పేరు మార్చుకున్న ఆకాశ్‌.. 'పూరి' అనే పదాన్ని తొలగించి ఆపై.. | Akash Puri Change His Name | Sakshi
Sakshi News home page

పేరు మార్చుకున్న ఆకాశ్‌.. 'పూరి' అనే పదాన్ని తొలగించి ఆపై..

Published Thu, Jul 25 2024 1:50 PM | Last Updated on Thu, Jul 25 2024 3:13 PM

Akash Puri Change His Name

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి తాజాగా తన పేరు మార్చుకున్నాడు. నేడు (జులై 25) తన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఇతడు.. ఆపై హీరోగా పలు సినిమాల్లో మెప్పించాడు.

చివరగా 2022లో 'చోర్ బజార్' అనే మూవీతో వచ్చాడు ఆకాశ్‌. కానీ ఫ్లాప్ అయింది. సుమారు రెండేళ్లు సమయం పూర్తి అయినా కూడా ఆకాశ్‌ నుంచి సినిమా ప్రకటన రాలేదు. కనీసం ఆయన ఎక్కడా కూడా కనిపిమచలేదు. అయితే, చాలారోజుల తర్వాత ఓ క్లాతింగ్ బ్రాండ్‌కి ఆకాశ్ అంబాసిడర్‌గా కనిపించాడు. తాజాగా తన పేరును 'ఆకాశ్‌ జగన్నాథ్‌'గా మార్చుకున్నాడు. ఆకాశ్ పేరు పక్కన  తన తండ్రి పేరు నుంచి 'జగన్నాథ్‌' అనే పదాన్ని ఆయన తీసుకున్నాడు. గతంలో కూడా తన తండ్రి పేరు నుంచే పూరి అనే పదాన్ని తీసుకున్నాడు.

ఇక నుంచి 'ఆకాశ్‌ జగన్నాథ్‌' అనే తనను పిలవాల్సి ఉంటుంది. ఈ పేరు మార్పులు వెనుక అసలు కారణాలు ఆయన వెళ్లడించలేదు. సినీ కెరియర్‌ పరంగా మరిన్ని అవకాశాలు వచ్చేందుకే ఇలా పేరు మార్చుకున్నాడని నెట్టింట ఒక వార్త వైరల్‌ అవుతుంది. ఆకాశ్‌ అనుకుంటే తన తండ్రి డైరెక్షన్‌లో మరో సినిమా తీయగలడు. కానీ, దానిని ఆయన సున్నితంగా తిరస్కరించాడు. ఇండస్ట్రీలో తానేంటు నిరూపంచకున్న తర్వాతే తన తండ్రి డైరెక్షన్‌లో సినిమా చేస్తానిని గతంలో ఆకాశ్‌ జగన్నాథ్‌ తెలిపారు. 

చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన ఆకాష్ 2018లో ‘మెహబూబా’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 2007లో చిరుతు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌.. ఆపై బుజ్జిగాడు, ఏక్‌నిరంజన్‌,బిజినెస్‌మేన్‌,గబ్బర్‌ సింగ్‌ వంటి చిత్రాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మెరిశాడు. ఆ తర్వాత 2015లో ఆంధ్రాపోరి, మెహబూబా,రొమాంటిక్‌ వంటి సినిమాల్లో నటించాడు. ఇప్పుడు తన కొత్త సినిమా కోసం ఆకాశ్‌ జగన్నాథ్‌ కథలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement