dadishetti raja
-
సంక్రాంతి తర్వాత టీడీపీ ఖాళీ: మంత్రి దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ: చంద్రబాబుకు సభలో జనం లేక పిచ్చి పట్టి మాట్లాడుతున్నారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు. ప్రజలు చంద్రబాబు మాటలను నమ్మడం లేదని తెలిపారు. రెండు పంటలకు ఒక్కసారి కూడా చంద్రబాబు నీరు ఇవ్వలేదని మండిపడ్డారు. సీఎం జగన్ వచ్చాక రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని అన్నారు. చంద్రబాబు సభలకు జనం నుంచి స్పందన లేదని అన్నారు. కాపులను చంద్రబాబు మోసం చేసి అవమానపరిచారని దుయ్యబట్టారు. చంద్రబాబు దగా, మోసాన్ని ఎవ్వరూ మరచిపోలేదని రాజా తెలిపారు. ప్రజలు ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకుంటారని అన్నారు. సంక్రాంతి తర్వాత టీడీపీ ఖాళీ అవుతుందని, అభ్యర్ధులు కూడా దొరకరని అన్నారు. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు దోపిడి పరిపాలనే సాగిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని చంద్రబాబు, చంద్రబాబు కుటుంబం అడ్డంగా దోచుకుందని రాజా మండిపడ్డారు. 2014-2019లో మరుగుదోడ్లు నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన కోట్లాది రూపాయాలను యనమల అనుచరులు దోచేసుకున్నారని విమర్శించారు. చదవండి: టీడీపీకి కేశినేని నాని రాజీనామా -
యనమల ఓ సైకో : మంత్రి దాడిశెట్టి రాజా
-
పోలవరాన్ని ఏటీఎంల వాడుకున్నది చంద్రబాబే : మంత్రి దాడిశెట్టి రాజా
-
చంద్రబాబుతో ఉన్నప్పుడు సిద్ధాంతాలు ఏమయ్యాయి?
తుని రూరల్: ‘టీడీపీ అధినేత చంద్రబాబుతో మీరు ఐదేళ్లు పార్టనర్‌గా ఉన్నప్పుడే దివీస్ పరిశ్రమకు 560 ఎకరాలు కేటాయించారు. ఇప్పుడు మీరు చెబుతున్న సిద్ధాంతాలన్నీ అప్పుడేమయ్యాయి?’ అని పవన్‌ను తూర్పు గోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. ఎస్.అన్నవరంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. తొండంగి మండలంలో జరిగిన సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. దివీస్‌కు భూములు కట్టబెట్టిందే కాకుండా అన్ని అనుమతులనూ నాటి టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దివీస్‌కు వ్యతిరేకంగా గతంలో జరిగిన పోరాటానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. డబుల్ స్టాండ్ తీసుకునేది పవనేనని విమర్శించారు. సీఎం జగన్ ప్రజల పక్షాన పని చేస్తున్నారన్నారు. ప్రజలకు, రైతులకు, యువతకు నష్టం కలిగే పనులు చేయరని చెప్పారు. జీరో పొల్యూషన్‌తో ప్రకృతికి నష్టం వాటిల్లకుండా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడమే తమ ప్రభుత్వ విధానమన్నారు. -
రాష్ట్రంలో పండుగ వాతావరణం: దాడిశెట్టి రాజా
సాక్షి, తుని: శ్రావణ శుక్రవారం పూట రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా పెర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ అమోదం తెలపడంతో కర్నూల్, విశాఖపట్నం, తుని ప్రతి చోట ప్రజలు పండుగ చేసుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు వికేంద్రీకరణ బిల్లు ఆమోదాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. రెండు వందల రోజులు రాజధాని కోసం కృత్రిమ ఉద్యమం చేశామని చెప్పుకునే చంద్రబాబు తాబేదార్లు మాత్రం స్వాగతించడం లేదని పేర్కొన్నారు. రాజధాని ప్రకటించక ముందే రూ. 30 లక్షలు కూడా విలువ చేయని భూములను చంద్రబాబు తాబేదార్లు కొనుక్కున్నారన్నారు. ప్రకటన వచ్చాక వారిలో కొందరు ఎకరం రూపాయలు కోటిన్నర, రెండు కోట్లకు అమ్ముకున్నారని వ్యాఖ్యానించారు. ఇంకా అత్యాశకు పోయి కొంత మంది ఎకరం 10 కోట్ల రూపాయలు వస్తుందన్న దురాశతో ఆ భూములును ఉంచుకున్న వారే వికేంద్రీకరణ బిల్లుతో యిబ్బంది పడుతున్నారన్నారు. వికేంద్రీకరణ బిల్లుకు అనేక అడ్డంకులు సృష్టించాలని చంద్రబాబు త్రయం అనేక ప్రయత్నం చేసినప్పటికీ అవి సఫలీకృతం కావన్నారు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు అవుతుందని ఆ భారం అంతా తమ నెత్తిన చంద్రబాబు పెడుతున్నాడని తెలిసే రాష్ట్ర ప్రజలు టీడీపీకి 23 సీట్లు ఇచ్చి ఘన సత్కారం చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఈ విషయాన్ని మరిచిపోయినట్లు ఉన్నారని, ఒకసారి గుర్తు చేసుకోమని కోరుతున్నానని ప్రభుత్వ విప్ విమర్శించారు. -
అందుకే ప్రభుత్వంపై కుట్రలు : దాడిశెట్టి రాజా
సాక్షి, తాడేపల్లి : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌కు మతి భ్రమించిందని అందుకే ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. 30 లక్షల ఇళ్ల స్థలాలను పేదలకు ఇస్తుంటే కుట్ర చేస్తున్నారన్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఎన్నో అరాచకాలు చేశారని, మత్సకారుల ఇళ్లను తగలపెట్టించిన చరిత్ర ఆయనది అని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో ఓరిగిందేమీ లేదని రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసమే చంద్రబాబు తాపత్రయం పడ్డారు తప్పా పేదల గురించి ఆలోచించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా బాబు హయాంలో పేదలకు ఒక్క ఇళ్ల నిర్మాణం కూడా జరగలేదని గుర్తుచేశారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు కుట్రలు చేశారు కానీ సీఎం జగన్ పాలనలో ప్రజలకు మంచి జరుగుతుంది అని రాజా పేర్కొన్నారు. (దీన్ని బ్లాక్ డేగా చెప్పుకోవాలి: వాసిరెడ్డి పద్మ) టీడీపీ కాపు నేతలు కిందిస్థాయిలో పర్యటన జరిపి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని రాజా సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రతీ టీడీపీ నేత వైసాస్సార్‌సీపీకి జై కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కాపుల సంక్షేమం కోసం ఏడాదికి 400 కోట్లు కూడా ఖర్చు చేయని టీడీపీ నేతలకు వారి సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని దాడిశెట్టి రాజా అన్నారు. రాష్ర్టంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న చర్యలను ప్రతీ ఒక్కరూ హర్షిస్తున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. (సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా: సీఎం జగన్ ) -
నువ్వు, నీ కుమారుడు ఇంట్లోనే ఉండిపోతారా?
సాక్షి, తూర్పుగోదావరి : కరోనా కోసం చంద్రబాబు ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన కరోనా నిర్మూలన వ్యాక్సిన్ వచ్చే వరకు నువ్వు, నీ కుమారుడు ఇంట్లోనే ఉండిపోతారా? అని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అప్పటి వరకు మీ పార్డీ క్యాడర్ తమ కార్యాకలపాలను ఆపేస్తుందా అని సవాల్ విసిరారు. శుక్రవారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఉండగా ఒక మీడియో హౌజ్‌కు చంద్రబాబు రూ.700 కోట్లు దారదత్తం చేశాడని విమర్శించాడు. ఎల్లో మీడియోను ప్రభుత్వం మీద ఉసుగొల్పుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎల్లో మీడియాకు ప్రకటనలు ఇవ్వడం మానేయాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నానన్నారు. (క్వారంటైన్ కేంద్రాలపై నిరంతర పరిశీలన: సీఎం జగన్ ) చంద్రబాబుకు పదిరోజుల సమయం ఇస్తున్నామని, ముందు హెరిటేజ్ కంపెనీలో సోకిన కరోనాను పారదోలి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచించాలన్నారు. ఎల్లో మీడియా, సమాజానికి పట్టిన చీడ పురుగుల్లా తయారైందని దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. ఒక వ్యాధి ప్రబలితే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లాగా పారిపోయే పరిస్ధితి తమకు లేదని, కరోనాను ఖచ్చితంగా ఎదుర్కోంటామన్నారు. తమ ప్రయాణం కొనసాగిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తామని స్పస్టం చేశారు. ఈ సమయంలో ఒకవేళ చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే, కరోనా పేరు చెప్పి రూ.20 వేల కోట్లు దోచేసేవాడని, అది జరగలేదనే చంద్రబాబు తెగ కుమిలిపోతున్నాడని ఆరోపించారు. యనమల రామకృష్ణుడు ధర్మ ప్రభువు అని, కరోనా భాధితుల కోసం రూ.లక్ష రూపాయలు విరాళం ఇచ్చాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (పీఎఫ్ ఉపసంహరణకు పోటెత్తిన ఉద్యోగులు.. ) ఆక్వారంగాన్ని తన భుజాలపై వేసుకున్నారు తుని నియోజకవర్గం నుండి గెలిచి రాష్ట్ర ఖజానా నుంచి వేల కోట్లు యనమల దోచుకున్నాడని, చంద్రబాబు, యనమలని ఆంధ్రప్రదేశ్‌లో ఎవరడ్డుకుంటున్నరని ప్రశ్నించారు. ఒకసారి వీరిద్దరు రాష్టానికి వచ్చి ఒక క్వారంటైంన్ సెంటర్‌ను పరిశీలించాలని కోరుతున్నానన్నారు. తమ మూడుసార్లు ముఖ్యమంత్రి చరిత్రలో ఏనాడైనా ఉద్యానవన పంటలను మద్దతు ధర ఇచ్చి కొన్నావా అని చంబ్రాబును నిలదీశారు. లాక్డౌన్ వేళ ఆక్వారంగాన్ని తన భుజాలపై వేసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కష్టాల్లో నుంచి లాభాల్లోకి తీసుకు వచ్చారని ప్రశంసించారు. అదే బాబు అధికారంలో ఉంటే ఆక్వా రైతుల నడ్డి విరిచి తన వాళ్ళతో సిండికేట్ పెట్టించి దోచుకునేవాడని విమర్శించారు. రాష్ట్రం ఇబ్బందికర పరిస్ధితుల్లో ఉన్నా, సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. (వూహాన్లో కన్నీళ్లు పెట్టుకున్న డెలివరీ బాయ్ ) -
సీఎం జగన్ ఐడియాలను కాపీ కొడుతున్న చంద్రబాబు
-
రూ.లక్ష కోట్లతో రాజధాని అవసరం లేదు
-
‘చంద్రబాబు నక్క.. యనమల గుంట నక్క’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఒక పొలిటికల్ టెర్రరిస్టు అని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శించారు. మంగళవారం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు ఒక నక్క అయితే.. ఆయన పక్కన ఉండే యనమల రామకృష్ణుడు గుంటనక్క అని రాజా మండిపడ్దారు. తాను అనారోగ్యంతో ఆస్పత్రికి వెళితే దాన్ని కూడా టీడీపీ వక్రీకరిస్తోందని అయన దుయ్యబట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు తండ్రిని ఎలా ఆదర్శంగా తీసుకోవాలో.. సీఎం వైఎస్ జగన్‌ను చూసి నెర్చుకోవాలని అయన అన్నారు. చంద్రబాబు సీఎం జగన్‌పై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తున్నారని రాజా ధ్వజమెత్తారు. శాసన మండలిలోకి టీడీపీ ఎలాంటి వారిని తీసుకువచ్చిందో అందరికీ తెలుసని తెలిపారు. (పన్నులు కట్టేది.. చంద్రబాబు బినామీల కోసం కాదు) వెన్నుపోటు పొడిచి పార్టీని, పదవుల్నిపొందిన చరిత్ర చంద్రబాబుదనాయుడిదని రాజా ఎద్దేవా చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు అంటే చంద్రబాబుకు ఎందుకు అంత కక్ష అని రాజా ప్రశ్నించారు. మరో ఆరు నెలల్లో చంద్రబాబు పక్కన 21 ఎమ్మెల్యేల్లో ఎంత మంది ఉంటారో తెలుసుకోవాలన్నారు. యనమల రామకృష్ణుడు గతంలో మంత్రిగా పని చేసినప్పుడు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని రాజా ఆరోపించారు. అదేవిధంగా యనమల రామకృష్ణుడు స్పిన్నింగ్ పనులు చేయిస్తానని చెప్పి రూ. 25 కోట్లు వసూళ్లు చేశాడని దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ‘ఎదుటవారికి నీతులు చెప్పడానికే.. కానీ వాటిని ఆచరించడానికి కాదు’ అన్న చందంగా యనమల రామకృష్ణుడి తీరు ఉందని రాజా ఫైర్ అయ్యారు. ముందు చంద్రబాబు రాజీనామా చేయాలని రాజా డిమాండ్ చేశారు. విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం తమ ప్రభుత్వం హయాంలో పూర్తి చేయబోతున్నామని రాజా స్పష్టం చేశారు. -
చంద్రబాబులా మేము సంస్కార హీనులం కాదు
-
ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: మండలిలో రాజకీయాల కోసం చట్టాలను వాడుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలిలో ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు పోడిచారని మండిపడ్డారు. ప్రజలు ఆమోదించిన, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మండలిలో అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనం కోసం మండలిని ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ రాజకీయం చేయాలనుకుంటే ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టేవారని.. రాజకీయాలు ఫేర్‌గా ఉండాలని ఆయన అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు. సీఎం అనుకుంటే ఆర్డినెన్స్ ద్వారా అయినా చట్టం తెచ్చేవారన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ముందుకు వెళ్తుంటే టీడీపీ రాజకీయం చేస్తోందన్నారు. మండలి రద్దు నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించాలని చెవిరెడ్డి కోరారు. ఆయన ప్రయోజనాల కోసమే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాలన్ని ఆయన ప్రయోజనాల కోసమేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనమండలిలో చంద్రబాబు, టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును ఎండగట్టారు. చంద్రబాబు పాలనలో దాడులు,అసమానతలు, ప్రాంతాలు, కులాల మధ్య వైషమ్యాలు చూశామని.. రాష్ట్ర విభజనకు ఆయన లేఖ ఇచ్చారని దుయ్యబట్టారు. హోదా విషయంలో అనేకసార్లు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం వికేంద్రీకరణ బిల్లు తెస్తే..మండలిలో టీడీపీ సభ్యులు ఎలా ప్రవర్తించారో అందరికి తెలుసునన్నారు. మండలి రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ,ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ల బిల్లులను కూడా చంద్రబాబు అడ్డుకున్నారని మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు. మండలిని అడ్డం పెట్టుకుని.. మండలిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన బినామీలను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని పేరుతో చంద్రబాబు భారీ దోపిడీకి ప్రయత్నించారని మండిపడ్డారు. మండలిలో సైంధవుల్లా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. యనమల వేసుకునే సూటు,బూటు కూడా ప్రభుత్వ సొమ్మేనని విమర్శించారు. ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేసిన చరిత్ర యనమలది అని దుయ్యబట్టారు. శాసనసభ్యులను ఆంబోతులతో పోల్చిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. -
అప్పుడు దోపీడి చేసి ఇప్పుడు నీతులు..
సాక్షి, తూర్పుగోదావరి: అమరావతిలో భూముల రేట్లు పడిపోతాయని యనమల రామకృష్ణుడు రకరకాల ప్రేలాపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ఆయన గురువారం జిల్లాలోని అన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోపీడి చేసి ఇప్పుడు యనమల రామకృష్ణుడు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. అమరావతిలో యనమలతో పాటుగా ఆయన సోదరుడు, అల్లుడు భూములు కొన్నారని దాటిశెట్టి రాజా విమర్శించారు. ప్రజాధనాన్నీ.. యనమల, చంద్రబాబు కలిసి ఏలా దోచుకున్నారో త్వరలోనే బయట పెడతామన్నారు. పరిశ్రమల పెట్టుబడుల కోసం వైజాగ్‌లో నిర్వహించిన కార్యక్రమాలకు టీడీపీ వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు బస చేసిన ఒక్కో హోటల్‌కు రూ. 250 నుంచి రూ.300 కోట్లు చెల్లించారని దాడిశెట్టిరాజా మండిపడ్డారు. టీడీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆయన తీవ్రంగా విమర్శించారు. టీడీపీ హయాంలో డబుల్ డిజిట్ గ్రోత్ ఎక్కడ వచ్చిందో యనమల చెప్పాలని రాజా డిమాండ్ చేశారు. కేవలం ఫిషింగ్ సెక్టార్లో డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చిందని.. ఆ సెక్టార్లో వచ్చిన గ్రోత్‌ను పట్టుకుని అన్ని సెక్టార్లలో వచ్చినట్లు మీడియాతో ప్రచారం చేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లూలూ గ్రూప్ అనేది ఓ షాపింగ్ మాల్ లాంటిదని దాటిశెట్టిరాజా అన్నారు. గట్టిగా ఐదువందల మందికి కూడా ఈ కంపెనీలో ఉద్యోగాలు రావని ఆయన రాజా విమర్శించారు. అటువంటి షాపింగ్ మాల్‌కు రూ.10వేల కోట్ల పెట్టుబడులు ఎలా పెడతారని ప్రశ్నించారు. లూలూ గ్రూప్ ప్రపంచంలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అని.. యనమలతో పాటు చంద్రబాబు, లోకేష్ బిల్డప్ ఇస్తున్నారని దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైజాగ్‌లో పర్యటిస్తే వేలాది మంది వచ్చారని ఆయన తెలిపారు. చంద్రబాబులా తాము పేయిడ్ ఆర్టిస్టులను తెచ్చుకోమని రాజా అన్నారు. -
ఈ రాజా చెయ్యి వేస్తే అంతా మంచే
ఆయన ప్రజాసేవలోనే కాదు.. దాతృత్వంలో సైతం రాజానే. పాఠశాలల్లో పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బాగోలేదని గుర్తించిన ఎమ్మెల్యే రాజా తన సొంత ఖర్చుతో వారికి భోజనాలు పంపిస్తున్నారు. రోజూ వందలాది విద్యార్థులకు ఆయన రుచికరమైన భోజనాలు పెడుతున్నారు. అలా పెద్దల్లోనే కాదు.. పిల్లల మనస్సులో సైతం చెరగని ముద్ర వేసుకుంటున్నారు. సాక్షి, తుని : ధనం అందరికీ ఉంటుంది కానీ దాతృత్వ గుణం కొందరికే ఉంటుంది. దాతృత్వం ఉన్న వారిలో తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అగ్రగణ్యుడు. మధ్యాహ్న భోజనం బాగుండక పోవడంతో తినలేకపోతున్న విద్యార్థుల అవస్థలను గుర్తించి 740 మంది విద్యార్థులకు ఆయన తన సొంత ఖర్చుతో పదిరోజులుగా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నియమించిన బెండపూడిలోని ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్నారు. ఆ భోజనాలు మెనూ ప్రకారం అందకపోవడంతోపాటు పురుగులు పట్టిన అన్నం, సాంబారు సరఫరా చేస్తుండటంతో పిల్లలు పురుగులను తొలగించి తినాల్సిన దుస్ధితి ఏర్పడింది. కుళ్లిన కోడి గుడ్లు సరఫరా చేస్తుండటంతో వాటిని తినకుండా పారేస్తున్నారు. దీనిపై పై అధికారులకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఫిర్యాదు చేసినా పట్టించుకొనేవారే లేకుండా పోయారు. ఆ పరిస్థితుల్లో ఈనెల ఆరో తేదీన ఎమ్మెల్యే రాజా పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలు తింటున్న భోజనాన్ని స్వయంగా పరిశీలించారు. భోజనం బాగుండడం లేదని, దాన్ని తినలేక పారేస్తున్నామని వారు ఎమ్మెల్యేకు తెలియజేశారు. అలాగే తొండంగి మండలం శృంగవృక్షంలోని జెడ్పీ హైస్కూల్‌ను, ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించి అక్కడి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అదికూడా అలాగే అధ్వానంగా ఉండడంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించేలా ఏర్పాటు చేయాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. అంతవరకూ తన సొంత ఖర్చుతో విద్యార్థులకు భోజనాన్ని పంపుతామన్నారు. ఇచ్చిన హామీ మేరకు సన్న భియ్యం అన్నంతోపాటు కూర, పప్పు, సాంబారు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పంపిస్తున్నారు. తుని గర్ల్స్ హైస్కూల్లో 300 మందికి, శృంగవృక్షం జెడ్పీ హైస్కూల్లో 290 మందికి, ప్రాథమిక పాఠశాలలో 150 మందికి మొత్తం 740 మందికి రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే పంపించారు. అధ్వానంగా ఉండే భోజనాన్ని తినలేక, ఇళ్ల నుంచి క్యారేజీలు తెచ్చుకునే ఆర్థిక స్థోమతలేని పేద, మద్యతరగతి వర్గాల పిల్లలు ఆకలితో అలమటించకుండా ఉండాలనే సంకల్పంతో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా భోజనాలు పంపించడం ఆయన దాతృత్వానికి నిదర్శనమని విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. రుచికరమైన భోజనం అందించి పిల్లల మనస్సుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. -
కాపుల సమావేశానికి వెళ్తే చంద్రబాబు నిలదీశారు
సాక్షి, విజయవాడ: కాపులకు గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలనే ఆలోచనతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) అన్నారు. కాపు ఛైర్మన్ ప్రమాణా స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..చిన్న వయస్సున్న రాజాకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కేటాయించడం పట్ల వైయస్ జగన్ కాపుల పక్షపాతి అనడానికి నిదర్శనం అని పేర్కొన్నారు. గతంలో తాను కాపుల సమావేశానికి వెళ్ళితే చంద్రబాబు నిలదీశారని తెలిపారు. జన్మించేటప్పుడు..మరణించేటప్పుడు మనకు తోడుగా ఉండేది కులమేనని తెలిపారు. కాపులకు ఐక్యత ఉండదంటారని అదే మనకు బలం కావాలన్నారు. కాపులు ఆశించే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగేలా జక్కంపూడి రాజా కృషి చేయాలని కోరారు. బీసీలకు కాపు జాతి అన్యాయం చేయద్దని..కాపులు ఎవరికైనా కాపు కాస్తారే తప్ప అన్యాయం చేయరని తెలిపారు. కాపుల ఎదుగుదలను చంద్రబాబు అడ్డుకున్నారు:దాడిశెట్టి రాజా 70 శాతం ఉన్న కాపులను ఏ రంగంలో కూడా ఎదగనివ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కాపులకు అండగా ఉన్నారన్నారు. కాపు సంక్షేమానికి ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ కాపుల పక్షపాతి:సామినేని ఉదయభాను కాపుల పక్షపాతి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. కాపుల సంక్షేమాన్ని చంద్రబాబు విస్మరించారన్నారు.కాపు ప్రజా ప్రతినిధులకు పెద్దపీట వేసిన వ్యక్తి వైయస్ జగన్ అని కొనియడారు. -
రైతుల ఆత్మహత్యలకు కారణం చంద్రబాబే..
