మాస్ మహారాజా రవితేజ- డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా రీరిలీజ్ కానుంది. ఈమేరకు తాజాగా విడుదులైన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 2008లో విడుదలైన 'నేనింతే' చిత్రంలో రవితేజ,శియా గౌతం జోడీగా మెప్పించారు. పూరి దర్శకత్వానికి చక్రి సంగీతం తోడైతే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మ్యూజికల్‌గా ఈ చిత్రంలోని చాలా పాటలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి.
సుమారు 16 ఏళ్ల తర్వాత నేనింతే చిత్రం రీరిలీజ్ కానుంది. రవితేజ బర్త్‌డే సందర్భంగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు చిత్ర మేకర్స్ ప్రకటించారు. ఈమరకు ఒక పోస్టర్‌ను కూడా అభిమానులతో పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో తమ టాలెంట్ చూపించాలని చాలామంది హైదరాబాద్ వస్తుంటారు. అలా కృష్ణ నగర్‌లో అడుగుపెట్టిన వారి కష్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ.. దర్శకుడు పూరి జగన్నాథ్ నేనింతే మూవీని తెరకెక్కించాడు. చిత్ర పరిశ్రమలో సక్సెస్ కావడం వెనుక దాగి ఉన్న కష్టాలను చాలా ఎమోషనల్‌గా ఈ మూవీలో పూరి చూపించాడు. ఈ మూవీ కమర్షియల్‌గా ఫెయిల్యూర్ అయినప్పటికీ ఉత్తమ నటుడిగా రవితేజకు నంది అవార్డు దక్కింది. ఇదే చిత్రానికి గాను ఉత్తమ మాటల రచయితగా పూరీ జగన్నాథ్, ఉత్తమ ఫైట్ మాస్టర్స్‌గా రామ్ లక్ష్మణ్‌లకు నంది అవార్డ్స్ లభించాయి.
నేనింతే సినిమాలో రవితేజకు జోడీగా శియా గౌతమ్ హీరోయిన్‌గా తొలి పరిచయం అయింది. ఆమెకు అదితి గౌతమ్ అని మరో పేరు కూడా ఉంది. నేనింతే చిత్రంలో శియా నటనకు మంచి గుర్తింపు దక్కింది. అయినా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే, ముంబయికి చెందిన వ్యాపార వేత్తతో రీసెంట్‌గా ఆమె పెళ్లి కూడా అయిపోయింది. నేనింతే చిత్రంలో బ్రహ్మానందం, వేణుమాధవ్, సుప్రీత్, సుబ్బరాజు కీలక పాత్రల్లో కనిపించారు. ఇదే మూవీలో డైరెక్టర్లు హరీష్ శంకర్, వీవీ వినాయక్, కోన వెంకట్‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కూడా గెస్ట్ రోల్స్ కనిపించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment