రుషికొండ తీరంలో వేల్‌షార్క్‌ సందడి | Whale Shark Fish Spotted Coastal Sea At Visakhapatnam | Sakshi
Sakshi News home page

రుషికొండ తీరంలో వేల్‌షార్క్‌ సందడి

Published Wed, Feb 9 2022 10:43 AM | Last Updated on Wed, Feb 9 2022 10:43 AM

Whale Shark Fish Spotted Coastal Sea At Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రపంచంలో అతి పెద్ద చేపగా పిలిచే వేల్‌షార్క్‌ మరోసారి విశాఖలో సందడి చేసింది. ఇటీవల తంతడి వద్ద మత్స్యకారుల వలకు చిక్కగా.. దానికి వైద్యం చేసిన జిల్లా అటవీ శాఖ అధికారులు సురక్షితంగా తిరిగి సముద్రంలోకి పంపించారు. తాజాగా రుషికొండ తీరంలో ఈ అరుదైన వేల్‌షార్క్‌ కనిపించింది. లివిన్‌ అడ్వెంచర్స్‌ సంస్థకు చెందిన స్కూబా డైవర్లు తీరం నుంచి 2 కి.మీ. దూరంలో విహరించి.. బోటులో తిరిగి వస్తుండగా.. ఈ చుక్కల వేల్‌షార్క్‌ సందడి చేసింది.

సుమారు 7 మీటర్ల పొడవుందని సంస్థ ప్రతినిధి బలరాంనాయుడు తెలిపారు. ప్రపంచంలో అంతరించిపోతున్న ఈ తరహా వేల్‌షార్క్‌లు రుషికొండ తీరంలో కనిపించడం మొట్టమొదటిసారి అని ఆయన వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement