రోల్స్ రాయిస్... అత్యంత ఖరీదైన ఈ కారును కొనుగోలు చేయాలని కొందరు కోటీశ్వరులు తహతహలాడుతుంటారు. అలాగే రోల్స్ రాయిస్ కార్ల కంపెనీ ప్రతీ కారును సంబంధిత వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా సిద్ధం చేస్తుంది. ఒక్కో రోల్స్ రాయిస్ కారు తయారీకి సుమారు ఆరు నెలల సమయం పడుతుంది.
దీనికిగల కారణం.. రోల్స్ రాయిస్ కారులోని కొన్ని భాగాలకు చేతితో పెయింటింగ్ చేసి, వాటిని అసెంబుల్ చేస్తారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నకారణంగానే ఈ కారు ధర కోట్లలో ఉంటుంది. అయితే రోల్స్ రాయిస్ కారు క్వాలిటీని కేవలం ఐదు రూపాయల నాణెంతో చెక్ చేయవచ్చంటున్నారు ప్రముఖ యూట్యూబర్, స్టాక్ మార్కెట్ నిపుణుడు పీ ఆర్ సుందర్. ఈ కారుకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలను ఆయన మీడియాతో పంచుకున్నారు.
రోల్స్ రాయిస్ చాలా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుందని, వీటి గురించి తెలిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుందని ఆయన తెలిపారు. కారు ఇంజన్ ఆన్‌లో ఉన్నప్పుడు దానిపై ఐదు రూపాయల నాణెం ఉంచితే.. అది కదలి, కిందికు పడిపోదన్నారు. రోల్స్ రాయిస్ ఇంజన్ ఆన్‌లో ఉన్నప్పుడు కూడా దానిలో వైబ్రేషన్ రాదని సుందర్ తెలిపారు.
రోల్స్ రాయిస్ కారును భారత్‌కు తీసుకురావాలంటే అధిక మొత్తంలో దిగుమతి పన్ను చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. భారతదేశంలో ఈ కారును నడపాలనుకుంటే, కారు కోసం ప్రత్యేకంగా పాస్‌పోర్ట్, వీసా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దుబాయ్‌లోని తన రోల్స్ రాయిస్‌ను భారత్‌కు తీసుకురావడానికి వీసా, పాస్‌పోర్ట్ పొందానని తెలిపారు. ఆరు నెలల తర్వాత తన కారును తిరిగి దుబాయ్‌కి తీసుకెళ్లాల్సి ఉంటుందని సుందర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment