Uma Shankar Ganesh
-
వైఎస్సార్సీపీ నేతల అరెస్టులపై మండిపడ్డ ఉమాశంకర్ గణేష్
-
‘ఇసుక దొంగలను వదిలేసి.. వైఎస్సార్సీపీ నేతలపై కేసులా?’
సాక్షి, అనకాపల్లి: ఇసుక దొంగలను వదిలేసి వైఎస్సార్సీపీ నేతలపై తప్పులు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ అన్నారు. ఇసుకను టీడీపీ నేతలు అక్రమంగా రాత్రికి రాత్రే తరలించుకుపోతున్నారని ధ్వజమెత్తారు. ఇసుక దొంగలపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేస్తే, తిరిగి వారి మీదే అక్రమ కేసులు బనాయించారంటూ మండిపడ్డారు.పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. పోలీసుల తప్పుడు కేసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. స్పీకర్ అయ్యన్న ఒత్తిడితోనే వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీసులు పెట్టే తప్పుడు కేసులకు మేము భయపడం. వైఎస్సార్సీపీ నేతలతో కలిసి నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తామని ఉమాశంకర్ గణేష్ హెచ్చరించారు. -
ఎందుకు టీడీపీకు ఓటు వేశామా అని ప్రజలు బాధపడుతున్నారు
-
పేరుకే ఫ్రీ.. ఇసుక దోపిడీకి టీడీపీ కొత్త స్కెచ్
-
నర్సీపట్నం ఇసుక డిపోలో!
సాక్షి, అనకాపల్లి జిల్లా: నర్సీపట్నం ఇసుక డిపోలో రూ.5 కోట్ల విలువైన ఇసుక తరలించేందుకు టీడీపీ నేతలు ప్లాన్ వేశారని.. ఉచిత ఇసుక అంటూ ప్రజల్ని టీడీపీ మోసం చేస్తోందంటూ నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ మండిపడ్డారు.టన్నుకు కేవలం రూ.175 తగ్గించి ఉచిత ఇసుక అంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమ్తెతారు. మా ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్లకు ఇసుక ఉచితంగా ఇచ్చామని ఉమాశంకర్ అన్నారు. డిపోకి వచ్చిన, అమ్మిన ఇసుక వివరాలు వెల్లడించాలని అధికారులను ఉమా శంకర్ గణేష్ కోరారు.కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని టీడీపీ సర్కారు చెబుతున్న మాటలు మాయ నాటకాలని తేలిపోయింది! ఉచిత ఇసుక విధానాన్ని సోమవారం నుంచి అమల్లోకి తెస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించినా స్టాక్ యార్డుల వద్ద మాత్రం ధరల పట్టికలు పెట్టడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత ఇసుక హామీకి స్టాక్ యార్డుల వద్ద పెట్టిన ధరల పట్టికలతో సీఎం చంద్రబాబు తూట్లు పొడిచారు. -
గబ్బాడ యార్డులో రూ.5 కోట్ల ఇసుక మయం
నర్సీపట్నం: కూటమి అధికారంలోకి వచి్చన తర్వాత టీడీపీ నాయకులు పాల్పడిన ఇసుక దోపిడీపై విచారణ చేపట్టి, దోపిడీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో భారీఎత్తున ఇసుక దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలకు ముందు నర్సీపట్నం గబ్బాడ యార్డులో లక్ష టన్నుల ఇసుక ఉండేదన్నారు.ఫలితాలు వెలువడిన మరుసటి రోజే టీడీపీ నాయకులు యార్డును స్వా«దీనం చేసుకున్నారని చెప్పారు. లక్ష టన్నులు ఉండాల్సిన ఇసుక ప్రస్తుతం 48 వేల టన్నులే ఉందని అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యార్డులోని రూ.5 కోట్లు విలువ చేసే ఇసుకను వాహనాల్లో తరలించి టీడీపీ నాయకులు సొమ్ము చేసుకున్నారని మండిపడ్డారు.యార్డులోని 60 వేల టన్నుల ఇసుకను మాయం చేశారన్నారు. గబ్బాడ ఇసుక దోపిడీపై అధికారులు సమగ్రమైన విచారణ జరిపితే వాస్తవాలు బయటపడతాయని చెప్పారు. ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను నయవంచనకు గురిచేసిందని గణేష్ దుయ్యబట్టారు. ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారన్నారు. పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడికి గణేష్ అదిరిపోయే కౌంటర్
-
Narsipatnam: బాబాయ్‌ను గెలిపించు స్వామీ..
కోటవురట్ల: వర్థమాన హీరో, సినీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ శనివారం పాత తంగేడులో సందడి చేశారు. ఇక్కడ నూతనంగా నిర్మించిన దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం స్థానిక యువకులతో సెల్ఫీలు దిగారు. పరిచయస్తులు, బంధువులు ఆకాష్ పూరీతో కాసేపు ముచ్చటించారు. తాను నటిస్తున్న, ఒప్పుకున్న సినిమా కబుర్లు వారితో పంచుకున్నారు. ఆకాష్ పూరీ మాట్లాడుతూ తన బాబాయ్ పెట్ల ఉమాశంకర గణేష్ నర్సీపట్నం నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావడంతో ఆయన గెలుపులో తాను భాగస్వామి కావాలనే ఉద్దేశంతో వచ్చినట్టు తెలిపారు. ఫ్యాను గుర్తుపై ఓటేసి బాబాయ్ ఉమాశంకర గణేష్‌ను గెలిపించాలని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించినట్టు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే తన బాబాయ్‌ను గెలిపిస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు. చాలా సింపుల్‌గా, సౌమ్యంగా అందరితో కలిసిపోయే మంచి వ్యక్తిత్వం కలిగిన బాబాయ్ గెలుపు తథ్యం అన్నారు. సీఎం జగన్ సహకారంతో నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధిలో తక్కువ కాలంలోనే బాబాయ్ తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. నియోజకవర్గ ప్రజలు మరోసారి బాబాయ్ గణే‹Ùను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. -
'అయ్యన్న పాత్రుడు సైకో, శాడిస్టు.. ఆయన చరిత్ర అందరికీ తెలుసు'
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత అయ్యన్న పాత్రుడును ఏకి పారేశారు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్. ఆయన ఒక సైకో, శాడిస్డు అని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌లు పెద్ద సైకోలు అని ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుడు చరిత్ర అందరికి తెలుసని, నర్సీపట్నంను గంజాయి అడ్డాగా మార్చిన చరిత్ర ఆయనదని విమర్శలు గుప్పించారు. 'రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీ ముఠా చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు. అయ్యన్న కంటే మేము బూతులు మాట్లాడగలము. అయ్యన్న నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారు. జన్మభూమి కమిటీల్లా బ్రోకర్లలా కాకుండా వలంటీర్ల వ్యవస్థ పని చేస్తుంది. పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు ఉందా? 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా? ఓడిపోతామనే భయంతో అన్ని పార్టీల నేతల ఇంటికి అయ్యన్నపాత్రుడు తిరుగుతున్నారు. వెయ్యి మంది చంద్రబాబులు, లక్ష మంది అయ్యన్నపాత్రుడులు వచ్చినా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు. రూ. 500 కోట్లతో మెడికల్ కాలేజీ ఇచ్చారు. రూ.470 కోట్లతో తాండవ ఏలేరు కాలువ నదులను అనుసంధానం చేశారు' అని ఉమా శంకర్ గణేశ్ వ్యాఖ్యానించారు. చదవండి: శ్రీవారి ఆలయం డ్రోన్ విజువల్స్‌పై టీటీడీ సీరియస్.. విచారణకు ఆదేశం -
చెరువు కాల్వను ఆక్రమించి అయ్యన్న ప్రహరీ గోడ నిర్మించాడు : ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్
-
ఎమ్మెల్యేలు ఎలీజా, గణేష్‌లకు సీఎం పరామర్శ
చింతలపూడి/నర్సీపట్నం: ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా ఇటీవల అస్వస్థతకు గురవ్వడంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం శస్త్రచికిత్స చేశారు. ఆయనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులను కోరారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే సతీమణి ఝాన్సీరాణితో కూడా ఫోన్లో మాట్లాడిన సీఎం ఆమెకు ధైర్యం చెప్పారు. అలాగే మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించిన బైక్ ర్యాలీలో గాయపడి విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్‌ను ఆదివారం ఫోన్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదీ చదవండి: ఆర్టీసీ బస్సులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల ఓవరాక్షన్.. కౌంటర్ ఇచ్చిన మహిళలు! -
అయ్యన్నకు మతిభ్రమించింది
నర్సీపట్నం: టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మతిభ్రమించి మాట్లాడుతున్నారని నర్సీపట్నం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నర్సీపట్నం మునిసిపాలిటీ ప్రజల దాహార్తిని తీర్చేందుకు తమ ప్రభుత్వం రూ.166.89 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టిందన్నారు. అయితే టీడీపీ హయాంలోనే ఈ ప్రాజెక్టును తెచ్చామని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ హయాంలోనే ఈ ప్రాజెక్టు వచ్చి ఉంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేకపోయిందని నిలదీశారు. అయ్యన్నపాత్రుడు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నర్సీపట్నానికి చేసిందేమీ లేదన్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు రూ.56 కోట్ల ప్యాకేజీ–2కి టెండర్లు పిలిచారన్నారు. ఏలేరు నీటిని తీసుకునేందుకు అనుమతులు రాకపోయినా.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అప్పట్లో కేవలం పైపులకు టెండర్లు పిలిచారని మండిపడ్డారు. -
Liger Movie: థియేటర్ వద్ద రచ్చ చేసిన పూరీ ఫ్యామిలీ
నర్సీపట్నం: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ సినిమా రిలీజ్ కావడంతో నర్సీపట్నంలో అభిమానుల సందడి నెలకొంది. రాజు థియేటర్ వద్ద అభిమానుల కోలాహలం మిన్నంటింది. పూరీ జగన్నాథ్ సోదరుడు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, పూరీ సతీమణి లావణ్య, కుమార్తె పవిత్ర, మిగతా కుటుంబ సభ్యులతో రాజు థియేటర్లో సినిమాను తిలకించారు. అభిమానులు భారీ ఎత్తున బాణసంచా పేల్చారు. సినిమా తిలకించిన అనంతరం థియేటర్ ఆవరణలో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను ఎమ్మెల్యే గణేష్, పూరీ సతీమణి లావణ్య, కుమార్తె పవిత్ర, ఎమ్మెల్యే సతీమణి కళావతి కట్ చేసి అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా లావణ్య మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందనడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: (గణేష్ మండపం పెడుతున్నారా? ఈ అనుమతులు తప్పనిసరి) -
రూ.10 కోట్లతో 100 ఆలయాలు
నాతవరం: ఎంతో చరిత్ర కలిగిన ఈరుడుకొండపై శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం నిర్మాణం చేయడం ఆనందాయకమని ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ అన్నారు. నాతవరం సమీపంలో ఉన్న ఈరుడికొండపై రూ.3కోట్లతో శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం నిర్మించేందుకు శుక్రవారం కశింకోట శ్రీమారుతీరామానుజచార్యులు అధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రబ్యాంకు చైర్మన్ చింతకాయల అనిత సన్యాసిపాత్రుడు దంపతులు, డీసీసీబీ డైరెక్టరు అంకంరెడ్డి జమీలు పార్వతి దంపతులు, అన్ని వర్గాలకు చెందిన 27 దంపతులతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ నియోజకవర్గం నాలుగు మండలాల్లో రూ.10కోట్లతో సుమారుగా 100 ఆలయాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. ఆలయానికి రూ.10 లక్షల వరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రతిపాదనలు పంపించిన ఆలయాలకు గ్రామాల్లో ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారని తెలిపారు. మరో సింహచలం కానున్న నాతవరం ఉమ్మడి జిల్లాలో ఉన్న శ్రీనృసింహస్వామి ఆలయం కారణంగా సింహాచలానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని డీసీసీబీ చైర్మన్ చింతకాయల అనిత సన్యాసిపాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లాలో నిర్మించనున్న శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంతో నాతవరం గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. ఆలయాల నిర్మాణంతో ప్రజల్లో భక్తిభావం పెరిగి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారన్నారు. నాతవరం గ్రామానికి సమీపంలో ఎత్తయిన ఈరుడి కొండపై 500 ఏళ్లు పైగా చెట్టు పొదలో ఉన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి రాతి విగ్రహాలకు గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ ప్రాంతంలో పురాతన రాతి విగ్రహాలు బయటపడ్డాయి. వాటిని పరిశీలించిన డీసీసీబీ డైరెక్టరు అంకంరెడ్డి జమీలు ఈ కొండపై ఆలయం నిర్మాణం చేయాలని గ్రామస్తులతో కలిసి నిర్ణయించారు. ఎత్తయిన కొండపై రూ.15లక్షలతో ఎకరం స్థలాన్ని చదును చేయించారు. కొండ చుట్టూ ఘాట్‌రోడ్డు ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో రూ.3 కోట్లతోశ్రీలక్ష్మీనృసింహస్వామి ప్రధాన ఆలయంతో పాటు కొండచుట్టూ తొమ్మిది ఆలయాలు నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, జెడ్పీటీసీ అప్పలనర్స, వైస్ ఎంపీపీ సునీల్, ఎంపీడీవో నాగలక్ష్మి, నాతవరం సర్పంచ్ గొలగాని రాణి, ఎంపీటీసీ రేణుక తదితరులు పాల్గొన్నారు. -
అయ్యన్నపాత్రుడిపై ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ ఫైర్
-
3 రాజధానుల నుంచి జనం దృష్టి మరల్చేందుకే..
నర్సీపట్నం: చింతకాయల అయ్యన్నపాత్రుడు పిచ్చి ప్రేలాపన మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్ హెచ్చరించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక నేరస్థుడైన అయ్యన్నపాత్రుడే ఆర్థిక నేరాల గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఎన్ని ఆస్తులున్నాయో.. రాజకీయాల్లోకి వచ్చాక వేల కోట్లు ఎలా సంపాదించావో చెప్పాలని డిమాండ్ చేశారు. తమపై వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి, రాయలసీమ ప్రజల మూడు రాజధానుల ఉద్యమం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే పిచ్చి తుగ్లక్ లాంటి అయ్యన్నపాత్రుడితో చంద్రబాబు, లోకేశ్‌లు పిచ్చి ప్రేలాపనలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎల్లో మీడియాకు మేత కోసమే అయ్యన్నపాత్రుడు మందు కొట్టి మాట్లాడుతున్నారని.. ఆయనవి మత్తు మాటలు.. మందు మాటలు.. మతిలేని మాటలంటూ ఎద్దేవా చేశారు. సుదీర్ఘకాలం మంత్రిగా వెలగబెట్టిన అయ్యన్నపాత్రుడు నర్సీపట్నాన్ని గంజాయి అడ్డాగా మార్చారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా అతను ఏం చేశాడన్నది చూస్తే.. గంజాయి రవాణా తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. తండ్రీకుమారులు ఇద్దరి చేతిలోనూ ఓడిపోయారు.. సిగ్గు లేదా చంద్రబాబు? 2019 ఎన్నికల్లోనే కాక.. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓడిపోయినందుకు, వైఎస్సార్ చేతిలో, ఆయన కుమారుడు వైఎస్ జగన్ చేతిలో ఓడినందుకు సిగ్గుతో రాజీనామా చేయాల్సింది చంద్రబాబేగానీ, ప్రతి రూపాయినీ ప్రజల కోసమే ఖర్చు చేస్తున్న సీఎం జగన్ కాదని ఉమాశంకర్‌గణేశ్ స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు, లోకేశ్‌లు రూ.241 కోట్లను అప్పనంగా కొట్టే్టశారని ప్రజలు గుర్తించారని, సంతకం పెట్టిందెవరన్నది కాదు.. బస్తాల్లో డబ్బులు పట్టుకుపోయిందెవరన్నదే ముఖ్యమన్న విషయాన్ని అయ్యన్నపాత్రుడు తెలుసుకోవాలంటూ ఉమాశంకర్ గణేశ్ హితవుపలికారు. -
అయ్యన్న వ్యాఖ్యలపై వైఎస్ఆర్ సీపీ నేతలు ఆగ్రహం
-
టీడీపీ హయాంలోనే లేటరైట్ దోపిడీ
నర్సీపట్నం: విశాఖ జిల్లా సరుగుడు ప్రాంతంలో రూ.లక్షల కోట్ల విలువైన లేటరైట్‌ను టీడీపీ నాయకులు లూటీ చేశారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు, లోకేష్, అయ్యన్నపాత్రుడు కలిసి విలువైన ఖనిజాన్ని దోచుకున్నారని ధ్వజమెత్తారు. గిరిజన గ్రామాలకు ప్రభుత్వం రహదారి సౌకర్యం కల్పిస్తే.. చూసి ఓర్వలేక నిజనిర్ధారణ కమిటీ పేరుతో అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో ఆ ప్రాంత టీడీపీ నాయకులు రాద్ధాంతం చేయటం విడ్డూరంగా ఉందని శనివారం ఆయన మీడియాతో అన్నారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో టీడీపీ ప్రభుత్వమే 13 లేటరైట్ లీజులు మంజురు చేసిందని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోర్టు ఆదేశాల మేరకు ఒకేఒక్క లీజు ఇచ్చిందన్నారు. 20లక్షల టన్నుల లేటరైట్ లూటీ నర్సీపట్నం నియోజకవర్గంలోని సుందరకోట, తోరడ గ్రామాల్లో లేటరైట్ తవ్వకాలు జరిపింది నిజం కాదా అని అయ్యన్నపాత్రుడిని ఉమాశంకర్ గణేష్ ప్రశ్నించారు. చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు అండ్ కో కలిసి కోటి 20 లక్షల టన్నుల లేటరైట్‌ను లూటీ చేసిందన్నారు. ఈ ఖనిజాన్ని లోకేష్ బినామీ కంపెనీ అయిన అండ్రో మినరల్స్‌కు కట్టబెట్టిన సంగతి అయ్యన్నపాత్రుడు గుర్తుచేసుకోవాలని ఆయనన్నారు. అలాగే, సుందరకోట, తోరడ గ్రామాల్లోని లేటరైట్‌ను తరలించేందుకు అయ్యన్నపాత్రుడు కనుసన్నల్లోనే కొండలను తొలచి, వేల చెట్లను నేలకూల్చి అక్రమంగా రోడ్డు వేసిన విషయం ఈ ప్రాంత ప్రజలకు తెలుసునన్నారు. అప్పట్లో లేటరైట్ లూటీపై కథనాలు రాసిన ‘సాక్షి’ విలేకరిపై హత్యాయత్నం, అడ్డుకున్న గిరిజనులపై అక్రమ కేసులు పెట్టించింది నువ్వు కాదా.. అని అయ్యన్నపాత్రుడిని ప్రశ్నించారు. ఆందోళనల పేరుతో లేటరైట్ అక్రమాల నుంచి తప్పించుకోవాలని అయ్యన్నపాత్రుడు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజానికి అయ్యన్న అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేయించి రూ.17 కోట్లు పెనాల్టీ విధించిందన్నారు. ప్రస్తుతం సిట్ విచారణ కొనసాగుతుండడంతో అక్రమాలు ఎక్కడ బయటపడతాయనే భయంతో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. బినామీ అయిన సింగం భవాని అనే గిరిజన మహిళ పేరుతో సుందరకోటలో అయ్యన్నపాత్రుడు, తనయుడు విజయ్ లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వేస్తున్నారని.. ప్రస్తుత టీడీపీ నాయకుడు రుత్తల యర్రాపాత్రుడు అప్పట్లో హైకోర్టులో పిల్ వేశారన్నారు. దీనిని విచారించిన హైకోర్టు బాక్సైట్ కాదు.. లేటరైట్ అని తీర్పు ఇచ్చిందన్నారు. -
ఆ ఘనత జగన్‌దే.. గర్వంగా చెబుతున్నా..
సాక్షి, నర్సీపట్నం: టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఉత్తరాంధ్ర ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిని భ్రమరావతిగా చూపి టీడీపీ నేతలు అక్కడ భూములను దోచుకున్నారని ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి 60 కూడా నెరవేర్చని చేతగాని ప్రభుత్వం టీడీపీ అని విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో 90 శాతం హామీలు నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానిదేనని గర్వంగా చెబుతున్నామన్నారు. చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని ఉమాశంకర్ గణేష్ హితవు పలికారు. -
సుధాకర్‌కు ఎమ్మెల్యే సీటు ఇస్తామని..
సాక్షి, విశాఖపట్నం : దళితుడైన అనస్థీషియా డాక్టర్ సుధాకర్‌కు పాయకరావుపేట ఎమ్మెల్యే సీటు ఇస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మోసం చేశారని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. సుధాకర్ మాటలపై అయ్యన్న సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయ్యన్నపాత్రుడు తనను కుక్కలా వాడుకున్నాడని సుధాకర్ చెబుతుంటే.. అయ్యన్న మాత్రం ఆయనతో పెద్దగా పరిచయం లేదని చెప్పటం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. సోమవారం ఉమాశంకర్ గణేష్ మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి డాక్టర్ సుధాకర్‌కు ఎమ్మెల్యే సీటు ఇస్తామని ఆశ చూపి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. దళితుడైన సుధాకర్‌ను తమ రాజకీయం కోసం చంద్రబాబు, అయ్యన్నలు బలి చేశారని అన్నారు. ( ‘అయ్యన్న పాత్రుడి ఇంట్లోనే ఆయనకు తర్ఫీదు ఇచ్చారు’ ) చంద్రబాబు, అయ్యన్న కలిసి శాడిస్టుల్లా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైజాగ్ టీడీపీ కార్యాలయం వేదికగా ప్రభుత్వంపై డాక్టర్ సుధాకర్‌తో కలిసి అయ్యన్నపాత్రుడు కుట్ర చేశారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందచేస్తున్న మొనగాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. ప్రజలు తమను మర్చిపోతారేమోనన్న భయంతో చంద్రబాబు, అయ్యన్నలు దళితులతో డ్రామాలాడించడం దళితులను మోసం చేయడమేనని అన్నారు. ( ‘బాబు చేతిలో ఆ డాక్టర్ కీలు బొమ్మ’ ) కాగా, ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్.. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు, డాక్టర్ సుధాకర్ల మధ్య బంధాన్ని బైట పెట్టారు. అయ్యన్న పాత్రుడు గురించి డాక్టర్ సుధాకర్ మాట్లాడిన వీడియోను ఆయన వెలుగులోకి తెచ్చారు. ‘‘ నన్ను అయ్యన్నపాత్రుడు కుక్కలా వాడుకున్నాడు’’ అని సుధాకర్ మాట్లాడిన వీడియో అది. -
‘బాబు చేతిలో ఆ డాక్టర్ కీలు బొమ్మ’
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి అయ్యనపాత్రుడి చేతుల్లో డాక్టర్ సుధాకర్ కీలు బొమ్మలా మారాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ విమర్శించారు. టీడీపీ నేతల పథకం ప్రకారమే డాక్టర్ సుధాకర్ నడిరోడ్డుపై వీరంగం సృష్టించారని మండిపడ్డారు. ఇందుకోసం టీడీపీ కార్యాలయం ముందుగానే ఓ లేఖ తయారుచేసిందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే సుధాకర్ విషయంలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కులాన్ని లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి : ‘బాబును దళిత సమాజం ఏనాడు క్షమించదు’) 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పాయకరావుపేట సీటు కోసం సుధాకర్ ప్రయత్నం చేశారని తెలిపారు. ఎమ్మెల్యే సీటు కోసం సుధాకార్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఆ లేఖను వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు సమర్పించారని చెప్పారు. ఎమ్మెల్యే సీటు రాకపోవడంతో వైద్య విధాన పరిషత్ కమిషన్ ఆ లేఖను ఆమోదించలేదని వివరించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత రోజే ఉద్యోగానికి రాజీనామా లేఖ సమర్పించిన సుధాకర్.. సీటు లభించకపోవడంతో తిరిగి ఉద్యోగంలో చేరాడని విమర్శించారు. (చదవండి : చంద్రబాబు డైరెక్షన్లో.. డాక్టర్ సుధాకర్) -
అయ్యన్నా.. చౌకబారు విమర్శలు మానుకో
సాక్షి, నర్సీపట్నం : ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేస్తే మాజీ మత్రి అయ్యన్నపాత్రుడుకు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హెచ్చరించారు. పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనాపై అయ్యన్నపాత్రుడు రాజకీయం చేయడం సిగ్గు చేటు అన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు పక్కనపెట్టి ప్రజలకు అండగా నిలవాల్సిన అయ్యన్నపాత్రుడు తీరు పట్ల ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. ఇప్పుడు రాష్ట్ర రాజధాన్ని విశాఖపట్నానికి తరలించేందుకు కరోనా కేసులు దాచిపెడుతున్నారని, పరిపాలన రాజధాన్ని విశాఖకు తరలిస్తున్నారంటూ అయ్యన్నపాత్రుడు రాజకీయం చేస్తున్నారన్నారు. కరోనా కేసులు దాయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్న ఆయన గుర్తించుకోవాలన్నారు.కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్మోహన్రెడ్డిని జాతీయ మీడియా ప్రశంసించిన విషయాన్ని గుర్తించుకోవాలని హితువు పలికారు. ప్రజలకు సహాయపడకుండా టీడీపీ నాయకుడు చంద్రబాబు హైదరాబాద్, అయ్యన్నపాత్రుడు విశాఖలో ఉంటూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు తీర్పు తెలుగు వారి విజయంగా పేర్కొన్న అయ్యన్నపాత్రుడు తన పిల్లలను ఏ మీడియంలో చదివించారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే టీడీపీ నాయకులు అడ్డుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు మనవుడిని ఎక్కడ చదివిస్తున్నాడో అయ్యన్నపాత్రుడు సమాధానం చెప్పాలన్నారు. తమ పార్టీ నాయకులు, పెద్దలను అగౌరవ పరిచే విధంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఎమ్మెల్యే హెచ్చరించారు. -
గణేష్ ఆధ్వర్యంలో విశాఖలో భారీ ర్యాలీ
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర కార్యనిర్వహక రాజధానిగా విశాఖను గుర్తించినందుకు నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు కృతజ్ఞతగా సోమవారం విశాఖలో 5 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. అధికార వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో ప్రణాళికాబద్ధంగా పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. -
నెల్లూరు జిల్లా టీడీపీకి మరో షాక్
-
టీడీపీకి వరుస షాక్‌లు
సాక్షి, నెల్లూరు/విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలు నచ్చక నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీ నేత కువ్వారపు బాలాజీతో పాటు వందలాది మంది కార్యకర్తలు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సమక్షంలో వీరంతా వైఎస్సార్సీపీలోకి వచ్చారు. వీరిని మంత్రి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు చూసి వైఎస్సార్సీపీలో చేరినట్టు ఈ సందర్భంగా కువ్వారపు బాలాజీ తెలిపారు. వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు.. విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్, ఆడారి ఆనంద్ సమక్షంలో మాకవరపాలెం మండలం గిడుతూరు గ్రామానికి చెందిన 500 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పట్ల ఆకర్షితులై పెద్ద ఎత్తున ఇతర పార్టీల నాయకులు వైఎస్సార్సీపీలో చేరుతున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని తెలిపారు. నవరత్నాలు పథకాల ద్వారా పేదలకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. రైతు భరోసా, పింఛన్ల పెంపు, అమ్మఒడి పథకాలు ప్రవేశ పెట్టడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. (చదవండి: వైఎస్సార్ సీపీలోకి ఆకుల, జూపూడి)