Rolls Royce Cullinan: భారతదేశంలో ముఖేష్ అంబానీ గురించి, వారి కుటుంబం గురించి దాదాపు అందరికి తెలుసు. ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉంటూ.. రిలయన్స్ గ్రూప్ వంటి బడా కంపెనీతో కోట్లు సంపాదిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నారు. అత్యంత విలాసవంతమైన భవనాల్లో నివసించడమే కాకుండా ఖరీదైన లగ్జరీ కార్లను సైతం లెక్కకు మించి కొనుగోలు చేశారు. వీరి వద్ద ఇప్పటికే మూడు రోల్స్ రాయిస్ కార్లు ఉండటం గమనార్హం. వీటి ధరలు రూ. కోట్లలో ఉన్నాయి. కాగా ఇందులో ఒక కారు పెయింట్ ఖర్చు మాత్రమే రూ. 1 కోటి వరకు ఉంటుందని చెబుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
గత సంవత్సరంలో ముఖేష్ అంబానీ మూడవ 'రోల్స్ రాయిస్ కల్లినన్' (Rolls Royce Cullinan) డెలివరీ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న దాదాపు అన్ని కార్లలో ఈ కారు చాలా ప్రత్యేకమైనదని చెబుతారు. ఇది ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కలిగి ఉండటమే కాకుండా, వారికి నచ్చిన విధంగా తయారైంది. దీన్ని బట్టి చూస్తే ఇది కస్టమైజేషన్ కారు అని తెలుస్తోంది. ఈ కారు ధర ఏకంగా రూ. 13.14 కోట్లు అని నివేదికలు చెబుతున్నాయి.
మార్కెట్లో రోల్స్ రాయిస్ కల్లినన్ బేస్ మోడల్ ప్రారంభ ధర రూ. 6.8 కోట్లు. అయితే ఇది ఆప్షనల్ ఫీచర్స్ కలిగి కస్టమైజ్ పొందటం వల్ల ధర ఎక్కువ అని తెలుస్తోంది. ఇందులో తెలుసుకోవలిసిన మరో అంశం ఏమిటంటే పెయింటింగ్ స్కీమ్. ఈ కారు పెయింట్‌వర్క్‌కే రూ. 1 కోటి ఖర్చు అయినట్లు సమాచారం. 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉండటం కూడా ఇందులో గమనించవచ్చు.
(ఇదీ చదవండి: ఇన్‌స్టా సంపాదనలో వీరిని మించిన వారే లేరు! టాప్ 5 జాబితాలో ఎవరున్నారంటే?)
రిజిస్ట్రేషన్ నెంబర్
ముఖేష్ అంబానీ కల్లినన్ 0001 అనే రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగి ఉంటుంది. సాధారణ విఐపి నెంబర్ ధర రూ. 4 లక్షలు. అయితే ఈ నెంబర్ మరింత స్పెషల్ కావున దీని ధర రూ. 12 లక్షలు. అంతే కాకుండా ఈ కారు కోసం రూ. 20 లక్షలు వన్-టైమ్ టాక్స్ చెల్లించారు. ఇది 2037 వరకు చెల్లుబాటు అవుతుంది.
(ఇదీ చదవండి: ఆఫర్ అంటే ఇలా ఉండాలి.. అతి తక్కువ ధరకే ఒప్పో 5జీ స్మార్ట్‌ఫోన్!)
భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో ముఖేష్ అంబానీ గ్యారేజిలో రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాకుండా మెర్సిడెస్ బెంజ్, బెంట్లీ బెంటాయగ, బీఎండబ్ల్యూ, ఫెరారీ మొదలైన ఖరీదైన కార్లు ఎన్నో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment