కాకినాడ(తూర్పుగోదావరి): కాకినాడ మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. బంగాళాఖాతంలో వేటకు వెళ్ళిన మత్స్యకారుల వలలో టన్నున్నర బరువుగల వేల్ షార్క్ పడింది. అయితే, అది చనిపోవడంతో ఫిషింగ్ హార్బర్‌కు తరలించారు. క్రేన్ సాయంతో దానిని బోటు నుంచి జట్టీలోకి దించారు.
దీంతో అక్కడ ఉన్న మత్స్యకారులు, వ్యాపారులు ఈ సొరను ఆసక్తిగా తిలకించి, ఆ చిత్రాలను తమ సెల్ ఫోన్ లో బంధించారు. వేల్ షార్క్ ను తెలుగులో పులి బొక్కి సొర అంటారు. ఇది పూర్తిగా శాకాహారి. సముద్రంలో మొక్కలు తిని జీవిస్తుంది. ఈ జాతి అంతరించి పోవడంతో ప్రభుత్వం వీటి వేటను నిషేధించింది. ఒకవేళ పొరపాటున గంగపుత్రుల వలకు ఈ చేప చిక్కితే వల కట్ చేసి దానిని సముద్రంలో వదిలేయాలి. అలా చేసి, ఆ వీడియోను అధికారులకు చూపిస్తే ప్రభుత్వం వారికి రూ.25 వేల నగదు ఇస్తుంది.