Rolls Royce
-
రూ.8.95 కోట్ల కొత్త రోల్స్ రాయిస్ కారు ఇదే.. చూశారా?
రోల్స్ రాయిస్ (Rolls Royce) కంపెనీ.. ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఘోస్ట్ సిరీస్ II' (Ghost Series II)ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ కొత్త వెర్షన్ దాని మునుపటి మోడల్లో అందుబాటులో లేని కొత్త ఇంటీరియర్ ఫినిషింగ్‌లు, ఫీచర్లను పొందిందని సంస్థ వెల్లడించింది.రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్‌లో.. మూడు వెర్షన్స్ ఉన్నాయి. అవి ఘోస్ట్ సిరీస్ II, ఘోస్ట్ ఎక్స్టెండెడ్ సిరీస్ II, బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ సిరీస్ II. వీటి ధరలు వరుసగా రూ. 8.95 కోట్లు, 10.19 కోట్లు,10.52 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు కోసం చెన్నై, న్యూఢిల్లీ షోరూమ్‌లలో బుక్ చేసుకోవచ్చు.రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II కారు 6.75 లీటర్, ట్విన్ టర్బోచార్జ్డ్ వీ12 ఇంజిన్‌ను పొందుతుంది, ఇది వరుసగా 600 హార్స్ పవర్, 900 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా అత్యద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.ఘోస్ట్ సిరీస్ II మెరుగైన రైడ్ స్టెబిలిటీ కోసం ప్లానార్ సస్పెన్షన్ సిస్టమ్, రోడ్డు పరిస్థితికి అనుగుణంగా సస్పెన్షన్లను అడ్జెస్ట్ చేయడానికి కెమెరాల సహాయంతో ఫ్లాగ్ బేరర్ సిస్టమ్ వంటి టెక్నాలజీ అప్గ్రేడ్లను పొందుతుంది. ఇది మెరుగైన ఆడియో సిస్టమ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, వీడియో స్ట్రీమింగ్ ఫంక్షన్లను కూడా పొందుతుంది. -
అంబానీ కొత్త కారు.. తొలి బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయిస్!
ఆసియాలోనే అపర కుబేరుడు ముఖేష్ అంబానీ (Mukesh Ambani). అత్యంత సంపన్నులుగా ఐశ్వర్యానికి, హోదాకు పేరుగాంచిన అంబానీ కుటుంబం (Ambani family) దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ కార్ల సేకరణను కూడా కలిగి ఉంది. జియో గ్యారేజ్‌లో ఉన కార్ల ఖచ్చితమైన లెక్క తెలియదు కానీ దేశంలోనే అత్యధిక సంఖ్యలో రోల్స్-రాయిస్ కల్లినన్ ఎస్‌యూవీలు (Rolls-Royce Cullinan) వీరి వద్దే ఉన్నాయి. ఇలాంటి కార్లు వీరి వద్ద కనీసం పది ఉంటాయని చెబుతారు. ఇప్పుడు మరో కొత్త రోల్స్ రాయిస్ కారు చేరింది. ఇది సాధారణ కుల్లినన్ కారు కాదు. ఇది భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయిస్ కల్లినన్.జియో గ్యారేజ్‌కి ప్రత్యేక అతిథిఅంబానీ ఫ్యామిలీ కొత్త కారు అంటూ ఈ ప్రత్యేకమైన రోల్స్ రాయిస్ కల్లినన్ ఫొటోలు ఆన్లైన్లో కనిపించాయి. ఆటోమొబిలి ఆర్డెంట్ ఇండియా వారి ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఇవి షేర్ అయ్యాయి. బుల్లెట్‌ఫ్రూఫింగ్ కార్లలో ప్రత్యేకత కలిగిన చండీగఢ్ వర్క్‌షాప్‌లో అద్భుతమైన సిల్వర్ ఎస్యూవీ కనిపించింది. ‘తమ వద్ద ఉన్న కుల్లినన్లతోపాటు అంబానీ కుటుంబం బుల్లెట్‌ప్రూఫ్‌ను కలిగి ఉండాల్సిన సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నారు. అంబానీ ఫ్లీట్ నుండి అందమైన సిల్వర్ రోల్స్ రాయిస్ కల్లినన్ ఇదే’ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.ఫొటోల్లో కల్లినన్ సిరీస్ I మోడల్‌గా కనిపిస్తోంది. ఇది ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ కార్ల కలెక్షన్లో భాగమై ఉండవచ్చు. దాన్నే బుల్లెట్‌ప్రూఫ్ చేయిస్తుండవచ్చు. ముఖేష్ అంబానీ సాధారణంగా భారీ భద్రత కలిగిన మెర్సిడెస్ బెంజ్ ఎస్ 680 (Mercedes-Benz S 680) గార్డ్ సెడాన్లలో ప్రయాణిస్తూ కనిపిస్తారు. అయితే భారతదేశంలో ఎస్‌యూవీలకు పెరుగుతున్న ప్రాధాన్యత కారణంగా బుల్లెట్ ప్రూఫ్ కల్లినన్ తమ అవసరాలకు బాగా సరిపోతుందని కుటుంబం భావించి ఉండవచ్చు.అల్ట్రా లగ్జరీ ఎస్యూవీరోల్స్ రాయిస్ కల్లినన్ అత్యంత లగ్జరీ కారు. 6.75-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V12 ఇంజన్ 563 Bhp, 850 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. విస్తృతమైన కస్టమైజేషన్ ఆప్షన్స్‌కు ఇది ప్రసిద్ధి చెందింది. బెస్పోక్ ఫీచర్ల ఆధారంగా కుల్లినన్ ధర ఉంటుంది. ఇప్పుడు ఆర్మ్డ్ బాడీవర్క్ కోసం వర్క్‌షాప్‌కు పంపిన నేపథ్యంలో దీని తుది ధరను అంచనా వేయడం సవాలుగా మారింది.అంబానీ రోల్స్ రాయిస్ కలెక్షన్రాయిస్ కలెక్షన్ కల్లినన్ కార్లతో అంబానీ ఫ్యామిలీ అనుబంధం 2019 నాటిది. భారతదేశంలో మొట్ట మొదటగా ఈ మోడల్‌ను కొనుగోలు చేసింది అంబానీ కుటుంబమే. రిచ్ బ్రౌన్ షేడ్ వాహనం మొదటి కల్లినన్ కాగా ఆ తర్వాత 2021లో ఆర్కిటిక్ వైట్ కలర్ కార్ వచ్చింది.మూడవ కల్లినన్‌ను వారి కుమార్తె ఇషా అంబానీ ఉపయోగించారు. దాదాపు రూ. 1 కోటి విలువైన టస్కాన్ సన్ కల్లినన్ కూడా ఈ కలెక్షన్లో ఉంది. దీపావళి సందర్భంగా నీతా అంబానీకి బహుమతిగా ఇచ్చిన ప్రీమియం మోడల్ బ్లాక్ బ్యాడ్జ్ కల్లినన్. పెబుల్ ప్యారడిసో బ్లాక్ బ్యాడ్జ్ కల్లినన్‌ను అనంత్ అంబానీ పెళ్లికి ముందు కొనుగోలు చేశారు. సిరీస్ II కల్లినన్ తాజాగా ఫ్లీట్‌లో చేరింది. వీటితో పాటు విదేశాల్లోనూ కులినన్ వాహనాలు అంబానీ ఫ్యామిలీకి ఉన్నాయి. -
రోల్స్‌రాయిస్‌కు రూ.90,200 కోట్ల కాంట్రాక్ట్
బ్రిటన్ జలాంతర్గాములకు ఎనర్జీ అందించే అణు రియాక్టర్ల రూపకల్పన, వాటి నిర్వహణ కాంట్రాక్ట్‌ను రోల్స్ రాయిస్ దక్కించుకుంది. 11 బిలియన్ డాలర్ల(సుమారు రూ.90,200 కోట్లు) ఈ ‘యూనిటీ’ కాంట్రాక్టు ఎనిమిదేళ్లపాటు చెల్లుబాటు అవుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం బ్రిటన్ రాయల్ నేవీ సామర్థ్యాన్ని పెంచుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఈ యూనిటీ ఒప్పందం గతంలో చేసుకున్న ఒప్పందాలను క్రమబద్ధీకరిస్తుందని అధికారులు తెలిపారు. కంపెనీ అందుకున్న కాంట్రాక్టు వల్ల లండన్‌లో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ నిధులు బ్రిటిష్ వ్యాపారం, ఉద్యోగాలు, జాతీయ భద్రతకు దీర్ఘకాలిక ప్రోత్సాహాన్ని అందిస్తాయని రక్షణ మంత్రి జాన్ హీలీ నొక్కి చెప్పారు. ఈ ఒప్పందం వల్ల కనీసం 1,000 నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు అవకాశాలు వస్తాయని, 4,000 మందికి పరోక్షంగా రక్షణ లభిస్తుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఇంగ్లాండ్‌లో డెర్బీలో రోల్స్ రాయిస్ న్యూక్లియర్ రియాక్టర్ ఉత్పత్తి కేంద్రాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి హీలీ సందర్శించారు.ఇదీ చదవండి: కాల్స్ కోసమే ప్రత్యేక ప్యాక్.. వాట్సప్‌కు ఊరటయూకే, యూఎస్, ఆస్ట్రేలియా మధ్య సైనిక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ ఒప్పందం సహకరిస్తుందని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. ఈ ఒప్పందంతో రక్షణ రంగంలో నూతన ఆవిష్కరణలతో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించబోతున్నట్లు రోల్స్ రాయిస్ పేర్కొంది. -
అంబానీ ఇంటికి కొత్త అతిథి.. ఇది చాలా స్పెషల్!
భారతీయ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) మరో విలాసవంతమైన ఎలక్ట్రిక్ కారును (Electric Car) కొనుగోలు చేశారు. ఇది అంబానీ బ్యారేజిలో చేరిన 'రోల్స్ రాయిస్' (Rolls Royce) బ్రాండ్ మొదటి ఎలక్ట్రిక్ వెహికల్. దీని ధర రూ. 7.5 కోట్లు (ఎక్స్ షోరూమ్).అంబానీ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు పేరు 'స్పెక్టర్' (Spectre). ఈ కారుకు MH 0001 అనే వీఐపీ నెంబర్ ప్లేట్ ఉంది. ఈ నెంబర్ ప్లేట్ కోసం కూడా వారు భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే ఎంత వెచ్చించారు అనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.అంబానీ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు కస్టమైజ్డ్ అని తెలుస్తోంది. కాబట్టి దీని ధర ఎక్స్ షోరూమ్ ధర కంటే ఎక్కువగానే ఉంటుంది. ఈ కారు 102 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది ఒక సింగిల్ ఛార్జితో ఏకంగా 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.ఇదీ చదవండి: ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్న బైకులు ఇవే!స్పెక్టర్ అనేది రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ కారును ఇప్పటికే మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', కేరళకు చెందిన ఒక బిల్డర్ కూడా కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.రోల్స్ రాయిస్ స్పెక్టర్ (Rolls Royce Spectre)రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన స్పెక్టర్ కారు ధర రూ. 7 కోట్ల కంటే ఎక్కువ. కాబట్టి దీనిని సామాన్య ప్రజలు కొనుగోలు చేయడం కష్టం. ఇప్పటి వరకు భారతదేశంలో ఈ కారును 10మంది కంటే తక్కువే.. దీనిని కొనుగోలు చేసినట్లు సమాచారాం. అయితే ఈ కారు చూడటానికి మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది.ఇదీ చదవండి: రూ.15 లక్షలుంటే చాలు.. ఇందులో ఓ కారు మీ సొంతం!అంబానీ గ్యారేజిలోని కార్లు (Mukesh Ambani Car Collection)భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ గ్యారేజిలో.. రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఈడబ్ల్యుబీ, మెర్సిడెస్ బెంజ్ ఎస్660 గార్డ్, మాట్ బ్లాక్ బీఎండబ్ల్యూ 760ఎల్ఐ, ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్, మెర్సిడెస్ ఏఎంజీ జీ63, టెస్లా మోడల్ ఎస్ 100డీ, రోల్స్ రాయిస్ కల్లినన్, మెర్సిడెస్ మేబ్యాక్ 62, ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్, ఆస్టన్ మార్టిన్ రాపిడ్, లంబోర్ఘిని ఉరుస్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే, ఆర్మర్డ్ బీఎండబ్ల్యూ 760 ఎల్ఐ, బెంట్లీ బెంటయ్గా, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ మొదలైనవి ఉన్నాయి. మొత్తం మీద అంబానీ గ్యారేజిలో సుమారు 170 కంటే ఎక్కువ కార్లు ఉన్నట్లు సమాచారం. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు: ధర రూ.250 కోట్ల కంటే ఎక్కువే! (ఫోటోలు)
-
రూ.12 కోట్ల విలువైన కారు కొన్న 'వినయ విధేయ రామ' నటుడు
బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ఖరీదైన కారు కొనుగోలు చేశారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్ కల్లినన్ బ్రాండ్ కారును సొంతం చేసుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి లగ్జరీ కారు డెలివరీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు.వివేక్ తన తల్లిదండ్రులు సురేశ్, యశోధర, భార్య ప్రియాంకతో కలిసి కొత్త కారులో ప్రయాణించారు. సిల్వర్ గ్రే కలర్ ఉన్న రోల్స్ రాయిస్ కుల్లినన్ కారు ధర మనదేశంలో దాదాపు రూ.12.25 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. వివేక్ ఒబెరాయ్ చివరిసారిగా 2019లో పీఎం నరేంద్ర మోదీ, ప్రైమ్ మినిస్టర్స్ బయోపిక్‌లో నటించారు.అంతేకాకుండా మలయాళం, కన్నడతో పాటు తెలుగు చిత్రాల్లోనూ కనిపించారు. తెలుగులో రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన రక్త చరిత్ర సినిమాలో నటించి తన నటనతో తెలుగు వారిని మెప్పించారు. రామ్ చరణ్ చిత్రం వినయ విధేయ రామలోనూ కీలక పాత్ర పోషించారు. సినిమాలతో పాటు ఇన్సైడ్ ఎడ్జ్, ధారవి బ్యాంక్, ఇండియన్ పోలీస్ ఫోర్స్ లాంటి వెబ్ సిరీస్‌లలో కూడా కనిపించాడు. విలన్‌గా, హీరోగా, సహా నటుడిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని విలక్షణ నుటుడిగా పేరు తెచ్చుకున్నారు వివేక్. హిందీ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి దాదాపు 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Vivek Oberoi (@vivekoberoi) -
భారత్‌లో రూ.10.50 కోట్ల రోల్స్ రాయిస్ కారు లాంచ్
ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను లాంచ్ చేసిన వాహన తయారీ సంస్థ 'రోల్స్ రాయిస్' (Rolls Royce) భారతీయ విఫణిలో 'కల్లినన్ ఫేస్‌లిఫ్ట్' లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.రోల్స్ రాయిస్ కల్లినన్ ఫేస్‌లిఫ్ట్ స్టాండర్డ్ వెర్షన్ ధర రూ. 10.50 కోట్లు కాగా.. బ్లాక్ బ్యాడ్జ్ ధర రూ. 12.25 కోట్లు (ఎక్స్ షోరూమ్). కంపెనీ లాంచ్ చేసిన ఈ ఎస్యూవీ డెలివరీలు 2024 డిసెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కారును కల్లినన్ సిరీస్ 2 అని కూడా పిలువవచ్చు.2024 రోల్స్ రాయిస్ కల్లినన్ ఫేస్‌లిఫ్ట్ కొత్త స్టైలింగ్, రివైజ్డ్ ఇంటీరియర్ మరియు అప్డేటెడ్ టెక్నాలజీ పొందుతుంది. ఇది ఎల్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, వెనుక భాగంలో స్టెయిన్లెస్-స్టీల్ స్కిడ్ ప్లేట్ వంటివి ఉన్నాయి. రీడిజైన్ గ్రిల్ ఇక్కడ చూడవచ్చు. ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ కూడా కొంత అప్డేట్ పొందాయి.ఇదీ చదవండి: రూ.209 కోట్ల 'రోల్స్ రాయిస్' కారు - వివరాలురోల్స్ రాయిస్ కల్లినన్ ఫేస్‌లిఫ్ట్ 6.75 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వీ12 ఇంజన్ స్టాండర్డ్ వేరియంట్ 571 హార్స్ పవర్, 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్ 600 హార్స్ పవర్, 900 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. -
రూ. 5తో ‘రోల్స్ రాయిస్’ క్వాలిటీ చెక్!
రోల్స్ రాయిస్... అత్యంత ఖరీదైన ఈ కారును కొనుగోలు చేయాలని కొందరు కోటీశ్వరులు తహతహలాడుతుంటారు. అలాగే రోల్స్ రాయిస్ కార్ల కంపెనీ ప్రతీ కారును సంబంధిత వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా సిద్ధం చేస్తుంది. ఒక్కో రోల్స్ రాయిస్ కారు తయారీకి సుమారు ఆరు నెలల సమయం పడుతుంది.దీనికిగల కారణం.. రోల్స్ రాయిస్ కారులోని కొన్ని భాగాలకు చేతితో పెయింటింగ్ చేసి, వాటిని అసెంబుల్ చేస్తారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నకారణంగానే ఈ కారు ధర కోట్లలో ఉంటుంది. అయితే రోల్స్ రాయిస్ కారు క్వాలిటీని కేవలం ఐదు రూపాయల నాణెంతో చెక్ చేయవచ్చంటున్నారు ప్రముఖ యూట్యూబర్, స్టాక్ మార్కెట్ నిపుణుడు పీ ఆర్ సుందర్. ఈ కారుకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలను ఆయన మీడియాతో పంచుకున్నారు.రోల్స్ రాయిస్ చాలా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుందని, వీటి గురించి తెలిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుందని ఆయన తెలిపారు. కారు ఇంజన్ ఆన్‌లో ఉన్నప్పుడు దానిపై ఐదు రూపాయల నాణెం ఉంచితే.. అది కదలి, కిందికు పడిపోదన్నారు. రోల్స్ రాయిస్ ఇంజన్ ఆన్‌లో ఉన్నప్పుడు కూడా దానిలో వైబ్రేషన్ రాదని సుందర్ తెలిపారు.రోల్స్ రాయిస్ కారును భారత్‌కు తీసుకురావాలంటే అధిక మొత్తంలో దిగుమతి పన్ను చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. భారతదేశంలో ఈ కారును నడపాలనుకుంటే, కారు కోసం ప్రత్యేకంగా పాస్‌పోర్ట్, వీసా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దుబాయ్‌లోని తన రోల్స్ రాయిస్‌ను భారత్‌కు తీసుకురావడానికి వీసా, పాస్‌పోర్ట్ పొందానని తెలిపారు. ఆరు నెలల తర్వాత తన కారును తిరిగి దుబాయ్‌కి తీసుకెళ్లాల్సి ఉంటుందని సుందర్ పేర్కొన్నారు. -
అపరకుబేరుడు ముఖేశ్ అంబానీ లగ్జరీ కార్లు
-
అంబానీ మరో ఖరీదైన కారు.. వీడియో వైరల్
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ వద్ద ఇప్పటికే ఖరీదైన అనేక అన్యదేశ్య కార్లు ఉన్నాయి. కాగా ఇటీవల మరో రోల్స్ రాయిస్ కారు వారు గ్యారేజిలో చేరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇప్పటికే ముకేశ్ అంబానీ గ్యారేజిలో ఎనిమిది రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు వీడియోలో కనిపించే రోల్స్ రాయిస్.. 9వ కారు అని తెలుస్తోంది. వీడియోలో మహీంద్రా స్కార్పియో, టయోటా ఫార్చ్యూనర్, మెర్సిడెస్ జీ63 ఏఎంజీ కార్లు కాన్వాయ్ ముందు భాగంలో ఉన్నాయి. ఆ తరువాత రోల్స్ రాయిస్ కారు రావడం గమనించవచ్చు.వీడియో రాత్రి సమయంలో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. కాబట్టి కారు ఏ కలర్ అనేది స్పష్టంగా తెలియడం లేదు. బహుశా ఇది వైట్ కలర్ అని తెలుస్తోంది. దీని ధర రూ. 10 కోట్లు కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. ముకేశ్ అంబానీ గ్యారేజిలో రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాకుండా ఇతర సూపర్ కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. -
రోల్స్ రాయిస్ కార్లతో వీధులు ఊడిపించిన భారతీయ రాజు!
రోల్స్ రాయిస్ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు నుంచే కార్లను ఉత్పత్తి చేసిన ప్రముఖ బ్రాండ్ ఇది. అందులో ఇరవై శాతం కార్లు భారత్‌కే దిగమతి అయ్యేవట. అంటే ఆనాడే మన భారతీయుల రాజులకు ఆ కార్లంటే ఎంత మోజు ఉండేదో క్లియర్‌గా తెలుస్తోంది. అలాంటి లగ్జరియస్ కార్లతో ఓ భారతీయరాజు నగరంలోని వీధులను ఊడిపించేందుకు ఉపయోగించాడట. అంత ఫేమస్ కార్లను ఇలా చెత్తను ఊడ్చేందుకు ఉపయోగించాడో వింటే ఆశ్చర్యపోతారు. అంతేగాదే ఏకంగా ఆ కంపెనీ ఏ దిగొచ్చి క్షమాపణలు చెప్పి ఆరు సరికొత్త కార్లను ఇచ్చిందట. ఏంటా కథ చూద్దామా..!ఆ భారతీయ రాజు పేరు రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన ప్రముఖ మహారాజు జైసింగ్. ఆయన వీటిని కొనాలని అనుకుంటే.. ఒకేసారి మూడు రోల్స్ రాయిస్‌లను కొనుగోలు చేసేవారట. ఆ క్రమంలోనే 1920 సంవత్సరంలో అల్వార్ మహారాజు జైసింగ్ లండన్‌లోని మేఫెయిర్ ఏరియా వీధుల్లో తిరుగుతున్నారు. ఒకసారి సాధారణ వస్త్రధారణలోనే రోల్స్ రాయిస్ షోరూమ్‌లోకి వెళ్లారు. అయితే అక్కడ ఉన్న ఓ బ్రిటీష్ సేల్స్ మాన్ మహారాజా జై సింగ్‌ను చూసి చూడనట్లు వ్యవహారించాడు. దీన్ని అవమానంగా భావించిన మహారాజు వెంటనే తన హోటల్ గదికి వెళ్లిపోయారు.తరువాత జై సింగ్ తన సేవకులతో షోరూమ్‌కు కాల్ చేయించి.. అల్వార్ నగర రాజువారు కొన్ని కార్లను కొనుగోలు చేయబోతున్నట్లుగా తెలయజేశారు. దీంతో రాజు రాకను పురస్కరించుకుని షోరూమ్‌లోని సేల్స్ మెన్స్ అందరూ బారులు తీరడంతో పాటు రెడ్ కార్పెట్ పరిచారు. అప్పుడు రాజు షోరూమ్‌ను సందర్శించి.. అక్కడ ఆరు కార్లు ఉంటే అన్నింటినీ ఒకేసారి కొనుగోలు చేశారు. డెలివరీ ఛార్జీలతో సహా పూర్తి మొత్తాన్ని చెల్లించారు. ఇక్కడ నుంచే అసలు కథ మొదలయ్యింది. ఆయన అక్కడ జరిగిన అవమానాన్ని దృష్టిలో ఉంచుకని, ఆ ఆరు రోల్స్ రాయిస్ దేశంలో దిగుమతి అవ్వగానే వీధులను ఊడ్చేందుకు ఉపయోగించాలని మున్సిపాలిటీని ఆదేశించారు.అతి తక్కువ సమయంలోనే ఈ వార్త యావత్ ప్రపంచం అంతా వ్యాపించింది. అప్పటివరకు వరల్డ్ నంబర్ వన్ కార్ల తయారీ సంస్థగా ఉన్న రోల్స్ రాయిస్ గుడ్‌విల్, ఆదాయం ఒక్కసారిగా పతనం అయ్యాయి. దీంతో కంగుతిన్న రోల్స్ రాయిస్ వెంటనే తమ ప్రవర్తనకు క్షమాపణ చెబుతూ మహారాజా జై సింగ్ కు టెలిగ్రామ్ పంపింది. అంతేగాదు ఆయన ఆగ్రహం చల్లారేలా ఆరు సరికొత్త కార్లను ఉచితంగా అందించింది. దీంతో రోల్స్ రాయిస్ కంపెనీ క్షమాపణలు అంగీకరించిన రాజు జైసింగ్ చెత్తను సేకరించడానికి ఆ కార్లను వినియోగించడం మానేయాలని మున్సిపాలిటీకి సూచించారు. ఏదీఏమైన భారతీయ రాజు దెబ్బకు బ్రిటన్ రోల్స్ రాయిస్ కంపెనీ గడగడలాడింది కదూ.(చదవండి: ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!) -
రూ.209 కోట్ల 'రోల్స్ రాయిస్' కారు - వివరాలు
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే 'రోల్స్ రాయిస్' ఇప్పుడు మరో ఖరీదైన కారు 'ఆర్కాడియా డ్రాప్‌టైల్'ను వెల్లడించింది. ఈ కారు ధర సుమారు రూ. 209 కోట్లు. దీనిని కంపెనీ సింగపూర్‌లోని ఒక ప్రైవేట్ వేడుకలో వెల్లడించారు. రోల్స్ రాయిస్ ఆర్కాడియా అద్భుతమైన డిజైన్ కలిగి చాలా వరకు వైట్ పెయింట్ అల్యూమినియం, కార్బన్ ఫైబర్ టబ్, ముందు భాగంలో బ్లాక్ కలర్ వంటి వాటిని పొందుతుంది. ఇది ఇతర డ్రాప్టెయిల్ల మాదిరిగా కాకుండా చాలా ప్రత్యేకంగా ఉండటం గమనించవచ్చు. రెండు డోర్స్, రెండు సీట్లు కలిగిన ఈ కారులో శాంటాస్ స్ట్రెయిట్ గ్రెయిన్ రోజ్‌వుడ్ ఎక్కువగా ఉపయోగించినట్లు సమాచారం. ఈ కారు తయారీలో సుమారు 233 చెక్క ముక్కలను ఉపయోగించినట్లు, దీనిని రూపొందించడానికి 8000 గంటల కంటే ఎక్కువ సమయం పట్టినట్లు సమాచారం. డ్యాష్‌బోర్డ్‌లో రోల్స్ రాయిస్ క్లాక్ ఉంది. కేవలం దీనిని తయారు చేయడానికే.. రెండు సంవత్సరాల రీసర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కారులోని ట్విన్ టర్బోచార్జ్డ్ 6.75 లీటర్ వీ12 ఇంజిన్ కలిగి 601 హార్స్ పవర్ 841 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. -
రోల్స్‌రాయిస్‌తో హైదరాబాద్ కంపెనీ ఒప్పందం
ఇండియాలో కాంప్లెక్స్ డిఫెన్స్ ఏరో ఇంజిన్ల తయారీకి రోల్స్ రాయిస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆజాద్ ఇంజినీరింగ్ ప్రతినిధులు తెలిపారు. ఈ దీర్ఘకాలిక ఒప్పందంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ఆజాద్ ఇంజినీరింగ్ డిఫెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ల కోసం కాంప్లెక్స్ కాంపోనెంట్లను సరఫరా చేయనుంది. ఈ ఒప్పందం ఏడేళ్లు కొనసాగనుంది. రోల్స్ రాయిస్ ఏరోస్పేస్ పరికరాలకు కీలకమైన సాంకేతిక, అధునాతన భాగాల ఉత్పత్తిలో ఆజాద్ ఇంజినీరింగ్ భాగమవ్వడం పట్ల కంపెనీ వర్గాలు హర్షంవ్యక్తం చేశాయి. తమకు కాంప్లెక్స్ కాంపోనెంట్లను సప్లయ్ చేస్తున్న గ్లోబల్ కంపెనీల జాబితాలో ఆజాద్ ఇంజినీరింగ్ చేరుతుందని రోల్స్‌రాయిస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ గ్లోబల్ నెట్వర్క్స్ హెడ్ అలెక్స్ జినో అన్నారు. బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి ఆజాద్ ఇంజినీరింగ్ ఫౌండర్ రాకేశ్ చోప్దార్ మాట్లాడుతూ డిఫెన్స్ కాంపోనెంట్లను భారతదేశంలోనే తయారు చేయడం వల్ల దేశ ఏరోస్పేస్ రక్షణ పరిశ్రమకు మేలు కలుగుతుందని అన్నారు. ప్రతిష్టాత్మక కంపెనీ భాగస్వామ్యంతో పనిచేయనుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
లాంచ్‌కు ముందే రూ.10 కోట్ల కారు కొన్న చెన్నై వాసి - ఫోటోలు వైరల్
Rolls Royce Spectre Delivery: ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రోజురోజుకి పెరిగిపోతున్న తరుణంలో బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'రోల్స్ రాయిస్' (Rolls Royce) గత ఏడాది గ్లోబల్ మార్కెట్లో 'స్పెక్టర్' పేరుతో ఓ ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించింది. కంపెనీ ఈ కారుని భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయకముందే ఫస్ట్ డెలివరీ ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారుని.. సంస్థ చెన్నైకి చెందిన భాష్యం కన్స్ట్రక్షన్స్కు చెందిన భాష్యం 'యువరాజ్'కు డెలివరీ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుమారు రూ. 10 కోట్లు ఖరీదైన ఈ కారుని కొన్న మొదటి భారతీయ కస్టమర్‌గా రికార్డ్ క్రియేట్ చేశారు. రోల్స్ రాయిస్ స్పెక్టర్ దాని మునుపటి మోడల్ కార్లకంటే చాలా భిన్నంగా ఉంటుంది. డీఆర్ఎల్లతో కూడిన ఎల్ఈడీ హెడ్‌లైట్స్, స్టైలిష్ ఎల్ఈడీ టైల్లైట్స్ వంటి వాటితో పాటు.. షార్ప్ స్లాంటెడ్ రూఫ్ డిజైన్ పొందుతుంది. సైడ్ ప్రొఫైల్‌లో 23 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు కొత్త 'స్పిరిట్' సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫారమ్‌తో కూడిన ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే పొందుతుంది. ఇది కనెక్టెడ్ కార్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. డ్యాష్‌బోర్డ్ ప్యానెల్ 'స్పెక్టర్' నేమ్‌ప్లేట్‌తో చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. దీని చుట్టూ దాదాపు 5,500 స్టార్స్ లాంటి ఇల్యూమినేషన్లు ఉన్నాయి. ఇదీ చదవండి: కొన్న ఏడాదిలో అమ్మేస్తే.. మస్క్ రూల్స్ మామూలుగా లేదుగా!! రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారు 593 పీఎస్ పవర్, 900 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా 520 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. సుమారు 3 టన్నుల బరువున్న ఈ కారు కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. View this post on Instagram A post shared by Rolls-Royce Motor Cars Chennai (@rollsroycechennai) -
నీతా అంబానీ కొత్త కారు - ధర తెలిస్తే అవాక్కవుతారు!
భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించే సంపన్న కుటుంబాలలో 'ముఖేష్ అంబానీ' ఫ్యామిలీ ఒకటి. రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఫెరారీ, బెంట్లీ వంటి ఎక్స్పెన్సివ్ కార్లను కలిగిన ఉన్న వీరు తాజాగా మరో కాస్ట్లీ కారుని తమ గ్యారేజిలో చేర్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వీడియోలో గమనించినట్లతే 'రోల్స్ రాయిస్' (Rolls Royce) కంపెనీకి చెందిన 'కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్' (Cullinan Black Badge) కారు ముంబై రోడ్లపై Z+ సెక్యూరిటీ కాన్వాయ్‌లో వెళ్లడం చూడవచ్చు. ఇది ముకేశ్ అంబానీ భార్య 'నీతా అంబానీ'కి చెందినట్లు, దీని ధర రూ.10 కోట్లు (ఆన్ రోడ్) వరకు ఉంటుందని సమాచారం. పెట్రా గోల్డ్ షేడ్‌లో కనిపించే ఈ కారు సాధారణ కార్లకంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. 6.75 లీటర్ ట్విన్ టర్బో వి12 పెట్రోల్ ఇంజిన్ కలిగిన కల్లినన్ 5,000 ఆర్పీఎమ్ వద్ద 563 బీహెచ్పీ పవర్, 1600 ఆర్పీఎమ్ 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కిమీ. ఇదీ చదవండి: ఆగని యుద్ధం.. పోయిన లక్షల ఉద్యోగాలు - ఐఎల్ఓ సంచలన రిపోర్ట్ రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారు లోపల కొన్ని భాగాలు కార్బన్ ఫైబర్‌తో, లెదర్ అపోల్స్ట్రే బ్లాక్ కలర్ స్కీమ్ పొందుతుంది. ఇలాంటి కారు ఇప్పటికే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూడా కొనుగోలు చేశారు. -
రోల్స్ రాయిస్ కొత్త ఎడిషన్ - కేవలం 25 మందికి మాత్రమే!
గ్లోబల్ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే 'రోల్స్ రాయిస్' (Rolls Royce) ఇటీవల ఘోస్ట్ సెలూన్ అనే కొత్త లిమిటెడ్ ఎడిషన్ కారుని లాంచ్ చేసింది. దీనినే కంపెనీ 'బ్లాక్ బ్యాడ్జ్ ఎక్లీప్సిస్' అని పిలుస్తోంది. ఈ కొత్త ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ ఎక్లీప్సిస్ ఎడిషన్ కేవలం 25 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. అద్భుతమైన డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగిన ఈ లగ్జరీ కారు ఇంటిగ్రేటెడ్ పౌడర్ కాపర్ పిగ్మెంట్‌తో కూడిన కస్టమ్ లిరికల్ కాపర్ ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. వైట్ కలర్ అల్లాయ్ వీల్స్, కలర్‌ఫుల్ బ్రేక్ కాలిపర్లు కలిగిన ఈ కారు లేటెస్ట్ ఇంటీరియర్ డిజైన్ అండ్ ఫీచర్స్ పొందుతుంది. లోపల స్టార్‌లైట్ హెడ్‌లైనర్‌ను ప్రత్యేకంగా క్రియేట్ చేశారు. ఇది సూర్యగ్రహణాన్ని కాపీ చేసే కస్టమ్ యానిమేషన్‌ను కలిగి ఉంది. డాష్‌బోర్డ్ టైమ్పీస్లో 0.5 క్యారెట్ డైమండ్ కూడా ఉంది. ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ జాబ్.. రూ.3 కోట్లు వేతనం - అయినా వదిలేశాడు! కారణం తెలిస్తే.. రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ 6.7 లీటర్ ట్విన్ టర్బో వీ12 పెట్రోల్ ఇంజిన్ కలిగి 1600 ఆర్పీఎమ్ వద్ద 563 హార్స్ పవర్, 850 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. దీని ధరను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇది ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రోల్స్ రాయిస్ ఘోస్ట్ (రూ. 6.95 నుంచి రూ. 7.95 కోట్లు) కంటే ఎక్కువ ఉంటుందని అంచనా. -
230 కిలోమీటర్ల వేగంతో రోల్స్ రాయిస్ బీభత్సం
చంఢీగడ్: హర్యానాలోని నూహ్‌లో దారుణం జరిగింది. జాతీయ రహదారిపై రోల్స్ రాయిస్ కారు ఓ ట్యాంకర్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ట్యాంకర్ యూటర్న్ తీసుకునే క్రమంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణం అని వెల్లడించారు. కారు, ట్యాంకర్ రెండు కూడా ఒకే దారిలో వస్తున్నాయి. ఈ క్రమంలో ట్యాంకర్ యూటర్న్ కోసం నిలిచి ఉంది. వెనకే ఉన్న రోల్స్ రాయిస్ దాదాపు గంటకు 230 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చింది. అదుపుతప్పి నిలిచి ఉన్న ట్యాంకర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు, ట్యాంకర్‌కు మంటలు అంటుకున్నాయి. కారు అతి వేగమే ప్రమాదానికి కారణం అని స్థానికులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెనకే మరో కారులో వస్తున్న బాధిత కుటుంబ సభ్యులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: రాహుల్ గాంధీ ఇక ఆ బంగ్లాకు వెళ్లలేరు.. ఎందుకంటే..? -
రూ. 200 కోట్లు కంటే ఎక్కువ ఖరీదైన కారు! ఎందుకింత రేటు?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే కంపెనీ ఏదంటే అందరూ చెప్పే సమాధానం 'రోల్స్ రాయిస్' (Rolls Royce). ఇప్పటికే బోట్ టెయిల్ అనే ఖరీదైన కారుని విడుదల చేసిన ఈ సంస్థ తాజాగా మరో ఖరీదైన కారు ఆవిష్కరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రోల్స్ రాయిస్ ఆవిష్కరించిన ఈ కారు పేరు 'డ్రాప్‌టైల్ రోడ్‌స్టర్' (Droptail Roadster). దీనిని 'లా రోజ్ నోయిర్' అని కూడా పిలుస్తారు. ఈ కారు ధర 30 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉంటుందని అంచనా. ఆంటే భారతీయ కరెన్సీ ప్రకారం 200 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఇది చూడటానికి చాలా ఆకర్షయంగా ఉంటుంది. ఇది రిమూవబుల్ హార్డ్‌టాప్ కూడా పొందుతుంది. కావున ఇది ఓపెన్ టాప్ కారు మాదిరిగా ఉంటుంది. ఇదీ చదవండి: ఉల్లి విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం - రేపటి నుంచే అమలు! రోల్స్ రాయిస్ డ్రాప్‌టైల్ రోడ్‌స్టర్ 6.75-లీటర్ V12 ఇంజిన్ కలిగి 563 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు చేతితో రూపొందించిన అల్యూమినియంతో తయారై ఉంటుంది. హ్యాండ్ పెయింటెడ్ కోచ్‌లైన్ అండ్ లాంబ్వుల్-లైన్డ్ ఇంటీరియర్‌తో సహా అనేక బెస్పోక్ డిజైన్ ఎలిమెంట్స్ ఇందులో గమనించవచ్చు. లిమిటెడ్ ఎడిషన్‌లో లభిస్తున్న రోల్స్ రాయిస్ కార్ల జాబితాలో ఈ డ్రాప్‌టైల్ రోడ్‌స్టర్ కూడా ఒకటి కానుంది. ఇది 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ డార్క్ మిస్టరీ పెయింట్ ట్రీట్మెంట్ను కలిగి ఉంది. దూరం నుంచి ఇది నలుపు రంగులోనూ.. దగ్గర నుంచి ముదురు ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఇంటీరియర్ డిజైన్ & ఫీచర్స్ కూడా చాలా అద్భుతంగా.. వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండనున్నాయి. -
ఇషా అంబానీ కారు.. దూరం నుంచి అలా.. దగ్గర నుంచి ఇలా!
ముఖేష్ అంబానీ గురించి వారి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా విలాసవంతమైన జీవితం గడుపుతూ.. భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు. అయితే వీరి వద్ద ఉన్న లగ్జరీ వాహనాలు లెక్కకు మించి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో చెప్పుకోదగ్గ కారు రంగులు మార్చే 'రోల్స్ రాయిస్'. రోల్స్ రాయిస్ కల్లినన్.. రంగులు మార్చే ఖరీదైన రోల్స్ రాయిస్ కారులో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కనిపించింది. వీరి వద్ద ఉన్న రోల్స్ రాయిస్ కార్లలో ఇది చాలా ప్రత్యేకమైనదికి కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీలైక్ఓమ్ అనే యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన వీడియోలో గమనించినట్లైతే పోర్స్చే 911 జీటీ3, టయోటా సుప్రా వంటి కార్లతో పాటు రోల్స్ రాయిస్ కారుని గమనించవచ్చు. ఇది దూరం నుంచి వైలెట్ కలర్ షేడ్‌లో కనిపిస్తుంది.. దగ్గరకు వచ్చే సరికి నీలం (బ్లూ) రంగులోకి మారింది. ఇలా అది దూరం వెళ్లే సరికి మళ్ళీ రంగు మారినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇండియాలో ఆ మందు పాక్, చైనాకంటే 15 రెట్లు కాస్ట్లీ.. ధర తెలిస్తే షాకవుతారు! సైకెడెలిక్ ర్యాప్.. నిజానికి వర్షం కురిసిన సమయంలో ఈ కారు కనిపించడంతో ఇలా కనిపించింది. అదే బాగా ఎండగా ఉన్న సమయంలో అయితే మరింత ఆకర్షణీయంగా కనిపించి ఉంటుందని భావిస్తున్నారు. ఇది కలర్ మార్చే ర్యాప్.. కావున దానిపై పడే కాంతి పరిమాణం, మీరు కారును చూస్తున్న కోణాన్ని బట్టి రంగు మారుతుంది. ఈ రకమైన ర్యాప్‌ను సైకెడెలిక్ ర్యాప్ అని కూడా పిలుస్తారు, ఇది రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కల్లినన్ కారు అని తెలుస్తోంది. కావున ఈ లగ్జరీ కారు 6.8 లీటర్ V12 ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో గరిష్టంగా 580 బీహెచ్పీ పవర్ 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ముఖేష్ అంబానీ గ్యారేజిలో ఈ రోల్స్ రాయిస్ మాత్రమే కాకుండా.. బిఎమ్‌డబ్ల్యూ ఐ8, ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్, మెక్లారెన్ 520ఎస్ స్పైడర్, లంబోర్ఘిని అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్, ఫెరారీ 488 జిటిబి, ఫెరారీ పోర్టోఫినో వంటి మరెన్నో కార్లు ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 600 జీతం.. ఇప్పుడు కోట్ల సంపాదన - ఐఏఎస్ కొడుకు సక్సెస్ స్టోరీ! -
రోల్స్ రాయిస్ కారులో ధోని చక్కర్లు.. వీడియో వైరల్! ఆ కలెక్షన్ చూస్తే..
MS Dhoni Driving Rolls Royce: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి కార్లు, బైకులంటే మహాప్రీతి అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాంచీలోని తన ఇంట్లో ఉన్న గ్యారేజీని చూస్తే ఎవరికైనా ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. ధోని కలెక్షన్లో ఉన్న వింటేజీ కార్లు, బైకులు చూస్తే వాహన ప్రియులకు మతి పోవాల్సిందే! ధోని దగ్గర అనేక రకాల విలాసవంతమైన కార్లు ఉన్నాయి. అందులో ప్రఖ్యాత రోల్స్ రాయిస్(1980) మరింత ప్రత్యేకం. తాజాగా ఈ కారులో ధోని చక్కర్లు కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. రాంచి వీధుల్లో రాయల్ బ్లూ కలర్ కారులో ధోని జామ్జామ్ అంటూ దూసుకుపోయిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కళ్లు చెదిరేలా కాగా ఇటీవలే.. మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కారణంగా ధోని గ్యారేజీలో ఉన్న ఆటోమొబైల్ కలెక్షన్‌ను చూసే అవకాశం ఫ్యాన్స్‌కు లభించింది. తాజాగా మిస్టర్ కూల్ కారు నడుపుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఇక ఐపీఎల్-2023లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ధోని విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో గెలుపొందిన సీఎస్కే ఏకంగా ఐదోసారి చాంపియన్‌గా అవతరించింది. తద్వారా ఐపీఎల్లో అత్యధిక సార్లు(5) టైటిల్ గెలిచిన కెప్టెన్‌గా ధోని.. ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. సంపాదనలోనూ.. ఇక కెప్టెన్ కూల్ ధోని టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు(టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2013) అందించిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత జట్టు స్టార్ క్రికెటర్‌గా, సీఎస్కే సారథిగా ఇలా ఎన్నో విజయాలు అందుకున్న ధోని.. దాదాపు వెయ్యి కోట్లకు పైగానే ఆర్జించినట్లు అంచనా. ఇక ఇటీవలే సినీ రంగంలోనూ నిర్మాతగా అవతారమెత్తాడు ధోని. తమిళ ఇండస్ట్రీలో LGM(Lets Get Married) పేరిట సినిమా నిర్మించాడు. చదవండి: వైరల్‌గా అపాయింట్మెంట్ లెటర్.. ధోని నెలజీతం ఎంతంటే? View this post on Instagram A post shared by subodh singh Kushwaha (@kushmahi7) One of the craziest passion i have seen in a person. What a collection and what a man MSD is . A great achiever and a even more incredible person. This is a glimpse of his collection of bikes and cars in his Ranchi house. Just blown away by the man and his passion @msdhoni pic.twitter.com/avtYwVNNOz — Venkatesh Prasad (@venkateshprasad) July 17, 2023 -
ప్రపంచంలోనే ఖరీదైన కారు మొదటిసారి రోడ్డుపై - చూస్తే హవాక్కావల్సిందే!
Rolls Royce Boat Tail: ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు ఏది అంటే వెంటనే వచ్చే సమాధానం 'రోల్స్ రాయిస్' (Rolls Royce). ఈ బ్రాండ్ కార్లు ప్రారంభ ధరలే కోట్లలో ఉంటాయి. కాగా గరిష్ట ధరలు ఏకంగా రూ. 200 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి అత్యంత ఖరీదైన కారు దుబాయ్ రోడ్ల మీద మొదటిసారి కనిపించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 'రోల్స్ రాయిస్ బోట్ టెయిల్' (Rolls Royce Boat Tail) పేరుతో అందుబాటులో ఉన్న ఈ కారు ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కావడం గమనార్హం. ఇప్పటికే 'బెయోన్స్ అండ్ జే జెడ్' ఈ కారుని కొనుగోలు చేసినట్లు సమాచారం. ధర.. నిజానికి ఈ కారుని ఆవిష్కరించిన తరువాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కనిపించడం ఇదే మొదటిసారి. కాగా కంపెనీ ఇప్పటి వరకు ఈ కార్లను కేవలం మూడు యూనిట్లను మాత్రమే విడుదల చేసింది. దీని ధర 28 మిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 220 కోట్ల కంటే ఎక్కువ. (ఇదీ చదవండి: ప్రపంచ దేశాల్లో వణుకుపుట్టిస్తున్న భారత్ నిర్ణయం - బియ్యం ధరల్లో పెనుమార్పులు!) రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ బ్రాండ్ మోడల్స్ కంటే కూడా చాలా బిన్నంగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో లభించే ఫీచర్స్ దాదాపు ఇప్పటివరకు ఇతర ఏ లగ్జరీ కార్లలోనూ లభించకపోవడం విశేషం. కావున దీనిని కంపెనీ స్పెషల్ కారు అని కూడా పిలుస్తారు. డిజైన్ మాత్రం చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఇందులో చెప్పుకోదగ్గ మరో ఫీచర్ వెనుక భాగంలో కనిపించే కాక్టెయిల్ స్టోర్. ఇందులో అవసరమైన డ్రింక్స్ స్టోర్ చేసుకోవచ్చు. దీనితో పాటు కంప్ర్టిబుల్ టేబుల్స్, కుర్చీలు వంటివి లభిస్తాయి. -
పెయింట్ ఖర్చు రూ. కోటి! ఆ కారు ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Rolls Royce Cullinan: భారతదేశంలో ముఖేష్ అంబానీ గురించి, వారి కుటుంబం గురించి దాదాపు అందరికి తెలుసు. ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉంటూ.. రిలయన్స్ గ్రూప్ వంటి బడా కంపెనీతో కోట్లు సంపాదిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నారు. అత్యంత విలాసవంతమైన భవనాల్లో నివసించడమే కాకుండా ఖరీదైన లగ్జరీ కార్లను సైతం లెక్కకు మించి కొనుగోలు చేశారు. వీరి వద్ద ఇప్పటికే మూడు రోల్స్ రాయిస్ కార్లు ఉండటం గమనార్హం. వీటి ధరలు రూ. కోట్లలో ఉన్నాయి. కాగా ఇందులో ఒక కారు పెయింట్ ఖర్చు మాత్రమే రూ. 1 కోటి వరకు ఉంటుందని చెబుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత సంవత్సరంలో ముఖేష్ అంబానీ మూడవ 'రోల్స్ రాయిస్ కల్లినన్' (Rolls Royce Cullinan) డెలివరీ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న దాదాపు అన్ని కార్లలో ఈ కారు చాలా ప్రత్యేకమైనదని చెబుతారు. ఇది ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కలిగి ఉండటమే కాకుండా, వారికి నచ్చిన విధంగా తయారైంది. దీన్ని బట్టి చూస్తే ఇది కస్టమైజేషన్ కారు అని తెలుస్తోంది. ఈ కారు ధర ఏకంగా రూ. 13.14 కోట్లు అని నివేదికలు చెబుతున్నాయి. మార్కెట్లో రోల్స్ రాయిస్ కల్లినన్ బేస్ మోడల్ ప్రారంభ ధర రూ. 6.8 కోట్లు. అయితే ఇది ఆప్షనల్ ఫీచర్స్ కలిగి కస్టమైజ్ పొందటం వల్ల ధర ఎక్కువ అని తెలుస్తోంది. ఇందులో తెలుసుకోవలిసిన మరో అంశం ఏమిటంటే పెయింటింగ్ స్కీమ్. ఈ కారు పెయింట్వర్క్కే రూ. 1 కోటి ఖర్చు అయినట్లు సమాచారం. 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉండటం కూడా ఇందులో గమనించవచ్చు. (ఇదీ చదవండి: ఇన్‌స్టా సంపాదనలో వీరిని మించిన వారే లేరు! టాప్ 5 జాబితాలో ఎవరున్నారంటే?) రిజిస్ట్రేషన్ నెంబర్ ముఖేష్ అంబానీ కల్లినన్ 0001 అనే రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగి ఉంటుంది. సాధారణ విఐపి నెంబర్ ధర రూ. 4 లక్షలు. అయితే ఈ నెంబర్ మరింత స్పెషల్ కావున దీని ధర రూ. 12 లక్షలు. అంతే కాకుండా ఈ కారు కోసం రూ. 20 లక్షలు వన్-టైమ్ టాక్స్ చెల్లించారు. ఇది 2037 వరకు చెల్లుబాటు అవుతుంది. (ఇదీ చదవండి: ఆఫర్ అంటే ఇలా ఉండాలి.. అతి తక్కువ ధరకే ఒప్పో 5జీ స్మార్ట్‌ఫోన్!) భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో ముఖేష్ అంబానీ గ్యారేజిలో రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాకుండా మెర్సిడెస్ బెంజ్, బెంట్లీ బెంటాయగ, బీఎండబ్ల్యూ, ఫెరారీ మొదలైన ఖరీదైన కార్లు ఎన్నో ఉన్నాయి. -
బైకు తెచ్చిన భారీ లాభం.. పాత బైక్‌కు రూ.3 కోట్లు!
హాలీవుడ్ సినిమా ‘ఘోస్ట్ రైడర్’లో హీరో కంటే, ఆ హీరో నడిపిన మోటర్ బైక్ బాగా పాపులర్ అయింది. అలా సామాన్యులకు కూడా స్పోర్ట్స్ బైక్స్‌పై ఆసక్తిని పెంచింది ఆ సినిమా. అయితే, స్వతహాగానే చాలామంది అబ్బాయిలకు మోటర్‌బైక్స్, కారులంటే చాలా పిచ్చి. అలాంటి ఓ పిచ్చితోనే యూకేకు చెందిన వాకర్స్, 1973లోనే 150 పౌండ్లు (రూ. 16 వేలు) ఖర్చు పెట్టి 1931 నాటి రోల్స్‌రాయ్స్ కంపెనీ తయారు చేసిన ‘బ్రౌ సుపీరియర్ ఎస్ఎస్100’ మోడల్ బైక్ కొనుగోలు చేశాడు. ఈ మోటర్ బైక్ గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్‌బైక్. దాదాపు ఇరవై సంవత్సరాలు సంతోషంగా ఈ సూపర్‌బైక్‌ను నడిపిన వాకర్స్.. తర్వాత కారు కొని, బైకును మూడు దశాబ్దాలకుపైగా గ్యారేజ్‌కే పరిమితం చేశాడు. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల కారణంగా తనకెంతో ఇష్టమైన ఈ సూపర్బైకును వేలానికి ఉంచడంతో కళ్లుచెదిరే ధర పలికింది. ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ సూపర్‌బైక్‌ను 2.80 లక్షల పౌండ్లు (రూ.3 కోట్లు) చెల్లించి కొనుగోలు చేశాడు. అంటే రెండు వేల రెట్ల లాభం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యాభై ఏళ్ల తర్వాత కూడా ఈ మోటర్‌బైకు మంచి కండిషన్లోనే ఉండటం. ఇక వచ్చిన డబ్బును తన కాలి శస్త్రచికిత్సకు ఉపయోగిస్తానని వాకర్స్ చెప్పాడు. -
ప్రభాస్ రేంజే వేరు.. డార్లింగ్ కార్ల కలెక్షన్స్ చూస్తే కళ్లు తిరగాల్సిందే!
ఈశ్వర్ సినిమాతో తెలుగు చలన చిత్ర సీమలో అడుగుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నటుడు 'ప్రభాస్' (Prabhas) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టి ఇప్పుడు ఆదిపురుష్ చిత్రంలో తెరకెక్కాడు. సుమారు రూ. 200 కోట్ల కంటే ఎక్కువ నికర ఆస్తులు కలిగిన ప్రభాస్ సినిమాల గురించి తెలిసిన చాలా మందికి అతడు ఎలాంటి కార్లను ఉపయోగిస్తాడనేది తెలిసి ఉండక పోవచ్చు. ఈ కథనంలో ప్రభాస్ ఉపయోగించే కార్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లంబోర్ఘిని అవెంటడోర్ భారతదేశంలో లంబోర్ఘిని కంపెనీకి చెందిన అవెంటడోర్ కలిగి ఉన్న కొంతమందిలో ప్రభాస్ ఒకరు. ఈ కారు ధర రూ. 6 కోట్లు వరకు ఉంటుంది. ఇది లంబోర్ఘిని కంపెనీకి చెందిన అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్. ఇది 6.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి12 పెట్రోల్ ఇంజిన్ కలిగి 740 హార్స్ పవర్ 690 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో సింగిల్ క్లచ్ 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉండటం వల్ల అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఒకటి. ఈ కారు ప్రభాస్ గ్యారేజిలో కూడా ఉంది. 2016లో బ్లాక్ కలర్ ఫోర్త్ జనరేషన్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కొనుగోలు చేశారు. ఈ SUV లో 4.4 లీటర్ డీజిల్ వి8 ఇంజిన్ కలిగి 340 పీఎస్ పవర్, 740 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రభాస్ ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన లగ్జరీ కారుగా ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన 'ఫాంటమ్' కారుని కూడా కలిగి ఉన్నారు. ఈ కారు ధర సుమారు రూ. 8 కోట్ల కంటే ఎక్కువ. ప్రభాస్ గ్యారేజిలో ఉన్న అత్యంత ఖరీదైన కారు కూడా ఇదే. దీనిని 2013లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ లగ్జరీ కారు 6.75 లీటర్ వి12 ఇంజిన్ కలిగి 460 పీఎస్ పవర్, 720 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. (ఇదీ చదవండి: ప్రపంచంలో ఇదే బెస్ట్ ఎయిర్ లైన్! భారత్ ఎక్కడుందంటే?) జాగ్వార్ ఎక్స్‌జే భారతీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరించే జాగ్వార్ ఎక్స్‌జే ప్రభాస్ కార్ల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 1 కోటి కంటే ఎక్కువ ఉంటుంది. సిల్వర్ కలర్ ఆప్షన్లో కనిపించే ఈ కారుని 2012లో కొనుగోలు చేశారు. ఇది 3.0-లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వి6 డీజిల్ ఇంజిన్ కలిగి 275 పీఎస్ పవర్ 600 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ -స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. (ఇదీ చదవండి: హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!) బీఎండబ్ల్యూ ఎక్స్3 జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన బ్లాక్ కలర్ ఎక్స్3 మోడల్ కారుని 2018లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కారుని ప్రభాస్ చాలా అరుదుగా వినియోగిస్తారని తెలుస్తోంది. నిజానికి బీఎండబ్ల్యూ ఎక్స్3 మూడు వేరియంట్లలో లభిస్తుంది. కావున ప్రభాస్ ఇందులో ఏ వేరియంట్ కొన్నారనేది స్పష్టంగా తెలియదు. ఇది డీజిల్ ఇంజిన్ కలిగి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుందని తెలుస్తుంది. -
రోల్స్ రాయిస్ నుంచి ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకతలు ఎన్నో
-
సెలబ్రిటీలు మెచ్చిన రోల్స్ రాయిస్ కార్లు - ప్రారంభం నుంచి ఇప్పటి వరకు (ఫోటోలు)
-
ముఖేష్ అంబానీ కన్నా ముందు రోల్స్ రాయిస్ కల్లినన్ కొన్న ఫస్ట్ ఇండియన్ ఇతడే!
Sohan Roy: ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే సంస్థ ఏది అంటే.. వెంటనే వచ్చే సమాధానం 'రోల్స్ రాయిస్' (Rolls Royce). మన దేశంలో ముఖేష్ అంబానీ, కుమార్ మంగళం బిర్లా మొదలైన పారిశ్రామిక వేత్తలు ఈ కంపెనీకి చెందిన లగ్జరీ కార్లను వినియోగిస్తున్నారు. అయితే ప్రపంచంలోనే మొట్ట మొదటి 'రోల్స్ రాయిస్ కల్లినన్' (Rolls Royce Cullinan) కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరనేది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఫస్ట్ 'కల్లినన్' సొంతం చేసుకున్న వ్యక్తి ఎవరనేది ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, యుఎఇకి చెందిన 'సోహన్ రాయ్' (Sohan Roy) రోల్స్ రాయిస్ కల్లినన్‌ను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొదటి భారతీయుడు. అతడు తన భార్య 'అభిని సోహన్'కు 25 వ పెళ్లి రోజు కానుకగా కొనుగోలు చేసినట్లు గతంలోనే వెల్లడించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వెల్లడయ్యాయి. దీని ధర రూ. 5 కోట్ల కంటే ఎక్కువని సమాచారం. సోహన్ రాయ్ ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, సీఈఓగా ఉన్నారు. పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా ఈయన సినిమా డైరెక్టర్ కూడా. సోహన్ దర్శకత్వంలో DAM999 చిత్రం తెరకెక్కింది. అంతే కాకుండా మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ విస్మయాస్ మాక్స్ స్టూడియో కాంప్లెక్స్‌ను ఏరీస్ గ్రూప్ స్వాధీనం చేసుకుంది. (ఇదీ చదవండి: వంటగదిలో మొదలైన వ్యాపారం కోట్లు కురిపిస్తోంది - 50 ఏళ్ల మహిళ సక్సెస్ స్టోరీ) ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన కారుగా ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్ కల్లినన్ విషయానికి వస్తే.. ఇది ఖరీదైనదైనప్పటికీ లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. ఈ కారు 2018లో మార్కెట్లో అడుగుపెట్టింది. ఇది ట్విన్-టర్బోచార్జ్డ్ 6.75-లీటర్ V12 ఇంజన్ ప్యాక్ కలిగి 5000 ఆర్‌పిఎమ్ వద్ద 563 హార్స్ పవర్, 1600 ఆర్‌పిఎమ్ వద్ద 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిమీ. (ఇదీ చదవండి: అదిరిపోయే ఫీచర్స్ కలిగిన అద్భుతమైన 5 స్మార్ట్‌ఫోన్స్ - ధర కూడా తక్కువే!) రోల్స్ రాయిస్ కల్లినన్ అద్భుతమైన డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. పరిమాణం పరంగా విశాలంగా ఉండే ఈ కారు 1835 మిమీ పొడవు, 5341 మిమీ వెడల్పు, 2164 మిమీ ఎత్తు కలిగి ఈ కారు బరువు సుమారు మూడు టన్నుల వరకు ఉంటుంది. ప్రపంచ మార్కెట్లో ఇప్పటి వరకు ఎక్కువమంది ధనవంతులు కొనుగోలు చేసిన కార్లలో ఇది ప్రధానమైనది. -
వచ్చేసింది.. ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు విడుదల చేసిన రోల్స్ రాయిస్
భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి సన్నద్ధమయ్యాయి, అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసిన 'రోల్స్ రాయిస్' (Rolls Royce) కూడా 'స్పెక్టర్' అనే ఎలక్ట్రిక్ కారు విడుదలతో ఈ జాబితాలో చేరింది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసిన రోల్స్ రాయిస్ కంపెనీ తాజాగా 'స్పెక్టర్' (Spectre) ఎలక్ట్రిక్ కారుని సౌత్ కొరియాలో విడుదల చేసింది. గతంలో వెల్లడించినట్లుగానే కంపెనీ ఎలక్ట్రిక్ కారుని తీసుకువచ్చింది. ఇది గ్లోబల్ మార్కెట్లో కంపెనీ విడుదల చేసిన మొదటి ఎలక్ట్రిక్ మోడల్. దీని ధర కొరియాలో 620 మిలియన్ వాన్స్.. అంటే భారతీయ కరెన్సీ దీని విలువ సుమారు 3.98 కోట్లు. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా వైరల్ ట్వీట్.. నితిన్ గడ్కరీ జీ అంటూ..!!) దక్షిణ కొరియాలో రోల్స్ రాయిస్ తన ఉనికిని మరింత విస్తరించుకోవడంలో భాగంగానే స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసినట్లు సమాచారం. ఈ కారు డిజైన్ చూడగానే రోల్స్ రాయిస్ తెలిసిపోతుంది. ఇందులో అత్యంత విశాలవంతమైన గ్రిల్ చూడవచ్చు. పరిమాణం పరంగా ఇది చాలా విషయంగా ఉంటుంది. పొడవు 5,453 మిమీ పొడవు, 2,080 మిమీ వెడల్పు, ఎత్తు 1,559 మిమీ వరకు ఉంది. వీల్‌బేస్ 3210 మిమీ. ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొత్త రోల్స్ రాయిస్ స్పెక్టర్ 2,950 కేజీల కంటే ఎక్కువ బరువును కలిగి.. రెండు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా 576.6 bhp పవర్, 900 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. ఇది ఒక ఛార్జ్‌తో గరిష్టంగా 520 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. -
ఇప్పటివరకు చూడని కోట్లు విలువైన 'యూసఫ్ అలీ' కార్ల ప్రపంచం!
M.A Yusuf Ali Car Collection: భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తల్లో ఒకరైన 'లులు గ్రూప్ ఇంటర్నేషనల్' (Lulu Group International) అధినేత 'ఎమ్ఏ యూసఫ్ అలీ' (M.A Yusuf Ali) గురించి దాదాపు అందరికి తెలుసు. ఎందుకంటే ఈయన ఇండియాలోని సంపన్నుల జాబితాలో ఒకరు మాత్రమే కాదు, కోట్లు విలువ చేసే అనేక అన్యదేశ్యపు లగ్జరీ కార్లను కూడా కలిగి ఉన్న ప్రముఖుల జాబితాలో కూడా ఒకరు. యూసఫ్ అలీ గ్యారేజిలోని లగ్జరీ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రోల్స్ రాయిస్ ఘోస్ట్ ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కారుగా ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్ కేవలం సంపన్న వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలు మాత్రమే కొనుగోలు చేస్తారు. ఈ జాబితాలో యూసఫ్ అలీ ఉన్నారు. ఈయన రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఘోస్ట్ కారుని కలిగి ఉన్నారు. దీని ధర సుమారు రూ. 8 కోట్ల వరకు ఉంటుందని అంచనా. భారతదేశంలో ఉన్నప్పుడు ఈయన ఈ కారునే ఎక్కువగా వినియోగిస్తారని సమాచారం. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన ఖరీదైన రేంజ్ రోవర్ వోగ్ కూడా ఈయన గ్యారేజిలో ఉంది. యూసఫ్ అలీ కొనుగోలు చేసిన ఈ కారు వైట్ కలర్ పెయింట్ స్కీమ్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఇతని వద్ద బ్లాక్ కలర్ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ కూడా ఉన్నట్లు సమాచారం. వీటిని తన కుటుంబంతో పాటు ప్రయాణించడానికి ఉపయోగిస్తాడని తెలుస్తోంది. ఈ కార్లు కేరళ రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగి ఉండటం గమనార్హం. బెంట్లీ బెంటాయగా బెంట్లీ కంపెనీకి చెందిన బెంటాయగా వంటి విలాసవంతమైన SUV కూడా యూసఫ్ అలీ ఖాన్ గ్యారేజిలో ఉంది. ఇది కూడా కేరళ రిజిస్ట్రేషన్ కలిగి ఉంది. భారతదేశంలో మొట్ట మొదటి బెంట్లీ బెంటాయగా కొనుగోలు చేసిన వ్యక్తి యూసఫ్ అలీ కావడం ఇక్కడ తెలుసుకోవలసిన విషయం. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా ఇకనైనా శ్రద్ద పెట్టండి - నెట్టింట్లో మహిళ ట్వీట్ వైరల్!) రోల్స్ రాయిస్ కల్లినన్ ముఖేష్ అంబానీ వంటి కుబేరుల వద్ద ఉన్న రోల్స్ రాయిస్ కల్లినన్ కూడా యూసఫ్ అలీ గ్యారేజిలో ఉంది. ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే రోల్స్ రాయిస్ కార్లలో కల్లినన్ ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. ఈ కారుని అతడు దుబాయ్‌లో ఉపయోగిస్తాడని తెలుస్తోంది. (ఇదీ చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా..!) రోల్స్ రాయిస్, బెంట్లీ వంటి కార్లతో పాటు యూసఫ్ అలీ మినీ కూపర్ కంపెనీకి చెందిన మినీ కంట్రీమ్యాన్, మెర్సిడెస్-మేబ్యాక్ GLS, లెక్సస్ LX750, BMW 7-సిరీస్, మెర్సిడెస్-మేబ్యాక్ S600 వంటి ఖరీదైన కార్లు ఆయన గ్యారేజిలో ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించే ధనవంతుల జాబితాలో యూసఫ్ అలీ ఖాన్ కూడా ఒకరుగా ఉన్నారు. -
అవమానానికి గుణపాఠం.. తలపాగా రంగుకు తగ్గ రోల్స్ రాయిస్
Reuben Singh: భారతీయులకు సహనం, పట్టుదల వంటివి చాలా ఎక్కువ. అయితే కోపంలో కూడా ఏ మాత్రం తీసిపోరు. దీనికి నిదర్శనమే లండన్‌లో స్థిరపడిన భారత సంతతికి చెందిన వ్యాపార వేత్త 'రూబెన్ సింగ్'. తన తలపాగాను అవమానించిన వారికి సరైన గుణపాఠం చెప్పడానికి ఏకంగా 15 కంటే ఎక్కువ ప్రపంచంలో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేసాడు. ఇన్ని రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉన్న వ్యక్తి ప్రపంచంలో బహుశా ఇతడే అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. జీవితంలో ఒక్క రోల్స్ రాయిస్ కొంటే చాలు అనుకునే వ్యక్తులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, జీవితంలో ఒక్క సారైనా రోల్స్ రాయిస్ కార్లను ఎక్కాలి అని అందరికి ఉంటుంది. అలాంటిది ఎవరో హేళన చేసారని, తలపాగా విలువేంటో చూపించాలని ఇన్ని ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు రూబెన్ సింగ్. ఒక ఇంగ్లాండ్ వ్యక్తి తన తలపాగాను అవమానిస్తూ బ్యాండేజ్ అని ఎగతాళి చేసేవాడని, దానికి విసుగు చెందిన సింగ్ నా తలపాగా పవర్ ఏంటో చూపిస్తా అని తలపాగా రంగుకి తగ్గ రోల్స్ రాయిస్ కొనేసాడు. దెబ్బతో ఎగతాళి చేసినవాడు నివ్వెరపోయాడు. ప్రస్తుతం అతని వద్ద 15 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు ఉన్నట్లు సమాచారం. రూబెన్ సింగ్ ఎవరు? బ్రిటన్ బిల్ గేట్స్‌గా ప్రపంచానికి సుపరిచితమైన రూబెన్ సింగ్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. ఇంగ్లాండ్ వ్యక్తికి తనకి జరిగిన ఒక పందెంలో ఎవరు ఓడిపోతే వారు స్వచ్చంద సంస్థకు విరాళంగా డబ్బు ఇవ్వాలని పందెం వేసుకున్నారు. సిక్కు మతానికి చెందిన రూబెన్ వారానికి తాను ధరించే తలపాగా రంగుకి తగ్గ రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేసాడు. రోల్స్ రాయిస్ కార్లతో వరం రోజులు తానూ ధరించే తలపాగా రంగుని బట్టి దిగిన ఫోటోలు గతంలో సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యాయి. (ఇదీ చదవండి: అనుకున్నదాని కోసం ఐఏఎస్ వదిలేసాడు - ఎవరీ బాలగోపాల్ చంద్రశేఖర్!) తల్లితండ్రుల మీద ఆధారపడ కుండా తన సొంత తెలివితేటలతో ఎంతో శ్రమించి భారీగా డబ్బు సంపాదించాడు. 1990లో ఇంగ్లాండులో మిస్ ఆటిట్యూడ్ అనే ఫ్యాషన్ చైనా బిజినెస్ స్థాపించి కోట్లు సంపాదించగలిగాడు. 17వ ఏట నుంచి రోజుకి 20 గంటలు కస్టపడి గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసాడు. ఆ తరువాత కొన్ని రోజులకు తన సంస్థ కొంత వెనుకపడింది. అయినప్పటికీ పట్టు వదలకుండా శ్రమించి లాభాల బాటలో పయనించేలా చేసాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
సంపాదనలో మాత్రమే కాదు లగ్జరీ కార్ల విషయంలో అంతకు మించి
Kumar Mangalam Birla Car Collection: భారతదేశంలో ఉన్న అగ్రశ్రేణి ధనవంతులలో ఒకరైన 'కుమార్ మంగళం బిర్లా' (Kumar Mangalam Birla) గురించి దాదాపు అందరికి తెలుసు. ఈయన ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ మాత్రమే కాకుండా.. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌కి ఛాన్సలర్ కూడా. గతంలో ఈయన సక్సెస్ సీక్రెట్, నికర ఆస్తులు వంటి వాటిని గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ కథనంలో మంగళం బిర్లా ఉపయోగించే లగ్జరీ కార్లను గురించి తెలుసుకుందాం. రోల్స్ రాయిస్ ఘోస్ట్ (Rolls Royce Ghost) ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార్ మంగళం బిర్లా ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కారుని (రోల్స్ రాయిస్ ఘోస్ట్) కలిగి ఉన్నారు. ఈ కారు ఖరీదు రూ. 8 కోట్లు (ఎక్స్-షోరూమ్). అయితే ఇది కొంత కస్టమైజేషన్ పొందినట్లు తెలుస్తోంది. సుమారు రూ. 9 కోట్లు వరకు ఉండవచ్చు. ఈ కారుని ఆయన అప్పుడప్పుడు మాత్రమే వినియోగిస్తారని సమాచారం. ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత విలాసవంతమైన కార్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ రోల్స్ రాయిస్ ఘోస్ట్ ముఖేష్ అంబానీ వంటి పారిశ్రామిక వేత్తల గ్యారేజిలో కూడా ఉంది. ఇందులో 6.7 లీటర్ వి12 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 520 బిహెచ్పి పవర్, 780 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. గరిష్ఠ వేగం గంటకు 250 కిమీ. మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్500 (Mercedes-Maybach S500) జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థకు మెర్సిడెస్ కంపెనీకి చెందిన అత్యంత ఖరీదైన కారు 'మేబ్యాచ్ ఎస్500' సెడాన్ కూడా కుమార్ మంగళం బిర్లా గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 1.86 కోట్లు. ఇందులో 4663 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 453 బిహెచ్పి పవర్, 700 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సెడాన్ కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ వరకు ఉంది. భారతదేశంలోని సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ఇది ప్రధానమైనదని. బీఎండబ్ల్యూ 760ఎల్ఐ (BMW 760LI) కుమార్ మంగళం బిర్లా గ్యారేజిలో ఉన్న కార్లలో బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 760ఎల్ఐ ఒకటి. దీని ధర రూ. 2.46 కోట్లు. రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొనుగోలు చేయడానికి ముందు ఈయన ఎక్కువగా ఈ కారునే ఉపయోగించేవారని సమాచారం. ఇది బుల్లెట్ ప్రూఫ్ సెడాన్. కావున వినియోగదారులకు పటిష్టమైన భద్రతను అందిస్తుంది. ఇందులోని 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ 850 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ సెడాన్ టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ. ఇది కేవలం 3.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగవంతమవుతుంది. (ఇదీ చదవండి: పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, హెలికాఫ్టర్స్.. ఇంకా ఎన్నో..!) జాగ్వార్ ఎక్స్ఎఫ్ (Jaguar XF) బ్రిటీష్ వాహన తయారీ సంస్థకు చెందిన జాగ్వార్ ఎక్స్ఎఫ్ 'కుమార్ మంగళం బిర్లా' గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 55.67 లక్షలు. ఇందులోని 2.0 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ 247 బిహెచ్పి పవర్ & 365 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లగ్జరీ కారు కేవలం 7.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతమవుతుంది. టాప్ స్పీడ్ గంటకు 365 కిమీ. (ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - ఓ యువకుని సక్సెస్ స్టోరీ) బీఎండబ్ల్యూ 5 సిరీస్ (BMW 5-Series) బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన మరో కారు 5 సిరీస్ కుమార్ మంగళం బిర్లా గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 62.90 లక్షలు. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉండే ఈ కారు 2993 ఇంజిన్ కలిగి 261 బిహెచ్పి పవర్ పవర్, 620 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం కాగా, టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ. 28 సంవత్సరాల వయసులో తండ్రి మరణించిన తరువాత ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేప్పట్టిన కుమార్ మంగళం బిర్లా 47 బ్రాండ్లు, 27 ఎంటర్ప్రైజెస్, 14 పరిశ్రమ రంగాలను విజయపథంలో నడిపిస్తున్నాడు. ప్రస్తుతం కంపెనీ ఆదాయం రూ.50000 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
ముఖేష్ అంబానీ ఉపయోగించే టాప్ 5 లగ్జరీ కార్లు
ప్రముఖ పారిశ్రామికవేత్త, అపరకుబేరుడు ముఖేష్ అంబానీ గురించి దాదాపు అందరికి తెలుసు. ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన ఈయన అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్లను ఉపయోగిస్తారు. ముఖేష్ అంబానీ ఉపయోగించే టాప్ 5 లగ్జరీ కార్లను గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. రోల్స్ రాయిస్ ఫాంటమ్: ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారుచేసే కంపెనీలలో చెప్పుకోదగ్గది రోల్స్ రాయిస్. ఈ సంస్థకు చెందిన ఫాంటమ్ SUV ముఖేష్ అంబానీ గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 13.50 కోట్లు. ఈ లగ్జరీ కారు 6.75 లీటర్ V12 పెట్రోల్ ఇంజన్ కలిగి ఉత్తమమైన పనితీరుని అందిస్తుంది. మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్660 గార్డ్: జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ 'మేబ్యాచ్ ఎస్660' ముఖేష్ అంబానీ గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 10.50 కోట్లు. ఈ కారు అత్యంత సురక్షితమైన, అధిక సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది. ఇది బుల్లెట్లు, బాంబులు ఇతర ప్రాణాంతక ప్రమాదాల్లో రక్షించడానికి ప్రత్యేకంగా తయారుచేశారు. బిఎండబ్ల్యు 760ఎల్ఐ సెక్యూరిటీ: రూ. 8.9 కోట్లు విలువ చేసే బిఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 760ఎల్ఐ సెక్యూరిటీ కూడా ముఖేష్ అంబానీ వినియోగించే కార్లలో ఒకటి. ఈ లగ్జరీ సెడాన్ 6 లీటర్ V12 ఇంజన్ కలిగి 544 బిహెచ్పి పవర్, 880 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అధిక భద్రతా ఫీచర్స్ కలిగిన కార్లలో ఇది ఒకటి. ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్: అంబానీ గ్యారేజిలోని మరో ఖరీదైన కారు ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్. దీని ధర రూ. 7.50 కోట్లు. ఈ స్పోర్ట్స్ కారు 2019లో ప్రారంభమై హైబ్రిడ్ టెక్నాలజీ ఉపయోగించిన మొదటి కారు. ఇది 4 లీటర్ వి8 ఇంజిన్ కలిగి 769 బిహెచ్పి పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్: బెంట్లీ కంపెనీకి చెందిన కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ ధర రూ. 3.69 కోట్లు. ఇది 2005లో బెంట్లీ ఆర్నేజ్కు వారసుడిగా పరిచయమైంది. కావున ఇది కూడా అదే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ 6 లీటర్ డబ్ల్యు12 ఇంజన్‌తో అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఈ కార్లతో పాటు ముఖేష్ అంబానీ గ్యారేజిలో మరిన్ని ఖరీదైన కార్లు ఉన్నాయి. -
AirIndia Deal: యూకే పీఎం రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు
ప్రపంచంలోని అగ్ర దేశాలకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ సంస్థలతో భారత విమానయాన సంస్థ ఎయిరిండియా కుదుర్చుకున్న ఒప్పందాలపై ఆయా దేశాల అధినేతలు స్పందించారు. బ్రిటన్‌కు చెందిన రోల్స్ రాయిస్, ఎయిరిండియా మధ్య జరిగిన డీల్ ఓ మైలురాయిలా నిలిచిపోతుందని యూకే ప్రధాని రిషి సుకాక్ అభివర్ణించారు. టాటా నేతృత్వంలోని ఎయిరిండియా అమెరికాకు చెందిన బోయింగ్, ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్ బస్ సంస్థలతో అతిపెద్ద డీల్ కుదుర్చుకుంది. వాటి నుంచి మొత్తం 470 ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బ్రిటన్‌కు చెందిన రోల్స్ రాయిస్ నుంచి కూడా ఎక్స్‌డబ్ల్యూబీ ఇంజిన్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు లింక్డ్ఇన్లో చేసిన పోస్టులో రిషి సునాక్.. ఎయిరిండియా, ఎయిర్‌బస్, రోల్స్‌రాయిస్‌ల మధ్య జరిగిన డీల్స్ యూకే ఏరోస్పేస్ రంగానికి హద్దులు లేకుండా చేశాయన్నారు. ఎయిర్‌బస్ విమానాల రెక్కలను యూకేలోనే తయారు చేస్తుందని, అలాగే ఏ350 ఎయిర్ క్రాఫ్ట్స్‌కు రోల్స్ రాయిస్ ఎక్స్‌డబ్ల్యూబీ ఇంజిన్లను సమకూర్చుతుందన్నారు. ఎయిరిండియా డీల్‌తో యూకే ఏరోస్పేస్ రంగంలో మరిన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు. అలాగే 2050 కల్లా భారత్ ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు. (ఇదీ చదవండి: బోయింగ్‌కు హైదరాబాద్ నుంచి తొలి ‘ఫిన్’ డెలివరీ) మరోవైపు ఎయిరిండియా డీల్‌పై యూఎస్ ప్రెసిడెంట్ జోబైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మైక్రాన్ కూడా స్పందన తెలియజేశారు. ఎయిరిండియాతో ఒప్పందం అమెరికాలో లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని, అదే సమయంలో ఎయిరిండియాకు ట్రాన్స్‌పోర్టేషన్ డిమాండ్లు తీరుతాయని వైట్‌హౌస్ తెలియజేసింది. ఎయిరిండియా-ఎయిర్‌బస్ ఒప్పందం ఇండియా-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సరికొత్త అధ్యాయమని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మైక్రాన్ ట్విటర్ ద్వారా అభిప్రాయపడ్డారు. -
రోల్స్ రాయిస్ అల్ట్రా-లగ్జరీ తొలి ఈవీ స్పెక్టర్: షాకింగ్ ధర
న్యూఢిల్లీ: బ్రిటన్ కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ కూడా ఈవీ మార్కెట్లోకి అడుగు పెట్టింది.ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కస్టమర్లకోసం తొలి ఆల్-ఎలక్ట్రిక్ కారు ‘స్పెక్టర్’ ను ఆవిష్కరించింది. 2023 చివరికి కస్టమర్లకు వాహనాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ కారు పప్రారంభ ధర సుమారు దాదాపు రూ.3.5 కోట్లుగా ఉండనుంది. దాదాపు ఏడాది క్రితం దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసిన కంపెనీ తాజాగా దీన్ని లాంచ్ చేసింది.ఇప్పటికే దాదాపు 300కు పైగా ఈ లగ్జరీ కారును ప్రీబుకింగ్ అయ్యాయని రోల్స్ రాయిస్ సీఈఓ టోర్స్టన్ ముల్లర్-ఓట్వోస్ వెల్లడించారు. ఈవీ కార్లలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదే కాదు "అల్ట్రా-లగ్జరీ ఎలక్ట్రిక్ సూపర్ కూపే" , ఫాంటమ్ కూపేకి కొనసాగింపు అని పేర్కొన్నారు. తమ స్పెక్టర్ 3.4 సెకన్లలో 0-100 (కిమీ/గం) వేగం పుంజుకుంటుందని తెలిపారు. డిజైన్ పరంగా, ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ మెరుగైన ఏరోడైనమిక్ సామర్థ్యం, విశాలమైన గ్రిల్‌ను యాడ్ చేసింది. అలాగే బానెట్‌పై కొత్త 'స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ’ అని పేర్కొంది. కేవలం 2 డోర్లు మాత్రమే ఉన్న ఈ అతి విలాసవంతమైన కారులోని ఇతర విశేషాలను గమనిస్తే. ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు మధ్యలో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేను అందించింది.అలాగే స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్, హెడ్‌ల్యాంప్ క్లస్టర్, హై-మౌంటెడ్ అల్ట్రా-స్లిమ్ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (డీఆర్ఎల్స్), అలాగే ఏరో-ఆప్టిమైజ్ 23 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. -
దూసుకొస్తున్న రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు, ధర ఎంతంటే!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. 2023 చివరి నాటికి రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు 'రోల్స్ రాయిస్ స్పెక్టర్'ను విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ కారును రెండో సారి టెస్ట్ డ్రైవ్ నిర్వహించగా..ఆ కారులో 40శాతం అభివృద్ధి సాధించినట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఆ టెస్ట్ డ్రైవ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రోల్స్ రాయిల్స్ ఈవీ కారును ఆ సంస్థ రెండో సారి ఫ్రెంచ్ రివేరా, దక్షిణ ఫ్రాన్స్‌లో 625,000 కిలోమీటర్ల వరకు టెస్ట్ డ్రైవ్ నిర్వహించింది. దీంతో ఇప్పటి వరకు 2.5 మిలియన్ కిలోమీటర్ల టెస్ట్ డ్రైవ్‌ను పూర్తి చేసినట్లైంది. ఇక ఈ టెస్ట్‌లో కారులో 40 శాతం అభివృద్ధిని సాధించింది. ఈ సందర్భంగా రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ సీఈవో టోర్స్టెన్ ముల్లర్ ఓట్వోస్ మాట్లాడుతూ..రోల్స్ రాయిస్ కారు తరహాలో ఈ కొత్త ఈవీ కారు ఉండదని, వాటన్నింటి కంటే భిన్నంగా ఉంటుందని అన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ వేరియంటే కాకుండా.. కంప్యూటింగ్ సామర్ధ్యం ,లేటెస్ట్ డేటా ప్రాసెసింగ్ టెక్నాలజీ అప్లికేషన్ కనెక్ట్ చేసిన రోల్స్ రాయిస్ అని చెప్పారు. అంతేకాదు ఈ కారులో స్టార్ట్ రాడ్, ట్రాన్స్వెర్స్ రాడ్ (Transverse), కాయిల్ స్పింగ్, షాక్ అబ్జార్బర్స్(అంవాంఛనీయ ఘటనలు..లేదంటే రోడ్డు ప్రమాదాల్ని నివారించే సిస్టం), డ్రమ్, కంట్రో ఆర్మ్, డ్రైవ్ యాక్సిల్ భాగాల్ని కలిపే సస్పెన్షన్ సిస్టం 'మ్యాజిక్ కార్పెట్ రైడ్' ఫీచర్లు ఉన్నాయి. తమ సంస్థ చరిత్రలోనే తొలిసారి 1.5 మీటర్ల పొడవైన పిల్లర్ లెస్ కోచ్ డోర్లను ఈ ఈ కార్లలో ప్రవేశ పెట్టిందని టోర్స్టెన్ గుర్తు చేశారు. దాదాపు నాలుగు మీటర్ల పొడవుతో ముందు ఏ' పోల్ నుంచి వెనుక టెయిల్లైట్ల వరకు వన్ పీస్ సైడ్ ప్యానల్ విస్తరించింది ఉంది. అదేవిధంగా, పిల్లర్‌లెస్ కోచ్ డోర్లు దాదాపు 1.5 మీటర్ల పొడవుతో రోల్స్ రాయిస్ చరిత్రలో అత్యంత పొడవైనవి ఈ సందర్భంగా వివరించారు. కారు ధర ఎంతంటే! మోటార్ కార్లు, ఎలక్ట్రిక్ కార్ల ధరల్ని పోల్చితే.. ఈవీ కారు రోల్స్ రాయిస్ స్పెక్టర్ మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ కారుగా అవతరించనున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పలు నివేదికల ప్రకారం..ఈ కారు ధర £400,000 (భారత్ కరెన్సీలో రూ.3,86,46,873.07) ఉండగా.. భవిష్యత్‌లో ఈ కారు ధర మరింత పెరిగే అవకాశం ఉండనుంది. -
రోల్స్‌రాయ్స్: గంటకు 623 కిలోమీటర్లు..
భూమిలో ఇంధనాలు అడుగంటిపోతుండటం, కర్బన ఉద్గారాలు పెరిగిపోతుండటంతో.. వాహనాల తయారీదారులు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నారు. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. బైక్‌లు, కార్ల నుండి విమానాలకు చేరుకుంది. రోల్స్‌రాయ్స్... అందరికీ అత్యంత ఖరీదైన కార్ల కంపెనీగానే తెలుసు. అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ విమానాన్ని ఇటీవల పరీక్షించింది. ఈ సంస్థ తయారు చేసిన ‘స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్’ఆల్–ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ వేగంలో మూడు కొత్త ప్రపంచ రికార్డులను సృష్టించింది. యూకే రక్షణ మంత్రిత్వ శాఖ బోస్కోంబ్డౌన్ టెస్టింగ్ సైట్లో దీనిని పరీక్షించారు. టెస్ట్ ఫ్లైట్‌ను రోల్స్‌రాయ్స్ కంపెనీ ఫ్లైట్ ఆపరేషన్ డైరెక్టర్ ఫిల్ ఓడెల్ నడిపారు. ఫ్లయింగ్ ట్యాక్సీస్ తమ భవిష్యత్ ప్రణాళిక అని చెబుతోంది రోల్స్‌రాయ్స్. ‘రోడ్డు, సముద్ర, ఆకాశయాన మార్గాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాల్లో భాగమే ఈ ఎలక్ట్రిక్ ప్లేన్’అని రోల్స్‌రాయ్స్ సీఈఓ వారెన్ ఈస్ట్ చెబుతున్నారు. డిపార్ట్మెంట్ ఫర్ బిజినెస్, ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ స్ట్రాటజీ మరియు ఇన్నోవేట్ యూకే భాగస్వామ్యంతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు సగం నిధులను బ్రిటీష్ ఏరోస్పేస్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అందించింది. ప్రత్యేకతలు.. ఇది పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ విమానం. గంటకు 387.4 మైళ్ల (గంటకు 623 కి.మీ) వేగంతో దూసుకెళ్తుంది. ఈ వేగం పాత రికార్డుకంటే... 132 మైళ్లు (212.5 కిలోమీటర్లు) ఎక్కువ. 60 సెకన్లలోనే మూడు వేల మీటర్ల ఎత్తు ఎగరడం ఈ విమానం ప్రత్యేకత. గతంలో ఉన్న రికార్డులు... గతంలో విమానం 3 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 345 మైళ్లు (555.9 కిలోమీటర్ల), 15 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 331 మైళ్లు (531.1 కిలోమీటర్లు), 202 సెకన్లలో మూడువేలమీటర్ల ఎత్తుకు ఎగిరిన రికార్డులున్నాయి. ఈ మూడు రికార్డులను ‘స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్’బ్రేక్ చేసింది. బ్యాటరీ పనితీరు.. 400 కిలోవాట్ల పవర్ బ్యాటరీ దీని సొంతం. దీని సామర్థ్యం 7,500 స్మార్ట్ఫోన్లు పూర్తిగా చార్జ్ చేసేంత. సాధారణంగా వాషింగ్ మెషీన్స్‌లో ఉండే స్పిన్ 1000 ఆర్పీఎం ఉంటుంది. దానికి రెట్టింపు సామర్థ్యంతో ఈ విమానం ప్రొఫెల్లర్స్ తిరుగుతాయి. బ్యాటరీని కూల్‌గా ఉంచడం కోసం పోర్చుగీస్ కార్క్‌తో థెర్మల్ రక్షణ కవచం ఏర్పాటు చేశారు. -
అరె డాల్ఫిన్‌లా ఉందే, వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రికార్డ్లను తుడిచి పెట్టింది
రోల్స్ రాయిస్‌కు చెందిన 'స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్' ఎలక్ట్రిక్ ఫ్లైట్ ఇప్పటి వరకు అన్నీ రికార్డ్లను తుడిచిపెట్టింది. మూడు సరి కొత్త ప్రపంచ రికార్డ్లను క్రియేట్ చేసి ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్‌గా ప్రసిద్ధికెక్కింది. ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ స్ట్రాటజీ అండ్ ఇన్నోవేట్ యూకే భాగస్వామ్యంతో ఏరోస్పేస్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (ATI) సంస్థ నిధుల్ని అందించింది. ఆ నిధులతో రోల్స్ రాయిస్ 'యాక్సిలరేటింగ్ ది ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఫ్లైట్' పేరుతో స్పిరిట్ ఆఫ్ ఇన్నోవేషన్ అనే ఎలక్ట్రిక్ ఫ్లైట్‌ను తయారు చేసింది. అయితే తాజాగా యూకే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ బోస్కోంబ్ డౌన్ ఎయిర్‌క్రాఫ్ట్ టెస్టింగ్ నిర్వహించింది. ఈ టెస్టింగ్‌లో రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ విమానం 3 కిలోమీటర్లను 555.9 కేఎం/హెచ్ (345.4 ఎంపీహెచ్ ) అత్యధిక స్పీడ్‌తో అధిగమించింది. దీంతో ఇప్పటికే ఉన్న రికార్డ్‌ను 213.04 కేఎం/హెచ్ (132ఎంపీహెచ్) బద్దలు కొట్టింది. అంతేకాదు విమానం 532.కేఎం/హెచ్ (330 ఎంపీహెచ్) స్పీడ్‌తో 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లి ఈ అరుదైన ఫీట్‌ను సాధించగా, ఒకే సమయంలో 3000 కిలోమీటర్ల ఎత్తును ఒకేసారి 60 సెకన్ల నుంచి 202 సెకన్ల సమయంలో అధిగమించింది. రికార్డ్‌ను క్రియేట్ చేసే సమయంలో విమానం 623కేఎం/హెచ్ (387.4ఎంపీహెచ్) గరిష్ట వేగాన్ని అందుకుంది. తో ఇదే ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్‌గా నిలిచింది. ఈ రికార్డ్లను వరల్డ్ ఏరోనాటికల్ అండ్ ఆస్ట్రోనాటికల్ రికార్డులను నియంత్రించే, ధృవీకరించే వరల్డ్ ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ - ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ (FAI)రోల్ రాయిస్ రికార్డ్లను ధృవీకరించాయి. చదవండి: బిఎమ్‌డబ్ల్యు ఎలక్ట్రిక్ స్కూటర్ ధరెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! -
రోల్స్ రాయిస్ లగ్జరీ కారు భారత మార్కెట్లోకి
బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీదారు రోల్స్ రాయిస్ భారతదేశంలో మరో న్యూ మోడల్ కారును మన మార్కెట్లోకి తీసుకొచ్చింది. కలినన్ ఎస్యూవీ ధరను భారతదేశంలో రూ .6.95 కోట్ల (ఎక్స్ షోరూం, ఇండియా) ధరగా నిర్ణయించింది. రోల్స్ రాయిస్ కొత్త ఎస్‌యూవీని 'లగ్జరీ ఆర్కిటెక్చర్' గా నిర్మించినట్టు కంపెనీ ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన వజ్రంగా చెప్పుకునే కలినన్ డైమండ్ పేరుతో 'రోల్స్ రాయిస్ కలినన్'ను విడుదల చేసింది రోల్స్ రాయిస్. ప్రపంచం మొత్తం మీద అత్యంత కాస్ట్లీ ఎస్యూవీ కూడా ఇదేనని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అన్ని భౌగోళిక, వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ కారును తయారుచేశామని కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా 'ఎవ్రీవేర్' మోడ్ ఆప్షన్ ద్వారా ఇసుక, మట్టి, తడిగడ్డి, కంకరరోడ్డు, మంచురోడ్డు ఇలా దేనిమీదైనా ఈ కారును ఏమాత్రం కుదుపులు లేకుండా, హాయిగా నడపొచ్చని పేర్కొంది. ఫీచర్లు 6.75 లీటర్ల వీ 12 ఇంజిన్, 653 బీహెచ్పీ శక్తిని, 850 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డాష్‌బోర్డుపై టచ్‌స్క్రీన్‌తో పాటు ముందు సీట్ల వెనుక కూడా 12 అంగుళాల టచ్స్క్రీన్లను ఏర్పాటుచేశారు. 22 అంగుళాల అల్లోయ్ వీల్స్ జోడించింది. అలాగే వెనుకవైపు సీట్ల కింద బూట్లో రెండు ఇన్నర్ బెంచీలను ఏర్పాటుచేశారు. కావాలనుకుంటే వాటిని బయటకు లాగి కుర్చీల్లా మార్చుకోవచ్చన్నమాట. -
ఎగిరే కార్ల రేసులోకి ఆ కంపెనీ కూడా..
డ్రైవర్ అనే వాడే లేకుండా వాటంతట అవే నడిచే వాహనాలు రోడ్ల మీదకు వస్తాయి. కేవలం రోడ్లపైనే కాక, గగనంలోనూ స్వయంప్రతిపత్త వాహనాలు ఎగరబోతున్నాయి. ఈ బిగ్ ట్రాన్స్‌పోర్టేషన్ ట్రెండ్ ఇప్పుడిప్పుడే ప్రపంచమంతటా వ్యాప్తిస్తోంది. ఉబర్ దుబాయ్‌లో ఈ ఎగిరే ట్యాక్సీ నెట్‌వర్క్‌ను క్రియేట్ చేస్తుండగా.. గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీపేజ్ కిట్టి హాక్ అనే ఎగిరే కారు స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ఇప్పటికే పలువురు కస్టమర్లకు వీటిని ఆఫర్ చేస్తుంది కూడా. తాజాగ ఈ రేసులోకి రోల్స్ రాయిస్ కూడా వచ్చి చేరింది. యూకేలో జరిగిన ఫార్న్బోరో అంతర్జాతీయ ఎయిర్ షోలో ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ఈ వెహికిల్ హెలికాప్టర్ తరహాలో గగనతలంలో ఎగరడంతోపాటు రోడ్డుపైనా దూసుకెళ్తుంది. ఈ వెహికిల్ ఐదుగురు ప్రయాణికులను తీసుకెళ్లడంతో పాటు, గాల్లో 500 మైళ్ల (805 కిలోమీటర్లు) వరకు ప్రయాణించగలదని, గంటకు గరిష్ఠంగా 200 మైళ్ల వేగంతో దూసుకెళ్లగలదని సంస్థ తెలిపింది. మరో ఏడాదిన్నరలో ఈ హైబ్రిడ్ ఫ్లయింగ్ ట్యాక్సీ ప్రొటొటైప్ సిద్ధం కానుందని, 2020నాటికి వెహికిల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రోల్స్‌రాయిస్ ఎలక్ట్రిక్ టీమ్ హెడ్ రాబ్ వాట్సన్ తెలిపారు. టేకాఫ్ అవ్వడం కానీ ల్యాండ్ అవ్వడం కానీ వెర్టికల్‌గా జరుగుతుందని కంపెనీ తెలిపింది. ఈ వెహికిల్ వింగ్స్ 90 డిగ్రీల్లో తిరుగుతూ ఉంటాయని చెప్పింది. -
ఈ రోల్స్ రాయస్ వెరీ వెరీ స్పెషల్...
-
ఈ రోల్స్ రాయస్ వెరీ వెరీ స్పెషల్...
అతి ఖరీదైన కార్లకు పెట్టింది పేరైన బ్రిటిష్ అల్ట్రా లగ్జరీ కార్ మేకర్ రోల్స్ రాయిస్ సరికొత్త కారును ఈ వారం ఆవిష్కరించింది. ఎలిగెన్స్ పేరుతో జెనీవా మోటారో షోలో లాంచ్ చేసిన ఈ రాయల్ కారు గురించి తెలుసుకోవాల్సిందే. అసలే కోట్ల రూపాయలు ఖరీదు చేసే కారు.. అలాంటి కారుపై వజ్రాలు పొదిగితే ఎలా ఉంటుంది.. ఎందుకంటే మామూలుగానే రోల్స్ రాయిస్ కార్లు చాలా ప్రత్యేకం. అలాంటి రాయల్ కార్లతో పోలిస్తే ఇది మరీ స్పెషల్ . దాదాపు వెయ్యి రియల్ డైమండ్ల డస్ట్ తో దీన్ని పెయింట్ చేశారు. ఈ డైమండ్ పూతను ప్రత్యేకంగా చేతితోనే రూపొందించి మరింత స్పెషల్ అప్పీల్ తీసుకొచ్చారు. కారు టాప్ పార్ట్ డార్క్ గ్రే కలర్, దిగువ భాగం లైట్ బూడిద రంగులో డిజైన్ చేసినప్పటికీ ..ఈ కారు పై లైటింగ్ పడినపుడుమాత్రం మెటాలిక్ పెయింట్‌తో వజ్రపు కాంతుల మెరుపులతో మెరిసిపోతూ కార్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకోనుంది. దీనికోసం తమ టెక్నికల్ టీం రెండు నెలలు కష్టపడిందని రోల్స్ రాయిస్ తెలిపింది. యూనిక్ లైట్ ట్రాన్స్మిషన్, వజ్రాల కాంతి రిఫ్లెక్షన్ కోసం తమ టెక్నీషియన్స్ చాలా జాగ్రత్తగా పనిచేసినట్టు చెప్పింది. అంతేకాదు అల్ట్రా హార్డ్ డైమండ్ డస్ట్ కు ప్రత్యేక శ్రద్ధతో అతిసున్నితమైన స్మూత్ టచ్ ను తీసుకొచ్చినట్టు చెప్పింది. అన్నట్టు డై మండ్ పెయింటింగ్‌ను ప్రత్యేకంగా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదట. అయితే దీని ధర ఎంతో కంపెనీ రివీల్ చేయలేదు. ఎందుకంటే ఒకప్రత్యేక ప్రయివేటు కస్టమర్ కోసం దీన్ని రూపొందించారట. -
రోడ్లూడ్చిన రోల్స్‌రాయ్స్
లండన్‌లోని బాండ్ స్ట్రీట్. ఒకాయన ఆ వీధిలో నడుస్తున్నాడు. మార్గమధ్యంలో రోల్స్‌రాయ్స్ షోరూమ్ కనిపించింది. వెంటనే ఆ షోరూమ్‌లోకి వెళ్లిన ఆయన కార్ల ధరలు, ఇతర ఫీచర్స్ గురించి అడిగాడు. ఇండియా నుంచి వచ్చిన అందరిలాంటి ఓ సాధారణ వ్యక్తి అనుకున్న సేల్స్‌మ్యాన్.. అతడిని అవమానించాడు. బయటికి గెంటేసినంత పని చేశాడు. అలా అవమానం పొందిన వ్యక్తి ఎవరో కాదు హైదరాబాద్ నవాబు ముకర్రమ్ జా. వెంటనే హోటల్‌రూమ్‌కు వచ్చిన నవాబు తన సేవకులతో షోరూమ్‌కు ఫోన్ చేయించాడు. కార్లు కొనడానికి హైదరాబాద్ నవాబు వస్తున్నాడని చెప్పించాడు. ఈసారి పూర్తిగా నవాబు హోదా, రాజఠీవీతో షోరూమ్‌కు బయలుదేరాడు. ఆయన అక్కడికి చేరేటప్పటికే ఫ్లోర్‌పై రెడ్‌కార్పెట్ పరిచి ఉంది. అక్కడ ఉన్న సేల్స్‌మెన్ వంగి వంగి దండాలు పెట్టారు. నవాబు అప్పుడు షోరూమ్‌లో ఉన్న ఆరు కార్లను డెలివరీ ధరలు కూడా చెల్లించి కొనేశాడు. ఇండియాకు చేరుకున్న నవాబు కార్లు రాగానే... ఆ ఆరు కార్లకు పొరకలు కట్టి హైదరాబాద్ రోడ్లను శుభ్రం చేయించాలని మున్సిపల్ డిపార్ట్మెంట్ను ఆదేశించాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రోల్స్‌రాయ్స్ కార్లు అలా నగరంలో చెత్తను శుభ్రం చేయడానికి ఉపయోగించారు. ఈ వార్త ఈ పత్రికా, ఆ పత్రికా చేరి చివరకు... ప్రపంచ ప్రఖ్యాత రోల్స్‌రాయ్స్ పరువు మురికి కాలువలో కలిసింది. యూరప్ అమెరికాల్లో ఈ కారును ఉపయోగించిన వారు.. ‘ఏది ఇండియాలో చెత్త మోయడానికి వాడుతున్నారే.. ఆ కారా?’ అని వ్యంగ్యంగా అనేవారట. ఒక్కసారిగా రోల్స్‌రాయ్స్ ప్రతిష్టతోపాటు రెవెన్యూ కూడా తగ్గిపోయింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా అసలుకే ఎసరొస్తుందనుకున్న రోల్స్‌రాయ్స్ యాజమాన్యం..నవాబుకు క్షమాపణలు చెబుతూ టెలిగ్రాం పంపింది. కార్లతో రోడ్లు క్లీన్చేయించడం ఆపేయాలని కోరింది. అంతేకాదు.. తాము చేసిన తప్పుకు బదులుగా ఆరు రోల్స్‌రాయ్స్ కార్లను ఉచితంగా ఇస్తామని కూడా ఆఫర్ చేసింది. 1967లో అతని నాన్నమ్మ మరణానంతరం ముకర్రమ్ జా యువరాజయ్యాడు. ప్రస్తుతం అతని ప్యాలెస్ మ్యూజియంగా మారింది. ఆ రోల్స్‌రాయ్స్ కార్లు కూడా ప్రదర్శనకు ఉంచారు.