జిమ్‌లో క్లీనింగ్‌ చేశాను: పూరీ తనయుడు ఆకాష్‌ | Akash Puri About His Movies Struggles | Sakshi
Sakshi News home page

Akash Puri: నాన్న సినిమా చేద్దామంటే కుదరదని చెప్పేశా

Published Wed, Jun 8 2022 9:33 PM | Last Updated on Thu, Jun 9 2022 8:19 AM

Akash Puri About His Movies Struggles - Sakshi

పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'చోర్‌ బజార్‌'. సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న తరుణంలో ఆకాష్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు వ్యక్తిగత విషయాలతో పాటు సినీ విశేషాలను సైతం పంచుకున్నాడు. తనకు తొలి రెమ్యునరేషన్‌ ప్రకాశ్‌రాజ్‌ ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు.

'ఓసారి ఏమైందంటే నేను నటిస్తున్న సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఒక్కసారి చూద్దామని నాన్న గోడ మీద నుంచి ఎగిరెగిరి చూస్తుంటే అక్కడున్న సెక్యూరిటీ లాగిపెట్టి కొట్టి వెళ్లిపోమన్నారు. ఇంట్లో ఖాళీగా ఉన్నావు, పార్ట్‌ టైం జాబ్‌ చూశాను, చేయమన్నారు. అలా జిమ్‌కు వెళ్లి క్లీనింగ్‌ చేశా. ఆర్థిక సమస్యలతో ఇక్కడ జాబ్‌ చేస్తున్నానన్నాను. కానీ వారికి నేను పూరీ కొడుకు అని తెలిసిపోయింది.

ఆంధ్రావాలాలో నాకు పాత్ర ఫిక్సయిపోయింది. సడన్‌గా ఫోన్‌ చేసి నువ్వు చేయట్లేదు అన్నారు. నన్నెందుకు తొక్కేస్తున్నారు అని ఫీలయ్యాను. ఇక రామ్‌చరణ్‌ అన్నయ్య ఓసారేం చేశారంటే నాకు జెల్‌ ఇష్టమని రకరకాల హెయిర్‌ స్టైయిల్స్‌ వేశారు. ఓసారి మార్కెట్‌లో లయన్‌ కింగ్‌ సీడీని దొంగిలించి ఎవరికీ కనిపించకుండా జేబులో పెట్టుకుని వచ్చేశాను. ఇక సినిమాల విషయానికి వస్తే పూరీ కొడుకు.. పూరీ కొడుకు, స్టార్‌డమ్‌ ఉన్న వాళ్ల నాన్న ఉన్నాడు, వాడికేంటిలే అనే టాక్‌ బయట బాగా ఎక్కువైపోయింది. అందుకే నాన్న నాతో సినిమా చేద్దాం అన్నా కూడా నో చెప్పాను. పూరీ కొడుకు అనేది పోగొట్టుకున్నాకే నీతో సినిమా చేస్తానని చెప్పాను' అని పేర్కొన్నాడు పూరీ.

చదవండి: విక్రమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్... సూర్యకి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన కమల్‌ హాసన్‌
ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ రూమ్‌ను తలపిస్తున్న శిల్పాశెట్టి వ్యానిటీ వ్యాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement