Narsipatnam: బాబాయ్‌ను గెలిపించు స్వామీ.. | akash puri durga malleswara temple Puja to win to Umashankara Ganesh | Sakshi
Sakshi News home page

Narsipatnam: బాబాయ్‌ను గెలిపించు స్వామీ..

Published Sun, Apr 28 2024 12:32 PM | Last Updated on Sun, Apr 28 2024 12:34 PM

akash puri durga malleswara temple Puja to win to Umashankara Ganesh

కోటవురట్ల: వర్థమాన హీరో, సినీ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరీ శనివారం పాత తంగేడులో సందడి చేశారు. ఇక్కడ నూతనంగా నిర్మించిన దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం స్థానిక యువకులతో సెల్ఫీలు దిగారు. పరిచయస్తులు, బంధువులు ఆకాష్‌ పూరీతో కాసేపు ముచ్చటించారు. తాను నటిస్తున్న, ఒప్పుకున్న సినిమా కబుర్లు వారితో పంచుకున్నారు. 

ఆకాష్‌ పూరీ మాట్లాడుతూ తన బాబాయ్‌ పెట్ల ఉమాశంకర గణేష్‌ నర్సీపట్నం నియోజకవర్గం వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావడంతో ఆయన గెలుపులో తాను భాగస్వామి కావాలనే ఉద్దేశంతో వచ్చినట్టు తెలిపారు. ఫ్యాను గుర్తుపై ఓటేసి బాబాయ్‌ ఉమాశంకర గణేష్‌ను గెలిపించాలని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించినట్టు తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే తన బాబాయ్‌ను గెలిపిస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు. 

చాలా సింపుల్‌గా, సౌమ్యంగా అందరితో కలిసిపోయే మంచి వ్యక్తిత్వం కలిగిన బాబాయ్‌ గెలుపు తథ్యం అన్నారు. సీఎం జగన్‌ సహకారంతో నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధిలో తక్కువ కాలంలోనే బాబాయ్‌ తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. నియోజకవర్గ ప్రజలు మరోసారి బాబాయ్‌ గణే‹Ùను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement