aakash puri
-
హీరో ఆకాష్ పూరి ని ప్రాంక్ చేసిన ప్రేమదేశం మూవీ టీమ్
-
జిమ్‌లో క్లీనింగ్ చేశాను: పూరీ తనయుడు ఆకాష్
పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'చోర్ బజార్'. సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న తరుణంలో ఆకాష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు వ్యక్తిగత విషయాలతో పాటు సినీ విశేషాలను సైతం పంచుకున్నాడు. తనకు తొలి రెమ్యునరేషన్ ప్రకాశ్‌రాజ్ ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు. 'ఓసారి ఏమైందంటే నేను నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. ఒక్కసారి చూద్దామని నాన్న గోడ మీద నుంచి ఎగిరెగిరి చూస్తుంటే అక్కడున్న సెక్యూరిటీ లాగిపెట్టి కొట్టి వెళ్లిపోమన్నారు. ఇంట్లో ఖాళీగా ఉన్నావు, పార్ట్ టైం జాబ్ చూశాను, చేయమన్నారు. అలా జిమ్‌కు వెళ్లి క్లీనింగ్ చేశా. ఆర్థిక సమస్యలతో ఇక్కడ జాబ్ చేస్తున్నానన్నాను. కానీ వారికి నేను పూరీ కొడుకు అని తెలిసిపోయింది. ఆంధ్రావాలాలో నాకు పాత్ర ఫిక్సయిపోయింది. సడన్‌గా ఫోన్ చేసి నువ్వు చేయట్లేదు అన్నారు. నన్నెందుకు తొక్కేస్తున్నారు అని ఫీలయ్యాను. ఇక రామ్‌చరణ్ అన్నయ్య ఓసారేం చేశారంటే నాకు జెల్ ఇష్టమని రకరకాల హెయిర్ స్టైయిల్స్ వేశారు. ఓసారి మార్కెట్లో లయన్ కింగ్ సీడీని దొంగిలించి ఎవరికీ కనిపించకుండా జేబులో పెట్టుకుని వచ్చేశాను. ఇక సినిమాల విషయానికి వస్తే పూరీ కొడుకు.. పూరీ కొడుకు, స్టార్డమ్ ఉన్న వాళ్ల నాన్న ఉన్నాడు, వాడికేంటిలే అనే టాక్ బయట బాగా ఎక్కువైపోయింది. అందుకే నాన్న నాతో సినిమా చేద్దాం అన్నా కూడా నో చెప్పాను. పూరీ కొడుకు అనేది పోగొట్టుకున్నాకే నీతో సినిమా చేస్తానని చెప్పాను' అని పేర్కొన్నాడు పూరీ. చదవండి: విక్రమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్... సూర్యకి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్ ఫైవ్ స్టార్ హోటల్ రూమ్‌ను తలపిస్తున్న శిల్పాశెట్టి వ్యానిటీ వ్యాన్ -
సమంత చేతుల మీదుగా నూనుగు మీసాల సాంగ్ రిలీజ్
ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ కథానాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న "చోర్ బజార్" నుంచి సాంగ్స్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ చిత్రంలోని 'నూనుగు మీసాల' లిరికల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేశారు. హీరోయిన్ పాడుకునే సోలో సాంగ్ ఇది. ప్రియుడు తనను ఎలా ఆకర్షించాడు, అతని గురించి తానెంతగా ఎదురుచూస్తుందో ఈ పాట ద్వారా చెబుతుంది. "నూనుగు మీసాల పోరడు చూడు ఎదురుసూరీడే, నామీద నజర్ ఏసిండే, రంగుల డబ్బాల గుండెను ముంచి ఎత్తుకపోయిండే, వాని గుండెల్ల దాచిండే, వాని బొమ్మ గీసి, మాటా ముచ్చట చెప్పుకున్న గాలిలో, వాణ్ని చేరితే చాలయ్యో, మళ్లొస్తడాని బాట మీద కూసోనున్న ఎవరన్నా జెర చెప్పిపోండయ్యో" అంటూ సాగుతుందీ పాట. ఈ పాటను సురేష్ బొబ్బిలి స్వరపర్చగా...కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. లక్ష్మీ మేఘన పాడారు. భాను కొరియోగ్రఫీ చేశారు. Noonugu Meesala from #ChorBazaar will make you fall in love ❤️https://t.co/BX2S8TrBSx All the best to team Chorbazaar 👍@ActorAkashPuri @gehna_sippy @GeorgeReddyG1 @VSRajuOfficial @IVProductions_ @sureshvarmaz @DopJagadeesh @sureshbobbili9 @GskMedia_PR @LahariMusic — Samantha (@Samanthaprabhu2) June 3, 2022 చదవండి: జవాన్ మూవీ.. మాస్ లుక్‌లో షారుక్ ఖాన్ బిగ్‌బాస్ 6లోకి సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్! -
'మీకు దిల్ ఉన్నోళ్ల కథ చెప్పాలె'.. చోర్ బజార్ సాంగ్ విన్నారా?
Hero RAM Launched Akash Puri Movie Title Song: ఆకాశ్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన చిత్రం ‘చోర్ బజార్’. ‘దళం, జార్జ్ రెడ్డి’ చిత్రాల ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను హీరో రామ్ పోతినేని విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘చోర్ బజార్’ టైటిల్ సాంగ్ చాలా ట్రెండీగా ఉంది, గల్లీ బాయ్స్ పాటలా అనిపించింది. ఈ సినిమాతో ఆకాశ్ హిట్ కొడతాడని నమ్మకంగా చెబుతున్నా’’ అన్నారు. ‘మీకు దిల్ ఉన్నోళ్ల కథ చెప్పాలె.. దిల్ నిండా దమ్మున్నోళ్ల కథ చెప్పాలె.. ఇది చోర్ బజార్... ఆజా చోర్ బజార్..’ అంటూ సాగే ఈ పాటకు నవాబ్ గండ్, అసురన్ టీమ్ సంగీతం, ర్యాప్ అందించి, పాడారు. ‘‘లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న మా సినిమా త్వరలో విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, సహనిర్మాత: అల్లూరి సురేష్ వర్మ. -
మిలియన్ మామ్స్ ర్యాలీ ప్రారంభించిన ఆకాశ్ పూరీ
శంషాబాద్: నిత్యం కుటుంబ బాధ్యతల్లో తలమునకలయ్యే అమ్మలందరూ ఆరోగ్యంపై తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని నొవాటెల్ హోటల్ వద్ద మిలియన్ మామ్స్ కార్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అమ్మ బాగుంటేనే కుటుంబంలోని సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. మహిళల ఆరోగ్యంపై చైతన్యపరిచే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీ విజయవంతం కావాలని ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ ఆకాంక్షించారు. సమయం, వేగం, గమ్యం ఆధారితంగా నిర్వహించే ఈ ర్యాలీలో మొత్తం 75 మంది మహిళలు పాల్గొన్నారని కార్యక్రమ నిర్వాహకులైన షాదాన్ విద్యాసంస్థల ప్రతినిధులు తెలిపారు. ఇందులోంచి ఇద్దరిని విజేతలు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీ నొవాటెల్ నుంచి కాళీమందిర్ సమీపంలోని షాదాన్ కాలేజీ వరకు ఉంటుందన్నారు. మొత్తం మిలియన్ మంది మహిళలను చైతన్యం చేసే విధ ంగా కార్యక్రమాలను రూపొందించినట్లు డాక్టర్ మనిపవిత్ర తెలిపారు. విజేతలను సోమవారం ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు, నటుడు ఆకాష్ పూరి తదితరులు పాల్గొన్నారు. -
న్యూజెర్సీలో మెహబూబా టీం సందడి
-
నాలుగోసారి.. ఐదోసారీ చూశారు – పూరి జగన్నాథ్
‘‘అమెరికాలో తెలుగువాళ్లతో కలిసి ‘మెహబూబా’ ప్రీమియర్ చూశాం. అందరికీ బాగా నచ్చింది. హైదరాబాద్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూశాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. నాలుగోసారి, ఐదోసారి చూసినవాళ్లను కూడా నేను కలిశాను. ఆకాష్ బాగా చేశాడంటూ అభినందిస్తున్నారు’’ అని పూరి జగన్నాథ్ అన్నారు. ఆకాష్ పూరి, నేహాశెట్టి జంటగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పూరి కనెక్ట్స్ నిర్మాణంలో రూపొందిన ‘మెహబూబా’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘మెహబూబా’ రెగ్యులర్‌గా నేను తీసే సినిమాల్లా ఉండదు. కమర్షియల్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే లవ్‌స్టోరీ. నా కెరీర్లో బాగా మనసుపెట్టి తీసిన సినిమా ఇది. హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. ‘మెహబూబా’ లాంటి సినిమాను థియేటర్స్‌లోనే చూడాలి. సినిమాలోని విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్‌ని ఎంజాయ్ చెయ్యాలంటే బిగ్ స్క్రీన్లోనే సాధ్యమవుతుంది’’ అన్నారు చార్మి. ‘‘మెహబూబా’ చూసినవాళ్లంతా చాలా బాగుందని చెబుతున్నారు. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు నాన్నకి థ్యాంక్స్. ఆ పదం చాలా చిన్నదని నా ఒపీనియన్. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు పూరి ఆకాష్. ‘‘రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉండే సినిమాలు చూడాలనుకునేవారికి ‘మెహబూబా’ తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు నేహాశెట్టి. నటులు విషురెడ్డి, విజయ్, పృథ్వీ, ఎడిటర్ జునైద్ సిద్ధిఖీ, ఆర్ట్ డైరెక్టర్ జానీ షేక్ పాల్గొన్నారు. -
చూసిన వెంటనే షాకయ్యా : నాని
ఒకప్పుడు డైనమిక్ డైరెక్టర్ ఎవరు అంటే పూరి జగన్నాథ్ మాత్రమే అని అనేవారు. స్టార్ డైరెక్టర్ హోదాలో చాలా కాలమే కొనసాగారు. కానీ ప్రస్తుతం పూరి సినిమాలు వస్తున్నాయంటే ఒకప్పటి హంగామా ఇప్పుడు ఉండటం లేదు. దానికి కారణం వరుసబెట్టి ఒకే మూసధోరణిలో సినిమాలు చేస్తుండటమే. అయితే ‘మెహబూబా’ మాత్రం పూర్తిగా తన పంథా మార్చి కొత్తగా ట్రై చేసిన సినిమా అంటూ చెప్తున్నాడు పూరి. ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రమోషన్స్ హైలెవల్లో చేస్తోంది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రమోషన్లో భాగంగా నాని ఈ సినిమా గురించి వివరిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ‘ట్రైలర్ చూసిన వెంటనే షాకయ్యా. టెక్నికల్లి బ్రిలియంట్‌గా ఉంది. ఇదంతా ఎప్పుడు తీశారా అని డౌట్ వచ్చింది. సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న క్యూరియాసిటీ పెరిగింది. చిత్రబృంధానికి,పూరి గారికి, ఆకాష్, ఛార్మి గారికి విష్ యూ ఆల్ ది బెస్ట్’ అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇండో పాక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనుభూతికి లోనయ్యా : కోన ఇప్పుడే మెహబూబా సినిమా చూశాను. కాదు...కాదు...అనుభూతికి లోనయ్యాను. ప్రేమతో పూరి తీసిన గొప్ప ప్రేమకథ మెహబూబా. చిత్రబృంధానికి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడే "మెహబూబా" చూసాను .. కాదు .. కాదు .. ఒక అనుభూతికి లోనయ్యాను.. పూరి ప్రేమతో తీసిన ఒక గొప్ప ప్రేమకథ ఇది !! ఆకాష్ చాలా చాలా బాగా చేసాడు.. It’s a mind blowing love story 👍Congratulations @purijagan , @PuriConnects & the whole team 👏👏👏 — kona venkat (@konavenkat99) May 9, 2018 -
మెహబూబా ట్రైలర్ చూసిన వెంటనే షాకయ్యా
-
ఆయనంటే పిచ్చి
‘‘ఈ క్షణం కోసం పదిహేనేళ్లుగా ఎదురు చూస్తున్నా. ‘మెహబూబా’ సినిమా రిలీజ్ కోసం చాలా ఎగై్జట్‌మెంట్‌తో ఉన్నా. ఈ తరహా లవ్‌స్టోరీ మా నాన్న నుంచి వస్తుందనుకోలేదు. ఆయన దర్శకత్వం వహించిన ఏ సినిమాకీ ఇంత కాన్ఫిడెంట్‌గా లేను. ‘మెహబూబా’ తో నాన్నకు చాలా మంచి పేరొస్తుంది’’ అని ఆకాశ్ పూరి అన్నారు. ఆకాశ్, నేహాశెట్టి జంటగా పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘మెహబూబా’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆకాశ్ మాట్లాడుతూ–‘‘ఇండియా– పాకిస్థాన్ బోర్డర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాలో హీరోకి ఆర్మీలో చేరాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఇది నా డెబ్యూ మూవీ అని హీరోయిజం చూపించలేదు. కథకు ఎంత అవసరమో అంతే చూపించారు. నా తొలి సినిమా ‘చిరుత’ నుంచి ‘మెహబూబా’ వరకూ ప్రతి సినిమాకి ఎంతో కొంత నటన నేర్చుకుంటున్నా. రామ్‌చరణ్, ప్రభాస్, మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్.. వంటి స్టార్లతో నటించడం నా అదృష్టం. వారి స్థాయికి ఎదగాలంటే చాలా కష్టపడాలి.. కష్టపడతా. నా రోల్‌మోడల్, దేవుడు రజనీకాంత్‌గారు. చిన్నప్పటి నుంచి ఆయనంటే పిచ్చి. నేను ఎంత బాగాచేసినా నాన్న ‘బావుందిరా’ అంటారు. కానీ, పెద్దగా కాంప్లిమెంట్స్ ఇవ్వలేదు. 2017 అక్టోబర్ 12న ‘మెహబూబా’ షూటింగ్లో ఓ సీన్ చేశాక ‘సూపర్ సూపర్’ అన్నారు. ఈ రోజుని నా జీవితంలో మరచిపోలేను. నేహాశెట్టితో పోటీపడి మరీ నటించా. ‘దిల్’ రాజుగారు మా సినిమా రిలీజ్ చేస్తున్నందకు ‘థ్యాంక్స్’ చెబితే చిన్నమాట అవుతుంది. నాన్న, రాజుగారి కాంబినేషన్లో వచ్చిన ‘ఇడియట్, పోకిరి’ సూపర్ హిట్స్ అయ్యాయి. ‘మెహబూబా’ కూడా అదే కోవలోకి వస్తుంది. బయటి కథలు కూడా వింటున్నా. కానీ, నా తర్వాతి సినిమా నాన్నగారితోనే ఉంటుంది. నేను ఇంటర్ పూర్తి చేశా. అదే నాకు ఎంబీబీఎస్ పూర్తి చేసినట్టు అనిపిస్తోంది. ఇక నా దృష్టి అంతా సినిమాలపైనే ’’ అన్నారు. -
పూరి–దిల్– ఓ మెహబూబా
తనయుడు ఆకాష్ పూరి హీరోగా దర్శకుడు పూరి జగన్నాద్ తెరకెక్కించిన చిత్రం ‘మెహబూబా’. ఇందులో నేహా శెట్టి కథానాయిక. ఇండో–పాక్ బోర్డర్ నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీగా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని మే 11న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘మెహబూబా’ చిత్రం ద్వారా ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజుగారి శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌తో అసోసియేట్ అవ్వడం చాలా ఆనందంగా, గర్వంగానూ ఉంది. ‘మెహబూబా’ మా పూరీ కనెక్ట్స్ గర్వించే సినిమా. ‘ఇడియట్, పోకిరి’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత మళ్లీ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌తో కలుస్తున్నాం. మంచి హిట్ సినిమాల తర్వాత మరోసారి ‘దిల్’రాజుగారితో చేతులు కలపటం ఆనందంగా ఉంది. మే11న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొన్నారు. ఈ సినిమాకు సంగీతం: సందీప్ చౌతా, కెమెరా: విష్ణు శర్మ కో–ప్రొడ్యూసర్: పూరీ కనెక్ట్స్. -
తొలిసారి నా బాస్ నన్ను గుర్తించారు : పూరీ
సాక్షి, హైదరాబాద్ : డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం తన తనయుడు ఆకాష్ పూరీ హీరోగా మెహబూబా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చూసి ఫిదా అయ్యారు. అంతేకాకుండా పూరి డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ పోకిరితో మెహబూబా చిత్రాన్ని కంపేర్ చేశారు. మెహబూబాతో పోల్చితే పోకిరి ఓ ఫ్లాప్ చిత్రం అంటూ తనదైన శైలిలో పూరీని పొగడ్తలతో ముంచెత్తారు. పూరీ తన కుమారుడి మీదున్న ప్రేమతో మెహబూబాను అత్యంత అద్భుతంగా తెరకెక్కించారని, ఓ అందమైన కావ్యంగా మలిచారని వర్మ ట్విట్ చేశారు. 'తొలిసారి నా బాస్ నన్ను ఓ ఫిల్మ్ మేకర్‌గా గుర్తించారు. నా జీవితంలోనే ఇదో పెద్ద కాంప్లిమెంట్, లవ్ యూ సర్' అంటూ పూరీ ట్వీట్టర్లో బదులిచ్చారు. 1971లో భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఆకాష్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సందీప్ చౌతా సంగీతమందిస్తున్నారు. పూరీ తన సొంత బ్యానర్ లో మెహబూబా సినిమాను నిర్మిస్తున్నారు. I just saw parts of @purijagan ‘s Mehbooba and I strongly feel @urstrulyMahesh ‘s Pokiri is a flop in comparison ..Could be becos of his love for his son that he made this film so fucking special ..Whatever reason it’s FUCKING looking EPIC 🙏 — Ram Gopal Varma (@RGVzoomin) 21 January 2018 First time my boss considered me as a film maker. That’s my biggest compliment in my life. Lov u sir https://t.co/7rbwq7iQjW — PURI JAGAN (@purijagan) 21 January 2018 -
పూరి కనెక్ట్స్‌లో కొత్త పోరి
ఎవరీ బ్యూటీ? పూరి కనెక్ట్స్‌లో కొత్తగా అడుగుపెట్టిన పోరి! పేరేంటో? నేహా శెట్టి! ఏ ఊరో? మంగళూరు (కర్ణాటక)! ఆల్రెడీ కన్నడలో ఓ సినిమా చేశారు. మిస్ మంగుళూరు విన్నర్ కూడా! త్వరలో తెలుగు తెరకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించబోయే సినిమాతో పరిచయం కానున్నారు. కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ సినిమా తీయబోతున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే. అందులో హీరోయిన్గా నేహా శెట్టీని తీసుకున్నారు. ఈ క్యారెక్టర్‌కి సుమారు 200 మందిని ఆడిషన్ చేసి, ట్రయల్ ఫొటోషూట్స్ చేసి ఫైనల్లీ ఈ బ్యూటీని ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ అమ్మాయి తెలుగు నేర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. సినిమా కోసం కొంచెం బరువు కూడా తగ్గుతున్నారట! -
‘నాన్నగారి ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి’
పాల్వంచ రూరల్: 'నాన్నగారి ప్రోత్సాహంతోనే సినిమాల్లో నటిస్తున్నాను. నా పేరు వెనుక నాన్న గారు పూరి జగన్నాథ్ పేరు ఉంది. ఆంధ్రాపోరి చిత్రం ఇటు తెలంగాణ, ఆటు ఆంధ్రప్రదేశ్‌లో రెండు రాష్ట్రాలలో విజయవంతమైనందుకు ఆనందంగా ఉంది. మూడు సంవత్సరాల పాటు విదేశాలలో నటనపై శిక్షిణ పొందిన అనంతరం మళ్లి సినిమాలలో నటిస్తా. నేను తొలిసారి హీరోగా నటించిన చిత్రం షూటింగ్ జరుపుకున్నందుకు ఈ ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటాను' అని 'ఆంధ్రాపోరి' హీరో ఆకాష్ పూరి అన్నారు. ఆంధ్రాపోరి చిత్రం యూనిట్ మంగళవారం పాల్వంచలో సందడి చేసింది. ఎల్వి. ప్రసాద్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్ర హీరో ఆకాశ్పూరితోపాటు నిర్మాత మహేష్, సంగీత దర్శకులు ప్రవీణ్ వనమాల, పాటల రచయిత జోశ్య భట్ల బృందం మంగళవారం నవభారత్ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని, పెద్దమ్మతల్లి ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆంధ్రాపోరి చిత్రం ప్రదర్శిస్తున్న శాంతి థియేటర్‌కు చేరుకున్నారు. ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూశారు. థియేటర్ స్క్రీన్ వద్దకు వెళ్లిన ఆకాశ్‌పూరి ప్రేక్షకులతో మాట్లాడారు. వారి కోరిక మేరకు డ్యాన్స్ చేశారు. ప్రేక్షకలనుద్దేశించి మాట్లాడుతూ ప్రేక్షకులకు, పాల్వంచ ప్రజలకు, చిత్రంలో నటించిన స్థానిక కళకారులకు రుణపడి ఉంటానని అన్నారు. చిత్ర నిర్మాత మహేష్ మాట్లాడుతూ ఆంధ్రాపోరి చిత్రం తెలంగాణ, ఆంధ్రాలో విజయవంతమైందన్నారు. ఆంధ్రాపోరికి సీక్వెల్ తీయనున్నట్లు తెలిపారు. చిత్ర యూనిట్‌తో స్థానిక కళాకారులు సైదులు, శ్రీనివాస్,శిరిష, సునిత, రత్నబారుు, ఎండి యాకూబ్, నాగేందర్ పాల్గొన్నారు. -
ఆకాశ్ హీరోగా ఆంధ్రా పోరి!