నువ్వు, నీ కుమారుడు ఇంట్లోనే ఉండిపోతారా? | Dadisetti Raja Slams Chandrababu Over Lockdown | Sakshi
Sakshi News home page

‘అది జరగలేదనే చంద్రబాబు తెగ కుమిలిపోతున్నాడు’

Published Fri, May 1 2020 3:35 PM | Last Updated on Fri, May 1 2020 3:53 PM

Dadisetti Raja Slams Chandrababu Over Lockdown - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి :  కరోనా కోసం చంద్రబాబు ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదించిన కరోనా నిర్మూలన వ్యాక్సిన్ వచ్చే వరకు నువ్వు, నీ కుమారుడు ఇంట్లోనే ఉండిపోతారా? అని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అప్పటి వరకు మీ పార్డీ క్యాడర్ తమ కార్యాకలపాలను ఆపేస్తుందా అని సవాల్‌ విసిరారు. శుక్రవారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఉండగా ఒక మీడియో హౌజ్‌కు చంద్రబాబు రూ.700 కోట్లు దారదత్తం చేశాడని విమర్శించాడు. ఎల్లో మీడియోను ప్రభుత్వం మీద ఉసుగొల్పుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎల్లో మీడియాకు ప్రకటనలు ఇవ్వడం మానేయాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నానన్నారు. (క్వారంటైన్‌ కేంద్రాలపై నిరంతర పరిశీలన: సీఎం జగన్‌ )

చంద్రబాబుకు పదిరోజుల సమయం ఇస్తున్నామని, ముందు హెరిటేజ్ కంపెనీలో సోకిన కరోనాను పారదోలి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచించాలన్నారు. ఎల్లో మీడియా, సమాజానికి పట్టిన చీడ పురుగుల్లా తయారైందని దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. ఒక వ్యాధి ప్రబలితే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లాగా పారిపోయే పరిస్ధితి తమకు లేదని, కరోనాను ఖచ్చితంగా ఎదుర్కోంటామన్నారు. తమ ప్రయాణం కొనసాగిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తామని స్పస్టం చేశారు. ఈ సమయంలో ఒకవేళ చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే, కరోనా పేరు చెప్పి రూ.20 వేల కోట్లు దోచేసేవాడని, అది జరగలేదనే చంద్రబాబు తెగ కుమిలిపోతున్నాడని ఆరోపించారు. యనమల రామకృష్ణుడు ధర్మ ప్రభువు అని, కరోనా భాధితుల కోసం రూ.లక్ష రూపాయలు విరాళం ఇచ్చాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (పీఎఫ్‌ ఉపసంహరణకు పోటెత్తిన ఉద్యోగులు.. )

ఆక్వారంగాన్ని తన భుజాలపై వేసుకున్నారు
తుని నియోజకవర్గం నుండి గెలిచి రాష్ట్ర ఖజానా నుంచి వేల కోట్లు యనమల దోచుకున్నాడని, చంద్రబాబు, యనమలని ఆంధ్రప్రదేశ్‌లో ఎవరడ్డుకుంటున్నరని ప్రశ్నించారు. ఒకసారి వీరిద్దరు రాష్టానికి వచ్చి ఒక క్వారంటైంన్‌ సెంటర్ను పరిశీలించాలని కోరుతున్నానన్నారు. తమ మూడుసార్లు ముఖ్యమంత్రి చరిత్రలో ఏనాడైనా ఉద్యానవన పంటలను మద్దతు ధర ఇచ్చి కొన్నావా అని చంబ్రాబును నిలదీశారు. లాక్‌డౌన్ వేళ ఆక్వారంగాన్ని తన భుజాలపై వేసుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కష్టాల్లో నుంచి లాభాల్లోకి తీసుకు వచ్చారని ప్రశంసించారు. అదే బాబు అధికారంలో ఉంటే ఆక్వా రైతుల నడ్డి విరిచి తన వాళ్ళతో సిండికేట్ పెట్టించి దోచుకునేవాడని విమర్శించారు. రాష్ట్రం ఇబ్బందికర పరిస్ధితుల్లో ఉన్నా, సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా అన్నారు. (వూహాన్‌లో క‌న్నీళ్లు పెట్టుకున్న డెలివ‌రీ బాయ్‌ )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement