'బాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు' | uma shankar ganesh, pila vijaya kumar speech in jai andhra pradesh meeting | Sakshi
Sakshi News home page

'బాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు'

Published Sun, Nov 6 2016 4:40 PM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

'బాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు'

'బాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు'

విశాఖపట్నం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే అభివృద్ధి చెందడమే కాకుండా, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మచిలీపట్నం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఉమా శంకర్ గణేశ్ అన్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వైఎస్‌ఆర్‌ సీపీ నిర‍్వహిస్తున్న జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు 15 ఏళ్లు హోదా కావాలన్న చంద్రబాబు అధికారంలోకి రాగానే స్పెషల్ ప్యాకేజీ అంటూ మాట మార్చారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజీలేని పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి రైతు, మహిళ, అన్ని వర్గాలు వారు సంతోషంగా ఉండాలంటే జగన్ సీఎం కావాలని అభిప్రాయపడ్డారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీల సాధన కోసం ఒక్కపక్క, ప్రత్యేక హోదా కోసం మరో పక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాడుతున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త పైలా విజయ కుమార్ అన్నారు. ప్రతిపక్షం పాత్రకు జగన్ సంపూర్ణ న్యాయం చేస్తున్నారని ప్రశంసించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు గాలికి వదిలేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా మాటను చంద్రబాబు మర్చిపోయారని విమర్శించారు. ప్రతిదాన్ని నంబర్ వన్ చేస్తానని చెబుతున్న చంద్రబాబు.. హుద్ హుద్ తుపాను బాధితులకు ఎటువంటి సహాయం చేయలేదన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజలకు గమనిస్తున్నారని హెచ్చరించారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement