![Puri Jagannadh to team up with Nagarjuna Akkineni - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/25/Nagarjuna-Akkineni.jpg.webp?itok=qF2rndz7)
‘శివమణి, సూపర్’ వంటి చిత్రాలతో తమది క్రేజీ కాంబినేషన్ అనిపించుకున్నారు హీరో నాగార్జున–దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ రెండు సినిమాల్లో నాగ్‌ని కొత్తగా చూపించారు పూరి. ఇప్పటికే రెండు సార్లు కలిసి పని చేసిన వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి ఓ సినిమా చేయనున్నారని సమాచారం. కరోనా లాక్ డౌన్‌లో బోలెడంత సమయం దొరకడంతో కొత్త సినిమాల స్క్రిప్ట్స్ రాసుకుంటున్నారు పూరి జగన్నాథ్. ఇందులో భాగంగానే నాగార్జున కోసం ఓ ఆసక్తికరమైన కథని తయారు చేశారట. పూర్తి స్క్రిప్ట్‌ని నాగ్‌కి వినిపించగా నటించేందుకు పచ్చజెండా ఊపారని తెలిసింది. ప్రస్తుతం నాగార్జున ‘వైల్డ్‌డాగ్’ సినిమాతో పాటు ‘బిగ్ బాస్ 4’తో బిజీ. అటు పూరి కూడా విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘ఫైటర్’ సినిమా తర్వాత నాగార్జున చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారట పూరి జగన్నాథ్.
Comments
Please login to add a commentAdd a comment