Tollywood Director Puri Jagannadh Acts As Side Artiste In Shiva Movie - Sakshi
Sakshi News home page

RGV Tweet: ఆర్జీవీ సూపర్ హిట్‌ మూవీ.. సైడ్‌ ఆర్టిస్ట్‌గా స్టార్ డైరెక్టర్!

Published Fri, Jul 14 2023 10:14 AM | Last Updated on Fri, Jul 14 2023 10:24 AM

Tollywood Director Puri Jagannadh Acts As Side Actor In Shiva Movie  - Sakshi

సినిమా ఇండస్ట్రీలో సొంతంగా ఎదగడం అనుకున్నంత సులభం కాదు. ఓవర్‌నైట్‌ స్టార్‌ గుర్తింపు వచ్చినా గ్లామర్ ఫీల్డ్‌లో నిలదొక్కుకోవటం అంతా ఆషామాషీ కాదు. కానీ ఏకంగా బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌ నుంచి స్టార్ డైరెక్టర్‌గా ఎదగడమంటే మాటలు కాదు. అంతకుమించిన సక్సెస్ ఉండదు కూడా. అలాంటి అసాధ్యం కానీ విషయాన్ని చేసి చూపించాడు మన టాలీవుడ్ ఆర్టిస్ట్. అతనెవరో కాదు.. పోకిరీ మూవీతో చరిత్ర సృష్టించిన పూరి జగన్నాథ్.

(ఇది చదవండి: మీరు అలా మాట్లాడుతుంటే సిగ్గేస్తోంది సార్: సీఎం తీరుపై సింగర్ ఫైర్)

అప్పట్లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ శివ. ఈ చిత్రంలో నాగార్జున హీరోగా నటించిగా.. ఆయన పక్కనే పూరి బ్యాక్‌గ్రౌండ్‌ ఆర్టిస్ట్‌గా నటించారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆర్జీవీ ట్విటర్‌లో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.  ఆర్జీవీ ట్వీట్‌లో రాస్తూ..' ఒక బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా శివ సెట్స్‌లో సూపర్ స్మార్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ . అతని విజయం నిజంగా స్ఫూర్తిదాయకం.' అంటూ శివ సినిమాలోని ఫోటోను షేర్ చేశారు. 

టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. బద్రి నుంచి లైగర్ దాకా ఆయన ప్రభంజనం కొనసాగింది. తెలుగులో ఇప్పటివరకు ఆయన 33 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, దేశముదురు, పోకిరి, చిరుత, గోలీమార్, నేను నా రాక్షసి, బిజినెస్ మేన్, కెమెరామెన్ గంగతో రాంబాబు, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించారు. కాగా..  గతేడాది విజయ్ దేవరకొండతో తీసిన లైగర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ సినిమాతో నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్లు సైతం ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ముంబయిలో ఉంటున్నారు. 

(ఇది చదవండి: నాది చాలా చిన్న వయసు.. వారి ఉద్దేశమేంటో గుర్తించలేకపోయా: బుల్లితెర నటి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement