశనం చేశాడు: షాకింగ్ వీడియో!
న్యూఢిల్లీ: కోట్ల రూపాయల ఖరీదైన లగ్జరీ కారును కళ్లముందే ధ్వంసం చేసిన వీడియో ఒకటి నెట్లో హల్చల్ చేస్తోంది. లిట్ ఎనర్జీ డ్రింక్ ప్రమోషన్లో భాగంగా లంబోర్ఘిని ఉరస్‌ను ఒక రష్యన్ యూ ట్యూబర్ ముక్కలు చేసి పారేశాడు. దీంతో వీడియో వైరల్‌గా గారింది. రూ. 3 కోట్లకు పైగా విలువైన లంబోర్ఘిని కారును నాశనం చేయడం నెటిజన్లని షాక్‌కి గురి చేసింది. (మహీంద్రా స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ లీక్ ? షాకింగ్ వీడియో వైరల్) వివరాల్లోకి వెళితే మిఖాయిల్ లిట్విన్ అనే పాపులర్ రష్యన్ యూట్యూబర్ లిట్ ఎనర్జీ డ్రింక్ ప్రమోషన్ కోసం తన వైట్ లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగానే ఉరుస్ కారును కేవలం కొన్ని సెకన్లలో ధ్వంసం చేసి, ఆ వీడియో షేర్ చేశాడు. ఒక భారీ క్రేన్‌తో లంబోర్ఘిని కారుపై పడేసి, తద్వారా లిట్ డ్రింక్ చిందేలా చేయడం ఇంటర్నెట్ యూజర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేవలం ఎనర్జీ డ్రింక్ ప్రకటన కోసం రూ. 3.15 కోట్ల (ఎక్స్-షోరూమ్) ఖరీదైన ఎస్‌యూవీని యూట్యూబర్ ముక్కలు చేయడంపై నెటిజన్లు పలు అనుమానాల్ని వ్యక్తం చేశారు. స్టంట్‌పై స్పందించిన ఒక యూజర్ బీమా కంపెనీ పరిస్థితి ఏంటి ఒకరు వ్యాఖ్యానించారు. పాపులారిటీ కోసం యూట్యూబర్లు ఇదంతా చేస్తున్నారని కొంతమంది మండి పడ్డారు. అనవసరంగా ఇంత పొల్యూషన్ సృష్టించడం నేరమని కొందరు లైక్స్ అండ్ వ్యూస్ కోసం చేస్తున్న ఫక్తు బిజినెస్ ఇంకొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Jist (@jist.news) కాగా మహీంద్రా స్కార్పియోఎన్ రూఫ్ టాప్ లీక్ అవుతున్న వీడియోను ఒక యూట్యూబర్ షేర్ చేసిన క్లిప్ కూడా ఇంటర్నెట్లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో యూట్యూబ్ క్రియేటర్లు ఇలాంటి వైరల్ కంటెంట్‌ను తయారు చేయడంలో ఆరితేరిపోయారనే నవిమర్శలు వినిపిస్తున్నాయి. -
బడాబాబులు ఎక్కడా తగ్గట్లే: లంబోర్ఘిని కార్ల హాట్ సేల్
న్యూఢిల్లీ: ఇటాలియన్ సూపర్ కార్-మేకర్ లంబోర్ఘిని ఇండియాలో రికార్డ్ సేల్స్ నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన కార్లను విక్రయిస్తున్న సంస్థ అద్భుతమైన వృద్ధిని సాధించింది. ఇండియాలో తమ టార్గెట్ రీచ్ అయిందని కంపెనీ ప్రకటించింది. 2023లో భారతదేశంలో 100 కార్లను విక్రయించాలనేది అసలు ప్లాన్. అయితే, ఇంకా ఫిబ్రవరి పూర్తి కాకుండానే వీటిలో 90 కార్లను ఇప్పటికే ఆర్డర్స్‌ను అల్ట్రా హై నెట్ వర్త్ వ్యక్తులు (UHNIలు) హాట్‌కేక్‌లా కొనుగోలు చేస్తున్నారని లంబోర్ఘిని ఆసియా-పసిఫిక్ డైరెక్టర్ ఫ్రాన్సిస్కో స్కార్డొని తెలిపారు. లంబోర్ఘిని ఉరుస్ లగ్జరీ SUV, అవెంటడోర్, హురాకాన్ వంటి లగ్జరీ కార్లను ఇండియాలో విక్రయిస్తోంది. భారతదేశంలో దాని అన్ని కార్ల ధరలు రూ. 4 కోట్లకు పైమాటే. అయినప్పటికీ, సెలబ్రిటీలు , వ్యాపారవేత్తలు ఈ కార్లను ఎగరేసుకు పోవడం విశేషం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న లంబోర్ఘిని మార్కెట్లలో ఇండియా ఒకటి. వార్షిక ప్రాతిపదికన 30 శాతం అమ్మకాలను సాధిస్తోంది. 2022లో దేశంలో 90 కార్లు విక్రయించగా, చైనాలో 1,000 కార్లను విక్రయించింది. మహమ్మారి అనంతర డిమాండ్ లంబోర్ఘిని ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగింది. గ్లోబల్ ట్రెండ్ల గురించి మాట్లాడుతూ 2023 ఏడాదికి సంబంధించిన ఆర్డర్లు ముగిసాయి. 2024 ఆర్డర్లను తీసుకుంటున్నాం. రోజువారీ ఆర్డర్‌బుక్ ఇంత ఎక్కువగా ఉండటం ఆశ్చర్యంగా ఉందని స్కార్డొని సంతోషం ప్రకటించారు. ఆర్డర్ బుకింగ్ సగటున 18 నెలల కంటే ఎక్కువే. -
భారత్‌లో లంబోర్గీని రికార్డ్ సేల్స్; వచ్చే ఏడాదికి భారీ టార్గెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సూపర్ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న ఇటలీ సంస్థ ఆటోమొబైలి లంబోర్గీని 2022లో భారత్‌లో 92 యూనిట్లు విక్రయించింది. దేశంలో ఇప్పటి వరకు కంపెనీకి ఇవే అత్యధిక అమ్మకాలు కావడం విశేషం. 2021తో పోలిస్తే 33 శాతం వృద్ధి సాధించింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా కంపెనీ నుంచి అత్యధికంగా 9,233 యూనిట్లు రోడ్డెక్కాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 10 శాతం అధికం. మార్కెట్ సానుకూలంగా ఉందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని కంపెనీ తెలిపింది. అత్యుత్తమ మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచిందని వెల్లడించింది. 2021తో పోలిస్తే గతేడాది ఆసియా దేశాలు 14 శాతం వృద్ధి సాధించాయి. విక్రయాల పరంగా తొలి స్థానంలో ఉన్న యూఎస్ మార్కెట్ 10 శాతం అధికంగా 2,721 యూనిట్లు నమోదు చేసింది. భారత్‌లో లంబోర్గీని కార్ల ధరలు రూ.3.16 కోట్ల నుంచి ప్రారంభం. అంతేకాదు 2023 సంవత్సరానికి గాను భారీ టార్గెట్ పెట్టకున్నట్టు కంపెనీ కంట్రీ హెడ్ శరద్ అగర్వాల్ తెలిపారు. 2023లో మూడు అంకెల మార్కును ఎలా సాధించి సెంచరీ కొట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు. -
లంబోర్గినీ సూపర్ ఎస్యూవీ వచ్చేసింది: కళ్లు చెదిరేలా!
హైదరాబాద్: ఇటాలియన్ సూపర్ స్పోర్ట్స్ కార్ల తయారీ దిగ్గజం లంబోర్గినీ తాజాగా భారత్‌లో ఊరూస్ పెర్ఫార్మెంటే ఎస్‌యూవీని పరిచయం చేసింది. ప్రారంభ ధర ఎక్స్‌షోరూంలో రూ.4.22 కోట్లునుంచి ప్రారంభం. స్టాండర్ట్ ఎస్యూవీ కంటే దాదాపు రూ. 1.12 కోట్లు ఎక్కువ. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.3 సెకన్లలోనే చేరుకోవడం దీని ప్రత్యేకత. గరిష్ట వేగం గంటకు 306 కిలోమీటర్లు. భారత్‌లో బ్రాండ్ వృద్ధిని పెంచడంలో, కొత్త మార్కెట్లను తెరవడంలో ఊరూస్ కీలకపాత్ర పోషించిందని లంబోర్గినీ ఇండియా హెడ్ అగర్వాల్ తెలిపారు. -
లంబోర్గిని సూపర్ లగ్జరీ కార్లు: ధర రూ. 4 కోట్లకు పైమాటే
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఇటీవలి కాలంలో విడుదలైన మోడళ్లను భారత్‌కు పరిచయం చేయాలని కార్ల తయారీ దిగ్గజం ఆటోమొబిలి లంబోర్గీని భావిస్తోంది. ఇక్కడి సూపర్ లగ్జరీ కార్ల మార్కెట్లో స్థానాన్ని బలపర్చుకోవడమే కంపెనీ లక్ష్యంగా కనిపిస్తోంది. లంబోర్గీని హురకాన్ టెక్నికా మోడల్‌ను గురువారం భారత్‌లో ప్రవేశపెట్టింది. ధర రూ.4.04 కోట్ల నుంచి ప్రారంభం. త్వరలోనే ఊరూస్ పెర్ఫార్మెంట్ ఎస్‌యూవీని ఇక్కడకు తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉంది. విదేశీ మోడళ్లను భారత్‌లో త్వరతగతిన విడుదల చేసేందుకు కృషిచేస్తున్నట్టు లంబోర్గీని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ తెలిపారు. కొత్త మోడళ్లను వేగంగా స్థానిక మార్కెట్లోకి తీసుకురావడం భారత్‌లో సంస్థ వృద్ధికి కీలక స్తంభమని ఆయన అన్నారు. గతంలో 8-10 నెలల సమయం పట్టేదని చెప్పారు. విదేశాల్లో పరిచయం చేసిన నెల రోజుల్లో ఊరూస్ను ఇక్కడకు తెచ్చామని, హురకాన్ ఈవోను తొలుత భారత్‌లో విడుదల చేశామన్నారు. లంబోర్గీని కార్ల ధరలు రూ.3.16 కోట్ల నుంచి ప్రారంభం. 2021లో కంపెనీ భారత్‌లో 69 కార్లను విక్రయించింది. హురకాన్ టెక్నికా 5.2 లీటర్ ఇంజన్‌తో తయారైంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.2 సెకన్లలో అందుకుంటుంది. -
లంబోర్ఘిని సూపర్ కార్: ఇండియాలో రెండో లక్కీయెస్ట్ ఓనర్!
సాక్షి, ముంబై: లగ్జరీ స్పోర్ట్స్ కార్లు అండ్ ఎస్‌యూవీలను అందించే ఇటలీ కార్ మేకర్ లంబోర్ఘిని లేటెస్ట్ సూపర్ కార్ అవెంటడోర్ అల్టిమే రోడ్‌స్టర్ రెండో కారును భారత మార్కెట్లో డెలివరీ చేసింది. గ్లోబల్‌గా లిమిటెడ్ ఎడిషన్‌గా లాంచ్ చేసిన ఈ కారులో రెండోది ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టనుంది. దేశంలో రెండో కారుగా అల్టిమే రోడస్టర్ ఎల్పీ 780-4ను రు ముంబైకి చెందిన వ్యక్తి సొంతంచేసుకున్నారు. అవెంటడార్ అల్టిమే రోడ్‌స్టర్ రెండో కారును డెలివరీ చేశామని లంబోర్ఘిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ వెల్లడించారు. లంబోర్ఘిని చరిత్రలో అత్యాధునిక టెక్నాలజీ, సూపర్ డిజైన్‌ను ఇందులో జోడించింది. అలాగే 6.5-లీటర్ల వీ12 ఇంజిన్‌తో 8,500rpm వద్ద 769bhp, 6,750rpm వద్ద 720Nm పీక్ టార్క్‌ను విడుదల చేస్తుంది. కేవలం 2.9 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఇండియాలో దీని ధర సుమారు 8కోట్ల రూపాయలు. కాగ అవెంటడోర్ అల్టిమే రోడ్‌స్టర్ కారుకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 600 యూనిట్లను మాత్రమే విక్రయించనుంది లంబోర్ఘిని. కూపే, రోడస్టర్ అనే రెండు వేరియంట్లలో పరిచయం చేసింది. గ్లోబల్‌గా కూపే మోడల్లో 350, రోడ్‌స్టర్ బాడీ స్టైల్లో 250 యూనిట్లను విక్రయించ నున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఎన్ని కోట్లయినా సరే.. తగ్గేదేలే!సూపర్ రిచ్ ఇక్కడ!
సాక్షి, ముంబై: సూపర్-లగ్జరీ కార్ల విక్రయాలు సూపర్ వేగంతో దూసుకుపోతున్నాయి. దేశంలో అంతకంతకు పెరుగుతున్న బిలియనీర్ల కారణంగా కరోనా సంక్షోభంలో కూడా రూ. 2 కోట్లకు పైగా విలువున్న కార్లను హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయట. ముఖ్యంగా కరోనా మహమ్మారి తరువాత దేశీయ కుబేరులు లగ్జరీ కార్లను ఎగరేసుకుపోతున్నారట. రూ.2 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన కార్ సేల్స్ ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనాకి ముందున్న గరిష్ట స్థాయిలను అధిగమించే అవకాశం ఉందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. 2018లో భారతదేశంలోని అత్యంత సంపన్నులు రూ. 2 కోట్లకు పైగా ధర కలిగిన 325 లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. అయితే కోవిడ్-19 మహమ్మారి దెబ్బకు 2020లో వాటి సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. కానీ ప్రస్తుతం భారతదేశంలోని లగ్జరీ కార్ మార్కెట్లో పదివేల యూనిట్లకు పైగా ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని ఎకనామిక్స్ టైమ్స్ ఒక రిపోర్టులో తెలిపింది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం ఇటాలియన్ సూపర్-లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని, ఆర్థిక అనిశ్చితి పరిస్థితిల్లో కూడా కార్ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. 2022 మొదటి ఐదు నెలల్లో ఊహించిన దానికంటే ట్రెండ్ బాగా పుంజుకుందని లంబోర్ఘిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్‌ని పేర్కొన్నారు. ఈ నెంబర్లు సూపర్-లగ్జరీ కార్ల మార్కెట్ సామర్థ్యం కంటే ప్రపంచంలో ఇండియాలో అత్యధికంగా పెరుగుతున్న బిలియనీర్ల సంఖ్యను ప్రతిబింబిస్తోందన్నారు. ఇంతకుముందు మూడో/ నాల్గవ తరం వ్యాపారులకు మాత్రమే లగ్జరీ కార్లను విక్రయించాం కానీ ఇపుడు మొదటి తరం వ్యాపారవేత్తలు, మహిళలు, ఇతరులతో తమ కస్టమర్ బేస్ మరింత విస్తరించిందని అగర్వాల్ వెల్లడించారు. కోటి రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న మెర్సిడెస్ బెంజ్ హై-ఎండ్ లగ్జరీ కార్ల వాటా 2018లో 12 శాతంతో పోలిస్తే 2022లో 29 శాతానికి రెండింతలు పెరిగింది. దాదాపు 5వేల మందిలో మూడింట ఒక వంతు మంది తమ లగ్జరీ కారు వినియోగిస్తున్నారని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ ష్వెంక్ చెప్పారు. 2021లో 2వేల లగ్జరీ కార్లను విక్రయించిన బెంజ్ చేతిలో కోటి రూపాయల కంటే ఎక్కువ ధర వాహనాల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయిట. కాగా ఇటీవల లంబోర్ఘిని అవెంటడోర్ అవెంటోని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని అంచనా ధర సుమారు 8-10 కోట్లు. లిమిటెడ్ ఎడిషన్‌గా ప్రపంచవ్యాప్తంగా 600 కార్లను రిలీజ్ చేయగా ఇప్పటికే అన్ని కార్లు బుక్ అయిపోయాయి. ఇందులో ఇండియా నుంచి ఒకరు ఉండటం విశేషం. ఇది కూడా చదవండి: Lamborghini Aventador Ultimae: వావ్..లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్‌కార్: హాట్ సేల్ -
వావ్..లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్‌కార్: హాట్ సేల్
న్యూఢిల్లీ: ఇటాలియన్ కార్ బ్రాండ్ లంబోర్ఘిని మరో సూపర్ కారును భారత మార్కెట్లో లాంచ్ చేసింది. లంబోర్ఘిని అవెంటడోర్ అల్టిమే పేరుతో లిమిటెడ్ ఎడిషన్ కార్‌ను తీసుకొచ్చింది. ప్యూర్ పెట్రోల్ వీ12 ఇంజన్‌తో ఈ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 600 యూనిట్లను మాత్రమే అందుబాటులో ఉంచింది. కూపే, రోడస్టర్ రెండు వేరియంట్లలో దీన్ని పరిచయం చేసింది. కూపే మోడల్లో 350, రోడ్‌స్టర్ బాడీ స్టైల్లో 250 యూనిట్లను విక్రయించనుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ లంబోర్ఘిని అవెంటడోర్ అల్టిమేపనితీరు-స్పెసిఫికేషన్లు... కొంత మార్పు చేసినప్పటికీ, అవెంటడార్ ఎస్వీజే, అవెంటడార్ ఎస్ మాదిరిగానే ఉండనున్నాయి. లంబోర్ఘిని అవెంటడార్ LP780-4 Ultimae ఫీచర్లు అత్యంత శక్తివంతమైన 6,498 సీసీ వీ12 ఇంజన్. ఇది 770bhp వద్ద 8,500ఆర్పీఎంను, 6,750 ఆర్పీఎం వద్ద 720 ఎన్ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. కొత్త స్టైలింగ్, కొత్త ఫ్రంట్ బంపర్, మాసివ్ సైడ్ స్కర్ట్లు, రియర్ డిఫ్యూజర్, 20- అంగుళాల అల్లాయ్ వీల్స్ 7- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, గరిష్టంగా గంటలకు 355 కిలోమీటర్ల వేగం లాంటి ఇతర ఫీచర్లు ఈ కారుసొంతం. అవెంటడార్ ఎస్ కంటే ఇది 25 కిలోల బరువు తక్కువ. అయితే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంచిన కార్లన్నీ ఇప్పటికే అమ్ముడు పోయాయట. ఇండియాలో ఒక్కరు మాత్రమే ఈ కారును సొంతం చేసుకున్నారు. అయితే ఈ కారు ధరను లంబోర్ఘిని వెల్లడించలేదు. -
సరికొత్త ఘనత సాధించిన సూపర్ లగ్జరీ కారు లంబోర్ఘిని ఉరుస్
ఇటాలియన్ సూపర్ లగ్జరీ కారు తయారీ కంపెనీ లంబోర్ఘిని సరికొత్త ఘనత సాధించింది. ప్రముఖ లంబోర్ఘిని ఎస్యూవీ ఉరుస్ కారు ప్రపంచంలోనే ఎత్తైన లడఖ్ ప్రాంతంలోని ఉమ్లింగ్ లా పాస్ రహదారిపై నడవడం ద్వారా భారతదేశంలో మరో మైలురాయిని సాధించిందని కంపెనీ తెలిపింది. అక్టోబర్ 8, 9న రెండుసార్లు సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎత్తులో ఉన్న ఉమ్లింగ్ లా పాస్‌లో ఉరుస్ ప్రయాణించడంతో ఇప్పటి వరకు లంబోర్ఘిని ప్రయాణించిన ఎత్తైన ప్రాంతం ఇదేనని లంబోర్ఘిని ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. నడపడం కష్టం ఉమ్లింగ్ లా పాస్ అనేది భారతదేశంలోని లడఖ్‌లో ఒక పర్వత మార్గం. ఈ మార్గం సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటం వల్ల అక్కడ వాహనం నడపాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఈ మార్గంలో 86 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నమ్మశక్యం కాని అద్భుతమైన ఘనత సాధించినట్లు కంపెనీ తెలిపింది. "లంబోర్ఘిని ప్రపంచంలోని అత్యధిక క్లిష్టమైన రహదారిపై నడుస్తున్నపుడు మాకు నిజంగా గర్వించదగ్గ క్షణం" అని లంబోర్ఘిని ఇండియా అధిపతి శ్రీ శరద్ అగర్వాల్ చెప్పారు. (చదవండి: ఆరు రోజులు.. రూ.10.56 లక్షల కోట్ల సంపద) ఈ సంధర్భంగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బిఆర్ఓ)కు అభినందనలు తెలియజేశారు. లంబోర్ఘిని ఎస్యూవీ ఉరుస్ అనేది ఒక సూపర్ స్పోర్ట్స్ కారు. ప్రపంచంలో అన్ని మార్గాలలో ప్రయాణించే అగ్రశ్రేణి కారు. 4-లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజిన్ తో నడిచే ఈ ఉరుస్ కారు 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ప్రపంచంలోనే అత్యధిక క్లిష్టమైన రోడ్డులో నడవడంతో తన సామర్థ్యాలను ప్రదర్శించిందని కంపెనీ తెలిపింది. భారతదేశంలో లంబోర్ఘినికి ఉరుస్ ప్రారంభ ధర ₹3.16 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ సూపర్ లగ్జరీ ఎస్‌యూవీని ప్రస్తుతం 8-10 నెలల ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. -
వైరల్: 'రామ్‌చరణ్ ఇంటి ముందు ఎన్టీఆర్ కాస్ట్లీ కారు'
Facts On Jr NTR Buys Lamborghini: జూనియర్ ఎన్టీఆర్‌కు కార్లు అంటే ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తారక్ దగ్గర కార్ల కలెక్షన్లు చాలానే ఉన్నాయి. 'ఇప్పుడు ఆయన గ్యారెజీలో మరో కొత్త కారు వచ్చి చేరింది. అత్యంత ఖరీధైన లంబోర్గిని ఉరుస్ మోడల్ కారును కొనేశాడు. దీని ఖరీదు సుమారు 5 కోట్ల రూపాయలు.అత్యంత విలాసవంతమైన ఈ కారుతో ఎడారి ప్రాంతంలోనూ రయ్యుమంటూ రైడ్‌కి దూసుకెళ్లొచ్చు.ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్న ఈ కారు హైదరాబాద్ చేరుకోగానే.. ఫస్ట్ రైడ్ రామ్ చరణ్ ఇంటికి తీసుకెళ్లాడు. కొద్ది నెలల క్రితమే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లంబోర్గిని కారును కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీని ధర రూ. 4కోట్లు ఉండగా, ఇప్పుడు దాన్ని తారక్ దాటేశాడు. దీంతో ప్రస్తుతం అత్యంత కాస్ట్లీ కార్లు ఉన్న మన తెలుగు హీరోల లిస్ట్‌లో ఎన్టీఆర్ ముందున్నారు' అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ కాస్ట్లీ కారు గురించి ఇండస్ట్రీలోనూ జోరుగా చర్చ జరుగుతుంది. దీంతో ఈ వార్తలపై ఎన్టీఆర్ మేనేజర్ మహేష్ కోనేరు క్లారిటీ ఇచ్చారు. 'సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఆ కారు ఎన్టీఆర్‌ది కాదు. రామ్‌చరణ్ ఇంటి ముందు పార్క్ చేసిన ఎన్టీఆర్ కొత్త కారు అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. కానీ ఎన్టీఆర్ కొన్నాళ్ల క్రితం లంబోర్గిని ఉరుస్ మోడల్‌ను బుక్ చేసిన విషయం మాత్రం వాస్తవం. కానీ అది ఇండియాకు డెలీవరీ అయ్యేందుకు మరికాస్త సమయం పడుతుంది. త్వరలోనే ఇటలీ నుంచి ఆ కారు రానుంది' అని ఆయన పేర్కొన్నారు. దీంతో ఎన్టీఆర్ కొత్త కారు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. -
భారత మార్కెట్లోకి లంబోర్ఘిని కొత్త కారు విడుదల..ధర ఎంతంటే..
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని భారత మార్కెట్లోకి హురాకాన్ ఎస్టిఓ కారును విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా హురాకాన్ ఎస్టీఓను నవంబర్ 2020లోనే రిలీజ్ చేయగా, హురాకాన్ ఎస్టీఓ ప్రస్తుతం ఉన్న హురాకాన్ పెర్ఫార్మంటే కారును రిప్లెస్ చేయనుంది. ఈ కారు బాడీ తయారీలో సుమారు 75 శాతం వరకు కార్బన్ ఫైబర్‌ను వినియోగించారు. లంబోర్ఘిని హురాకాన్ ఎస్టీవోలో వీ10 ఇంజన్ ఏర్పాటు చేశారు. 630 బీహెచ్పీ సామర్థ్యంతో 565ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్సత్తి చేస్తోంది. సున్నా నుంచి 100 స్పీడ్‌ను కేవలం మూడు సెకండ్లలోనే అందుకుంటుంది. కారు 200కెఎమ్పీచ్ స్పీడ్‌ను తొమ్మిది సెకండ్లలో అందుకుంటుంది. కారు టాప్ స్పీడ్ 310కేఎమ్‌పీహెచ్. కారులో మూడు రకాల డ్రైవింగ్ మోడ్స్‌ను అమర్చారు. ది రోడ్ ఒరియంటెడ్ ఎస్టీవో, ట్రాక్ ఫోకస్డ్ ట్రోఫీ, రెయిన్ మోడ్‌లను అమర్చారు. కార్ ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌లో భాగంగా కొత్త హ్యూమన్ మెషిన్ ఇంటర్ఫేస్ (హెచ్ఎంఐ) గ్రాఫిక్స్ ఫీచర్స్‌ను అమర్చారు. అంతేకాకుండా కారులో డ్రైవ్ మోడ్ ఇండికేటర్, ఎల్డివిఐ సిస్టమ్, టైర్ ప్రెజర్, బ్రేక్ ఉష్ణోగ్రతలతో సహా కారు విధులను నిర్వహిస్తుంది. పూర్తిగా అనుసంధానించబడిన టెలిమెట్రీ వ్యవస్థతో డ్రైవర్లు హురాకాన్ STO ను రేస్ట్రాక్లపై రయ్‌రయ్‌మంటూ దూసుకువెళ్లొంచును. భారత్‌లో లంబోర్ఘిని హురాకాన్ ఎస్టీవో ఎక్స్‌షోరూమ్ ధర రూ. 4.99 కోట్లుగా నిర్ణయించారు. -
కరోనాకి బెదరని లంబోర్గిని
కరోనా సెకండ్ వేవ్ ఇండియా మొత్తాన్ని చుట్టేసింది, దాదాపుగా అన్ని రంగాలు కోవిడ్ ఎఫెక్ట్‌కి లోనయ్యాయి. కరోనా వైరస్ ధాటికి నూటికి తొంభైశాతం అమ్మకాలు తగ్గిపోయాయి. అయితే లగ్జరీ కార్ల బ్రాండ్ లంబోర్గిని మాత్రం కరోనాకు సవాల్ విసిరింది. కరోనా సంక్షోభ సమయంలోనూ రికార్డు స్థాయి అమ్మకాలు సాగించింది. అంచనాలు తారుమారు జర్మనీకి చెందిన లంబోర్గిని బ్రాండ్‌కి అంతర్జాతీయంగా మంచి ఫేమ్ ఉంది. ఈ బ్రాండ్ కార్లను ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో బాగా సేల్ అవుతోన్న లంబోర్గిని ఉరుస్ కారు షోరూమ్ ధరనే రూ. 3.43 కోట్లుగా ఉంది. దీంతో లగ్జరీ బ్రాండ్ కార్ల అమ్మకాలు తగ్గుతాయనే అంచనాలు ఉండేవి. అయితే అవి పటాపంచలయ్యాయి. రెట్టింపు అమ్మకాలు ధర ఎంతున్నా పర్వాలేదు మాకు లంబోర్గిని ఉరుస్ కావాలంటున్నారు సినీ సెలబ్రిటీలు, బిజెనెస్‌మెన్‌లు. దీంతో అమ్మకాల్లో లంబోర్గిని ఉరుస్ దూసుకుపోతుంది. గతేడాది కూడా కరోనా ఎఫెక్ట్‌లో దేశవ్యాప్తంగా కేవలం 13 లంబోర్గిని ఉరుస్ మోడళ్లు ఇండియాలో అమ్ముడు పోయాయి. కానీ ఈసారి కేవలం ఆరు నెలల కాలంలోనే 26 కార్లు ఇండియాలో డెలివరీ చేసింది లంబోర్గిని. కరోనా కల్లోలం, మందగించిన ఆర్థిక వ్యవస్థ తదితర అంశాలేవి లంబోర్గినిపై ప్రభావం చూపలేదు. లగ్జరీ సెగ్మెంట్లో ఒక్క లంబోర్గినే కాదు మెర్సిడెస్, ఆడి వంటి ఇతర లగ్జరీ బ్రాండ్లలో కూడా కార్ల అమ్మకాలు సూపర్‌గా ఉన్నాయి. ఇటీవల విడుదలై మెర్సిడెస్ మేహ్బ్యాక్ జీఎల్ఎస్ 400 మోడల్ కార్లు విడుదలకు ముందే దాదాపు స్టాక్ మొత్తం అమ్ముడైపోయింది. ఇండియాలో తమ లగ్జరీ బ్రాండ్ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని, త్వరలో మరిన్ని మోడళ్లు ఇండియాలో ప్రవేశపెడతామని మెర్సిడెస్ సీఈవో మార్టిన్ చెబుతున్నారు. ఇండియన్ మార్కెట్లో లగ్జరీ కార్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆడి ఏకంగా ఈ ట్రాన్ పేరుతో లగ్జరీ ఈవీ ని అందుబాటులోకి తెచ్చింది. మరో హై ఎండ్ బ్రాండ్ పోర్షే కార్ల అమ్మకాలు ఈ త్రైమాసికంలో 57 శాతం పెరిగాయి. బైకుల పరిస్థితి దారుణం బిజినెస్ టైకూన్లు, టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, సినీ సెలబ్రిటీలు లగ్జరీ కార్లు కొనేందుకు ఉత్సాహం చూపిస్తుంటే .. కరోనా ఎఫెక్ట్‌తో స్వంత టూవీలర్ కొనుక్కోవాలనుకున్న సామాన్యులు వెనుకడుగు వేస్తున్నారు. ఏళ్ల తరబడి పొదుపు చేసిన సొమ్మును ఖర్చు పెట్టేందుకు ధైర్యం చేయట్లేదు. దీంతో ఈ ఏడాది బైకుల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ లెక్కల ప్రకారం కరోనాకు ముందు 2019 మేతో పోల్చితే 2021 మేలో బైకుల అమ్మకాలు ఏకంగా 71 శాతం పడిపోయాయి. చదవండి : స్టైలిష్ లుక్‌తో కట్టిపడేస్తున్న 'యమహా' -
మార్కెట్ లో లంబోర్గిని కొత్త లగ్జరీ కారు, ఇండియాలో విడుదల
ముంబై: ఇటాలియన్ సూపర్ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని భారత మార్కెట్లో మంగళవారం సరికొత్త లగ్జరీ కారును విడుదల చేసింది. ‘హురాకన్ ఈవీఓ రేర్–వీల్ డ్రైవ్ స్పైడర్’ పేరుతో ఆవిష్కరించిన ఈ కారు ధర రూ.3.54 కోట్లుగా ఉంది. ఇందులో అమర్చిన వీ10 ఇంజిన్‌కు గరిష్టంగా 610 హెచ్‌పీ సామర్థ్యం ఉంది. ఈ కొత్త కారు కేవలం 3.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు 324 వేగంతో ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది. -
లంబోర్గినిలో షికారుకెళ్లిన ప్రభాస్ సోదరి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే కొత్త కారు కొనుక్కున్న విషయం తెలిసిందే కదా! లంబోర్గిని అవెంటాడర్ ఎస్ రోడ్‌స్టర్ అనే లగ్జరీ కారును బెంగళూరు నుంచి తన ఇంటికి తెప్పించుకున్నాడు. దీని ధర సుమారు రూ.7 కోట్లు ఉంటుందని అంచనా. నారింజ రంగులో మెరిసిపోయే ఈ కారు రోడ్ల మీదకు వచ్చిందంటే అందరి చూపు దీనిమీదే. ఈ క్రమంలో లంబోర్గిని కారు హైదరాబాద్ రోడ్ల మీద చక్కర్లు కొట్టిన పలు వీడియోలు నెట్టింట దర్శనమిచ్చాయి. అయితే వీటిలో ప్రభాస్ ఉన్నాడో, లేడో అన్నది స్పష్టంగా తెలియరాలేదు. తాజాగా ప్రభాస్ సోదరి, కృష్ణంరాజు-శ్యామల కుమార్తె ప్రసీద ఈ కారులో షికార్లు కొట్టింది. దీని తాలూకు వీడియోను స్వయంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామల సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ఇది కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రసీద ప్రస్తుతం అమెరికాలో ఫిల్మ్‌మేకింగ్ నేర్చుకుంటోంది. మరోవైపు 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' జూలై 30న రిలీజ్ అవుతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్లో చేస్తున్న 'ఆదిపురుష్' వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న సలార్ వచ్చే ఏడాది ఏప్రిల్ 14న థియేటర్లలోకి రానుంది. చదవండి: లగ్జరీ కారులో ప్రభాస్ షికార్లు మహేశ్ ‘రామాయణం’.. సీతగా స్టార్ హీరోయిన్! -
లంబోర్గిని కారు కొన్న కుర్ర హీరో, ధర ఎంతంటే?
కరోనా సెకండ్ వేవ్ బాలీవుడ్‌ను చిగురుటాకులా వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు బీటౌన్ సెలబ్రిటీలు కరోనా బారిన పడిగా మరికొందరు ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుని బయటపడుతున్నారు. ఈ క్రమంలో మార్చి 22న యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 14 రోజుల క్వారంటైన్ తర్వాత అతడికి మళ్లీ పరీక్ష చేయగా నెగెటివ్ అని తేలింది. దీంతో తిరిగి సెట్స్‌లో అడుగు పెట్టనున్నాడీ కుర్ర హీరో. అయితే తనకు కరోనా పీడ విరగడైందని తెలిసిన తర్వాత ఈ హీరో ఏం చేశాడనుకుంటున్నారు? అదే సాయంత్రం ఓ కొత్త కారును తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అత్యంత ఖరీదైన లంబోర్గిని కారును కొనుగోలు చేసిన కార్తీక్ ముంబై వీధుల్లో సోమవారం దాన్ని నడుపుకుంటూ ఇంటికి తీసుకెళ్లాడు. దీని ధర ఇంచుమించు నాలుగున్నర కోట్ల రూపాయలుగా ఉందట. ఇక ఈ మధ్యే ప్రభాస్ ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే లంబోర్గిని అవెంటాడర్ ఎస్ రోడ్‌స్టర్ కారును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) ఇదిలా వుంటే కార్తీక్ ప్రస్తుతం 'భూల్ భులైయా 2' సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో కియారా అద్వాణీ, టబు, రాజ్‌పాల్ యాదవ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు 'ధమాకా', 'దోస్తానా 2' చిత్రాలు చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) చదవండి: హీరో కార్తీక్‌కు కరోనా..టెన్షన్లో కియారా అద్వానీ అభిమాని ఫోన్ లాక్కున్న అజిత్ లంబోర్గిని కారులో ప్రభాస్ షికారు -
జాతిరత్నాలు డైరెక్టర్‌కు కాస్ట్లీ లంబోర్గిని కారు!
నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో అనుదీప్ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘జాతి రత్నాలు’.థియేటర్లోకి అడుగు పెట్టిన ప్రేక్షకులు సినిమా చూస్తున్నంతసేపు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. నిర్మాతలకు కాసుల పంట కురిపించింది. దీంతో డైరెక్టర్ అనుదీప్‌కు స్వప్నా సినిమా బ్యానర్ అదిరిపోయే గిప్ట్ ఇచ్చింది. ప్రొడ్యూసర్స్ స్వప్న దత్, ప్రియాంక దత్‌లు కాస్ట్లీ లంబోర్గిని కారును బహుమతిగా ఇచ్చారు. అయితే ఇది నిజమైన కారు కాదు..లంబోర్గిని మోడల్లోని ఓ బొమ్మకారును అనుదీప్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నా పంచులతో అందరినీ అందరినీ ఫూల్స్ చేస్తుంటే..వీళ్లు బొమ్మ కారిచ్చి నన్నే ఫూల్‌ని చేస్తున్నారు అంటూ అనుదీప్ చెబుతున్నట్లు కొన్ని మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే అనుదీప్ తన పంచులు, కౌంటర్లతో హీరోకు సమానంగా పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Arey Entra Edi 😂 (@na_page_ni_rechagotaku) చదవండి: బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన జాతిరత్నాలు! 'ఆస్కార్' బరిలో జాతిరత్నాలు! -
కొత్త లగ్జరీ కారులో షికారుకెళ్లిన ప్రభాస్
బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్ హీరో ప్రభాస్ రేంజ్ అమాంతం ఎదిగిపోయింది. 'సాహో' సినిమాతో ఆయన హిందీ మార్కెట్ పరిధి విస్తరించింది. తెలుగులో ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ హిందీలో మాత్రం కాసులు కురిపించింది. సౌత్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఈ హీరో అన్ని భాషల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు పాన్ ఇండియా రూటును ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఆదిపురుష్, రాధేశ్యామ్, సలార్‌తో పాటు నాగ్ అశ్విన్‌తో మరో సినిమా చేస్తున్నాడు. ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ముఖ్యంగా వీటి హెవీ షూటింగ్ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ ముంబైలో ఓ ఇల్లు కొనుక్కునే వేటలో పడ్డాడని ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే అదెంతవరకు వచ్చిందనేది ఇంకా తెలియరాలేదు. కానీ, తాజాగా ఈ హీరో ఓ ఖరీదైన కారును సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. లంబోర్గిని అవెంటాడర్ ఎస్ రోడ్‌స్టర్ కారును ప్రభాస్ కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. నేడే(ఆదివారం) ఈ కారు హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇద దీని ధర సుమారు ఏడు కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా ప్రభాస్‌కు ఇప్పటికే బీఎమ్‌డబ్ల్యూ 520D, ఇన్నోవా క్రిస్టా, జగువార్ ఎక్స్‌జేఎల్, రేంజ్ రోవర్ వోగ్, రోల్స్ రాయ్స్ గోస్ట్ కార్లు ఉన్నట్లు సమాచారం. తాజాగా ఈ జాబితాలో లంబోర్గిని కారు వచ్చి చేరింది. కొత్త కారు కొన్న ప్రభాస్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: ఆదిపురుష్: తగ్గేది లేదంటున్న బాలీవుడ్ భామ షారుఖ్‌తో సినిమా.. ముంబైలో ఆఫీస్ వెతుకుతున్న డైరెక్టర్ -
ఏపీలో ‘లంబోర్గిని’
సాక్షి, అమరావతి: ప్రఖ్యాత స్పోర్ట్స్ వెహికల్ బ్రాండ్ లంబోర్గిని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. గోల్ఫ్, ఆతిథ్య రంగాల్లో వినియోగించే ప్రీమియం బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాల (బ్యాటరీతో నడిచే కార్లు) తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి పుణెకు చెందిన కైనటిక్ గ్రీన్ సంస్థ ప్రతిపాదనలు పంపింది. దేశంలో లంబోర్గిని బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసి విక్రయించేందుకు గాను కైనటిక్ గ్రీన్ సంస్థతో 2018లో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో సుమారు రూ.1,750 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్, బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు, చార్జింగ్ స్వాపింగ్, ఆర్ అండ్ డీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి కైనటిక్ గ్రీన్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కైనటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఫౌండర్ సీఈవో సులజ్జా ఫిరోడియా మొత్వాని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి లేఖ రాశారు. ఆ సంస్థ పోర్టు ఆధారిత సెజ్ ప్రాంతంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. లంబోర్గిని వాహనాలతో పాటు కైనటిక్ గ్రీన్ బ్రాండ్ పేరుతో ద్వి, త్రిచక్ర వాహనాలను స్థానిక అవసరాలకు తోడు ఎగుమతి చేసే విధంగా యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే పదేళ్లలో కేవలం రాష్ట్రంలోనే 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయిస్తామని, దీనివల్ల 2,30,00,000 మెట్రిక్ టన్నుల కాలుష్య ఉద్గారాలు తగ్గుతాయన్నారు. ఇది 147.34 కోట్ల చెట్లను పెంచడానికి సమానమని ఆ ప్రతిపాదనల్లో పేర్కొంది. భారీ మెగా ప్రాజెక్టుగా దీన్ని పరిగణించి దానికి అనుగుణంగా రాయితీలు ఇవ్వాల్సిందిగా కోరింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఆర్ అండ్ డీలో అభివృద్ధి చేసిన టెక్నాలజీ వాణిజ్యపరంగా వినియోగిస్తే దానిపై ఒక శాతం రాయల్టీ చెల్లించడానికి కంపెనీ ప్రతిపాదించింది. -
కారు కొనేందుకు కారేసుకెళ్లిన బుడ్డోడు
కాలిఫోర్నియా: అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో పిల్లలు అలుగుతుంటారు.. అది సహజం. అయితే ఓ ఐదేళ్ల బుడ్డోడు మాత్రం అలిగి బుంగమూతి పెట్టుకుని కూర్చోలేదు. తను కోరింది దక్కాల్సిందేనన్న మంకుపట్టుతో చెప్పాపెట్టకుండా కారేసుకుని వెళ్లిపోయాడు. హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఆ బుడతడు డ్రైవింగ్ చేయడం చూసి ఖంగు తిన్నారు. ఈ ఆశ్చర్యకర ఘటన సోమవారం అమెరికాలోని ఉటావాలో జరిగింది. ఓ బాలుడు తన తల్లిని ఖరీదైన లంబోర్గిని కారు కొనివ్వమని అడిగాడు. అందుకు అతని తల్లి నిరాకరించింది. (సైకిల్‌పై వచ్చి చిన్నారిని ఈడ్చుకెళ్లిన కోతి) దీంతో స్వయంగా అతనే వెళ్లి తెచ్చుకోవాలని భావించిన పిల్లవాడు మూడు డాలర్లు వెంట పెట్టుకుని ఇంట్లో మాటైనా చెప్పకుండా తన పేరెంట్స్ ఎస్యూవీ కారు తీసుకుని కాలిఫోర్నియాకు బయలు దేరాడు. మార్గమధ్యంలో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు. నీకు ఐదేళ్లే కదా? ఇంత చిన్న వయసులో డ్రైవింగ్ ఎక్కడ నేర్చుకున్నావ్? అంటూ ప్రశ్నలు కురిపించారు. అదృష్టవశాత్తూ అతని డ్రైవింగ్‌లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. సుమారు నాలుగైదు కిలోమీటర్ల వరకు అతను కారు నడిపాడని తెలిపారు. తర్వాత అతడిని మందలించి తల్లిదండ్రులకు అప్పగించారు. (డిస్ట్రబ్ చేసింది.. స్టార్ అయ్యింది) -
లంబార్గిని సూపర్ స్పోర్ట్స్ కారు లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : ఇటలీకి చెందిన సూపర్ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లంబార్గిని అతి ఖరీదైన కారును భారతీయ మార్కెట్లో గురువారం లాంచ్ చేసింది. హరికేన్ ఎవో పేరుతో లాంచ్ చేసిన ఈ కారుకు రూ .3.73 కోట్లు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరగా నిర్ణయించింది. 2018 ఏడాదికి సూపర్ లగ్జరీ కార్ సెగ్మెంట్లో భారత్ తామే లీడర్స్‌గా ఉన్నామనీ, ఈ ఏడాదిలో కూడా తమ స్థానాన్ని మరింత పటిష్టపరుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని లంబార్గిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ వెల్లడించారు. 5.2 లీటర్ ఇంజిన్, వీ10 పవర్, మల్టీ పాయింట్ ఇంజెక్షన్ + డీఎస్ఐ డీజిల్ గరిష్ట టార్క్ 640, సెవెన్ స్పీడ్ డ్యుయల్ క్లచ్ గేర్ బాక్స్, రియర్ వీల్ డ్రైవ్ సిస్టం, రియర్ మెకానికల్ సెల్ఫ్ లాకింగ్ ఫీచర్లతోపాటు కొత్తగా అడ్వాన్స్డ్ న్యూ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టంను జోడించింది. కాగా గత సంవత్సరం భారతదేశంలో 45 యూనిట్లు విక్రయించగా, 2017 లో 26 యూనిట్లు విక్రయించింది. ప్రపంచవ్యాప్తంగా లంబార్గిని గత సంవత్సరం 5,750 యూనిట్లు విక్రయించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 2017 లో 1,000 యూనిట్ల నుంచి 1,301 యూనిట్లను సేల్ చేసింది. -
భారత్‌లోకి లంబోర్గిని ‘ఉరుస్’
ముంబై: ఇటలీకి చెందిన సూపర్ స్పోర్ట్స్ కార్ల తయారీ కంపెనీ ‘లంబోర్గిని’ తాజాగా తన తొలి సూపర్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ ‘ఉరుస్’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.3 కోట్లు. కంపెనీ విక్రయాల్లో ఇండియా కీలకపాత్ర పోషిస్తోందని, తాజా మోడల్ ఆవిష్కరణతో అమ్మకాలు 2.5– 3 రెట్లు పెరగొచ్చని సంస్థ జనరల్ మేనేజర్ (ఆసియా–పసిఫిక్) ఆండ్రియా బల్ది తెలిపారు. ‘ఉరుస్ మాకు అతిముఖ్యమైన ప్రొడక్ట్. ఇది ఇండియాలో కంపెనీకి కొత్త కస్టమర్లను తీసుకురానుంది’ అని లంబోర్గిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ పేర్కొన్నారు. -
వరల్డ్ ఫాస్టెస్ట్ ఎస్యూవీ భారత్‌లో లాంచ్
ఎంతో కాలంగా వేచిచూస్తున్న ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎస్యూవీ భారత్‌లో లాంచ్ అయింది. ఊరుస్ పేరుతో ఈ ఎస్‌యూవీని ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని విడుదల చేసింది. దీని ధర ఎక్స్‌షోరూం, భారత్‌లో రూ.3 కోట్లగా నిర్ణయించింది. కంపెనీ చరిత్రలో ఇది రెండో ఎస్యూవీ కావడం విశేషం. ఎల్ఎం002 తర్వాత కంపెనీ ఉత్పత్తి చేసిన ఎస్యూవీ ఇదే. కొన్ని నెలల క్రితమే ఈ కారును గ్లోబల్‌గా లంబోర్ఘిని లాంచ్ చేసింది. ఈ లాంచింగ్‌తో భారత్ పోర్ట్‌ఫోలియోలో ఆవెంటోర్, హురాకాన్ వంటి సూపర్‌కార్ల సరసన ఇది కూడా వచ్చి చేరింది. 3500 వాహనాల వార్షిక ఉత్పత్తితో, ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల్లో మంచి వాల్యుమ్ను ఊరుస్ అందిస్తుందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టెఫానో డొమెనికల్ అన్నారు. భవిష్యత్తు వృద్ధిలో భారత్ కూడా ఓవ్యూహాత్మకమైన మార్కెట్ అని లంబోర్ఘిని ఇండియా అధినేత శరద్ అగర్వాల్ చెప్పారు. ప్రపంచంలోని తొలి కొన్ని మార్కెట్లలో భారత్ కూడా ఒకటని పేర్కొన్నారు. ఇది కేవలం ప్రాక్టికల్ ఎస్యూవీ మాత్రమే కాదని, మెరుగైన ప్రదర్శనను ఇది కనబర్చనున్నట్టు లంబోర్ఘిని చెప్పింది. ఊరుస్ 4 లీటర్ ట్విన్-టర్బో వీ8 ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది అత్యధికంగా 650 హెచ్‌పీ, 850ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 3.6 సెకన్లలో 0 నుంచి 100 కేఎంపీహెచ్‌ను, 12.8 సెకన్లలో 200 కేఎంపీహెచ్‌ను చేరుకోగలదు. ఊరుస్ టాప్ స్పీడ్ 305 కేఎంపీహెచ్. దీని వీ8 ఇంజిన్ 8 స్పీడ్ టర్క్ కన్వర్టర్‌తో కలిసి రూపొందింది. ఈ ఇంజిన్ దాని విభాగంలో అత్యంత శక్తివంతమైనది, ఉరూస్‌ని దాని విభాగంలో అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీగా చేస్తుందని తెలుస్తోంది. కేవలం ఊరుస్ కోసమే స్పెషల్ టైర్లను లంబోర్ఘిని అభివృద్ధి చేసింది. -
లంబోర్గిని లగ్జరీ స్మార్ట్‌ఫోన్, ధరవింటే షాక్
ఇటాలియన్ లగ్జరీ కారు తయారీదారు లంబోర్గిని గ్లోబల్‌గా మొబైల్ మార్కెట్లోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి వచ్చేసింది. ఓ కొత్త సూపర్ లగ్జరీ స్మార్ట్‌ఫోన్‌ను లంబోర్గిని లాంచ్ చేసింది. ఆల్ఫా-వన్ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర సుమారు 1.57 లక్షల రూపాయలు. ఈ ధరల్లోనే వ్యాట్ ఛార్జీలు కూడా కలిసి ఉన్నాయి. అదనపు కస్టమ్స్ పన్నులను ఇక కొనుగోలుదారులే భరించాల్సి ఉంటుంది. లంబోర్గిని తన సూపర్ కార్లలో వాడే డెంట్ రెసిస్టెంట్ లిక్విడ్ అలోయ్‌తో ఆల్ఫా-వన్ను రూపొందించింది. టైటానియం కంటే అలోయ్ ఎక్కువ మన్నికమైంది. ఆల్ఫా వన్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు... క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్ 5.5 అంగుళాల 2కే అమోలెడ్ డిస్ప్లే 2560x1440 పిక్సెల్ రెజుల్యూషన్ 20మెగాపిక్సెల్ వెనుక కెమెరా 8మెగాపిక్సెల్ ముందు కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ యూకే, యూఏఈలలో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చినట్టు అంతర్గత రిపోర్టులు చెబుతున్నాయి. ఈ ఫోన్‌ను ఆన్లైన్లో విక్రయించనున్నారు. దుబాయ్, లండన్ మాల్స్‌లో లగ్జరీ బొటిక్స్ బ్రాండ్స్ వద్ద కూడా ఇది లభించనుంది. ఈ ఫోన్‌తో పాటు ఇటాలియన్ లెదర్ స్లీవ్ ఫోన్ కేసు కూడా కొనుగోలుదారులకు వస్తుంది. -
ఈ కారు ధర రూ.3.45 కోట్లు
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబార్గిని మరో లగ్జరీకార్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. లంబార్గిని హరికేన్ ఆర్డబ్ల్యుడీ స్పైడర్ పేరుతో దీన్ని లాంచ్ చేసింది. ఈ టాప్ వెర్షన్ కారు రూ 3.45 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) గా ధరకు భారతదేశం లో ఇప్పుడు అందుబాటులో ఉంది. లంబార్గిని హరికేన్ ఆర్డబ్ల్యుడీ కుపేను పోలిన ఫీచర్స్ తోనే దీన్ని లాంచ్ చేసింది. 5.2 లీటర్ ఇంజిన్, వీ10 పవర్, మల్టీ పాయింట్ ఇంజెక్షన్ + డీఎస్ఐ డీజిల్ గరిష్ట టార్క్ 540, సెవెన్ స్పీడ్ డ్యుయల్ క్లచ్ గేర్ బాక్స్, రియర్ వీల్ డ్రైవ్ సిస్టం, రియర్ మెకానికల్ సెల్ఫ్ లాకింగ్ , 319 కిలోమీటర్ల వేగంతో కేవలం 3.6 సెకన్లలో0-100కి.మీ. 10.4 సెకన్లలో 0-200కి.వేగాన్ని అందుకోగలదు. 2620ఎంఎం వీల్ బేస్ తో లీటరుకు 12.1కి.మీ ఇంధన సామర్ధ్యంతో ఇది అందుబాటులోకి వచ్చింది. భారత్ లో ఇది ఫెరారి ఎఫ్ ఎఫ్, బీఎండబ్ల్యు ఐ 8, ఆడి ఆర్ 8లకు గట్టి పోటీ ఇవ్వనుంది. కాగా భారతలో తమ నెట్వర్క్ విస్తరణకు భారీగా శ్రద్ధ పెడుతున్న లంబార్గిని కంపెనీ ప్రస్తుతం ఇండియాలో 3-6 కోట్ల రూపాయల విలువైన కార్లను అమ్ముతోంది. కంపెనీకి ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో షోరూమ్‌లున్నాయి. -
ఖరీదైన కార్లలో సమాజ్‌వాదీ నేతలు
-
లంబోర్గిని హరకేన్ స్పైడర్@ రూ. 3.89 కోట్లు
గరిష్ట వేగం గంటకు 324 కి.మీ. కారు ప్రత్యేకతలు...: ఈ కారు సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని 3.4 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 324 కి.మీ. అని కంపెనీ పేర్కొంది. రిట్రాక్టబుల్ రూఫ్, డబ్ల్యూ షేప్‌లో ఉండే ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, 7 స్పీడ్ ఎల్డీఎఫ్ డ్యుయల్క్లచ్ ట్రాన్స్మిషన్ వంటి ప్రత్యేకతలున్నాయని తెలిపింది. ముంబై: ఇటలీ స్పోర్ట్స్ కార్ల కంపెనీ లంబోర్గిని కొత్త హరకేన్ ఎల్పీ 610-4 స్పైడర్ కారును భారత మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధర రూ.3.89 కోట్లు(ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) అని కంపెనీ పేర్కొంది. తమ ఓపెన్ టాప్ మోడల్ విభాగంలో గెల్లార్డో స్పైడర్ మంచి అమ్మకాలు సాధించిందని, ఈ కారు స్థానాన్ని కొత్తగా తెస్తున్న ఈ హరకేన్ స్పైడర్ భర్తీ చేస్తుందని లంబొర్గిని ఆగ్నేయాసియా హెడ్ సెబాస్టియన్ హెన్రి చెప్పారు. తమకు వ్యూహాత్మకమైన కీలక మార్కెట్లలో ఒకటని పేర్కొన్నారు. పెర్ఫామెన్స్ డ్రైవింగ్, సౌకర్యం, టెక్నాలజీ కోరుకునే వినియోగదారుల లక్ష్యంగా ఈ కొత్త స్పోర్ట్స్ కారును అందుబాటులోకి తెస్తున్నామని లంబోర్గిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ చెప్పారు. -
ఇక లంబొర్గిని లగ్జరీ ట్రాక్టర్లు
పుణే: ఇటలీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ లంబొర్గిని బ్రాండ్ లగ్జరీ కార్లనే కాకుండా అదే బ్రాండ్ కింద లగ్జరీ ట్రాక్టర్లను అందిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌కే చెందిన వ్యవసాయ సంబంధిత పరికరాలు తయారు చేసే సేమ్ డజ్-ఫహర్(ఎస్డీఎఫ్) ప్రీమియం ట్రాక్టర్లను గురువారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. లంబొర్గని బ్రాండ్ కింద ఈ ప్రీమియం ట్రాక్టర్లను అందిస్తున్నామని ఎస్డీఎఫ్ ఇండియా ఎండీ, సీఈవో భాను శర్మ చెప్పారు. ధర రూ. 12 లక్షల రేంజ్లో ఉండొచ్చని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ప్రారంభంలో 30 హెచ్‌పీ ట్రాక్టర్లను అందిస్తామని, ఆ తర్వాత 70-80 హెచ్‌పీ ట్రాక్టర్లను అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఈ 30 హెచ్‌పీ ట్రాక్టర్లను యూరప్ ప్లాంట్ల నుంచి దిగుమతి చేసుకొని భారత్‌లో విక్రయిస్తామని పేర్కొన్నారు. ఈ ట్రాక్టర్లు కేవలం పొలం పనులకే కాకుండా, రిసార్టులు, స్టేడియమ్ల్లో కూడా వివిధ పనులకు వాడుకోవచ్చని వివరించారు. -
లగ్జరీ కార్... టాప్‌గేర్!
న్యూఢిల్లీ: మందగమనంతో వాహనాల అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కోట్ల ఖరీదు చేసే సూపర్ లగ్జరీ కార్ల జోరు మాత్రం తగ్గలేదు. పెపైచ్చు లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు మరిన్ని కొత్త మోడల్స్‌ని ప్రవేశపెట్టడానికి ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. ఆర్థిక సర్వీసుల సంస్థ సీఎల్ఎస్ఏ ఇటీవలి నివేదిక ప్రకారం భారత్‌లో కోటీశ్వరుల సంఖ్య 2015 నాటికి రెట్టింపై 4,03,000కి పెరుగుతుందని అంచనా. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనా కన్నా కూడా అత్యధిక సంఖ్యలో అత్యంత సంపన్నులు భారత్‌లోనే ఉండనున్నారు. ఇలాంటి గణాంకాలతో అత్యంత ఖరీదైన కార్ల కంపెనీలు భారత్‌పై మరింతగా దృష్టి పెడుతున్నాయి. అంతర్జాతీయ దిగ్గజాలు ఇప్పటిదాకా ఏటా రెండో, మూడో సూపర్ లగ్జరీ కార్ల కొత్త మోడల్స్ భారత్‌లో ఆవిష్కరించేవి. కానీ, ఈ ఏడాది మాత్రం ఏకంగా ఆరు మోడల్స్‌ని ఆవిష్కరిస్తున్నాయి. ఇటలీకి చెందిన సూపర్ స్పోర్ట్స్‌కారు బ్రాండ్ లంబోర్గిని, బ్రిటిష్‌కి చెందిన బెంట్లీ.. ఆస్టన్ మార్టిన్, నెదర్లాండ్స్ కంపెనీ స్పైకర్ వంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్, గలార్డో ఎల్పీ550-2 లిమిటెడ్ ఎడిషన్లను, రోల్స్ రాయిస్ రెయిత్లను ప్రవేశపెట్టాయి. వీటి ధర రూ. 3.5 కోట్ల పైమాటే. రూ.37 కోట్ల దాకా రేట్లు.. సాధారణంగా భారత్‌లో లగ్జరీ సెగ్మెంట్ కార్లు మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, పోర్షే, జాగ్వార్ అండ్ ల్యాండ్‌రోవర్ వంటి బ్రాండ్లతో మొదలవుతుంటాయి. ఈ కార్ల ధరలు (ప్రీమియం మోడల్స్ మినహా) సుమారు రూ. 1 కోటి లోపే ఉంటున్నాయి. అయితే, కొన్నాళ్లుగా వీటిని మించిన సూపర్ లగ్జరీ బ్రాండ్లకు గిరాకీ పెరుగుతోంది. 20 అడుగుల పొడవు మొదలు రెండు డోర్ల సూపర్ ఫాస్ట్ కార్ల దాకా వీటిలో ఉంటున్నాయి. బుగాటి, కీనిగ్సెగ్, ఫెరారీ, పగాణీ, మాసెరాటి వంటి బ్రాండ్లు ఈ సెగ్మెంట్లో ఉంటున్నాయి. మిగతా బ్రాండ్లు వేలల్లో అమ్మితే ఇవి రెండంకెల స్థాయిలో అమ్ముడవుతున్నా కంపెనీలకు ఆదాయం భారీగానే ఉంటోంది. దిగుమతి సుంకాలు పెరగడం, రూపాయి పతనం తదితర కారణాలతో సూపర్ లగ్జరీ కార్ల రేట్లు భారీగా పెరుగుతున్నప్పటికీ .. క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, బాలీవుడ్ స్టార్స్, ఇతర రాజకీయ నాయకులు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. వీరు కొనే కార్ల ధరలు సుమారు రూ. 1 కోటి నుంచి రూ. 7 కోట్ల దాకా ఉంటున్నాయి. అదే, ఆస్టన్ మార్టిన్ వన్77, బుగాటి వేరాన్ వంటి మోడల్స్ ధరలు ఏకంగా రూ. 20 కోట్లు నుంచి రూ. 37 కోట్ల దాకా ఉన్నాయి. దేశీయంగా ఇవి అత్యంత ఖరీదైనవి. అమ్మకాల్లో 25% దాకా వృద్ధి..: సూపర్ లగ్జరీ కార్లు దేశీయంగా ఏటా 20-25% వృద్ధితో 300-400 మేర అమ్ముడవుతున్నాయని అంచనా. సగటున ఒక్కో కారు ఖరీదు రూ. 3.5 కోట్లు లెక్కగడితే..ఈ మార్కెట్ విలువ రూ. 1,500 కోట్లు. లంబోర్గిని గతేడాది 17 కార్లు విక్రయించింది. ఇప్పుడున్న జోరును బట్టి చూస్తే తాము నిర్దేశించుకున్నట్లుగా 2015 నాటికన్నా ముందుగానే 50 సూపర్ కార్ల అమ్మకాల లక్ష్యాన్ని సాధించేయగలమనేది కంపెనీ వర్గాల ధీమా. ఇక ఆస్టన్ మార్టిన్ గతేడాది 20 కార్లను విక్రయించగా.. ఈ ఏడాది ఇప్పటికే ఆ సంఖ్యను దాటేసింది. ఇదే ఊపులో కొత్తగా తీర్చిదిద్దిన డీబీఎస్ మోడల్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఆస్టన్ మార్టిన్ కార్ల రేట్లు సగటున రూ. 3 కోట్ల పైనే. వచ్చే నెల బెంట్లీ ఫ్లయింగ్ స్పర్.. బెంట్లీ మోటార్స్ త్వరలో ఫ్లయింగ్ స్పర్ కారును వచ్చే నెల ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. దాదాపు 17.3 అడుగుల పొడవుండే ఈ సెడాన్ కారు, గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. విలాసవంతమైన లెదర్ సీట్లు, మినీ రిఫ్రిజిరేటరు మొదలైన హంగులు ఇందులో ఉంటాయి. ఇక సూపర్ స్పోర్ట్స్ కార్లను తయారుచేసే స్పైకర్ కంపెనీ.. ఈ ఏడాది ఆఖరులో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ తమ కారు సీ8 ఐలెరాన్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. న్యూఢిల్లీలో ఇప్పటికే కొంతమంది డీలర్లను కూడా ఎంపిక చేసుకుంది. దీని ధర రూ. 1 కోటిపైనే ఉండనుంది.