Is Puri Jagannadh To Make An International Movie? ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో పూరి ​ చిత్రం - Sakshi
Sakshi News home page

Puri Jagannadh: పాన్​ ఇండియా కాదు.. ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో పూరి ​ చిత్రం

Published Tue, Feb 22 2022 1:41 PM | Last Updated on Tue, Feb 22 2022 5:38 PM

Puri Jagannadh To Make An International Movie - Sakshi

Puri Jagannadh To Make An International Movie: డేరింగ్​ అండ్​ డ్యాషింగ్ డైరెక్టర్​ పూరి జగన్నాథ్​ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్​లో వస్తున్న చిత్రం 'లైగర్'​. ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. లైగర్​ మూవీతో పాన్​ ఇండియా డైరెక్టర్​గా మారిన పూరి జగన్నాథ్ డ్రీమ్​ ప్రాజెక్ట్​ 'జనగణమన' పేరుతో​ మరో సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. పూరి సొంత నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాను కూడా పాన్​ ఇండియాగా అది కూడా విజయ్​ దేవరకొండతోనే తీస్తున్నట్లు సమాచారం. 

అయితే ఈ చిత్రాల తర్వాత  పూరి ఏకంగా అంతర్జాతీయ సినిమా దృష్టి సారించినట్లు టాక్​ వినిపిస్తోంది. పూరి కనెక్ట్స్​ నిర్మాణంలోనే ఈ ప్రాజెక్ట్​ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే స్క్రిప్ట్​ కూడా సిద్ధమైన ఈ ఇంటర్నేషనల్​ మూవీలో ఎవరు నటిస్తారనేది మాత్రం ఇంకా ఫైనలైజ్​ కాలేదు. భాషల మధ్య హద్దులు చెరపేసిన సినిమా రంగం పాన్​ ఇండియాగా, అంతర్జాతీయంగా దూసుకుపోతోంది. ఈ తరుణంలో డేరింగ్​ డైరెక్టర్​ పూరీ జగన్నాథ్ కొత్త చిత్రం ఎలాంటి రికార్డ్స్​ బ్రేక్​ చేస్తుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement