whale shark fish
-
రుషికొండ తీరంలో వేల్‌షార్క్ సందడి
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచంలో అతి పెద్ద చేపగా పిలిచే వేల్‌షార్క్ మరోసారి విశాఖలో సందడి చేసింది. ఇటీవల తంతడి వద్ద మత్స్యకారుల వలకు చిక్కగా.. దానికి వైద్యం చేసిన జిల్లా అటవీ శాఖ అధికారులు సురక్షితంగా తిరిగి సముద్రంలోకి పంపించారు. తాజాగా రుషికొండ తీరంలో ఈ అరుదైన వేల్‌షార్క్ కనిపించింది. లివిన్ అడ్వెంచర్స్ సంస్థకు చెందిన స్కూబా డైవర్లు తీరం నుంచి 2 కి.మీ. దూరంలో విహరించి.. బోటులో తిరిగి వస్తుండగా.. ఈ చుక్కల వేల్‌షార్క్ సందడి చేసింది. సుమారు 7 మీటర్ల పొడవుందని సంస్థ ప్రతినిధి బలరాంనాయుడు తెలిపారు. ప్రపంచంలో అంతరించిపోతున్న ఈ తరహా వేల్‌షార్క్‌లు రుషికొండ తీరంలో కనిపించడం మొట్టమొదటిసారి అని ఆయన వెల్లడించారు. -
తంతడి తీరానికి అతిపెద్ద అతిథి
దొండపర్తి (విశాఖ దక్షిణ): ప్రపంచంలోనే అతి పెద్ద చేపగా గుర్తించబడిన వేల్ షార్క్ విశాఖ తీరానికి వచ్చింది. ఇక్కడి తంతడి బీచ్‌లో బుధవారం స్థానిక మత్స్యకారుల వలకు చిక్కింది. 50 అడుగుల పొడవు, 2 టన్నుల బరువు ఉండే చేప ఒడ్డుకు రావడాన్ని గమనించిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ శ్రీకాంత్ మన్నెపూరి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని తెలియజేశారు. విశాఖ డీఎఫ్‌వో అనంత్‌శంకర్ ఆదేశాల మేరకు సిబ్బంది వెంటనే తంతడి బీచ్‌కు చేరుకొని ప్రపంచంలోనే అతిపెద్ద చేప అయిన వేల్‌షార్క్‌గా దీనిని నిర్ధారించారు. అంతరించిపోతున్న షార్క్‌ల జాతిలో ఇదొకటిగా గుర్తించారు. షార్క్‌ను సురక్షితంగా సముద్రంలోకి పంపించే ఏర్పాట్లు చేయాలని డీఎఫ్‌వో అనంత్‌శంకర్ సూచించారు. వెంటనే అటవీ శాఖ సిబ్బంది, మత్స్యకారులు, వన్యప్రాణుల సంరక్షకులు షార్క్‌కు ఫిల్టర్ ఫీడింగ్ ఇచ్చారు. అనంతరం షార్క్‌ను సురక్షితంగా సముద్రంలోకి పంపించారు. చిక్కింది టేకు చేప.. మత్స్యకారుల వలకు భారీ టేకు చేప చిక్కింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామ సమీపంలోని కృష్ణా నదిలో బుధవారం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు పోస సాయికృష్ణ, ఉట్టి వెంకటేశ్వర్లు, గంగరాజులు వేసిన వలలో 200 కిలోల బరువున్న ఈ భారీ టేకు చేప పడింది. – దాచేపల్లి -
చేప గాలానికి.. 22 అడుగుల ‘తిమింగలం’
బరంపురం: పనికిరాని వ్యర్థ వస్తువులతో చేప గాలానికి 22 అడుగుల తిమింగలం తయారు చేసి బరంపురం ఐటీఐ విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ 22 అడుగుల తిమింగలం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఐటీఐ ప్రిన్సిపాల్ రజత్ కుమార్ పాణిగ్రహి శుక్రవారం సాక్షితో మాట్లాడుతూ గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లక్ష్యంతో ఐటీఐ కళాశాలలో చదువుతున్న ఫిట్టర్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్లకు చెందిన 25 మంది విద్యార్థులు 40 రోజుల పాటు శ్రమించి వ్యర్థ పదార్థాలతో చేప గాలానికి 22 అడుగుల తిమింగలం తయారు చేసి రికార్డు సృష్టించారని చెప్పారు. ఇది సుమారు 400 కిలోల బరువు ఉన్నట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే విద్యార్థులు 70 అడుగుల గిటార్‌ను తయారు చేసి అసియా బుక్ అఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారన్నారు. ప్రస్తుతం ఈ చేప గాలానికి చిక్కిన 22 అడుగుల తిమింగలం ప్రపంచంలో మరెక్కడా లేదని ఈ నేపథ్యంలో బరంపురం ఐటీఐ విద్యార్థులకు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తప్పక స్థానం దక్కుతుందని ప్రిన్సిపాల్ రజత్ పాణిగ్రహి ఆశాభావం వెలిబుచ్చారు. -
ఈ చేప బరువు ఒకటిన్నర టన్నులు
-
ఈ చేప బరువు ఒకటిన్నర టన్నులు
కాకినాడ(తూర్పుగోదావరి): కాకినాడ మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. బంగాళాఖాతంలో వేటకు వెళ్ళిన మత్స్యకారుల వలలో టన్నున్నర బరువుగల వేల్ షార్క్ పడింది. అయితే, అది చనిపోవడంతో ఫిషింగ్ హార్బర్‌కు తరలించారు. క్రేన్ సాయంతో దానిని బోటు నుంచి జట్టీలోకి దించారు. దీంతో అక్కడ ఉన్న మత్స్యకారులు, వ్యాపారులు ఈ సొరను ఆసక్తిగా తిలకించి, ఆ చిత్రాలను తమ సెల్ ఫోన్ లో బంధించారు. వేల్ షార్క్ ను తెలుగులో పులి బొక్కి సొర అంటారు. ఇది పూర్తిగా శాకాహారి. సముద్రంలో మొక్కలు తిని జీవిస్తుంది. ఈ జాతి అంతరించి పోవడంతో ప్రభుత్వం వీటి వేటను నిషేధించింది. ఒకవేళ పొరపాటున గంగపుత్రుల వలకు ఈ చేప చిక్కితే వల కట్ చేసి దానిని సముద్రంలో వదిలేయాలి. అలా చేసి, ఆ వీడియోను అధికారులకు చూపిస్తే ప్రభుత్వం వారికి రూ.25 వేల నగదు ఇస్తుంది.