![Nagarjuna Naa Saami Ranga Movie Glimpse Video And First Look - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/29/nagarjuna-new-movie.jpg.webp?itok=Rb_MzdF6)
కింగ్ నాగార్జున గతేడాది అక్టోబరులో 'ఘోస్ట్' మూవీతో థియేటర్లలోకి వచ్చారు. అది ఘోరంగా ఫెయిలైంది. దీంతో ఆలోచనలో పడిపోయారు. కొత్త ప్రాజెక్ట్‌ని ప్రకటించడానికి చాలా టైమ్ తీసుకున్నారు. ఫైనల్‌గా ఇప్పుడు సినిమా టైటిల్ ఫిక్స్ చేయడంతోపాటు ఓ వీడియోని రిలీజ్ చేసి హైప్ పెంచేశారు. వచ్చే సంక్రాంతికే ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకొస్తామని చెప్పి దర్శకనిర్మాతలు షాకిచ్చారు.
హిట్ కోసం వెయిటింగ్
అక్కినేని ఫ్యామిలీకి హిట్ పడి చాలాకాలమైపోయింది. 'ఘోస్ట్'తో బోల్తా కొట్టిన నాగార్జున.. ఏడాది గ్యాప్ తర్వాత కొత్త మూవీ ప్రకటించారు. కొత్త సినిమాకు 'నా సామిరంగ' అనే పేరు నిర్ణయించారు. తనకు బాగా అచ్చొచ్చిన సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. గుంటూరు కారం, ఈగిల్, హనుమాన్.. భారీ బడ్జెట్ చిత్రాలున్నా సరే నాగ్.. తన మూవీని బరిలో దింపుతున్నారు. దీనిబట్టి కాన్ఫిడెన్స్ అర్థమవుతోంది.
(ఇదీ చదవండి: బర్త్‌డే స్పెషల్.. టాలీవుడ్‌లో ఆ రికార్డులన్నీ నాగార్జునవే)
గ్లింప్స్ ఎలా ఉంది?
రెండు నిమిషాలున్న ఈ బర్త్ డే స్పెషల్ వీడియోలో నాగ్.. రగ్డ్ లుక్‌తో కనిపించారు. సీన్స్ అవీ చూస్తుంటే రూరల్ మాస్ ఎంటర్‌టైనర్‌లా అనిపిస్తుంది. కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ బిన్నీ.. ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆస్కార్, నేషనల్ అవార్డులు గెలుచుకున్న కీరవాణి.. ఈ చిత్రాన్ని సంగీతమందిస్తున్నారు. హీరోయిన్‌తో సహా ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
ధనుష్ సినిమాలోనూ
అలానే నాగ్ పుట్టినరోజు సందర్భంగా మరో క్రేజీ అప్డేట్ కూడా వచ్చేసింది. ధనుష్-శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ మూవీ తీస్తున్నారు. కొన్నిరోజుల క్రితం ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఇందులో కీలకపాత్రలో నాగార్జున నటిస్తారని ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఎస్ జే సూర్య విలన్ అని తెలుస్తోంది. రష్మిక హీరోయిన్. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: పబ్లిక్‌లో హీరోయిన్‌కి ముద్దుపెట్టిన తెలుగు డైరెక్టర్)
Official !!#Nagarjuna Onboard for #Dhaush's #D51 🔥
— AmuthaBharathi (@CinemaWithAB) August 29, 2023
He is going to play an extended cameo role 💫 pic.twitter.com/avPQQFqVlk
Comments
Please login to add a commentAdd a comment