ఈశ్వర్ సినిమాతో తెలుగు చలన చిత్ర సీమలో అడుగుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నటుడు 'ప్రభాస్' (Prabhas) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టి ఇప్పుడు ఆదిపురుష్ చిత్రంలో తెరకెక్కాడు. సుమారు రూ. 200 కోట్ల కంటే ఎక్కువ నికర ఆస్తులు కలిగిన ప్రభాస్ సినిమాల గురించి తెలిసిన చాలా మందికి అతడు ఎలాంటి కార్లను ఉపయోగిస్తాడనేది తెలిసి ఉండక పోవచ్చు. ఈ కథనంలో ప్రభాస్ ఉపయోగించే కార్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
లంబోర్ఘిని అవెంటడోర్
భారతదేశంలో లంబోర్ఘిని కంపెనీకి చెందిన అవెంటడోర్ కలిగి ఉన్న కొంతమందిలో ప్రభాస్ ఒకరు. ఈ కారు ధర రూ. 6 కోట్లు వరకు ఉంటుంది. ఇది లంబోర్ఘిని కంపెనీకి చెందిన అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్. ఇది 6.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి12 పెట్రోల్ ఇంజిన్ కలిగి 740 హార్స్ పవర్ 690 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో సింగిల్ క్లచ్ 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉండటం వల్ల అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్
ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఒకటి. ఈ కారు ప్రభాస్ గ్యారేజిలో కూడా ఉంది. 2016లో బ్లాక్ కలర్ ఫోర్త్ జనరేషన్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కొనుగోలు చేశారు. ఈ SUV లో 4.4 లీటర్ డీజిల్ వి8 ఇంజిన్ కలిగి 340 పీఎస్ పవర్, 740 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
రోల్స్ రాయిస్ ఫాంటమ్
ప్రభాస్ ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన లగ్జరీ కారుగా ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన 'ఫాంటమ్' కారుని కూడా కలిగి ఉన్నారు. ఈ కారు ధర సుమారు రూ. 8 కోట్ల కంటే ఎక్కువ. ప్రభాస్ గ్యారేజిలో ఉన్న అత్యంత ఖరీదైన కారు కూడా ఇదే. దీనిని 2013లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ లగ్జరీ కారు 6.75 లీటర్ వి12 ఇంజిన్ కలిగి 460 పీఎస్ పవర్, 720 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.
(ఇదీ చదవండి: ప్రపంచంలో ఇదే బెస్ట్ ఎయిర్ లైన్! భారత్ ఎక్కడుందంటే?)
జాగ్వార్ ఎక్స్‌జే
భారతీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరించే జాగ్వార్ ఎక్స్‌జే ప్రభాస్ కార్ల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 1 కోటి కంటే ఎక్కువ ఉంటుంది. సిల్వర్ కలర్ ఆప్షన్లో కనిపించే ఈ కారుని 2012లో కొనుగోలు చేశారు. ఇది 3.0-లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వి6 డీజిల్ ఇంజిన్ కలిగి 275 పీఎస్ పవర్ 600 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ -స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
(ఇదీ చదవండి: హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!)
బీఎండబ్ల్యూ ఎక్స్3
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన బ్లాక్ కలర్ ఎక్స్3 మోడల్ కారుని 2018లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కారుని ప్రభాస్ చాలా అరుదుగా వినియోగిస్తారని తెలుస్తోంది. నిజానికి బీఎండబ్ల్యూ ఎక్స్3 మూడు వేరియంట్లలో లభిస్తుంది. కావున ప్రభాస్ ఇందులో ఏ వేరియంట్ కొన్నారనేది స్పష్టంగా తెలియదు. ఇది డీజిల్ ఇంజిన్ కలిగి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుందని తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment