spotted
-
ఇండియా-చైనా సరిహద్దుల్లో డ్రోన్ కదలికలు: హిమాచల్ మంత్రి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో ఉన్న ఇండియా-చైనా సరిహద్దుల్లో డ్రోన్ కదలికలను గుర్తించినట్లు హిమాచల్ ప్రదేశ్ మంత్రి జగత్ సింగ్ నేగి తెలిపారు. సరిహద్దుల్లో పొరుగు దేశం చైనా.. డ్రోన్లను నిఘా, గూఢచర్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు ఆయన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బోర్డర్లో డ్రోన్ల కదలికల విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కిన్నౌర్ జిల్లాలోని షిప్కి లా , రిషి డోగ్రీ గ్రామాల్లో డ్రోన్ కార్యకలాపాలను గుర్తించాం. సరిహద్దు ప్రాంతానికి సమీపంలో తరచుగా డ్రోన్లు ఎగురుతున్నట్లు గత వారంలో కూడా గుర్తించాం. షిప్కిలా, రిషిడోగ్రి గ్రామాల్లో వాస్తవ నియంత్రణ రేఖ వరకు రహదారి నిర్మాణం పురోగతిలో ఉంది. ..పొరుగుదేశం చైనా ఈ డ్రోన్ల ద్వారా నిఘా, గూఢచర్యానికి పాల్పడే అవకాశాన్ని తోసిపుచ్చలేం. డ్రోన్లను పోలీసులు, ఆర్మీ సిబ్బంది సైతం చూశారు. చైనా డ్రోన్లు భారత గగనతలంలోకి చొరబడటం చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని అవసరమైన ఆదేశాలు జారీ చేయాలి’ అని అన్నారు.ఇక.. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్, లాహౌల్, స్పితి గిరిజన జిల్లాలు చైనాతో 240 కిలో మీటర్ల సరిహద్దును కలిగి ఉన్నాయి. -
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చిరుతల సంచారం
-
మెదక్ జిల్లాలో చిరుత సంచారం
-
నంద్యాల జిల్లాలో మరోసారి చిరుత కలకలం
-
తిరుమలలో మరోసారి చిరుత కలకలం..
-
సర్జరీ తర్వాత కెమెరా కంటపడిన బ్రిటన్ యువరాణి?
బ్రిటీష్ రాజకుటుంబానికి చెందిన కోడలు కేట్ మిడిల్టన్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటి మధ్య కేట్ మిడిల్టన్ మొదటిసారిగా బహిరంగంగా కనిపించారు. కేట్ మిడిల్టన్ ఇటీవల తన భర్త ప్రిన్స్ విలియమ్‌తో కలిసి లండన్ సమీపంలోని విండ్సర్ ఫార్మ్స్ లో కనిపించారు. బ్రిటీష్ మీడియా నివేదికల ప్రకారం కేట్ మిడిల్టన్ ఆ సమయంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆమె బహిరంగంగా కనిపించడంపై బ్రిటిష్ మీడియా హర్షం వ్యక్తం చేసింది. బ్రిటిష్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేట్ మిడిల్టన్ షాపింగ్ చేస్తూ కనిపించారు. దీనిపై బ్రిటన్ మీడియా సంతోషం వ్యక్తం చేస్తూ ‘కేట్.. మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది’ అని రాసింది. కొన్ని మీడియా సంస్థలు ఈ జంటకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాయి. ఒక క్రీడా కార్యక్రమానికి కేట్ మిడిల్టన్ తన భర్త, ముగ్గురు పిల్లలతో పాటు హాజరయ్యారని ఓ బ్రిటిష్ వార్తాపత్రిక పేర్కొంది. కేట్ మిడిల్టన్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ కారణంగా ఆమె గత ఏడాది చివరి నుండి బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఇటీవల మదర్స్ డే సందర్భంగా కేట్ మిడిల్టన్ ఫోటో రివీల్ అయ్యింది. అయితే అది వివాదాస్పదంగా మారింది. అప్పటి నుండి మిడిల్టన్ ఆరోగ్యంపై పుకార్లు వెల్లువెత్తాయి. దీనికితోడు బ్రిటిష్ రాజభవనమైన కెన్సింగ్టన్ ప్యాలెస్‌లోని పలువురు ఉద్యోగులు తాము కేట్‌ను చాలా రోజులుగా చూడలేదని పేర్కొన్నారు. దీంతో ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. I edited the video to enhance the image quality, and it's definitely #PrincessCatherine in the footage.#RoyalFamily #PrincessofWales pic.twitter.com/4yOdGwQ0Vm — Royal Gossip 🇬🇧 (@UKRoyalGossip) March 19, 2024 -
తిరుమలలో చిరుత..టీటీడీ కొత్త నిబంధనలు
-
తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంటి కలకలం
-
కారు చీకటిలో పెద్దపులి.. వీడియో వైరల్!
ఒకవేళ మీరు రాత్రి పూట పొలం మీదుగా వెళుతున్నప్పుడు హఠాత్తుగా పెద్ద పులి కనిపిస్తే ఏం చేస్తారు? ఇది ఊహకు వస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇటీవల కారులో చెరకు తోట పక్కగా వెళుతున్న కొంతమందికి ఇటువంటి అనుభవమే ఎదురయ్యింది. కారులో ఉన్న వారికి దారిలోపెద్ద పులి కనిపించింది. అంత భయంలోనూ వారు ఆ పెద్ద పులిని వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ 17 సెకన్ల వీడియో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని తేరాయ్కు చెందినదని తెలుస్తోంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో @prashant_lmp పేరుతో ఉన్న ఖాతాతో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన జనం తెగ ఆశ్చర్యపోతున్నారు. వీడియోను చూసినప్పుడు దీనిని వాహనంలో నుండి చిత్రీకరించారని గమనించవచ్చు. కారు బానెట్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేసిన యూజర్ ‘ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లా తేరాయ్లోని కొన్ని చెరకు పొలాల్లో పులులు సరదాగా తిరుగుతాయి. ఈ వీడియో కుక్రా ప్రాంతానికి చెందినది’ అనిరాశారు. ఈ పోస్ట్‌ను రీపోస్ట్ చేస్తూ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)అధికారి రమేష్ పాండే ..‘చెరకు పొలాలు అటు వేటగాళ్లకు, ఇటు వేటాడే క్రూర జంతువులకు ఇష్టమైన ప్రదేశం. అందుకే ఇటువంటి చోట్ల మనుషులు, క్రూరమృగాలు ఎదురుకావడం జరుగుతుంటుంది. శీతాకాలంలో ఇలా జరిగేందుకు అవకాశాలున్నాయి. కారు హెడ్ లైట్ల కాంతి పెద్దపులిపై పడుతుండటం వీడియోలో కనిపిస్తుంది’ అని రాశారు. ఇది కూడా చదవండి: ఆశారాం నుంచి రామ్ రహీం వరకూ ఏం చదువుకున్నారు? यूपी के तराई में पड़ने वाले लखीमपुर खीरी जिले में टाइगर्स कुछ ऐसे गन्ने के खेतों में मस्ती भरी चाल से घूमते हैं। वीडियो कुकरा इलाके की बताई जा रही। #Canetigers@rameshpandeyifs @DudhwaTR @raju2179 pic.twitter.com/ewhdJvbcPJ — Prashant pandey (@prashant_lmp) September 30, 2023 -
వర్షం మధ్య దాహార్తి తీర్చుకుంటున్న పులి.. అలరిస్తున్న అరుదైన వీడియో!
జూపార్కులో సఫారీ చేసే సమయంలో పులి కనిపించడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఊహించని రీతిలో సఫారీలో ఉన్న పర్యాటకులకు పులి ఎదురైతే ఇక వారి ఆనందానికి హద్దులుండవు. ఇలాంటి సందర్భాల్లో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ పాండే తన ట్విట్టర్ అకౌంట్లో ఇటువంటి క్లిప్నే షేర్ చేశారు. కర్నాటకలోని నేషనల్ పార్కులో కనిపించిన పులికి సంబంధించిన క్లిప్ అది. ఈ వీడియో బందీపూర్ నేషనల్‌పార్కులో షూట్ చేశారు. వీడియోలో ఒక పులి భారీగా వర్షం కురుస్తున్న సమయంలో నీరు తాగుతూ కనిపిస్తుంది. అది ఎంత సావధానంగా నీరు తాగుతున్నదో ఈ వీడియోను చూస్తే తెలుస్తుంది. ఈ వీడియోకు ఇప్పటివరకూ 2 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ అరుదైన వీడియో వీక్షకులను ఇట్టే ఆకట్టుకుంటోంది. వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: తల్లీకొడుకులను కలిపిన భారీ వరదలు.. 35 ఏళ్ల క్రితం వేరయి.. Tiger sighting in Monsoons. This comes from Bandipur. VC: FD Bandipur pic.twitter.com/OIgak01xV9 — Ramesh Pandey (@rameshpandeyifs) July 26, 2023 -
ప్రపంచంలోనే ఖరీదైన కారు మొదటిసారి రోడ్డుపై - చూస్తే హవాక్కావల్సిందే!
Rolls Royce Boat Tail: ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు ఏది అంటే వెంటనే వచ్చే సమాధానం 'రోల్స్ రాయిస్' (Rolls Royce). ఈ బ్రాండ్ కార్లు ప్రారంభ ధరలే కోట్లలో ఉంటాయి. కాగా గరిష్ట ధరలు ఏకంగా రూ. 200 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి అత్యంత ఖరీదైన కారు దుబాయ్ రోడ్ల మీద మొదటిసారి కనిపించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 'రోల్స్ రాయిస్ బోట్ టెయిల్' (Rolls Royce Boat Tail) పేరుతో అందుబాటులో ఉన్న ఈ కారు ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కావడం గమనార్హం. ఇప్పటికే 'బెయోన్స్ అండ్ జే జెడ్' ఈ కారుని కొనుగోలు చేసినట్లు సమాచారం. ధర.. నిజానికి ఈ కారుని ఆవిష్కరించిన తరువాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కనిపించడం ఇదే మొదటిసారి. కాగా కంపెనీ ఇప్పటి వరకు ఈ కార్లను కేవలం మూడు యూనిట్లను మాత్రమే విడుదల చేసింది. దీని ధర 28 మిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 220 కోట్ల కంటే ఎక్కువ. (ఇదీ చదవండి: ప్రపంచ దేశాల్లో వణుకుపుట్టిస్తున్న భారత్ నిర్ణయం - బియ్యం ధరల్లో పెనుమార్పులు!) రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ బ్రాండ్ మోడల్స్ కంటే కూడా చాలా బిన్నంగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో లభించే ఫీచర్స్ దాదాపు ఇప్పటివరకు ఇతర ఏ లగ్జరీ కార్లలోనూ లభించకపోవడం విశేషం. కావున దీనిని కంపెనీ స్పెషల్ కారు అని కూడా పిలుస్తారు. డిజైన్ మాత్రం చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఇందులో చెప్పుకోదగ్గ మరో ఫీచర్ వెనుక భాగంలో కనిపించే కాక్టెయిల్ స్టోర్. ఇందులో అవసరమైన డ్రింక్స్ స్టోర్ చేసుకోవచ్చు. దీనితో పాటు కంప్ర్టిబుల్ టేబుల్స్, కుర్చీలు వంటివి లభిస్తాయి. -
ఎలుగుబంట్ల సంచారంతో సున్ని పెంటలో భయాందోళనలు
-
రుషికొండ తీరంలో వేల్‌షార్క్ సందడి
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచంలో అతి పెద్ద చేపగా పిలిచే వేల్‌షార్క్ మరోసారి విశాఖలో సందడి చేసింది. ఇటీవల తంతడి వద్ద మత్స్యకారుల వలకు చిక్కగా.. దానికి వైద్యం చేసిన జిల్లా అటవీ శాఖ అధికారులు సురక్షితంగా తిరిగి సముద్రంలోకి పంపించారు. తాజాగా రుషికొండ తీరంలో ఈ అరుదైన వేల్‌షార్క్ కనిపించింది. లివిన్ అడ్వెంచర్స్ సంస్థకు చెందిన స్కూబా డైవర్లు తీరం నుంచి 2 కి.మీ. దూరంలో విహరించి.. బోటులో తిరిగి వస్తుండగా.. ఈ చుక్కల వేల్‌షార్క్ సందడి చేసింది. సుమారు 7 మీటర్ల పొడవుందని సంస్థ ప్రతినిధి బలరాంనాయుడు తెలిపారు. ప్రపంచంలో అంతరించిపోతున్న ఈ తరహా వేల్‌షార్క్‌లు రుషికొండ తీరంలో కనిపించడం మొట్టమొదటిసారి అని ఆయన వెల్లడించారు. -
హైదరబాద్‌లో మళ్లీ చిరుత కలకలం
-
చిరుత ఆచూకీ లభ్యం
-
భారత్ పాక్ మ్యాచ్ వీక్షించిన మాల్యా
-
అదిరిపోయే ఫీచర్లతో ఎంఐ మాక్స్ 2
న్యూఢిల్లీ: బడ్జెట్ ధరల్లో స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేస్తూ ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న చైనా మొబైల్ మేకర్ షియోమి మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ ను తీసుకురాబోతోంది. అదీ సరసమైన ధరకే. షియోమి ఎంఐ మ్యాక్స్ 2గా చెబుతున్న స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కొన్ని ఫీచర్లు బయటికొచ్చాయి. ఇప్పటికే షియోమి అప్ కమింగ్ డివైస్ లు ఎంఐ 6, ఎంఐ 6 ప్లస్ భారీగా ఆసక్తి నెలకొంది. అలాగే వీటి ఫీచర్లకు సంబంధించి రూమర్లు వ్యాపిస్తున్నప్పటికీ మి మాక్స్ 2 ఫీచర్స్ మాత్రం ఆకర్షణీయంగా ఉండడం విశేషం. మి మాక్స్ కు సక్సెసర్‌గా ఇది మార్కెట్లో లాంచ్ కానుంది. శక్తివంతమైన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్‌ను ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో వాడినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎంఐ మ్యాక్స్ 2లో వేగవంతమైన ఛార్జింగ్ సామర్ధ్యంతో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని వాడారట. ఇక కెమెరా విషయానికి వస్తే ఎంఐ 5ఎస్‌లో వాడిన కెమెరానే దీనిలో కూడా వాడినట్లు తెలుస్తోంది. వెనుకవైపు 12ఎంపీ సోనీ ఐఎంఎక్స్378 కెమెరా ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుందని అంచనా. ధర 1499 -1699 యెన్ లుగా అంటే సుమారు రూ. 14వేల నుంచి రూ. 16వేల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. షియోమి ఆక్సిజన్ గా పిలుస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఇలా ఉండబోతున్నాయి. ఎంఐ మాక్స్ 2 ఫీచర్స్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్ 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ప్లే 1920x1080 పిక్సెల్ రిజల్యూషన్ 4 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా దీన్ని విస్తరించుకునే సదుపాయం కూడా 12ఎంపీ రియర్ కెమెరా 5ఎంపీ ఫ్రంట్ కెమెరా సెల్ఫీ షూటర్ 5000 ఎంఏహెచ్ అయితే లాంచింగ్ సమయం, విక్రయాలు ఎపుడు మొదలుకానున్నాయనే అంశాలపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. మరోవైపు షియామి ఎంఐ 6 ఏప్రిల్ 19 న లాంచ్ కానుంది. 203-day wait for you since our #Mi5s launch, 7 years for Mi. #Mi6 is a guaranteed performance beast. Can't wait to show you what's to come! pic.twitter.com/hPA60ec8QX — Mi (@xiaomi) April 11, 2017 -
నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం
మాక్లూర్: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గుత్ప గ్రామ సమీపంలో చిరుత సంచారం గ్రామస్తులకు ఆందోళన కలిగిస్తోంది. స్థానిక శ్రీఅపురూప ఆలయానికి కొద్ది దూరంలోని అటవీ ప్రాంతంలో చిరుత పులి దాడి చేసి రెండు ఆవు దూడలను చంపేసింది. మంగళవారం వాటి కళేబరాలు కనిపించటంతో బుధవారం ఉదయం రైతులు ఫారెస్టు, పశువైధ్యాదికారులకు సమాచారం అందజేశారు. వారు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుతలను బంధించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని అటవీ అధికారులు తెలిపారు. -
వామ్మో.. ఇది ఉడుమా.. గాడ్జిల్లా పిల్లనా?
గ్రాఫిక్స్, త్రీడి చిత్రాల్లో గాడ్జిల్లా(రాక్షస బల్లి)ని మనం ఇప్పటి వరకు చూశాం. ఒకప్పుడు అది ఇలా ఉండేదని మిగిలిపోయిన శిలాజాల ద్వారా మనం వాటి పరిమాణాన్ని అంచనా వేశాం తప్ప ఏనాడు ప్రత్యక్షంగా చూడలేదు. అయితే, మనం ఇప్పటి వరకు రాక్షసబల్లి ఎలా ఉంటుందని ఇప్పటి వరకు చూస్తూ వచ్చామో అచ్చం అలాంటి రూపమే ప్రత్యక్షంగా దర్శనమిచ్చింది. అది కూడా గాలపాగో ద్వీపంలోని ఇసబెల్లా కోస్తా తీరంలో. అవునూ.. సముద్ర జలాల్లో ప్రత్యేక కెమెరాల ద్వారా వీడియోలు తీసి అందులోని వృక్షరాశి, జంతురాశి గురించి ఆరా తీసే ప్రత్యేక గజ ఈతగాళ్లకు ఇది కనిపించి అబ్బురపడిపోయేలా చేసింది. కాకపోతే ఇది రాక్షసబల్లి కాదుగానీ, అచ్చం అలాగే ఉన్న ఓ పెద్ద ఉడుము. ఇది నీటి అడుగు భాగంలో ఎంతో నేర్పుగా డైవర్స్ తోపాటు ఈదుతూ రుచికరమైన ఆహారం కోసం నీటి అడుగున పాకుతూ ఆ తర్వాత గాలి తీసుకునేందుకు తిరిగి సముద్ర ఉపరితలంపైకి రావడాన్ని వారు వీడియోలో చూశారు. ఇది అచ్చం జురాసిక్ పార్క్ సినిమాలో జంతువులు ఎలా ఉన్నాయో అలాగే ఉంది. ఇంతకీ దీని పరిమాణం ఎంత ఉందని అనుకుంటున్నారు.. సరిగ్గా ఒక మనిషి అంత పెద్దగా ఉందట. ఇలా ప్రతిసారి నీటిలో వేగంగా మునుగుతూ ఆహారం కోసం వెతుకుతూ తోకతో ఈదుతూ వేగంగా ముందుకు కదలడం ఈ వీడియోలో రికార్డయింది. -
హల్చల్ చేస్తున్న లులియా- సల్మాన్ ఫోటో
ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, ప్రియురాలు లులియా వాంటర్ సన్నిహితంగా ఉన్నఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. రొమేనియన్ ముద్దుగుమ్మ లులియా, సల్మాన్ ను ముద్దాడుతున్న ఫోటో ఒకటి చక్కర్లు కొడుతోంది. దుబాయ్ లో వీళ్లిద్దరు కలిసినపుడు ఈ ఫోటో చిక్కినట్టు సమాచారం. ఈ మధ్య సల్మాన్ ఖాన్ త్వరలో పెళ్లి చేసుకోనున్నాడనే వార్తల నేపథ్యంలో ఈ ఫోటో ఆసక్తికరంగా మారింది. ఇటీవల చాలా సందర్భాలలో సల్మాన్, లులియా కలిసి దర్శనమిచ్చిన వార్తల్లో నిలిచారు. మరోవైపు రొమానియన్ రియాల్టీ షోలో లులియా పాల్గొన్న వీడియోనొక దాన్ని సల్మాన్ ట్విట్టర్లో షేర్ చేశాడు. అంతేకాదు.. తనకు కూడా ఇలాంటి షో చేయాలని ఉందని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఇక నేను పెళ్ళి చేసుకునేది అనుమానమే. ఆ వయసు దాటేసాను. కానీ పిల్లల్ని కనాలని ఉంది.. ఇద్దరు ముగ్గురు పిల్లలు కావాలని ఓ ఇంటర్యూలో చెప్పాడు. కాగా టాప్ హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినా కథ మాత్రం పెళ్ళి పీటల దాకా వెళ్ళలేదు. ప్రసుతం రోమానియా నటి లులియా వాంటర్ తో సల్మాన్ డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు ఉన్నా, సల్మాన్ ఇంకా ధృవీకరించలేదు. -
మొన్న మొసలి, నిన్న అనకొండ, నేడు...
బెంగళూరు: నిత్యం నడిచే రోడ్డుపై ఊహించని రీతిలో అందమైన ఓ కొలను, అందులో కమలాలు విరబూసి కనువిందు చేస్తే.. అచ్చంగా ఇలాంటి దృశ్యమే గార్డెన్ సిటీ బెంగళూరులోని ఓ వీధిలో కనువిందు చేసింది. ఎపుడూ మురికి, దుర్గంధంతో ఉండే ఆరోడ్డు అకస్మాత్తుగా ముదురు ఎరుపు , గులాబీ రంగు పూలతో పాదచారులను మురిపించింది. బెంగళూరు ప్రధాన రహదారులపై ప్రజల పాలిట మృత్యు కుహరాలుగా మారిన మ్యాన్‌హోల్స్, గోతులు, గుంటలపై అధికారుల దృష్టి నిలిపే విధంగా ఓ కళాకారుడు నిరసన వ్యక్తం చేస్తూ రూపొందించిన కళాఖండమిది. ముదురు ఎరుపు,గులాబీ, వంకాయ రంగులతో ఉన్న కమలాలు అందరినీ విపరీతంగా ఆకర్షించాయి. అవి నిజం పూలుకాదని, థెర్మాకోల్తో కృత్రిమంగా తయారు చేసినవి అని తెలిసినా నమ్మలేనంత సహజంగా అమరాయి. కాగా నగరంలో శనివారం మున్సిపల్ ఎన్నికలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో నగర పాలక యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా అధ్వాన్నంగా మారిన రోడ్లను పరిస్థితిని అధికారులకు తెలిపేందుకు స్థానిక కళాకారుడు బాదల్ నంజుండస్వామి ఈ ప్రయత్నం చేశారు. గతనెల కూడా పొడవాటి మొసలి బొమ్మను రోడ్డు పక్కన ఉన్న గుంటలో ఏర్పాటు చేసి అధికారులు, మీడియా, ప్రజల దృష్టిని ఆకర్షించారు. అనంతరం భారీ సైజులో అనకొండ పట్టపగలే రోడ్డుపైన ఉన్న మ్యాన్‌హోల్ నుంచి బయటకు వచ్చి, ఓ మనిషిని మింగేస్తూ, చేయి మాత్రమే బయట మిగిలి ఉన్నదృశ్యం బెంగళూరు రోడ్డుపై బీభత్సం సృష్టించింది. నంజుండస్వామి చేస్తున్న ఈ ప్రయత్నానికి నమ్మ బెంగళూరు ఫౌండేషన్ కూడా మద్దతు తెలిపింది. మొసలి, అనకొండల కంటే రహదారులపై గోతులు, గుంటలు, మ్యాన్‌హోల్స్ ప్రజలకు ప్రమాదకరంగా మారాయని అధికారులను హెచ్చరించారు. కాగా కర్ణాటక హైకోర్టు కూడా స్పందించింది. బెంగళూరు నగరంలోని అపరిశభ్ర వాతావరణాన్ని సరిదిద్దాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో సంబంధిత చర్యలకు బృహత్ బెంగళూరు మహానగర పాలిక అధికారులు శ్రీకారం చుట్టారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. వచ్చిన అతిథి
ఇండియానా: దాదాపు 140 సంవత్సరాల తర్వాత ఓ అతిథి ఇండియానా అడవులను పలకరించింది. దీంతో అటవీశాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. తిరిగి ఆ సంతతి తమ వద్ద పునరుత్పత్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ అతిథి ఎవరనీ అనుకుంటున్నారా. నల్లటి ఎలుగుబంటి. అవును.. 1871 నుంచి ఇండియానా అడవుల్లో ఎలుగు బంట్లు కరువై పోయాయట. అంతకుముందు కుప్పలుగా ఉన్న అవి ఉన్నపలంగా అంతరించిపోయి పూర్తిగా కనిపించడం మానేశాయి. వారి వద్ద ఉన్న డేటా ప్రకారం.. 140 ఏళ్లుగా ఒక్క ఎలుగుబంటి కూడా తమ అడవుల్లో ఉన్నట్లు రికార్డుల్లో లేదు. తాజాగా దాని పాదముద్రలు, మల విసర్జన గుర్తించిన అధికారులు వచ్చింది మగ ఎలుగుబంటి అని, అది మిచిగాన్ ప్రాంతం నుంచి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, చాలాకాలం తర్వాత ఎలుగుబంట్లు కనిపించడంతో అక్కడి వారు చాలా ఆందోళన చెందుతున్నారట. ఎందుకంటే అవి చాలా క్రూరమైన జాతికి చెందినవి.