సాక్షి, తూర్పుగోదావరి : చంద్రబాబు చేసిన పాపాలతోనే నేటికీ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆరోపించారు. కోటనందూరు మండలం అప్పలరాజుపేటలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు బంగారు రాంబాబు కుటుంబాన్ని బుధవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్సార్ భరోసా పథకం క్రింద రూ. 7 లక్షల చెక్కును మృతుడి భార్య సూర్యకాంతం, పిల్లలు రమాదేవి, లక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ మీ అప్పులు మా బాధ్యత అని చెప్పీ 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు పీఠం ఎక్కాక రైతులను పూర్తిగా మోసం చేశారన్నారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న రైతు బంగారు రాంబాబు మృతి తనను ఎంతో కలచి వేసిందన్నారు. రాంబాబు మృతి సంఘటన తెలుసుకున్న సీఎం జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ భరోసా సాయాన్ని తక్షణమే అందజేయాలని ఆదేశించారన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న ఈ ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ కోటనందూరు, తుని మండల కన్వీనర్లు గొర్లి రామచంద్రరావు, పోతల రమణ, ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, కాకినాడ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు పెదపాటి అమ్మాజీ, పార్టీ నేతలు లాలం బాబ్జీ, నల్లమిల్లి గోవిందు, లగుడు శ్రీను, లంక ప్రసాద్, దొడ్డి బాబ్జీ, బొంగు గోపాలకృష్ణ, జిగటాల వీరబాబు, చింతకాయల చినబాబు, రుత్తల జోగిరాజు, కుంచే అచ్చిరాజు, వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్, ఎంపీడీఒ శర్మ, డీటీ కిరణ్‌కుమార్, ఏడీఎ సుంకర బుల్లిబాబు, ఏఒ వాణీ తదితరులు పాల్గొన్నారు. -
సస్పెన్స్ లవ్ స్టోరీ
హీరోగా పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మంగళవారం మొదలైంది. ఈ చిత్రంతో చిరుమామిళ్ల కృష్ణ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అమృత హరిణి క్రియేషన్స్ సురేష్ రెడ్డి, రియల్ రీల్స్ రాజారెడ్డి, శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ తలుపులమ్మ దేవస్థానంలో ప్రారంభమైంది. నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కెమెరా స్విచ్చాన్ చేయగా, తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా క్లాప్ ఇచ్చారు. సాయిరాం శంకర్ మాట్లాడుతూ–‘‘నేను ఇదివరకు నటించిన చిత్రాల్లోకి ఇది విభిన్న కథా చిత్రం అవుతుంది. నా కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘క్రైమ్, సస్పెన్స్, లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది. అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం’’ అన్నారు చిరుమామిళ్ల కృష్ణ. -
దాడిశెట్టి రాజాకు నోటీసులు
సాక్షి, తూర్పుగోదావరి/కాకినాడ : అధికార టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై వేధింపుల పర్వం కొనసాగిస్తోంది. పోలవరంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న క్రమంలో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై మూడేళ్ల క్రితం కేసు(ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ) నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి రాజాకు తుని పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. నేరుగా వైఎస్సార్ సీపీ కార్యాలయానికి వచ్చిన తుని రూరల్ ఎస్సై సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసు అందజేశారు. కాగా మూడేళ్ల తర్వాత.. అది కూడా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తనపై కక్ష్య సాధించేందుకే యనుమల సోదరులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ రాజా ఆరోపించారు. -
చంద్రబాబు, లోకేశ్ గ్రోత్ రేట్ పెరిగాయే తప్ప..
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతి, హత్యల్లో చంద్రబాబు నాయుడు నెంబర్ వన్‌గా చేశారని తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలోని అన్ని హామీలు అమలు చేశామని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ...వారి కార్యకర్తల ముందు కాకుండా ప్రజల ముందు చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. యనమల వయసుకు తగ్గట్టుగా మాట్లాడటం లేదని దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు కన్నబాబు మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల చంద్రబాబు, లోకేశ్ గ్రోత్ రేటులు పెరిగాయే తప్ప రైతులు, ప్రజల గ్రోత్ రేటు పెరగలేదన్నారు. గురువారం నుంచి జూన్ 5వ తేదీ వరకూ ప్రతి నియోజకవర్గంలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలు, అధికార పార్టీలో లోపాలపై చర్చించి తీర్మానాలు చేస్తామని అన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో జరిగిన వైఎస్ఆర్ సీపీ సమావేశంలో కురుసాల కన్నబాబు, కందుల దుర్గేష్, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, పిల్లి సుభాష్ చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ నేతలు పాల్గొన్నారు.