Akash Puri
-
దీన స్థితిలో పావలా శ్యామల.. సాయం చేసిన పూరీ తనయుడు
సీనియర్ నటి పావలా శ్యామల (Pavala Syamala) కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల ఆమె ఆరోగ్యం మరింత దిగజారింది. కనీసం మాట్లాడేందుకు కూడా శరీరం సహకరించడం లేదు. ఎవరైనా దయతలచి ఆదుకోమని చేతులెత్తి వేడుకుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో చూసిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ చలించిపోయాడు.ఆర్థిక సాయంహైదరాబాద్ శివార్లో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీలో నివాసముంటున్న శ్యామలను కలుసుకున్నాడు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని రూ.1 లక్ష ఆర్థిక సాయం చేశాడు. దీంతో శ్యామల ఎమోషనలైంది. డబ్బు ఎవరైనా సంపాదిస్తారు కానీ మంచి మనసు మాత్రం ఎవరూ సంపాదించలేరు. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని ఆశీర్వదించింది.చదవండి: సైఫ్‌ను ఆవేశంతో పొడిచాడు.. నా నగల జోలికి వెళ్లలేదు: కరీనా -
ప్రతి ఇండస్ట్రీ మన తెలుగు ప్రేక్షకుల వైపే చూస్తోంది: ఆకాశ్ జగన్నాథ్
లక్ష్మణ మూర్తి రతన, భ్రమరాంబిక తూటిక లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘సీతారం సిత్రాలు’. డి. నాగ శశిధర్ రెడ్డి దర్శకత్వంలో పి. పార్థసారథి, డి. నాగేంద్ర రెడ్డి, కృష్ణ చంద్ర విజయబట్టు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన హీరో ఆకాశ్ జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘ప్రతి ఇండస్ట్రీ మన తెలుగు ప్రేక్షకుల వైపే చూస్తోంది. సినిమా బాగుంటే పెద్ద విజయాన్ని అందిస్తారు. ‘సీతారం సిత్రాలు’ని ప్రేక్షకులు సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘గుడికి వెళితే ఎంత ప్రశాంతత లభిస్తుందో, ఈ సినిమా చూస్తే ప్రేక్షకులకు అంతే ప్రశాంతత లభిస్తుంది’’ అని తెలిపా లక్ష్మణ మూర్తి. ‘‘జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, రేలంగిగార్ల సినిమాల్లా మా ‘సీతారం సిత్రాలు’ ప్రేక్షకులకు మంచి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది’’ అన్నారు నాగ శశిధర్ రెడ్డి. ‘‘మా చిన్న సినిమాను ప్రేక్షకులు ఆదరించి, పెద్ద సక్సెస్ చేయాలి’’ అని పేర్కొన్నారు నిర్మాతలు. -
రెండేళ్ల నుంచి ఖాళీగా ఏం లేను: ఆకాశ్
తండ్రీకొడుకులకు టైం బాగోలేనట్లుంది.. అటు పూరీ జగన్నాథ్ లైగర్, డబుల్ ఇస్మార్ట్‌తో వరుస పరాజయలు అందుకోగా మరోవైపు ఆకాశ్ పూరీ రెండేళ్లక్రితం చోర్ బజార్‌తో ఫ్లాప్ అందుకున్నాడు. అప్పటినుంచి మళ్లీ వెండితెరపై కనిపించనేలేదు. తాజాగా సోషల్ మీడియాలో తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చాడు.ఒకటే ప్రశ్న..నేను ఈ వీడియో పెట్టడానికి ప్రధాన కారణం... ఏం సినిమా చేస్తున్నావ్? అంటూ చాలారోజుల నుంచి అందరూ అడుగుతూ ఉన్నారు. సినిమా ప్రకటించి రెండేళ్లయిపోయింది.. చాలాకాలంగా ఖాళీగా ఎందుకుంటున్నావ్? అని అడుగుతున్నారు. ఖాళీగా ఏం లేను.. జాగ్రత్తగా ఉంటున్నానంతే!ఈసారి గట్టిగా..ఎన్నో కథలు విన్నాను. నాకు మంచి ప్రొడక్షన్ హౌస్ దొరికింది. మంచి దర్శకుడు, నిర్మాతలు దొరికారు. చాలా కథలు వింటూ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉండేవాడిని. దేవుడి దయ వల్ల, నేను నమ్మిన అమ్మవారి దయ వల్ల నాకంటూ మంచి టీమ్ దొరికింది. ఈసారి గట్టిగా కొట్టాలని ఫిక్సయి ఓ సినిమా ఫైనల్ చేశాను. సోమవారం (ఆగస్టు 19న) నా కొత్త సినిమా అప్డేట్ రాబోతోంది. మీ అందరూ నాకు తోడుగా ఉండాలి అని వీడియోలో చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Akash Jagannadh (@actorakashpuri) -
పేరు మార్చుకున్న ఆకాశ్.. 'పూరి' అనే పదాన్ని తొలగించి ఆపై..
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి తాజాగా తన పేరు మార్చుకున్నాడు. నేడు (జులై 25) తన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇదే విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఇతడు.. ఆపై హీరోగా పలు సినిమాల్లో మెప్పించాడు.చివరగా 2022లో 'చోర్ బజార్' అనే మూవీతో వచ్చాడు ఆకాశ్. కానీ ఫ్లాప్ అయింది. సుమారు రెండేళ్లు సమయం పూర్తి అయినా కూడా ఆకాశ్ నుంచి సినిమా ప్రకటన రాలేదు. కనీసం ఆయన ఎక్కడా కూడా కనిపిమచలేదు. అయితే, చాలారోజుల తర్వాత ఓ క్లాతింగ్ బ్రాండ్‌కి ఆకాశ్ అంబాసిడర్‌గా కనిపించాడు. తాజాగా తన పేరును 'ఆకాశ్ జగన్నాథ్'గా మార్చుకున్నాడు. ఆకాశ్ పేరు పక్కన తన తండ్రి పేరు నుంచి 'జగన్నాథ్' అనే పదాన్ని ఆయన తీసుకున్నాడు. గతంలో కూడా తన తండ్రి పేరు నుంచే పూరి అనే పదాన్ని తీసుకున్నాడు.ఇక నుంచి 'ఆకాశ్ జగన్నాథ్' అనే తనను పిలవాల్సి ఉంటుంది. ఈ పేరు మార్పులు వెనుక అసలు కారణాలు ఆయన వెళ్లడించలేదు. సినీ కెరియర్ పరంగా మరిన్ని అవకాశాలు వచ్చేందుకే ఇలా పేరు మార్చుకున్నాడని నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. ఆకాశ్ అనుకుంటే తన తండ్రి డైరెక్షన్లో మరో సినిమా తీయగలడు. కానీ, దానిని ఆయన సున్నితంగా తిరస్కరించాడు. ఇండస్ట్రీలో తానేంటు నిరూపంచకున్న తర్వాతే తన తండ్రి డైరెక్షన్లో సినిమా చేస్తానిని గతంలో ఆకాశ్ జగన్నాథ్ తెలిపారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన ఆకాష్ 2018లో ‘మెహబూబా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 2007లో చిరుతు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్.. ఆపై బుజ్జిగాడు, ఏక్‌నిరంజన్,బిజినెస్‌మేన్,గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెరిశాడు. ఆ తర్వాత 2015లో ఆంధ్రాపోరి, మెహబూబా,రొమాంటిక్ వంటి సినిమాల్లో నటించాడు. ఇప్పుడు తన కొత్త సినిమా కోసం ఆకాశ్ జగన్నాథ్ కథలు -
Narsipatnam: బాబాయ్‌ను గెలిపించు స్వామీ..
కోటవురట్ల: వర్థమాన హీరో, సినీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ శనివారం పాత తంగేడులో సందడి చేశారు. ఇక్కడ నూతనంగా నిర్మించిన దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం స్థానిక యువకులతో సెల్ఫీలు దిగారు. పరిచయస్తులు, బంధువులు ఆకాష్ పూరీతో కాసేపు ముచ్చటించారు. తాను నటిస్తున్న, ఒప్పుకున్న సినిమా కబుర్లు వారితో పంచుకున్నారు. ఆకాష్ పూరీ మాట్లాడుతూ తన బాబాయ్ పెట్ల ఉమాశంకర గణేష్ నర్సీపట్నం నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావడంతో ఆయన గెలుపులో తాను భాగస్వామి కావాలనే ఉద్దేశంతో వచ్చినట్టు తెలిపారు. ఫ్యాను గుర్తుపై ఓటేసి బాబాయ్ ఉమాశంకర గణేష్‌ను గెలిపించాలని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించినట్టు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే తన బాబాయ్‌ను గెలిపిస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు. చాలా సింపుల్‌గా, సౌమ్యంగా అందరితో కలిసిపోయే మంచి వ్యక్తిత్వం కలిగిన బాబాయ్ గెలుపు తథ్యం అన్నారు. సీఎం జగన్ సహకారంతో నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధిలో తక్కువ కాలంలోనే బాబాయ్ తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. నియోజకవర్గ ప్రజలు మరోసారి బాబాయ్ గణే‹Ùను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. -
‘మెర్సి కిల్లింగ్’ కాన్సెప్ట్ బాగుంది: ఆకాష్ పూరి
సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మెర్సి కిల్లింగ్’. సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సూరపల్లి వెంకటరమణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను యువ హీరో ఆకాష్ పూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడు..‘మెర్సి కిల్లింగ్ టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది. మొషన్ పోస్టర్ లో కాన్సెప్ట్ బాగుంది. ఇలాంటి కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమాలు తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో రాబోతున్న ఈ చిత్రం హైదరాబాద్, కాకినాడ, ఉప్పాడ, అరకు వంటి అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించడం జరిగింది. ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్ . స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుందని దర్శకుడు వెంకటరమణ ఎస్ తెలిపారు. -
‘వెయ్ దరువెయ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
హీరోగా సెట్ అయిన తర్వాత అది చేస్తా: హీరో ఆకాశ్ పూరీ
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ చాలామందికి తెలుసు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఇతడు.. ప్రస్తుతం హీరోగా చేస్తున్నాడు. చివరగా 2022లో 'చోర్ బజార్' అనే మూవీతో వచ్చాడు. కానీ ఫ్లాప్ అయింది. ఇలా చాలారోజుల తర్వాత ఇప్పుడు కనిపించాడు. ఓ క్లాతింగ్ బ్రాండ్‌కి ఆకాశ్ అంబాసిడర్‌గా చేస్తున్నాడు. తాజాగా హైదరాబాద్‌లో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ క్రమంలోనే పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమా రివ్యూ (ఓటీటీ)) 'నా కెరీర్ పరంగా చూస్తే గత సినిమా 'చోర్ బజార్' అంతగా ఆదరణ దక్కించుకోలేదు. అందుకే ఈసారి నేను చేసే సినిమా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాను. లవ్ స్టోరీ, యాక్షన్ కథలు విన్నాను. అవి ఫైనలైజ్ దశలో ఉన్నాయి. ప్రాజెక్ట్ లాక్ అయ్యాక మీకు వివరాలు చెబుతాను. ఇప్పటికీ నేను చిన్న పిల్లాడిలా ఉంటాననే కంప్లైంట్ ఉంది. హీరోగా సెట్ అయిన తర్వాతే విలన్ తరహా క్యారెక్టర్స్ చేయడం గురించి ఆలోచిస్తా. నాన్న పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇప్పట్లో నటించకూడదని అనుకున్నా' 'నాకు నేనుగా హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాతే నాన్న డైరెక్షన్లో మూవీ చేస్తా. నాకు అమ్మా నాన్న ఇద్దరి సపోర్ట్ పూర్తిగా ఉంది. నా స్క్రిప్ట్స్ నాన్న చదువుతారు. మన ఇండస్ట్రీలో చాలా గొప్ప సినిమాలు వస్తున్నాయి. కార్తికేయ 2, హనుమాన్ లాంటివి చూసినప్పుడు ఇలాంటి వాటిలో నటించాలనే కోరిక కలుగుతుంటుంది. ఇప్పుడు నేను సింగిల్‌గానే ఉన్నా. ఏ అమ్మాయినీ ప్రేమించడం లేదు' అని ఆకాశ్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 100 కోట్ల కలెక్షన్ సూపర్ హిట్ సినిమా.. ఏ ఓటీటీ సంస్థ కొనట్లేదు!) -
నాన్న డైరెక్షన్లో సినిమా చేయను: ఆకాశ్ పూరి
టాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా ఎంట్రీ ఇచ్చి హీరోలుగా మారిన నటులు చాలా మంది ఉన్నారు. వారిలో ఆకాశ్ పూరి కూడా ఒకరు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడిగా ఇంటస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆకాశ్. చిరుత, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్‌తో పాటు పలు సినిమాల్లోనూ హీరోల చిన్ననాటి పాత్రను పోషించాడు. ‘ఆంధ్రా పోరి’తో హీరోగా మారాడు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో స్వయంగా పూరినే రంగంలోకి దిగాడు. కొడుకుతో డిఫరెంట్ లవ్‌స్టోరీ ‘మెహబూబా’ తీశాడు. అయితే అది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘రొమాంటిక్’ ఫిల్మ్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అదీ కూడా ఫ్లాప్ అయింది. చివరగా చోర్ బజార్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ చిత్రానికి కూడా తొలి రోజే ప్లాప్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కథల వేటలో పడ్డాయి. అయితే ఎంతో మందిని స్టార్ హీరోలుగా మలిచిన పూరి జగన్నాథ్.. కొడుకును మాత్రం హీరోగా పెట్టి మరో సినిమా తీయలేకపోయాడు. పూరి అనుకుంటే.. ఆకాశ్‌ను ఓ మాస్ హీరోగా నిలబెట్టగలడు. కానీ అది ఆకాశ్‌కి ఇష్టం లేదు. తండ్రి డైరెక్షన్లో ఇప్పుడే సినిమా చేయాలని లేదట. తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్లో ఇదే విషయాన్ని చెప్పాడు ఆకాశ్. ‘నాన్న డైరెక్షన్లో ఇప్పుడే సినిమా చేయాలని లేదు. నటుడిగా నన్ను నేను ఫ్రూవ్ చేసుకున్న తర్వాత నాన్నతో సినిమా చేస్తాను. అప్పటి వరకు నేను నాన్నతో సినిమా చేయను. ఒకవేళ సినిమా చేయాల్సి వస్తే.. ‘పూరి జగన్నాథ్-ఆకాశ్ కాంబోలో ఓ సినిమా రాబోతుంది’ అనుకునే స్థాయికి వచ్చినప్పుడే చేస్తాను’ అన్నాడు. నేనింతే సినిమాకు సీక్వెల్ వస్తే.. అందులో హీరోగా నటించాలని ఉందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. -
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుక్కి పెళ్లి కుదిరిందా?
టాలీవుడ్లో మరో హీరో పెళ్లికి రెడీ అయ్యాడా? ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అయితే ఈ కుర్రాడు మరెవరో కాదు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ వారసుడే అని తెలుస్తోంది. అలానే అమ్మాయికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో నిజమెంత? అసలేం జరుగుతోంది? (ఇదీ చదవండి: హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) దర్శకుడు పూరీ జగన్నాథ్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో బెంచ్ మార్క్ సెట్ చేశాడు. తనదైన స్టైల్ ఆఫ్ మూవీస్‌తో అప్పట్లో ఊపు ఊపాడు. ఇతడి కొడుకు ఆకాశ్.. చైల్డ్ ఆర్టిస్టుగా బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండు మూడు సినిమాల్లో హీరోగా కూడా చేశాడు. కానీ పెద్దగా లక్ కలిసి రాలేదు. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ ఏం చేస్తున్నట్లు లేడు. కొన్నాళ్ల నుంచి అసలెక్కడ వినిపించని ఆకాశ్ పూరీ పేరు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారిపోయింది. చిన్నప్పటి క్లాస్మేట్ ఒకమ్మాయితో ఆకాశ్ ప్రేమలో ఉన్నాడని.. త్వరలో వీళ్ల నిశ్చితార్థం-పెళ్లి ఉండబోతున్నాయని అంటున్నారు. అలానే అమ్మాయి తాత పెద్ద పొలిటికల్ లీడర్ అని అంటున్నారు. అయితే ఇది నిజమా? కాదా? అనేది తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు ఆగాలి. లేదంటే స్వయంగా ఆకాశ్ స్పందిస్తే గానీ క్లారిటీ రాదు! (ఇదీ చదవండి: 'సలార్' సినిమాలో దాన్ని కావాలనే మిస్ చేశారా? లేదంటే..?) -
బిచ్చగాడు-2 కోసం ప్రాణం పెట్టారు : అడివి శేష్
‘‘సినిమా కోసం ప్రాణం పెట్టి చేశామని అందరూ చెబుతుంటారు. కానీ, ‘బిచ్చగాడు 2’ కోసం విజయ్, ఫాతిమాగార్లు నిజంగా ప్రాణం పెట్టి పనిచేశారు. వారికోసమైనా ‘బిచ్చగాడు 2’ హిట్టవ్వాలి’’ అన్నారు హీరో అడివి శేష్. విజయ్ ఆంటోని హీరోగా నటించి, దర్శకత్వం వహించడంతో పాటు సంగీతమందింన త్రం ‘బిచ్చగాడు 2’. కావ్యా థాపర్ హీరోయిన్. ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మింన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. కాగా తెలుగులో ఈ చిత్రాన్ని ఉషా పిక్చర్స్‌పై విజయ్ కుమార్, వీరనాయుడు రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి హీరోలు అడివి శేష్, ఆకాశ్ పూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆకాశ్ పూరి మాట్లాడుతూ– ‘‘విజయ్ ఆంటోనిగారిని ఇంతవరకు ప్రేమిస్తూ వచ్చాను.. కానీ ఆయన్ను కలిశాక గౌరవం మొదలైంది. ‘బిచ్చగాడు 2’ పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘బిచ్చగాడు’ తొలి భాగం నచ్చినవారికి రెండో భాగం కూడా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘నేనీ సినిమాకు కేవలం నిర్మాతను మాత్రమే. అన్నీ మా ఆయన (విజయ్ ఆంటోని) చూసుకున్నారు. ఆయన ప్రమాదానికి గురైనా.. అభిమానుల ప్రేమ వల్లే కోలుకున్నారు’’ అన్నారు ఫాతిమా విజయ్ ఆంటోని. -
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్
మాన్యం కృష్ణ, అర్చన జంటగా రూపొందిన చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్’. పండు దర్శకత్వంలో ఉషశ్రీ సమర్పణలో ఎన్వీ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్ని హీరో ఆకాశ్ పూరి విడుదల చేసి, ‘‘సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. మహిళలకు కనెక్ట్ అయ్యే అంశాలు మా సినిమాలో ఉన్నాయి’’ అని చిత్ర యూనిట్ తెలిపింది. -
వైవిధ్యం.. వినోదం...
జస్వంత్ పడాల (జెస్సీ), నక్షత్ర త్రినయని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎర్రర్ 500’. సాందీప్ మైత్రేయ.ఎన్ దర్శకత్వంలో యు.బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్) నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్య అతిథులుగా దర్శకుడు వీఎన్ ఆదిత్య, హీరో ఆకాష్ పూరి పాల్గొన్నారు. వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ–‘‘ట్రైలర్ బ్రిలియంట్‌గా ఉంది. అలాగే ‘ఎర్రర్ 500’ అనేది జెస్సీకి యాప్ట్ టైటిల్. ఈ సినిమా రిలీజ్ ప్లాన్ గురించి సాందీప్‌ని అడిగినప్పుడు సంతోషం సురేష్‌గారు చూశారని చెప్పారు. వెంటనే సినిమా సేఫ్ హ్యాండ్స్‌లో ఉందని చెప్పాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం చాలా హార్డ్‌వర్క్ చేశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. ఫణి కల్యాణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు’’ అన్నారు జెస్సీ. ‘‘ట్రైలర్లానే సినిమా కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. జెస్సీ చాలా అంకితభావంతో ఈ సినిమా చేశాడు’’ అన్నారు సాందీప్. -
‘ఓరి దేవుడా’ దివాలీ దావత్, సందడి చేసిన యంగ్ హీరోలు
యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ఓరి దేవుడా. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్టరి వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్లుగా నటించారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం రాత్రి ‘దివాలీ దావత్’ పేరుతో వేడుకను నిర్వహించారు. ఈ పార్టీకి పలువుకు టాలీవుడ్ యంగ్ హీరోలు హాజరై సందడి చేశారు. అల్లరి నరేశ్, టీజే టిల్లు ఫేం సద్ది జొన్నలగడ్డ, సందీప్ కిషన్, ఆది సాయి కుమార్, ఆకాశ్ పూరి, విశ్వక్ సేన్, హీరో కార్తికేయతో పాటు తదితరులు, చిత్ర బృందం పాల్గొంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చైతన్య, రితిక జంటగా కొత్త సినిమా షురూ
మహీంద్ర పిక్చర్స్ పతాకంపై చైతన్య పసుపులేటి, రితిక చక్రవర్తి జంటగా నటిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని సత్యసాయి కల్యాణమండపంలో ఘనంగా జరిగాయి. చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వి.శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన హీరో ఆకాష్ పూరి హీరో హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, ప్రొడ్యూసర్ రావ్ బోయపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం దర్శకుడు చిన్న వెంకటేష్ మాట్లాడుతూ.. 'నేను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చిన నిర్మాత వి.శ్రీనివాస రావ్ గారికి నా ధన్యవాదాలు. ఈ సినిమాకు అందరూ కొత్త వారైనా చాలా మంది సీనియర్ టెక్నీషియన్స్ పని చేస్తుండటంతో ఈ సినిమా కొత్త వారు తీసినట్టు ఉండదు. ఈ నెల 17 నుంచి చీరాలలో మొదటి షెడ్యూల్, ఆ తర్వాత హైదరాబాద్‌లో రెండవ షెడ్యూల్‌తో సినిమా పూర్తి చేస్తాం' అన్నారు. చిత్ర నిర్మాత వి.శ్రీనివాస రావ్ మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. మేం పిలవగానే వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన హీరో ఆకాష్ పూరి,నిర్మాత వి. రావు గార్లకు ధన్యవాదాలు. ఇది నా మొదటి సినిమా.దర్శకుడు వెంకటేష్ చెప్పిన కథ నచ్చడంతో మహీంద్ర పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నాను. ప్రేక్షకులందరికి నచ్చేవిధమైన అన్ని అంశాలతో వస్తున్న ఈ సినిమా.. మా బ్యానర్ కు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు. చిత్ర హీరో చైతన్య పసుపులేటి మాట్లాడుతూ.. 'ఇది నా మూడవ సినిమా. నా మెదటి సినిమా నుంచి వెంకటేష్ గారు నాకు తెలుసు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు' అన్నారు. హీరోయిన్ రితిక చక్రవర్తి మాట్లాడుతూ.. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది సినిమాలో హీరోయిన్గా నటించాను. ఆ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత విజయ్ దేవరకొండ "ఖుషి", అనంత సినిమాలలో నటిస్తున్న నాకు సస్పెన్స్ థ్రిల్లర్‌లో నటించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు. చదవండి: ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ -
లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'నేనెవరు' ఆడియో రిలీజ్
ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం 'నేనెవరు'. ఈ సినిమాలో అతనికి జోడిగా సాక్షి చౌదరి నటిస్తోంది. కౌశల్ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్జీ సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో, ప్రోమోను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేసింది చిత్రబృందం. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. (చదవండి: పొన్నియన్ సెల్వన్ ఆ నటితో చేద్దామనుకున్నా: మణిరత్నం) ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి, మరో నటుడు రాహుల్ విజయ్ ముఖ్యఅతిథులుగా హాజరై ఆడియోను రిలీజ్ చేశారు. దర్శక, నిర్మాతలకు ఈ చిత్రం మంచిపేరు తీసుకురావాలని ఆకాష్ పూరి, రాహుల్ విజయ్ ఆకాంక్షించారు. ఈ చిత్రంలో తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్, రాజా రవీంద్ర, దిల్ రమేష్, తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వేడుకల్లో సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. -
మాస్ హీరోగా గుర్తింపు దక్కింది: ఆకాష్ పూరి
Akash Puri Emotional Speech In Chor Bazaar Success Meet: ''చోర్ బజార్' సినిమాతో మాస్ హీరోగా మెప్పించాననే పేరు నాకు దక్కింది. జనాల్లోకి హీరోగా వెళ్లిపోయాను అనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ క్రెడిట్ దర్శకుడు జీవన్ రెడ్డిదే. నా గత చిత్రాల (మెహబూబా, రొమాంటిక్) కన్నా 'చోర్ బజార్' గ్రాండ్‌గా ఉందంటున్నారు. దానికి కారణం నిర్మాత వీఎస్ రాజు'' అని ఆకాష్ పూరి తెలిపాడు. జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా తెరకెక్కిన చిత్రం 'చోర్ బజార్'. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 24) విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ సమావేశంలో ''ఫస్ట్ టైమ్ 'చోర్ బజార్' వంటి ఒక కమర్షియల్ సినిమా చేశాను. మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అని డైరెక్టర్ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 'మా శ్రమకు మంచి ఫలితాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కు థ్యాంక్స్' అని నిర్మాత వీఎస్ రాజు తెలిపారు. చదవండి:👇 చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట? 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు.. 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్.. -
బచ్చన్ సాబ్‌గా ఆకాష్ పూరి మెప్పించాడా ?.. 'చోర్ బజార్' రివ్యూ
టైటిల్: చోర్ బజార్ నటీనటులు: ఆకాష్ పూరి, గెహనా సిప్పీ, అర్చన, సునీల్, సుబ్బరాజు తదితరులు దర్శకుడు: జీవన్ రెడ్డి నిర్మాత: వీఎస్ రాజు సంగీతం: సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి విడదల తేది: జూన్ 24, 2022 ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి నటుడిగా తానేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. 'రొమాంటిక్' మూవీతో నటనపరంగా మంచి మార్కులే తెచ్చుకున్నాడు. తాజాగా ప్రేక్షకులను అలరించేందుకు 'చోర్ బజార్' సినిమాతో మరోసారి సందడి చేశాడు. గెహనా సిప్పీ హీరోయిన్గా నటించింది. ఈ మూవీకి 'జార్జ్ రెడ్డి'ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి అర్చన (నిరీక్షణ ఫేమ్) అమితాబ్ బచ్చన్ అభిమానిగా నటించింది. శుక్రవారం (జూన్ 24)న విడుదైలన 'చోర్ బజార్' ప్రేక్షకుల మనసును చోరీ చేసిందో తెలియాలంటే ఈ రివ్యూ చూడాల్సిందే. కథ: హైదరాబాద్‌లోని మ్యూజియంలో రూ. 200 కోట్లు విలువ చేసే నిజాం కాలం నాటి వజ్రం అపహరణకు గురవుతుంది. దొంగలను పట్టుకునే క్రమంలో ఆ వజ్రం చోర్ బజార్ అనే ఏరియాలో పడుతుంది. మరోవైపు చోర్ బజార్‌ను అన్ని తానై నడిపిస్తుంటాడు బచ్చన్ సాబ్ (ఆకాష్ పూరి). దీంతో ఎలాగైన ఆ వజ్రాన్ని పట్టుకునేందుకు చోర్ బజార్లో కాపు కాస్తారు పోలీసులు. మరి ఆ వజ్రాన్ని పోలీసులు పట్టుకున్నారా ? చివరిగా అది ఎక్కడికి చేరింది ? బచ్చన్ సాబ్ ప్రేమించిన మూగ అమ్మాయి సిమ్రాన్ (గెహనా సిప్పీ)ని దక్కించుకున్నాడా? చోర్ బజార్‌ను శాశ్వతంగా మూయించాలనుకున్నా గబ్బర్ సింగ్ (సుబ్బరాజు) ఏం చేశాడు? అనే తదితర విషయాలు తెలియాలంటే 'చోర్ బజార్' చూడాల్సిందే. విశ్లేషణ: డైరెక్టర్ జీవన్ రెడ్డి 'జార్జ్ రెడ్డి'తో మంచి దర్శకుడిగా గుర్తింపు పొందారు. అంతకుముందు ఆయన 'దళం' సినిమాకు ఒక డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అయితే ఈ రెండు సినిమాల అనుభవం 'చోర్ బజార్' మూవీని తెరకెక్కించడంలో కనిపించలేదనే చెప్పవచ్చు. వజ్రాన్ని దొంగతనం చేసే సన్నివేశంతో ఆసక్తిగా ప్రారంభించిన దర్శకుడు తర్వాత పూర్తిగా తడబడ్డారు. డైమండ్ చోరి తర్వాత వచ్చే సీన్లన్ని చప్పగా సాగుతాయి. డైమండ్ చోరీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో లవ్, చోర్ బజార్ మనుషుల కథ, ఉమెన్ ట్రాఫికింగ్, అమితాబ్ బచ్చన్ మీద అభిమానంతో ఇళ్లు వదిలేసి వచ్చిన యువతి కథ వంటి పలు ఉప కథలు గందరగోళానికి గురిచేస్తాయి. మరీ స్లోగా సాగే స్క్రీన్‌ప్లే, గజిబిజి సీన్లతో నిండిన ఎడిటింగ్ ప్రేక్షకుల సహనానికి పరీక్షపెడతాయి. రెండు పాటలు, సురేష్ బొబ్బిలి సంగీతం పర్వాలేదనిపించింది. నటీనటులు మాట్లాడే తెలంగాణ యాస కొంత ఇబ్బందిపెడుతుంది. ఎవరెలా చేశారంటే? ఆకాష్ పూరి నటన ఇంతకుముందు చిత్రాల్లానే ఇందులో ఉంది. అలాగే పూరీ స్టైల్ హీరోగా కనిపిస్తాడు. ప్రతి సినిమాలో అలాగే కనిపించేసరికి రొటీన్‌గా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ పర్వాలేదనిపిస్తుంది. ఇక మూగ అమ్మాయిగా గెహనా సిప్పీ తన పాత్రకు న్యాయం చేసిందనే చెప్పవచ్చు. మూగ అమ్మాయిగా హీరోయిన్ ఎలివేట్ అయ్యే సన్నివేశాలు అంతగా లేకున్నా ఉన్నంతలో బాగానే నెట్టుకొచ్చింది. సీనియర్ నటి అర్చన (నిరీక్షణ ఫేమ్) బాగుంది. స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ అంతగా వర్కౌట్ కాలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ 'చోర్ బజార్'ను వీక్షించాలంటే మాత్రం ఎంతో ఓపిక కావాలి. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
నేను జీరో.. ఏదో ఒకరోజు ఆ స్థాయికి వెళ్తా: ఆకాష్ పూరి
'ఆకాష్‌కి ఏంటి? పూరి జగన్నాథ్ కొడుకు అనుకుంటారు. కానీ, మా నాన్న స్టార్ డైరెక్టర్ కాకముందే హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యాను. మా నాన్న నా పక్కన లేకుంటే నేను జీరో.. ఏదో ఒకరోజు మా నాన్న స్థాయికి వెళ్లి, ఆయనతో కలిసి సినిమా చేస్తా' అని ఆకాష్ పూరి తెలిపాడు. జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి, గెహానా సిప్పీ జంటగా నటించిన చిత్రం చోర్ బజార్. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మూవీ యూనిట్ పాల్గొంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ 'చోర్ బజార్ బాగా తీస్తావనే నమ్మకం ఉంది. మా అబ్బాయి (ఆకాష్)తో మంచి సినిమా చెయ్ అని పూరి జగన్నాథ్ అన్నారు. ఆయన మాట నిలబెట్టుకుంటాననే నమ్మకం ఉంది' అని తెలిపారు. 'కలర్‌ఫుల్ కమర్షియల్ ఫిల్మ్ ఇది. అందరూ ఎంజాయ్ చేస్తారు' అని నిర్మాత వీఎస్ రాజు పేర్కొన్నారు. చదవండి: 'పుష్ప 2'లో శ్రీవల్లి చనిపోతుందా ? నిర్మాత క్లారిటీ ! కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు.. అప్పుడు కాలర్ ఎగిరేశా.. కానీ అంత ఈజీ కాదు: ఆకాష్ పూరీ -
కొడుకు ఫంక్షన్‌కు వచ్చే టైం లేదా.. పూరీపై బండ్ల ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంతో మందిని స్టార్ హీరోలుగా చేసిన పూరి జగన్నాథ్.. కన్నకొడుకు(ఆకాశ్ పూరీ) సినిమా ఫంక్షన్‌కి రాకపోవడం బాధగా ఉందన్నారు. ఆకాష్ పురి, గెహనా సిప్పీ జంటగా దర్శకుడు జీవన్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన బండ్ల గణేశ్ పూరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఓ సామెత ఉంటుంది.. దేశం మొత్తం కల్లాపు చల్లాడు కానీ.. ఇంటి ముందు కల్లాపు చల్లడానికి టైం లేదనే పూరీని చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది.ఎంతో మందిని స్టార్స్‌గా తయారు చేశాడు. డైలాగ్‌లు చెప్పడం రాని వాళ్లకి డైలాగ్‌లు నేర్పాడు. డాన్స్‌లు రాని వాళ్లకి డాన్స్‌లు నేర్పాడు. కానీ కన్న కొడుకు సినిమా ఫంక్షన్‌కి మాత్రం రాలేదు. అదే నేనైతే నేను లండన్‌లో ఉన్నా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చేవాడిని. ఎందుకంటే నేను ఉన్నదే నా కొడుకు కోసం.. నా భార్య కోసం.. నా పిల్లల కోసం.. మా అన్న(పూరి జగన్నాథ్) ఎక్కడ ఉన్నాడో.. ఏం బిజీగా ఉన్నాడో.. ఈసారికి అయిపోయింది కానీ ఇంకోసారి ఇలాంటి పని మాత్రం చేయమాకు. ఎందుకంటే మనం ఏం చేసినా వాళ్ల కోసమే. మనం చస్తే తలకొరివి పెట్టాల్సింది వాళ్లే. మనం సంపాదిస్తే ఆస్తులు వాళ్లకే.. అప్పులు చేస్తే తీర్చేదీ వాళ్లే. ఆకాశ్ అంటే సన్నాఫ్ పూరీ జగన్నాథ్.. . ఎవర్నెవర్నో స్టార్లని చేశావ్.. నీ కొడుకు వచ్చేసరికి వెళ్లి ముంబాయిలో ఉన్నావ్.. ఇదెక్కడి న్యాయం అన్నా?.నువ్ నీ కొడుకుని స్టార్‌ని చేసినా చేయకపోయినా నీ కొడుకు స్టార్ అవుతాడు.. చోర్ బజార్ పెద్ద హిట్ అవుతుంది. నువ్ కూడా నీ కొడుకు డేట్స్ కోసం క్యూలో ఉండే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో. నేను ఈరోజు చెప్తున్నా రాస్కో.. నువ్ బ్యాంకాక్ పోయి కథ రాసుకుని.. ఆకాష్ కథ చెప్తా వినరా అని ఎదురుచూసే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో. అలా జరక్కపోతే నా పేరు బండ్ల గణేష్ కాదు. ఆరోజు వచ్చినరోజు.. ఆకాశ్ నువ్ డేట్లు ఇవ్వొద్దని చెప్తా’ అని బండ్ల గణేశ్ చెప్పుకొచ్చాడు. -
అప్పుడు కాలర్ ఎగిరేశా.. కానీ అంత ఈజీ కాదు: ఆకాశ్ పూరీ
‘‘బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని ఉంది. ఓ బిగ్ హిట్ కోసం మరింత ఏకాగ్రతతో కష్టపడి పని చేస్తున్నాను. ‘చోర్ బజార్’ హిట్ సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ఆకాష్ పూరి. జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆకాష్ పూరి చెప్పిన విశేషాలు. చదవండి: హెల్త్అప్డేట్: ‘కెప్టెన్’ విజయకాంత్ కాలివేళ్లు తొలగింపు ⇔ ఈ సినిమాలో నేను బచ్చన్ సాబ్ అనే పాత్రలో కనిపిస్తాను. టైర్లను దొంగతనం చేయడం నా పని. దొంగతనాలు చేసి పేదవారికి సాయం చేస్తుంటాడు. సో... వారి దృష్టిలో బచ్చన్ సాబ్ హీరో. ‘చోర్ బజార్’ అనగానే అందరూ దొంగలు, క్రిమినల్స్ గురించే ఆలోచిస్తుంటారు. కానీ అక్కడ కూడా కుటుంబాలు, ఎమోషన్స్ ఉంటాయి. వీటినే మా ‘చోర్ బజార్’ సినిమాలో చూపించాం. నా కెరీర్లో డిఫరెంట్ అండ్ మంచి స్టైలిష్ యాక్షన్ డ్రామా ఇది. జీవన్రెడ్డిగారు కథ వినిపించినప్పుడు ఆసక్తికరంగా అనిపించింది. ఈ సినిమా యాక్టర్‌గా నా ఇమేజ్ను పెంచుతుందనుకుంటున్నాను. చదవండి: ఓటీటీకి అంటే సుందరానికి, స్ట్రీమింగ్ డేట్, టైం ఫిక్స్.. ఎక్కడంటే! ⇔ నాన్నగారు (పూరి జగన్నాథ్) ఇంకా ‘చోర్ బజార్’ చూడలేదు. కానీ ట్రైలర్ చూసి మెచ్చుకున్నారు. నా ప్రతి సినిమా కథను నాన్నకి వినిపించి ఆయన్ను డిస్ట్రబ్ చేయాలనుకోను. ‘సొంత నిర్ణయాలు తీసుకో.. నీ గట్ ఫీలింగ్‌పై వెళ్లు’ అని నాన్న చెబుతుంటారు. నా గత చిత్రం ‘రొమాంటిక్’ ప్రమోషన్లో నేను హీరోగా సక్సెస్ అయి నాన్న పేరు నిలబెడతానని కాలర్ ఎగరేశాను. కానీ అది ఒక సినిమాతో జరిగే పని కాదు. కొంత జర్నీ సాగాలి. ఇక నేను కొత్తగా మూడు సినిమాలు కమిటయ్యాను. -
నా వయసున్నోళ్లు లవ్‌స్టోరీస్ కూడా చేస్తున్నారు
‘‘చోర్ బజార్’ ఎంటర్టైన్మెంట్, కమర్షియల్, కలర్‌ఫుల్ ఫిల్మ్. ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్ర చేశాను. ఇదొక మాస్ ఫిలిం. నా జానర్ దాటి బయటికొచ్చి ఈ సినిమా చేశాను’’ అని నటి అర్చన (‘నిరీక్షణ’ ఫేమ్) అన్నారు. ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన అర్చన మాట్లాడుతూ– ‘‘నా గురువులు, దర్శకులు నన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. 300 సినిమాల్లో చేసిన హీరోయిన్‌కి ఎలాంటి గుర్తింపు ఇవ్వాలో అలాంటి గుర్తింపును భారతీయ సినిమా, నా దర్శకులు నాకు ఇచ్చారు.. ఆ గౌరవాన్ని పాడు చేసుకునే హక్కు నాకు లేదు. నేను చెన్నైలో ఉంటున్నాను. షూటింగ్ కోసం హైదరాబాద్ రాలేకపోయేదాన్ని. అందుకే తెలుగులో గ్యాప్ వచ్చింది. ఒకప్పుడు హీరో సరసన నటించిన హీరోయిన్ కొంత కాలానికి అదే హీరోకి సోదరి, వదిన, తల్లి, అత్త అవుతోంది. మన సినిమాల్లో మహిళా పాత్రలకు 80 శాతం ప్రాధాన్యత ఉండటం లేదు. మరాఠీలో మహిళలకు ఎక్కువ వైవిధ్యమైన పాత్రలు దక్కుతున్నాయి. నా వయసువాళ్లు అక్కడ లవ్ స్టోరీస్‌లో నటిస్తున్నారు.. బోల్డ్ సీన్స్ చేస్తున్నారు. ‘చోర్ బజార్లో’ నాది అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ పాత్ర. ఆయన్ను ప్రేమించి, ఆయన కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోయే పాత్ర నాది. ఈ మూవీలో హీరో పేరు బచ్చన్ సాబ్. మా ఇద్దరికీ అమితాబ్ అంటే ఇష్టం. అర్చన అంటే నెక్ట్స్ డోర్ ఉమెన్ అనే ఇమేజ్ ఉంది.. ఆ గుర్తింపును ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను. ప్రస్తుతం తమిళంలో ఒకటి, కన్నడలో ఒక ఆర్ట్ ఫిలిం చేస్తున్నాను. అలాగే ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించనున్నాను’’ అన్నారు. -
భార్యకు పూరీ జగన్నాథ్ విడాకులు? స్పందించిన డైరెక్టర్ కుమారుడు
స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్ చార్మీల మధ్య ఏదో ఉందంటూ చాలాకాలంగా ఏవేవో కథనాలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. పూరీ కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించిన పూరీ, చార్మీతో కలిసి సినిమాలు నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ బయట పార్టీల్లో కనిపిస్తుండటంతో వీళ్ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ జరుగుతోందని గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేశారు. అంతేకాదు, ఏకంగా పూరీ తన భార్యకు విడాకులు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడంటూ వార్తలు రాసుకొచ్చారు. తాజాగా ఈ రూమర్లపై పూరీ తనయుడు, హీరో ఆకాశ్ పూరీ స్పందించాడు. 'నాన్న సినీకెరీర్‌లో చాలా నష్టపోయాడు. అమ్మకు పరిస్థితి అర్థమై మాకు ఆ విషయాలేవీ తెలియకూడదని చెల్లిని, నన్ను హాస్టల్ పంపించారు. అప్పుడు నేను మూడో తరగతి చదువుతున్నా. మేమేమో.. మా నాన్న పెద్ద డైరెక్టర్, అంతా హ్యాపీ అనుకున్నాం. కొన్నాళ్ల తర్వాత మాకు అసలు విషయం అర్థమైంది. మేము వేసుకునే బట్టల నుంచి, తినే ఫుడ్ వరకు, ఉంటున్న ప్లేస్ అంతా మారిపోయింది. ఉన్న ఇల్లు, కార్లు కూడా అమ్మేశాం. ఐదారేళ్లు నరకం చూశాం. కానీ మా నాన్న మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వడం మాత్రం మామూలు విషయం కాదు. మా ఫ్యామిలీ ఇప్పుడిలా ఉందంటే కారణం అమ్మే. అమ్మానాన్న విడాకులు తీసుకుంటారన్న వార్త నేనింతవరకు వినలేదు. నాన్నకు పెద్ద సపోర్ట్ మమ్మీనే. వాళ్లది లవ్ మ్యారేజ్. కొందరు టైంపాస్ కోసం వీరు విడాకులు తీసుకుంటున్నారంటూ ఇష్టం వచ్చినట్లు రాస్తూనే ఉంటారు. కానీ అదైతే నిజం కాదు. ఇక్కడ మీకో నిజం చెప్తాను.. మా పేరెంట్స్ లవ్‌లో ఉన్న సమయంలో నాన్న అమ్మకు ఫోన్ చేసి పెళ్లి చేసుకుందాం, వస్తావా? అని అడిగాడు. హా, వచ్చేస్తానంది అమ్మ. నా జేబులో రూ.200 మాత్రమే ఉన్నాయి. రేపు ఎలా ఉంటుందో కూడా తెలీదు, నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడట. క్షణం కూడా ఆలోచించకుండా చేసుకుంటానని వచ్చేసింది. ఇంతలా ప్రేమించేవాళ్లు నిజంగా ఉంటారా? అనిపించింది' అని చెప్పుకొచ్చాడు ఆకాశ్. చదవండి: తింటున్న టైంలో వచ్చి ముక్కు కోసేశాడు, ప్లేటంతా రక్తమే.. బికినీ ఫొటోలు నాన్న చూడకూడదని అలా చేస్తా.. బుల్లితెర నటి -
హైదరాబాద్‌లో అది 400 ఏళ్లుగా ఉంది: నిర్మాత
Producer VS Raju About Akash Puri Chor Bazaar Movie: ‘‘హైదరాబాద్‌లో దాదాపు 400 సంవత్సరాలుగా ‘చోర్ బజార్’ ఉంది. నిజాం కాలంలో దొంగతనం చేసిన వస్తువులను అక్కడ అమ్మేవారని చెబుతారు. ఇప్పటికీ చోరీ చేసిన వస్తువులను అక్కడ విక్రయిస్తారని అంటుంటారు. ‘చోర్ బజార్’ సినిమాతో ఆకాష్‌కు మంచి పేరు వస్తుంది’’ అని నిర్మాత వీఎస్ రాజు అన్నారు. ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చోర్ బజార్’. ఈ నెల 24న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వీఎస్ రాజు మాట్లాడుతూ – ‘‘నాది భీమవరం. సినిమాలపై ఆసక్తితో రామ్‌గోపాల్ వర్మ ‘రక్ష’ చిత్రానికి దర్శకత్వ విభాగంలో పని చేశాను. ‘గుండెల్లో గోదారి, జోరు...’ఇలా ఏడెనిమిది చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. ‘రక్ష’ సమయంలోనే జీవన్ రెడ్డితో నాకు పరిచయం ఏర్పడింది. నేను దర్శకత్వ విభాగంలో పనిచేసినా ఈ సినిమా విషయంలో ప్రొడక్షన్ మాత్రమే చూసుకున్నాను. రాత్రి జరిగే కథ ఇది. హీరోయిన్ పాత్రను మూగగా ఎందుకు చూపించాం? అనేది ఆసక్తిగా ఉంటుంది. పృథ్వీ ఫైట్స్ బాగా డిజైన్ చేశాడు. సురేష్ బొబ్బిలి సంగీతం అదనపు ఆకర్షణ. మా జర్నీలో యూవీ క్రియేషన్స్ సంస్థ కలవడం మాకు మరింత ధైర్యాన్నిచ్చింది’’ అని తెలిపారు. చదవండి: మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు -
ఆకాశ్ పూరీ ‘చోర్ బజార్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే
ఆకాశ్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ ‘చోర్ బజార్’. ‘దళం, జార్జ్ రెడ్డి’ చిత్రాల ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో వీఎస్ రాజు నిర్మించాడు. అంతేకాదు ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటు మంచి హిట్ అయ్యాయి. ఇక బాలకృష్ణ ఇటీవల విడుదల ఈ మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో చోర్ బజార్ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. చదవండి: పోస్ట్ వెడ్డింగ్ అంటూ ఫొటోలు షేర్ చేసిన కీర్తి, పక్కనే మరో హీరోయిన్ ఈ నేపథ్యంలో ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ నెల్ 24వ తేదీన సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. కాగా ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించగా.. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఐవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత వీఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లూరి సురేశ్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరించారు. చదవండి: విజయ్, రష్మికల షూటింగ్ ఫొటోలు లీక్.. డైరెక్టర్ అప్సెట్