
Rolls Royce Boat Tail: ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు ఏది అంటే వెంటనే వచ్చే సమాధానం 'రోల్స్ రాయిస్' (Rolls Royce). ఈ బ్రాండ్ కార్లు ప్రారంభ ధరలే కోట్లలో ఉంటాయి. కాగా గరిష్ట ధరలు ఏకంగా రూ. 200 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి అత్యంత ఖరీదైన కారు దుబాయ్ రోడ్ల మీద మొదటిసారి కనిపించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
'రోల్స్ రాయిస్ బోట్ టెయిల్' (Rolls Royce Boat Tail) పేరుతో అందుబాటులో ఉన్న ఈ కారు ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కావడం గమనార్హం. ఇప్పటికే 'బెయోన్స్ అండ్ జే జెడ్' ఈ కారుని కొనుగోలు చేసినట్లు సమాచారం.
ధర..
నిజానికి ఈ కారుని ఆవిష్కరించిన తరువాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కనిపించడం ఇదే మొదటిసారి. కాగా కంపెనీ ఇప్పటి వరకు ఈ కార్లను కేవలం మూడు యూనిట్లను మాత్రమే విడుదల చేసింది. దీని ధర 28 మిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 220 కోట్ల కంటే ఎక్కువ.
(ఇదీ చదవండి: ప్రపంచ దేశాల్లో వణుకుపుట్టిస్తున్న భారత్ నిర్ణయం - బియ్యం ధరల్లో పెనుమార్పులు!)
రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ బ్రాండ్ మోడల్స్ కంటే కూడా చాలా బిన్నంగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో లభించే ఫీచర్స్ దాదాపు ఇప్పటివరకు ఇతర ఏ లగ్జరీ కార్లలోనూ లభించకపోవడం విశేషం. కావున దీనిని కంపెనీ స్పెషల్ కారు అని కూడా పిలుస్తారు. డిజైన్ మాత్రం చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఇందులో చెప్పుకోదగ్గ మరో ఫీచర్ వెనుక భాగంలో కనిపించే కాక్టెయిల్ స్టోర్. ఇందులో అవసరమైన డ్రింక్స్ స్టోర్ చేసుకోవచ్చు. దీనితో పాటు కంప్ర్టిబుల్ టేబుల్స్, కుర్చీలు వంటివి లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment