tuni
-
ప్రశాంతంగా ఉండాలనే రాజీనామా చేస్తున్నాను తునిలో రెడ్ బుక్ పాలన
-
తుని ఘటనపై అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి క్లారిటీ
-
దిగజారిన ప్రజాస్వామ్యం
తుని: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మరో మెట్టు దిగజారింది. తెలుగుదేశం పార్టీ నేతల బరితెగింపు పరాకాష్టకు చేరింది. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల్లో గెలుపొందిన ఓ ప్రజాప్రతినిధిపై దారుణంగా ఒత్తిళ్లుతెచ్చారు. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక కాకినాడ జిల్లా తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ‘రాష్ట్రంలో తునికి ఉన్న మంచి పేరును టీడీపీ ప్రభుత్వం కాలరాసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కౌన్సిలర్లను పోలీసుల సహకారంతో చిత్రహింసలకు గురి చేసింది.సహచర కౌన్సిలర్లపై జరుగుతున్న దమనకాండను చూడలేక కలత చెంది చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది’ అని ఆమె ఉద్వేగంతో చెప్పారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామాకు గల కారణాలను వెల్లడించారు. గత ఎన్నికల్లో తుని మున్సిపాలిటీ 30కి 30 వార్డులనూ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుందని తెలిపారు.ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను నిట్టనిలువునా కూల్చేందుకు కుట్ర చేస్తోందన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్–2 ఎన్నిక కోసం మున్సిపల్ కార్యాలయానికి వెళ్తే.. టీడీపీ గూండాలు కౌన్సిల్ హాల్లోకి ప్రవేశించి అడ్డుకున్నారని, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు, అధికారులు టీడీపీకి వత్తాసు పలికారని ఆవేదన వ్యక్తం చేశారు.శాంతియుత వాతావరణంలో వైస్ చైర్మన్ ఎన్నిక జరిపించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ, స్థానిక పోలీసులను కోర్టు ఆదేశించినా.. అధికారులు అధికార పార్టీకి వంతపాడటంతో టీడీపీ దాష్టికాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్నారు. వీరి దారుణాల కారణంగా వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి కూడా వాయిదా పడిందని చెప్పారు. కౌన్సిలర్లకు భద్రత కల్పించిన తనపై, తమకు అండగా నిలిచిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయక తప్పడం లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం సహచర కౌన్సిలర్లు 15 మందితో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని, కమిషనర్ వెంకట్రావుకు రాజీనామా పత్రాన్ని అందజేశారు.మున్సిపల్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశానని కౌన్సిలర్‌గా కొనసాగుతానన్నారు. మహిళలతో కన్నీరు పెట్టించిన టీడీపీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కాగా తుని చైర్పర్సన్ రాజీనామా ఉదంతం రాష్ట్రంలో దిగజారిన ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజీనామా నిర్ణయం తీసుకునేలా చేశారంటే ఎంత ఒత్తిడి చేశారో, ఎంతకు బరితెగించారో అర్ధం చేసుకోవచ్చని వారు పేర్కొంటున్నారు. ప్రాణంపోయినా వైఎస్సార్సీపీని వీడేది లేదు : కౌన్సిలర్ జ్యోతి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తనకు టీడీపీ నాయకులు ఆదివారం రాత్రంతా నరకం చూపారని ఒకటో వార్డు కౌన్సిలర్ వారాధి జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు ఇనుగంటి సత్యనారాయణ, మళ్ల గణేష్, డి.శ్రీనివాసరాజు తదితరులు తనను ఇంటి నుంచి బలవంతంగా బయటకు లాకెళ్లి వైఎస్సార్సీపీలోంచి టీడీపీలోకి చేరాలంటూ బెదిరించారని.. ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని చెప్పారు. ఈ వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని, అదే జరిగితే దానికి టీడీపీ నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
తునిలో రెడ్‌బుక్ రాజ్యాంగం.. వైఎస్సార్సీపీ నేతలకు బెదిరింపులు
కాకినాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగానికే సై అంటోంది. వేరే పార్టీల నాయకులను బెదిరించడంతో పాటు వారిపై అక్రమ కేసులు బనాయించి టీడీపీలో చేర్చుకుంటోంది. తాజాగా తునిలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను బెదిరించడంతో పాటు అక్రమ కేసులు బనాయించింది. దాంతో వారు టీడీపీలో చేరకతప్పలేదు. ఇప్పటికే 10 మంది కౌన్సిలర్లు యనమల సమక్షంలో టీడీపీలో చేరారు.గత మున్సిపల్ ఎన్నికల్లో 30కి 30 స్థానాలను వైఎస్సార్ సీపీ గెలవగా, ఇప్పుడు తాజాగా టీడీపీ రాజకీయ కుట్రలకు తెరలేపింది. టీడీపీకి సంఖ్యా బలం లేకపోయినా దౌర్జన్యాలు, బెదిరింపులతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను టీడీపీలో చేరేలా కుట్రలు చేశారు యనమల.ఇప్పటికే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను నాలుగు సార్లు వాయిదా వేయించిన టీడీపీ.. చైర్మన్ సుధాబాలు రాజీనామా చేసేలా ఆయనపై అక్రమ కేసులు బనాయించింది. ఈ క్రమంలోనే సుధాబాలు తన పదవికి రాజీనామా చేశారు. పోలీసుల సహకారంతో టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపి.. వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోంది. -
అధికార మదంతో రెచ్చిపోతున్నారు టీడీపీపై యనమల కృష్ణుడు ఫైర్
-
తుని మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా
సాక్షి, కాకినాడ జిల్లా: నిస్సిగ్గుగా చంద్రబాబు సర్కార్ దౌర్జన్యాలు, అరాచకాలతో తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. తునిలో టీడీపీ గూండాల దౌర్జన్యకాండకు దిగారు. తునిలో 30కి 30 మంది కౌన్సిలర్లు వైఎస్సాస్‌పీ వారే. ప్రలోభపెట్టి, భయపెట్టి 10 మంది టీడీపీ లాక్కుంది. వైఎస్సార్సీపీ చేతిలో 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ గూండాలు దాడి చేసి.. మున్సిపల్ ఆఫీస్‌లో వెళ్లకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు.దీంతో ప్రాణభయంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వెనుదిరిగారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద కర్రలతో టీడీపీ గూండాలు మోహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నాటీడీపీ గూండాలు పట్టించుకోలేదు. తునిలో ప్రజాస్వామ్యం ఖూనీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేడు తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. ఇప్పటికే మూడుసార్లు ఎన్నికను అడ్డుకున్న టీడీపీ గుండాలు.. నాలుగోసారి అడ్డుకున్నారు.తునిలో పోలీస్ బందోబస్తు లేదంటూ వైఎస్సార్సీపీ నేత దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ‘‘తునిలో టీడీపీ గూండాలే కనిపిస్తున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ప్రాణభయంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వెనుదిరిగారు’’ అని దాడిశెట్టి పేర్కొన్నారు. తుని వెళ్తున్న మాజీ మంత్రి కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలను పిఠాపురం టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. -
వైఎస్ఆర్ సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు
-
కాకినాడ జిల్లా తునిలో పరాకాష్టకు చేరిన టీడీపీ దౌర్జన్యం
-
బెదిరించారు.. బరితెగించారు
అసలు బలమే లేని మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు చంద్రబాబు సర్కారు సాగిస్తున్న కుట్రలు, కుతంత్రాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, కాకినాడ జిల్లా తుని, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవుల కోసం టీడీపీ అధికార బలంతో బరితెగించింది. సంఖ్యా బలం లేకపోయినా వాటిని బలవంతంగా తమ ఖాతాలో వేసుకునేందుకు కుయుక్తులు పన్నింది.పిడుగురాళ్ల మున్సి పాల్టీ లో టీడీపీ తరఫున ఒక్క కౌన్సిలర్ కూడా గెలవకపోయినా సోమవారం జరిగిన ఎన్నికలో వైస్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకుందంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసైగ మేరకు పోలీసులు, రెవిన్యూ అధికారులు వేధించి, భయపెట్టి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు బలవంతంగా పచ్చ కండువా కప్పి.. మాదే మెజార్టీ అని నిస్సిగ్గుగా ప్రకటించడం విస్తుగొలుపుతోంది. తుని, పాలకొండ మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవులను కూడా అదే రీతిలో సొంతం చేసుకునేందుకు ప్రయత్నిం చినా వైఎస్సార్సీపీ అడ్డుకోవడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి.సాక్షి, నరసరావుపేట/తుని/పాలకొండ: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను భయపెట్టి అరాచకం çసృష్టించారు. పోలీసులు కూడా తమ కర్తవ్యాన్ని మరచి ఎమ్మెల్యే ఆదేశాలతో కౌన్సిలర్లను భయాందోళనకు గురిచేసి టీడీపీ గూటికి వెళ్లేలా తమవంతు సాయం చేశారు. వైస్ చైర్మన్ ఎన్నికకు పోటీ చేయడానికి టీడీపీ తరఫున కనీసం ఒక్క కౌన్సిలర్ సైతం లేకపోయినా పోటీలో నిలిచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.కౌన్సిలర్లను భయపెట్టి, బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి పచ్చ కండువా కప్పి తెలుగుదేశంలో చేర్చుకున్నట్లు ప్రకటించి.. యరపతినేని ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇదేనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 33 స్థానాలకు 33 స్థానాలు వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. వైస్ చైర్మన్‌గా ముక్కంటి అనే వ్యక్తిని ఎన్నుకోగా ఆయన అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో మున్సిపల్ వైస్ చైర్మన్‌ని ఎంపిక చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ నెల 3వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా వైఎస్సార్సీపీ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా టీడీపీ నేతలు అడ్డుపడటంతో మరుసటి రోజు.. అంటే ఈ నెల 4వ తేదీకి ఎన్నికను వాయిదా పడింది. అయితే రాత్రికి రాత్రే యరపతినేని ఆదేశాలతో పోలీసులు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పాత కేసులు పేరిట వేధించి ఎన్నికకు రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఎన్నికల కమిషన్ ఈ నెల 17న సోమవారం మరోసారి వైస్ చైర్మన్ ఎన్నికలకు అవకాశం కల్పించింది. నాలుగో తేదీ నుంచి 17 వ తేదీ వరకు సుమారు రెండు వారాలు సమయం ఉండటంతో టీడీపీ నేతలు.. పోలీసు, రెవెన్యూ అధికారులను ఉపయోగించి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను వేధించడం మొదలుపెట్టారు. తునిలోనూ టీడీపీ బల ప్రయోగం కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను మూడోసారి టీడీపీ అడ్డుకోవడంతో వాయిదా పడింది. టీడీపీ లొంగదీసుకున్న కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి అనుమతించి, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. మున్సిపాలిటీలో 30 వార్డులకుగాను 30 మందీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరు ఉద్యోగం రావడంతో రాజీనామా చేశారు. మిగిలిన 28 మంది వైఎస్సార్సీపీకి చెందినవారే. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన వైస్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చారు. టీడీపీ ముందస్తు వ్యూహంలో భాగంగా కౌన్సిల్ హాల్లోకి చొరబడి ఎన్నికను అడ్డుకుంది.మరుసటి రోజూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. దీంతో వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్ కాసే సుమతి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఎన్నిక జరగాల్సి ఉన్నా, టీడీపీ దౌర్జన్యం వల్ల మళ్లీ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 11 గంటలకు వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆర్వో రవికుమార్ తెలిపారు. కాగా, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం చైర్పర్సన్ సుధారాణి నివాసం వద్ద నుంచి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను బలవంతంగా తీసుకువెళ్లేందుకు టీడీపీ నాయకులు యత్నిం చారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అడ్డుకున్నారు.దీంతో టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావులు రాజాపై దాడికి దిగారు. వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ శ్రేణులను పోలీసులు అక్కడ నుంచి బయటకు పంపించి వేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలను పంపించేస్తే ఓటింగ్‌కు వస్తామని కౌన్సిలర్లు చెప్పారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల వరకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లక పోవడంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. టీడీపీకి సొంతంగా ఒక్క సీటు లేకపోయినా అధికార మదంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను లొంగదీసుకోవాలని చూస్తోందని, సంతలో పశువుల్లా కొనాలనుకుంటోందని మండిపడ్డారు. అయినా మెజార్టీ లేకపోవడంతో పోలీసులను వినియోగించారన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి భర్త, కో ఆప్షన్ సభ్యుడు ఏలూరి బాలును హౌస్ అరెస్ట్ చేశారని, మరికొందరి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి భయాందోళనలు సృష్టించారన్నారు.మహిళా కౌన్సిలర్లలో గర్భిణులు ఉన్నారని, వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు టీడీపీ గూండాలు, రౌడీ షీటర్లకు సహకరించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంగళవారం చలో తుని కార్యక్రమానికి జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని రాజా పిలుపునిచ్చారు. మున్సిపల్ కౌన్సిలర్ల రక్షణ బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు.బెదిరింపుల పర్వం... వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ఇళ్లకు పోలీసులను పంపించి స్టేషన్‌కు రావాలని పిలిపించి టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని బెదిరింపులకు దిగారు. మరికొంతమందికి కాంట్రాక్టులు, బిల్లుల పేరుతో తాయిలాలు ఆశచూపే ప్రయత్నం చేశారు. మరోవైపు తెలుగుదేశం నాయకులు రోజూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు ఫోన్ చేసి కచ్చితంగా మీరు పార్టీ మారాల్సిందేనని ఒత్తిడి చేశారు. యరపతినేని శ్రీనివాసరావు నిర్ణయించిన వైస్ చైర్మన్ అభ్యర్థికే మీరు ఓటు వేయాలంటూ బెదిరించారు. తెలుగుదేశం రౌడీల బెదిరింపులతో కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.దీంతో పోలీసుల సహకారంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల బంధువులను బెదిరించి భయపెట్టి వాళ్ల శిబిరంలోకి బలవంతంగా తీసుకువెళ్లారు. ఇలా సుమారు 17 మందిని టీడీపీ వైపు లాగేశారు. వారితో వైస్ చైర్మన్ పదవిని దౌర్జన్యంగా లాగేసుకున్నారు. 30వ వార్డు కౌన్సిలర్ ఉన్నం భారతిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు వ్యాపారాలను అడ్డుకుంటామని బెదిరించి పార్టీ మారేలా చేశారని పట్టణంలోని ఆర్య వైశ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పిడుగురాళ్ల 29వ వార్డు కౌన్సిలర్ మునీరా దంపతులు తెలుగుదేశం నాయకుల బెదిరింపులకు లొంగక పోవడంతో నిర్మాణంలో ఉన్న వాళ్ల ఇళ్లను పొక్లెయినర్‌తో నేలమట్టం చేశారు. ఇలా బెదిరించి బరితెగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.పాలకొండలోనూ అదే తీరు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ కుర్చీ కోసం కూటమి నాయకులు వేస్తున్న ఎత్తులు పారడం లేదు. ముచ్చటగా మూడోసారి సోమవారం నిర్వహించిన చైర్మన్ ఎన్నికలో పదవి దక్కించుకోవాలని కూటమి నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డితో పాటు జేసీ శోభిక ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. కూటమికి చెందిన ముగ్గురు సభ్యులు, బలవంతంగా తీసుకెళ్లిన ఇద్దరు వైఎస్సార్సీపీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరంలేక ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.కాగా, పాలకొండ నగర పంచాయతీలో మొత్తం 20 వార్డుల్లో 17 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 19వ వార్డు కౌన్సిలర్ ఉద్యోగ రీత్యా తన పదవికి రాజీనామా చేశారు. మరో ఇద్దరు కౌన్సిలర్లను టీడీపీ నేతలు బలవంతంగా వారి వైపు తిప్పుకున్నారు. ఈ లెక్కన టీడీపీ బలం ఐదుకు చేరిందనుకున్నా, వైఎస్సార్సీపీ బలం 14గా ఉంది. ఎలాగైనా సరే గెలవాలని మంత్రి సంధ్యారాణి ఎన్ని రకాలుగా ఒత్తిడి తెచి్చనప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. -
మరోసారి తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా
-
టీడీపీ దౌర్జన్యం.. రేపు చలో తునికి పిలుపునిచ్చిన దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి నేతల అరాచకం కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నేతల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రేపు చలో తునికి పిలుపునిచ్చారు వైఎస్సార్సీపీ నాయకులు దాడిశెట్టి రాజా. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు రేపు తుని రావాలని కోరారు. తుని మున్సిపాలిటీ వైఎస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఈరోజు టీడీపీ నేతలు రెచ్చిపోయారు. తునిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను బెదిరింపులకు గురిచేశారు. అలాగే, ఎన్నిక సందర్భంగా అక్కడికి వెళ్లిన దాడిశెట్టి రాజాపై టీడీపీ మూకలు దాడికి పాల్పడ్డారు. అనంతరం, ఎన్నికల్లో కోరం లేకపోవడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేశారు.ఈ నేపథ్యంలో దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ..‘మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను టీడీపీ దౌర్జన్యంగా అడ్డుకుంటోంది. తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు కౌన్సిలర్లను బెదిరిస్తున్నాడు. కలెకక్టర్, ఎస్పీ వచ్చి మా కౌన్సిలర్లను కౌన్సిల్ హాల్‌కు తీసుకువెళ్ళాలి. గతంలో నాపై కేసు నమోదు చేశానని సీఐ చెప్పుకుంటున్నారు. టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోవడం లేదు. రేపు చలో తునికి పిలుపునిస్తున్నాం. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో రేపు తునికి రావాలని కోరుతున్నట్టు’ తెలిపారు.మరోవైపు.. తునిలో టీడీపీ గుండాల దౌర్జన్యాన్ని ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ ఇంచార్జ్ కురసాల కన్నబాబు ఖండించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ..‘తునిలో టీడీపీ దుర్మార్గంగా ప్రవర్తించి వైస్ చైర్మన్ ఎన్నికను అడ్డుకుంది. పోలీసుల సహకారంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయాలనుకున్నారు. యనమల రామకృష్ణుడు ఇలాంటి దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్నారో లేదో చెప్పాలి. టీడీపీకి సహకారం అందిస్తున్న పోలీసులపై అధికారులు, ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. తునిలో శాంతియుత వాతావరణం కల్పించి..హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలను సజావుగా జరిపించాలి. రేపు మేమంతా తుని వెళ్తాం’ అని చెప్పారు. -
కిరాయి రౌడీలకు మద్యం పట్టించి.. తునిలో రెచ్చిపోయిన టీడీపీ
-
టీడీపీ నేతల అరాచకం.. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా
Municipal Elections Updates..👉ఏపీలో కూటమి నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తూ దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఎన్నికల్లో బలం లేకపోయినా అధికారంలో ఉన్నారనే అహంకారంతో టీడీపీ నేతలు పోటీకి దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు.👉పాలకొండలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా. ఎన్నిక జరగకుండా అడ్డుకున్న టీడీపీ నేతలు. 👉తుని వైఎస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. దీంతో, మూడోసారి వాయిదా పడినట్టు అయ్యింది. శాంతి భద్రతల సమస్య కారణంగా ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. 👉కాకినాడ..తునిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా టీడీపీ గుండాల దౌర్జన్యం. మున్సిపల్ చైర్మన్ సుధా బాలు ఇంటి వద్ద వేలాదిగా మోహరించిన పచ్చ గుండాలు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన పది మంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్లోకి వెళ్లారు. కోరం లేకపోవడంతో ఎన్నిక జరగకుండా పచ్చనేతలు అడ్డుకుంటున్నారు. ఎన్నికలు సజావుగా జరపాలని హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న టీడీపీ నేతలు. ఇక.. టీడీపీ నేతలకు పోలీసులు వంతపాడుతున్నారు. దీంతో, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మరోసారి హైకోర్టును ఆశ్రయించనున్నారు. టీడీపీ నాయకులు యనమల డైరెక్షన్లోనే వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పచ్చ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారు. పల్నాడులో ప్రజాస్వామ్యం ఖూనీ.. 👉పిడుగురాళ్లలో పట్ట పగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. అరాచకానికి ఐకాన్‌గా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మారారు. పిడుగురాళ్లలో మొత్తం 33 వార్డులు ఉండగా.. గతంలో 33 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవని తెలుగుదేశం. అయితే, ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌ను తన వైపునకు తిప్పుకున్న యరపతినేని. బలం, అర్హత లేకపోయినా వైస్ చైర్మన్ పదవి కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన శ్రీనివాసరావు.👉పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేయించారు. బెదిరించి, భయపెట్టి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ వైపునకు తిప్పుకున్నారు. 29వ వార్డు కౌన్సిలర్ మునీరా రెండు ఇళ్లను కూల్చే చేయించిన యరపతినేని. కౌన్సిలర్లు అందరినీ ఒక లాడ్జిలో బంధించి బస్సులో నేరుగా మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చిన తెలుగుదేశం నేతలు. వైఎస్ చైర్మన్ పదవి కైవసం చేసుకున్నట్టు యరపతినేని ప్రకటన. 👉తునిలో మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీ మూకలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నాయకులు దాడిశెట్టి రాజాపై దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడే ఉన్నా.. వారిని అడ్డుకోకపోవడం గమనార్హం. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ సుధా బాలు భర్త ఏలూరి బాలు, తొండంగి వైఎస్సార్సీపీ నేత గంగబాబు, తుని ఎస్సీ సెల్ అధ్యక్షుడు చింతా శ్రీనుతో పాటుగా మరో ముగ్గురు కౌన్సిలర్ల భర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు. అనంతరం, తుని టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 👉దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారు. దీనిపై కచ్చితంగా కోర్టుకు వెళ్తాం. వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తునిలో 30 స్థానాల్లో 30 కౌన్సిలర్లను వైఎస్సార్సీపీ గెలిచింది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. టీడీపీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేడు. తొమ్మిది మందిని మభ్యపెట్టి లాక్కున్నారు. చైర్పర్సన్ ఇంటి చుట్టూ వేలాది మంది మోహరించారు. కోర్టులు, వ్యవస్థలు అంటే టీడీపీకి లెక్కలేదు అంటూ మండిపడ్డారు. కాకినాడ..👉తుని మున్సిపల్ ఎన్నిక సందర్భంగా సెక్షన్ 163(2) అమలు చేసిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ఈ నేపథ్యంలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమ్మికూడరాదని ఆదేశాలు జారీ. కానీ, టీడీపీ గుండాలకు వర్తించని సెక్షన్ 163(2).👉మున్సిపల్ చైర్మన్ సుధా బాలు ఇంటి వద్ద వందలాదిగా గుమిగూడిన పచ్చ మూకలు. మున్సిపల్ కౌన్సిలర్లు బయటకు రాకుండా అడ్డుకుంటున్న టీడీపీ గుండాలు. సుధా బాలు నివాసం వద్దకు వెళ్ళిన జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా. ఈ క్రమంలో రాజాను కూడా అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు. రంగంలోకి దిగిన పోలీసులు.. టీడీపీ వారికే వత్తాసు. వైఎస్సార్సీపీ నేతలను అక్కడి నుంచి పంపిచేస్తున్న పోలీసులు. కాకినాడ..👉తునిలో మరోసారి టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. మున్సిపల్ వైఎస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మున్సిపల్ చైర్మన్ సుధాబాబు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పచ్చమూకలు అడ్డుకున్నాయి. ఈ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు.. వారిని అడ్డుకోలేదు. టీడీపీ నేతలకు పోలీసుల సహకారం అందిస్తూ.. తొండగి మండలం వైఎస్సార్సీపీ నేత గంగబాబుతో పాటుగా పలువరి నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారు. కూటమి అరాచకం..👉ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో పలుచోట్ల జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పచ్చ నేతలు యధేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. బలం లేకపోయినా అధికార మదంతో పోటీకి దిగుతున్నారు టీడీపీ నేతలు. కాగా, నేడు తుని, పాలకొండ, పిడుగురాళ్లలో డిప్యూటీ చైర్మన్, చైర్మన్ల ఎన్నికల జరగనుంది. ఇప్పటికే ఇక్కడ రెండు సార్లు ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ స్థానాల్లో టీడీపీకి బలం లేకపోయినా పచ్చ నేతలు అధికార మదంతో పోటీలో నిలబడ్డారు. కూటమి నేతలు ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నా పోలీసులు మాత్రం తమకు ఏదీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.👉ఇక, పిడుగురాళ్లలో కూటమి ప్రభుత్వానికి కోరం లేకున్నా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలతో, దౌర్జన్యాలతో లోబరుచుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. టీడీపీకి మద్దతిచ్చేది లేదని 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మున్నీరా సైదావలి తేల్చి చెప్పడంతో ఆదివారం టీడీపీ నేతలు బరితెగింపునకు పాల్పడ్డారు. కౌన్సిలర్ ఇంటితో పాటు, ఆయన బంధువుకు చెందిన నిర్మాణంలో ఉన్న ఇంటిని మున్సిపల్ అధికారులను అడ్డుపెట్టుకుని పొక్లెయిన్‌తో కూల్చివేయించారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు, శానిటేషన్ సిబ్బందితో పాటు టీడీపీకి చెందిన రాయపాటి సాంబశివరావు, షేక్ ఇంతియాజ్ తదితరులు, ఆ పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని దగ్గరుండి మరీ రెండు ఇళ్లను కూల్చివేయించారు.ఇప్పటికే రెండు సార్లు అరాచకాలు 👉పిడుగురాళ్ల మున్సిపాల్టీలో 33 వార్డులకు గాను వైఎస్సార్సీపీ 33 వార్డులను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. చైర్‌పర్సన్‌గా కొత్త వెంకటసుబ్బారావు, వైస్ చైర్మన్లుగా కొమ్ము ముక్కంటి, షేక్ నసీమా జైలాబ్దిన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ముక్కంటి మృతితో ఈ నెల 3న వైఎస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ జీవో ఇచ్చింది. అయితే, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి రానివ్వకుండా పోలీసుల సమక్షంలోనే టీడీపీ శ్రేణులు అడ్డుపడటంతో ఎన్నిక 4వ తేదీకి వాయిదా పడింది. 4వ తేదీ కూడా టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ఇళ్ల వద్ద ఉండి ఇళ్లల్లోంచి వారిని బయటకు రానివ్వకుండా అడ్డుపడ్డారు. దీంతో మళ్లీ సోమవారానికి వాయిదా పడింది. -
తునిలో బాలుడి కిడ్నాప్ కలకలం
సాక్షి,కాకినాడజిల్లా:తునిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. స్థానిక భాష్యం స్కూల్లో దాడిశెట్టి పరమేష్(6) అనే బాలుడు ఒకటో తరగతి చదువుతున్నాడు. ఉదయం పరమేష్‌ను తండ్రి సురేష్ స్కూల్లో వదిలిపెట్టాడు. ఉదయం 10:30 గంటలకు పరమేష్‌కు టానిక్ పట్టించాలని చెప్పిన ఆగంతకుడు స్కూల్ నుండి బైక్‌పై తీసుకువెళ్లాడు.మధ్యాహ్నం పేరేంట్స్ పరమేష్‌కు లంచ్ బాక్స్ తేవడంతో అసలు విషయం బయటపడింది. స్కూల్లో బాబు లేకపోవడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. వెంటనే బాలుడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాలుడి ఆచూకీ కోసం పోలీసులు, బంధువులు గాలిస్తున్నారు. -
బాబు బాదుడుపై తుని YSRCP నేతలు పోరుబాట
-
కాకినాడ జిల్లా తునిలో మద్యం షాపులపై మహిళల తిరుగుబాటు
-
నాన్ డ్యూటీ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
-
యనమల ఇంట రచ్చకు కారణం ఎవరు?
తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల వ్యవహారం పలువురు నేతల ఇళ్ళల్లో కుంపట్లు రగిలిస్తోంది. టీడీపీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇంట్లోనే అన్నదమ్ముల మధ్య యుద్ధం మొదలైంది. ఇద్దరి మధ్యా టిక్కెట్ పోరు రచ్చకెక్కింది. దశాబ్దాలుగా వెంట నడిచిన తమ్ముడిని ఇప్పుడు అన్న దూరం చేసుకున్నాడు. ఇంతకి తుని సీటు కోరిందెవరు? దక్కించుకున్నది ఎవరు? యనమల ఇంట రచ్చకు కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీలో సూపర్ సీనియర్ నాయకుల్లో ఒకరైన యనమల రామకృష్ణుడు 2009లో ఓడిపోయాక ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత రెండు ఎన్నికల్లోనూ దశాబ్దాలుగా తన వెంట నడుస్తూ... నియోజకవర్గంలో పనులు చక్కబెట్టుకుడుతున్న యనమల కృష్ణుడికి సీటు ఇప్పించారు. రెండుసార్లు ఓడిపోయినా... మూడోసారి కూడా తనకు సీటు కావాలని కృష్ణుడు డిమాండ్ చేశారు. తనకు ఇవ్వకపోయినా..తన కొడుక్కి అయినా ఇవ్వాలని ఇటు అన్నను.. అటు టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు. తన అన్న కోసమే దశాబ్దాలుగా నియోజకవర్గంలో పనిచేస్తున్నందున తనకు కచ్చితంగా సీటు ఇవ్వాల్సిందేనని కృష్ణుడు ఒత్తిడి చేశారు. కాని పరిస్థితి రివర్స్ అయ్యింది. చంద్రబాబు తర్వాత పార్టీలో తానే సుపీరియర్‌గా చలామణీ అవుతున్న యనమల రామకృష్ణుడు తన తమ్ముడి ప్రయత్నాలకు చెక్ పెట్టారు. ఈసారి తన కుమార్తె దివ్యకు కాకినాడు జిల్లా తుని అసెంబ్లీ సీటు ఇప్పించుకున్నారు. దీంతో యనమల ఇంట చిచ్చు రగిలింది. ఇదే సమయంలో దివ్య తన ఎన్నికల ప్రచారంలో బాబాయ్ కృష్ణుడు వర్గాన్ని దూరంగా ఉంచుతున్నారు. తనతో ప్రచారానికి రావొద్దని.. పార్టీ కార్యాలయంలోనే ఉంటూ..ఆఫీస్ పని చూసుకోవాలని కొద్ది రోజుల క్రిందట కృష్ణుడు ముఖ్య అనుచరుడైన శేషగిరికి యనమల కుమార్తె దివ్య స్పష్టం చేశారు. ఇలా తండ్రి..కూతుళ్ళు కృష్ణుడు.. అతని వర్గాన్ని దూరం పెట్టడంతో తునిలో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆరుసార్లు తుని నుంచి గెలిచిన యనమల రామకృష్ణుడు 2009లో ఓడిపోయారు. అదే సమయంలో యనమల టీడీపీ రాష్ట్ర రాజకీయాల్లో..ప్రభుత్వ పదవుల్లో బిజీగా ఉండటంతో తునిలో పార్టీ తరపున అన్ని పనులూ ఆయన తమ్ముడు కృష్ణుడు చూసుకునేవారు. కార్యకర్తలకు..పార్టీకి మధ్య వారధిగా పనిచేశారు. అందుకే యనమల రెండుసార్లు సిఫార్సుచేసి సీటు ఇప్పించినా కృష్ణుడు ఓడిపోయారు. మూడోసారి తనకు కాకపోయినా తన వారసుడికి అయినా ఇవ్వాలని కోరినా..అన్న రామకృష్ణుడు చక్రం తిప్పి తన కుమార్తెకు ఇప్పించుకున్నారు. దీంతో కృష్ణుడు అవమానతో రగిలిపోతున్నారు. కనీసం ప్రచారంలో కూడా తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఇక అన్నకు..తెలుగుదేశం పార్టీకి కూడా గుడ్‌బై చెప్పాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. తమ్ముడు దూరమైతే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దివ్యకు కచ్చితంగా నష్టమే అంటున్నాయి టీడీపీ వర్గాలు. -
సంక్రాంతి తర్వాత టీడీపీ ఖాళీ: మంత్రి దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ: చంద్రబాబుకు సభలో జనం లేక పిచ్చి పట్టి మాట్లాడుతున్నారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు. ప్రజలు చంద్రబాబు మాటలను నమ్మడం లేదని తెలిపారు. రెండు పంటలకు ఒక్కసారి కూడా చంద్రబాబు నీరు ఇవ్వలేదని మండిపడ్డారు. సీఎం జగన్ వచ్చాక రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని అన్నారు. చంద్రబాబు సభలకు జనం నుంచి స్పందన లేదని అన్నారు. కాపులను చంద్రబాబు మోసం చేసి అవమానపరిచారని దుయ్యబట్టారు. చంద్రబాబు దగా, మోసాన్ని ఎవ్వరూ మరచిపోలేదని రాజా తెలిపారు. ప్రజలు ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకుంటారని అన్నారు. సంక్రాంతి తర్వాత టీడీపీ ఖాళీ అవుతుందని, అభ్యర్ధులు కూడా దొరకరని అన్నారు. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు దోపిడి పరిపాలనే సాగిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని చంద్రబాబు, చంద్రబాబు కుటుంబం అడ్డంగా దోచుకుందని రాజా మండిపడ్డారు. 2014-2019లో మరుగుదోడ్లు నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన కోట్లాది రూపాయాలను యనమల అనుచరులు దోచేసుకున్నారని విమర్శించారు. చదవండి: టీడీపీకి కేశినేని నాని రాజీనామా -
తునిలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
కాకినాడ: టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. కాకినాడ జిల్లాలోని తునిలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. సాయి వేదిక ఫంక్షన్ హల్లో యనమల సోదరులు న్యూ ఇయర్ వేడుకలు ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకల్లో యనమల సోదరుల వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. యనమల సోదరుడు కృష్ణుడు వర్గానికి, యనమల అన్న కుమారుడు రాజేష్ వర్గానికి మధ్య పరస్పర దూషణలతో బీభత్సం చేశారు. అయితే ఈ వివాదం ముదరడంతో ఇరువర్గాల టీడీపీ కార్యకర్తలు వేదికపైనే తన్నుకున్నారు. చదవండి: రెచ్చిపోయిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.. మంత్రి విడదల రజిని ఆఫీసుపై దాడి -
అనిల్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన తుని
-
2024 కోసం వెయిటింగ్...మా జగనన్నే మళ్లీ సీఎం
-
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర.. 21వ రోజు షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర శనివారం కాకినాడ జిల్లా తుని, అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గాల్లో జరగనుంది. అనకాపల్లి జిల్లా: పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్ రాజు అధ్వర్యంలో జరగనున్న బస్సు యాత్ర జరగనుంది. ఉదయం 10:30 గంటలకు జీవీఎంసీ కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 11:30 గంటలకు వేపగుంట నుంచి పాలిటెక్నిక్ కాలేజీ వరకు భారీ ర్యాలీ జరపనున్నారు. 12 గంటలకు నూతనంగా ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవం అనంతరం 3 గంటలకు వెల్ఫే ర్ కాలేజీ నుంచి సబ్బవరం వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సబ్బవరం జంక్షన్లో జరిగే బహిరంగ సభలో పార్టీ రీజనల్ ఇంఛార్జి వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, స్పీకర్ తమ్మినేని సీతారాం తదితరులు హాజరుకానున్నారు. కాకినాడ జిల్లా: తునిలో ఎమ్మెల్యే మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు తుని ఆర్అండ్బి అతిథి గృహంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజా మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పార్టీ రీజనల్ ఇంఛార్జ్ పిల్లి సుభాస్ చంద్రబోస్, మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, మేరుగ నాగార్జున, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తదితరులు హాజరుకానున్నారు. -
ఊపిరి పోసిన జగనన్న ఆరోగ్య సురక్ష
తుని రూరల్: జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య బృందం అందించిన అత్యవసర వైద్య సేవలు ఓ యువకుడి ప్రాణాలు నిలబెట్టాయి. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట శివారు టి.వెంకటాపురంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. హెచ్.కొత్తూరుకి చెందిన మలగంటి లోకేష్ ఉన్నట్టుండి ఆయాసంతో కుప్పకూలిపోయాడు. అతడికి మెరుగైన వైద్యం అందించాలంటే 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుని పట్టణానికి తీసుకువెళ్లాలి. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న టి.వెంకటాపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం జరుగుతోందని తెలుసుకున్న లోకేష్ బంధువులు వెంటనే అక్కడికి తీసుకువెళ్లారు. వైద్య బృందం 104లో ఉంచి సీపీఆర్ పరికరంతో హృదయ స్పందన, శ్వాస తిరిగి ప్రారంభమయ్యేలా ప్రయత్నం చేశారు. వారి కృషి ఫలించడంతో కొంతసేపటికి హృదయ స్పందన తిరిగి ప్రారంభమై లోకేష్ కళ్లు తెరిచాడు. వెంటనే ఎర్రకోనేరు గ్రామం వరకూ 104లో, అక్కడి నుంచి 108లో తుని ఆస్పత్రికి తరలించారు. గోల్డెన్ సెక్షన్స్‌లో సీపీఆర్ సేవలు అందించడం సత్ఫలితాన్ని ఇచి్చందని వైద్యులు చెప్పారు. -
కాకినాడలో దారుణం: మహిళా చిరు వ్యాపారి హత్య
సాక్షి, కాకినాడ: తుని మండలం ఎర్రకోనేరు వద్ద దారుణం జరిగింది. ఓ మహిళా చిరు వ్యాపారిని నగదు కావాలంటూ బెదిరించి.. కత్తులతో దాడి చేశారు ఇద్దరు దుండగులు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే కన్నుమూసింది. తొలుత.. ఆ దారి వెంట వెళ్తున్న ఓ ఆటోను ఆపి డ్రైవర్‌ను కత్తితో దాడి చేశారు ఇద్దరు దుండగులు. దాడి అనంతరం అతని ఆటో తీసుకుని పరారయ్యారు. ఈ క్రమంలో.. కొద్ది దూరంలో చిన్న కొట్టు నడిపించుకుంటున్న మహిళను గమనించారు. ఆమె దగ్గరకు వెళ్లి కత్తి చూపించి నగదు కావాలంటూ బెదిరించారు. ఆమె భయంతో కేకలు వేయగా.. కత్తితో దాడి చేసి పరారయ్యారు. గాయపడిన మహిళను స్థానికులు తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే మృతి చెందింది. గాయపడిన ఆటో డ్రైవర్‌ను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా.. క్లూస్ టీం ఘటనా స్థలి నుంచి వివరాలు సేకరించింది. మృతి చెందిన మహిళ పేరు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: దిశ పోలీసుల ఎంట్రీతో నర్సింగ్ విద్యార్థినులు సేఫ్ -
ముద్రగడ కుటుంబం పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించారు: కన్నబాబు
-
తుని రైలు దగ్ధం కేసు కొట్టివేత
-
వెలుగులోకి అ‘పూర్వ’ చరిత్ర
సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లా తుని సమీపంలోని గొంపకొండ వద్ద క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటి చారిత్రక ఆనవాళ్లు బయపడ్డాయి. గతంలో రైతులు పొలాలను చదును చేస్తుండగా.. రాతి కుండలు, ప్రమిదలు, శిలాఫలకాలు బయటపడ్డాయి. కొండవాలున ఉన్న ఇక్కడి జీడి, మామిడి తోటల్లో వెలుగుచూసిన ఈ శిథిలాలను సాధారణ రాళ్లుగా భావించి చెల్లాచెదురుగా పడేశారు. నాటి రాతి తొట్టెలను అక్కడి రైతులు ఇప్పటికీ వినియోగిస్తుండటం విశేషం. తుప్పలు, డొంకల్లో పడివున్న ఆ శిథిలాలను ‘సాక్షి’ ప్రతినిధి పరిశీలించగా.. అవి ఓ ఆలయానికి చెందిన శిల్ప చెక్కడాలుగా తేలాయి. అక్కడే పురాతన ఇటుకలు, గుడి శిథిలాలు, రాతి శాసనాలు సైతం బయల్పడ్డాయి. వాటిని సేకరించి పురావస్తు శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసిన నిపుణుడికి పంపించగా.. అవి యలమంచిలి చాళుక్యుల కాలం నాటివని తేల్చారు. గుడి, ఇటుకలు, విగ్రహాలు క్రీ.శ. 800 సంవత్సరం నాటివని, తెలుగు శాసనాలు 1240 సంవత్సరం నాటివని గుర్తించారు. మట్టిలో 1200 ఏళ్ల నాటి గుడి తుని–నర్సీపట్నం మార్గంలో తుని నుంచి 12 కి.మీ. వెళితే.. (కోటనందూరుకు 2 కి.మీ. దూరంలో) గొంపకొండ ఉంది. కొండను ఆనుకుని జీడి, మామిడి తోటలున్నాయి. రోడ్డును ఆనుకుని ఉన్న ఓ దేవత విగ్రహం (గొంప తల్లిగా పిలుస్తారు) ఉంది. స్థానికంగా మరికొన్ని విగ్రహాలు, శాసనాలు కూడా ఉన్నట్టు స్థానికులు చెప్పారు. అక్కడికెళ్లి పరిశీలించగా.. అద్భుతమైన రాతి కట్టడాలు విరిగిపోయి, మట్టిలో కూరుకుపోయాయి. రాయిని తొలిచి చేసిన నీటి తొట్టెలని రైతులు ఇప్పటికీ వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతంలో గతంలో పట్టణం ఉండేదని, అగ్ని ప్రమాదం లేదా మశూచి వంటి భయంకరమైన వ్యాధితో ప్రజలు వలసపోయి ఉంటారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడి ఆలయం నిరాదరణకు గురై ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. అనంతర కాలంలో ఈ ప్రాంతంలో పొలం పనులు చేపట్టిన రైతులు గుడి రాళ్లను సరిహద్దు కంచెగా మార్చుకున్నారు. తవ్వకాల్లో దొరికిన విగ్రహాలను స్థానిక దేవతలుగా పూజిస్తున్నారు. తవ్వకాల్లో తెలుగు లిపితో ఉన్న శాసనాలు, పద్మాలు చెక్కిన స్తంభాలు, వివిధ ఆకృతుల్లో ఉన్న రాతి ఫలకాలు, విష్ణుమూర్తి విగ్రహం, మహిషాసురమర్దని, భైరవ శిల్పాలు బయటపడ్డాయి. ఈ శిల్ప సంపద సుమారు క్రీ.శ 800 నుంచి 1240 సంవత్సరాల మధ్య విలసిల్లిన ఆలయానికి చెందినదని పురావస్తు నిపుణులు గుర్తించారు. యలమంచిలి చాళుక్యుల పాలనా కాలంలో ఈ ప్రాంతంలో ‘జననాథపట్నం’ అనే పట్టణం ఉండేదని.. తర్వాత ఇక్కడి ప్రజలు వలసపోయినట్టు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లలేని వారు మాత్రం సమీపంలోనే ‘జగన్నాథపురం’ అనే గ్రామాన్ని నిర్మించుకోగా.. ఇప్పటికీ అదే పేరుతో చలామణిలో ఉంది. కాగా, ఇక్కడ లభించిన భైరవ, విష్ణు విగ్రహాలను సైతం స్థానికులు స్త్రీ మూర్తులుగా కొలవడం గమనార్హం. ఇక్కడ లభించిన విగ్రహాలు, శాసనాలు, కట్టడాలను పురావస్తు పరిశోధకులు పరిశీలన జరపడం ద్వారా గత చరిత్రను వెలికి తీయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఆనవాళ్లు నివ్వెర పరుస్తున్నాయి అడవిని తలపిస్తున్న ఈ ప్రాంతంలో ఇంత గొప్ప చారిత్రక సంపద ఉందంటే ఆశ్చర్యకరంగా ఉంది. శిల్పాలను పరిశీలిస్తే క్రీ.శ. 800 సంవత్సరం నాటివని తెలుస్తోంది. తెలుగు శాసనాలు క్రీ.శ. 1200–40 నాటివిగా భావిస్తున్నాం. ఇటుకలు 40 గీ30 గీ6 సెం.మీ. వ్యాసార్ధంలో ఉన్నాయి. రాయిని తొలిచి చేసిన నీటి తొట్టె (గోలెం) కూడా ఓ అద్భుతమనే చెప్పొచ్చు. మహిషాన్ని ఎడమ కాలితో తొక్కుతూ, శూలంతో గుచ్చుతూ, ఖడ్గంతో నరుకుతున్న మహిషాసురమర్దిని శిల్పం, వింజడలు, కపాల మాల, ఢమరుకం, ఖడ్గం, శూలం, పాత్ర ధరించి నగ్నంగా ఉన్న భైరవ శిల్పం కనిపిస్తున్నాయి. ఇవి క్రీ.శ. 9–12 శతాబ్దాలలో యలమంచిలి చాళుక్యుల శైలిని తెలియజేస్తున్నాయి. ఇక్కడ లభించిన మరో అద్భుతం శాసనం. ఇందులో లిపి తెలుగును పోలి ఉన్నప్పటికీ తెలుగు కాదు. ఇక్కడ మరింత లోతుగా పరిశోధనలు చేస్తే గొప్ప సంస్కృతి బయటపడే అవకాశం ఉంది. – డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో -
టీడీపీ సీనియర్‌కు షాక్.. ఎలాగు గెలవరు మీకెందుకు టికెట్?
ఆయన టీడీపీలో సీనియర్ నాయకుడు. చంద్రబాబు తర్వాత అంతటివాడని చెప్పుకునేవారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవులు అలంకరించారు. కానీ, రెండుసార్లు ప్రజలు ఆయన్ను ఓడించారు. అయినా గత ప్రభుత్వంలో మండలి ద్వారా మంత్రి పదవి పొందారు. టీడీపీలో ఇప్పుడాయన హవా ఆగిపోయింది. వచ్చే ఎన్నికల్లో సీటే ఇవ్వొద్దని పచ్చ బాస్ నిర్ణయించినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయన కథేంటో చూద్దాం. తునిలో బ్రేక్ ఎందుకు పడింది? తెలుగుదేశం పార్టీలో పరిచయం అక్కరలేని నాయకుడు యనమల రామకృష్ణుడు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం నుండి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యనమల ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్‌గా, అనేక సార్లు మంత్రిగా పదవులు అనుభవించారు. ఎమ్మెల్యేగా ఓడిన తర్వాత రెండు మార్లు ఎమ్మెల్సీ అయ్యారు. 2009 ఎన్నికల్లో మొదటి సారి ఓటమిని చవిచూసిన యనమల అప్పటి నుంచి ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో తన సోదరుడు యనమల కృష్ణుడుని తునిలో టీడీపీ తరపున పోటీ చేయించినా ఓటమి తప్పలేదు. వచ్చే ఎన్నికల్లో మూడోసారి పోటీ చేసి అదృష్టం పరీక్షించుకుందామనుకుంటున్న కృష్ణుడుకి టీడీపీ అధిష్టానం బ్రేక్ వేసింది. అన్న అసలే వద్దు, తమ్ముడి ఊసే వద్దు ఇటీవల టీడీపీ నిర్వహించిన ఒక సర్వేలో యనమల సోదరులకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయట. దీంతో కృష్ణుడుకి సీటు ఇచ్చేది లేదని పార్టీ అధిష్టానం స్పష్టం చేసిందని సమాచారం. అంతేకాదు.. తనకు సీటు ఇవ్వకపోతే.. తన కుమారుడికైనా సీటు వస్తుందని కృష్ణుడు పెట్టుకున్న ఆశలపై కూడా చంద్రబాబు, లోకేష్‌లు నీళ్లు చల్లేశారట. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి యనమల రామకృష్ణుడు తన పెద్ద కుమార్తె దివ్యను పోటీ చేయించాలని భావించారట. కానీ, అక్కడ ఈక్వేషన్స్ సూట్ కాకపోవడంతో తుని నుండే దివ్యను పోటీ చేయించాలని భావించారట. దివ్యకే తుని టీడీపీ బెర్తు ఖాయమనుకున్న సమయంలో.. అనూహ్యంగా తెర మీదకు వచ్చారు తుని మాజీ ఎమ్మెల్యే రాజా ఆశోక్ బాబు. ఎలాగు గెలవరు, మీకెందుకు టికెట్? 2009 ఎన్నికల్లో యనమల మొట్ట మొదటిగా ఓటమి చెందింది ఆశోక్ బాబు పైనే. దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ఆర్ ఆశీస్సులతో అపట్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు ఆశోక్ బాబు. అలాగే 2019 ఎన్నికల్లో జనసేన నుండి పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయారు. ఐతే అలాంటి ఆశోక్ బాబును ఇటీవలే తన దగ్గరకు పిలుచుకుని మాట్లాడారు చంద్రబాబు నాయుడు. దీంతో ఆ ఫోటో ఇప్పుడు లోకల్ పేపర్లు..సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... వచ్చే ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి ఆశోక్ బాబే అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు, తునిలో యనమల సోదరులు పట్టు కోల్పోయారని.. సీటు ఇచ్చేది లేదని యనమల సోదరులకు అధిష్టానం స్పష్టం చేసిందని తునిలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఐతే యనమల మాత్రం సీటు తన పెద్ద కుమార్తె దివ్యకే అన్న ధీమా లో ఉన్నారట. పార్టీయే పాతాళంలో కూరుకుపోతే..టీడీపీలో సీట్ల పంచాయితీ నడుస్తోంది. తుని సీటు పోతే పోయింది..ఈసారి తనకు రాజ్యసభ సీటు వస్తుందని యనమల తెలుగు తమ్ముళ్ళకు చెబుతున్నారట. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com. -
Yanamala Brothers: అన్నదమ్ముల అస్త్రసన్యాసం!
సాక్షి, కాకినాడ: ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు అస్త్ర సన్యాసం చేస్తున్నారు. వరుస పరాజయాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ముఖ్య నేతలు సైతం వైఎస్సార్ సీపీ సంక్షేమ పాలన ముందు మళ్లీ పోటీకి వెనుకంజ వేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాలలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దయనీయ పరిస్థితులపై టీడీపీ అధిష్టానం తల పట్టుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు భవిష్యత్తు అంతా మనదేనంటూ ఊరూవాడా ప్రచారంతో హంగామా చేస్తుంటే ఆ పార్టీ నేతలు మాత్రం యుద్ధానికి ముందే అ్రస్తాలు వదిలేస్తున్నారు. వరుస ఓటములకు తోడుగా భవిష్యత్తు ఫలితాలు కళ్లెదుట స్పష్టంగా కనిపిస్తుండటంతో రాజకీయ కురువృద్ధులు సైతం పునరాలోచనలో పడ్డారు. పోటీ అంటే ససేమిరా అంటున్నారు. నేరుగా ఈ విషయం చెప్పలేక చేస్తోన్న వ్యూహాత్మక వ్యాఖ్యలు పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేస్తున్నాయి. పోటీ చేయడానికి ధైర్యం చాలక కుంటిసాకులు వెతుక్కుంటున్నారని ఆ పార్టీలోని అసమ్మతి శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పుడు ముచ్చెమటలు టీడీపీలో చంద్రబాబు తరువాత నంబర్–2గా చలామణీ అయ్యే ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మూడు దశాబ్దాల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ పక్షాన చక్రం తిప్పారు. తెర వెనుక రాజకీయాల్లో ఈయన్ను ఎదుర్కొనేందుకు చాలాకాలం రెండు గ్రూపులు కూడా నడిచాయి. అటువంటి నాయకుడికే వైఎస్సార్ సీపీ ప్రజా సంక్షేమ పాలనతో ముచ్చెమటలు పడుతున్నాయని సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయం ఈ నాయకుడిని వెంటాడుతోంది. తాను పుట్టి పెరిగి, రాజకీయంగా ఇప్పుడున్న స్థాయికి కారణమైన సొంత నియోజకవర్గం తుని నుంచి..తాను, వరుసకు సోదరుడైన కృష్ణుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పార్టీ శ్రేణులకు ఇటీవల రామకృష్ణుడు పరోక్ష సంకేతాలు పంపించారు. ఇవి నియోజకవర్గంతోపాటు జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. రెండు రోజుల క్రితం తునిలో జరిగిన పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో స్వయంగా రామకృష్ణుడు ఈ విషయాన్ని చెప్పకనే చెప్పడం గమనార్హం. 70 సంవత్సరాలు వయసు దాటింది.. కృష్ణుడికి కూడా కాస్త అటు ఇటుగా వయస్సు మీరింది..ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీచేసినా కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తల సమావేశంలోనే యనమల ప్రకటించారు. రామకృష్ణుడి వ్యాఖ్యలను పార్టీ నేతలు ఎవరికి తోచిన రీతిలో వారు అ న్వయించుకుంటున్నారు. యువకులకు అవకాశం కల్పించాలని తానే చంద్రబాబును కోరినట్టు, అందుకు ఆయన సరేనన్నట్టు కూడా ఈ నేత చెప్పుకొచ్చారు. సీనియారిటీ, వయసు మీరడమనేది రాజకీయాల్లో అసలు ప్రశ్నే కాదనే విషయం రాజకీయాలపై ఏ కొద్దిపాటి అవగాహన ఉన్న వారిని అడిగినా ఇట్టే చెబుతారు. టీడీపీలో అపర చాణుక్యుడిగా చెప్పుకునే యనమల అంత పెద్ద మాటలు మాట్లాడారంటే దీని వెనుక పెద్ద వ్యూహమే ఉంటుందనే చర్చ కూడా నడుస్తోంది. ఈ మాటల వెనుక మర్మం ఏమిటంటూ తెలుగు తమ్ముళ్లు ఎవరి స్థాయిలోవారు అంచనాలు వేస్తున్నారు. నాటి అరాచకాలు ఇంకా కట్టెదుటే.. అధికారంలో ఉన్నన్నాళ్లు తునిలో సాగించిన అరాచక పాలనతో యనమల సోదరులు ప్రజల ఛీత్కారానికి గురయ్యారు. రామకృష్ణులను వరుసగా మూడు పర్యాయాలు ఓడించిన తరువాత కూడా అక్కడి ప్రజలు గత జ్ఞాపకాలను మరచిపోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం చాలక రామకృష్ణుడు 2009 తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. అయినా ఆశను వదులుకోలేక తన రాజకీయ వారసుడిగా (వరుసకు సోదరుడు) కృష్ణుడ్ని తుని నుంచి బరిలోకి దింపారు. రామకృష్ణుడి తరువాత వరుసగా రెండు పర్యాయాలు 2014, 2019లలో బరిలోకి దిగిన కృష్ణుడిని తుని ప్రజలు ఓడించారు. వరుస ఓటములు, గడచిన మూడున్నరేళ్ల జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలన వెరసి తునిలో యనమల సోదరులకు రాజకీయ భవిష్యత్తు లేదనే అంచనాలే రామకృష్ణుడు నోటితో ఆ మాటలు పలికించాయనే వాదన పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. ఈ మాటలు సాకులే.. 1983 నుంచి వరుసగా రామకృష్ణుడు తునిలో ఆరు పర్యాయాలు గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ఓటమి తరువాత తుని నుంచి పోటీ చేసే సత్తా లేక చేతులెత్తేసి ఆయన ఇక్కడి రాజకీయాలకు దూరమయ్యారు. సందర్భోచితంగా బంధువులు, సన్నిహితుల శుభ కార్యాలకు రావడం తప్పితే సొంత నియోజకవర్గ రాజకీయ వ్యవహారాలకు దాదాపు ముఖం చాటేశారని చెప్పొచ్చు. ఈ నాయకుడు ఇంత హఠాత్తుగా తుని నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటుచేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. ఒకవేళ పార్టీపై అభిమానంతో ఏర్పాటు చేశారనుకున్నా, వయసు మీరిందని సాకులు చెబుతూ యువకులకు అవకాశం కల్పించాలంటూ చేసిన వ్యాఖ్యల అంతరార్థం ఏమై ఉంటుందా అనే కోణంలో కూడా తమ్ముళ్లు ఆరా తీస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గుకు రావడం కలే అనే నిర్థారణకు రావడంతోనే వయస్సును సాకుగా చూపిస్తున్నారని తెలుస్తోంది. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో యనమల పలికిన నాలుగు పలుకులు టీడీపీ పరిస్థితికి అద్దం పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
మాజీ ఎంపీపీపై హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్
తుని: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ పోల్నాటి శేషగిరిరావుపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు అగ్రహారపు చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసినట్లు అదనపు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. తునిలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. విశాఖపట్నం ఆరిలోవ పెద్దగదుల ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్.. అదే ప్రాంతానికి చెందిన అభిరామ్‌కు శిష్యుడు. ఇతర ప్రాంతాలకు వెళ్లి పూజలు చేసే వీరు కొంతకాలంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం నామవరంలో రిటైర్ట్ ఉద్యోగి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పోల్నాటి శేషగిరిరావు తనను ఇబ్బందిపెట్టాడని, అతడిని గాయపరిస్తే సొమ్ము ఇస్తానని వారికి గురువు అభిరామ్ చెప్పాడు. దీంతో చంద్రశేఖర్ తన స్నేహితులతో కలిసి శేషగిరిరావు కదలికలపై నిఘాపెట్టాడు. ఈ నెల 17న ఉదయం చంద్రశేఖర్ భవానీమాల ధరించి, ముఖానికి మాస్క్ పెట్టుకుని తుని సమితి ఆఫీసు వీధిలో నివాసం ఉంటున్న శేషగిరిరావు ఇంటికి మోటారు సైకిల్ మీద వెళ్లాడు. భిక్షం అడిగాడు. బియ్యం వేస్తుండగా శేషగిరిరావుపై కత్తితో దాడిచేసి పారిపోయాడు. శేషగిరిరావు అక్కడే పడిపోయిన కత్తిని తీసుకుని వెంటపడి చంద్రశేఖర్ వీపుపై దాడిచేయడంతో గాయమైంది. శేషగిరిరావు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియాలో వచ్చిన ఊహాచిత్రం ఆధారంగా విస్తృతస్థాయిలో గాలించారు. పోలీసులు గాలిస్తున్నట్లు తెలుసుకున్న చంద్రశేఖర్ బుధవారం తుని పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి దర్యాప్తు అధికారి డీఎస్పీ మురళీమోహన్‌కు లొంగిపోయాడు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు అదనపు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ మురళీమోహన్, తుని, ప్రత్తిపాడు సీఐలు నాగదుర్గారావు, కిశోర్‌బాబు పాల్గొన్నారు. -
ముగిసిన ముద్రగడ పద్మనాభం రైలు దగ్ధం కేసు విచారణ
-
మద్యం స్కామ్‌లకు ఆద్యులు చంద్రబాబు కుటుంబ సభ్యులే: పెద్దపాటి అమ్మాజీ
సాక్షి, కాకినాడ: ఏపీలో మద్యం బ్రాండ్ల పేర్లకు టీడీపీ హయంలోనే అనుమతిచ్చారు. మద్యం స్కామ్‌లకు ఆద్యులు చంద్రబాబు కుటుంబ సభ్యులేనని రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పెద్దపాటి అమ్మాజీ మండిపడ్డారు. కాగా, పెద్దపాటి అమ్మాజీ ఆదివారం తునిలో మీడియాతో మాట్లాడుతూ.. మద్యం స్కామ్‌లకు ఆద్యులు చంద్రబాబు కుటుంబ సభ్యులే. డిస్టిలరీలకు అనుమతులు కావాలంటే గతంలో భువనేశ్వరిని కలిసేవారని విన్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై ఎలా బురద చల్లాలో తెలియక మద్యం స్కామ్ అంటూ బురద చల్లుతున్నారు. మద్యం బ్రాండ్ల పేర్లకు టీడీపీ హయంలోనే అనుమతి ఇచ్చారని అన్నారు. -
కాకినాడ: బీజేపీ ఆఫీసులో అసాంఘిక కార్యకలాపాలు.. కేసు నమోదు
సాక్షి, కాకినాడ: జిల్లాలోని తునిలో బీజేపీ నేతలు రెచ్చిపోయారు. దీంతో కాషాయ పార్టీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తునిలోని బీజేపీ ఆఫీసులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు ఫిర్యాదు అందడంతో బీజేపీ నేతలపై కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. వివరాల ప్రకారం.. తుని పట్టణ శివారులోని మాన్విత అపార్ట్మెంట్లో బీజేపీ కార్యాలయం ఉంది. కాగా, బుధవారం రాత్రి బీజేపీ నేతలు మద్యం మత్తుల్లో అపార్ట్‌మెంట్‌వాసులపై దాడికి పాల్పడ్డారు. దీంతో, గురువారం అపార్ట్మెంట్లోని నివాసితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు.. బీజేపీ ఆఫీసులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు ఆరోపణలు చేశారు. దీంతో, బీజేపీ నేతలపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ప్యాకేజీకి అంగీకరించిన మీరే ఇప్పుడు హోదా అడుగుతారా -
కలర్‌ఫుల్.. ప్రూట్స్
కడియం: పనస తొనలు తెలుపు లేత గోధుమ లేదా పసుపు రంగులో ఉండటం సహజమే. అవే తొనలు చూడగానే ఆకర్షించేలా ఆరెంజ్ కలర్లో ఉంటే ఆశ్చర్యమే. సీతాఫలాలు పైకి ఆకుపచ్చగా.. లోపల తెల్లటి గుజ్జుతో ఉండటం సహజమే. అవే ఫలాలు పైకి పింక్ కలర్లో కనిపిస్తే ‘ఎంత బాగున్నాయో’ అనిపించక మానదు. సాధారణంగా నేరేడు పండ్లు నల్లగా ఉంటాయి. అవే పండ్లు తెల్లగా ఉంటే..! సహజ సిద్ధంగా లభిస్తున్న ఫండ్లను ఇలా సరికొత్తగా అభివృద్ధి చేస్తూ నూతన ఒరవడిని సృష్టిస్తున్నారు కడియం ప్రాంత నర్సరీ రైతులు. సాధారణంగా మనం చూసే పండ్లను భిన్నమైన రంగుల్లో కాసే అనేక రకాల మొక్కలను తమ నర్సరీల్లో అందుబాటులో ఉంచుతున్నారు. మన దేశంలో లభించే వివిధ రకాల పండ్లకు ఉండే సహజ గుణాలకు భిన్నంగా రూపొందిస్తున్న ఈ మొక్కలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగని వీటి తయారీ ప్రకృతి విరుద్ధంగానో లేక జీన్ మోడిఫైడ్గానో చేయడం లేదు. ప్రకృతి సహజంగా లభించే పండ్ల మొక్కల్లో భిన్నమైన లక్షణాలను ముందుగా గుర్తిస్తున్నారు. ఇవన్నీ కలిపి ఒక మొక్కలో వచ్చేవిధంగా అంటు కట్టి తయారు చేస్తున్నారు. ఇలా దేశ, విదేశాల్లో విభిన్న రకాలైన పండ్ల మొక్కలను ఇక్కడకు తీసుకువచ్చి, సరికొత్తగా అభివృద్ధి చేసి, కొనుగోలుదార్లకు అందుబాటులో ఉంచుతున్నారు. నిబంధనల ప్రకారం.. సాధారణంగా వేరే ప్రదేశం నుంచి ఏదైనా మొక్కను తేవాలంటే ప్లాంట్ క్వారంటైన్ నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా పండ్ల మొక్కల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి. విభిన్న రకాల మొక్కలను ఆయా నిబంధనలకు లోబడి ఇక్కడి నర్సరీ రైతులు తీసుకువస్తున్నారు. ముంబై, పుణే, కోల్‌కతా, కేరళ, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో క్వారంటైన్ లైసెన్సులు ఉన్న పలువురు నర్సరీ రైతులు ఇతర దేశాల నుంచి ఈ రకమైన పండ్ల మొక్కలకు మన దేశానికి తీసుకువస్తున్నారు. వీటిని కడియం ప్రాంత నర్సరీ రైతుల ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. కంటికి భిన్నంగా కనిపించినప్పటికీ రుచిలో ఏ మాత్రం తేడా లేకపోవడంతో వీటి ప్రత్యేకతగా చెబుతున్నారు. తెల్ల నేరేడు, పింక్ జామ, ఎరుపు రంగు తొనలు ఇచ్చే పనస, సీడ్ లెస్ నిమ్మ, పింక్ కలర్ సీతాఫలం, ఎరుపు రంగులో ఉండే గులాబీ జామ, వెరిగేటెడ్ అరటి, స్వీట్ గుమ్మడి, పింక్ కొబ్బరి, వివిధ రంగుల్లో చిలగడదుంప, ఉసిరి, డ్రాగన్‌ఫ్రూట్, రామాఫలం, ఎర్రని చింత/సీమచింత తదితర రకాల పండ్ల మొక్కలను స్థానిక నర్సరీ రైతులు అభివృద్ధి చేస్తున్నారు. పింక్ కలర్ గులాబీజామ ,ఆరెంజ్ పనస స్వీట్ గుమ్మడికొనుగోలుదారులను ఆకట్టుకుంటాయి సాధారణంగా ఉండే పండ్ల కంటే భిన్నంగా కనిపిస్తుండడంతో కొనుగోలుదారులను ఇవి ఆకట్టుకుంటున్నాయి. వీటి అభివృద్ధి శ్రమతో కూడినది. కానీ నాణ్యమైన దిగుబడి ఇస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఔత్సాహిక రైతులు వీటిని నాటి మంచి ఫలసాయం పొందుతున్నారు. ఇవి సహజసిద్ధంగా రూపుదిద్దుకున్నవే. – కుప్పాల దుర్గారావు, సప్తగిరి నర్సరీ, బుర్రిలంక సహజమైనవే.. కొన్ని రకాల పండ్లు, పువ్వులు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగు, రుచి, వాసన కలిగి ఉంటాయి. మన దేశంలో పనస సాధారణంగా తెలుపు, లేత గోధుమ, పసుపు రంగుల్లో ఉంటుంది. థాయ్‌లాండ్‌లో ఎరుపు రంగులో ఉంటుంది. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన భిన్న లక్షణాలుంటాయి. వీటిని సేకరించి తీసుకువచ్చి, స్థానిక నర్సరీ రైతులు అభివృద్ధి చేస్తున్నారు. సంబంధిత రకాన్ని అభివృద్ధి చేయడంగానే దీనిని చెప్పవచ్చు. – సుధీర్‌కుమార్, ఉద్యాన అధికారి, కడియం -
తుని.. మూడు తరాలుగా మామిడికి ప్రసిద్ధి
సాక్షి, తుని: తింటే గారెలే తినాలి అంటారు కానీ.. ఆ కోవలో తుని మామిడి పండ్లు వస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా లేని రుచి తుని ప్రాంతంలో పండే మామిడి పండ్లకు ఉంది. 1947కు ముందు నుంచీ మామిడికి తుని ప్రసిద్ధి. తుని పట్టణానికి ఏకంగా “మ్యాంగో సిటీ’ అనే పేరు కూడా ఉంది. తుని డిపో ఆర్టీసీ బస్సులపై ఈ డిపో పేరు రాసినప్పుడు పక్కనే మామిడికాయల బొమ్మలు కూడా ఉండేవంటే.. ఇక్కడి మామిడి ఎంత ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల తునిలో ప్రారంభమైన ఓ జ్యూయలరీ సంస్థ సైతం “మ్యాంగో సిటీ’గా ప్రచారం చేసుకోవడం విశేషం. ఇక్కడి రైతులు మూడు తరాలుగా ఇతర రాష్ట్రాలకు మామిడి పండ్లు ఎగుమతి చేస్తున్నారు. ఉద్యాన శాఖ ద్వారా రెండేళ్లుగా విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 15,362 హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. తుని సబ్ డివిజన్లో మామిడి విస్తీర్ణం 1,700 హెక్టార్లుగా ఉంది. ఇక్కడ పండే బంగినపల్లి, చెరకు రసాలు, తోతాపురి, సువర్ణరేఖ, పంచదార కల్తీ, కొత్తపల్లి కొబ్బరి, పండూరి మామిడి పండ్లకు ఎంతో డిమాండ్. ఏటా తుని ప్రాంతం నుంచి 60 వేల టన్నుల పండ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం తుని కేంద్రంగా ఏటా రూ.20 కోట్ల మేర మామిడి వ్యాపారం జరుగుతోంది. రవాణా సౌకర్యాలు అంతగా అందుబాటులో లేని సమయంలో ఇక్కడి రైతులు, వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు రైళ్ల ద్వారా మామిడి ఎగుమతులు చేసేవారు. క్రమేపీ లారీ రవాణా అందుబాటులోకి రావడంతో ఉత్తరాది రాష్ట్రాలకు భారీ స్థాయిలో ఎగుమతులు చేస్తూ ఇక్కడి వ్యాపారులు ఆదాయం పెంచుకుంటున్నారు. ఇక ఉద్యాన శాఖ విదేశాలకు ఎగుమతి చేయడానికి 3,500 మంది రైతులతో ఒప్పందం చేసుకుంది. మూడు తరాలుగా ఎగుమతులు మా తాత, నాన్న పప్పు సూర్యారావు నుంచి 80 ఏళ్లుగా మామిడి ఎగుమతులు చేస్తున్నాం. రైతుల నుంచి తోటలు కొని పక్వానికి వచ్చిన పండ్లను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాం. తొలి రోజుల్లో వెదురు బుట్టల్లో ప్యాకింగ్ చేసి రైళ్లలో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశాం. గుజరాత్, పశ్చిమ బెంగాల్, బిహార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో తుని మామిడికి ఎంతో డిమాండ్ ఉంది. వేసవి సీజన్లో ఎన్ని పనులున్నా మామిడి ఎగుమతులు ఆపలేదు. ఉద్యాన అధికారులు సహకరించడంతో విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా కలిగింది. – పప్పు వెంకట రమణ, వ్యాపారి, వెంకటాపురం నేల స్వభావంతో మంచి రుచి తుని ప్రాంతంలో ఇసుక, గరప (గ్రావెల్) నేలలు కావడంతో ఇక్కడి మామిడి పండు రంగు ఎంతో బాగుంటుంది. రుచి కూడా చాలా మధురంగా ఉంటుంది. వేసవి వచ్చిందంటే చాలు తుని మామిడి పండ్లు రుచి చూడాలని ప్రతి ఒక్కరూ పరితపిస్తారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడంతో మంచి రంగు ఉంటుంది. ప్రస్తుతం మేలు రకం పండ్ల ధర టన్నుకు రూ.75 వేలు పలుకుతోంది. విదేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశాం. – విజయలక్ష్మి, ఉద్యాన అధికారి, తుని -
టీడీపీ నేత యనమల కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, తూర్పుగోదావరి: తుని నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓటమి చెందిన టీడీపీ నేత యనమల కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఓ సభలో టీడీపీ కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే జగనన్న ఇళ్ల పట్టాల లబ్ధిదారుల లిస్ట్ రద్దుచేస్తామని పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలందరికీ 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. అవసరమైతే ఒక్కొక్కరికి మూడేసి ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. కాగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు కృష్ణుడు సోదరుడి వరుస అవుతారు. ‘ఈ లిస్టులు ఉంటాయి అనుకుంటున్నారు వీళ్లు.. గవర్నమెంట్ రాగానే అయి తీసి పడేసి మన లిస్టులు ఇస్తాం. మన లిస్ట్ పెట్టి రెండేసి సెంట్లు చేసి ఫస్ట్ లిస్ట్ పెడతాం. అబ్బాయి మీ లిస్ట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇదిగో మా లిస్ట్ పంచి పెట్టండి అని చంద్రబాబు నాయుడుని తిట్టారు కూడా ఒక్కోరు. ఇంతకముందు మనది కూడా తప్పుంది. ఎందుకంటే ధర్మంగా చెయ్యాలి అని చేశాం. ధర్మం ఇక పనిచేయదు. చదవండి👉 తుమ్మపూడిలో ఉద్రిక్తత.. లోకేష్ రాకతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు రెండు సెంట్లే కాదు.. రెండేసి పేర్లు పెడతామో, మూడేసి పేర్లు పెడతామో మీకే తెలీదు. రాబోయే రోజుల్లో మాత్రం చాలా గొప్పగా చేసాడ్రా కృష్ణాగారు అనే టైపు తీసుకొచ్చాను చూడండి అని చెప్పుకోవాలి. తునిలో నేను గెలిచాను.. మోజారీటీ కోసం పోరాడుతున్నాను. అక్కడ చంద్రబాబు అధికార పార్టీకి సీట్లు రాకుండా పోరాడుతున్నారు. మీరు ప్రజల్లోకి వెళ్ళి చంద్రబాబు..కృష్ణుడు వచ్చేశారని ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయండి’ అంటూ యనమల కృష్ణుడు కార్యకర్తలతో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి👉 టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజీపై మంత్రి బొత్స క్లారిటీ -
కూతురిని కాపాడి.. తండ్రి మృత్యుఒడికి..
సాక్షి, తూర్పుగోదావరి : నాన్నంటే నమ్మకం.. ఈ మాటను అక్షరాలా నిజం చేశాడో తండ్రి.. తాను మృత్యుఒడికి చేరుతూ బిడ్డ ప్రాణాలను కాపాడాడు.. వివరాలివీ.. తుని మండలం హంసవరానికి రావాడ జయబాబు(50)కు భార్య అప్పలకొండ, ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె విశాఖపట్నంలో చదువుతోంది. చిన్న కుమార్తె నిర్మల గ్రామంలోనే ఇంటర్మీడియెట్ చదువుతోంది. భార్యభర్తలిద్దరూ కష్టపడితేనే పూట గడిచేది. రోజులాగే ఆ దంపతులు మంగళవారం ఉపాధి హామీ పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. కుమార్తె నిర్మల కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే కనిపించడంతో తల్లి అప్పలకొండకు కోపం వచ్చింది. నిర్మలను గట్టిగా మందలించింది. మనస్తాపం చెందిన నిర్మల ఆత్మహత్య చేసుకుంటానంటూ కిలో మీటరు దూరంలో రైల్వే ట్రాక్‌వద్ద ఉన్న పోలవరం ఎడమ ప్రధాన కాలువ బ్రిడ్జి పైకి పరుగు తీసింది. భార్య, పిల్లలతో మృతుడు జయబాబు (పాత చిత్రం) కుమార్తెను ఆపేందుకు తండ్రి జయబాబు కూడా వెంట పరుగెత్తాడు. తండ్రి కళ్లెదుటే బ్రిడ్జిపై నుంచి నిర్మల పోలవరం కాలువలోకి దూకేసింది. కూతురిని కాపాడేందుకు తండ్రి కూడా వెంటనే కాలువలోకి దూకాడు. నీట మునిగిన కూతురిని భుజాలపై ఎక్కించుకుని అతి కష్టం మీద కొంతమేర ఒడ్డుకు వచ్చాడు. ఈలోగానే ఆయాసంతో కుప్పకూలి నీటిలో పడి గల్లంతయ్యాడు. కుమార్తె ఒడ్డున పడింది. సమీపంలో కొందరు స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది గాలించగా గంట తర్వాత జయబాబు మృతదేహం లభించింది. నిర్మల తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. భర్త మృతదేహం వద్ద అప్పలకొండ, బంధువులు బోరున విలపించారు. రూరల్ సీఐ కె.కిషోర్‌బాబు, ఎస్సై వై.గణేష్‌కుమార్ సంఘన స్థలాన్ని పరిశీలించారు. చదవండి: ప్యాంట్ విప్పి తనిఖీ.. అవమానంతో రైలు కిందపడి భర్త రెండో పెళ్లికి ప్లాన్.. ప్రాణాలు తీసుకున్న భార్య -
భార్య తప్పటడుగులు.. మార్పు రాకపోవడంతో..
తుని రూరల్(తూర్పుగోదావరి): ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఒక మహిళను ఆమె భర్త.. తల్లి కలిసి అంతమొందించిన వైనమిది. తుని మండలం కొత్త వెలంపేట శివారు మామిడి తోటలో బయటపడిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు బుధవారం రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు తెలిపారు. లోవదేవస్థానంలో సన్నాయి వాయిద్యకారుడు చింతపల్లి సత్యనారాయణ 2004లో తన అక్క కుమార్తె ఆదిలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి పదో తరగతి చదువుతున్న రమేష్ నాలుగో తరగతి చదువుతున్న మరో కుమారుడున్నారు. తుని మార్కండ్రాజు పేటలో ఈ కుటుంబం ఉండేది. ఆదిలక్ష్మి కొందరితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తోందని ఆమె భర్త, తల్లి సత్తెమ్మ తరచూ మందలించేవారు. పరువుపోతోందని బాధపడేవారు. అయినప్పటికీ మార్పు రాకపోవడంతో వీరిద్దరూ విసిగిపోయారు. ఈ నేపథ్యంలో గతనెల 28న సత్తెమ్మ, ఆమె అల్లుడు కలిసి ఆదిలక్ష్మి తలపై సుత్తితో బలంగా కొట్టారు. దీంతో ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని గోనె సంచిలోకి కుక్కి స్కూటీ వాహనం ముందు పెట్టుకుని సత్యనారాయణ కొత్తవెలంపేట శివారు మామిడి తోటకు తరలించాడు. అక్కడ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఎవరైనా చూస్తారని వెంటనే ఇంటికి వచ్చేశాడు. అయితే మృతదేహం సగంకాలి మిగిలినభాగం ఉండిపోయింది. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. హైవే సీసీ కెమెరాల ఫుటేజ్‌ల ద్వారా కీలక ఆధారాలు సేకరించారు. ఈలోగా భయాందోళనకు గురైన సత్యనారాయణ, సత్తెమ్మ బుధవారం పోలీసులకు లొంగిపోయారు. ఇద్దరినీ రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ వివరించారు. రూరల్ సీఐ కె.కిషోర్‌బాబు, ఎస్సై వై.గణేష్ కుమార్, సిబ్బందిని ఆయన అభినందించారు. తల్లి హత్యకు గురికాగా తండ్రి, అమ్మమ్మ అరెస్టవడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఆదిలక్ష్మి హత్యతో కుటుంబం చిన్నాభిన్నమయ్యింది. చదవండి: అంతా సినీ ఫక్కీ: 20 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు.. పెళ్లైన మరుసటి రోజే షాకిచ్చిన వధువు.. -
అమ్మ దగ్గరకెళ్దాం.. లేవండిరా!
కొడుకుల చేతుల మీదుగా తనువు చాలించాలనే ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. అటువంటిది కడుపున పుట్టిన బిడ్డలు తమ కళ్లముందే మృత్యువు పాలైతే వారి కడుపు కోతకు అంతే ఉండదు. అప్పటి వరకూ తండ్రితో పాటే బైక్‌పై ప్రయాణించిన ఆ కొడుకులిద్దరూ.. మృత్యుశకటంలా దూసుకువచ్చిన కంటైనర్ ఢీకొని, మృత్యు ఒడిలోకి ఒరిగిపోయారు. తుని పట్టణంలో ఆదివారం ఉదయం ఈ ఘోరం చోటు చేసుకుంది. కళ్లెదుటే నెత్తుటి ముద్దలుగా మారిన బిడ్డలను చూసి.. ఆ తండ్రి గుండె పగిలింది. తీవ్రమైన వేదనతో తల్లడిల్లిపోతూ, నడిరోడ్డుపై పొర్లాడుతూ ‘అమ్మ దగ్గరకెళ్దాం లేవండిరా’ అంటూ అతడు విలపించడం చూసిన వారిని కంటతడి పెట్టించింది. సాక్షి, తుని(తూర్పు గోదావరి) : లేవండిరా.. ఒరేయ్! అమ్మ దగ్గరకు వెళ్దాం.. సోదరి మిమ్మల్ని చూడాలంటోంది.. చేపల కూర వండించుకుని తిందాం.. సరదాగా గడుపుదాం.. అంటూ కుమారుల మృతదేహాల వద్ద ఆ తండ్రి రోదించిన తీరు హృదయాన్ని కలచివేసింది. కొద్ది నిమిషాల్లో తల్లి దగ్గరకు చేరుకునే లోపే ఆ కుమారులను ఓ కంటైనర్ మృత్యు ఒడిలోకి చేర్చింది.. కన్న తండ్రి కళ్లెదుటే జరిగిన ఈ ఘటన ప్రత్యక్షంగా చూసిన వారిని కంటతడి పెట్టించింది. ఆదివారం ఉదయం తుని పట్టణం ఎస్.అన్నవరం రోడ్డులో ఈ దుర్ఘటన జరిగింది. తల్లిదండ్రులు, సోదరితో దుర్గ, తాతాజీ (ఫైల్) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా కోటవురట్లకు చెందిన బర్రే వేణుయ్య తన ఇద్దరు కుమారులను తీసుకుని తుని మండలం ఎస్.అన్నవరం పంచాయతీలోని కవలపాడుకు మోటార్ సైకిల్‌పై వస్తున్నాడు. తుని మార్కెట్లో చేపలు కొనుగోలు చేశారు. మోటార్ సైకిల్ వెనుక బియ్యం బస్తాను కట్టుకుని వస్తున్న సమయంలో తుని వైపు వస్తున్న కంటైనర్ ఢీకొంది. వెనుక కూర్చున్న ఇద్దరు కుమారులు దుర్గ (17), తాతాజీ (7) కంటైనర్ కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వేణుయ్య మాత్రం ఎడమ వైపు పడడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుల తల్లి లోవలక్ష్మి, సోదరి సంతోషి ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై ఇద్దరి మృతదేహాలను చూసి వారి దుఃఖానికి అవధులు లేకుండా పోయింది. అక్కడ వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఆ పిల్లలే ఆస్తిగా.. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలే ఆస్తి. వారిని చూసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు.. తాము కష్టపడినా పిల్లలు మాత్రం చదువుకోవాలని భావించారు. దానికి అనుగుణంగానే ముగ్గురినీ చదివిస్తున్నారు. పిల్లల భవిష్యత్ కోసం జిల్లా దాటి ఇటుకల బట్టీలో కూలీలుగా పని చేస్తున్నారు. పిల్లలు మాత్రం విశాఖ జిల్లా కోటవురట్ల గొల్లపేటలో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. సొంతూరులో పని లేకపోవడంతో తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కవలపాడు గ్రామంలో ఇటుకల బట్టీలో బర్రే వేణుయ్య, అతని భార్య లోవలక్ష్మి పని చేస్తున్నారు. వీరు సంపాదించే సొమ్ముతో కుటుంబం సంతోషంగా ఉంటోంది. ఇటుకల బట్టీకి శనివారం సెలవు కావడంతో వేణుయ్య కోటవురట్ల వెళ్లారు. అప్పటికి రెండు రోజుల ముందే కుమార్తె సంతోషి కవలపాడులో తల్లి దగ్గరకు వచ్చింది. కోటవురట్లలో ఉన్న కుమారులు దుర్గ, తాతాజీలను తీసుకుని ఆదివారం బైక్‌పై వేణుయ్య పయనమయ్యారు. కేవలం 15 నిమిషాల్లో వీరు కవలపాడుకు చేరుకుంటారనగా, అంతలోనే కంటైనర్ రూపంలో ఇద్దరు కుమారులను మృత్యువు కబళించింది. దీంతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. విగతజీవులుగా మారిన కుమారులను చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తుని పట్టణ సీఐ రమేష్‌బాబు ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనివాస్‌కుమార్ శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
దారుణం: కస్తూర్భ టీచర్‌పై భర్త కత్తి దాడి
సాక్షి, తూర్పు గోదావరి: తుని మండలం వి.కొత్తూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని కస్తూర్భా బాలికలో విద్యాలయంలో పనిచేస్తున్న జూవాలజీ టీచర్‌పై ఆమె కత్తితో దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేగింది. భర్త విచక్షణంగా దాడి చేయడంతో సదరు ఉపాధ్యాయురాలు మధురాక్షి తీవ్ర గయాలయ్యాయి. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులకు అక్కడికి చేరుకుని గాయపడిన మధురాక్షిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ తగాదాలే దాడికి కారణమై ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలిన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
రైలులో చిన్న వివాదం ఎంత పనిచేసింది?
సాక్షి, తూర్పుగోదావరి: సౌమ్యుడు, వివాద రహితుడు, అందరినీ నవ్వుతూ పలకరించే ఆ యువకుని పట్ల ‘విధి’ వక్రించింది. హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రెడ్డి సూర్య వెంకటశివ (36) మరి కొద్ది నిమిషాలలో రైలు దిగి క్షేమంగా ఇంటి చేరుకునేవాడు. కానీ ఈలోపే రైలులోని ఓ ఉన్మాదితో వివాదం తలెత్తింది. ఆ ఉన్మాది శివను రైలులో నుంచి బయటకు తోసేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడిపై ఆధారపడి జీవిస్తున్న తల్లి, భార్య దిక్కులేనివారయ్యారు. ఎప్పటికైనా ఉద్యోగంలో గొప్పవాడై అందరికీ ఆసరాగా ఉంటాడని భావించిన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిపోయారు. అందరితో కలుపుగోరుతనంగా ఉండే ఆ యువ హోంగార్డు ప్రాణాలు కోల్పోవడంతో మండల వ్యాప్తంగా ప్రజలు ఆవేదనకు గురయ్యారు. చదవండి: 'ఆయన ముక్కు బాలేదు.. నాకీ పెళ్లొద్దు' పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోటనందూరు పోలీసు స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తున్న శివకు చెరకు క్రషింగు సీజన్ నేపథ్యంలో సామర్లకోట సెంటర్లో ట్రాఫిక్ డ్యూటీ వేశారు. 15 రోజులు డ్యూటీ టర్నలో భాగంగా ఆదివారం శివ డ్యూటీ ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఆదివారం మధ్యాహం సామర్లకోటలో బొకారో ట్రైన్ ఎక్కాడు. రైలులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన అబీబ్ ఇతర ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిని శివ వారించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో అబీబ్ అన్నవరం దాటిన తరువాత హంసవరం సమీపంలో ట్రైన్ నుంచి శివను బయటకు తోసేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తుని రైల్వే పోలీసులు మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. కొత్తకొట్టాంలో వెంకటశివ ఇంటి వద్ద శోకసంద్రంలో కుటుంబ సభ్యులు, (అంతరచిత్రం) హోంగార్డు వెంకట శివ మృతదేహం కొత్త కొట్టాంలో విషాదం మండలంలోని కొత్తకొట్టాం గ్రామానికి చెందిన శివ కోటనందూరు పోలీసు స్టేషనులో హోమ్ గార్డుగా పని చేస్తున్నాడు. ఇతడి తండ్రి ఆరేళ్ల క్రితం మృతి చెందారు. తల్లి సత్యవతి, శివ కలిసి ఉంటున్నారు. శివకు నలుగురు అక్కలు, అన్నయ్య ఉన్నారు. నలుగురు అక్కలకు పెళ్లిళ్లు జరిగి ఎవరికి వారు జీవిస్తున్నారు. అన్నయ్య గ్రామంలోనే ఉండి వ్యవసాయం చేస్తూ అవకాశం వచ్చినప్పుడు బయట చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తుంటాడు. 10వ తరగతి చదువుకున్న శివ 2003లో కోటనందూరు పోలీసు స్టేషనులో హోంగార్డుగా చేరాడు. ఈ 16 ఏళ్లలో కోటనందూరు, తునిటౌన్, తునిరూరల్, అన్నవరం పోలీసు స్టేషన్లు, అన్నవరం కొండపై విధులు నిర్వహించాడు. క్రమశిక్షణతో, అందరితో కలివిడిగా మెలిగే శివ అంటే తోటి ఉద్యోగుల ఎంతో ఇష్టపడేవారు. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పరికరించే శివ దుర్మరణం పాలయ్యాడని తెలుసుకుని వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. విశాఖ జిల్లా నాతవరం మండలం, చిక్కుడుపాలెం గ్రామానికి చెందిన దేవిని 2018 జూన్ 18న శివ వివాహం చేసుకున్నాడు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో మృత్యువు ఇలా ఉన్మాది రూపంలో వచ్చి శివను కడతేర్చింది. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు శివ మృతితో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తల్లి, అక్కలు, అన్నయ్య రోదన అందరినీ కలచివేసింది. డ్యూటీ చేస్తున్నంత సమయం నవ్వుతూనే ఉండేవాడని, ఎప్పుడు ఎవరితోనూ గొడవ పడ్డ సందర్భాలు లేవని కోటనందూరు పోలీసు సిబ్బంది చెబుతున్నారు. శివ ఎంతో మంచి వాడని, చెప్పిన పనిని వెంటనే ముగించేవాడని, అతని మరణం స్టేషన్‌కు తీరని లోటని ఎస్సై అశోక్ అన్నారు. తునిలో విలేకరులతో మాట్లాడుతున్న ఎస్పీ నయీం అస్మి తుని: విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ నయీం అస్మి హుటాహుటిన తుని చేరుకున్నారు. హోంగార్డు శివ మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సాయం అందించారు. శివ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
రైలులో ఉన్మాది వీరంగం
తుని: తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలో వేగంగా వెళ్తున్న రైలు నుంచి ఓ ఉన్మాది తోసివేయడంతో ఆదివారం హోంగార్డు దుర్మరణం పాలయ్యాడు. తుని జీఆర్పీ ఎస్ఐ అబ్దుల్ మారూఫ్ తెలిపిన వివరాలు.. అలెప్పీ నుంచి ధన్‌బాద్ వెళ్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన అబీబ్ ప్రయాణిస్తున్నాడు. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ దాటిన తర్వాత ఎస్–7 బోగీలో సహచర ప్రయాణికులను అతడు ఇబ్బందులకు గురి చేశాడు. సామర్లకోటలో అదే రైలు ఎక్కిన హోంగార్డు రెడ్డి సూర్యవెంకటశివ (35) ఎస్–7 బోగీలోకి వచ్చాడు. అబీబ్ అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని ప్రయాణికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకిలా చేస్తున్నావంటూ అబీబ్‌ను నిలువరించేందుకు హోంగార్డు వెంకటశివ ప్రయత్నించాడు. తుని స్టేషన్ సమీపంలోకి రైలు వచ్చిన సమయంలో అబీబ్ అనూహ్యంగా నెట్టివేయడంతో హోంగార్డు రైలు నుంచి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బోగీలో ఉన్న ప్రయాణికులు తుని జీఆర్పీకి సమాచారం ఇచ్చారు. పోలీసులు అబీబ్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారు. జిల్లాలోని కోటనందూరు మండలం కొత్తకొట్టాం గ్రామానికి చెందిన వెంకటశివ కోటనందూరు పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. సామర్లకోటలో ట్రాఫిక్ విధులు నిర్వహించి, ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ విషాదం జరిగింది. శివకు ఏడాది క్రితమే వివాహమైంది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీంఅస్మి తుని చేరుకొని హోంగార్డు మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబసభ్యులను ఓదార్చి ఆర్థిక సాయం అందజేశారు. -
చెరువు గర్భాలనూ దోచేశారు
నాడు అధికార బలం ఉండడం.. దానికి అధికారుల అండ తోడవడంతో.. దేన్నయినా దోచుకోవడానికి బరితెగించిన టీడీపీ నాయకులు చెరువు గర్భాలను సహితం వదల్లేదు. రాష్ట్రంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఓ కీలక మంత్రి అండదండలు ఉండడంతో తుని మండలం టి.తిమ్మాపురంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు నాలుగు చెరువులను ఆక్రమించుకున్నారు. నాడు అధికార దర్పంతో ఆక్రమించుకున్న భూముల్లో ఏమాత్రం వెరపు లేకుండా నేటికీ సాగు చేసుకుంటున్నారు. గణేశుల చెరువు, కొండివారి చెరువు, గంగుల చెరువు, గుజ్జవాని చెరువుల్లో ఆరెకరాలకు పైగా భూమిని దర్జాగా ఆక్రమించేసుకున్నారు. గ్రామకంఠాన్ని సహితం ఆక్రమించుకుని, షాపులు నిర్మించి, అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. వారి అధికార మదానికి భయపడో.. వేరే కారణాలో కానీ ఇంత జరిగినా నాటి గ్రామ, మండల స్థాయి రెవెన్యూ అధికారులు ఈ బాగోతాన్ని చూసీచూడనట్టుగా వ్యహరించారు. ఫలితంగా చెరువుల గర్భాలు కుచించుకుపోయి నీటినిల్వ సామర్థ్యాలు తగ్గిపోయాయి. తుని రూరల్: టి.తిమ్మాపురం గ్రామానికి చెందిన ఓ పెద్ద మనిషి టీడీపీలో తృతీయ శ్రేణి నాయకుడిగా చెలామణీ అవుతున్నారు. గ్రామంలోని గణేశుల చెరువు సమీపంలో ఆయనకు భూములున్నాయి. ఆ భూముల మధ్య నుంచి గణేశుల చెరువుకు బిళ్లవాక గెడ్డ నీరు చేరేందుకు 172/8 సర్వే నంబర్లో కాలువ ఉంది. దానిని దారి మళ్లించడంతో రెండున్నర ఎకరాల భూమి ఆ పెద్దమనిషి భూమిలో కలిసిపోయింది. అందులో కొబ్బరి తోట సాగు చేసుకుంటున్నాడు. చెరువును ఆనుకుని ఉన్న టేకు చెట్లను సహితం తన భూభాగంలో కలిపేసుకున్నాడు. చెరువు గట్టును రోడ్డుగా విస్తరించి తన భూముల్లోకి కార్లు రాకపోకలు సాగించేలా ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే గ్రామాన్ని ఆనుకుని సర్వే నంబర్ 970/3లో 2.88 ఎకరాల్లో గుజ్జవాని చెరువు ఉంది. ఇందులో ఎకరా భూమిని కబ్జా చేసి ఇళ్ల స్థలాలుగా విక్రయించుకున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దానిని ఆనుకుని 970/3 సర్వే నంబర్లో ఉన్న గ్రామకంఠంలో కొంతభాగం ఆక్రమించుకుని, ఎన్టీఆర్ విగ్రహం, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. మిగిలిన గ్రామకంఠాన్ని కూడా ఆక్రమించుకుని దర్జాగా దుకాణాలు నిర్మించేశారు. ఇలా కోట్ల రూపాయల విలువైన భూములను ఆక్రమించుకున్నా అప్పట్లో రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఈ నాయకుడి అండదండలతో అతడి అనుచరులు సైతం సర్వే నంబరు 706/2లో 3.42 ఎకరాల విస్తీర్ణం ఉన్న కొండివారి చెరువులో రెండు ఎకరాలు ఆక్రమించుకుని కొబ్బరి సాగు చేస్తున్నారు. 954/7 సర్వే నంబర్లో 28.74 విస్తీర్ణం గల చెరువు పొర్లుకట్టుకు అడ్డంగా 80 సెంట్ల భూమిని ఆక్రమించి పత్తి సాగు చేస్తూ ధనార్జన సాగిస్తున్నారు. ఇప్పటికైనా అక్రమార్కుల చెర నుంచి చెరువులను కాపాడాలని, బిళ్లవాక గెడ్డ కాలువను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. సర్వే చేసి చర్యలు చెరువుల ఆక్రమణలపై నాకు ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ గ్రామ రెవెన్యూ అధికారిని అడిగి తెలుసుకుంటాను. ఆ చెరువులను పరిశీలించి, సర్వే చేస్తాం. చెరువులను ఆక్రమించడం చట్టరీత్యా నేరం. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. – పి.శ్రీపల్లవి, తహసీల్దార్, తుని ఆక్రమణలు తొలగించాలి చెరువుల గర్భాల్లో ఆక్రమణలను తొలగించి, రైతుల ప్రయోజనాలు కాపాడాలి. ఆక్రమణదారులు ఎంతటివారైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్తులకు అధికారులు రక్షణ కల్పించాలి. సమగ్ర సర్వే జరిపించి చెరువులను కాపాడాలి. చెరువులకు పూర్వ వైభవం తీసుకురావాలి. – మాణిక్యం, గ్రామస్తుడు, టి.తిమ్మాపురం కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తా.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు చెరువులు, బిళ్లవాక గెడ్డ కాలువ, గ్రామకంఠం వంటి విలువైన భూములను ఆక్రమించుకున్నారు. ఆక్రమణలు, అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాను. గతంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడైనా అధికారులు స్పందిస్తే రైతులకు, గ్రామానికి ప్రయోజనం చేకూరుతుంది. – పోల్నాటి ప్రసాద్, గ్రామస్తుడు, టి.తిమ్మాపురం -
ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్య
తుని: కుటుంబ పోషణ కోసం ఇద్దరు ఫైనాన్స్ వ్యాపారం ప్రారంభించారు. అనూహ్యంగా ఆదాయం వచ్చింది. ఇద్దరు మధ్య ఆర్థికపరమైన మనస్పర్థలు వచ్చాయి. కట్ చేస్తే వరుసకు మామైన నల్లమిల్లి రాజారెడ్డి(59)ని అల్లుడు మారెడ్డి దారుణంగా హత్య చేశాడు. బుధవారం జరిగిన సంఘటనకు సంబంధించి పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, తుని పట్టణ సీఐ రమేష్‌బాబు కథనం ఇలా.. రాయవరం మండలం పుసలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి రాజారెడ్డి, కర్రి మారెడ్డిలు 2006లో ఫైనాన్స్ వ్యాపారం చేపట్టారు. తుని పట్టణం సీతారాంపురంలో ఇంటిని అద్దెకు తీసుకుని పరిసర ప్రాంతాల్లో వ్యాపారం చేస్తున్నారు. అప్పట్లో మారెడ్డి వ్యాపారంలో రూ.ఆరు లక్షలు పెట్టుబడి పెట్టాడు. 2014 వరకు వ్యాపారం సజావుగా సాగింది. ప్రతి సోమవారం తుని వచ్చి రెండు రోజుల పాటు వసూళ్లు చేసుకుని సొంత ఊళ్లకు వెళ్లేవారు. రాజారెడ్డి కుటుంబం విశాఖ జిల్లా విశాఖపట్టణంలో ఉంటున్నారు. మారెడ్డి పసలపూడిలో ఉంటున్నారు. అకౌంట్ విషయంలో వివాదం మొదలైంది. రాజారెడ్డి అకౌంట్‌ను చూసేవారు. ఉమ్మడి వ్యాపారంలో రూ.11 లక్షలు తేడా వచ్చింది. ఇదే విషయాన్ని మారెడ్డి తరచూ రాజారెడ్డిని ప్రశ్నించారు. తొందరలోనే సెటిల్ చేస్తానని చెప్పాడు. ఐదు నెలలుగా ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. సోమవారం రాజారెడ్డి, మారెడ్డితో పాటు రాజారెడ్డి మేనల్లుడు హరినాథ్‌రెడ్డి తుని పట్టణంలోని సీతారాంపురం అద్దె ఇంటికి వచ్చారు. మంగళవారం లైన్‌కు వెళ్లి కలెక్షన్ చేసుకుని సాయంత్రం గదికి వచ్చారు. హరినాథ్‌రెడ్డి బయటకు వెళ్లి ముగ్గురికి టిఫిన్ తీసుకువచ్చాడు. అనంతరం రాజారెడ్డి, హరినాథ్‌రెడ్డి ఒక గదిలో, మారెడ్డి వేరే గదిలో పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో మారెడ్డి రాజారెడ్డి పడుకున్న గదిలోకి వెళ్లాడు. నిద్రలో ఉన్న రాజారెడ్డి తలపై ఇనుప రోడ్డుతో కొట్టాడు. శబ్ధం రావడంతో హరినాథ్‌రెడ్డి లేచి మారెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మారెడ్డి విచక్షణ కోల్పోయి కొట్టడంతో రాజారెడ్డి తలకు తీవ్ర గాయమైంది. ఇది గమనించిన హరినాథ్‌రెడ్డి కటుంబ సభ్యులకు, వారు 108 అంబులెన్స్‌కు సమచారం ఇచ్చారు. గాయపడిన రాజారెడ్డిని అంబులెన్స్‌లో తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. పట్టణ సీఐ రమేష్‌బాబు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాతే హత్యకు దారి తీసిన పరి«స్థితులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. హత్యకు ప్రత్యక్ష సాక్షి హరినాథ్‌రెడ్డి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. -
విలేకరి హత్య కేసు; పాతకక్షలే కారణం
సాక్షి, తుని (తూర్పుగోదావరి) : తుని మండలం ఎస్.అన్నవరంలో నివాసం ఉంటున్న విలేకరి కాతా సత్యనారాయణ హత్యకేసు మిస్టరీ వీడింది. ఈ సంఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకోవడంతో పాటు.. హత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం స్థానిక రూరల్ పోలీసు స్టేషన్లో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ వివరించారు. హత్య కేసులో నేరస్తులను రెండు వారాల్లో ఛేదించినట్టు ఎస్పీ తెలిపారు. ఎస్.అన్నవరం గ్రామానికి చెందిన వంగలపూడి గౌరీ వెంకటరమణ (గౌరీ), మడగల దొరబాబుల బలహీనతలను ఆసరా చేసుకుని గౌరీపై అధికారులతో రౌడీ షీట్ ఓపెన్ చేయిస్తానని మృతుడు బెదిరించి, రూ.మూడు లక్షలు డిమాండ్ చేశాడన్నారు. భయపడిన గౌరీ రూ.రెండు లక్షలు చెల్లించాడు. మడగల దొరబాబుపై పాత క్రిమినల్ కేసులు, అతడి వ్యక్తిగత విషయాల్లో కాతా సత్యనారాయణ తలదూర్చి తరచూ ఇబ్బందులకు గురి చేసేవాడని, విలేకరిగా ఉన్న పరపతిని స్వప్రయోజనాలకు ఉపయోగించుకుని మద్దాయిలను తరచూ ఇబ్బందులకు గురి చేయడంతో అతడిపై పగ పెంచుకున్నారన్నారు. పథకం ప్రకారం హత్య చేసినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ నేపథ్యంలో ఆరుగురు స్నేహితులతో కలసి సత్యనారాయణను ఈనెల 15న పథకం ప్రకారం హతమార్చాడని వెల్లడించారు. ఎస్.అన్నవరానికి చెందిన గౌరీ, నక్కపల్లికి చెందిన సకురు దుర్గ, పెనుముచ్చు శివరామకృష్ణ తాతాజీ (తేజ), అల్లాడి బాబ్జి, గంగిశెట్టి జోగి సురేష్, బొక్కిన (బొక్కిస) రమేష్, ఎస్.అన్నవరానికి చెందిన మడగల దొరబాబు విలేకరి సత్యనారాయణను హతమార్చినట్టు ఎస్పీ తెలిపారు. ఎఫ్ఐఆర్లో పేర్లు అనుమానితులే మృతుడి సోదరుడు కాతా గోపాలకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్న గాబు రాజబాబు, మురాలశెట్టి రాజబాబు సహ ఆరుగురు అనుమానితులేనని ఎస్పీ అస్మి అన్నారు. నేరస్తులను పట్టుకునేందుకు లక్షకుపైగా ఫోన్ కాల్స్‌ను సమగ్రంగా పరిశీలించామని, సాంకేతిక నిపుణుల సహాయంతో అసలు నేరస్తులను పట్టుకున్నట్టు తెలిపారు. హత్యకు నేరస్తులు వినియోగించిన కత్తి, నాలుగు ఇనుప రాడ్లు, రెండు మోటార్ సైకిళ్లు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో డీఎస్పీలు రామకృష్ణ, అరిటాకుల శ్రీనువాసరావు, నలుగురు సీఐలు, పది మంది ఎస్సైలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. అక్రమ ఆస్తులు ఇవే! విలేకరి సత్యనారాయణ తేటగుంటలో 2009లో 64.5 సెంట్లు, 2011లో 91 సెంట్లు, 25 సెంట్లు, 50 సెంట్లు, 2013లో 79 సెంట్లు, ఎస్.అన్నవరంలో ఎకరా 20 సెంట్లు, తుని వీరవరపేటలో 267 గజాలు ఇంటి స్థలం, 2015లో ఎస్.అన్నవరంలో 110 గజాల ఇంటి స్థలం, 2016లో టి.వెంకటాపురంలో 182 గజాలు ఇంటిస్థలం, తేటగుంటలో 42 సెంట్ల భూమి, 2019లో టి.వెంకటాపురంలో 25 సెంట్ల భూమి ఇలా భూములు సంపాదించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఎస్.అన్నవరంలో మూడు అంతస్తుల ఇంటిని నిర్మించి అందులో నివాసం ఉంటున్నాడు. ఇవేకాకుండా బ్యాంకు లాకర్లలో మరిన్ని ఆస్తుల వివరాలు తెలుస్తాయని అధికారులు భావిస్తున్నారు. -
వారి ఆలస్యం పాప ప్రాణాలను తీసింది
సాక్షి, తుని : చిన్నారి ప్రాణాలను కాపాడుకొనేందుకు ఆ తల్లిదండ్రులు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఎంతో ఖర్చు పెట్టి వైద్యం చేయించారు. చివరికి ఆమెకు డెంగీ ఉన్నట్టు నిర్ధారణ కావడంతో కాకినాడ తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతుండగా, ఇంటిలోంచి సొమ్ము తెచ్చుకోవడంలో ఆలస్యమైంది. ఆ ఆలస్యమే పాప ప్రాణాలను తీసింది. డెంగీతో ఆ పాపకు ఊపిరి తీసుకోలేకపోతుంటే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ పెట్టి కాకినాడ జీజీహెచ్‌కు తరలించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. సొమ్ము కోసం ఇంటికి పరుగున వెళ్లిన ఆ పాప తిరిగి ఆస్పత్రికి వచ్చేసరికి.. ఆ పాప ప్రాణాలు కోల్పోయింది. స్థానిక 4వ వార్డుకు చెందిన నాగులాపల్లి స్వాతిశ్రీ (5)కి తొలుత సాధారణ జ్వరమని ఆర్ఎంపీతో వైద్యం చేయించారు.టైఫాయిడ్, మలేరియాకు మందులు కూడా వాడించారు. చివరకు పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆమె డెంగీతో మృతి చెందింది. నాగులాపల్లి నాగేశ్వరరావు, జ్యోతిలకు ఇద్దరు పిల్లలు. ఇందులో స్వాతిశ్రీ ఆఖరి కుమార్తె. రెండు వారాల క్రితం జ్వరం వస్తే పట్టణంలోని ఆర్ఎంపీతో వైద్య పరీక్షలు చేయించి టైఫాయిడ్, మలేరియాకు మందులు వాడించారు. రెండు రోజల క్రితం ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు పిల్లల ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యుడు ఆమెకు డెంగీ ఉన్నట్టు చెప్పారు. ఆమె రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ 47వేలకు పడిపోయింది. వెంటనే కాకినాడ తీసుకువెళ్లాలని వైద్యుడు రిఫర్ చేశారు. దీంతో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండడంతో ఆమెకు ఆక్సిజన్ పెట్టి అంబులెన్స్‌లో ఎక్కించారు. చేతిలో సొమ్ము లేకపోవడంతో తల్లి జ్యోతి ఇంటికి వెళ్లి రావడం ఆలస్యమైంది. ఈలోగా పాప ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కట్టలు తెంచుకున్న తల్లిదండ్రుల ఆవేదన కంటికి రెప్పలా చూసుకున్న చిన్నారి ఇక తిరిగిరాదన్న విషయం తల్లిదండ్రుల ఆవేదన కట్టలు తెచ్చుకుంది. ముందే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చి ఉంటే ప్రాణాలను కాపాడుకునే వాళ్లమని దుఃఖంతో కన్నీరుమున్నీరయ్యారు. డెంగీ చికిత్సకు ఆరోగ్యశ్రీలో అవకాశం కల్పించినప్పటికీ చిన్నారిని బతికించుకోలేక పోయామని ఆవేదన చెందారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. డెంగీ నిర్ధారణ పరీక్ష తునిలో అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. పురపాలక సంఘం అధికారులు పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
భిక్ష కాదు...లక్ష, కాదు కాదు మూడు లక్షలు...!!
బాప్రే....! భిక్ష...అంటే భిక్ష కాదు.. లక్ష!!. కాదు కాదు మూడు లక్షలు...!!. ఈ దృశ్యం చూస్తుంటే మీకేమనిపిస్తోంది..? ఆరుబయట హుండీ డబ్బులు లెక్కిస్తున్నట్లు లేదూ...!. కానీ ఇది ఓ యాచకుడు ‘కష్టపడి’ సంపాదించిన భిక్షను లెక్కిస్తున్న చిత్రం!. తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలోని ముక్తిలింగవారి వీధిలో అప్పల సుబ్రహ్మణ్యం (75) ఒక పాడుబడిన ఇంట్లో ఉంటున్నాడు. అయినవాళ్లు ఆదరణ లేకపోవడంతో యాచకుడిగా మారాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందాడు. కుటుంబసభ్యులు వచ్చి దహన కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం ఇంట్లో సంచులను వెతగ్గా అందులో సుమారు రూ.3 లక్షల వరకూ ఉన్నట్లు గుర్తించారు. కాగా రాజమండ్రిలోని యాచిస్తూ జీవనం గడుపుతూ మరణించిన ఓ వృద్ధ సాధువు జోలె సంచిలో రూ. లక్షా 80 వేల నగదు లభ్యమైన విషయం తెలిసిందే. చదవండి: సాధువు మృతి.. సంచిలో లక్షా 80 వేలు! -
పరారీలో ఉన్న టీడీపీ నాయకులు
సాక్షి, తుని(తూర్పుగోదావరి) : రాజ్యాంగేతర శక్తిగా అవతరించి దౌర్జన్యాలు చేయడంలో టీడీపీ నాయకులు దిట్ట. అన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ్ముడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యనమల కృష్ణుడు, ఆయన ఆసరా చూసుకుని ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ పోల్నాటి శేషగిరిరావు, అధినాయకుల ప్రాపకం పొందేందుకు మున్సిపల్ మాజీ చైర్మన్ యినుగంటి సత్యనారాయణ అధికార బలంతో చేసిన అరాచకాలు నియోజకవర్గంలో ప్రజలందరికి తెలిసిందే. అధికారంలో ఉండగా తొండంగి మండలంలో మామూళ్లు ఇవ్వనందుకు హేచరీలపై దాడులకు పురిగొల్పిన యనమల కృష్ణుడు, ఇప్పుడు అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేసి ప్రతిపక్షంలో ఉన్నా తమదే పైచేయి అని నిరూపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అన్న క్యాంటీన్ అద్దాలను ధ్వంసం చేయడంపై మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దౌర్జన్యకాండకు కారుకులైన ఈ ముగ్గురూ (యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరిరావు, యినుగంటి సత్యనారాయణ), దిబ్బ శ్రీను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని పారిపోయారు. మరుసటి రోజు దిబ్బ శ్రీనును పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురూ పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. 1984 నుంచి యనమల రామకృష్ణుడు రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ కీలక పదవులు చేపట్టగా ఆ హోదాను యనమల కృష్ణుడు అనుభవించారు. తమను అడ్డుకునే శక్తివంతులు లేరని రెచ్చిపోయిన కృష్ణుడు, అతడి సన్నిహితులు శేషగిరిరావు, సత్యనారాయణ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పరారైనట్టు తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం అధికారం లేకపోవడంతో పాటు ప్రజలకు అండగా నిలిచి ఢీకొనేందుకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఉండడంతో అధికారుల్లోను, ప్రజల్లో ధైర్యం నెలకొంది. ఇన్నాళ్లు తనపై కేసులు పెట్టే ధైర్యం ఎవరికి లేదని, తన ఇంటి దరిదాపుల్లోకి పోలీసులు రాలేరన్న మొండితనంతో ఉన్న యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరిరావు, యినుగంటి సత్యనారాయణలు ఇళ్లను వదిలి పరారవ్వడంపై నియోజకవర్గంలో తీవ్ర చర్చ సాగుతోంది. ఏ అర్ధరాత్రి ఇళ్లకు వచ్చినా అరెస్టు చేసేందుకు పోలీసులు వారి ఇళ్ల వద్ద నిఘా ఉంచారు. -
ఈ రాజా చెయ్యి వేస్తే అంతా మంచే
ఆయన ప్రజాసేవలోనే కాదు.. దాతృత్వంలో సైతం రాజానే. పాఠశాలల్లో పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బాగోలేదని గుర్తించిన ఎమ్మెల్యే రాజా తన సొంత ఖర్చుతో వారికి భోజనాలు పంపిస్తున్నారు. రోజూ వందలాది విద్యార్థులకు ఆయన రుచికరమైన భోజనాలు పెడుతున్నారు. అలా పెద్దల్లోనే కాదు.. పిల్లల మనస్సులో సైతం చెరగని ముద్ర వేసుకుంటున్నారు. సాక్షి, తుని : ధనం అందరికీ ఉంటుంది కానీ దాతృత్వ గుణం కొందరికే ఉంటుంది. దాతృత్వం ఉన్న వారిలో తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అగ్రగణ్యుడు. మధ్యాహ్న భోజనం బాగుండక పోవడంతో తినలేకపోతున్న విద్యార్థుల అవస్థలను గుర్తించి 740 మంది విద్యార్థులకు ఆయన తన సొంత ఖర్చుతో పదిరోజులుగా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నియమించిన బెండపూడిలోని ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్నారు. ఆ భోజనాలు మెనూ ప్రకారం అందకపోవడంతోపాటు పురుగులు పట్టిన అన్నం, సాంబారు సరఫరా చేస్తుండటంతో పిల్లలు పురుగులను తొలగించి తినాల్సిన దుస్ధితి ఏర్పడింది. కుళ్లిన కోడి గుడ్లు సరఫరా చేస్తుండటంతో వాటిని తినకుండా పారేస్తున్నారు. దీనిపై పై అధికారులకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఫిర్యాదు చేసినా పట్టించుకొనేవారే లేకుండా పోయారు. ఆ పరిస్థితుల్లో ఈనెల ఆరో తేదీన ఎమ్మెల్యే రాజా పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలు తింటున్న భోజనాన్ని స్వయంగా పరిశీలించారు. భోజనం బాగుండడం లేదని, దాన్ని తినలేక పారేస్తున్నామని వారు ఎమ్మెల్యేకు తెలియజేశారు. అలాగే తొండంగి మండలం శృంగవృక్షంలోని జెడ్పీ హైస్కూల్‌ను, ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించి అక్కడి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అదికూడా అలాగే అధ్వానంగా ఉండడంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించేలా ఏర్పాటు చేయాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. అంతవరకూ తన సొంత ఖర్చుతో విద్యార్థులకు భోజనాన్ని పంపుతామన్నారు. ఇచ్చిన హామీ మేరకు సన్న భియ్యం అన్నంతోపాటు కూర, పప్పు, సాంబారు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పంపిస్తున్నారు. తుని గర్ల్స్ హైస్కూల్లో 300 మందికి, శృంగవృక్షం జెడ్పీ హైస్కూల్లో 290 మందికి, ప్రాథమిక పాఠశాలలో 150 మందికి మొత్తం 740 మందికి రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే పంపించారు. అధ్వానంగా ఉండే భోజనాన్ని తినలేక, ఇళ్ల నుంచి క్యారేజీలు తెచ్చుకునే ఆర్థిక స్థోమతలేని పేద, మద్యతరగతి వర్గాల పిల్లలు ఆకలితో అలమటించకుండా ఉండాలనే సంకల్పంతో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా భోజనాలు పంపించడం ఆయన దాతృత్వానికి నిదర్శనమని విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. రుచికరమైన భోజనం అందించి పిల్లల మనస్సుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. -
'ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు'
సాక్షి, తూర్పుగోదావరి : శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హెచ్చరించారు. తునిలో శుక్రవారం జరిగిన ఆందోళనకారుల దాడిలో అన్నక్యాంటీన్ ద్వంసమైన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో ఏర్పడ్డ అన్నక్యాంటీన్లు అవినీతిమయంగా మారాయని, టీడీపీకి చేందిన వారే క్యాంటీన్లను ద్వంసం చేసి దానిని ప్రభుత్వం మీదకు నెట్టివేస్తున్నారని ఆరోపించారు. -
కట్టుకున్నోడే కడతేర్చాడు
సాక్షి, తూర్పుగోదావరి(తుని) : తుని మండలం టి.తిమ్మాపురం గ్రామంలో కట్టుకున్న భర్తే డబ్బుల కోసం తగాదా పడి భార్యను హత్య చేశాడు. ఈ సంఘటనలో పక్కుర్తి శివకుమారి(28) మృతి చెందగా, భర్త మహాలక్ష్మి పరారీలో ఉన్నాడు. విషయం తెలియడంతో సంఘటన స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, రూరల్ సీఐ కె.కిషోర్‌బాబు, రూరల్ ఎస్సై ఎస్.శివప్రసాద్ పరిశీలించారు. రూరల్ సీఐ కిషోర్‌బాబు కథనం ప్రకారం.. టి.తిమ్మాపురానికి చెందిన పక్కుర్తి మహాలక్ష్మికి, కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామానికి చెందిన శివకుమారితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరికి ఎనిమిది, ఐదేళ్ల వయస్సుగల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తె దేవి తాతయ్య వద్ద ఉంటుండగా, చిన్న కుమార్తె తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. మహాలక్ష్మి వ్యవసాయ కూలి. కొద్ది రోజులుగా శివకుమారి తునిలో వస్త్ర దుకాణంలో పని చేస్తుంది. ఇటీవల గొర్రెల లోను కోసం రూ.40వేలను లబ్ధిదారువాటాగా చెల్లించారు. ఆ లోను రాకపోవడంతో లబ్ధిదారు వాటాగా పెట్టిన డబ్బు మంగళవారం వెనక్కి ఇచ్చారు. ఆ డబ్బును పెద్దమ్మ వరుసైన ఆవాల సుబ్బలక్ష్మికి ఇవ్వడంపై భార్యాభర్తల మధ్య ఘర్షణ మొదలైంది. ఆ ఘర్షణ బుధవారం తెల్లవారుజామున శివకుమారి హత్యకు దారితీసింది. శివకుమారిని తీవ్రంగా కొట్టడంతో మృతి చెందినట్టు వివరించారు. మృతురాలి తండ్రి ఇసరపు త్రిమూర్తులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ వివరించారు. నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రమాదవశాత్తూ మరణించినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం నిందితుడు భార్య శివకుమారిని హత్య చేసి మృతదేహాన్ని నివాస గృహం ఎదుట ఉన్న రైల్వే పట్టాలపై ఉంచి ప్రమాదం జరిగినట్టుగా చిత్రీకరించాడన్నారు. బహిర్భూమికి వెళ్లగా మృత్యువాత పడిందనుకున్న స్థానికులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి దహన సంస్కారాలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో స్థానికులు మహాలక్ష్మి ఇంట్లోకి వెళ్లగా రక్తపు మరకలు కనిపించడంతో అనుమానం వ్యక్తమైంది. మృతురాలి తల్లి దుబాయ్‌లో ఉంటుండగా తండ్రి, సోదరుడు సర్పవరంలో ఉంటున్నారు. వీరిద్దరూ వచ్చి అల్లుడే తమ కుమార్తెను హత్య చేశాడని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ చేసిన ఎస్సై శివప్రసాద్, సీఐ కిశోర్‌బాబు, డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావులు హత్యగా నిర్ధారించారు. అనాథలైన చిన్నారులు : తల్లి శివకుమారి మృత్యుఒడికి చేరగా తండ్రి మహాలక్ష్మి పరారీలో ఉండడంతో వీరికి జన్మించిన ఇద్దరు చిన్నారులు అనాథులయ్యారని స్థానికులు విచారం వ్యక్తం చేశారు. భర్తకు చేదోడుగా ఉండేందుకు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న శివకుమారి కొద్దిరోజులుగా తునిలో వస్త్ర దుకాణంలో పనికి వెళుతోంది. అందరితో కలసిమెలసి ఉండే శివకుమారి మృతితో పిల్లలు అనాథలయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. -
రైతుల ఆత్మహత్యలకు కారణం చంద్రబాబే..
సాక్షి, తూర్పుగోదావరి : చంద్రబాబు చేసిన పాపాలతోనే నేటికీ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆరోపించారు. కోటనందూరు మండలం అప్పలరాజుపేటలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు బంగారు రాంబాబు కుటుంబాన్ని బుధవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్సార్ భరోసా పథకం క్రింద రూ. 7 లక్షల చెక్కును మృతుడి భార్య సూర్యకాంతం, పిల్లలు రమాదేవి, లక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ మీ అప్పులు మా బాధ్యత అని చెప్పీ 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు పీఠం ఎక్కాక రైతులను పూర్తిగా మోసం చేశారన్నారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న రైతు బంగారు రాంబాబు మృతి తనను ఎంతో కలచి వేసిందన్నారు. రాంబాబు మృతి సంఘటన తెలుసుకున్న సీఎం జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ భరోసా సాయాన్ని తక్షణమే అందజేయాలని ఆదేశించారన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న ఈ ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ కోటనందూరు, తుని మండల కన్వీనర్లు గొర్లి రామచంద్రరావు, పోతల రమణ, ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, కాకినాడ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు పెదపాటి అమ్మాజీ, పార్టీ నేతలు లాలం బాబ్జీ, నల్లమిల్లి గోవిందు, లగుడు శ్రీను, లంక ప్రసాద్, దొడ్డి బాబ్జీ, బొంగు గోపాలకృష్ణ, జిగటాల వీరబాబు, చింతకాయల చినబాబు, రుత్తల జోగిరాజు, కుంచే అచ్చిరాజు, వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్, ఎంపీడీఒ శర్మ, డీటీ కిరణ్‌కుమార్, ఏడీఎ సుంకర బుల్లిబాబు, ఏఒ వాణీ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుడి పైశాచికత్వం
సాక్షి, తుని(తూర్పు గోదావరి) : విద్యార్థులను తండ్రిలా చూసుకుంటూ బాధ్యతగా వ్యవహరించాల్సిన హెచ్ఎం పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదాడు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో హల్చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. కోటనందూరు మండలంలో ఏకైక గిరిజన గ్రామం సంగవాక. అక్కడి గిరిజన సంక్షేమ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న కోటేశ్వరరావు పాఠశాల సమయంలో సాధారణ డ్రెస్ (లుంగీ)తో ఉండి తన పడకగదిలో విద్యార్థులను చితకబాదుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వాటిని చూసిన గ్రామస్తులు సోమవారం విలేకర్లకు ఆ వివరాలను తెలియజేశారు. గతంలో ఈ పాఠశాలలో హాస్టల్ ఉండేదని వారు తెలిపారు. హెచ్ఎంగా కోటేశ్వరరావు, వార్డెన్‌గా ఎ. నూకరాజు వచ్చిన తరువాత వారి పనితీరుతో హాస్టల్‌ను ఎత్తి వేశారన్నారు. వీరిద్దరూ విధి నిర్వహణలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పాఠశాలలో పిల్లలు పూర్తిగా తగ్గిపోయారన్నారు. ప్రస్తుతం గ్రామానికి చెందిన 35 మంది పిల్లలు మాత్రమే ఈ పాఠశాలలో ఉన్నారని తెలిపారు. హెచ్ఎం కోటేశ్వరరావు పిల్లలను హింసిస్తూ, కొడుతున్నారని గ్రామపెద్ద పిట్టం బాబూరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎంఈఓ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. పాఠశాల సమయంలో కూడా హెచ్ఎం, వార్డెన్ టీవీ రూంకు పరిమితమై ఉంటున్నారని, వీరిని మార్చాలని ఫిర్యాదులో కోరారు. ఈ దుస్థితిపై ఉన్నతాధికారులందరికీ సమాచారం చేరవేసినట్టు గ్రామస్తులు తెలిపారు. -
అజాతశత్రువుకు అశ్రునివాళి
అజాత శత్రువుగా కడప జిల్లా ప్రజలకు ఎనలేని సేవలు అందించిన మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణులు తీవ్ర దిగ్భాంతి చెందారు. ఆయన హత్య వెనుక కుట్రదాగి ఉందని, నేరస్తులను కఠినంగా శిక్షించాలని నినదించారు. వైఎస్ వివేకానంద రెడ్డి మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సాక్షి, కాకినాడ రూరల్: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ సోదరుడు, సీనియర్ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి అకాల మరణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ రూరల్ పార్టీ కార్యాలయంలో కన్నబాబు ఆధ్వర్యంలో శుక్రవారం వైఎస్ వివేకానందరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వెన్నంటే ఉంటూ పార్టీ కార్యక్రమాలలో ముందుండి నడిపే వివేకానందరెడ్డి అకాల మరణం తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ (కిట్టు), రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కర్నాసుల సీతారామాంజనేయులు, నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు గీసాల శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి, రాష్ట్ర యువజన కార్యదర్శి లింగం రవి, గొల్లపల్లి ప్రసాదరావు, గంజా సత్యనారాయణ, పుల్ల చైర్మన్ శ్రీను, కొత్తపల్లి గిరీష్, పాలిక నర్శింహమూర్తి, సమనాసి ప్రసాద్, చెరుకూరి సుజాత, కొప్పిశెట్టి శివపార్వతి, పాలిక వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. ఆకస్మిక మృతి బాధాకరం : రాజా తుని: వైఎస్ వివేకానందరెడ్డి మృతి పార్టీకి తీరని లోటని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. స్థానిక శాంతినగర్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం వివేకానందరెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వివేకానందరెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజా మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలన్న కోరిక నేరవేరకుండా తుది శ్వాస విడిచి అందరినీ విషాదంలో నింపారని ఆవేదన వ్యక్తం చేశారు. తుని పట్టణ శాఖ పార్టీ అధ్యక్షుడు రేలంగి రమణాగౌడ్, తుని మండల పార్టీ అధ్యక్షుడు పోతల రమణ, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు నార్ల రత్నాజీ, కీర్తి బాలకృష్ణ, ఎస్సీ సెల్ తుని నియోజకవర్గ అధ్యక్షుడు గారా శ్రీనివాసరావు, తుని మండల యూత్ కన్వీనర్ చోడిశెట్టి వెంకటేష్, నాయకులు వంగలపూడి వాసు, శివ, నైషీ, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డికి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే రాజా సీబీఐ విచారణ జరిపించాలి: బోస్ రామచంద్రపురం రూరల్: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో తీవ్ర దిగ్భాంతికి లోనైనట్లు వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూ తెలిపారు. ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నంగా కన్పిస్తోందని శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ప్రతిపక్ష నాయకుడి కుటుంబానికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం రాజకీయాల్లో తిరిగే సామన్యులకు ఏమి రక్షణ కల్పిస్తుందని ఆయన ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి వెంటనే సీబీఐ ఎంక్వయిరీ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని బోస్ డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీకి తీరని లోటు కోటనందూరు (తుని): వైఎస్ వివేకానందరెడ్డి మరణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆ పార్టీ కాకినాడ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు పెదపాటి అమ్మాజీ అన్నారు. ఆమె శుక్రవారం కోటనందూరులో మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి లేని లోటును ఆ కుటుంబానికి వివేకానందరెడ్డి భర్తీ చేసేవారని, ఆయన మరణంతో వైఎస్ కుటుంబ సభ్యులకు అన్యాయం జరిగిందన్నారు. మృదుస్వభావి, అందరినీ చిరునవ్వుతో పలకరించే వివేకానందరెడ్డి ఇకలేరనే వార్త పార్టీ శ్రేణులను శోకసంద్రంలో ముంచిందన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అమ్మాజీ చెప్పారు. -
‘ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’
సాక్షి, తూర్పుగోదావరి : నాలుగేళ్లలో తుని పట్టణానికి ప్రభుత్వం చేసిందేమి లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుని అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం కనీసం రూ. 5కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ఇప్పటి వరకూ కోట నందురు మండలం జూనియర్ కాలేజీ లేదన్నారు. నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని చూపించినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. చినుకు పడితే తుని పట్టణం వరదలో మునిగిపోయేలా ఉందన్నారు. టీడీపీ నాయకులు అభివృద్దిని పక్కకు పెట్టి అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. -
ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడు వైఎస్ జగన్
-
235వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం
-
జన ప్రభంజనం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జననేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాకతో తుని పట్టణం జనసంద్రమైంది. అభిమానుల సందడితో హోరెత్తింది. జననేత వెంట పడ్డ వేలాది అడుగులు ఒక్కటై గొల్ల అప్పారావు సెంటర్‌కు చేరుకున్నాయి. సభాప్రాంగణమంతా ఒక్కసారిగా కిటకిటలాడింది. ప్రజా సంకల్ప యాత్ర 2700 కిలోమీటర్ల మైలురాయి దాటిన గడ్డగా తుని చరిత్రలో లిఖించబడింది. జననేత పాదయాత్రతో పాటు బహిరంగ సభకు హాజరై మునుపెన్నడూ లేని విధంగా ప్రజాసంకల్పయాత్ర బహిరంగ సభను విజయవంతం చేయడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరిచింది. జగన్ ప్రజాసంకల్పయాత్ర 234వ రోజైన శనివారం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని డీజే పురం నుంచి ప్రారంభమై తుని నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అవినీతిలో ముందున్నారు : యనమలపై ధ్వజం స్పీకర్‌గా, మంత్రిగా సుదీర్ఘకాలంగా పని చేసిన యనమల హయాంలో నియోజకవర్గం అభివృద్ధి చెందకపోగా అవినీతిలో మాత్రం ముందుకు పరుగెడుతుందని జగన్ ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో యనమల హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను ఎండగట్టారు. తాండవ నదిలో ఇసుకను దోచేయడమే కాకుండా ఆ ఇసుకను సముద్రం ఇసుకతో కలిసి అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. కేవలం టీడీపీ నాయకులు దోచుకునేందుకే ఇసుకను ఫ్రీ అంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో వల్లూరు, శృంగవృక్షం, పైడికొండ తదితర గ్రామాల చెరువుల్లో తాడిచెట్టు లోతులో ఇసుక, మట్టి తవ్వి లక్ష ట్రాక్టర్లకు పైగా అమ్ముకున్నారంటూ ప్రజలు చెబుతున్నారని తెలిపారు. చెరువు తవ్వినందుకు బిల్లులు తీసుకోవడంతో పాటు ఆ మట్టిని అమ్ముకుని కూడా సంపాదించుకున్నారని తెలిపారు. ఆర్థిక మంత్రి నియోజకవర్గంలో మరుగుదొడ్లకు కూడా లంచాలు వసూలు చేస్తున్నారని, పైడికొండలో రూ.60 లక్షలు లూటీ చేస్తే వైఎస్సార్ సీపీ ధర్నా చేసేంత వరకు చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. తొండంగి మండలం పి.అగ్రహారంలో ఉత్తరాదిమఠానికి చెందిన 420 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ మేరకు రికార్డులు తారుమారు చేసి వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్నా చర్యలు లేవని ప్రశ్నించారు. చివరికి తొండంగి మండలం ఒంటిమామిడితో పోలీస్‌స్టేషన్ కోసం భూములిస్తే దాంతో పాటు పక్కనే ఉన్న భూమిని కూడా కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారని విపక్ష నేత మండిపడ్డారు. తుని పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న బాతులు కోనేరును కూడా కప్పి దాన్ని కబ్జా చేశారని, చివరకు డ్రైనేజీ భూములు కూడా కబ్జా చేయడంతో తుని పట్టణంలో పది వార్డుల్లో మురికినీరు రోడ్డుపై ప్రవహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో పార్టీ శ్రేణులు: ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి కె.పార్థసారథి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పినిపే విశ్వరూప్, తలశిల రఘురామ్, పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, సమన్వయకర్తలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, జ్యోతుల చంటిబాబు, పొన్నాడ సతీష్‌కుమార్, అనంత ఉదయభాస్కర్, తోట సుబ్బారావునాయుడు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, కాకినాడ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు పెదపాటి అమ్మాజీ, రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మాకినీడి గాంధీ, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, పార్టీ నాయకులు కొల్లి నిర్మలకుమారి, మిండగుదిటి మోహన్, విప్పర్తి వేణుగోపాల్, ముదునూరి మురళీకృష్ణంరాజు, దవులూరి దొరబాబు, పితాని అన్నవరం, కర్రి పాపారాయుడు, మేడపాటి షర్మిలారెడ్డి, పి.సోనీవుడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ కుసుమంచి శోభారాణి, డీసీసీబీ డైరెక్టర్ పోలిశెట్టి సోమరాజు, కొయ్య శ్రీనివాస్ అధిక సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
234వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర విశేషాలు
-
తుని వైఎస్ జగన్ పాదయాత్రలో జనతరంగం
-
అధికారంలోకి రాగానే స్కూళ్లు కాలేజీల ఫీజులు తగ్గిస్తాం
-
తునిలో డంపింగ్ యార్డ్ లేక శ్మశానంలో చెత్త వేస్తున్నారు
-
తుని బహిరంగ సభలో జనసందోహం
-
అధికారంలోకి రాగానే తుని కేసులు ఎత్తేస్తాం
-
ప్రజాసంకల్పయాత్ర : తునిలో జనతరంగం
సాక్షి, తుని: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 234వ రోజు శనివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చేరుకుంది. ఇక్కడ అడుగుపెట్టగానే వైఎస్ జగన్ పాదయాత్ర 2700 కిలోమీటర్ల మైలురాయిని దాటడం విశేషం. జననేతకు తుని ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తునిలో అడుగు పెట్టిన జననేత వైఎస్ జగన్‌కు ప్రజలు, పార్టీనేతలు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. పూల దండలతో ఎదురేగి రాజన్న తనయుడిని ఆహ్వానించారు. తమ బాధలను జననేత జగన్‌తో చెప్పుకోవడానికి వేలాది సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. పెద్దఎత్తున తరలివచ్చిన జనంతో రోడ్లన్ని కిక్కిరిశాయి. రాజన్న తనయుడిని చూసేందుకు వేలాది అభిమానులు భవనాలపైకి చేరుకున్నారు. రహదారుల వెంట ఎటుచూసినా జనమే కనిపించారు. దీంతో తుని పట్టణం జనసాగరాన్ని తలపించింది. వైఎస్ జగన్ తన ప్రసంగంలో భాగంగా టీడీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాల గురించి వివరించినప్పుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. చంద్రబాబు మోసాలు, కుట్రలను బట్టబయలు చేయడంతో జగన్ ప్రసంగాన్ని జనం ఆసక్తిగా విన్నారు. -
తునిలో గుట్క అక్రమ రవాణా గ్యాంగ్ అరెస్ట్
-
తమ్ముళ్ల రియల్ దందా
తుని: నిబంధనలకు విరుద్ధంగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు లే అవుట్లు వేసి.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి ఎగనామం పెట్టారు. ఇందులో అధికార పార్టీకి చెందిన కీలక నాయకుల ప్రమేయం ఉండడంతో అధికారులు మౌనం వహించారు. విజిలెన్స్ అధికారులు సమర్పించిన నివేదికను సహితం బుట్టదాఖలు చేశారు. ఇంత జరుగుతున్నా పారదర్శకతకు మారుపేరని చెప్పుకునే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎందుకు మౌనం వహిస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తుని మండలం ఎస్.అన్నవరం గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన ఈ దందాకు చివరకు ప్లాట్లు కొన్నవారు బలైపోతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి.. తుని పట్టణం నానాటికీ విస్తరిస్తోంది. చుట్టుపక్కల పల్లెలకు చెందిన అనేకమంది ఇక్కడకు వచ్చి ఇళ్లు నిర్మించుకొంటున్నారు. ఇదే అవకాశంగా రియల్టర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చారు. 2009 నుంచి 2014 మధ్య కాలంలో ఇక్కడ రియల్ దందా ప్రారంభించారు. మెట్ట ప్రాంతంలోని 300 ఎకరాల వ్యవసాయ భూమిలో 112 లే అవుట్లు వేశారు. నిబంధనల ప్రకారం లే అవుట్ వేసిన విస్తీర్ణంలో 10 శాతం స్థలాన్ని సామాజిక అవసరాలకు కేటాయించాలి. అలాగే మార్కెట్ విలువలో 10 శాతం భూమి మార్పిడి ఫీజును రెవెన్యూ శాఖకు చెల్లించాలి. మొత్తం లే అవుట్లో 10 శాతం సామాజిక స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి స్థానిక సంస్థలకు అప్పగించాలి. రోడ్లు, కాలువలు, తాగునీరు తదితర అవసరాలకు సంబంధించి డెవలప్మెంట్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం డైరెక్టరేట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ), విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) నుంచి అనుమతులు పొందాలి. తరువాత మాత్రమే ప్లాట్ల విక్రయాలు జరపాల్సి ఉంది. కానీ బరితెగించిన రియల్టర్లు ఎటువంటి నిబంధనలూ పాటించకుండానే దర్జాగా ప్లాట్లు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. పైగా మొత్తం 300 ఎకరాలకు సంబంధించిన లే అవుట్లలో ప్లాట్లతోపాటు అందులోని సామాజిక స్థలాలను కూడా బరితెగించి, నిబంధనలకు విరుద్ధంగా అమ్మేసినట్టు అధికారులు చెబుతున్నారు. టీడీపీ నాయకులు కావడంతో.. మూడేళ్ల క్రితం వుడా అధికారులు ఈ అనధికార లే అవుట్లను పరిశీలించారు. లే అవుట్లలో వేసిన రోడ్లను యంత్రాలతో ధ్వంసం చేశారు. ఆ ప్లాట్లను ఎవ్వరూ కొనుగోలు చేయరాదని బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ తరువాత విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పంచాయతీ పరిధిలోని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆ రికార్డులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్మును రియల్టర్లు ఎగవేశారని నివేదిక ఇచ్చారు. అనంతరం రూ.21 కోట్లు చెల్లించాలని సంబంధిత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నోటీసులు ఇచ్చారు. అలా నోటీసులు అందుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఎక్కువ శాతం అధికార టీడీపీకి చెందిన నాయకులే ఉన్నారు. తరువాత ఏం రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయో ఏమో కానీ, మొదట్లో హడావుడి చేసిన అధికారులు చివరకు రియల్టర్ల నుంచి చిల్లిగవ్వ కూడా రికవరీ చేయలేకపోయారు. చివరకు ఇందులో ప్లాట్లు కొనుక్కొని మోసపోయిన బాధితులు రెవెన్యూ శాఖకు కన్వర్షన్ ఫీజులు, ఇతర నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన ఫీజులను జరిమానాలతో కలిపి వుడాకు చెల్లించాల్సి వస్తోంది. అప్పుడు మాత్రమే వారికి ఇళ్లు నిర్మించుకొనేందుకు అనుమతులు వస్తున్నాయి. తమకు న్యాయం చేయాలని వారు అధికారులను కోరుతున్నారు. ప్లాటు కొని మోసపోయాను ఇల్లు కట్టుకుందామని అప్పు చేసి ఎస్.అన్నవరం లే అవుట్లో ప్లాటు కొన్నాను. అప్పట్లో అన్ని అనుమతులూ ఉన్నాయని వ్యాపారి చెప్పాడు. ఇల్లు కట్టుకోవడానికి ప్లాను కోసం దరఖాస్తు చేశాను. అనుమతి ఇవ్వబోమని అధికారులు చెప్పారు. ఎందుకని అడిగితే ఆ లే అవుట్‌కు అనుమతి లేదని, భూమి మార్పిడి ఫీజు కట్టలేదని చెప్పారు. కొన్న ప్లాటుకు రూ.2 లక్షలు అదనంగా చెల్లిస్తే ప్లాను ఇస్తామని చెబుతున్నారు. ఇంటి నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. – కె.గోపి, వ్యాపారి, తుని 5 శాతమే చెల్లించారు ఎస్.అన్నవరం పంచాయతీ పరిధిలో లే అవుట్లు వేసి, భూమి మార్పిడి ఫీజు ఎగవేతకు పాల్పడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నోటీసులు ఇచ్చి మూడేళ్లవుతోంది. ఇప్పటివరకూ 5 శాతం మాత్రమే సొమ్ములు చెల్లించారు. దీంతో పంచాయతీలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నాం. – బి.వరప్రసాద్, డివిజనల్ పంచాయతీ అధికారి, పెద్దాపురం -
పదో రోజుకు రిలే దీక్షలు
తుని : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎమ్మెల్యే దాడిశెట్టి ఆధ్వర్యంలో స్థానిక గొల్ల అప్పారావు సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం పదో రోజుకు చేరాయి. కోటనందూరు మండలం బొద్దవరం, తొండంగి మండలం దానవాయిపేట, ఎ.కొత్తపల్లి పంచాయతీల పరిధిలోని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. వారికి పార్టీ తుని పట్టణ శాఖ అ«ధ్యక్షుడు రేలంగి రమణాగౌడ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వేంకటేష్ పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. రిలే దీక్షలో బొద్దవరానికి చెందిన దొడ్డి బాబ్జీ, సుర్ల నానాజీ, వేగి అప్పలనాయుడు, సుర్ల అప్పలనాయుడు, యల్లపు దొరబాబు, లగుడు వరహాలు, యల్లపు రామసూరి, మళ్ల శ్రీను, యల్లపు రాము, తొండంగి మండలం దానవాయిపేటకు చెందిన మేరుగు ఆనందహరి, యనమల నాగేశ్వరరావు, గరికిన రాజు, మొసా సత్తిబాబు, అంగుళూరి శ్రీను, మడదా శ్రీనివాసరావు, మారేటి లక్ష్మణరావు, కుక్కా నాగరాజు, పిరాది గోపి, పి.పోలారావు, నేమాల రామకృష్ణ, అంబుజాలపు అచ్చారావు, ఎ.కొత్తపల్లికి చెందిన వనపిర్త సూర్యనారాయణ, సాపిశెట్టి చిన్న, వడ్లమూరి కృష్ణ, బెక్కం చంద్రగిరి, గర్లంక బాబ్జీ, డి.నాగు, మెయ్యేటి సత్యానందం, వనపర్తి రాఘవ, శివకోటి శేషారావు, గణ్ణియ్య, వెలుగుల చిట్టిబాబు పాల్గొన్నారు. ప్రత్యేక హోదాను పక్కన పెట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉద్యమాలు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని దీక్షలో పాల్గొన్న నాయకులు విమర్శించారు. హోదా కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రజలు రుణపడి ఉన్నారన్నారు. అందరూ సమష్టిగా పోరాటం చేయకపోతే భావి తరాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ఏకతాటిపై పోరాటం చేస్తే ఢిల్లీ పెద్దలు దిగివస్తారని నాయకులు స్పష్టం చేశారు. పదో రోజు దీక్ష చేస్తున్న వారికి పార్టీ నాయకులు షేక్ ఖ్వాజా, అనిశెట్టి నాగిరెడ్డి, కీర్తి రాఘవ, కుసనం దొరబాబు, నాగం గంగబాబు, గాబు రాజబాబు, బర్రే అప్పారావు, చోడిశెట్టి పెద్ద, వాసంశెట్టి శ్రీను, షేక్ బాబ్జి, కొప్పన రాజబాబు తదితరులు సంఘీభావం తెలిపిన వారిలో ఉన్నారు. -
టైరు పేలి కారు బోల్తా
మహిళ మృతి, ముగ్గురికి గాయాలు కుమార్తెను ఇంజనీరింగ్ కళాశాలకు తీసుకువెళ్తుండగా ఘటన తునిరూరల్ : తుని మండలం తేటగుంట శివారు ఎర్రకోనేరు వద్ద జాతీయ రహదారిపై టైరు పేలిపోవడంతో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వివాహిత మహిళ తోనంగి సుధా మాధురి (42) మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలను రూరల్ ఎస్సై సుధాకర్ తెలిపారు. విజయనగరానికి చెందిన తోనంగి విణిష రాజమహేంద్రవరంలో ఇంజనీరింగ్ కళాశాలలో చేరాల్సి ఉంది. అందుకుగాను ఇద్దరు పిల్లలు విణిష, హిమవర్షిణి, సోదరుడు సురేంద్రతో సుధామాధురి రాజమహేంద్రవరానికి కారులో బయలుదేరింది. సురేంద్ర డ్రైవింగ్ చేస్తుండగా హిమవర్షిణి ముందు సీట్లో కుర్చింది. వెనుక సీట్లలో సుధామాధురి, విణిష కుర్చున్నారు. ఎర్రకోనేరు సమీపంలో వెనుక టైరు పేలడంతో అదుపుతప్పిన కారు రోడ్డుపక్కన ఉన్న బండరాయిని ఢీకొని, సమీపంలో ఉన్న గుంతలో బోల్తా పడింది. దీంతో సుధామాధురి, విణిష తీవ్రంగా, హిమవర్షిణి, సురేంద్ర స్పల్పంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళుతున్న శ్రీశైలం ఐటీడీఏ పీఓ కారు నిలిపి క్షతగాత్రులను అన్నవరం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రికి తీసుకువెళ్లేసరికే సుధామాధురి మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. 108 అంబులెన్సులో మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి, విణిష, హిమవర్షిణిలను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వినిషకు మెరుగైన వైద్యం కోసం కాకినాడలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
విరిగిపడిన మట్టిచరియలు
ఒకరి మృతి, నలుగురికి గాయాలు తుని : కూలీ పనికి వెళితే నాలుగు రాళ్లు సంపాదించుకుందామని ఇంటి నుంచి తెల్లవారుజామున వెళ్లి మట్టిలో కలిసిపోయాడు. పనికి వెళితే పూట గడవని కూలీలు చెరువులో మట్టి తవ్వుతుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. తుని రూరల్ ఎస్సై, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం చిన్న నరసాపురంకు చెందిన ఐదుగురు, తుని పట్టణం రామకృష్ణాకాలనీకి చెందిన ఒకరు ట్రాక్టరు పనికి శనివారం తెల్లవారుజామున వెళ్లారు. తుని మండలం వి.కొత్తూరు పెద్దచెరువులో వీరు మట్టి తవ్వుతుండగా ఒక్కసారిగా పైన ఉన్న చరియలు విరిగిపడిపోయాయి. మట్టికింద చిక్కుకు పోయిన మాసా పాపారావు, జెక్కల సత్యనారాయణ, వై.సింహాచలం, వంతాడ అప్పన్నలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మట్టిలో కూరుకుపోయిన జెక్కల నాగబాబు (45) మృతి చెందాడు. గాయపడిన వారిని తుని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మృతిచెందిన నాగబాబును సంఘటనా స్థలం నుంచి నేరుగా నరసాపురానికి తీసుకుపోయారు. జరిగినది ప్రమాదం కావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లమని గ్రామస్తులు చెప్పడంతో ఉదయం 10 గంటలకు తీసుకువచ్చారు. మృతుడు నాగబాబుకు భార్య కరుణ, నలుగురు పిల్లలు ఉన్నారు. దీంతో బంధువులు ఆస్పత్రికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. సంఘటనా స్థలం పరిశీలన మట్టి చరియలు పడి ప్రమాదం జరిగిన పెద్ద చెరువును రూరల్ ఎస్సై ఆశోక్ పరిశీలించారు. చెరువు గర్భంలో మెత్తటి మట్టి ఉన్న చోట లోతుగా తవ్వడంతో ప్రమాదం జరిగిందన్నారు. నీరూ చెట్టు పథకంలో ఇటీవల పనులు చేశారని స్థానికులు చెప్పడంతో తహసీల్దార్ సూర్యనారాయణకు సమచారం ఇచ్చారు. ప్రస్తుతం మట్టి తవ్విన ప్రాంతానికి అనుమతులు లేన ట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. రెవెన్యూ అధికారుల విచారణ చేసిన తర్వాత కాంట్రాక్టరుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో మట్టిని తరలిస్తున్న సదరు కాంట్రాక్టరు పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మట్టిని తరలించడానికి ఉపయోగించిన ట్రాక్టరును సీజ్ చేశామని ఎస్సై తెలిపారు. -
పెళ్లింట విషాదం
రెండు ప్రాణాలను బలిగొన్న మిల్లర్ రోడ్డు ప్రమాదంలో మేనమామ, మేనల్లుడు మృతి తుని రూరల్ : తుని మండలం తేటగుంట శివారు రాజుల కొత్తూరు వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న మిల్లరు ఆటోను మోటార్ సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. శుక్రవారం జరిగిన ప్రమాదంలో సీలి వెంకటరమణ (22) అక్కడికక్కడే మృతి చెందగా ఎస్కే అమర్ (అమర్నాథ్) (4) తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు రూరల్ ఎస్సై ఎం.అశోక్ తెలిపారు. వీరిద్దరూ శంఖవరం మండలం కత్తిపూడి గ్రామం ఒకే కుటుంబానికి చెందిన మేనమామ, మేనల్లుడన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన రూరల్ ఎస్సై అశోక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జూన్ ఐదున జరగనున్న తన సోదరుడి వివాహానికి బంధువులను పిలిచేందుకు కత్తిపూడికి చెందిన వెంకటరమణ మేనల్లుడు అమర్‌తో కలసి మోటార్ సైకిల్‌పై తుని వచ్చారు. శుభలేఖలు పంపిణీ చేసిన తర్వాత తిరుగు ప్రయాణంలో రాజులు కొత్తూరు వద్ద ప్రమాదానికి గురయ్యారు. వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన అమర్‌ను ప్రత్యేక వాహనంలో తుని ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. కొద్దిసేపు చికిత్స పొందుతూ అమర్ మృతి చెందినట్టు ఆయన వివరించారు. కేసు నమోదు చేసి దర్వాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రూరల్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అలముకున్న విషాదం జూన్ ఐదున జరగనున్న వివాహ వేడుకలతో ఆనందంగా ఉండాల్సిన ఆ ఇంట విషాదమే మిగిలింది. తన సోదరుడు చంద్రరావు వివాహం దగ్గరుండి చేసేందుకు హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వెంకటరమణ ఇటీవల స్వగ్రామం కత్తిపూడి వచ్చాడు. పది రోజులు గడువు ఉండడంతో బంధువులను స్వయంగా ఆహ్వానించేందుకు మేనల్లుడు అమర్‌ను తీసుకుని మోటార్ సైకిల్‌పై బయలుదేరాడు. తుని ప్రాంతంలో బంధువులకు శుభలేఖలు ఇచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. రాజులు కొత్తూరు వద్ద ఆగి ఉన్న మిల్లరు ఆటోను ఢీకొని మృత్యువాత పడ్డారు. చేతికి అందివచ్చిన చిన్న కొడుకు వెంకటరమణ, అల్లారు ముద్దుగా చూసుకుంటున్న పెద్ద మనమడు అమర్ మృతి చెందడంతో సీలి మరియరాణి, సీలి ముసలియ్య దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు తన వివాహం జరిపించేందుకు వచ్చిన సోదరుడు మృతి చెందాడని పెళ్లి పీటలు ఎక్కాల్సిన చంద్రరావు, పెద్ద కుమారుడిని కోల్పోయామని అమర్ తల్లిదండ్రులు ఎస్కే దుర్గ, నాగలక్ష్మి బోరున విలపిస్తున్నారు. పెళ్లింట విషాదం నెలకొనడంతో స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. విషయం తెలియడంతో ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకుని విలపిస్తున్నారు. -
వివాహానికి వచ్చి విగత జీవుడయ్యాడు
బైక్ నుంచి పడి ద్వారపూడి వాసి మృతి ఆస్పత్రిలో బంధువులను పరామర్శించిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తుని రూరల్ : ఆనందోత్సవాల మధ్య జరిగిన బావమరిది వివాహానికి వచ్చి ప్రమాదవశాత్తు బండారు శ్రీనివాస్ (35) విగత జీవుడయ్యాడు. ఆదివారం జరిగిన బావమరిది పెళ్లికి నాలుగు రోజులు ముందుగానే ద్వారపూడికి చెందిన బండారు శ్రీనివాస్ భార్య సత్యవేణి, ముగ్గురు కుమార్తెలను తీసుకుని తుని మండలం చేపూరు చేరుకున్నాడు. పెళ్లి వైభవంగా జరిగింది. అందరూ సంతోషంగా ఉండగా సోమవారం ఉదయం సత్యదేవుని వ్రతం చేయించేందుకు వధూవరులను తీసుకుని సత్యవేణి అన్నవరం వెళ్లింది. కొద్దిసేపటికి మర్లపాడుకు చెందిన మేకల రాఘవ అనే వ్యక్తి గవరయ్య కోనేరు సమీపంలో కోళ్ల ఫారాల వద్ద ఉన్న హోటల్లో ఫలహారం తీసుకునేందుకు వెళుతూ మార్గం మధ్యలో బైక్‌పై బండారు శ్రీనివాస్‌ను ఎక్కించుకున్నాడు. హోటల్ సమీపంలో బైక్ ముందు చక్రం టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. 16వ నంబరు జాతీయ రహదారిపై బైకు అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై వెనుక కూర్చున్న శ్రీనివాస్ ఎగిరి రోడ్డుపై పడ్డాడు. తలకు తీవ్రగాయం కావడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా రాఘవ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. గాయపడిన రాఘవ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోస్ట్‌మార్టం కోసం శ్రీనివాస్ మృతదేహాన్ని తరలించారు. విషయం తెలియడంతో రూరల్ ఎస్సై ఎం.అశోక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం అనంతరం బంధువులకు అప్పగించడంతో మృతదేహాన్ని స్వగ్రామం ద్వారపూడికి తరలించారు. పెళ్లింట విషాదం సంతోషాలు వెల్లివిరియాల్సిన పెళ్లింట విషాదం నెలకొంది. కుమారుడి పెళ్లికి వచ్చిన అల్లుడు మృత్యువాత పడడంతో ఆ కుటుంబ సభ్యులు, బంధువుల్లో విషాదం అలుముకుంది. పెళ్లైన 12 గంటలు గడవకముందే ఆ ఇంట విషాదం అలముకుంది. ఎమ్మెల్యే పరామర్శ మృతుడు శ్రీనివాస్ అత్తవారింట బంధువులు తుని మండలం చేపూరు గ్రామం కావడం, బంధువుల్లో కొంతమంది వైఎస్సార్ సీపీకి చెందిన వారు ఉండడంతో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. పోలీస్, ఆస్పత్రిలో లాంఛనాలను దగ్గరుండి పూర్తి చేయించారు. ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్ పోతల రమణ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, కీర్తి రాఘవ, కొండ్రు నాగేశ్వరరావు, చోడిశెట్టి పెద్ద, వడ్డాది ఏసుబాబు తదితరులు ఉన్నారు. -
అంతలోనే విషాదం
గవరయ్య కోనేరు వద్ద అర్ధరాత్రి ఆర్తనాదాలు రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త, కుమారుడికి తీవ్ర గాయాలు జాతీయ రహదారిలోని గవరయ్య కోనేరు వద్ద పెట్టి మట్టి పీపాలు.. వాహనాల వేగ నిరోధం మాటేలా ఉన్నా.. ఆ ప్రాంతం అందరిని హడలెత్తించింది. ఆదివారం అర్ధరాత్రి ఆ ప్రాంతంలో బైక్‌ను ఒక లారీ ఢీకొనడంతో భార్య మృతి చెందగా, భర్త, కుమారుడి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వీరిని ఆస్పత్రికి తరలించేందుకు ఆ ప్రాంతంలో సిద్ధం చేసిన వాహనాన్ని.. మరో లారీ ఢీకొంది. దీంతో హతాశులైన పోలీసులు రెండు లారీలను సీజ్ చేశారు. తుని రూరల్ (తుని) : మండలంలోని గవరయ్యకోనేరు వద్ద జాతీయ రహదారిపై అర్థరాత్రి ఆర్తనాదాలు మిన్నంటాయి. మండలంలోని కుమ్మరిలోవకు చెందిన నల్లల శేషగిరి, అతని భార్య నాగలక్ష్మి, కుమారుడు శ్యాం ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మోటారుసైకిల్‌పై ఈ ముగ్గురూ ఆదివారం ప్రత్తిపాడు మండలం గోపాలపట్నంలో జరిగిన శుభకార్యానికి వెళ్లొస్తుండగా గవరయ్యకోనేరు వద్ద ప్రమాదానికి గురయ్యారు. మరో పది కిలోమీటర్లు ప్రయాణిస్తే వారు గమ్యానికి చేరుకునేవారే. వేగ నిరోధానికి పోలీసులు ఏర్పాటు చేసిన మట్టి పీపాల వద్ద మోటారు సైకిల్‌ను లారీ ఢీకొంది. బైక్ పైనుంచి కింద పడిన నాగలక్ష్మి మెడ, శేషగిరి కాళ్లపై నుంచి లారీ దూసుకుపోయింది. దీంతో నాగలక్ష్మి (28) అక్కడికక్కడే మృతి చెందగా శేషగిరి, శ్యాం తీవ్రంగా గాయపడ్డారు. దూరంగా పడిన బాలుడు శ్యాం రక్షించండి అంటూ కేకలు వేయడంతో డ్రైవర్లు వాహనాలను ఆపి పోలీసులకు, 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. రోడ్డు మధ్యనే ప్రమాదం జరగడంతో అన్నవరం నుంచి తుని వైపు వచ్చే వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్థంభించింది. సమాచారం తెలియగానే పోలీసులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రూరల్ ఎస్సై ఎం.అశోక్, పోలీసులు క్షతగాత్రులను తుని ఏరియా ఆస్పత్రికి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శేషగిరి, శ్యాంలను విశాఖపట్నంలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు ఎన్‌హెచ్ 16 నిర్వాహకులకు చెందిన బొలోరాలో ఎక్కిస్తుండగా మరో ట్యాంకర్ లారీ ఢీకొంది. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. దీంతో ఈ రెండు లారీలను రూరల్ పోలీసులు సీజ్ చేశారు. రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి ప్రధాన కారణం జాతీయ రహదారిపై పీపాలను ఏర్పాటు చేయడమేని వాహనదారులు అంటున్నారు. -
ఉపమానం చెప్పలేని వేల్పు వేంకటేశ్వరుడు
ఉపమాక వేంకటేశ్వరాలయం ఉపమాక అంటే సాటి లేనిది అని అర్థం. ఇటువంటి క్షేత్రం మరెక్కడా ఉండదని అర్థం స్ఫురించేలా పురాణాలలో ఉపమాక అనే పదాన్ని ఉపయోగించారు. ‘కలౌ వేంకటనాయక’ అన్నట్లుగా, కలియుగంలో శ్రీమన్నారాయణుడు వేంకటేశ్వరస్వామి అవతారంలో వేంచేస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇందుకు నిదర్శనమే ఉపమాక వేంకటేశ్వరస్వామి. ఒకసారి ఆ ప్రాంతాన్ని దర్శించినవారు తిరిగి భగవంతుడిని దర్శించుకోవడానికి పదే పదే వెళ్లి తీరతారని స్థానికులు చెబుతారు. స్వామివారు గరుడాద్రిపై విశ్రాంతి కోసం పవళించినట్లుగా తెలుస్తోంది. ఆలయానికి సమీపంలో బందుర సరస్సు ఉంది. ఇది చాలా పవిత్రమైనదని, తిరుమలలోని పాపనాశంతో సమానమని చెబుతారు. క్రీ.శ. ఆరవ శతాబ్దంలో తూర్పుగోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానాన్ని పరిపాలించిన శ్రీకృష్ణ భూపాలుడు స్వామికి ఆలయాన్ని నిర్మించినట్లు క్షేత్ర మహాత్మ్యం చెబుతోంది. ఇక్కడ క్షేత్రపాలకుడైన వేణుగోపాలస్వామి విగ్రహాన్ని నారదుడు ప్రతిష్ఠించాడని, 11వ శతాబ్దంలో రామానుజులవారు ఈ ఆలయాన్ని దర్శించారనీ తెలుస్తోంది. స్థలపురాణం ద్వాపర యుగంలో గరుత్మంతుడు శ్రీకృష్ణ భగవానుడిని ఎల్లవేళలా తన వీపుపై ఉండాలని కోరాడు. దక్షిణ సముద్రతీరంలో గరుడ పర్వతం ఉందని, తాను వేటకు వచ్చి అక్కడ వేంకటేశ్వరునిగా స్థిరపడతానని వరమిచ్చాడు. అలాగే మునులు తమకు మోక్షం ప్రసాదించాలని కోరగా, దక్షిణ సముద్ర తీరమంతా అరణ్యప్రాంతమని, అక్కడ అడవి జంతువులుగా జన్మిస్తే, తాను వేటకు వచ్చి మోక్షం ప్రసాదిస్తానని, అనంతరం అక్కడే స్థిరపడతానని వరమిచ్చినట్లు బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది. మాట నిల»ñ ట్టుకోవడం కోసం శ్రీకృష్ణుడు... ఉపమాక గ్రామంలో ఉన్న గరుడ పర్వతం మీద కొలువయ్యాడని, అక్కడ సంచరించే గొర్రెల కాపరులు స్వామివారికి నిత్య సేవలు చేస్తూ, నైవేద్యాలు సమర్పించడం ద్వారా భగవంతుడు వెలిశాడని గ్రామప్రజలు తెలుసుకున్నారని తెలుస్తోంది. ఆ విధంగా శ్రీమన్నారాయణుడు గరుత్మంతునికి, ఋషీశ్వరులకు ఇచ్చిన వరప్రభావంతో కలియుగంలో షడ్భుజాలతో, లక్ష్మీ సమేతుడై, అశ్వాన్ని అధిరోహించి దర్శనమిస్తాడు. ఆరు భుజాలతో దర్శనమిచ్చే అరుదైన విగ్రహం: ఇక్కడి వేంకటేశ్వరుడు ఆరు భుజాలు, పంచాయుధాలతో దర్శనమిస్తాడు. ఇందులో ఐదు భుజాలు దుష్ట శిక్షణకు, ఒక హస్తం అభయ ముద్రలో ఉంటూ, భక్తులకు అభయమిస్తుంటాడు. గుర్రం మీద కూర్చుని, క్రింద వామభాగంలో ఎడమవైపున లక్ష్మీదేవిని కలిగి కనువిందు చేస్తాడు. స్వయంభూగా వేంచేసిన క్షేత్రం ఉపమాక. ఈ పేరు పురాణాలలోనూ కనిపిస్తుంది. ఎక్కడ ఉంది? విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో ఉన్న ఉపమాక వెంకటేశ్వరస్వామి ఆలయం క్రీ.పూ 6వ శతాబ్దానికి చెందినది. తుని – విశాఖపట్టణం ప్రాంతాలకు మధ్యగా ఎన్‌హెచ్ – 5 నుంచి ఒక కిలోమీటరు దూరంలో ఉంది ఉపమాక గ్రామం. స్వామి దర్శనం 17, 18 శతాబ్దాలలో పిఠాపురం సంస్థానానికి చెందిన ప్రభువు ఎంతో ముచ్చటపడి విలువైన పచ్చలు, వజ్రాలు పొదిగిన కిరీటాన్ని చేయించుకున్నాడట. ధారణకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. ముందు రోజు రాత్రి ఆ రాజుకి కలలో స్వామి దర్శనమిచ్చి, ‘ఉపమాక క్షేత్రంలో నేను వేంచేసి ఉండగా, నాకు సమర్పించకుండా నువ్వు ఎందుకు ధరించాలనుకుంటున్నావు’ అని అడిగాడట. పశ్చాత్తాప పడిన రాజు మరునాడు ఊరేగింపుగా ఉపమాక వచ్చి స్వామివారికి కిరీటం సమర్పించాడట. ఎలా చేరుకోవాలి? రోడ్డు మార్గం నర్సీపట్నం రోడ్... రైల్వే స్టేషన్నుంచి 4 కిలోమీటర్లు ∙రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాల నుంచి గంటగంటకూ ఆర్టీసీ బస్సులు ∙తుని, యలమంచిలి ప్రాంతాల నుంచి బస్సులు ఎక్కువగా ఉన్నాయి ∙నర్సీపట్నం రోడ్, అడ్డ రోడ్, నక్కపల్లి ప్రాంతాల నుంచి సర్వీస్ ఆటోలు నడుస్తూనే ఉంటాయి. రైలు మార్గం ∙చెన్నై – కలకత్తా మార్గంలో తునిలో దిగితే, అక్కడ నుంచి 20 కి.మీ. దూరం ∙కొన్ని రైళ్లు నర్సీపట్నం రోడ్ స్టేషన్లో ఆగుతాయి. ఇక్కడి నుంచి ఉపమాక గ్రామం కేవలం 4 కి.మీ. విమానమార్గం విశాఖపట్టణం విమానాశ్రమం. ఇక్కడ నుంచి ఉపమాక గ్రామం 90 కి.మీ. దూరం క్షేత్ర విశేషాలు గరుడాద్రి పర్వతంపై గుర్రంపై వేటకు వెళ్తున్న రూపంలో స్వామి దర్శనమిస్తాడు ∙ఆలయానికి ఎదురుగా ఉన్న బందుర సర స్సులో బ్రహ్మ తపస్సు చేశాడట. ఆ సరస్సులోని పవిత్ర జలాలతో అనునిత్యం స్వామివారికి అభిషేకం చేస్తా్తరు ∙స్వామి వారు పగలు తిరుపతిలోను, రాత్రి ఉపమాక గరుడాద్రి పర్వతంపై కొలువు తీరి (విశ్రాంతి కోసం) ఉంటారని క్షేత్రమహాత్మ్యం చెబుతోంది. అందువల్లే ఉదయం 5గం.లకు స్వామివారి గర్భాలయ ద్వారాలు తెరిచి, పూజాదికాలు నిర్వహించి, సాయంత్రం 6 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు ∙కొండ దిగువన బేడా మండపంలో స్వామివారి ఉత్సవ మూర్తులు, పక్కన ఉపాలయంలో ఆండాళ్లమ్మవారు కనువిందు చేస్తారు ∙బందుర సరస్సులో స్నానమాచరించి ధ్వజస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. స్వామివారికి కోట్ల విలువ చేసే స్వర్ణాభరణాలు, నవరత్నాల ఆభరణాలు ఉన్నాయి. ఈ ఆలయంలో నిత్యం ప్రసాద వితరణ ఉంటుంది. ప్రతి శనివారం అన్నదానం చేస్తారు ∙అన్ని క్షేత్రాలలో సంవత్సరానికి ఒక్కరోజు లభించే ఉత్తర ద్వారదర్శనం, ఇక్కడ నిత్య వైకుంఠ ద్వార దర్శనంగా విలసిల్లుతోంది. ∙దూరం నుంచి ఈ పర్వతం గరుడ పక్షి ఆకారంలో కనిపిస్తుంది. అందుకే ఈ కొండను గరుడాద్రి అంటారు ∙భక్తులు దగ్గరుండి మూలవిరాట్‌కు అనునిత్యం పంచామృత అభిషేకం చేయించుకోవచ్చు. పంచామృతాభిషేక సమయంలో స్వామివారిని దర్శించి, తీర్థప్రసాదాలు స్వీకరిస్తే, సంతానప్రాప్తి కలుగుతుందని నమ్మకం ∙స్వామివారికి తమ కోరికను విన్నవించి, అది నెరవేరిన తరవాత కాలి నడకన కొండపైకి వస్తాననుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని, నెరవేరిన వెంటనే కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని స్థానికులు చెబుతారు ∙త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్ద జీయర్ స్వామివారు భారతదేశంలో ప్రతిష్ఠించిన 108 స్థూపాలలో ఇది 48వది. – డా.పురాణపండ వైజయంతి సహకారం: ఆచంట రామకృష్ణ సాక్షి, నక్కపల్లి -
పర్యవేక్షణ కరువు.. భక్షణ షురూ
నాణ్యతకు తూట్లు ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్ పనులు గృహనిర్మాణశాఖ సిమెంట్ వాడకం రూ. 2.20 కోట్లతో రోడ్డు కాలువల నిర్మాణం తుని : దీర్ఘకాలికంగా ఉండే నిర్మాణాల విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే అనతికాలంలోనే శిథిలమవుతాయి. ఇందుకు గతంలో చేసిన పనులే నిదర్శనం. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసమో, లేక అధికార పార్టీకి చెందిన నాయకుడని భయమో తెలియదు కాని అధికారులు నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి రావడం లేదు. దీంతో కాంట్రాక్టర్ నచ్చిన రీతిలో కాలువ నిర్మిస్తున్నారు. కాంక్రీట్‌లో ఉపయోగించే పాళ్లను చూసి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తుని పట్టణంలోని ఎస్ఏ రోడ్డును వుడా నిధులు రూ.2.20 కోట్లతో విస్తరిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా కాలువ నిర్మాణంలో నాసిరకం మెటీరియల్ వాడుతున్నారు. నిబంధనలు గాలికి విశాఖ నగరపాలక అభివృద్ధి సంస్థ (వుడా) తుని మున్సిపాలిటీకి రూ. 2.20 కోట్లు మంజూరు చేసింది. ఆంజనేయస్వామి గుడి నుంచి ఎస్.అన్నవరం లక్ష్మీదేవి చెరువు వరకు రోడ్డు విస్తరణ, కాలువల నిర్మాణానికి ఆ¯ŒSలై¯ŒS టెండర్లు పిలిచారు. అధికార పార్టీకి చెందిన నాయకుడి బంధువులకు టెండర్ దక్కింది. ప్రస్తుతం ఉన్న 20 అడుగుల రోడ్డును 40 అడుగులకు విస్తరించి కొత్త రహదారిని నిర్మించాలి. విస్తరణలో పాత కాలువలను తొలగించి, కొత్తవి నిర్మించాలి. సుమారు 800 మీటర్ల మేర రోడ్డు, కాలువలను నిర్మించాల్సి ఉంది. ఇటీవల పనులు ప్రారంభించారు. గృహ నిర్మాణశాఖ సిమెంట్ వాడకం అంచనాలో పేర్కొన్న విధంగా కాకుండా గృహనిర్మాణశాఖకు చెందిన సిమెంట్‌ను పనులకు వినియోగిస్తున్నారు. ఇది జాతీయ ఉపాధి హామీ నిధులతో చేసే పనులకు మాత్రమే ఉద్దేశించినది. కాంట్రాక్టర్ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఏ సిమెంట్ వాడినా ప్రశ్నించే అధికారులు కరువయ్యారు. మార్కెట్లో 53 గ్రేడ్ రకం సిమెంట్ బస్తా ధర రూ.360 ఉంది. గృహనిర్మాణశాఖ సిమెంట్ బస్తా ధర రూ.230. అంటే బస్తాకు రూ.130 ఆదా అవుతుంది. రెండు అడుగుల వెడల్పు, రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు కొలతలతో నిర్మిస్తున్నారు. రోడ్డుకు రెండు వైపులా 800 మీటర్ల చొప్పున 1,600 మీటర్ల కాలువ నిర్మిస్తారు. మూడు మీటర్ల కాంక్రీట్‌కు 331.20 కిలోలు (7 బస్తాలు) సిమెంట్ పడుతుంది. దీంతో 10 ఎంఎం కంకర, సిమెంట్ మాత్రమే కాంక్రీట్‌కు వాడాలి. కాంక్రీట్ రంగు కోసం క్రషర్ బూడిదను మిక్స్ చేస్తున్నారు. 1,600 మీటర్ల కాలువ నిర్మాణానికి 2,548 బస్తాల సిమెంట్ పడుతుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అంచనా ప్రకారం కాలువలకు వాడే సిమెంట్‌కు రూ. 9,17,280 అవుతుంది. గృహనిర్మాణ శాఖ సిమెంట్‌కు రూ.5, 86,040 అంటే కాంట్రాక్టర్‌కు రూ.3,31,240 లబ్ధి చేకూరుతుం ది. ఇది సిమెంట్ మార్జి¯ŒSలో కలిగే ప్రయోజనం. క్రషర్ బూడిదను వినియోగించడం వల్ల ఇసుక పరిమాణం తగ్గుతుంది. ఐదేళ్లలో రూ.35 లక్షలు వృథా ఆంజనేయస్వామి గుడి నుంచి ఎస్.అన్నవరం రోడ్డు, కాలువలకు రూ.35 లక్షలు ఐదేళ్లలో ఖర్చు చేశారు. 2013లో రూ.20 లక్షలతో బీటీ రోడ్డు నిర్మించారు. 2014–15లో రూ.15 లక్షలతో కాలువలు కట్టారు. ఇప్పుడు విస్తరణ పేరుతో మళ్లీ అదే రోడ్డుకు రూ.2.20 కోట్లు మంజూరు చేసి పనులు చేపట్టారు. అధికారులకు ముందుచూపు లేకపోవడం వల్ల ప్రజలు పన్నుల రూపంలో కట్టిన రూ.35 లక్షలు వృథా అయ్యాయి. ఈ సొమ్ముతో మురికివాడల్లో రోడ్లు, కాలువలు నిర్మించి ఉంటే ప్రజలకు మేలు జరిగేదని పలువురు అంటున్నారు. పత్తాలేని అధికారులు రోడ్డు నిర్మాణంపై వివరణ కోసం మున్సిపల్ కమిషనర్ ఎస్.వెంకటరమణను సంప్రదించగా ఆ పనులకు, తమకు సంబంధం లేదని చెప్పారు. వుడాకు చెందిన అధికారులదే పర్యవేక్షణ బాధ్యత అన్నారు. రూ.రెండు లక్షల పనికే వర్క్ ఇ¯ŒSస్పెక్టరు ఉంటేనే పని చేయాలని చెబుతారు. రూ. 2.20 కోట్ల పనికి ఏ అధికారి లేకపోయినా కాంట్రాక్టర్ పని చేస్తున్నారు. పర్యవేక్షణ లేకపోతే నాణ్యత ప్రమాణాలు లోపిస్తాయని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. -
బాణసంచా కేంద్రంలో పేలుడు
తారాజువ్వ కూరుతుండగా..ముగ్గురికి తీవ్ర గాయాలు మహిళలను కాపాడిన పింఛన్ల పంపిణీ పోలీసుల అదుపులో నిర్వాహుకుడు క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే రాజా తుని : బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన బాణసంచా పేలుడు పట్టణాన్ని హడలెత్తించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఏడుగురు ప్రాణాలతో బయటపడ్డారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పింఛన్లు తీసుకునేందుకు మున్సిపాలిటీకి వెళ్లిన పలువురు మహిళలు పనిలోకి రాలేదు. వారు కూడా వచ్చి ఉంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని స్థానికులు, అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదంలో రూ.4 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్టు అధికారులు చెప్పారు. బాణసంచా కేంద్రం నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ భారీ పేలుడు సంఘటనపై పట్టణ సీఐ వి. శ్రీనివాస్, స్థానికుల కథనం ఇలా ఉంది. శ్రీరామనవమి పండుగ సందర్భంగా తారాజువ్వలు, అవుట్లకు అర్డర్లు రావడంతో వాటి తయారీ కోసం బిజీగా ఉన్న పట్టణంలోని ఇసుకలపేట సమీపంలో ఉన్న వెంకటరమణ ఫైర్ వర్క్స్‌లో మంగళవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఆ సమయంలో పది మంది కార్మికులు ఒక షెడ్లో మందుల మిశ్రమం తయారు చేస్తుంటే మరోదాంట్లో తారాజువ్వలు కూరుతున్నారు. ఐదు నిమిషాల వ్యవధిలోని మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. మందుగుండు సామగ్రి మధ్యలో ఉన్న ఇసుకలపేటకు చెందిన గెడ్డం దుర్గ (21), సాగిరెడ్డి ముసలయ్య (50), వీరవరపుపేటకు చెందిన ఆరుగలు రమేష్ (21)లను అగ్నికీలలు చుట్టిముట్టాయి. మిగిలిన కార్మికులు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగుతీశారు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు, అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసింది. క్షతగాత్రులు ముగ్గురిని అంబులె¯Œ్సలో ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ముసలయ్య, దుర్గలను కాకినాడ అపోలో ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బందికి స్వల్ప గాయాలు మందుగుండు ముడిసరుకులు ఉన్న షెడ్లో పీపాలు పేలిపోయాయి. వీటిని ఫోమ్‌తో అర్పుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అగ్నిమాపక సిబ్బంది ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. సుమారు గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. «ధైర్యం ప్రదర్శించిన ఫైర్మ¯ŒSలు రామచంద్రయ్య, సురేష్, రామకృష్ణలను ఆగ్నిమాపక అధికారి కేవీ రమణ అభినందించారు. పింఛ¯ŒS కోసం మహిళలు పనిలోకి రాలేదు.. ఈ కేంద్రంలో పనిచేస్తున్న పది మంది మహిళలు పింఛన్లు తీసుకునేందుకు వెళ్లారు. వారు కూడా పనికి వచ్చి ఉంటే ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. ఇక్కడ పనిచేసే కార్మికులకు రోజువారి కూలీ మాత్రమే యాజమాన్యం ఇస్తుందని చెప్పారు. తయారీ కేంద్రం వద్ద ఉన్న ఫైర్ ఫైటర్స్ సకాలంలో ఆ¯ŒS చేసి ఉంటే ప్రమాదం తప్పేదని అగ్నిమాపక అధికారి కేవీ రమణ, తహసీల్దార్ వి.సూర్యనారాయణ అన్నారు. ఈ కేంద్రానికి లైసె¯Œ్స రెన్యూవల్ చేయించారని, అన్ని అనుమతులు ఉన్నాయన్నారు. ప్రమాదంలో రూ. 4 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లిందని తెలిపారు. ఎమ్మెల్యే రాజా పరామర్శ బాణసంచా పేలుడులో గాయపడిన క్షతగాత్రులను ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. పెద్దాపురం డీఎస్పీ రాజశేఖర్, ఆర్డీఓ విశ్వేశ్వరరావు కూడా క్షతగాత్రులను పరామర్శించారు. మున్సిపల్ చైర్మ¯ŒS యినుగంటి సత్యనారాయణ, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మ¯ŒS పోల్నాటి శేషగిరిరావు క్షతగాత్రులను కాకినాడ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బాణసంచా తయారీ కేంద్రం యాజమాని సీహెచ్ వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. హోంమంత్రి, కలెక్టర్ పరామర్శ కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : తునిలో బాణసంచా కేంద్రంలో పేలుడుకు తీవ్రంగా గాయపడి, కాకినాడ అపోలోలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు సాదిరెడ్డి ముసలయ్య, గెడ్డం దుర్గాప్రసాద్‌లను మంగళవారం రాత్రి హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కలెక్టర్ అరుణ్‌కుమార్ పరామర్శించారు. బాణసంచా తయారీ కేంద్రంలో కార్మికుల భద్రత, ప్రాణరక్షణకు తీసుకున్న చర్యలపై సమగ్ర విచారణ చేయాలని రాజప్ప పోలీసులను ఆదేశించారు. భద్రతా ప్రమాణాలపై నిర్లక్ష్యం వహించి ఉంటే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు పూర్తి స్థాయిలో నాణ్యమైన వైద్యం చేయాలని వైద్యులకు సూచించారు. బా«ధితులను ప్రభుత్వం అందుకుంటుందని హామీ ఇచ్చారు. ఒకరి పరిస్థితి విషమం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు తుని శివారు ఇసుకులపేటలో బాణసంచా కేంద్రంలోని పేలుడులో తీవ్రంగా గాయపడి ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాదిరెడ్డి ముసలయ్య పరిస్థితి విషమంగా ఉంది. మరో క్షతగాత్రుడు గెడ్డం దుర్గాప్రసాద్ తీవ్ర గాయాలతో ఇక్కడ చికిత్స పొందుతున్నాడు. ఒళ్లంతా కాలిన గాయాలతో ఉన్న వీరిని తొలుత జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం వారిని అపోలోకు చేర్చారు. క్షతగాత్రుల బంధువులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
వ్యక్తి దారుణ హత్య
తుని: తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్.అన్నవరంలో ఆదివారం దారుణ హత్య జరిగింది. బాబ్జీ(40) అనే వ్యక్తి తన ఇంటికి సమీపంలో హత్యకు గురయ్యాడు. సిమెంటు రాయితో తలపై బలంగా మోదడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు పాత గోనె సంచులు కొనడం, అమ్మడం చేస్తుంటాడు. ఇతనికి మద్యం అలవాటు ఉందని.. ఆ సందర్భంగా ఏదైనా గొడవ జరిగిన కారణంగా హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతనికి భార్య, కుమార్తె ఉన్నారు. -
ప్రతి పాటా ప్రేక్షకుల హృదయాన్ని తాకాలి
సినీ గేయ రచయిత సిరివెన్నెల తుని రూరల్ (తుని) : ప్రతి పాటా ప్రేక్షకుల హృదయాలను తాకాలన్న సంకల్పమే తనకు గుర్తింపునిచ్చిందని సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. వేటూరి సాహితీ పీఠం, శ్రీప్రకాష్ కల్చరల్ అసోసియేషన్లు సంయుక్తంగా వేటూరి కవితా సప్తమ సాహితీ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. వేటూరి 81వ జయంతి సందర్భంగా తుని చిట్టూరి మెట్రో ఫంక్ష¯ŒS హాలులో ఆదివారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. సీతారామశాస్త్రి మాట్లాడుతూ, వ్యక్తికంటే వ్యక్తిత్వం గొప్పదన్నారు. మానవతా విలువలతో రచనలు పరిపూర్ణంగా ఉండాలని, సాహితీవేత్తకు సామాజిక బాధ్యత ముఖ్యమన్నారు. కాకినాడలో సినిమా చూస్తుండగా ‘అది మన ఊరి కోకిలమ్మ, నిన్నడిగింది కుశలమమ్మ, గట్టుమీద గోదారమ్మ, రెల్లిపూలవలే గంతులేస్తుంటే’ అనే పాట వేటూరిపై అభిమానాన్ని పెంచిందన్నారు. ఆ రోజే పాటలు రాసేందుకు ధైర్యం వచ్చిందన్నారు. తన తండ్రి వయస్సే కావడంతో వేటూరిని తండ్రిగా భావిస్తున్నట్టు తెలిపారు. అంతకుముందు పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు చక్కా సూర్యనారాయణ, అధ్యక్షుడు సీహెచ్‌వీకే నరసింహారావు, వ్యవస్థాపక కార్యదర్శి కలగ రామజోగేశ్వరశర్మ, ముఖ్య అతిథి యనమల కృష్ణుడు, విజయ ప్రకాష్‌లు సిరివెన్నెల సీతారామశాస్త్రి దంపతులను ఘనంగా సన్మానించారు. వేటూరి సాహితీ పీఠం 81 పుస్తకాలను బహూకరించింది. ముఖ్యవక్తలు పలువురు సిరివెన్నెల రచనలు, పాటల్లో భావాలను విశదీకరించారు. వేటూరి, సిరివెన్నెల సుమధుర గీతాల సంగీత విభావరి నిర్వహించారు. -
మెట్ట గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రాజా
17న దివీస్ బాధిత గ్రామాల్లో జగన్ పర్యటనను విజయవంతం చేయండి తొండంగి : కోన ప్రాంతంలో దివీస్ బాధిత గ్రామాలకు చెందిన రైతులు, ప్రజల ఇబ్బందులను తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి బాధిత గ్రామాల్లో పర్యటిస్తారని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు.బుధవారం ఆయన పార్టీ మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, యూత్ కన్వీనర్ ఆరుమిల్లి ఏసుబాబు ఇతర నాయకులతో కలిసి బెండపూడి, పి.ఇ.చిన్నాయపాలెం, ఎ.కొత్తపల్లి, శృంగవృక్షం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న వై.ఎస్.జగన్ మోన్ రెడ్డితోపాటు పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా కలిసి తీరప్రాంత గ్రామాలైన పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం, నర్శిపేట గ్రామాల్లో పర్యటిస్తారన్నారు. దీన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మద్దుకూరి వీరవెంకట సత్యనారాయణ చౌదరి, ముద్దకూరి వెంకటరామయ్య చౌదరి, మద్దుకూరి అప్పారావు చౌదరి, తొండంగి పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు వనపర్తి సూర్యనాగేశ్వరరావు, బెండపూడి హైస్కూలు విద్యా కమిటి ఛైర్మన్ బూసాల గణప తి, చిన్నాయపాలెం ఉపసర్పంచి దూళిపూడి ఆం జనేయులు, అడపా సూరచక్రం, కందబాబ్జి, దేవుల పల్లి శ్రీను, వడ్డి వెంకన్న, గర్లంకి బాబ్జి, గునిమానికల ఏసుబాబు, కటకం శివ, తదితరులు ఉన్నారు. -
రూ.15 కోట్లు...కృష్ణార్పణం
సాక్షిప్రతినిధి, కాకినాడ : ప్రజల సొమ్మే కాదు ప్రజలు ఏమైపోయినా సరే పాలకులకు లెక్కేలేకుండా పోతోంది. పాతికవేల మందిని ఇబ్బందుల పాలుజేసి ‘తమ్ముడుంగారి’ బాగు కోసం పురపాలికలు మోకరిల్లుతుండడంతో పట్టణ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇందుకు ఉదాహరణ తుని నడిబొడ్డున బాతులు కోనేరును బినామీ పేర్లతో ఆక్రమించేసిన వైనమే. 15 వార్డుల్లో నివసించే పాతికవేల మంది ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఆక్రమణలు చేస్తున్నా అడ్డుకోవల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహించడమేమిటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 53 సెంట్లు జిరాయితీ స్థలాన్ని కొనుగోలుచేసి కోట్ల రూపాయల విలువైన కోనేరు స్థలాన్ని కలిపేసుకున్నారు. మున్సిపాలిటీగా ఏర్పాటుకాక మునుపు తుని వీరవరం పంచాయతీగా ఉండేది. మురుగు ఈ బాతుల కోనేరులోకి వచ్చి ముంపు నుంచి రక్షించేది. కోనేరును చదును చేసి స్థలంగా మార్చేయడంతో పాతికవేల మంది నివసిస్తున్న 15 వార్డులు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆక్రమణకు గురైన ఈ కోనేరును తిరిగి స్వాధీనం చేసుకునే ధైర్యం ఎవరికీ లేదు. ఏదైనా తేడా వచ్చినా ‘అన్నయ్య’ (తుని నియోజక వర్గంలో అధికార పార్టీ ముఖ్య ప్రజా ప్రతినిధి) చూసుకుంటారని తమ్ముడు ఇచ్చిన ధైర్యంతో పురపాలికలు కిమ్మనడం లేదు. ఆక్రమణదారులను వదిలేసిన మున్సిపాలిటీ ప్రత్యామ్నాయంగా రూ.38 లక్షల ప్రజధనాన్ని కుమ్మరించి కొత్తగా డ్రై¯ŒSను నిర్మించింది. గట్టిగా వర్షం పడితే చాలు లక్షలు పోసి నిర్మించిన ఈ డ్రై¯ŒS ఎందుకు పనికిరావడం లేదు. వచ్చిన వర్షం నీటిని అదుపు చేయలేకపోవడంతో వరద కష్టాలు తప్పడం లేదు. ఆక్రమణ విలువ రూ.15 కోట్ల పైమాటే... ఆక్రమించుకున్న ఆ స్థలం మార్కెట్ విలువ రూ.15 కోట్ల పైమాటే. అన్ని కోట్లు విలువైన బాతుల కోనేరు కబ్జా చేసినా అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. కోనేరుకు ముందు జీఎన్టీటీ రోడ్డును అనుకుని తాలూకా పోలీస్‌స్టేçÙన్, దానికి వెనుక పోలీస్ క్వార్టర్లున్నాయి. ఇవన్నీ పోరంబోకు భూమిలో ఏర్పాటు చేసినవే. వీరవరం పంచాయతీగా ఉండగా సర్వే నంబరు 268/4లో 1.50 ఎకరాల రెవెన్యూ పోరంబోకు ఇది. 1983లో పురపాలక సంఘం జీఎన్టీ రోడ్డులోని సర్వే నంబరు 268/4లో సోమరాజు సినిమా థియేటర్ గోడ అనుకుని 22 సెంట్లు భూమిలో మురుగు కాలువ నిర్మించింది. కాలువ 15 వార్డుల మురుగుకు నీరు పారుదలకు ప్రధాన మార్గం. బినామీ పేర్లతో కొనుగోలు... బాతులు కోనేరు మనుగడలో ఉండగా ఆ స్థలంలో ఎవరూ లేరని స్థానికులు ఎవరినడిగినా ఇట్టే చెబుతారు. తునికి చెందిన ఒక వ్యక్తి సర్వే నంబరు 268/4 లో 1.25 సెంట్లు భూమి కొన్నట్టు డాక్యుమెంట్లు అధికారులకు అందజేశాడు.1995లో రెవెన్యూ సర్వేలో ప్రభుత్వ భూమిగా నిర్థారించారు. దీనిపై 2003లో జేసీ కోర్టును పిటీషనర్ ఆశ్రయించగా, జేసీ ఆదేశాల మేరకు మున్సిపల్ కాలువకు 22 సెంట్లు భూమి విడిచిపెట్టేశారు. జేసీ కోర్టుకు వెళ్లిన వ్యక్తికి తన పేరుతో 53 సెంట్లు 2005లో పట్టా ఇచ్చారు. వెబ్ ల్యాండ్‌లో మాత్రం ఆ భూమి రెవెన్యూ పోరంబోకుగానే ఉంది. అయినా సరే తన అధికార దర్పాన్ని చూపించి కబ్జాకు పాల్పడ్డాడు. కొనుగోలు ఇంత ... ఆక్రమణ అంత... అధికారికంగా కొనుగోలు చేసింది 53 సెంట్లే. కానీ ఆ భూమికి ఆనుకుని మురుగు డ్రై¯ŒSకు చెందిన 22 సెంట్లు, పోలీస్ క్వార్టర్స్ సమీపాన 10 సెంట్లనూ తన ఖాతాలో వేసేసుకున్నాడు.ఈ మొత్తం భూమి 1500 గజాలు పైబడి ఉంది. అక్కడ గజం రూ.లక్ష పలుకుతుంది.అంటే అక్షరాలా రూ.15 కోట్లు విలువైన స్థలం అధికారాన్ని అడ్డంపెట్టుకుని బినామీ పేర్లతో తమ్ముడు చేతుల్లోకి పోయింది. మున్సిపల్ కాలువ ఆనుకుని ఉన్న థియేటర్‌ను కూడా తమ్ముడు బినామీలే కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ఆ స్థలం, కబ్జా చేసిన స్థలాన్ని చదును చేసేసి కంచె ఏర్పాటు చేశారు. ప్లాట్లుగా అమ్మకానికి పెట్టినా భూమి రికార్డు విషయం తెలుసుకున్న వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నారు. కాలువ మూసి వేసినా పురపాలకులు మాత్రం తమ్ముడు అడుగులకు మడుగులొత్తుతూనే ఉన్నారు. -
జనధనంతో.. ప్రైవేటుకు ప్రయోజనం..
నిబంధనలకు నీళ్లొదిలిన తుని మున్సిపల్ అధికారులు పట్టణంలో అనేక ప్రాంతాల్లో కచ్చా డ్రెయిన్లూ కరువే.. టీడీపీ వారి లేఅవుట్‌కు రూ.28 లక్షలతో కాలువ నిర్మాణం ఎగువ నుంచి నీరు పోవడానికేనని సాకులు తుని : వడ్డించే వాడు మనవాడైతే చాలు.. బంతి చివర కూర్చున్నా నష్టం లేదన్నది సామెత. దీన్ని తుని పురపాలకసంఘం అధికారులు కొంచెం మార్చి ‘మనవాడైతే అసలు బంతిలో కూర్చోకపోయినా విందుకు లోటు లేదు’ అంటున్నారు. ప్రజాధనాన్ని ప్రజల కోసం కాక రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ధారాదత్తం చేస్తున్నారు. తుని పట్టణంలోని అనేక ప్రాంతాల్లో కనీసం రోడ్లు, కాలువలు లేవు. వీటికి సంబంధించి ప్రతిపక్షానికి చెందిన కౌన్సిలర్లు విజ్ఞాపనలిచ్చినా నిధులు లేవని చెప్పి మున్సిపల్ అధికారులు కాలయాపన చేస్తున్నారు. అదే అధికారులు ప్రైవేటు లే అవుట్ కోసం ప్రజాధనంతో అధికారికంగా కాలువ నిర్మాణం చేపట్టారు . అది అధికార పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్‌కు సంబంధించిన వారి లే అవుట్ కావడంతో నిబంధనలు సడలించారు. రూ.28 లక్షలతో యుద్ధప్రాతిపదికన కాలువ పనులు చేపట్టారు. నిబంధనలు ఇలా.. ఏదైనా వ్యవసాయ భూమిని లే అవుట్ వేయాలంటే మార్కెట్ విలువలో పది శాతం భూమి మార్పిడి ఫీజు చెల్లించాలి. కాలువలు, రోడ్లు, విద్యుత్ సదుపాయం లే అవుట్ వేసినవారే సమకూర్చాలి. మొత్తం స్థలంలో పది శాతాన్ని ప్రజావసరాలకు మార్ట్గేజ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే డీటీపీసీ లేదా ఉడా అనుమతులు ఇస్తాయి. గతంలో తుని పరిసర ప్రాంతాల్లో సుమారు 270 ఎకరాల్లో అనధికార లే అవుట్లు వేశారు. ఇందుకు సంబంధించి రూ.30 కోట్ల మేర చెల్లించాలని ఉడా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు తాజాగా పట్టణానికి ఆనుకుని ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్ కుటుంబసభ్యులకు చెందిన 15 ఎకరాల్లో ఉడా లే అవుట్ వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం దాఖలు చేసిన దరఖాస్తుల్లో రోడ్లు, కాలువలు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను కల్పిస్తామని పేర్కొన్నారు. 60 అడుగుల రోడ్లు, మేజర్ డ్రెయిన్లను ఏర్పాట చేయాల్సిన బాధ్యత లే అవుట్ వేసే వారిదే. ఇందుకు భిన్నంగా మున్సిపల్ అధికారులు ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్ముతో అధికార పార్టీకి చెందిన రియల్ఎ స్టేట్ వ్యాపారికి చెందిన లే అవుట్ లో కాలువ నిర్మిస్తున్నారు. విశేషమేమిటంటే అదే లే అవుట్‌కు అనుకుని మరో లే అవుట్ వ్యాపారి పక్కా రోడ్లు, కాలువలు, విద్యుత్ లైను ఏర్పాటు చేశారు. ఇక్కడ మాత్రం విరుద్ధంగా జరుగుతోంది. కనీస సదుపాయాలకు నోచని 18కి పైగా మురికివాడలు పట్టణంలోని 18కి పైగా మురికివాడల్లో కనీస సదుపాయాలు లేవు. రోడ్లు, కాలువలు ఏర్పాటు చేయాలని ఏళ్ల తరబడి ప్రజలు అడుగుతున్నా నిధుల కొరత ఉందని చెప్పి అధికారులు తప్పించుకుంటన్నారు. కొండవారిపేట, డ్రైవర్స్ కాలనీ, బ్రహ్మాల కాలనీ, సాయినగర్, వారదరపు పేట, రామకృష్ణా కాలనీ, ఇసుకలపేట, ఉప్పరగూడెం తదితర ప్రాంతాల్లో కచ్చా కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు తమ ప్రాంతాల్లో పరిస్ధితిని వివరించినా స్పందన లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తుల వ్యాపారానికి మేలు చేకూర్చేందుకు రూ.28 లక్షలను ధారపోయడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటి అనుచితాలు మాని, ప్రజాధనాన్ని ప్రజోపయోగానికే ఖర్చు పెట్టాలంటున్నారు. కాగా ఎగువ ప్రాంతంలో నీరు పోవడానికి దారి లేకపోవడంతో సదరు లే అవుట్ యజమానిని అభ్యర్థించి అటుగా కాలువను ప్రజల కోసం కాలువను నిర్మిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ ఎస్.వెంకటరమణ చెప్పారు. ఇందులో ఎవరి ఒత్తిళ్లూ లేవని, నిబంధనల ప్రకారం లే అవుట్ యజమాని రోడ్లు, కాలువలు నిర్మించాల్సే ఉంటుందని అన్నారు. -
ఉత్కంఠంగా ఖోఖో క్వార్టర్స్ ఫైనల్స్
తుని : స్థానిక శ్రీప్రకాష్‌లో జరుగుతున్న సీబీఎస్ఈ క్లస్టర్–7 అంతర్రాష్ట్రlఖోఖో పోటీలు ఉత్కంఠంగా జరుగుతన్నాయి. తెలంగాణా, ఆంధ్రాలకు చెందిన 350 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. మంగళవారం క్వార్టర్ ఫైనల్స్ నువ్వా నేనా అన్న రీతిలో జరిగాయి. క్వార్టర్స్‌లో విజ్ఞాస్ హైదరాబాద్, హార్వస్ట్ స్కూల్ ఖమ్మం , శ్రీ వివేకానంద స్కూల్ తెనాలి, బ్లూమింగ్ మైండ్స్ ఖమ్మం, కార్మెల్ స్కూల్ మంచిర్యాల, చిన్మయి స్కూల్ హైదరాబాదు, శుభ నికేతన కాకినాడ, శ్రీ ప్రకాష్ విద్యానికేతిన్ పాయకరావు పేట మధ్య పోటీ రసవత్తరంగా జరిగింది. సెమీ ఫైనల్స్‌కు శ్రీ ప్రకాష్ విద్యానికేతిన్, పాయకరావుపేట, హార్వస్ట్ స్కూల్ ఖమ్మం, కార్మెల్ స్కూల్ మంచిర్యాల, శ్రీవివేకానంద స్కూల్ తెనాలి జట్లు చేరుకున్నాయని ప్రిన్సిపాల్ ఎంవీఎస్ఎస్ మూర్తి తెలిపారు. ఫైనల్స్‌కు చేరిన జట్లు జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధిస్తాయని కన్వీనర్ పరేష్ కుమార్దాస్ తెలిపారు. స్పోర్ట్ప్ ఆథారిటీ పర్యవేక్షులు ఎం.వేంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని మూర్తి వివరించారు. -
వేలం కాదిది ముడుపుల మాయాజాలం
గాంధీ సత్రం షాపుల కేటాయింపులో గోల్మాల్ టీడీపీ నేతల అండతో దక్కించుకున్న పాత వ్యాపారులు 22 దుకాణాల దఖలుకు చేతులు మారిన రూ.లక్షలు తుని : సత్యమే ఆయుధమన్న వాడు, లక్ష్యమే కాదు.. దాన్ని సాధించే మార్గమూ స్వచ్ఛంగా ఉండాలన్న వాడు జాతిపిత గాంధీజీ. ఆయన పేరిట ఉన్న సత్రానికి సంబంధించిన దుకాణాల వేలంలోనే పారదర్శకతకు పాతరేశారు అధికార టీడీపీ నేతలు, అధికారులు. బుధవారం జరిగిన వేలం తంతును చూసి అనేకులు ‘ఔరా! మహాత్ముని పేరిట ఉన్న సత్రం మాటున ఎంత మకిలి!’ అని ముక్కున వేలేసుకున్నారు. దేవాదాయ ధర్మాధాయ శాఖ పరిధిలో ఉన్న స్థానిక గాంధీ సత్రానికి 66 దుకాణాలు ఉన్నాయి. వాటి లీజును మూడేళ్లకు ఒకసారి రెన్యువల్ చేయాల్సి ఉంది. కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం దుకాణాల్లో ఉన్న యజమానులను ఖాళీ చేయించి బహిరంగ వేలం వేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో దేవాదాయ శాఖ అధికారులు వేలం కం టెండర్‌కు ప్రకటన ఇచ్చారు. బుధవారం ఆ శాఖ ఇన్స్పెక్టర్ డి.సతీష్‌కుమార్ పర్య వేక్షణలో వేలం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఎప్పటి నుంచో ఆ దుకాణాల్లో తిష్టవేసిన వ్యాపారులు బహిరంగ వేలం వేస్తే బయటి వారు వచ్చి హెచ్చుపాటకు పాడతారని భయపడ్డారు. దీంతో అధికార పార్టీకి చెందిన నాయకులను ఆశ్రయించారు. దుకాణాలు వారి చేజారిపోకుండా ఉండేందుకు ఒక్కో షాపునకూ భారీ మొత్తంలో ముడుపులు చెల్లించేందుకు సంప్రదింపులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకు జరగాల్సిన వేలాన్ని అధికారులు కావాలనే ఆలస్యం చేశారు. లోపాయకారీ వ్యవహారాన్ని పసిగట్టిన మీడియా ప్రతినిధులు ఈఓ పులి నారాయణమూర్తిని ప్రశ్నించగా ఉదయం 9 గంటలకే వేల జరిగిపోయిందన్నారు. నోటీసులో 10 గంటలకు జరుగుతుందని ఉండగా ముందే ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించడంతో నీళ్లు నమిలారు. అయితే అందరూ బయటకు వెళ్లాక తమకు కావాల్సిన వ్యక్తులకు దుకాణాలు కేటాయించేలా వేలం తంతు నడిపించారు. పాత హక్కుదారుల బినామీలకే షాపులను కేటాయించేందుకు రూ.లక్షల్లో ముడుపులు చేతులు మారాయని సమాచారం. నిబంధనల మేరకే వేలం : ఈఓ కాగా 66 షాపుల్లో 22 షాపులకు వేలం నిర్వహించామని ఈఓ సాయంత్రం విలేకరులకు తెలిపారు. ప్రసుత్తం ఉన్న అద్దెపై 45 శాతం పెరిగిందన్నారు. ఇంకా 44 దుకాణాలకు వేలం వేయాల్సి ఉందన్నారు. నిబంధనల మేరకే వేలం నిర్వహించామని, ఎలాంటి అవకతవకలకూ తావు లేదని చెప్పారు. అయితే తెర వెనుక ముడుపులతో తంతులా జరిగిన వేలంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని, మిగిలిన దుకాణాలకు పారదర్శకంగా వేలం నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. -
అమరావతి పేరుతో దోపిడీ: పళ్లంరాజు
- కమీషన్ల కోసమే ప్యాకేజీలు తుని (తూర్పుగోదావరి జిల్లా) : అమరావతి రాజధాని పేరుతో టీడీపీ నేతలు దోపిడీ చేసేందుకు యత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి ప్యాకేజీ సాధించిన సీఎం చంద్రబాబు కమీషన్లు దండుకునేందుకే కల్లబొల్లి మాటలు వల్లిస్తున్నారని విమర్శించారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా తునిలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టరు సీహెచ్ పాండురంగారావు ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ చైతన్య యాత్ర సమావేశానికి హాజరైన పళ్లంరాజు బీజేపీ, టీడీపీలపై నిప్పులు చెరిగారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు కాకుండా రాష్ట్రానికి అదనంగా ఏమి తెచ్చారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. రైతులు బాగుంటే దేశం బాగుంటుందన్న విషయాన్ని విస్మరించారని తప్పు పట్టారు. సంక్షేమ పథకాలను జన్మభూమి కమిటీలకు అప్పగించి కార్యకర్తల జేబులు నింపుతున్నారని దుయ్యబట్టారు. కేంద్ర మాజీ మంత్రి, పార్టీ జిల్లా ఇన్చార్జి జేడీ శీలం మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా పుష్కరాల్లో వందల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ ఇవ్వాలని చేర్చిన విషయాన్ని బీజేపీ, టీడీపీ పక్కదారి పట్టించాయన్నారు. టీడీపీ ఎంపీలు ప్రధాని మోదీని ప్రశ్నించేందుకు భయపడుతున్నారన్నారు. ప్యాకేజీని హోదా తో ముడిపెట్టడం సరికాదన్నారు. 2019లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు ప్రత్యేక హోదాను ఇస్తామని చెప్పారు. పార్టీని గ్రామస్థాయి లో పటిష్టం చేసేందుకు తూర్పు సెంటిమెంట్‌తో తుని నుంచి చైతన్యయాత్రకు శ్రీకారం చుట్టామన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, పరిశీలకుడు పక్కాల సూరిబాబు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే రాజా నిర్బంధం
హైదరాబాద్ వెళ్లేందుకు అంగీకరించిన పోలీసులు విమానాశ్రయానికి తరలింపు తునిరూరల్ : ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత హైదరాబాద్ వెళ్లేందుకు అంగీకరించి మధురపూడి విమానాశ్రయానికి తరలించారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్.అన్నవరంలో స్వగృహం నుంచి బయలుదేరిన ఎమ్మెల్యే రాజాను పట్టణ సీఐ బి.అప్పారావు, ఎస్సై శంకరరావు, పోలీసులు వెంబడించి తునిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. దివీస్ ల్యాబ్ భూసేకరణకు వ్యతిరేకంగా ఆరవ తేదీన బాధితులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని అధికారేతర పార్టీల నాయకులు, సంఘాల వారు నిర్ణయించారు. దీంతో మంగళవారం అన్ని ప్రాంతాల నుంచి వచ్చే నాయకులను అడ్డుకునే క్రమంలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను నిర్బంధించేందుకు పోలీసులు యత్నించారు. దివీస్‌కు వ్యతిరేకంగా జరిగే సమావేశానికి వెళ్లనివ్వబోమని సీఐ అప్పారావు స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్‌లో జరిగే పార్టీ సమావేశానికి వెళతానని ఎమ్మెల్యే రాజా పోలీసులకు చెప్పారు. దివీస్‌కు వ్యతిరేకంగా జరిగే సమావేశానికి వెళతారన్న అనుమానంతో ఉన్న పోలీసులు హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతిస్తామని, విమానాశ్రయం వరకు తామే పంపిస్తామని ఎమ్మెల్యేకు చెప్పారు. ఇందుకు అంగీకరించడంతో ఎమ్మెల్యేను మధురపూడి విమానాశ్రయానికి పోలీసులు తరలించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ పాండురంగారావును తన ఆస్పత్రిలో నిర్బంధించారు. పంపాదిపేట సమీపంలో అదుపులోకి తీసుకున్న సీపీఐ (ఎం.ఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి బుగత బంగార్రాజు, తుని ఏరియా కార్యదర్శి కె.జనార్ధన్‌లను పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
ఒలింపియాడ్ పతకమే లక్ష్యం
చెస్ క్రీడాకారిణి ప్రత్యూష తుని : చెస్ ఒలింపియాడ్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని తునికి చెందిన చదరంగం క్రీడాకారిణి బి.ప్రత్యూష తెలిపారు. తుని రైల్వేస్టేçÙన్లో మంగళవారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడారు. వచ్చే నెల 2 నుంచి 14 వరకూ అజర్బైజాన్ దేశం బాకార్ పట్టణంలో నిర్వహించే అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీలకు వెళుతున్నట్టు వివరించారు. ఇండియా నుంచి ఐదుగురు క్రీడాకారిణులతో కూడిన జట్టు ఈ పోటీలకు వెళుతుందన్నారు. ఇందులో ఏపీ నుంచి తనతోపాటు ద్రోణవల్లి హారిక, ఢిల్లీకి చెందిన తానియా సత్యదేవ్, మహారాష్ట్ర నుంచి సౌమ్య స్వామినాథన్, ఒడిశాకు చెందిన పద్మినీ రీత్ ఉన్నారన్నారు. అజర్‌బైజా¯Œæకు బుధవారం బయలుదేరుతున్నట్టు ప్రత్యూష వివరించారు. ప్రస్తుతం 2,329 పాయింట్లతో ఉన్నానని, ఒలిపింయాడ్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది నవంబర్ 10 నుంచి 16 వరకూ కోల్‌కతాలో జరిగే వుమెన్–ఎ టోర్నమెంట్, డిసెంబర్ 2 నుంచి 14 వరకూ లండన్‌లో జరిగే క్లాసిక్ టోర్నీ, సెప్టెంబర్ 18 నుంచి 28 వరకూ ఖతార్‌లో జరిగే ఓపెన్ చెస్ టోర్నమెంట్లలో తాను పాల్గొంటున్నానని చెప్పారు. నవంబర్ నెలాఖరుకు మహిళా గ్రాండ్‌మాస్టర్ అవుతానని ప్రత్యూష వివరించారు. -
యనమల అధికార దుర్విని‘యోగం’
తమ్ముడి కోసం అడ్డగోలు జీవో ఏకంగా నాలుగు రెట్లు పెంచేసిన అద్దె మరీ అంత ‘పచ్చ’ పాతమా సాక్షిప్రతినిధి, తుని : ‘వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏంటీ’అనే సామెతను అక్షరాలా నిజం చేస్తున్నారు ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు. వరుసకు సోదరుడైన కృష్ణుడు కోసం ఏకంగా జీవోనే జారీ చేసి లాభాన్ని సమకూర్చారు మంత్రి వర్యులు. తమ్ముడి కోసం తుని నియోజకవర్గంతో ఉన్న 30 ఏళ్ల రాజకీయ అనుబంధాన్నే వదులుకున్నారాయన. చివరకు కుటుంబ సభ్యులను కూడా కాదని రాజకీయ వారసత్వాన్ని తమ్ముడు చేతుల్లో పెట్టారు. అదంతా వ్యక్తిగతం అనుకున్న నియోజకవర్గ ప్రజలకు తాజాగా తీసుకున్న నిర్ణయం ఆగ్రహం రప్పిస్తోంది. ఇంకా పూర్తికాకుండా నిర్మాణంలో ఉన్న తమ్ముడి భవనంలో తన శాఖకు చెందిన కార్యాలయాన్ని అద్దెకు కేటాయించడం విస్మయం కలిగిస్తోంది. వాణిజ్య పన్నులశాఖ ఆర్థిక మంత్రి యనమల చేతిలో ఉండటంతో ఈ ఆయాచిత లబ్థి చేకూర్చేందుకు తలపడడం అధికార దుర్వినియోగానికి పరాకాకష్టగా నిలుస్తోందరని పలువురు మండిపడుతున్నారు. తెరదీసింది ఇలా... వాణిజ్య పన్నులశాఖకు తునిలో సర్కిల్ కార్యాలయం రాణి సుభద్రయ్యమ్మపేటలో ఉంది. గత 30 ఏళ్లుగా కంకిపాటి రాములకు చెందిన భవనంలో ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయం నడుస్తోంది. వాణిజ్య పన్నులుశాఖ నెలకు రూ.12,000లు అద్దె చెల్లిస్తోంది. ఆరేళ్ల క్రితమే ఆ భవనాన్ని ఖాళీ చేయాలని భవన యజమాని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు లేఖలు రాశారు. అధికారులు ఖాళీ చేయకపోవడంతో భవన యజమాని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆ భవనాన్ని ఖాళీచేసి మరో భవనంలోకి మార్పు చేయాలని అధికారులు భావించారు. ఈ విషయం ఆనోటా, ఈనోటా మంత్రి సోదరుడు కృష్ణుడు దృష్టికి వెళ్లడంతో అన్నగారితో మంతనాలు జరిపి తనకు అనుకూలంగా మలుచుకున్నారు. అద్దెలోనూ హస్తలాఘవాలే... నిర్మాణం కూడా పూర్తికాని భవనంలో రెండు ఫ్లోర్లకు సంబంధించి 7వేల చదరపు గజాలను కార్యాలయం కోసం అద్దెకు తీసుకోవడానికి జీఓ విడుదల చేయించడంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. అందుకు నిర్థారించిన అద్దె కూడా ఆషామీషీగా లేదు. తన తమ్ముడే కదా అని యనమల ఉదారంగా ఇప్పుడున్న అద్దెకు నాలుగు రెట్లు ఎక్కువగా నిర్థారించడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. రూ.12000లు ఉన్న అద్దెను రూ.50 వేలు పైచిలుకు చెల్లించేలా జీఓ విడుదలవడం విస్మయం కలిగిస్తోంది. ఇప్పుడు కార్యాలయం నడుస్తోన్న భవనంలో 8 వేల చదరపు అడుగులకు నెలకు రూ.12 వేలు అద్దె చెల్లిస్తున్నారు. తాజా భవనంలో 7వేల చదరపు అడుగులకు నెలకు అద్దె రూ.50వేలు పైచిలుకుకు ఖాయం చేశారు. ఇప్పుడున్న స్థలం కంటే ఎక్కువగా విస్తీర్ణం ఉందా అంటే అదీ లేదు. ఈ బహుళ అంతస్తుల భవనం తుని పట్టణం శివారున ఉంది. భవనం నిర్మిస్తున్న ప్రాంతం సగం మున్సిపాలిటీ, సగం ఎస్. అన్నవరం పంచాయితీలో ఉంది. ప్రస్తుత కార్యాలయం నిర్వహిస్తున్న భవనం తుని పట్టణం మ«ధ్యలో అందరికీ అందుబాటులో ఉంది. అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం ప్రధాన కూడలిలో ఉన్న భవనాలకు ఎస్ఎఫ్టీ రూ.6 నుంచి రూ.7లు అద్దె ఉంది. పట్టణానికి శివారులో 1000 ఎస్ఎఫ్టి ఉన్న ప్లాటుకు రూ.5000 అద్దె పలుకుతోంది. ఈ లెక్కల ప్రకారం చూసినా ఏడు వేల చదరపు అడుగులకు రూ.35 వేలు సరిపోతుంది. అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట వాణిజ్యపన్నులశాఖ చేతిలో ఉందికదా అని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన సోదరుడికి ప్రయోజనం చేకూర్చేలా ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయం. రూ.12వేలు అద్దె ఉన్న కార్యాలయానికి పెద్దమొత్తంలో పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా? పట్టణ నడిబొడ్డున ఇప్పుడున్న అద్దెకు అనేక బిల్డింగ్లు ఇచ్చేందుకు అవకాశం ఉంది. కానీ పట్టణానికి శివారున నిర్మాణం కూడా పూర్తికాకుండానే తమ్ముడు భవనాన్ని అద్దెకు తీసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడం ఎంతవరకు న్యాయం. దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే, తుని -
కృష్ణద్వయం..కష్టకాలం
30 ఏళ్లలో తొలి తిరుగుబాటు అన్యాయం జరిగితే ఎవరినైనా సహించం తనవాళ్లనుకునేవాళ్లనుంచే తిరుగుబాటు కంసులుగా పోల్చి కన్నెర్ర చేసిన తెలుగు తమ్ముళ్లు అయోమయంలో యనమల సోదరులు అధికారమే అండగా చెలరేగిపోతే ... ఎవరు అడ్డు వస్తారంటూ అక్రమాలతో చక్రం తిప్పుతుంటే ... తమవారికి మేలు చేయడానికి నమ్మినవాళ్లనే నట్టేటా ముంచేస్తుంటే... సహనం కళ్లు తెరుచుకుంది... నిట్టనిలువునా మునుగుతున్నది తన బతుకేనన్న నిజం తెలుసుకున్నారు ... పిడికిలి బిగించారు ... ఇంకానా ఇకపై సాగదంటూ తిరుగుబావుటా ఎగురవేశారు ... కృష్ణులుగా భావించి కొలిస్తే కంసులుగా అవతారమెత్తి మమ్మల్ని హింసిస్తారా అంటూ ధ్వజమెత్తడంతో ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు కృష్ణల ఆటలకు చెక్ పడింది. మందుల పరిశ్రమ పేరుతో తుని నియోజకవర్గంలోని తాటియాకులపాలెంలో పేదల భూమలు కబ్జా చేయడానికి ఉపక్రమించంతో ఈ నిరసన ఘటన ఎదురవుతోంది. వివరాలు ఇలా... . సాక్షిప్రతినిధి, కాకినాడ : మంచి ముసుగులో ఎన్నాళ్లూ రాజకీయాలు నడప లేరు. ‘తన’ అనే పదంతో ఎంత తొక్కిపెట్టి ఉంచినా గూడుకట్టుకున్న వ్యతిరేకత ఎప్పుడో ఒకప్పుడు బద్దలవకమానదు. జిల్లాకు తూర్పున ఉన్న తునిలో ఇప్పుడదే జరుగుతోంది. మూడు దశాబ్థాలపాటు తుని రాజకీయాలను ఒంటిచేత్తో శాసించిన యనమల రామకృష్ణులు 30 ఏళ్లలో తొలిసారి తిరుగుబాటు ఎదుర్కొంటున్నారు. నిన్న, మొన్నటి వరకు తన వెంట తిరిగినవారే తిరగబడి శాపనార్థాలు పెడుతున్నారు. కడుపు మండితే ఎంతటి వారినైనా ధిక్కరిస్తారనేందుకు తుని నియోజకవర్గం తాటియాకులపాలెంలో తిరగ బడ్డ తమ్ముళ్లే తాజా ఉదాహరణ. టీడీపీ ఆవిర్భావం నుంచి మూడు దశాబ్థాలపాటు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకి తుని నియోజకవర్గం కంచుకోట. అటువంటి కోటకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బీటలువారిæవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో బద్దలై ఇప్పుడు పునాదులు కదిలిపోతున్నాయి. ఇంతకాలం రామకృష్ణుల వెన్నంటి నిలిచిన కోనబెల్ట్ గ్రామాలు ఒక్కటొక్కటిగా వారికి దూరమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడూ ఈ గ్రామాలే రామకృష్ణుడిని గట్టునపడేసేవి. నియోజకవర్గమంతా ఒక ఎత్తు అయితే ఈ గ్రామాల్లోనే ఐదారువేల మెజార్టీతో గెలిచేసేవారు. రామకృష్ణుడు ఇప్పటి వరకు అనేక పదవులు అధిష్టిస్తూ వస్తున్నారంటే పునాది ఆ గ్రామాలేనని నేతలు విశ్లేషిస్తుంటారు. ఆ నియోజకవర్గంలో 1989 నుంచి రామకృష్ణుని మాటకు 30 ఏళ్లపాటు తిరుగులేదు. కోనబెల్ట్ అంటే సుమారు 18వేల పై చిలుకు ఓటింగ్ ఉంటుంది. ఆ ఓటింగే అతనికి కంచుకోటగా ఉండేది. ఎన్నికల్లో ఏజంట్ కూడా లేని పరిస్థితి. అంత ఏకపక్షంగా ఓటింగ్ జరిగిపోయేది. 2005 నుంచి బీటలు ప్రారంభం... 2005లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు (తుని మున్సిపాలిటీలో 30 వార్డుల్లో) జెడ్పీటీసీలు, ఎంపీపీలు..ఇలా దాదాపు అన్ని చోట్లా దివంగత వైఎస్ ఛరిష్మాతో యనమల కోటరీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తరువాత 2009 సార్వత్రిక ఎన్నికల్లో 30 ఏళ్ల రాజకీయ ప్రస్తానంలో తొలిసారి రామకృష్ణుడు ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అశోక్‌బాబు చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచే రామకృష్ణుల రాజకీయ తిరోగమనం మొదలైంది. ఆ ఓటమితో తేరుకోలేక ప్రత్యక్ష ఎన్నికలకే గుడ్‌బై చెప్పేశారు. తన రాజకీయ వారసుడిగా వరుసకు సోదరుడైన కృష్ణుడిని 2014 ఎన్నికల బరిలోకి దింపినా ఓటమే ఆహ్వానించింది. రామకృష్ణుడు కంటే రెట్టింపు ఓట్ల తేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల్లో పోటీచేసిన దాడిశెట్టి రాజా ఓడించారు. 13 గ్రామాలు ఒక్కటై... తొండంగి మండలం దానవాయిపేట పంచాయతీలో యనమలకు నూటికి నూరుశాతం వెన్నంటి ఉండే గ్రామం తాటియాకులపాలెం. అటువంటి గ్రామమే రామకృష్ణులపై తాజాగా తిరుగుబాటు జెండా ఎగరేయడానికి వేదికగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. సుమారు 13 గ్రామాలు ఒక్కటై దివీస్ లేబొరేటరీస్‌కు భూ సేకరణ, ఇందుకు సహకరిస్తున్నారంటూ యనమల సోదరులపై తిరుగుబాటుకు నాందిపలికారు. ఆ గ్రామాల నుంచి పిల్లాపాపలతో వందలాది మంది మహిళలు తరలివచ్చి ధిక్కారస్వరాన్ని వినిపించారు. రామకృష్ణులు ఎదురుపడితే పక్కకు తప్పుకున్న ఆ గ్రామస్తులు ఒక్కటై తమ భూములు జోలికొస్తే ఖబడ్ధార్ అంటూ హెచ్చరించారంటే వారిలో ఇన్నేళ్లుగా కూడుగట్టుకున్న ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్టుగా స్పష్టమవుతోంది. తాజా వ్యతిరేకతకు భూ సేకరణ అంశం ఒకటే పైకి కన్పిపిస్తున్నా అంతర్లీనంగా రామకృష్ణుల అనుచరుల ఏకపక్ష విధానాలు కూడా తోడవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే తునిలో టీడీపీ చిరునామా గల్లంతవుతుందని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. -
అక్కడ అ అంటే అవినీతి
ఇటు పాయకరావుపేట.. అటు తుని.. మధ్యలో తాండవ వంతెన. జిల్లాలు వేరైనా.. దాన్నే వారధిగా చేసుకుని ఈ రెండూ సామాజికంగా, సాంస్కతికంగా జంట పట్టణాలుగా అనుబంధాన్ని పెనవేసుకున్నాయి. ఆ అనుబంధం అక్కడితో ఆగలేదు.. రెండు నియోజకవర్గాలస్థాయికి విస్తరించింది.. పెడదారి పట్టింది. మునుపెన్నడూ లేని విధంగా గత రెండేళ్లలో అవినీతి, అక్రమాలు జంట నియోజకవర్గాలను అక్టోపస్‌లా కబళించాయి. అధికార దన్నుతో అడ్డగోలు వసూళ్లు, ఇసుక దోపిడీ, భూ దందాలు, దురాక్రమణలు, మద్యం షాపుల నుంచి నెలవారీ మామూళ్లు, సెటిల్మెంట్లు, ఇష్టారాజ్యంగా ప్రభుత్వోద్యోగుల బదిలీలు.. అబ్బో.. ఇంకా చెప్పాలంటే.. ప్రతి పనిలోనూ కాసుల వేటతో పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. సరే.. తూర్పుగోదావరి జిల్లా తునిలో అవినీతి తుట్టె గురించి మనకెందుకు గానీ.. మన విశాఖ జిల్లా పాయకరావుపేటలో రెండేళ్లుగా ఏం జరుగుతుందో చూస్తే.. ఎవరికైనా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అర్ధంతరంగా అందిన అధికారం, నడమంత్రపు సిరి, దానికితోడు తలబిరుసుతో చెలరేగిపోతున్న ఓ పచ్చ నేత పైత్యం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. మనం చిన్నప్పుడు అ అంటే అమ్మ.. ఆ అంటే ఆవు అని చదువుకున్నాం. కానీ అక్కడ మాత్రం ఇప్పుడు అ అంటే అవినీతి,. ఆ అంటే ఆనకట్ట లేని అక్రమాలు అంటూ కొత్త నిర్వచనాలు చెబుతున్నారు. అ.. ఆ..లకు వారెలా కొత్తగా నిర్వచించారో.. ఈ వారం విశాఖ తీరంలో తెలుసకుందాం.. రండి.. –జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన దరిమిలా ఆ పదేళ్ల ఆకలిని తీర్చుకునేందుకు ఈ రెండేళ్ల కాలంలోనే తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అందినకాడికి ఆబగా దోచేశారు. ప్రతి పనిలోనూ కాసులు వెతుక్కుంటూ రూ.కోట్లు కూడగట్టేశారు. పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ నాయకులకు ఇందులో మినహాయింపేమీ లేదు. అయితే ప్రత్యేకించి ఓ టీడీపీ నేత వ్యవహారశైలి మాత్రం ఆ పార్టీ శ్రేణులకే మింగుడుపడటం లేదు. అడ్డగోలుగా రూ.కోట్లు కూడగడుతూనే అధికారులను, ఉద్యోగులను, పార్టీ కార్యకర్తలను ఏ మాత్రం లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న తీరు అందరికీ ఏవగింపు కలిగిస్తోంది. మండలాలు, గ్రామాల వారీగా దళారులను ఏర్పాటు చేసుకుని దందాలు చేయడం సదరు నేత ప్రత్యేకత. చిన్న పనికి కూడా రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతుంటారు. ఉద్యోగుల బదిలీలు మొదలుకొని అంగన్వాడీ కార్యకర్తలు, చివరికి ఆయాల నియామకాలకూ డబ్బులు ముట్టజ్పెపాల్సిందే. –ఎస్.రాయవరం మండలంలో ఇటీవల అంగన్వాడీ కార్యకర్తలు సదరు నేత పుట్టిన రోజు పురస్కరించుకుని తలో కొంత వేసుకుని బంగారం కొనుగోలు చేసి గిప్ట్గా ఇచ్చారు. అంతే.. అప్పటివరకు వేధింపులతో అల్లాడిపోయిన వారికి గిప్ట్ ఇచ్చిన తర్వాత ఒకింత ఉపశమనం లభించింది. – మద్యం షాపులవారు ఎంతో కొంత ఇవ్వాల్సిందేనన్న ఆ నేత ఒత్తిళ్లకు ఇటీవలే వ్యాపారులు తలొగ్గారు. గత నెల తలో యాభై వేల పోగేసి మొత్తం రూ.16 లక్షలు సమర్పించుకున్నారని అంటున్నారు. ఇలా ప్రతి నెలా ఇవ్వాలంటే మాత్రం సాధ్యం కాదని తెగేసి చెప్పేశారు. అయితే ఎంతోకొంత ఇవ్వకుంటే అధికారం తలకెక్కిన ఆ నేత పగబట్టి ఏం చేస్తారోనన్న ఆందోళన కూడా మద్యం వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది. అందుకే మద్యం సిండికేట్లు ఎంఆర్పీని పట్టించుకోకుండా ఇష్టమొచ్చిన ధరలకు మద్యం విక్రయాలు చేసేస్తున్నారు. గ్రామాల్లో బెల్టుషాపులూ రెట్టింపయ్యాయి. ఇసకాసుర అవతారం తాండవ, వరహా నదులను చెర పట్టిస్తూ అడ్డగోలుగా చేస్తున్న ఇసుక దోపిడీ ఆయా ప్రాంతాల్లో పరాకాష్టకు చేరింది. పందూరు ఇసుక రీచ్‌ను గ్రామస్తులు వేలం పాడుకుంటే వారి నుంచి రూ.3 లక్షలు, గొట్టివాడ రీచ్ నుంచి రూ.5 లక్షలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఎయిర్‡పోర్టు, అచ్యుతాపురం ప్రాంతాలకు ఇసుక తరలింపు విషయంలోనూ భారీగా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఆ నేత అండదండలతోనే నిత్యం ఈ రెండు నదుల్లో వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అక్రమంగా తరలిపోతోందనేది అక్కడ బహిరంగ రహస్యం. ఇసుక దోపిడీ విషయంలో టీడీపీకే చెందిన తుని నాయకుడితో సదరు నేతకు చాన్నాళ్లు విభేదాలు నడిచాయి. ఎట్టకేలకు ఇటీవల ఇరు జిల్లాల పార్టీ పెద్దలు రాజీ కుదిర్చిన నేపథ్యంలో వివాదాలు లేకుండా ఎవరికి అందినంత వారు దోచేసుకుంటున్నారు. ప్రతి పనికీ ఓ లెక్కుంది.. దానికో రేటుంది జాబు రావాలంటే బాబు రావాల్సిందే.. ఎన్నికల ముందు ఇదే టీడీపీ నినాదం. కానీ పాయకరావుపేటలో ఇప్పుడు ఆ నినాదం.. ‘జాబు రావాలంటే జేబు నిండాల్సిందే’ అన్నట్లు మారిపోయింది. కె.వెంకటాపురం, పాములవాక, కోటవురట్లలోని విద్యుత్ సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల ఉద్యోగాలకు ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల డిమాండ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయంలో టీచర్ల పోస్టులకు రూ.30 వేలు చొప్పున డిమాండ్ చేశారన్న వాదనలు ఉన్నాయి. నీరు చెట్టు పథకం ద్వారా నియోజకవర్గానికి మంజూరైన కోట్లాది రూపాయల నిధుల్లో కమీషన్లు ఇవ్వాలంటూ అదే పనిగా అధికారులు, కాంట్రాక్టర్ల వెంట పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ పధకం ద్వారా మంజూరైన పనులను కమీషన్లు ఇచ్చినవారికే కేటాయించారని చెబుతున్నారు. రెవెన్యూ కార్యాలయం నుంచి నెలవారీ మామూళ్లు ఇవ్వనందుకు.. పైగా ఈ విషయం బయట ప్రచారం చేసినందుకు ఓ తహశీల్దార్, పలువురు వీఆర్వోలు అర్ధంతరంగా బదిలీ అయ్యారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు ఎన్నాళ్లుగానో నియోజకవర్గంలోనే పాతుకుపోయిన ఓ డిఫ్యూటీ తహశీల్దార్ నుంచి రెండు లక్షలు తీసుకుని ఆయన బదలీని అడ్డుకున్నారన్న ఆరోపణలున్నాయి. హడలెత్తిపోతున్న మహిళా అధికారులు అధికారంలో ఉన్న నాయకులు ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నారంటే ఉద్యోగులు ఒకింత భయభక్తులతోనే ఉంటారు. కానీ సదరు నేత వస్తే మాత్రం ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడే ఆ నేత తీరుతో అల్లాడిపోతున్నారు. ఆ మధ్య పాయకరావుపేటలోని ఎండీవో కార్యాలయానికి ఆ నేత వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో ఏజెన్సీ ప్రాంతం నుంచి బదిలీపై వచ్చిన పంచాయతీరాజ్ మహిళా ఉద్యోగి సంతకాలు చేసే హడావుడిలో ఆ నేత రాకను గమనించలేదు. అంతే.. ‘నేనొచ్చినా పట్టించుకోవా.. నీసంగతి చూస్తా.. మళ్లీ నిన్ను కొండలెక్కించేస్తా’ అని వీరంగం వేసేశారట. ఇక నక్కపల్లి ఐసీడీఎస్ మహిళా అధికారిని సైతం ఇదేవిధంగా వేధింపులకు గురిచేశారని అంటున్నారు. అంగన్వాడీ కార్యకర్తల ఎంపిక మొత్తం తనకు చెప్పి చేయాలని నేత హుకుం జారీ చేశారు. అది సాధ్యం కాదని, జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీల ద్వారా ఎంపిక చేస్తారని చెప్పినప్పటికీ వినిపించుకోకుండా ఆ మహిళా అధికారిపై నోరుపారేసుకున్నారని అంటున్నారు. ఎస్.రాయవరం మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడికి నక్కపల్లి మండలంలో లేని భూమిని ఉన్నట్టుగా చూపించి రికార్డులు తయారు చేయాల్సిందిగా ఆ నేత అధికారులపై ఒత్తిడి చేశారు. అలా కుదరదన్న అధికారులపై ఇష్టమొచ్చినట్లు నోరుపారేసుకున్నారట. భూ సేకరణలోనూ కాసుల వేట నక్కపల్లి మండలంలో జరుగుతున్న భూసేకరణలో సదరు నేత నోట్ల కట్టలు దండుకున్నారన్న ఆరోపణలున్నాయి. రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ భూములను పార్టీ కార్యకర్తల పేరిట మార్చడం, ఆపై పరిహారం నొక్కేయడం అక్కడ తంతుగా మారింది. సదరు నేత బినామీ ఒకరు నక్కపల్లి మండలం సీతంపాలెం సర్వే నెం 1లో ఉన్న 240 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేశారు. ఆ భూమిని ప్రభుత్వ పెద్దలకు ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ భూమిని ఎన్నాళ్ల నుంచో సాగుచేస్తున్న రైతులకు డబ్బు ఆశ చూపి కొనుగోళ్లకు బేరం పెట్టారు. ఒక్కో రైతుకు రూ.50 వేలు చొప్పున అడ్వాన్స్ కూడా చెల్లించారు. అడ్వాన్సులు ఇచ్చిన రైతులకు డీఫారం పట్టాలు మంజూరు చేయాలని మండలస్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. పట్టాలు వచ్చిన తర్వాత రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు పక్కా ఆధారాలు ఉంటాయని భావించారు. అయితే సరిగ్గా ఇక్కడే కథ అడ్డం తిరిగింది. పట్టాలు ఇవ్వలేమని ఓ తహశీల్దార్ అడ్డం తిరిగారు. అంతే ఆ అధికారిని బదిలీ చేయించిన సదరు నేత ఇప్పటికీ ఆ భూముల విక్రయాల కథను కొలిక్కి తీసుకురాలేకపోయారు. కానీ ఆ భూముల పేరిట పెద్దమొత్తంలో డబ్బులు కూడబెట్టుకున్నారన్న వాదనలు ఉన్నాయి. ఇక కౌలురైతులుగా సదరు నేత అనుచరులు లేని భూమి ఉన్నట్టుగా రుణాలు పొందారన్న ఆరోపణలపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. అవినీతిపై ప్రశ్నించిన వారిని, అడ్డగోలు దందాలకు అడ్డొచ్చిన వారిని కులం పేరిట బెదిరించడం, నానాయాగీ చేయడం అక్కడ నిత్యకత్యంగా మారింది. ఈ దందాలన్నీ సరిపోలేదో.. లేక తన స్థాయి పెరిగిందన్న భ్రమల్లో ఉన్నారో గానీ.. క్యాబినెట్ హోదా పదవి కోసం ఆ నేత కొన్నాళ్లుగా పాకులాడుతున్నారు.. అటువంటి పదవి వచ్చేస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. అధికార మత్తులో తూగుతున్న సదరు నేతకు మూడేళ్ల తర్వాత పరిస్థితేమిటన్నదే ఇప్పుడు అక్కడ అందరి నోళ్లలో నానుతున్న చర్చ. -
తుని ఘటన కేసులో 8మంది బెయిల్ పై విడుదల
తుని(తూ.గో): తుని ఘటన కేసులో రాజమండ్రి జైలు నుంచి 8 మంది బెయిల్ పై విడుదలయ్యారు. బెయిల్ పత్రాలు సరిగా లేవని ఒకరిని అధికారులు విడుదల చేయలేదు. బెయిల్ పై విడుదలైన మరొకరిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుని ఘటన కేసులో 10 మందికి పిఠాపురం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో ముగ్గురి బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది. జనవరి 31న ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో కాపుఐక్యగర్జన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ రోజు తునిలో చోటుచేసుకున్న సంఘటనలపై 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలనే డిమాండ్‌తో ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారానికి పదో రోజుకు చేరింది. -
తుని ఘటనలో నలుగురికి బెయిల్
తుని(తూ.గో):తుని ఘటనలో అరెస్టయిన వారిలో నలుగురికి పిఠాపురం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. పుల్లయ్య, సత్తిబాబు, లగుడు నివాస్, పల్ల హరిబాబులకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జనవరి 31న ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో కాపుఐక్యగర్జన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ రోజు తునిలో చోటుచేసుకున్న సంఘటనలపై 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలనే డిమాండ్‌తో ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారానికి తొమ్మిదో రోజుకు చేరింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తోంది. ముద్రగడ మాత్రం వైద్యం చేయించుకునేందుకు నిరాకరిస్తున్నారు. -
అమలాపురం పీఎస్ వద్ద ముద్రగడ బైఠాయింపు
అమలాపురం: అమలాపురం: కాపు ఉద్యమ ఘటనలో సీఐడీ అరెస్ట్‌లకు దిగింది. తుని ఘటనకు సంబంధించి అమలాపురం, తునిలో అరెస్టు పది మందిని అరెస్టు చేశారు. వారిని కొద్దిసేపట్లో కాకినాడ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు. ఈ అరెస్ట్‌లను నిరసిస్తూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మంగళవారం అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. కేసుల పేరుతో అమాయకుల్ని అరెస్ట్‌లు చేస్తే సహించేది లేదని, కావాలంటే తనను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసినవారిని విడుదల చేసేవరకూ ఆందోళన విరమించేది లేదని ముద్రగడ స్పష్టం చేశారు. ఇదే విషయంపై డీఎస్పీతో ఆయన వాగ్వాదానికి దిగారు. అరెస్ట్ చేసినవారిని ఎక్కడికి తీసుకువెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనను అరెస్ట్ చేసి కోర్టుకు పంపాలని అన్నారు. కాపు ఉద్యమానికి కర్త, కర్మ అన్ని తాననేని అన్నారు. కార్యకర్తలను కాదని, ముందుగా నాయకుల్ని అరెస్ట్ చేయాలని ముద్రగడ సూచించారు. తమను అరెస్ట్ చేసేవరకూ అక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించారు. అయితే ఈ కేసు తమ పరిధిలో లేదని, రైల్వే పరిధిలో ఉందని డీఎస్పీ తెలిపారు. కాగా కేసు మీ పరిధిలో లేనప్పుడు అరెస్ట్‌లు ఎలా చేశారని ముద్రగడ ఈ సందర్భంగా ప్రశ్నించారు. మరోవైపు అమలాపురంలో 14చోట్ల పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ దామోదర్ నేతృత్వంలో కోనసీమలో పోలీసులు మోహరించారు. -
అవినీతిని ప్రశ్నిస్తే అంతేసంగతులు
తుని : ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించిన ఓ వ్యక్తిపై నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గతంలో పలువురు వైఎస్సార్సీపీకి నాయకులపైనా కేసులు బనాయించిన విషయం తెలిసిందే. తాజాగా తుని మండలం టి.తిమ్మాపురం గ్రామానికి చెందిన పోల్నాటి ప్రసాదరావును కేసులో ఇరికించారు. ప్రసాదరావు కథనం ప్రకారం.. ఉపాధి హామీ పథకంలో గతేడాది చేసిన పనులు, పని చే సిన కూలీల వివరాలను ఇవ్వాలని బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రసాదరావు లిఖితపూర్వకంగా ఎంపీడీఓ కె.భీమేశ్వర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై వివరాలను అందిస్తామని అధికారులు చెప్పడంతో తన గ్రామానికి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం పట్టణ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుళ్లు తిమ్మాపురం వెళ్లి ప్రసాదరావును తీసుకువచ్చారు. ‘తనను ఎందుకు తనను తీసుకువచ్చారు’’ అని ప్రసాదరావు పోలీసులను ప్రశ్నించాడు. ‘మీపై ఉపాధి హామీ పథకం టెక్నికల్ సిబ్బంది ఫిర్యాదు చేశారు’’ అని చెప్పిన పోలీసులు సాయంత్రం వరకు అతడిని స్టేషన్లో ఉంచి కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. అవినీతిని ప్రశ్నించినందుకే.. గతేడాది గ్రామంలో జరిగిన ఉపాధి పనికి తాను వెళ్లకపోయినా పని చేసినట్టు నమోదు చేశారని, ఇందుకు సంబంధించిన పేసిప్పులు పంపారని, పని చేయకపోయినా ఎందుకు తన పేరును నమోదు చేశారని అధికారులను నిలదీయడంతో తనపై అక్రమ కేసు బనాయించారని ప్రసాదరావు తెలిపారు. తప్పుడు సర్వే నంబర్లతో అధికార పార్టీ వ్యక్తులు కొందరు కొబ్బరి మొక్కలు వేసినట్టు రికార్డుల్లో నమోదు చేసి సొమ్మును స్వాహా చేశారన్నారు. ఒక్క తిమ్మాపురంలోనే సుమారు రూ. 50 లక్షల మేర ఉపాధి సొమ్మును వారు దిగమింగారన్నారు. ఈ పనుల వివరాలను అడిగినందుకే కేసు పెట్టారని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. ప్రసాదరావు ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న ఉపాధి హామీ పథకం సెక్షన్‌కు వెళ్లి విధి నిర్వహణలో ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ సాయిని దుర్భాషలాడి, రూ.50 వేలు డిమాండ్ చేసినట్టు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పట్టణ సీఐ బోను అప్పారావు తెలిపారు. అయితే కేసు పెట్టిన టెక్నికల్ అసిస్టెంట్ సాయి ఎవరో ప్రసాదరావు తెలియక పోవడం ఇక్కడ విశేషం. -
అమ్మకానికి ‘రత్నాచల్’ బోగీ
విజయవాడ: తూర్పుగోదావరి జిల్లా తునిలో దగ్ధమైన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోగీలను పాత ఇనుముగా విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఈ టెండర్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారులు పిలిచారు. మొత్తం 17 బోగీలను వేలం ద్వారా విక్రయిస్తున్నారు. ఎక్కువ ధరకు టెండర్ వేసిన వారికి ఖరారు చేస్తామని విజయవాడ డివిజన్ అధికారులు చెబుతున్నారు. జనవరి 30న తునిలో కాపుగర్జన సందర్భంగా రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను దహనం చేసిన విషయం విదితమే. ఘటన జరిగిన తర్వాత ఈ బోగీలను తుని స్టేషన్‌కు తరలించి ఇటీవలే విజయవాడ తీసుకొచ్చి వేలం నిర్వహిస్తున్నారు. -
5.08 కిలోల బరువుతో శిశువు జననం
తుని: తూర్పు గోదావరి జిల్లా తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో 5.08 కిలోల బరువుతో శిశువు జన్మించాడు. తుని మండలం ఎస్.అన్నవరం గ్రామానికి చెందిన హరిప్రసాద్, సత్య దంపతులకు తొలి సంతానంగా ఈ బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ 5.08 కిలోల బరువు ఉండడంతో వైద్యులు ఆశ్యర్యపోయారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని, అయినప్పటికీ 72 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతామని తెలిపారు. -
10న నారావారిపల్లెలో 'మహా సంగ్రామం'
భామిని(శ్రీకాకుళం): మాదిగలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విస్మరించారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా భామినిలో బుధవారం జరిగిన జిల్లాస్థాయి ఎమ్మార్పీఎస్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు, పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీల మేరకు ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీని కోసం మాదిగలు, ఇతర ఉపకులాలు తరలి రావాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ హామీని గాలికొదిలినందుకు నిరసనగా ఈనెల10న చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెని ముట్టడిస్తామని మంద కృష్ణమాదిగ తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు తరలిరావాలన్నారు. ఏప్రిల్10న మహాసంగ్రామం ఉద్యమం చేపడతామన్నారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాల పేరిట చేసే బెదిరింపులను బేఖాతరు చేయాలన్నారు. తునిలో కాపుల ఉద్యమంలో కోట్లాది రూపాయిల ప్రభుత్వ ఆస్తులు, ప్రజా ఆస్తులు ధ్వంసమయ్యాయని అలాగే 50 వరకూ కేసులు నమోదు చేసినా ఏ ఒక్కరీని అరెస్టు చేయలేదన్నారు. శాంతియుతంగా మాదిగలు చేస్తున్న ఉద్యమాన్ని అడ్డుకోవాలని చూడటం తగదన్నారు. -
ఎస్సీలను విస్మరిస్తే తుని ఘటన పునరావృతం
అధికారం, అగ్రకుల మైకంలో చంద్రబాబు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్రబాబు కురబలకోట : ఎస్సీ వర్గీకరణను విస్మరిస్తే తుని తరహాలో ఘటనలు పునరావృతమవుతాయని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్.నరేంద్రబాబు హెచ్చరించారు. కురబలకోట మండలంలోని అంగళ్లులో గురువారం జరిగిన ఎమ్మార్పీఎస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు కమిషన్లు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రిపోర్టులు ఇచ్చినా న్యాయం చేయలేదన్నారు. అలాంటిది చంద్రబాబు మంజునాథ కమిషన్ పేరుతో కాపులకేం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. వడ్డెర, వాల్మీకి, రజక కులాలవారిని ఎస్టీల్లో చేరుస్తానని హామీ ఇచ్చినా అతీగతీ లేదన్నారు. అందర్నీ నమ్మించడం, అధికారం చేపట్టాక వంచించడం ఆయన నైజంగా మారిందన్నారు. దళితులను కించపరుస్తూ మాట్లాడిన చంద్రబాబు క్షమాపణ చెప్పకపోతే ఆయన రాజకీయ జీవితానికి సమాధి కడతామని హెచ్చరించారు. -
ఆధారాలు సేకరించి కేసులు నమోదు చేయండి
రాజమహేంద్రవరం క్రైం : తునిలో కాపు ఐక్య గర్జన సందర్భంగా జరిగిన పరిణామాలు, వాటికి బాధ్యులపై నమోదు చేయవలసిన కేసులపై డీజీపీ రాముడు పోలీస్ ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజమహేంద్రవరం పోలీస్ గెస్ట్ హౌస్‌లో నాలుగు గంటల పాటు జరిపిన ఈ సమీక్షలో పోలీస్ ఉన్నతాధికారుల నుంచి డీజీపీ పలు వివరాలు సేకరించారు. తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ తగలబెట్టిన వారి గుర్తింపు, తుని రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీస్ జీప్‌లు, బైక్‌లు తగల బెట్టినవారిపై కేసుల నమోదు గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సంఘటనలకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించి, బాధ్యులపై కేసులు నమోదు చెయ్యాలని ఆదేశించారు. అందుకోసం ప్రత్యేకమైన ఈ మెయిల్ అడ్రస్, వాట్సప్ ఏర్పాటు చేసి బయట నుంచి కూడా ఆధారాలు సేకరించాలని సలహా ఇచ్చారు. అనంతరం కోస్టల్ ఐజీ కుమార్ విశ్వజిత్ వాట్సప్ నంబరు 9440904859 , ఈ మెయిల్ అడ్రస్ తుని మీటింగ్ ఎట్ రైట్ ఆఫ్ జి మెయిల్ డాట్ కామ్ పేరుతో ఏర్పాటు చేశామని, వీటికి ఫొటోలు, వీడియోలు కూడా పంపించవచ్చునని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.డీజీపీని కలిసిన గాయపడ్డ పోలీసుల కాపు ఐక్య గర్జన సందర్భంగా పోలీసులపై దాడి చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దాడిలో గాయపడిన పోలీసులు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. గాయాలపాలైన 30 మంది పోలీసులు రాజమహేంద్రవరం పోలీస్ గెస్ట్ హౌస్‌లో డీజీపీని కలసి తమపై ఏవిధంగా దాడి జరిగిందీ వివరించారు. ఈ సందర్భంగా డీజీపీ రాము డు వారి నుంచి కూడా తుని సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గా యాలపాలైన పోలీసులకు వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. విధ్వంసంలో వాహనాలు కోల్పోయిన వారికి కొత్త వాహనాలు ఇస్తామన్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని బాధిత పోలీసులకు హామీ ఇచ్చారు. కాపు ఐక్య గర్జన సంఘటన వివరాలు, ఆధారాలు పడద్భందీగా సేకరించాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఐదో తేదీ నుంచి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరహార దీక్ష చేపడుతున్నందున ఎలాం టిఆవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై డీజీపీ రాముడు చర్చించారు. అవసరమైతే ఆదనపు బలగాలు రప్చిం చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆడిషనల్ డీజీ ఆర్.పి. ఠాకూర్, ద్వారకా తిరుమలరావు, సూరి కుమార్, ఎస్పీ రవిప్రకాశ్, అర్భన్ ఎస్పీ ఎస్. హరికృష్ణ పాల్గొన్నార -
దోషులని తేలితే మేమే ఆహుతవుతాం
అమలాపురం టౌన్: తుని కాపు ఐక్య గర్జన సందర్భంగా జరిగిన విధ్వంసంలో కాపు నేతల ప్రమేయం, పాత్ర ఉన్నట్టు రుజువైతే దోషులుగా చట్టం శిక్షించనవసరం లేకుండా తమకు తామే ఆత్మాహుతై స్వీయ శిక్షలు విధించుకుంటామని కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు స్పష్టం చేశారు. కాపు నేత, అమలాపురానికి చెందిన దివంగత నల్లా సూర్య చంద్రరావు స్వగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, ఉపాధ్యక్షుడు బీఎల్ నరసింహారావు (ఏలూరు), రాష్ట్ర కాపు ఐక్య సంఘటన కన్వీనర్ ఇమ్మిడి సత్యనారాయణ (చిలకలూరుపేట) మాట్లాడారు. తుని విధ్వంసంలో అసాంఘిక శక్తులెవరో ప్రభుత్వమే తమ విచారణలో గుర్తించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ, అప్పుడే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో టీడీపీకి చెందిన కాపు నాయకులతో సమావేశం నిర్వహించి కాపు ఉద్యమం, డిమాండ్లపై చర్చించామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మొన్నటి వరకు కాపు ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న, తుని సభకు అడ్డంకులు సృష్టించిన వారితో మాట్లాడి కాపు నాయకులతో మాట్లాడానని చెప్పుకోవడం చంద్రబాబుకు సరికాదన్నారు. టీడీపీ కాపు నేతలతో కాకుండా, కాపు ఉద్యమాన్ని నడిపిస్తున్న నాయకులతో ఆయన మాట్లాడితే సమస్యకు మూలం తెలిసి పరిష్కారం లభిస్తుందని సూచించారు. ఎక్కడికక్కడ శాంతియుతంగానే దీక్షలు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలోని తన ఇంటి వద్ద శుక్రవారం నుంచి చేపడుతున్న ఆమరణ దీక్షకు మద్దతుగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడికక్కడ కాపు నాయకులు శాంతియుతంటా ఆమరణ దీక్షలు చేపట్టనున్నారని వారు చెప్పారు. దీక్షల కోసం కాపులు మళ్లీ రోడ్లపైకి ఎక్కితే అసాంఘిక శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల కాపులు నివసించే వీధుల్లో ఒక కూడలి వద్ద లేదా ఆలయాల వద్ద ఆమరణ దీక్షలకు దిగుతామని చెప్పారు. కొందరు కాపులు ఉమ్మడిగా తమ ఇళ్ల వద్దే దీక్షలు చేపట్టేలా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారన్నారు. విలేకరుల సమావేశంలో కాపు నాయకులు నల్లా పవన్, రంకిరెడ్డి రామలింగేశ్వరరావు, దివంగత కాపు ఉద్యమ నేత నల్లా సూర్యచంద్రరావు తనయులు నల్లా అజయ్, సంజయ్ పాల్గొన్నారు. -
నివురుగప్పిన నిప్పులా.. తూర్పు
-
రాజకీయాలు ఆపాదించకండి
తుని : కాపులను బీసీల జాబితాలో చేర్చాలని మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమం స్వచ్ఛమైనదని, దీనికి రాజకీయాలు అపాదించరాదని కాకినాడసిటీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అన్నారు. కాకినాడ మాజీ కార్పొరేటర్లు, బీసీ, ఎస్సీ, మైనారిటీ నాయకులతో కలసి చంద్రశేఖర రెడ్డి ర్యాలీగా తుని మండలం వి.కొత్తూరు కాపు ఐక్యగర్జన సభాస్థలికి వచ్చారు. ముద్రగడను కలిసి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. విలేకరులతో మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేరిస్తే మిగిలిన వారికి నష్టం ఉండదని, ఎందుకంటే రిజర్వేషన్ శాతాన్ని పెంపుదల చేస్తారన్నారు.‘‘కులాలకు అతీతంగా మేమంతా వచ్చాం. పార్టీ పరంగా నేను ఇక్కడకు రాలేదు. ముద్రగడ కుటుంబంతో మా కుటుంబానికి ఉన్న స్నేహం వల్ల వచ్చాను’’ అని చెప్పారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి ఆశోక్, ప్రచార కమిటీ రాష్ట్ర కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్, అల్లు రాజబాబు పాల్గొన్నారు. -
'కాపుల పోరాటానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు'
కాకినాడ: ఎన్నికల ముందు కాపులకు ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే నెరవేర్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన తునిలో కాపు గర్జన వేదిక వద్ద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను కలిశారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ... కాపులు చేస్తున్న పోరాటానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. చంద్రబాబు అధికారం చేపట్టి 20 నెలలు దాటుతున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాకుండా.... కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల హక్కుల సాధన కోసం ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఈ నెల 31న తునిలో కాపు గర్జన సభ తలపెట్టిన విషయం తెలిసిందే. -
వైఎస్సార్ సీపీ నేతపై దాడి
తుని: అధికార టీడీపీ నాయకల ఆగడాలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. అధికారం అండ చూసుకుని తెలుగు తమ్ముళ్లు ప్రత్యర్థులపై దాడులకు తెబడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా తుని మండలం చేవూరులో వైఎస్సార్ సీపీ నాయకుడు నాగేశ్వరరావుపై టీడీపీ నేతలు కత్తులతో దాడి చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి వెళుతున్న నాగేశ్వరరావుపై దుండగులు వెనుకాల నుంచి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావును కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
జగన్‌కు ఘనస్వాగతం
తుని :ప్రకృతి విపత్తులు, దుర్ఘటనల బాధితులను పరామర్శించేందుకు విశాఖ జిల్లా నుంచి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి తునిలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం 4.45 గంటలకు వచ్చిన ఆయనకు జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తదితరులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ తుని జాతీయరహదారి కొట్టం సెంటర్లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. 15 నిమిషాలకు పైగా వారితో ముచ్చటించారు. జెడ్పీ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తలశిల రఘురామ్, తాడి విజయభాస్కరరెడ్డి, సంగిశెట్టి అశోక్, గుండా వెంకటరమణ, కొల్లి నిర్మల కుమారి, మిండగుదిటి మోహన్, చెల్లుబోయిన శ్రీనివాసరావు, వట్టికూటి రాజశేఖర్, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, కో ఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, చెల్లుబోయిన వేణు, పెండెం దొరబాబు, కొండేటి చిట్టిబాబు, ఆకుల వీర్రాజు, గిరజాల వెంకటస్వామినాయుడు, వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, తోట సుబ్బారావునాయుడు, బొంతు రాజేశ్వరరావు, గుత్తుల సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శులు శెట్టిబత్తుల రాజబాబు, అత్తిలి సీతారామస్వామి, యువజన విభాగం కార్యదర్శులు గిరజాల వీర్రాజు, గుత్తుల నాగభూషణం, పెంకే వెంకట్రావు, సుంకర చిన్ని, ఎం.మురళీకృష్ణ, జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి సిరిపురపు శ్రీనివాసరావు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. -
మృగాళ్ల కిరాతకం
మైనరు బాలికను బంధించి అత్యాచారం ప్రశాంత విశాఖ ఉలికిపడింది. వరుస అత్యాచార సంఘటనలతో కలవరపడింది. నెలరోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని అత్యాచారం చేసిన సంఘటన మాసిపోకమునుపే మరో వైనం చోటుచేసుకుంది. ముగ్గురు మృగాళ్ల కిరాతకం శనివారం బయటపడింది. డాబాగార్డెన్స్: ముగ్గురు కిరాతకులు విశాఖలో ఓ మైనరు బాలికను దారుణంగా బంధించి అత్యాచారం చేశారు. మూడు రోజులపాటు కాళ్లు చేతులూ కట్టేసి గదిలో బంధించి అమానవీయంగా వ్యవహరించారు. నగరంలో శనివారం ఈ సంఘటన సంచలనం రేకెత్తించింది. డీసీపీ త్రివిక్రమ వర్మ కథనం ప్రకారం వివరాలివి. హైదరాబాద్‌కు చెందిన 14ఏళ్ల బాలిక తునిలో తాతగారింట్లో ఉంటోంది. పదిరోజుల క్రితం అలిగి బయటకొచ్చేసింది. తిరుపతి రెలైక్కేసింది. అక్కడ తనకు తెలిసిన స్నేహితునితో కలిసి ఐదురోజుల తర్వాత తుని తాతగారింటికి బయలు దేరింది. తీరా తుని చేరుకున్నాక ఇంటికి వెళ్లాలంటే బాలిక మనసంగీకరించలేదు. దీంతో తుని రైల్వే స్టేషన్లోనే తచ్చాడింది. ఇదే అదనుగా ఇద్దరు వ్యక్తులు ఆమె దగ్గరకు చేరారు. తాము ఇంటికి తీసుకు వెళ్తామంటూ నమ్మించారు. వారి మాటలను విశ్వసించిన బాలిక వారి ద్విచక్ర వాహనం ఎక్కింది. వారు మాయమాటలతో విశాఖ తీసుకువచ్చారు. తాడివీధిలో ఓ ఇంటికి తీసుకు వెళ్లారు. అక్కడ గదిలో తాళ్లతో బంధించారు. వారికి మరో వ్యక్తి తోడయ్యాడు. ముగ్గురూ బాలికపై అమానవీయంగా అత్యాచారం చేశారు. ఆమె అరుపులు వినిపించకుండా టీవీ సౌండ్ పెంచేవారు. మూడు రోజుల తర్వాత బాధితురాలిని అమానుషంగా గదిలో ఉంచి తాళం వేసి వెళ్లిపోయారు. శనివారం ఉదయం ఆమె కేకలకు ఇరుగుపొరుగు వారు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి బాధితురాలికి విముక్తి కలిగించారు. ఈ కేసులో ఫోన్ ఆధారంగా ప్రధాన నిందితుడు వీరబాబును వెంటనే పోలీసులు అరెస్టు చేయగలిగారు. మిగిలిన నిందితుల్ని కూడా పట్టుకుని తీరతామని డీసీపీ త్రివిక్రమవర్మ విలేకరులకు చెప్పారు. వరుస ఘటనలతో బెంబేలు.. మార్చి 16న ఆనందపురం మండలం వేములవలసకు చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న 14గేళ్ల బాలికపై పక్క ఇంట్లో ఉంటున్న పట్నాల ప్రసాద్ నేరుగా ఇంట్లోకి ప్రవేశించి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారానికి యత్నించాడు. దీంతో భీతిల్లిన ఆ బాలిక కేకలు వేయడంతో పరిసర ప్రాంతాల వారు పరుగున రావడంతో నిందితుడు ప్రసాద్ పారిపోయాడు. మార్చి 12న గృహిణిని వేధించిన వ్యక్తిని ఆరిలోవ పోలీసులు అరెస్టు చేశారు. ఆరిలోవలో భర్తతో నివాసముంటున్న ఓ మహిళ కొద్ది రోజుల కిందట ఆమె విజయనగరం జిల్లా సాలూరులోని పుట్టింటికి వెళ్లింది. అక్కడ భాస్కర్ అనే టైలర్‌కు జాకెట్టు కుట్టమని ఇచ్చింది. కుట్టిన జాకెట్టు ఇచ్చినప్పుడు ఆమె ఫోన్ నెంబరు తీసుకొని అప్పటి నుంచి ఫోన్ చేసి వేధించడంతో ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం భాస్కర్‌ను అరెస్టు చేశారు. గత నెల 24న కోటవీధికి చెందిన 15ఏళ్ల బాలికపై తెలుగుదేశం పార్టీ నాయకుడు మహ్మద్ సాధిక్ తండ్రి షేక్ ఫరీద్ షహనీసా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్ వద్ద వాపోయింది. తక్షణం పోలీసులు చర్యలు చేపట్టి నిందితుడ్ని అరెస్టు చేశారు. నెల రోజులకిందట పెందుర్తిలో స్నేహితుడు సోదరికి వివాహానికై హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చిన ఓ యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో నలుగురు నిందితుల్ని పట్టుకుని అరెస్టు చేశారు.ఇరవై రోజుల కిందట పెందుర్తి జుత్తాడలో ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు. -
రైతుబజార్ టీడీపీ నేతజాగీర్
తుని : దళారుల దందా లేకుండా అటు కూరలు పండించే రైతులకు, ఇటు వినియోగదారులకు ప్రయోజనం కలిగిం చాలన్న ధ్యేయంతో ఏర్పాటు చేసిన రైతుబజారు.. తునిలో అధికారపార్టీ నాయకుడి జాగీరుగా మారింది. టీడీపీ నేత, మున్సిపల్ కౌన్సిల్ కో ఆప్షన్ సభ్యుడు రాపేటి సూరిబాబు తుని మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన రైతుబజార్లో ఒకటి కాదు, రెండు కాదు.. ఆరుషాపుల జాగా లో కూరగాయల హోల్‌సేల్ వ్యాపారం నడుపుతున్నారు. ఆయన బరితెగింపు అంతటితోనూ ఆగలేదు.‘రాపేటి సూరి బాబు రైతు బజార్’ అని బోర్డూ పెట్టుకున్నారు. ‘అదేమి’టన్న వారి అంతు చూస్తాన న్నారు. గురువారం ‘సాక్షి’ చానల్ ప్రతినిధి కె.అప్పారావుపై దౌర్జన్యంగా వ్యవహరించడమే అందుకు సాక్ష్యం. మార్కెట్ యార్డులో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన రైతు బజార్లో.. నిజమైన రైతులకు జాగా కరువు కాగా, రైతులు కాని వారికి దుకాణాలు కట్టబెట్టారు. ఈ బజార్లో ప్రస్తుతం తెలుగు తమ్ముళ్ల హవా నడుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ నేత రాపేటి సూరిబాబు ఆరు షాపుల స్ధలంలో హోల్‌సేల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ‘రైతు బజార్’కు ముందు తన పేరు తగిలించి బోర్డు కూడా ఏర్పాటు చేశారు. వినియోగదారులకు, రైతులకు మధ్య దళారీ వ్యవస్థ ఉండకూడదన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన రైతుబజార్లో రైతులు కాని వారు, బినామీలు షాపులను ఏర్పాటు చేసుకున్న విషయాన్ని పలువురు రైతులు ‘సాక్షి’ చానల్ ప్రతినిధి అప్పారావు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన గురువారం రైతు బజార్‌కు వెళ్లి అక్కడి దృశ్యాలను చిత్రీకరించారు. రైతులు కాని వారికి దుకాణాలు ఉన్నాయని, ఒకే వ్యక్తి అనేక దుకాణాలు నిర్వహిస్తున్నారని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి కేఆర్ఆర్ నాగేశ్వరరావు దృష్టికి తీసుకు వెళ్లారు. నిబంధనల మేరకు ఎవరికైనా ఒక్క షాపు మాత్రమే కేటాయిస్తారని, ఒకే వ్యక్తికి ఎక్కువ షాపులు ఉండకూడదని కార్యదర్శి చెప్పారు. రైతు బజార్‌కు తన పేరు పెట్టుకోవడం చట్ట విరుద్ధమనీ స్పష్టం చేశారు. అనధికారికంగా నిర్వహిస్తున్న షాపుల యజమానులకు నోటీసులు ఇచ్చి, తొలగిస్తామన్నారు. సాయంత్రానికి అంతు చూస్తా.. కాగా ‘సాక్షి’ చానల్ ప్రతినిధి అప్పారావు రైతుబజార్లో దృశ్యాలను చిత్రీకరించిన సంగతి తెలుసుకున్న సూరిబాబు.. అక్కడి నుంచి ఇంటికి వెళుతున్న అప్పారావును పాత రైతు బజార్ సమీపంలో అడ్డగించారు. నానా దుర్భాషలు ఆడారు. తన షాపులను చిత్రీకరించినందుకు సాయంత్రానికి అంతు చూస్తానని బెదిరించారు. దీంతో అప్పారావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పారావు ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు. మరోపక్క అప్పారావు తనను సొమ్ముల కోసం డిమాండ్ చేశాడంటూ సూరిబాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదుకు టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. కాగాప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే మీడియా ప్రతినిధులపై టీడీపీ నేత సూరిబాబు దౌర్జన్యానికి పాల్పడడాన్ని పలువురు నిరసిస్తున్నారు. ఇది తెలుగుతమ్ముళ్ల నిరంకుశ వైఖరికి నిదర్శనమంటున్నారు. భారీ వ్యాపారంతో బడా వ్యాపారుల కన్ను తుని, తొండంగి, కోటనందూరు మండలాలకు చెందిన 25 గ్రామాలకు వినియోగపడేలా ఈ రైతుబజార్‌ను నాలుగేళ్ల క్రితం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేశారు. వివిధ రకాల కూరగాయలను రైతులు రోజూ మార్కెట్‌కు తీసుకు వస్తారు. రోజుకు రూ.ఐదు లక్షల మేర వ్యాపారం జరుగుతుంది. కేవలం రిటైల్ వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన బజారుపై బడా వ్యాపారుల కన్ను పడింది. ఇక ప్రస్తుతం అధికారం ఉండడంతో పలువురు తెలుగు తమ్ముళ్లు దీనిని సొంత జాగీరుగా ఉపయోగించుకుంటున్నారు. రైతుబజార్లో గుత్తాధిపత్యానికి తెరదించి, రైతులకు, చిరు వ్యాపారులకు అవకాశం కల్పించినప్పుడే వాటి ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుంది. -
రైతు బజార్లో తెలుగు తమ్ముళ్ల బాగోతం
తుని(తూ.గో): మరోసారి తెలుగు తమ్ముళ్లు తమ బాగోతాన్ని బయటపెట్టారు. మీడియా స్వేచ్ఛను అడ్డకుంటూ సాక్షి ప్రతినిధిపై బెదిరింపు చర్యలకు పాల్పడిన ఘటన జిల్లాలోని తుని రైతు బజార్లో గురువారం చోటు చేసుకుంది. కొంతమంది రైతులకు చెందాల్సిన షాపుల్లో తెలుగు తమ్ముళ్లు పాగా వేసి వీరంగం సృష్టించారు. అంతేకాకుండా మీడియాపై కూడా చిందులు వేశారు. తెలుగు తమ్ముళ్ల వ్యవహారాన్ని చిత్రీకరించడానికి వెళ్లిన సాక్షి ప్రతినిధిపై బెదిరింపులకు దిగారు. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ వారు తమ దైన శైలిలో హుకుం జారీ చేశారు. ఈ ఘటనపై సాక్షి ప్రతినిధి పోలీసుల్ని ఆశ్రయించాడు. -
బాబు వచ్చారు.. జాబు పోతుందా?
తుని :బాబు వస్తే జాబు వస్తుందంటూ ఎన్నికల ముందు తెలుగుదేశం నేతలు ఊదరగొట్టే ప్రచారం చేశారు. నిరుద్యోగులు, డ్వాక్రామహిళలు, రైతులు... ఇలా అన్ని వర్గాలపై వరాల జల్లులెన్నో కురిపించేశారు. తీరా అధికారంలోకి వచ్చాక దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మహిళా సంఘాల ఏర్పాటుతో మహిళలను లక్షాధికారులను చేసింది తామేనంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు, ఆ సంఘాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన యానిమేటర్లు (విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్లు -వీఓఏ)లను విస్మరిస్తున్నారు. వారికి సక్రమంగా జీతాలందడం లేదు. జిల్లాలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న 1700 మంది వీఓఎలు 14 నెలలుగా జీతాలు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇప్పుడు తమ ఉపాధిపై అనుమానాలు వారిని పట్టిపీడిస్తున్నాయి. మహిళా సంఘాలకు మూలస్తంభాలు మహిళా సంఘాల ఏర్పాటు, వాటిని పటిష్టపరచడంలో యానిమేటర్ల పాత్ర ఎంతో ఉంది. గత తెలుగుదేశం జమానాలో ఏర్పాటైన పొదుపు సంఘాలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు జిల్లా వ్యాప్తంగా ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ద్వారా 1700 మంది యానిమేటర్లను 15 ఏళ్ల క్రితం నియమించారు. పేద వర్గాలకు చెందిన మహిళలను గుర్తించి వారితో సంఘాలను ఏర్పాటు చేయడం, పొదుపు వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం వీరి బాధ్యత. పుట్టిన పిల్లలను బంగారు తల్లి పధకంలో నమోదు చేయడం, ఆమ్ ఆద్మీ, అభయ హస్తం, ఐఎస్ఎల్, నిరుద్యోగుల వివరాలు సేకరణ తదితర పనులను కూడా వీరు చేస్తున్నారు. మహిళా సంఘాలకు రుణాలు ఇప్పించడం, తిరిగి బ్యాంకులకు కట్టించడం, నెలకు రెండు సార్లు మొబైల్ బుక్ కీపింగ్ వంటి విధులను నిర్వహిస్తున్నారు. డీఆర్డీఏ, గ్రామ సంఘాల నుంచి నెలకు రూ. రెండు వేలు వీరికి చెల్లించేవారు. జిల్లా సమాఖ్య నుంచి ఐడీ కార్డులు, నియామక పత్రాలు ఇవ్వాలని వారు సుదీర్ఘమైన పోరాటం చేసినా పట్టించుకోలేదు. 2013 మే 13వ తేదీన ప్రభుత్వం వీరందరికి రూ. 3500 జీతం ఇస్తామంటూ జీవో విడుదల చేసింది. అయితే క్షేత్ర స్థాయిలో ఆ జీఓ అమలు కాకుండా వాయిదా వేశారు. అప్పటి నుంచి తమకు జీతాలు చెల్లించడం మానేశారని వీఓఏలు చెబుతున్నారు. 25 రోజులుగా ఆందోళన పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా 1700 మంది వీఓఏలు విధులు బహిష్కరించి ఆందోళనలు చేస్తున్నారు. వీరికి 14 నెలల బకాయి కింద సుమారు రూ. 84 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో 60 శాతం ప్రభుత్వం, 40 శాతం గ్రామ సంఘాల నుంచి రావాలి. మహిళా సంఘాల ద్వారా చెల్లించాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లించాలని వీఓఏలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై డీఆర్డీఏ పీడీని కలిస్తే తమకు సంబంధం లేదని, మీరు ఎవరో తమకు తెలియదని సమాధానం ఇచ్చారని వీఓఏల సంఘం అధ్యక్షురాలు మాసా రాజేశ్వరి తెలిపారు. తమను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి న్యాయం జరిగేలా చూడాలని వీఓఏలు తుని శాసన సభ్యుడు దాడిశెట్టి రాజాను కలసి విన్నవించుకున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా వారికి భరోసా ఇచ్చారు. -
బావా బావమరుదుల దుర్మరణం
తుని/తుని రూరల్ :జాతీయ రహదారిపై తుని మండలం ఎర్రకోనేరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బావాబావమరుదులు మరణించారు. కుమార్తె పెళ్లి కార్డులను బంధువులకు పంచడానికి కారులో వెళుతుండగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వీరిద్దర్ని మృత్యువు కబళించింది. సంఘటన స్థలంలో ఉన్న పోలీసు సిబ్బంది, విలేకరులపైకి పది నిమిషాల వ్యవధిలో రెండు వాహనాలు దూసుకురావడంతో ఐదుగురు గాయపడ్డారు. ఎస్సైకు తృటిలో ప్రమాదం తప్పింది. తుని రూరల్ ఎస్సై శివప్రసాద్, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, పాలకొల్లుకు చెందిన బావ, బావమరుదులైన దాట్ల గంగరాజు (51), మంతెన బలరామరాజు (51) కలిసి శనివారం ఉదయం పెళ్లి శుభలేఖలు పంచడానికి కారులో విశాఖపట్నం బయలుదేరారు. తుని మండలం ఎర్రకోనేరు వద్ద ఉదయం 9.30 సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. లారీ వెనుక భాగంలోకి కారు చొచ్చుకుపోవడంతో ఇద్దరూ సంఘటన స్థలంలోనే చనిపోయారు. నుజ్జయిన కారులోనే మృతదేహాలు చిక్కుకుపోయాయి. కారులో చిక్కుకుపోయిన గంగరాజు, బలరామరాజు మృతదేహాలను బయటకు తీయడానికి రెండు గంటలు పట్టింది. పలుగులతో కారు డోర్లను పగులగొట్టి బయటకుతీశారు. స్థానికులు పోలీసులకు సహకరించారు. తుని ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం గంగరాజు, బలరామరాజు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. దూసుకొచ్చిన వాహనాలు ఈ ప్రమాద వార్త తెలిసిన వెంటనే పోలీసులు, పాత్రికేయులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ సమయంలో వర్షం కురవడం వల్ల సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడింది. కారును తాళ్లతో కట్టి లారీ నుంచి వేరు చేస్తుండగా, రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళుతున్న సుమో అటుగా దూసుకొచ్చి, డివైడర్ పైకి ఎక్కింది. పోలీసులు, విలేకరులు పక్కకు తప్పుకున్నారు. మరో పది నిమిషాల వ్యవధిలో విలేకరులు, పోలీసుల పైకి ఓ కారు వేగంగా వచ్చి అక్కడున్న పోలీసు జీప్‌ను ఢీకొంది. ఆ జీప్ లారీ కింద ఇరుక్కున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పాత్రికేయులు, కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. అక్కడున్న ఎస్సై శివప్రసాద్ త్రుటిలో అపాయం నుంచి తప్పించుకున్నారు. పాత్రికేయులు ఎం.సూర్యనారాయణ, రామృకృష్ణ, వాసు, తుని మండలం రాజుపేటకు చెందిన కిల్లాడ దుర్గకు గాయాలు కావడంతో, 108లో తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వాహనాలను నిర్లక్ష్యంగా నడిపిన ఇద్దరు డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాత్రికేయులను తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పరామర్శించారు. ‘సాక్షి’ తుని రూరల్ విలేకరి సూర్యనారాయణకు తీవ్ర గాయం కావడంతో వైద్యులు చికిత్స అందించారు. శుభలేఖలు పంచడానికి వెళ్తూ.. బలరామరాజు పెద్ద కుమార్తెకు ఆగస్టు 13న వివాహం జరగనుంది. బంధువులు, స్నేహితులకు శుభలేఖలు పంచడానికి బావమరిది గంగరాజుతో కలసి శనివారం పాలకొల్లు నుంచి కారులో బయలుదేరారు. శుభలేఖలు పంచడానికి వెళ్లిన వీరు క్షేమంగా తిరిగొస్తారని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు తీరని విషాదం మిగిలింది. బావ, బావమరుదులైనా స్నేహితుల్లా కలిసిమెలిసి ఉండేవారని గంగరాజు సోదరుడు వెంకట్రాజు కన్నీరు పెట్టుకున్నారు. భీమవరానికి చెందిన గంగరాజు ఆక్వా వ్యాపారం చేస్తున్నారు. ఆయనకు భార్య సుబ్బలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పాలకొల్లుకు చెందిన బలరామరాజుకు భార్య రాధారాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
విశాఖ - కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
తుని : ఓ బోగీ నుంచి పొగలు రావడంతో విశాఖపట్నం - కాచిగూడ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలును తూర్పు గోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి అరగంటపాటు నిలిపేశారు. విశాఖపట్నంలో రాత్రి ఏడున్నర గంటలకు బయలుదేరిన ఈ రైలు 9.30కు తుని చేరుకుంది. రైలు తుని రాకముందే ఎస్-7 బోగీలో ప్రయాణికులు పొగలు రావడం గమనించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో తుని రైల్వే స్టేషన్లో ఆపి పొగలు వస్తున్న బోగీని సిబ్బంది పరిశీలించారు. బోగీ అడుగున ఉండే రెండు డైనమోలలో ఒకదాని బెల్ట్ పట్టేయడంతో పొగలు వచ్చాయని గుర్తించారు. బెల్టును తప్పించి రైలును పంపించివేశారు. -
ముంచుకోటే
సాక్షి ప్రతినిధి, కాకినాడ :తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచివరుసగా ఆరుసార్లు గెలుపొందిన యనమల రామకృష్ణుడు 2009లో ఓటమి పాలై ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్‌గా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఆర్థిక మంత్రిగా అనేక అత్యున్నత పదవులు నిర్వర్తించినా నియోజకవర్గానికి ఇది చేశానని గొప్పగా చెప్పుకోవడానికి యనమలకు ఏదీ మిగల్లేదని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. పదవులు నిర్వర్తించింది రామకృష్ణుడే అయినా వరుసకు సోదరుడైన కృష్ణుడు(ప్రస్తుత టీడీపీ అభ్యర్థి) నియోజకవర్గంలో అన్నీ తానే అన్నట్టు షాడో ఎమ్మెల్యేగా పెత్తనం చెలాయించారు. అన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో తన వ్యతిరేకులను పోలీసు కేసులతో వేధించిన సంఘటనలు అనేకం. ఏ సందర్భంలో, ఏ పని కావాలన్నా కృష్ణుడు అనుగ్రహించందే జరిగేదే కాదనే ఆరోపణలు ఉన్నాయి.తుని నుంచి రామకృష్ణుడు పోటీలో ఉంటే తెరవెనుక చక్రం తిప్పిన కృష్ణుడే ఇప్పుడు స్వయంగా బరిలోకి దిగారు. 2009లో ఓటమి తరువాత రామకృష్ణుడు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై, పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్నా, లేకున్నా కృష్ణుడు పోయిన ఒంటెత్తు పోకడలతో విసుగెత్తిన పలు సామాజికవర్గాలకు చెందిన నాయకులు ఈ ఎన్నికలను ఒక అవకాశంగా భావిస్తున్నారు. చాలా కాలంగా సమయం కోసం కాచుకున్న కొన్ని వర్గాలు కృష్ణుడిని దెబ్బ తీయడానికి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ పరిణామాలతో కృష్ణుడి వర్గం డీలాపడింది. నియోజకవర్గంలో తొండంగి మండలం రామకృష్ణుడికి కంచుకోట. తుని పట్టణం ఏనాడూ టీడీపీకి మద్దతు ఇచ్చిన దాఖలా లేదు. ఇందుకు ఉదాహరణ గత మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 30 వార్డుల్లో మహానేత వైఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గెలుపొందడమే. తుని రూరల్, కోటనందూరు మండలాల్లో పరిస్థితి నువ్వా, నేనా అన్నట్టుండేది. ఎటొచ్చీ తొండంగి మండలంలో వచ్చే ఆధిక్యతతోనే రామకృష్ణుడు సునాయాసంగా గెలుస్తూ వచ్చేవారు. అలాంటి తొండంగి మండలంలో గత ఎన్నికల నుంచీ పరిస్థితి మారి ప్రస్తుతం చేయి దాటిపోవడంతో యనమల కోట కుప్పకూలినట్టేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రామకృష్ణుడు అప్పుడప్పుడు ప్రచారం చేసి పోతున్నారే తప్ప నియోజకవర్గంపై దృష్టి పెట్టడం లేదని పార్టీ వర్గాలే అంటున్నాయి. అన్న మాటున అధికార దుర్వినియోగం.. అన్న ఉన్నత హోదాలో ఉన్నప్పుడు కృష్ణుడు చేసిన నిర్వాకాలతో పట్టణంతో పాటు, రూరల్ మండలాల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. వ్యాపారులు, వివిధ సామాజికవర్గాలకు చెందిన నేతలపై కేసులు పెట్టించిన అధికార దుర్వినియోగం ఇప్పుడు ఆయనను వెంటాడుతున్నాయి. రామకృష్ణుడి కంటే సీనియర్ అయిన కోటనందూరు మాజీ ఎంపీపీ గొర్లె అచ్చియ్యనాయుడు వంటి నాయకులు కృష్ణుడి తీరుతో విసిగి, వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. తుని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రుత్తల తమ్మయ్యదొర కృష్ణుడి విధానాల వల్లే టీడీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఆ వ్యతిరేకత తొండంగి మండలాన్ని కూడా తాకడంతో టీడీపీలో ఆందోళన మొదలైంది. ఆ మండలంలో ఎ.వి.నగరం, పెరుమాళ్లపురం, కోదాడ, సీతారామపురం, ఎ.కొత్తపల్లి, దానవాయిపేట, ఎర్రయ్యపేట, వేమవరం తదితర పంచాయతీలు ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలు. కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను కూడా పెట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు అదంతా మారిపోయింది. ఇందుకు సవాలక్ష కారణాలున్నాయి. రామకృష్ణుడు పాతికేళ్లకు పైగా ఉన్నతస్థాయిలో ఉన్నా.. సొంత సామాజికవర్గంలోనే ఎవరికీ ఉద్యోగాలు కల్పించకపోవడం, అభివృద్ధి కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం, మండలంలో కనీసం జూనియర్ కాలేజీ కూడా ఏర్పాటు చేయించ లేకపోవడం వంటివి మచ్చుకు కొన్ని. కోన ప్రాంతంలో కృష్ణుడి వర్గీయుల పెత్తనం, భూదందాలతో విసుగెత్తిన మత్స్యకారులు గత ఎన్నికల్లోనే నిరసన తెలపగా.. ఈసారి టీడీపీకి వ్యతిరేకంగా పని చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలతో గత ఎన్నికల ఫలితమే తిరిగి తప్పదన్న నిస్పృహ టీడీపీ శ్రేణులను వెన్నాడుతోంది. -
ప్రచారం ప్రారంభం
అడుగడుగునా జనం నీరాజనం కోటనందూరు నుంచి సునీల్, దాడిశెట్టి రాజా ప్రచారం తుని, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు చలమలశెట్టి సునీల్, దాడిశెట్టి రాజా శుక్రవారం ప్రారంభించిన ప్రచారానికి అడుగడుగునా జన నీరాజనం లభించింది. తూర్పు సెంటిమెంట్‌తో వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రచారాన్ని కాకినాడ పార్లమెంటు అభ్యర్థి చలమలశెట్టి సునీల్, తుని అసెంబ్లీ అభ్యర్థి దాడిశెట్టి రాజా కోటనందూరు మండలం, బొద్దవరంలో శ్రీకారం చుట్టారు. తాండవ నది తీరాన ఉన్న శివాలయంలో వారు పూజలు చేసి ప్రచారానికి బయలుదేరారు. అడుగడుగునా మహిళలు మంగళహారతులతో వారికి ఘనంగా స్వాగతం పలికారు. 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ స్వచ్ఛందంగా భారీగాజనం తరలివచ్చారు. బొద్దవరం, తాటిపాక, ఇండుగపల్లి, బిళ్లనందూరు, బంగారయ్యపేట, ఎస్‌ఆర్‌పేట, అప్పలరాజుపేట, భీమవరపుకోట, జగన్నాథపురం, కోటనందూరు, కేఏ మల్లవరం, పాతకొట్టాం, కేఎస్ కొత్తూరు, తిమ్మరాజుపేట, కేఈ చిన్నాయిపాలెంలలో ప్రచారాన్ని నిర్వహించారు. తుని నియోజకవర్గంలో ప్రజలు వైఎస్సార్ సీపీ పక్షాన నిలవడం ఆనందంగా ఉందని చలమలశెట్టి సునీల్ అన్నారు. చంద్రబాబును నమ్మితే నట్టేట ముంచడం ఖాయమన్నారు. మహానేత రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణపాలన జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు. రైతులకు సాగునీరు, మహిళలకు రుణమాఫీ, పిల్లలకు అమ్మఒడి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్జప్తి చేశారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా అభిమానంతో వేచిఉన్న అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు, అవ్వలు, తాతలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని దాడిశెట్టి రాజా అన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీగా సునీల్‌కు, ఎమ్మెల్యేగా తనకు ఓట్లను వేసి గెలిపించాలని కోరారు. మహిళా విభాగం కన్వీనర్ రొంగలి లక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి, లోవ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు లాలం బాబ్జి, మాకినీడి గంగారావు, నాగం దొరబాబు, మాజీ ఎంపీపీలు గొర్లి అచ్చియ్యనాయుడు, అంకంరెడ్డి నానబ్బాయి, నల్లమిల్లి గోవింద్, పెదపాటి అమ్మాజీ, ఆర్. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఓటేసింది మహిళాలోకం
తుని రూరల్, న్యూస్‌లైన్ : పరిషత్ ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలంలో 24 ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానానికి ఆదివారం జరిగిన పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. మండలంలో 57,296మంది ఓటర్లు ఉండగా 47,501మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో మహిళలే పైచేయి సాధించారు. 28,675 మంది పురుషులకుగాను 23,580మంది, 28,621మంది స్త్రీలకుగాను 23, 921మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. పురుషులకంటే స్త్రీలు 341 మంది అధికంగా ఓటు వేశారు. అత్యల్పంగా ఎస్.అన్నవరం-2లో 2180కి 1466(67.25శాతం) మంది ఓటర్లు ఓట్లు వేశారు. అత్యధికంగా వి.కొత్తూరు-4లో 1816 మందిలో 1675 (92.24 శాతం)మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
'పేదవాడికి భరోసా కల్పించిన నేత వైఎస్ఆర్'
-
'వచ్చేవి మన తలరాతను మార్చే ఎన్నికలు'
-
ఇప్పుడున్నది తెలుగు కాంగ్రెస్: విజయచందర్
విశాఖపట్నం, తుని: ప్రస్తుతం రాష్ట్రంలో అసలు టీడీపీయే లేదని, ఇప్పుడున్నది తెలుగు కాంగ్రెస్ అని వెఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు టి.ఎస్.విజయ్‌చందర్ ఎద్దేవా చేశారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో మూడు కాంగ్రెస్ పార్టీలున్నాయని, జాతీయ కాంగ్రెస్, తెలుగు కాంగ్రెస్, కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి, సోనియా అహంకారానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని అభివర్ణించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన అన్ని పార్టీలు ఒక వైపు ఉండి సమైక్యాంధ్ర కోసం పోరాడిన జగన్మోహన్రెడ్డిని ఓడించడానికి వ్యూహాలు పన్నుతున్నాయని చెప్పారు. చంద్రబాబు మనసంతా హైదరాబాద్, హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములపైనే ఉందని, సీమాంధ్ర అంటే ఆయనకు విద్వేషమన్నారు. రాష్ట్ర విభజనతో తెలుగువారిన విచ్ఛినం చేసిన తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే తెలుగు జాతికి ద్రోహం చేయడమే అవుతుందని విజయచందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన చంద్రబాబునాయుడు అదే పార్టీకి చెందిన మంత్రులు, ఇతర ముఖ్యనేతలను టీడీపీలోకి ఎలా చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపించిన వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రజల హృదయాల నుంచి ఎవరూ వేరు చేయలేరన్నారు. తండ్రిలా సులక్షణాలు కలిగిన జగన్మోహన్రెడ్డి మాత్రమే రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారని చెప్పారు. -
టీడీపీ బెండ తీసిన ఆ రెండూ
ఆ రెండు పురపాలక సంఘాలూ టీడీపీకి మర్చిపోలేని చేదు అనుభవాలు మిగిల్చాయి. అవి రామచంద్రపురం, తుని. 22 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఎరుగని ఘోరపరాజయాన్ని గత మున్సిపల్ ఎన్నికల్లో అంటే 2005లో తుని పురపాలకసంఘం టీడీపీకి అందించింది. ఈ ఎన్నికల్లో మహానేత వైఎస్సార్ ప్రభావంతో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఏక మొత్తంగా 30 కౌన్సిలర్ స్థానాలూ కాంగ్రెస్ పరమయ్యాయి. పార్టీ అగ్రనేత, 20 ఏళ్లకు పైగా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం కావడంతో ఈ పరిణామానికి రాష్ట్రస్థాయి ప్రాధాన్యం చేకూరింది. ఇక రామచంద్రపురంలో అయితే 1983 నుంచి ఇప్పటివరకూ ఏ ఎన్నికలోనూ మున్సిపల్ ఓటర్లు టీడీపీకి అధికారం కట్టబెట్టలేదు. ఈ పురపాలకసంఘంపై పచ్చజెండా రెపరెపలాడాలన్న ఆ పార్టీనేతల కల మూడు దశాబ్దాలుగా నెరవేరనేలేదు. 2005లో సైకిల్ తుని, న్యూస్‌లైన్ :అది 2005వ సంవత్సరం...తెలుగుదేశం కంచుకోట బద్ధలైన సంవత్సరం... చరిత్రలో వారికి చేదుజ్ఞాపకంగా మిగిలిపోయింది. రాజన్న పథకాలకు తుని మున్సిపాలిటీలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మొత్తం 30 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయబావుటా ఎగురవేశారు. చరిత్ర పుస్తకంలో తమకో పేజీ కేటాయించుకున్నారు. తుని పురపాలక సంఘం 1959 ఏప్రిల్ ఒకటిన ఆవిర్భవించింది. అంతకుముందు వీరవరం పేరుతో మేజర్ పంచాయతీగా ఉండేది. తుని ప్రథమ ఎమ్మెల్యే ఎస్ఆర్వీవీ కృష్ణంరాజు (బుల్లిబాబు) పురపాలక సంఘం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. అప్పటికే తుని వాణిజ్య కేంద్రం గా ఉంది. అప్పటి జనాభా ప్రకారం పట్టణాన్ని 16 వార్డులుగా విభజించారు. 1959 నుంచి 1963 వరకు ప్రత్యేకాధికారి పాలనలో ఉండేది. 1963లో నిర్వహించిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన ఎస్ఆర్వీవీ జగపతిబాబు (రాజబాబు) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 16 వార్డులకు గాను అత్యధిక వార్డులను కాంగ్రెస్ గెలుచుకుంది. 1963 నుం చి 1974 వరకు ఎస్ఆర్వీవీ జగపతిబాబు రెండోసారి చైర్మన్‌గా చేశారు. 1974 నుంచి 1981 వరకు ప్రత్యేక అధికారి పాలనలో ఉంది. 1981లో ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీచేసిన బర్రె సూర్యనారాయణ చైర్మన్‌గా గెలుపొందారు. 1983లో టీడీపీ అధికారంలోకి రావడంతో అవిశ్వాస తీర్మానం పెట్టి మేడి ది మాధవరావును చైర్మన్‌గా చేశారు. ఒకొక్కరు రుం డున్నర ఏళ్ల పాటు పనిచేశారు. 1987లో ఓసీ మహిళకు రిజర్వు అయ్యింది. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బొండా రత్నావతి చైర్మన్‌గా గెలుపొందారు. 1992 నుంచి 1995వరకు ప్రత్యేకాధికారి పాలనలో ఉంది. 1995లో వార్డుల పునర్విభజన జరిగింది. 16 నుంచి 24 వార్డులకు పెరిగాయి. 1995లో జరిగిన ఎన్నికల్లో ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది. టీడీపీ మద్దతుతో పోటీచేసిన బెందుర్తి సుశీల చైర్మన్‌గా గెలుపొందారు. 2000 వరకు చైర్మన్‌గా ఉన్నారు. 2000లో బీసీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. టీడీపీ మద్దతుతో చందక తలుపులరావు పోటీ చేసి గెలి చారు. 2005వరకు చందక తలుపుల రావు చైర్మన్‌గా చేశారు. 2005లో ఓసీ మహిళకు కేటాయించారు. కాంగ్రెస్ తరఫున కుసుమంచి శోభారాణి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో 30 వార్డులను కాంగ్రె స్ పార్టీ గెలుచుకుంది. టీడీపీ ఒక్క స్థానాన్ని గెలుచుకోలేదు. ఆ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభావం పురపాలక ఎన్నికలపై స్పష్టంగా కనిపించింది. రెండుసార్లు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన జగపతిరాజు, రెండుసార్లు వైశ్య సామాజిక వర్గం నుంచి చైర్మన్లుగా చేశారు. మూడవసారి వైఎస్సార్ సీపీ తరఫున వైశ్య సామాజిక వర్గానికి చెందిన కుసుమంచి శోభారాణి పోటీ చేస్తున్నారు. ‘దేశం’ నుదుట... ఓటర్ల ఓటమి రాత రామచంద్రపురం, న్యూస్‌లైన్ :రామచంద్రపురం మున్సిపాలిటీని గత 55 ఏళ్లుగా ఏడుగురు చైర్మన్లు పాలించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు స్వతంత్రులు సైతం ఈ పురపాలక సంఘాన్ని ఏలారు. అయితే 1983లో టీడీపీ వచ్చింది మొదలు ఇప్పటివరకూ ఒక్కసారి కూడా రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ పదవి ఆ పార్టీకి దక్కలేదు. 1983లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రభంజనం నెలకొన్న సమయంలో కూడా ఇక్కడ మున్సిపల్ చైర్మన్, అధిక శాతం కౌన్సిలర్ స్థానాలు ఇతర పార్టీలకే దక్కాయి. 1959లో గ్రేడ్-3 మున్సిపాలిటీగా ఆవిర్భవించిన రామచంద్రపురం 1980లో గ్రేడ్-2గా మారింది. ఇప్పటివరకూ పాలించిన ఏడుగురిలో ఎక్కువమంది క్షత్రియ సామాజిక వర్గీయులే. ఈ మున్సిపాలిటీ 1959లో ఆవిర్భవించగా 1962 వరకు ప్రత్యేకఅధికారి పాలన సాగింది. అనంతరం 1963లో జరిగిన ఎన్నికల్లో నందివాడ సత్యనారాయణరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయన 1968 ఆ పదవిలో కొనసాగారు. తదుపరి 1972వరకు చైర్మన్‌గా ఉన్న అడ్డూరి పద్మనాభరాజు కాంగ్రెస్ తరఫున గెలిచారు. 1972 నుంచి 1981వరకు తిరిగి ప్రత్యేక అధికారుల పాలన సాగింది. 1981 నుంచి 83వరకు స్వతంత్ర అభ్యర్థి ఎస్ఆర్కే రామచంద్రరాజు (రాజబాబు) చైర్మన్‌గా గెలుపొందారు. ఆయన 1983 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడంతో ఎస్ఆర్కే గోపాలబాబు 1985వరకు చైర్మన్‌గా కొనసాగారు. తర్వాత 1987లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రామచంద్రరాజు(రాజబాబు) కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తిరిగి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అనంతరం 1993 నుంచి 95వరకు రెండేళ్లపాటు ప్రత్యేక అధికారి పాలన సాగింది. 1995 నుంచి 2000వరకు స్వతంత్ర అభ్యర్థి కొండపల్లి కనకలింగేశ్వరరావు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2000లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా ఎస్ఆర్కే విజయాదేవి విజయం సాధించి 2005 వరకు చైర్మన్‌గా కొనసాగారు. 2005లో జరిగిన ఎన్నికల్లో చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కావటంతో పంతగడి జీవనజ్యోతి కాంగ్రెస్అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. జీవనజ్యోతి 2010 వరకు ఈ పదవిలో ఉన్నారు. అప్పటినుంచి నేటివరకూ మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి పాలనలోనే ఉంది. పట్టణంలో 43,683 మంది జనాభా కాగా ఓటర్ల సంఖ్య 31188. వీరిలో పురుషులు 15108, మహిళలు 16079. ఈ దఫా రామచంద్రపురం మున్సిపాలిటీ చైర్మన్ పదవిని జనరల్‌కు కేటాయించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మరణం
తుని, న్యూస్‌లైన్ :స్థానిక సీతారామపురం వద్ద జాతీయ రహదారి జంక్షన్లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. పట్టణ పోలీసుల కథనం ప్రకారం ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తుని పట్టణం కొండవారిపేటకు చెందిన పాస్టర్ దండా లాజరు (36), విశాఖజిల్లా పాయకరావుపేట ఇందిరా కాలనీకి చెందిన గారా సింహాచలం (40) సైకిల్‌పై తుని ఒకటో వార్డులోని నెహ్రూనగర్ వెళ్లేందుకు జాతీయ రహదారి దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. సింహాచలం సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన లాజర్‌ను 108 అంబులెన్స్‌లో తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అతడ్ని వైద్యుల సలహాపై కాకినాడ తరలిస్తుండగా దారిలో మృతి చెందాడు. సింహాచలం రిక్షా కార్మికుడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నెహ్రూ నగర్లో ప్రార్థనాలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. -
కరకట్టరా!
‘నేతి బీరకాయలో నెయ్యి ఉండ’దన్నది ఎంత నిజమో.. నేతల వాగ్దానాలు వాస్తవరూపం దాల్చవన్నది అంతే అక్షర సత్యమని మరోసారి నిర్ధారణ అయింది. తుని పట్టణ ప్రజలను నీటిముప్పు నుంచి ఆదుకుంటామని సాక్షాత్తూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన హామీ నీటిమూటగానే మిగిలింది. తాండవ నది వరద ముంపు బెడదను విరగడ చేసేందుకు ప్రతిపాదించిన కరకట్ట నిర్మాణం మొదలు కాకుండానే కంచికి చేరిన కథలా అనిపిస్తోంది. దీంతో తుని, పాయకరావుపేట ప్రజలను తాండవ నది వానా కాలం ‘ప్రవహించే ప్రమాదం’లా భయపెడుతూనే ఉంది. తుని, న్యూస్‌లైన్ :తాండవ రిజర్వాయర్ నుంచి వరదల సమయంలో విడుదల చేసే నీటి వల్ల తుని, పాయకరావుపేట పట్టణాలు ముంపునకు గురవడం ఏటా జరుగుతున్నదే. 1990, 2012లలోనైతే వరద బీభత్సానికి ఈ జంట పట్టణాల్లోని ప్రజలు కకావికలం అయ్యారు. వేలాది మంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని అల్లాడారు. తుని-విశాఖజిల్లాల పరిధిలో 45 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు విశాఖ జిల్లా నాతవరం వద్ద తాండవ ప్రాజెక్టును నిర్మించారు. కుడి, ఎడమకాలువల ద్వారా రెండు జిల్లాల్లో ఎనిమిది మండలాల పరిధిలోని భూములకు సాగునీరు లభిస్తుంది. రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 380 అడుగులు. నీటిమట్టం 375 అడుగులు దాటితే వరదనీటిని తాండవనదిలోకి విడుదల చేస్తారు. తాండవ నదీపరివాహక ప్రాంతం నాతవరం నుంచి పెంటకోట వరకు 35 కిలోమీటర్ల మేర ఉంది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వరదకాలువ వంద అడుగుల వెడల్పు ఉండేది. క్రమేపీ ఇసుక మేటలు, నది గమనంలో మార్పు వల్ల ఇరుకుగా మారింది. దీనికి తోడు ఇసుక తవ్వకాలు, ఆక్రమణల వల్ల నదిలో ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. 1990లో వచ్చిన వరదల వల్ల తునిలో పదివార్డులకు చెందిన ప్రజలు సర్వస్వం కోల్పోయారు. అయినా వరద నివారణ చర్యలు చేపట్టలేదు. 2012 నవంబరు నాలుగున నీలం తుపాను కారణంగా తాండవనది ఉగ్రరూపం దాల్చింది. దీని ప్రభావానికి తుని-పాయకరావుపేట పట్టణాలకు చెందిన 19 వేల కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. జనం పాట్లు పట్టని ప్రజాప్రతినిధులు వేలాది కుటుంబాలు ఎదుర్కొంటున్న ముంపు సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ప్రజాప్రతినిధులు చేసింది ఏమీ లేదు. తుని నుంచి రికార్డుస్థాయిలో వరుసగా ఆరుసార్లు శాసనసభకు ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, కాంగ్రెస్‌కు చెందిన ప్రస్తుత శాసనసభ్యుడు రాజా అశోక్‌బాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎం.ఎం.పళ్లంరాజు, తోట నరసింహం తాండవ నది కరకట్ట పనులపై కనీస శ్రద్ధ చూపలేదు. తమను ఎన్నుకున్న ప్రజల కష్టాలు తొల గించాలన్న పూనికే వారిలో కానరాలేదు. తొంగిచూడని ఇంజనీర్ ఇన్ చీఫ్.. 2012లో తాండవ నది ముంపు ప్రాంతాల్లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటించారు. కట్రాళ్లకొండ వద్ద ఉన్న భూమి రిజర్వాయర్‌ను పరిశీలించారు. కుమ్మరిలోవ తపోవనం నుంచి ఇసుకలపేట వరకు 2.5 కిలోమీటర్ల కరకట్ట నిర్మించాలని, దానికి సంబంధించి అంచనాలను రూపొందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కరకట్ట నిర్మాణానికి రూ.28 కోట్లు అవుతుందని అధికారులు నివేదిక ఇచ్చారు. 2012 డిసెంబరులోనే కరకట్ట నిర్మాణానికి రూ.24 కోట్లు మంజూరు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఆవగింజంత పని కూడా చేసిన దాఖలాలు లేవు. ముందుగా రూపొం దించిన డిజైన్లలో పదిమీటర్ల ఎత్తున సిమెంట్ కాంక్రీట్ గోడ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి రూ.28 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అయితే గోడ ఎత్తు తగ్గించి కొత్త డిజైన్ రూపొందించాలని ఉన్నతాధికారులు సూచించారు. దీనికి సంబంధించి తమ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ క్షేత్ర స్థాయి పర్యటనకు వస్తారని అప్పట్లో ఇరిగేషన్ అధికారులు చెప్పారు. అయితే 2014 జనవరి వచ్చినా ఆ ఊసే లేదు. సామగ్రి అంతా వరద పాలు.. భారీ వర్షాలు వచ్చినప్పుడు తాండవ నది వల్ల ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. 2012లో వచ్చిన వరద వల్ల ఇంట్లోని సామగ్రి అంతా కోల్పోయాము. శాశ్వత పరిష్కారానికి తీసుకున్న చర్యలు ఏమీ లేవు. - కర్రి నాగేశ్వరరావు, తుని వరదొస్తే మళ్లీ దుర్గతే.. నీలం తుపాను సమయంలో వరదనీటి వల్ల ఇబ్బందులు పడ్డాం. అప్పట్లో వరదనీరు రాకుండా రక్షణ గోడ నిర్మిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు. వరదలు వస్తే మళ్లీ ముంపులోనే గడపాల్సిన పరిస్థితి మాది. - తరిపే సుశీల, తుని -
‘ఆటో’ మాఫియా!
ప్రయాణించకపోయినా చార్జి అడిగిన ఆటోడ్రైవర్ ఇవ్వలేదని గొడవపడి.. ఇద్దరిపై అనుచరులతో దాడి మరో ఇద్దరు అమాయకులకూ గాయాలు తుని రూరల్, న్యూస్‌లైన్ : ఎక్కిన ఆటో దిగి.. తెలిసిన వారి ఆటో ఎక్కడమే వారు చేసిన పాపం. మాఫియాను తలదన్నే రీతిలో వారిని వెంబ డించి, వారెక్కిన ఆటోను అటకాయించి ఓ ఆటోడ్రైవర్, అతడి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఇద్దరు బాధితులతో పాటు.. ఈ గొడవతో సంబంధం లేని మరో ఇద్దరికీ గా యాలయ్యాయి. ఈ సంఘటన తుని మండలం సుభద్రయ్యమ్మపేట వద్ద గురువారం అర్ధరాత్రి జరిగింది. తుని రూరల్ ఎస్సై జి.రమేష్‌బాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తుని మండలం ఎన్ఎస్వీ నగరానికి చెం దిన కొందరు జట్టు కూలీలు పనుల కోసం కొన్ని రోజుల క్రితం ఖమ్మం జిల్లాకు వెళ్లారు. పనులు పూర్తి కావడంతో అక్కడి నుంచి బస్సులో బయలుదేరి, గురువారం రాత్రి తుని బస్టాండ్‌కు చేరుకున్నారు. స్వగ్రామమైన ఎన్ఎస్వీ నగరానికి వెళ్లేందుకు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌కు ఫోన్ చేశారు. అది వచ్చేలోగా.. మరో ఆటో అం దుబాటులో ఉండడంతో ఇంటికండ రాజారావు మినహా మిగిలిన వారు అందులో వెళ్లిపోయా రు. తునిలోని కొఠాం బస్టాండ్‌లోని సెలూన్లో రాజారావు షేవింగ్ చేయించుకునేందుకు వెళ్లా డు. అక్కడ అతడి తమ్ముడు ఇంటికండ అప్పారావు కలిశాడు. షేవింగ్ అనంతరం గ్రామానికి వెళ్లేందుకు పంపనబోయిన గోవింద్ ఆటోలో వీరు ఎక్కారు. ఈలోగా తొలుత ఫోన్ చేసిన ఆ టో అక్కడకు చేరుకుంది. దీంతో ఎక్కిన ఆటో ది గిన వీరిద్దరూ.. వచ్చిన ఆటోలో ఎక్కారు. దీం తో రాజారావు, అప్పారావును గోవింద్ ఆటో చార్జీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో వారికి, గోవింద్‌కు గొడవ జరిగింది. దీంతో గో వింద్ తన అనుచరులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. అప్పారావు, రాజారావు బయలుదేరి న ఆటోను గోవింద్ తన ఆటోలో వెంబడిం చాడు. మరో ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే గ్రా మం వస్తుందనగా, సుభద్రయ్యమ్మపేట సమీపంలో డ్రైవర్ గోవింద్, అతడి అనుచరులు మిరియాల ఏడుకొండలు, పంపనబోయిన రమణ, బర్ల కృష్ణంరాజు సహా 11 మంది వారి ఆటోను అటకాయించారు. ఆటోలో ఉన్న అప్పారావు, రాజారావులతో పాటు అదే గ్రామానికి చెందిన సోములు సత్తిబాబు, గొంప వరహాల బాబుపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడి లో రాజారావు, అప్పారావు తీవ్రంగా, సత్తిబా బు, వరహాలబాబు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం స్థానికులు తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితులఫిర్యాదు మేర కు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎస్సై రమేష్‌బాబు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏలేరుపై వార్!
=అనుమతి లేకుండా పనులు =విస్కోకు తెలియకుండా పైపులైను ఏర్పాటు =తొలగించేందుకు రంగం సిద్ధం చేసిన జీవీఎంసీ నర్సీపట్నం, న్యూస్‌లైన్: తుని, పాయకరావుపేట నియోజకవర్గాల్లోని తీరప్రాంత గ్రామాలకు నీటి తరలింపు వ్యవహారం కొలిక్కి రాలేదు. మొదట్లో తాండవ రైతులు వ్యతిరేకించగా, ప్రస్తుతం ఏలేరు నిర్వహణ చేపడుతున్న జీవీఎంసీ అడ్డుకుంటోంది. ప్రాజెక్టు ప్రారంభంలో తాండవనీటిని రెండు నియోజకవర్గాలకు పైపులైను ద్వారా సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పనులకు అప్పట్లో సీఎం కిరణ్ తునిలో శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించేందుకు పైపులు తరలిస్తుండగా తాండవ రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం పనులను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో అధికారులు తాండవకు ప్రత్యామ్నాయంగా ఏలేరు కాలువ నుంచి నీటిని తరలించాలని భావించి, ఏర్పాట్లు మొదలెట్టారుఏలేరు నీటిని తుని, పాయకరావుపేట గ్రామాలకు తరలించే ప్రతిపాదనను విశాఖ పరిశ్రమలు, తాగునీటి అవసరాల కమిటీ (విస్కో) నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దీన్ని కాదని రెండు జిల్లాల నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే దిగువ పైపులైను పనులు చేపట్టగా, తాజాగా నియోజకవర్గంలోని గొలుగొండ పేట వద్ద కాలువను ఆనుకుని స్టోరేజీ ట్యాంకునకు నీటిని తరలించే పైపులను ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న జీవీఎంసీ అధికార యంత్రాంగం ఇటీవల పరిశీలించి పైపులైనుకు అడ్డంగా గోడ నిర్మాణం చేసి పూడ్చివేశారు. వారం రోజుల్లో ఈ పైపులైనును పూర్తిగా తొలగించి అవసరమైన చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రెండు నియోజకవర్గాలకు తాగునీటి పంపిణీపై ఒక్కో అధికారి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. ఈ పథకాలకు అవసరమైన తాగునీటి కోసం ప్రతిపాదనలు పంపామని, ప్రభుత్వం ఆమోదించిందీ లేనిదీ తమకు ఇంకా తెలి యదని తూర్పుగోదావరి జిల్లా నీటి పారుదల శాఖ అధికారులుంటున్నా రు. నీటి తరలింపునకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని, అం దువల్లే పైపులైను పనులు ప్రారంభించామని తాగునీటి ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఏలేరు నీరివ్వని పక్షంలో తమ ప్రాంతం గుండా వెళ్లే కాలువను అడ్డుకుని ఆందోళన చేసేందుకు స్థానికులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. -
తేటగుంటలో..కాసులపంట
తుని రూరల్ / తుని, న్యూస్‌లైన్ :పదహారో నంబరు జాతీయ రహదారిపై తుని మండలం తేటగుంట వద్దనున్న రవాణా శాఖ చెక్‌పోస్టు అవినీతిపరులకు ఏడాది పొడవునా ఫలాలనిచ్చే కల్పవృక్షం లాంటిది. రాష్ట్రం లో ఒకచోటి నుంచి ఒకచోటికి వెళ్లే వాహనాలతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహనాలు నిత్యం వేలాదిగా ఈ రహదారిలో ప్రయాణిస్తుంటాయి. వాటిని తనిఖీ చేసి వాహనాలు కండిషన్లో లేకపోయినా, నిబంధనలకు అనుగుణంగా రికార్డులు లేకపోయినా, మితిమీరిన లోడు వేసినా జరిమానా విధించాల్సిన చెక్‌పోస్టు సిబ్బంది తమ చేతులు తడిపితే చాలు.. ఏ వాహనానికైనా ‘రైట్’ చెప్పేస్తారు. వాహనం కెపాసిటీకి మించి లోడు వేస్తే అదనపు టన్నుకు రూ.వేలల్లో అపరాధ రుసుము విధించాలి. వాహనాల రికార్డులు సక్రమంగా లేకపోయినా కేసులు నమోదు చేయాలి. ఇక ప్రైవేటు బస్సుల సంఖ్య వందల్లో ఉన్నా చూసీచూడనట్టు వదిలివేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓల్వో బస్సు ప్రమాదం తర్వాత తనిఖీ చేసి కేసులు నమోదు చేసి, హడావిడి చేసినా.. ఇప్పుడు ఆ బస్సులు నిబంధనల ప్రకారం లేకపోయినా యథాతథంగా నడుస్తున్నాయి. వాటి యజమానులు రవాణా శాఖ అధికారులకు నెలవారీ మామూళ్లు ఇవ్వడమే ఇందుకు కారణమని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. ఇక చెక్‌పోస్టులో పగలు, రాత్రీ తేడా లేకుండా ప్రైవేటు వ్యక్తులనే వాహనదారుల నుంచి మామూళ్లు దండుకోవడానికి నియోగిస్తున్నారు. ఏసీబీ దాడులు చేసినా తప్పించుకోవడానికే ఈ ఎత్తుగడ. ఈ రకంగా వేలాది వాహనాల నుంచి దండుకునే సొమ్మును ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి దిగువస్థాయి సిబ్బంది వరకు పంచుకుంటుంటారు. ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి కేవలం మొక్కుబడిగా మాత్రమే కేసులు రాస్తుంటారు. ఈ చెక్‌పోస్టులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ)పోస్టుకు రూ.25 లక్షలు ముడుపుగా చెల్లించేందుకు సిద్ధమవుతున్నారంటేనే.. ఇక్కడి దొడ్డిదారి రాబడి ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల్లో ఈ బండారం బయటపడుతున్నా రవాణాశాఖ సిబ్బంది తీరు మారడం లేదు. శనివారం జరిగిన తాజా దాడే అందుకు నిదర్శనం. ఏసీబీ అదుపులో ఇద్దరు ఎంవీఐలు, నలుగురు ప్రైవేట్ వ్యక్తులు ఏసీబీ డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నలుగురు ఇన్స్పెక్టర్లు శనివారం తెల్లవారుజామున ఈ చెక్‌పోస్టుపై దాడి చేశారు. ఉదయం తొమ్మిది గంటల వరకు చెక్‌పోస్టు సిబ్బందిని, అక్కడున్న ప్రైవేట్ వ్యక్తులను ప్రశ్నించారు. ఎంవీఐలు సిద్ధిక్, శేఖర్ల నుంచి రూ.73 వేలు, ప్రైవేట్ వ్యక్తులైన సుర్ల నారాయణస్వామి(వి.కొత్తూరు), తేటగుంటకు చెందిన ఆకుల బాబ్జి, గజ్జి వరహాలు, కె.పాదాలుల నుంచి రూ.12 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆరుగురినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు. ఇక్కడ అక్రమ వసూళ్లు భారీగా జరుగుతున్నట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో దాడి చేసినట్టు తెలిపారు. దాడుల్లో ఏలూరుకి చెందిన ఇన్స్పెక్టర్లు కొమరయ్య, విల్సన్, రాజమండ్రికి చెందిన రాజశేఖర్, సంజీవరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఏసీబీ అధికారులు ఇదే చెక్‌పోస్టుపై 2011 నవంబరులో దాడి చేసి రూ.1.20 లక్షలు, 2012 అక్టోబరులో దాడి చేసి రూ.నాలుగు లక్షలు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. కొందరు ఏసీబీ కేసుల్లో చిక్కుకుని జైలుకి వెళ్లినా ఇక్కడ అక్రమ వసూళ్లకు ‘చెక్’ పడడం లేదు. వీరికి కొందరు ప్రజాప్రతినిధుల అండ ఉండడంతో నిర్భయంగా అక్రమ దందా కొనసాగిస్తున్నారు. ఏటా సుమారు రూ.తొమ్మిది కోట్ల అపరాధ రుసుమును వసూలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చెక్‌పోస్టులో 12 మంది ఎంవీఐలను నియమించింది. అయితే ఆ మొత్తం కన్నా.. సిబ్బంది దండుకునే మామూళ్లు అనేకరెట్లు ఉంటాయంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో సుమారు రెండు నెలలు చెక్‌పోస్టు మూతపడింది. తిరిగి తెరుచుకున్న అనంతరం ఆవురావురుమంటున్న చెక్‌పోస్టు సిబ్బంది ‘స్వామికార్యం’గా అటు సర్కారు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికీ, ‘స్వకార్యం’గా ఇటు ‘రెండునెలలు కోల్పోయిన స్వార్జితం’ భర్తీకి మామూళ్ల దందాను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ దాడి జరగడం గమనార్హం. -
జలతాండవం
=ప్రమాదస్థాయిలో జలాశయం నీటిమట్టం =విడుదలకు అధికారులు సన్నద్ధం =పొలాల్లో నీరున్నందున ససేమిరా అంటున్న రైతులు నాతవరం, న్యూస్‌లైన్: తాండవ రిజర్వాయర్ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. జలాశయం సాధారణ నీటిమట్టం 380అడుగులు. 378 అడుగులకు చేరితే ప్రమాద హెచ్చరికలు జారీచేస్తారు. నాతవరం, పాయకరావుపేట, తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు, తుని మండలాల ప్రజలను అప్రమత్తం చేసి స్పిల్‌వే గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తారు. ఆదివారం సాయంత్రానికి నీటిమట్టం 376.6అడుగులు ఉంది. ఇన్‌ఫ్లో రోజుకు 50 క్యూసెక్కులకు పైగా వచ్చిపడుతోంది. నాలుగు రోజుల క్రితం పంట కాలువలకు నీటి విడుదలను ఆపేశారు. ప్రస్తుతం నీటిమట్టం పెరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఒకటి, రెండురోజుల్లో 378 అడుగులకు చేరుతుంది. తప్పని పరిస్థితుల్లో స్పిల్‌వే గేట్ల ద్వారా నీటిని విడుదలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల వర్షాల కారణంగా వరిపొలాల్లో పుష్కలంగా నీరు ఉంది. ఈ దశలో కాలువల ద్వారా నీరు విడుదలకు రైతులు ససేమిరా అంటున్నారు. పంటలు దెబ్బతింటాయని వాపోతున్నారు. నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుతుండటంతో స్పిల్‌వే గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడం తప్ప మరో మార్గం లేదని అధికారులు అంటున్నారు. ఇప్పటికే అధికారులు రిజర్వాయర్ నీటిమట్టంపై దృష్టిసారించారు. ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. దీనిపై తాండవ వర్క్ఇన్స్పెక్టర్ అప్పారావు మాట్లాడుతూ ఇన్‌ఫ్లో మేరకు నీటివిడుదలకు చర్యలు చేపడతామన్నారు. -
పంట కాలువలో లారీ బోల్తా
నక్కపల్లి న్యూస్‌లైన్: జాతీయ రహదారిపై గొడిచర్ల వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో తుని ఏరియా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. పోలీసుల కథనం ప్రకారం విజ యవాడ నుంచి విశాఖ వైపు కాగితాల లోడుతో వెళ్తున్న లారీ ముందువెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి గొడిచర్ల కూడలి వద్ద ఉన్న పంటకాలువలోకి బోల్తా పడింది. ఈ సంఘటనలో విజయవాడకు చెందిన లారీ డ్రయివర్ జె.నాగేశ్వరరావు (38) క్యాబిన్లో ఇరుక్కుపోయి మరణించాడు. బోల్తా పడుతున్నప్పుడు లారీ సమీపంలో బహిర్భూమికి వచ్చిన ముత్తిన వెంకటరమణ(32)ను ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో తీవ్రం గా గాయపడిన డ్రయివర్ సోదరుడైన క్లీనర్ వెంకటదుర్గారావును తుని ఏరి యా ఆస్పత్రికి తరలించారు. డ్రయివర్ నిద్రమత్తులో ఉండ టం వల్ల లారీ అదుపు తప్పి పంటకాలువలోకి బోల్తా పడినట్టు తెలిసింది. క్యాబిన్లో చిక్కుకుపోయిన డ్రయివర్ మృతదేహాన్ని బయటికి తీసేందుకు పోలీసులు ఇబ్బంది పడ్డారు. చుట్టం చూపుగా వచ్చి మృత్యువాత ప్రమాదంలో మరణించిన వెంకటరమణది తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి మండలం సీతయ్యపేట గ్రామం. భార్యాపిల్లలతో గొడిచర్లలో తోడల్లుడి ఇంటికి శనివారం వచ్చాడు. మంగళవారం వేకువజామున జాతీయరహదారిని ఆనుకుని పంటకాలువ వద్దకు బహిర్భూమికి వచ్చి లారీ ఢీకొని మృత్యువాత పడ్డాడు. స్వగ్రామానికి బుధవారం వెళ్లాల్లి ఉందని బందువుల చెబుతున్నారు. వెంకటరమణకు భార్య, అయిదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త మరణంతో చిన్నారులను ఎలా పెంచాలని అతని భార్య సంఘటన స్థలం వద్ద రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్చార్జి ఎస్ఐ జి.ప్రేమ్‌కుమార్ విలేకరులకు తెలిపారు. -
10 నియోజక వర్గాల్లో షర్మిల బస్సు యాత్ర
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే నినాదంతో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర శనివారం జిల్లాలోకి ప్రవేశించనుంది. తూర్పు గోదావరి జిల్లా తుని మీదుగా సాయంత్రం 4 గంటలకు పాయకరావుపేటకు చేరుకుని అక్కడే బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. సమైక్యాంధ్రకు జై కొడుతూ షర్మిలకు జిల్లా సరిహద్దులో ఘన స్వాగతం పలకడానికి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ,పోలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు,నియోజకవర్గ సమన్వయకర్త చెంగల వెంకట్రావులతో పాటు పార్టీ ముఖ్య నేతలు శుక్రవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. పాయకరావుపేట సభ ముగిశాక రాత్రికి నక్కపల్లి సమీపంలో బస చేసి షర్మిల ఆదివారం ఉదయం అక్కడి నుంచి బయల్దేరి విశాఖ నగరానికి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు జగదాంబ సెంటర్లో బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. అనంతరం విజయనగరం జిల్లా యాత్రకు బయల్దేరతారు. పాయకరావుపేటలో జిల్లాలోకి ప్రవేశించే షర్మిల బస్సు యాత్ర యలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి, గాజువాక, విశాఖ పశ్చిమ, ఉత్తరం, దక్షిణ, తూర్పు , భీమిలి నియోజక వర్గాల మీదుగా విజయనగరం జిల్లాలోకి వెళుతుంది. చురుగ్గా ఏర్పాట్లు పాయకరావుపేట : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సమైక్యశంఖారావానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా నుంచి బస్సు యాత్ర తాండవ బ్రిడ్జి ప్రాంతం నుంచి ఎల్టి కాలనీ, నాగరాజుపేట రైల్వేగేటు, గౌతమ్ సెంటరు మీదుగా చిత్ర మందిర్ సెంటరు వద్ద జరిగే బహిరంగసభ ప్రాంతానికి చేరుకుంటుంది. షర్మిలకు స్వాగతం పలుకుతూ అంతటా భారీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. పట్టణంలో రోడ్లకు ఇరువైపులా బారికేడ్లు, జగన్మోహన్రెడ్డి, షర్మిల ప్లెక్సీలు పెట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి రంగులు వేసి సుందరంగా తీర్చి దిద్దారు. దీనికి షర్మిల పూలమాల వేస్తారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు చిత్ర మందిర్ సెంటరులో జరిగే బహిరంగసభలో బస్సు పైనుంచే షర్మిల ప్రసంగిస్తారు. అటు గౌతమ్ సెంటరు, ఇటు పంచాయతీ కార్యాలయం వైపు వేలాది మందికి షర్మిల కనిపించే విధంగా ఏర్పాట్లు చేశారు . యాత్ర విజయవంతం కావాలి: కొణతాల షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బస్సు యాత్రను విజయవంతం చేయాలని కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. పాయకరావుపేటలో బస్సు యాత్రకు సంబంధించి రూట్‌తోపాటు,బహిరంగసభ స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. రోడ్డు కిరువైపులా బారికేడ్లు,స్వాగత ద్వారాలు ఏర్పాటు,బహిరంగ సభ నిర్వహణపై నాయుకులకు సూచనలిచ్చారు. అనంతరం మాట్లాడుతూ సమైక్యాంధ్రకు వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందన్నారు. రాజకీయలకు అతీతంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు, నియోజక వర్గ సమన్వయకర్తలు చెంగల వెంకట్రావు, గండి బాబ్జీ,బొడ్డేడప్రసాద్, పార్టీ నాయుకులు వీసం రామకృష్ణ, ధనిశెట్టి బాబూరావు,చిక్కాల రామారావు,జానకి శ్రీను, బొలిశెట్టి గోవిందు, ఆడారి ప్రసాద్, కోడా కోటేశ్వరరావు, దేవవరపు నాగభూషణం, ఆడారి నూకరాజు, దేవవరపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
తునిలో పట్టపగలే కాల్పులు
-
తునిలో వైయస్‌జగన్ ప్రసంగం