
సాక్షి,కాకినాడజిల్లా:తునిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. స్థానిక భాష్యం స్కూల్లో దాడిశెట్టి పరమేష్(6) అనే బాలుడు ఒకటో తరగతి చదువుతున్నాడు. ఉదయం పరమేష్‌ను తండ్రి సురేష్ స్కూల్‌లో వదిలిపెట్టాడు. ఉదయం 10:30 గంటలకు పరమేష్‌కు టానిక్ పట్టించాలని చెప్పిన ఆగంతకుడు స్కూల్ నుండి బైక్‌పై తీసుకువెళ్లాడు
.మధ్యాహ్నం పేరేంట్స్ పరమేష్‌కు లంచ్ బాక్స్ తేవడంతో అసలు విషయం బయటపడింది. స్కూల్లో బాబు లేకపోవడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. వెంటనే బాలుడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాలుడి ఆచూకీ కోసం పోలీసులు, బంధువులు గాలిస్తున్నారు.