
సీనియర్ నటి పావలా శ్యామల (Pavala Syamala) కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇటీవల ఆమె ఆరోగ్యం మరింత దిగజారింది. కనీసం మాట్లాడేందుకు కూడా శరీరం సహకరించడం లేదు. ఎవరైనా దయతలచి ఆదుకోమని చేతులెత్తి వేడుకుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో చూసిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ చలించిపోయాడు.
ఆర్థిక సాయం
హైదరాబాద్ శివార్లో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీలో నివాసముంటున్న శ్యామలను కలుసుకున్నాడు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని రూ.1 లక్ష ఆర్థిక సాయం చేశాడు. దీంతో శ్యామల ఎమోషనలైంది. డబ్బు ఎవరైనా సంపాదిస్తారు కానీ మంచి మనసు మాత్రం ఎవరూ సంపాదించలేరు. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని ఆశీర్వదించింది.
చదవండి: సైఫ్‌ను ఆవేశంతో పొడిచాడు.. నా నగల జోలికి వెళ్లలేదు: కరీనా
Comments
Please login to add a commentAdd a comment