సస్పెన్స్‌ లవ్‌ స్టోరీ | Puri Jagannath's brother Sairam Shankar new movie launch | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌ లవ్‌ స్టోరీ

Published Wed, Jul 3 2019 2:42 AM | Last Updated on Wed, Jul 3 2019 2:42 AM

Puri Jagannath's brother Sairam Shankar new movie launch - Sakshi

సాయిరామ్‌ శంకర్, దాడిశెట్టి రాజా, ఉమాశంకర్‌

హీరోగా పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ సోదరుడు సాయిరాం శంకర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మంగళవారం మొదలైంది. ఈ చిత్రంతో చిరుమామిళ్ల కృష్ణ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అమృత హరిణి క్రియేషన్స్‌ సురేష్‌ రెడ్డి, రియల్‌ రీల్స్‌ రాజారెడ్డి, శ్రీ శరణం అయ్యప్ప క్రియేషన్స్‌ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ తలుపులమ్మ దేవస్థానంలో ప్రారంభమైంది.

నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా క్లాప్‌ ఇచ్చారు. సాయిరాం శంకర్‌ మాట్లాడుతూ–‘‘నేను ఇదివరకు నటించిన చిత్రాల్లోకి ఇది విభిన్న కథా చిత్రం అవుతుంది. నా కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘క్రైమ్, సస్పెన్స్, లవ్‌ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది. అన్ని కమర్షియల్‌ అంశాలు ఉంటాయి. ఆగస్టులో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనున్నాం’’ అన్నారు చిరుమామిళ్ల కృష్ణ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement