
సాక్షి, కాకినాడ: చంద్రబాబుకు సభలో జనం లేక పిచ్చి పట్టి మాట్లాడుతున్నారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు. ప్రజలు చంద్రబాబు మాటలను నమ్మడం లేదని తెలిపారు. రెండు పంటలకు ఒక్కసారి కూడా చంద్రబాబు నీరు ఇవ్వలేదని మండిపడ్డారు. సీఎం జగన్ వచ్చాక రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని అన్నారు. చంద్రబాబు సభలకు జనం నుంచి స్పందన లేదని అన్నారు. కాపులను చంద్రబాబు మోసం చేసి అవమానపరిచారని దుయ్యబట్టారు.
చంద్రబాబు దగా, మోసాన్ని ఎవ్వరూ మరచిపోలేదని రాజా తెలిపారు. ప్రజలు ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకుంటారని అన్నారు. సంక్రాంతి తర్వాత టీడీపీ ఖాళీ అవుతుందని, అభ్యర్ధులు కూడా దొరకరని అన్నారు. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు దోపిడి పరిపాలనే సాగిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని చంద్రబాబు, చంద్రబాబు కుటుంబం అడ్డంగా దోచుకుందని రాజా మండిపడ్డారు. 2014-2019లో మరుగుదోడ్లు నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన కోట్లాది రూపాయాలను యనమల అనుచరులు దోచేసుకున్నారని విమర్శించారు.
చదవండి: టీడీపీకి కేశినేని నాని రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment