పూరి ఆకాష్‌ సందడి | akash puri joined in private function at hotel dhaspalla | Sakshi
Sakshi News home page

పూరి ఆకాష్‌ సందడి

Published Wed, Aug 3 2016 11:15 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

కేక్‌ కట్‌ చేస్తున్న ఆకాష్‌... - Sakshi

కేక్‌ కట్‌ చేస్తున్న ఆకాష్‌...

బంజారాహిల్స్‌: ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ తనదైన శైలిలో సందడి చేశారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో సాఫ్ట్‌ బూట్‌ టెక్నాలజీస్‌ 16వ వార్షిక ఆత్మీయ సమ్మేళనానికి ఈ యువ హీరో ముఖ్య అతిథిగా విచ్చేశారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లతో కలిసి సందడి చేశారు. కేక్‌ కట్‌ చేశారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు యువతులు పోటీపడ్డారు. కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల ఆట, పాటలు అలరించాయి. ఈ కార్యక్రమంలో సంస్థ ఎమ్‌డీ విజయ్‌భాస్కర్, డైరెక్టర్‌ నారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement