పూరి కనెక్ట్స్‌లో కొత్త పోరి | Neha Shetty in Puri Jagannadhi's film | Sakshi
Sakshi News home page

పూరి కనెక్ట్స్‌లో కొత్త పోరి

Published Mon, Sep 25 2017 1:30 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

Neha Shetty in Puri Jagannadhi's film  - Sakshi

ఎవరీ బ్యూటీ? పూరి కనెక్ట్స్‌లో కొత్తగా అడుగుపెట్టిన పోరి! పేరేంటో? నేహా శెట్టి! ఏ ఊరో? మంగళూరు (కర్ణాటక)! ఆల్రెడీ కన్నడలో ఓ సినిమా చేశారు. మిస్‌ మంగుళూరు విన్నర్‌ కూడా! త్వరలో తెలుగు తెరకు పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించబోయే సినిమాతో పరిచయం కానున్నారు.

కుమారుడు ఆకాశ్‌ పూరి హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఓ సినిమా తీయబోతున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే. అందులో హీరోయిన్‌గా నేహా శెట్టీని తీసుకున్నారు. ఈ క్యారెక్టర్‌కి సుమారు 200 మందిని ఆడిషన్‌ చేసి, ట్రయల్‌ ఫొటోషూట్స్‌ చేసి ఫైనల్లీ ఈ బ్యూటీని ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ అమ్మాయి తెలుగు నేర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. సినిమా కోసం కొంచెం బరువు కూడా తగ్గుతున్నారట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement